Shuru
Apke Nagar Ki App…
నేపాల్ వరద ఉద్రిక్తత రెప్పటిపటిలో ఊరు నామరూపాలు....... మంచుకొండ కూలిన ప్రాంతానికి 50 కిలోమీటర్లకు పైగా దిగువన చిత్రీకరించిన ఈ తాజాగా విడుదలైన వీడియోలో వరద ఉప్పెన ఎంత వేగంగా దూసుకొచ్చిందో స్పష్టంగా కనిపిస్తోంది. 🌊💔 కంటపడిన ప్రతిదానినీ తన వెంట కొట్టుకుపోతూ విధ్వంసం సృష్టించిన ఈ దృశ్యాలు తీవ్ర భయానకంగా ఉన్నాయి.
ఆజాద్
నేపాల్ వరద ఉద్రిక్తత రెప్పటిపటిలో ఊరు నామరూపాలు....... మంచుకొండ కూలిన ప్రాంతానికి 50 కిలోమీటర్లకు పైగా దిగువన చిత్రీకరించిన ఈ తాజాగా విడుదలైన వీడియోలో వరద ఉప్పెన ఎంత వేగంగా దూసుకొచ్చిందో స్పష్టంగా కనిపిస్తోంది. 🌊💔 కంటపడిన ప్రతిదానినీ తన వెంట కొట్టుకుపోతూ విధ్వంసం సృష్టించిన ఈ దృశ్యాలు తీవ్ర భయానకంగా ఉన్నాయి.
More news from తెలంగాణ and nearby areas
- నేపాల్ వరద ఉద్రిక్తత రెప్పటిపటిలో ఊరు నామరూపాలు....... మంచుకొండ కూలిన ప్రాంతానికి 50 కిలోమీటర్లకు పైగా దిగువన చిత్రీకరించిన ఈ తాజాగా విడుదలైన వీడియోలో వరద ఉప్పెన ఎంత వేగంగా దూసుకొచ్చిందో స్పష్టంగా కనిపిస్తోంది. 🌊💔 కంటపడిన ప్రతిదానినీ తన వెంట కొట్టుకుపోతూ విధ్వంసం సృష్టించిన ఈ దృశ్యాలు తీవ్ర భయానకంగా ఉన్నాయి.1
- నోట్లో గోల్డ్ క్యాప్సూల్స్ ఎయిర్‌పోర్టులో చిక్కిన ప్యాసింజర్ దుబాయ్ నుంచి బెంగళూరులోని కెంపెగౌడ ఎయిర్‌పోర్టుకు చేరుకున్నాడు ఓ ప్రయాణికుడు అటు నుంచి ఘాజియాబాద్‌కు వెళ్లాల్సి ఉండగా అతని ప్రవర్తన పట్ల అధికారులకు అనుమానం వచ్చింది దాంతో సీఐఎస్ఎఫ్ సిబ్బంది తనిఖీలు చేయగా!!!1
- వికలాంగుల రాజ్యాధికారమే లక్ష్యం 8వ ఆవిర్భావ దినోత్సవంలో రాష్ట్ర అధ్యక్షుడు గిద్దె రాజేష్ చివ్వెంల: వికలాంగుల హక్కులు, రాజకీయ ప్రాతినిధ్యం, రాజ్యాధికార సాధన కోసం ఉద్యమాన్ని మరింత ఉధృతం చేస్తామని భారత వికలాంగుల హక్కుల పరిరక్షణ సమితి రాష్ట్ర అధ్యక్షుడు గిద్దె రాజేష్ అన్నారు. గురువారం దురాజ్‌పల్లిలో సంఘం 8వ ఆవిర్భావ దినోత్సవ వేడుకలు నిర్వహించారు. సంఘం జెండా ఆవిష్కరించి, కేక్ కట్ చేసి నిరుపేదలకు పండ్లు పంపిణీ చేశారు. ఈ సందర్భంగా రాజేష్ మాట్లాడుతూ కేవలం సంక్షేమ పథకాలతో వికలాంగుల సమస్యలు పరిష్కారం కావని, నిర్ణయాలు తీసుకునే వ్యవస్థలో వారికి రాజకీయ ప్రాతినిధ్యం కల్పించాల్సిన అవసరం ఉందన్నారు. వికలాంగులకు ఇచ్చిన హామీలను ప్రభుత్వాలు అమలు చేయాలని డిమాండ్ చేశారు. వికలాంగుల హక్కుల కోసం గత ఎనిమిదేళ్లుగా పోరాటాలు కొనసాగిస్తున్నామని, గ్రామస్థాయి నుంచి జాతీయ స్థాయి వరకు ఉద్యమాన్ని విస్తరిస్తామని తెలిపారు. ఎర్రకోట, గోల్కొండ కోటపై వికలాంగుడు జాతీయ జెండా ఎగురవేసే రోజు వచ్చే వరకు పోరాటం ఆగదని స్పష్టం చేశారు. కార్యక్రమంలో సంఘం నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు.1
- పెంపుడు కుక్కరోజూ తన ఇంటికి వస్తుండడంతో కోపం పెంచుకున్న జానయ్య తన వద్ద ఉన్న ఎయిర్ గన్ తో కాల్చి చంపాడు ఖమ్మం జిల్లా ముదిగొండ మండలం ముత్తారం గ్రామానికి చెందిన రౌతు జానయ్య అనే రిటైర్డ్ ఆర్మీ ఉద్యోగి తన పక్కింట్లోని రాము అనే వ్యక్తికి చెందిన పెంపుడు కుక్కనుఎయిర్ గన్ తో కాల్చి చంపాడని రాము స్టేషన్ లో పిర్యాదు చేసాడు. రాముకు చెందిన పెంపుడు కుక్కరోజూ తన ఇంటికి వస్తుండడంతో కోపం పెంచుకున్న జానయ్య తన వద్ద ఉన్న ఎయిర్ గన్ తో కాల్చి చంపాడు.తాను ప్రేమగా పెంచు కుంటున్న కుక్కను కక్ష పూరితంగా జానయ్య చంపాడని రాము ముదిగొండ పోలీసులకు ఫిర్యాదు చేశాడు.రాము ఇచ్చిన పిర్యాదు మేరకు విచారణ చేపట్టిన పోలీసులు జానయ్య పై కేసు నమోదు చేశారు.1
- భార్య మరియు భార్య తరపు బంధువులు తనను వేధిస్తున్నారని ఆవేదన వ్యక్తం చేసిన భార్యా బాధితుడు కృష్ణాజిల్లా.. పామర్రు నియోజకవర్గం.. పమిడిముక్కల మండలం.. భార్యా బాధితుడు తన భార్య మరియు భార్య తరపు బంధువులు తనను వేధిస్తున్నారని భార్యా బాధితుడు పమిడిముక్కల మండలం కపిలేశ్వరపురం గ్రామానికి చెందిన జొన్నలగడ్డ సురేష్ మీడియా ముందు ఆవేదన వ్యక్తం చేశారు.గతంలో తాను ఆర్థికంగా బాగా బతికానని తన దగ్గర డబ్బు ఉన్నంతకాలం చుట్టాలందరూ తన చుట్టూ చేరి అవసరాలకు వాడుకున్నారని,. ప్రస్తుతం తాను ఆర్థికంగా చితికిపోయానని బంధువులందరూ ఇంటిపై దాడికి దిగుతున్నారని, తనను వేధిస్తున్నారని సురేష్ మీడియా ముందు తన గోడు వెళ్ళబోశారు.తనకు ఇద్దరు కుమారులని తన భార్య మానసిక స్థితి సరిగా లేదని పిల్లలపై కూడా దాడికి దిగుతూ బీర్జాలను పిసికి వేస్తూ పిల్లలనుచంపడానికి ప్రయత్నం చేస్తుందని, తనను తీసుకువెళ్లి హాస్పటల్లో చూపించిన ప్రయోజనం లేదని తనపై కూడా దాడికి దిగుతుందని సురేష్ తెలిపారు. తను ఆర్థికంగా దెబ్బతినడం వల్ల భార్య బంధువులు అందరూ వచ్చి తనపై తప్పుడు కేసులు బనాయించి తనకు అక్రమ సంబంధం అంటగట్టి బెదిరిస్తున్నారని, మీడియానే తనకు న్యాయం చేయాలని లేకుంటే తన పిల్లలతో సహా ఆత్మహత్య తనకు శరణ్యం అని తెలిపారు. తన వద్ద ఉన్న బంగారం కూడా 12 లక్షలకు తాకట్టు పెట్టి పుట్టింటి కాడ డబ్బులు దాచేసి తనను తీవ్ర ఇబ్బందులు గురిచేస్తున్నారని తెలిపిన సురేష్, పోలీసు అధికారులు సరైన విచారణ చేసి తనకు న్యాయం చేయకుంటే చావే శరణ్యమని సురేష్ వాపోయారు.1
- భారత ఎన్నికల సంఘం ఆదేశాల మేరకు చేపడుతున్న ప్రత్యేక సమగ్ర సవరణ SIR 2026 కార్యక్రమంలో భాగంగా జిల్లా అంతటా నిర్వహించిన గ్రామ, వార్డు సభల్లో ముసాయిదా ఓటరు జాబితాను ప్రజల పరిశీలన కోసం అందుబాటులో ఉంచినట్లు జిల్లా కలెక్టర్ స్నేహ శబరీష్ తెలిపారు. ఈ సందర్భంగా మహబూబాబాద్ జిల్లా సిరోలు మండలం చిలుకోడు, గ్రామంలో ఏర్పాటు చేసిన ప్రత్యేక గ్రామసభలో జిల్లా కలెక్టర్ స్వయంగా పాల్గొని ఓటరు నమోదు, సవరణల ప్రక్రియను క్షేత్రస్థాయిలో పరిశీలించారు. ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ ఎస్ఐఆర్ ప్రత్యేక ఓటరు జాబితా సవరణ డ్రాప్టు ముసాయిదా లో తమ పేరు సరిగా ఉందో లేదో తెలుసుకొని ఓటును నిర్ధారించుకోవడం కోసం నెల రోజుల సమయం ఉందని, నోటీసులు అందుకున్న ఓటర్లు తమ నిర్ధారణ సర్టిఫికెట్లు అప్లోడ్ చేసి సమర్పించి ఓటు హక్కును భద్రపరుచుకోవాలని తెలిపారు, 18 ఏళ్లు నిండిన అర్హులైన పౌరులు తమ పేరు ఓటరు జాబితాలో ఉందో లేదో సరిచూసుకోవాలని, పేరు లేని పక్షంలో వెంటనే దరఖాస్తు చేసుకోవాలని కలెక్టర్ సూచించారు. జనవరి 1, 2026 నాటికి 18 ఏళ్లు పూర్తయ్యే యవత ఫారమ్-6 ద్వారా కొత్త ఓటరుగా నమోదు చేసుకోవడానికి అవకాశం కల్పించారు.ఓటరు కార్డులో పేరు, చిరునామా, పుట్టిన తేదీ లేదా ఫోటో తప్పుగా ఉంటే ఫారమ్-8 ద్వారా సరిచేసుకోవచ్చని మరణించిన వారి లేదా ఇతర ప్రాంతాలకు శాశ్వతంగా తరలివెళ్లిన వారి పేర్లను జాబితా నుండి తొలగించేందుకు ఫారమ్-7 ఉపయోగించవచ్చని తెలిపారు. నేరుగా బి.ఎల్.ఓ లేదా గ్రామ,వార్డు సచివాలయాల వద్ద మాత్రమే కాకుండా, 'ఓటర్ హెల్ప్ లైన్ యాప్ లేదా వెబ్‌సైట్ ద్వారా కూడా ఆన్‌లైన్‌లో దరఖాస్తు చేసుకోవచ్చని స్పష్టం చేశారు. ప్రజాస్వామ్యంలో ఓటు హక్కు అత్యంత కీలకమైనదని, తప్పులు లేని పారదర్శకమైన ఓటరు జాబితా రూపకల్పనకు అధికారులు బాధ్యతాయుతంగా పనిచేయాలని ఆదేశించారు. అర్హులైన ప్రతి ఒక్కరూ ఈ ప్రత్యేక అవకాశాన్ని వినియోగించుకుని తమ ఓటు హక్కును నిర్ధారించుకోవాలని , పిలుపునిచ్చారు. నెలరోజుల సమయం ఉందని నోటీసులు అందుకున్న ఓటర్లు తమ ఓటు హక్కును సంబంధిత ఫారాల ద్వారా నిర్ధారించుకోవాలని అందుకోసం రెవెన్యూ అధికారులు సిద్ధంగా ఉంటారని తెలిపారు, ఈ కార్యక్రమంలో ఆర్డీవో గణేష్ , తహసిల్దార్ పున్నం చందర్, స్థానిక సర్పంచ్ ఉడుముల వెంకన్న, మార్కెట్ కమిటీ చైర్మన్ తేజవాత్ సుధాకర్, ఎంపీడీవో గౌస్ పాషా, పంచాయతీ సెక్రెటరీ నాగయ్య, బి.ఎల్.ఓలు, పెద్ద సంఖ్యలో గ్రామ ప్రజలు పాల్గొన్నారు.1
- *నోట్లో గోల్డ్ క్యాప్సూల్స్ ఎయిర్‌పోర్టులో చిక్కిన ప్యాసింజర్.* దుబాయ్ నుంచి బెంగళూరులోని కెంపెగౌడ ఎయిర్‌పోర్టుకు చేరుకున్నాడు ఓ ప్రయాణికుడు అటు నుంచి ఘాజియాబాద్‌కు వెళ్లాల్సి ఉండగా అతని ప్రవర్తన పట్ల అధికారులకు అనుమానం వచ్చింది దాంతో సీఐఎస్ఎఫ్ సిబ్బంది తనిఖీలు చేశారు.1
- నేపాల్ మహా ప్రళయం.. 98 సెకన్లలోనే పెను విషాదం నేపాల్ మెరుపు వరదలకు సంబంధించిన ఓ 98 సెకన్ల వీడియో వైరల్ అవుతోంది. భోటే కోషి నదికి ఒక్కసారిగా వరద పోటెత్తడంతో రసువా జిల్లాలో తీరంలో ఉన్న ఓ గ్రామం క్షణాల్లోనే తుడిచిపెట్టుకుపోయింది. భారీ భవంతులు సైతం మునిగిపోయాయి. బస్సులు, వ్యాన్లు, కార్లు ఆ నీటిలో కొట్టుకుపోయాయి. ప్రాణభయంతో కొందరు మనుషులు పరిగెత్తడం ఆ వీడియోలో కనిపించింది.....1