logo
Shuru
Apke Nagar Ki App…
  • Latest News
  • News
  • Politics
  • Elections
  • Viral
  • Astrology
  • Horoscope in Hindi
  • Horoscope in English
  • Latest Political News
logo
Shuru
Apke Nagar Ki App…

లక్షెట్టిపేట మున్సిపాలిటీ పరిధిలోని ఏడవ వార్డులో స్థానిక కౌన్సిలర్ బోడ రాజు తాత్కాలిక డ్రైనేజీని ఏర్పాటు చేయించారు. ఆ వార్డులో డ్రైనేజీ సౌకర్యం లేకపోవడంతో మురికి నీటి ప్రవాహంతో ఇబ్బంది పడుతున్నామని స్థానికులు ఆయన దృష్టికి తీసుకువచ్చారు. దీనికి స్పందించిన కౌన్సిలర్ రాజు శనివారం జెసిపి సహాయంతో రోడ్డు పక్కన కాలువను తవ్వించి తాత్కాలిక డ్రైనేజీని ఏర్పాటు చేయించారు. ఇరిగేషన్ కెనాల్లో పూడికను తీయించారు. దీంతో స్థానికులు కౌన్సిలర్ రాజును అభినందించారు.

10 hrs ago
user_P.G. Murthy
P.G. Murthy
జన్నారం, మంచిర్యాల, తెలంగాణ•
10 hrs ago

లక్షెట్టిపేట మున్సిపాలిటీ పరిధిలోని ఏడవ వార్డులో స్థానిక కౌన్సిలర్ బోడ రాజు తాత్కాలిక డ్రైనేజీని ఏర్పాటు చేయించారు. ఆ వార్డులో డ్రైనేజీ సౌకర్యం లేకపోవడంతో మురికి నీటి ప్రవాహంతో ఇబ్బంది పడుతున్నామని స్థానికులు ఆయన దృష్టికి తీసుకువచ్చారు. దీనికి స్పందించిన కౌన్సిలర్ రాజు శనివారం జెసిపి సహాయంతో రోడ్డు పక్కన కాలువను తవ్వించి తాత్కాలిక డ్రైనేజీని ఏర్పాటు చేయించారు. ఇరిగేషన్ కెనాల్లో పూడికను తీయించారు. దీంతో స్థానికులు కౌన్సిలర్ రాజును అభినందించారు.

More news from తెలంగాణ and nearby areas
  • కొమరం భీం ఆసిఫాబాద్ జిల్లా తిర్యాని పోలీస్ స్టేషన్‌ను జిల్లా ఎస్పీ నితికా పంత్ శనివారం ఆకస్మికంగా తనిఖీ చేశారు. స్టేషన్ రికార్డులు, పెండింగ్ కేసుల పురోగతి, హాజరు రిజిస్టర్, శుభ్రతను పరిశీలించారు. ఎస్‌హెచ్‌ఓ వెంకటేష్, సిబ్బందికి సూచనలు చేస్తూ శాంతి భద్రతలపై అప్రమత్తంగా ఉండాలని, అసాంఘిక కార్యకలాపాలు, అక్రమ రవాణా, మాదకద్రవ్యాలపై కఠిన చర్యలు తీసుకోవాలని ఆదేశించారు. మహిళలు, బాలికల భద్రతపై ప్రత్యేక దృష్టి పెట్టాలని, రాత్రి పర్యవేక్షణను బలోపేతం చేయాలని సూచించారు.
    3
    కొమరం భీం ఆసిఫాబాద్ జిల్లా తిర్యాని పోలీస్ స్టేషన్‌ను జిల్లా ఎస్పీ నితికా పంత్ శనివారం ఆకస్మికంగా తనిఖీ చేశారు. స్టేషన్ రికార్డులు, పెండింగ్ కేసుల పురోగతి, హాజరు రిజిస్టర్, శుభ్రతను పరిశీలించారు.
ఎస్‌హెచ్‌ఓ వెంకటేష్, సిబ్బందికి సూచనలు చేస్తూ శాంతి భద్రతలపై అప్రమత్తంగా ఉండాలని, అసాంఘిక కార్యకలాపాలు, అక్రమ రవాణా, మాదకద్రవ్యాలపై కఠిన చర్యలు తీసుకోవాలని ఆదేశించారు. మహిళలు, బాలికల భద్రతపై ప్రత్యేక దృష్టి పెట్టాలని, రాత్రి పర్యవేక్షణను బలోపేతం చేయాలని సూచించారు.
    user_Krishna
    Krishna
    ఆసిఫాబాద్, కుమురం భీమ్ ఆసిఫాబాద్, తెలంగాణ•
    5 hrs ago
  • బీఆర్ఎస్ నాయకులు ఆరోపించగా లాఠీ ఛార్జ్ చేసిన పోలీసులు. లాఠీ ఛార్జ్ చేయగా స్వల్పంగా గాయపడ్డ బీఆర్ఎస్ పార్టీ ఖానాపూర్ నియోజకవర్గ ఇంచార్జి భూక్యా జాన్సన్ నాయక్.
    1
    బీఆర్ఎస్ నాయకులు ఆరోపించగా లాఠీ ఛార్జ్ చేసిన పోలీసులు. లాఠీ ఛార్జ్ చేయగా స్వల్పంగా గాయపడ్డ బీఆర్ఎస్ పార్టీ ఖానాపూర్ నియోజకవర్గ ఇంచార్జి భూక్యా జాన్సన్ నాయక్.
    user_M.RAJKIRAN REDDY
    M.RAJKIRAN REDDY
    Adilabad Rural, Telangana•
    5 hrs ago
  • రాజన్న సిరిసిల్ల జిల్లా వేములవాడలోని శ్రీ రాజరాజేశ్వర స్వామి దేవస్థానం లో తెలంగాణ ప్రభుత్వము చేపట్టిన “ప్రజాపాలన – ప్రగతి ప్రణాళిక 2026” లో భాగంగా 99 రోజుల కార్యచరణ ప్రణాళిక కింద శనివారం (04-04-2026) అగ్నిప్రమాదాల నివారణపై అవగాహన కార్యక్రమం నిర్వహించారు.ఈ కార్యక్రమాన్ని తెలంగాణ ప్రజారక్షణ (ఫైర్) శాఖ ఆధ్వర్యంలో వేములవాడ ఫైర్ స్టేషన్ సిబ్బంది నిర్వహించారు. ఆలయ ప్రాంగణంలో నిర్వహించిన ఫైర్ సేఫ్టీ డ్రిల్ (Fire Safety Drill) ద్వారా అగ్నిప్రమాదాలు సంభవించినప్పుడు ఎలా స్పందించాలి, అగ్నిప్రమాదాలను ఎలా నివారించాలి అనే విషయాలను ప్రాక్టికల్‌గా వివరించారు.ఆలయ ఈవో ఎల్. రమాదేవి కార్యక్రమాన్ని పర్యవేక్షిస్తూ తెలంగాణ స్పెషల్ ప్రొటెక్షన్ ఫోర్స్ (SPF) సిబ్బందికి అగ్నిప్రమాదాల సమయంలో తీసుకోవాల్సిన జాగ్రత్తలు, ఫైర్ ఎక్స్టింగ్విషర్ వినియోగ విధానం వంటి అంశాలను వివరించారు. ఫైర్ సిబ్బంది ఎస్పీఎఫ్ సిబ్బందితో కలిసి ప్రాక్టికల్‌గా ఫైర్ సేఫ్టీ పరికరాల వినియోగంపై ప్రదర్శన నిర్వహించారు.దేవస్థానానికి వచ్చే భక్తుల భద్రతను దృష్టిలో ఉంచుకుని ఇటువంటి అవగాహన కార్యక్రమాలు నిర్వహించడం ఎంతో ఉపయోగకరమని అధికారులు తెలిపారు. కార్యక్రమంలో ఆలయ సిబ్బంది, తెలంగాణ స్పెషల్ ప్రొటెక్షన్ ఫోర్స్ సిబ్బంది పాల్గొన్నారు
    1
    రాజన్న సిరిసిల్ల జిల్లా వేములవాడలోని శ్రీ రాజరాజేశ్వర స్వామి దేవస్థానం లో తెలంగాణ ప్రభుత్వము చేపట్టిన “ప్రజాపాలన – ప్రగతి ప్రణాళిక 2026” లో భాగంగా 99 రోజుల కార్యచరణ ప్రణాళిక కింద శనివారం (04-04-2026) అగ్నిప్రమాదాల నివారణపై అవగాహన కార్యక్రమం నిర్వహించారు.ఈ కార్యక్రమాన్ని తెలంగాణ ప్రజారక్షణ (ఫైర్) శాఖ ఆధ్వర్యంలో వేములవాడ ఫైర్ స్టేషన్ సిబ్బంది నిర్వహించారు. ఆలయ ప్రాంగణంలో నిర్వహించిన ఫైర్ సేఫ్టీ డ్రిల్ (Fire Safety Drill) ద్వారా అగ్నిప్రమాదాలు సంభవించినప్పుడు ఎలా స్పందించాలి, అగ్నిప్రమాదాలను ఎలా నివారించాలి అనే విషయాలను ప్రాక్టికల్‌గా వివరించారు.ఆలయ ఈవో ఎల్. రమాదేవి కార్యక్రమాన్ని పర్యవేక్షిస్తూ తెలంగాణ స్పెషల్ ప్రొటెక్షన్ ఫోర్స్ (SPF) సిబ్బందికి అగ్నిప్రమాదాల సమయంలో తీసుకోవాల్సిన జాగ్రత్తలు, ఫైర్ ఎక్స్టింగ్విషర్ వినియోగ విధానం వంటి అంశాలను వివరించారు. ఫైర్ సిబ్బంది ఎస్పీఎఫ్ సిబ్బందితో కలిసి ప్రాక్టికల్‌గా ఫైర్ సేఫ్టీ పరికరాల వినియోగంపై ప్రదర్శన నిర్వహించారు.దేవస్థానానికి వచ్చే భక్తుల భద్రతను దృష్టిలో ఉంచుకుని ఇటువంటి అవగాహన కార్యక్రమాలు నిర్వహించడం ఎంతో ఉపయోగకరమని అధికారులు తెలిపారు. కార్యక్రమంలో ఆలయ సిబ్బంది, తెలంగాణ స్పెషల్ ప్రొటెక్షన్ ఫోర్స్ సిబ్బంది పాల్గొన్నారు
    user_Satheesh gangu
    Satheesh gangu
    జర్నలిస్ట్ సిరిసిల్ల, రాజన్న సిరిసిల్ల, తెలంగాణ•
    4 hrs ago
  • కరీంనగర్ జిల్లా గంగాధర లోని మహాత్మ జ్యోతిబా పూలే గురుకుల బాలుర పాఠశాలలో విద్యార్థుల మధ్య ఘర్షణ కలకలం సృష్టిస్తుంది. తొమ్మిదవ తరగతి విద్యార్థులపై పదవ తరగతి విద్యార్థులు దాడి చేయడంతో పలువురు విద్యార్థులకు స్వల్ప గాయాలయ్యాయి. ముగ్గురు విద్యార్థులను ఆసుపత్రికి తరలించి వైద్యం చేయించినట్లు అధికారులు తెలిపారు. ఆలస్యంగా వెలుగులోకి వచ్చిన ఘటనతో పేరెంట్స్ ఆందోళనకు దిగారు. దాడికి పాల్పడ్డ విద్యార్థుల పై చర్యలు తీసుకోవడంతో పాటు ప్రిన్సిపల్ ను, డ్యూటీలో ఉన్న ఉద్యోగులను సస్పెండ్ చేయాలని డిమాండ్ చేశారు. పేరెంట్స్ ముందు విద్యార్థులు బోరున విలపిస్తూ తమ గోడును వెళ్ళబోసుకున్నారు. చిన్న చిన్న కారణాలతో దాడి చేసి కొట్టారని ఆవేదన వ్యక్తం చేశారు. పిల్లలకు బిస్కెట్ ప్యాకెట్ తీసుకొస్తే అనుమతించని అధికారులు, విద్యార్థులు చేతులకు కడాలు పెట్టుకుని లోనికి వస్తే ఎలా అనుమతిస్తారని పేరెంట్స్ నిలదీశారు. ప్రిన్సిపల్ నిర్లక్ష్యం వల్లే పిల్లలపై దాడి జరిగిందని విధి నిర్వహణలో నిర్లక్ష్యం వహించిన ప్రిన్సిపాల్ తో పాటు ఉద్యోగులను సస్పెండ్ చేయాలని డిమాండ్ చేశారు. వెంటనే మండల విద్యాధికారి ప్రభాకర్ రావు, తహసిల్దార్ రజిత, ఎస్సై వంశీకృష్ణ గురుకుల పాఠశాలను సందర్శించి విచారణ చేపట్టారు. విధి నిర్వాహణలో నిర్లక్ష్యంగా వ్యవహరించిన వారిపై చర్యలు తీసుకునేలా కలెక్టర్ కు సిఫార్సు చేస్తున్నట్లు ప్రకటించారు. అధికారుల హామీతో ఆందోళన సద్దుమణిగింది.
    3
    కరీంనగర్ జిల్లా గంగాధర లోని మహాత్మ జ్యోతిబా పూలే గురుకుల బాలుర పాఠశాలలో విద్యార్థుల మధ్య ఘర్షణ కలకలం సృష్టిస్తుంది. తొమ్మిదవ తరగతి విద్యార్థులపై పదవ తరగతి విద్యార్థులు దాడి చేయడంతో పలువురు విద్యార్థులకు స్వల్ప గాయాలయ్యాయి. ముగ్గురు విద్యార్థులను ఆసుపత్రికి తరలించి వైద్యం చేయించినట్లు అధికారులు తెలిపారు. ఆలస్యంగా వెలుగులోకి వచ్చిన ఘటనతో పేరెంట్స్ ఆందోళనకు దిగారు.  దాడికి పాల్పడ్డ విద్యార్థుల పై చర్యలు తీసుకోవడంతో పాటు ప్రిన్సిపల్ ను, డ్యూటీలో ఉన్న ఉద్యోగులను సస్పెండ్ చేయాలని డిమాండ్ చేశారు. పేరెంట్స్ ముందు విద్యార్థులు బోరున విలపిస్తూ తమ గోడును వెళ్ళబోసుకున్నారు. చిన్న చిన్న కారణాలతో దాడి చేసి కొట్టారని ఆవేదన వ్యక్తం చేశారు. పిల్లలకు బిస్కెట్ ప్యాకెట్ తీసుకొస్తే అనుమతించని అధికారులు, విద్యార్థులు చేతులకు కడాలు పెట్టుకుని లోనికి వస్తే ఎలా అనుమతిస్తారని పేరెంట్స్ నిలదీశారు. ప్రిన్సిపల్ నిర్లక్ష్యం వల్లే పిల్లలపై దాడి జరిగిందని విధి నిర్వహణలో నిర్లక్ష్యం వహించిన ప్రిన్సిపాల్ తో పాటు ఉద్యోగులను సస్పెండ్ చేయాలని డిమాండ్ చేశారు. వెంటనే మండల విద్యాధికారి ప్రభాకర్ రావు, తహసిల్దార్ రజిత, ఎస్సై వంశీకృష్ణ గురుకుల పాఠశాలను సందర్శించి విచారణ చేపట్టారు. విధి నిర్వాహణలో నిర్లక్ష్యంగా వ్యవహరించిన వారిపై చర్యలు తీసుకునేలా కలెక్టర్ కు సిఫార్సు చేస్తున్నట్లు ప్రకటించారు. అధికారుల హామీతో ఆందోళన సద్దుమణిగింది.
    user_K.V.REDDY
    K.V.REDDY
    చిగురుమామిడి, కరీంనగర్, తెలంగాణ•
    11 min ago
  • *పేకాట స్థావరంపై CCS టీం మెరుపుదాడి – నలుగురు అరెస్ట్* నేడు *గౌరవనీయులు నిజామాబాద్ పోలీస్ కమిషనర్ శ్రీ పి. సాయి చైతన్య, IPS.,* గారి ఆదేశాల మేరకు CCS ఏసీపీ మస్తాన్ అలీ గారి ఆధ్వర్యంలో CCS సిబ్బంది పేకాట స్థావరంపై మెరుపుదాడి నిర్వహించారు. జక్రాన్‌పల్లి పోలీస్ స్టేషన్ పరిధిలోని కలిగొట్ గ్రామ శివారులో నడుస్తున్న పేకాట స్థావరంపై నేడు దాడి చేసి నలుగురు వ్యక్తులను అదుపులోకి తీసుకున్నారు. వారి వద్ద నుండి నాలుగు వాహనాలు, మూడు సెల్‌ఫోన్లు మరియు రూ.10,940 నగదు స్వాధీనం చేసుకున్నారు. పట్టుబడిన వ్యక్తులను మరియు స్వాధీనం చేసుకున్న వస్తువులను తదుపరి చట్టపరమైన చర్యల కోసం జక్రాన్‌పల్లి పోలీస్ స్టేషన్ SHO గారికి అప్పగించినట్లు పోలీసులు తెలిపారు.
    1
    *పేకాట స్థావరంపై CCS టీం మెరుపుదాడి – నలుగురు అరెస్ట్*
నేడు *గౌరవనీయులు నిజామాబాద్ పోలీస్ కమిషనర్ శ్రీ పి. సాయి చైతన్య, IPS.,* గారి ఆదేశాల మేరకు CCS ఏసీపీ మస్తాన్ అలీ గారి ఆధ్వర్యంలో CCS సిబ్బంది పేకాట స్థావరంపై మెరుపుదాడి నిర్వహించారు.
జక్రాన్‌పల్లి పోలీస్ స్టేషన్ పరిధిలోని కలిగొట్ గ్రామ శివారులో నడుస్తున్న పేకాట స్థావరంపై నేడు దాడి చేసి నలుగురు వ్యక్తులను అదుపులోకి తీసుకున్నారు. వారి వద్ద నుండి నాలుగు వాహనాలు, మూడు సెల్‌ఫోన్లు మరియు రూ.10,940 నగదు స్వాధీనం చేసుకున్నారు.
పట్టుబడిన వ్యక్తులను మరియు స్వాధీనం చేసుకున్న వస్తువులను తదుపరి చట్టపరమైన చర్యల కోసం జక్రాన్‌పల్లి పోలీస్ స్టేషన్ SHO గారికి అప్పగించినట్లు పోలీసులు తెలిపారు.
    user_Anantoji Kalidas
    Anantoji Kalidas
    నిజామాబాద్ నార్త్, నిజామాబాద్, తెలంగాణ•
    2 hrs ago
  • పత్రిక ప్రకటన తేది :04.04.2026 కామారెడ్డి జిల్లా శనివారం రబీ యాసంగి 2025-26 వరి ధాన్యం కొనుగోలు పై సమీక్ష సమావేశం రబీ యాసంగి 2025-26 సీజన్‌కు సంబంధించి వరి ధాన్యం కొనుగోలు ఏర్పాట్లపై జిల్లా స్థాయి సమీక్ష సమావేశం కలెక్టరేట్ సమావేశ మందిరంలో జిల్లా కలెక్టర్ ఆశిష్ సాంగ్వాన్ ఆధ్వర్యంలో నిర్వహించబడింది. ఈ సందర్భంగా జిల్లా కలెక్టర్ మాట్లాడుతూ, రైతుల నుండి వరి ధాన్యాన్ని సమర్థవంతంగా కొనుగోలు చేయడానికి అవసరమైన అన్ని చర్యలను ముందస్తుగా చేపట్టాలని అధికారులకు సూచించారు. కేంద్ర ప్రభుత్వం నిర్ణయించిన కనీస మద్దతు ధర (MSP) ప్రకారం: గ్రేడ్-1 వరికి క్వింటాలుకు రూ. 2389 సాధారణ రకం వరికి క్వింటాలుకు రూ. 2369 అని తెలియజేశారు. ధాన్యం కొనుగోలు ప్రక్రియలో పారదర్శకత, వేగం కోసం ఫ్యాక్స్, ఐకేపీ సిబ్బంది, ఇతర సంబంధిత సిబ్బందికి ప్రోక్యూర్మెంట్ యాప్ వినియోగంపై ప్రత్యేక అవగాహన కార్యక్రమాన్ని నిర్వహించారు. ఈ కార్యక్రమంలో అధికారులు యాప్ వినియోగం, నమోదు విధానం, ధాన్యం రికార్డింగ్, చెల్లింపుల ప్రక్రియలపై వివరమైన శిక్షణ పొందారు. రైతులకు ఎటువంటి ఇబ్బందులు కలగకుండా కొనుగోలు కేంద్రాలలో తగిన సదుపాయాలు కల్పించాలని, ధాన్యం తూకం, నిల్వ, రవాణా ఏర్పాట్లు సమర్థవంతంగా ఉండేలా చూడాలని, ముఖ్యంగా ఎండాకాలం దృష్ట్యా అన్ని సౌకర్యాలు కల్పించాలని జిల్లా కలెక్టర్ ఆదేశించారు. ఈ సమావేశంలో సంబంధిత శాఖల అధికారులు, ఐకేపీ సిబ్బంది, తదితరులు పాల్గొన్నారు.
    1
    పత్రిక ప్రకటన 
తేది :04.04.2026
కామారెడ్డి జిల్లా శనివారం 
రబీ యాసంగి 2025-26 వరి ధాన్యం కొనుగోలు పై సమీక్ష సమావేశం
రబీ యాసంగి 2025-26 సీజన్‌కు సంబంధించి వరి ధాన్యం కొనుగోలు ఏర్పాట్లపై జిల్లా స్థాయి సమీక్ష సమావేశం కలెక్టరేట్ సమావేశ మందిరంలో జిల్లా కలెక్టర్ ఆశిష్ సాంగ్వాన్ ఆధ్వర్యంలో నిర్వహించబడింది.
ఈ సందర్భంగా జిల్లా కలెక్టర్ మాట్లాడుతూ, రైతుల నుండి వరి ధాన్యాన్ని సమర్థవంతంగా కొనుగోలు చేయడానికి అవసరమైన అన్ని చర్యలను ముందస్తుగా చేపట్టాలని అధికారులకు సూచించారు. కేంద్ర ప్రభుత్వం నిర్ణయించిన కనీస మద్దతు ధర (MSP) ప్రకారం:
గ్రేడ్-1 వరికి క్వింటాలుకు రూ. 2389
సాధారణ రకం వరికి క్వింటాలుకు రూ. 2369
అని తెలియజేశారు.
ధాన్యం కొనుగోలు ప్రక్రియలో పారదర్శకత, వేగం కోసం ఫ్యాక్స్, ఐకేపీ సిబ్బంది, ఇతర సంబంధిత సిబ్బందికి ప్రోక్యూర్మెంట్ యాప్ వినియోగంపై ప్రత్యేక అవగాహన కార్యక్రమాన్ని నిర్వహించారు. ఈ కార్యక్రమంలో అధికారులు యాప్ వినియోగం, నమోదు విధానం, ధాన్యం రికార్డింగ్,  చెల్లింపుల ప్రక్రియలపై వివరమైన శిక్షణ పొందారు.
రైతులకు ఎటువంటి ఇబ్బందులు కలగకుండా కొనుగోలు కేంద్రాలలో తగిన సదుపాయాలు కల్పించాలని, ధాన్యం తూకం, నిల్వ, రవాణా ఏర్పాట్లు సమర్థవంతంగా ఉండేలా చూడాలని, ముఖ్యంగా ఎండాకాలం దృష్ట్యా అన్ని సౌకర్యాలు   కల్పించాలని జిల్లా కలెక్టర్ ఆదేశించారు. ఈ సమావేశంలో సంబంధిత శాఖల అధికారులు, ఐకేపీ సిబ్బంది, తదితరులు పాల్గొన్నారు.
    user_Narmala Swapna
    Narmala Swapna
    Tour operator నాగారెడ్డిపేట్, కామారెడ్డి, తెలంగాణ•
    2 hrs ago
  • * *ఆలయ అభివృద్ధి అద్భుతంగా ఉండేలా చర్యలు తీసుకోవాలని అధికారులను ఆదేశించిన సీఎం* భక్తుల విశ్వాసాలను గౌరవిస్తూ, శాస్త్ర ప్రకారం ఆలయ అభివృద్ధి ఉండాలన్న ముఖ్యమంత్రి భవిష్యత్ అవసరాలను, రద్దీని దృష్టిలో ఉంచుకుని విశాలమైన రోడ్లు ఉండేలా చర్యలు తీసుకోవాలన్న సీఎం ఆలయ పరిసరాల్లో ఈవీ వాహనాలను మాత్రమే వినియోగించేలా చర్యలు తీసుకోవాలని సూచించిన ముఖ్యమంత్రి ఆలయ పవిత్రతకు భంగం కలగకుండా నిబంధనలు కఠినతరం చేయాలని ఆదేశించిన సీఎం తిరుమల తరహాలో అన్ని ఆలయాల పరిసరాల్లో ఎలాంటి రాజకీయ కార్యకలాపాలు జరగకుండా నిబంధనలు ఉండాలన్న సీఎం ఈ నెల 6 న బాసర ఆలయ అభివృద్ధి పనులకు శంకుస్థాపన చేయనున్న సీఎం. రూ.225 కోట్లతో ఆలయ అభివృద్ధి పనులు ప్రారంభించనున్న సీఎం
    3
    *
*ఆలయ అభివృద్ధి అద్భుతంగా ఉండేలా చర్యలు తీసుకోవాలని అధికారులను ఆదేశించిన సీఎం*
భక్తుల విశ్వాసాలను గౌరవిస్తూ, శాస్త్ర ప్రకారం ఆలయ అభివృద్ధి ఉండాలన్న ముఖ్యమంత్రి 
భవిష్యత్ అవసరాలను, రద్దీని దృష్టిలో ఉంచుకుని విశాలమైన రోడ్లు ఉండేలా చర్యలు తీసుకోవాలన్న సీఎం 
ఆలయ పరిసరాల్లో ఈవీ వాహనాలను మాత్రమే వినియోగించేలా చర్యలు తీసుకోవాలని సూచించిన ముఖ్యమంత్రి 
ఆలయ పవిత్రతకు భంగం కలగకుండా నిబంధనలు కఠినతరం చేయాలని ఆదేశించిన సీఎం 
తిరుమల తరహాలో అన్ని ఆలయాల పరిసరాల్లో ఎలాంటి రాజకీయ కార్యకలాపాలు జరగకుండా నిబంధనలు ఉండాలన్న సీఎం 
ఈ నెల 6 న బాసర ఆలయ అభివృద్ధి పనులకు శంకుస్థాపన చేయనున్న సీఎం.
రూ.225 కోట్లతో ఆలయ అభివృద్ధి పనులు ప్రారంభించనున్న సీఎం
    user_M.RAJKIRAN REDDY
    M.RAJKIRAN REDDY
    Adilabad Rural, Telangana•
    7 hrs ago
  • కరీంనగర్ లో ఏఐఎస్ఎఫ్ విద్యార్థి సంఘం నాయకులు ఆదర్శ వివాహం చేసుకున్నారు. సిపిఐ జిల్లా సహకారంతో ఇందిరా గార్డెన్ లో మానకొండూర్ మండలం గట్టుదుద్దెనపల్లికి చెందిన ఏఐఎస్ఎఫ్ రాష్ట్ర గర్ల్స్ వింగ్ కో కన్వీనర్ కండె విజేత, పెద్దపల్లి జిల్లా గోదావరిఖనికి చెందిన జిల్లా కార్యదర్శి రేణుకుంట్ల ప్రీతమ్ స్టేజ్ మ్యారేజ్ చేసుకున్నారు. మీడియా అకాడమీ చైర్మన్ శ్రీనివాస్ రెడ్డి, మాజీ ఎమ్మెల్యే చాడ వెంకటరెడ్డి ల సమక్షంలో దండలు మార్చుకుని ఆలుమగలు గా ప్రమాణం చేశారు. అమ్మాయి విజేత చే వివాహ ప్రమాణ పత్రం శ్రీనివాస్ రెడ్డి చదివించగా, అబ్బాయి ప్రీతమ్ చే చాడ వెంకటరెడ్డి చదివించారు. అనంతరం అమ్మాయి, అబ్బాయి వివాహ పత్రాలపై సంతకాలు చేసి దండలు మార్చుకొని ఆలుమగలుగా ఒక్కటయ్యారు. జీవితంలో ఒకరినొకరు అర్థం చేసుకొని కలిసి జీవించడానికి నిర్ణయించుకొని ఆదర్శ వివాహం చేసుకోవడం అభినందనీయమన్నారు. ఆదర్శ వివాహం చేసుకున్న నూతన దంపతులు సమాజ హితం కోసం పనిచేయాలని సూచించారు. నూతన దంపతులను విద్యార్థి సంఘం నాయకులతోపాటు రాజకీయ పార్టీల నేతలు అభినందించి ఆశీర్వదించారు.
    4
    కరీంనగర్ లో ఏఐఎస్ఎఫ్ విద్యార్థి సంఘం నాయకులు ఆదర్శ వివాహం చేసుకున్నారు. సిపిఐ జిల్లా సహకారంతో ఇందిరా గార్డెన్ లో  మానకొండూర్ మండలం గట్టుదుద్దెనపల్లికి చెందిన ఏఐఎస్ఎఫ్ రాష్ట్ర గర్ల్స్ వింగ్ కో  కన్వీనర్ కండె విజేత, పెద్దపల్లి జిల్లా గోదావరిఖనికి చెందిన జిల్లా కార్యదర్శి రేణుకుంట్ల ప్రీతమ్ స్టేజ్ మ్యారేజ్ చేసుకున్నారు. మీడియా అకాడమీ చైర్మన్ శ్రీనివాస్ రెడ్డి, మాజీ ఎమ్మెల్యే చాడ వెంకటరెడ్డి ల సమక్షంలో దండలు మార్చుకుని ఆలుమగలు గా ప్రమాణం చేశారు. అమ్మాయి విజేత చే వివాహ ప్రమాణ పత్రం శ్రీనివాస్ రెడ్డి చదివించగా, అబ్బాయి ప్రీతమ్ చే చాడ వెంకటరెడ్డి చదివించారు. అనంతరం అమ్మాయి, అబ్బాయి వివాహ పత్రాలపై సంతకాలు చేసి దండలు మార్చుకొని ఆలుమగలుగా ఒక్కటయ్యారు. జీవితంలో ఒకరినొకరు అర్థం చేసుకొని కలిసి జీవించడానికి నిర్ణయించుకొని ఆదర్శ వివాహం చేసుకోవడం అభినందనీయమన్నారు. ఆదర్శ వివాహం చేసుకున్న నూతన దంపతులు సమాజ హితం కోసం పనిచేయాలని సూచించారు. నూతన దంపతులను విద్యార్థి సంఘం నాయకులతోపాటు రాజకీయ పార్టీల నేతలు అభినందించి ఆశీర్వదించారు.
    user_K.V.REDDY
    K.V.REDDY
    చిగురుమామిడి, కరీంనగర్, తెలంగాణ•
    2 hrs ago
  • ఈ నెల 6వ తేదీన బాసర పుణ్యక్షేత్రాన్ని సందర్శించనున్న తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి వర్యులు శ్రీ *అనుముల రేవంత్ రెడ్డి *గారి పర్యటన ఏర్పాట్లను సమీక్షించేందుకు, రాష్ట్ర మంత్రి వర్యులు శ్రీ జూపల్లి కృష్ణారావు గారు మరియు వివేక్ వెంకటస్వామి గారు నేడు బాసరకు విచ్చేశారు.ఈ సమీక్షా కార్యక్రమంలో జిల్లా కలెక్టర్ శ్రీ అభిలాష అభినవ్ గారు, బాసర సర్పంచ్ శ్రీ తీగల వెంకటేష్ గౌడ్ గారు మరియు EX MLA జి.విఠల్ రెడ్డి గారు EX సర్పంచ్ దయల లక్ష్మణ్ రావు గారు EX సర్పంచ్ కిర్గుల్ శ్రీ పెద్దకొండూరి సుధాకర్ రెడ్డి గారు ఉప సర్పంచ్ సయ్యద్ అలీ గారు బాసర గ్రామ టీమ్ విఠల్ రెడ్డి గారు కాంగ్రెస్ కార్యకర్తలు ఇతర ప్రభుత్వ అధికారులు పాల్గొన్నారు.ముఖ్యమంత్రి గారి పర్యటనకు సంబంధించి తీసుకోవాల్సిన జాగ్రత్తలు, భద్రత మరియు ఇతర ఏర్పాట్లపై వారు క్షేత్రస్థాయిలో చర్చించారు.
    1
    ఈ నెల 6వ తేదీన బాసర పుణ్యక్షేత్రాన్ని సందర్శించనున్న తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి వర్యులు శ్రీ *అనుముల రేవంత్ రెడ్డి *గారి పర్యటన ఏర్పాట్లను సమీక్షించేందుకు, రాష్ట్ర మంత్రి వర్యులు శ్రీ జూపల్లి కృష్ణారావు గారు మరియు వివేక్ వెంకటస్వామి గారు నేడు బాసరకు విచ్చేశారు.ఈ సమీక్షా కార్యక్రమంలో జిల్లా కలెక్టర్ శ్రీ అభిలాష అభినవ్ గారు, బాసర సర్పంచ్ శ్రీ తీగల వెంకటేష్ గౌడ్ గారు మరియు EX MLA జి.విఠల్ రెడ్డి గారు EX సర్పంచ్ దయల లక్ష్మణ్ రావు గారు EX సర్పంచ్ కిర్గుల్ శ్రీ పెద్దకొండూరి సుధాకర్ రెడ్డి గారు ఉప సర్పంచ్ సయ్యద్ అలీ గారు బాసర గ్రామ టీమ్ విఠల్ రెడ్డి గారు కాంగ్రెస్ కార్యకర్తలు  ఇతర ప్రభుత్వ అధికారులు పాల్గొన్నారు.ముఖ్యమంత్రి గారి పర్యటనకు సంబంధించి తీసుకోవాల్సిన జాగ్రత్తలు, భద్రత మరియు ఇతర ఏర్పాట్లపై వారు క్షేత్రస్థాయిలో చర్చించారు.
    user_Anantoji Kalidas
    Anantoji Kalidas
    నిజామాబాద్ నార్త్, నిజామాబాద్, తెలంగాణ•
    23 hrs ago
View latest news on Shuru App
Download_Android
  • Terms & Conditions
  • Career
  • Privacy Policy
  • Blogs
Shuru, a product of Close App Private Limited.