రైతు బాగుంటేనే రాష్ట్రం బాగుంటుంది.. రైతాంగానికి ఎన్డీఏ ప్రభుత్వం అండ బాపట్ల నియోజకవర్గం, పిట్టలవానిపాలెం మండల పరిధిలోని చందోలు, నారాకోడూరు, సంగుపాలెం, కోమలి, రెడ్డిపాలెం తదితర గ్రామాల్లో బాపట్ల ఎమ్మెల్యే వేగేశన నరేంద్ర వర్మరాజు మంగళవారం విస్తృత పర్యటన చేశారు. జిల్లా, మండల స్థాయి వ్యవసాయ, నీటిపారుదల శాఖ అధికారులతో కలిసి స్వయంగా వ్యవసాయ పొలాలను పరిశీలించారు. ఎల్-నినో (El Nino) ప్రభావంతో నెలకొన్న వర్షాభావ పరిస్థితుల నేపథ్యంలో రైతులు ఎదుర్కొంటున్న సమస్యలను ముఖాముఖిగా అడిగి తెలుసుకున్నారు. ఈ సందర్భంగా రైతులకు ప్రభుత్వం అన్ని విధాలా అండగా ఉంటుందని ఆయన భరోసా ఇచ్చారు.bవాతావరణ శాఖ నివేదికల ప్రకారం రాబోయే రెండు మూడు నెలలు వర్షాలు ఆశాజనకంగా లేనందున, కొత్తగా నీటి ఆధారిత పంటలు వేయవద్దని రైతులను కోరారు. ప్రస్తుత పరిస్థితుల్లో త్రాగునీరు, పశువుల మేతకు మొదటి ప్రాధాన్యత ఇవ్వాలన్నారు. కాబట్టి రైతులు మినుము, పెసర, సజ్జలు, రాగులు, కందులు, కొర్రలు, నువ్వులు తదితర ప్రత్యామ్నాయ/ఆరుతడి పంటల వైపు మళ్లాలని సూచించారు. ప్రత్యామ్నాయ పంటల సాగును ప్రోత్సహించేందుకు ప్రభుత్వం 80% సబ్సిడీపై విత్తనాలను అందిస్తోందని తెలిపారు. వెయ్యి రూపాయల విత్తనాలకు రైతులు కేవలం రూ. 200 చెల్లిస్తే సరిపోతుందని, మిగతా భారాన్ని ప్రభుత్వమే భరిస్తుందని స్పష్టం చేశారు. బోరుబావుల సదుపాయం ఉన్న రైతులు వేరుశనగ కూడా సాగు చేసుకోవచ్చని తెలిపారు.విత్తనాలు వేసిన తర్వాత వర్షాలు పడక మొలక రాకపోయినా, లేదా పంట ఎండిపోయినా రైతులు ఆందోళన చెందాల్సిన అవసరం లేదన్నారు. కేవలం రూ. 600 నుండి రూ. 800 నామమాత్రపు ప్రీమియం చెల్లించి ఈ-కేవైసీ (e-KYC) చేసుకుంటే, పంట నష్టపోయిన పక్షంలో ఎకరాకు రూ. 20,000 చొప్పున ఇన్సూరెన్స్ ద్వారా నష్టపరిహారం అందేలా ప్రభుత్వం చర్యలు తీసుకుంటుందని హామీ ఇచ్చారు.కృష్ణా డెల్టా పరిధిలోని నిజాంపట్నం, కొమ్మమూరు కాలువలకు రోజుకు 7000 క్యూసెక్కుల నీరు అవసరం కాగా, వర్షాలు లేకపోవడం వల్ల ప్రస్తుతం పట్టిసీమ ద్వారా సగం నీరు మాత్రమే వస్తుందని వివరించారు. ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు పోలవరం ప్రాజెక్టును ప్రతి సోమవారం సమీక్షిస్తున్నారని, 2027 మార్చి - ఏప్రిల్ నాటికి ప్రాజెక్టును పూర్తి చేసి గ్రావిటీ ద్వారా కృష్ణా నదికి నీరు అందిస్తామని ధీమా వ్యక్తం చేశారు. దీని ద్వారా భవిష్యత్తులో సాగునీటి డోకా ఉండదన్నారు.పొన్నూరు మున్సిపాలిటీ వారు నీటిని ఆపివేయడం వల్ల దిగువన ఉన్న కోమలి గ్రామ రైతులకు జరుగుతున్న నష్టాన్ని నీటిపారుదల శాఖ అధికారుల దృష్టికి తీసుకెళ్లారు. దామాషా పద్ధతిలో అందరికీ నీరు అందేలా చర్యలు తీసుకోవాలని అధికారులను ఆదేశించారు. అలాగే కోమలి గ్రామంలో త్రాగునీటి చెరువు (వేసవిలో నింపుదల) సమస్యను కూడా శాశ్వతంగా పరిష్కరిస్తామన్నారు.ఈ ప్రాంత రైతుల దీర్ఘకాలిక సమస్యల పరిష్కారం కోసం చందోలు పెట్రోల్ బంక్ సమీపంలో సుమారు 1,000 నుంచి 1,200 ఎకరాలకు సాగునీరు అందించేలా ఒక ఎత్తిపోతల పథకాన్ని ఏర్పాటు చేయడానికి అంచనాలు సిద్ధం చేయాలని ఇంజనీరింగ్ అధికారులను ఆదేశించారు. గత ప్రభుత్వం నిర్వీర్యం చేసిన ఎత్తిపోతల పథకాల పునరుద్ధరణతో పాటు, చందోలు కొత్త ప్రాజెక్టు కోసం జలవనరుల శాఖ మంత్రి నిమ్మల రామానాయుడు, జిల్లా కలెక్టర్ తో చర్చించి నిధులు మంజూరు చేయిస్తానని రైతులకు హామీ ఇచ్చారు.క్షేత్రస్థాయిలో సమస్యలను తెలుసుకొని, రైతులకు తక్షణమే సమాధానాలు, భరోసా ఇవ్వాలనే ఉద్దేశ్యంతోనే అధికారులందరినీ వెంటబెట్టుకుని ఈ పర్యటన చేపట్టినట్లు ఎమ్మెల్యే తెలిపారు. ప్రభుత్వం సూచించిన విధంగా సరైన నీటి లభ్యత ఉంటేనే కొత్త పంటలు వేయాలని, రైతులు ఎవరూ తొందరపడి పెట్టుబడులు పెట్టి నష్టపోవద్దని బాపట్ల నియోజకవర్గ ఎమ్మెల్యే నరేంద్ర వర్మ రాజుnవిజ్ఞప్తి చేశారు.ఈ కార్యక్రమంలో స్థానిక ప్రజాప్రతినిధులు, వ్యవసాయ మరియు ఇరిగేషన్ శాఖ అధికారులు, రైతులు, నాయకులు, కార్యకర్తలు తదితరులు పాల్గొన్నారు.
రైతు బాగుంటేనే రాష్ట్రం బాగుంటుంది.. రైతాంగానికి ఎన్డీఏ ప్రభుత్వం అండ బాపట్ల నియోజకవర్గం, పిట్టలవానిపాలెం మండల పరిధిలోని చందోలు, నారాకోడూరు, సంగుపాలెం, కోమలి, రెడ్డిపాలెం తదితర గ్రామాల్లో బాపట్ల ఎమ్మెల్యే వేగేశన నరేంద్ర వర్మరాజు మంగళవారం విస్తృత పర్యటన చేశారు. జిల్లా, మండల స్థాయి వ్యవసాయ, నీటిపారుదల శాఖ అధికారులతో కలిసి స్వయంగా వ్యవసాయ పొలాలను పరిశీలించారు. ఎల్-నినో (El Nino) ప్రభావంతో నెలకొన్న వర్షాభావ పరిస్థితుల నేపథ్యంలో రైతులు ఎదుర్కొంటున్న సమస్యలను ముఖాముఖిగా అడిగి తెలుసుకున్నారు. ఈ సందర్భంగా రైతులకు ప్రభుత్వం అన్ని విధాలా అండగా ఉంటుందని ఆయన భరోసా ఇచ్చారు.bవాతావరణ శాఖ నివేదికల ప్రకారం రాబోయే రెండు మూడు నెలలు వర్షాలు ఆశాజనకంగా లేనందున, కొత్తగా నీటి ఆధారిత పంటలు వేయవద్దని రైతులను కోరారు. ప్రస్తుత పరిస్థితుల్లో త్రాగునీరు, పశువుల మేతకు మొదటి ప్రాధాన్యత ఇవ్వాలన్నారు. కాబట్టి రైతులు మినుము, పెసర, సజ్జలు,
రాగులు, కందులు, కొర్రలు, నువ్వులు తదితర ప్రత్యామ్నాయ/ఆరుతడి పంటల వైపు మళ్లాలని సూచించారు. ప్రత్యామ్నాయ పంటల సాగును ప్రోత్సహించేందుకు ప్రభుత్వం 80% సబ్సిడీపై విత్తనాలను అందిస్తోందని తెలిపారు. వెయ్యి రూపాయల విత్తనాలకు రైతులు కేవలం రూ. 200 చెల్లిస్తే సరిపోతుందని, మిగతా భారాన్ని ప్రభుత్వమే భరిస్తుందని స్పష్టం చేశారు. బోరుబావుల సదుపాయం ఉన్న రైతులు వేరుశనగ కూడా సాగు చేసుకోవచ్చని తెలిపారు.విత్తనాలు వేసిన తర్వాత వర్షాలు పడక మొలక రాకపోయినా, లేదా పంట ఎండిపోయినా రైతులు ఆందోళన చెందాల్సిన అవసరం లేదన్నారు. కేవలం రూ. 600 నుండి రూ. 800 నామమాత్రపు ప్రీమియం చెల్లించి ఈ-కేవైసీ (e-KYC) చేసుకుంటే, పంట నష్టపోయిన పక్షంలో ఎకరాకు రూ. 20,000 చొప్పున ఇన్సూరెన్స్ ద్వారా నష్టపరిహారం అందేలా ప్రభుత్వం చర్యలు తీసుకుంటుందని హామీ ఇచ్చారు.కృష్ణా డెల్టా పరిధిలోని నిజాంపట్నం, కొమ్మమూరు కాలువలకు రోజుకు 7000 క్యూసెక్కుల నీరు
అవసరం కాగా, వర్షాలు లేకపోవడం వల్ల ప్రస్తుతం పట్టిసీమ ద్వారా సగం నీరు మాత్రమే వస్తుందని వివరించారు. ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు పోలవరం ప్రాజెక్టును ప్రతి సోమవారం సమీక్షిస్తున్నారని, 2027 మార్చి - ఏప్రిల్ నాటికి ప్రాజెక్టును పూర్తి చేసి గ్రావిటీ ద్వారా కృష్ణా నదికి నీరు అందిస్తామని ధీమా వ్యక్తం చేశారు. దీని ద్వారా భవిష్యత్తులో సాగునీటి డోకా ఉండదన్నారు.పొన్నూరు మున్సిపాలిటీ వారు నీటిని ఆపివేయడం వల్ల దిగువన ఉన్న కోమలి గ్రామ రైతులకు జరుగుతున్న నష్టాన్ని నీటిపారుదల శాఖ అధికారుల దృష్టికి తీసుకెళ్లారు. దామాషా పద్ధతిలో అందరికీ నీరు అందేలా చర్యలు తీసుకోవాలని అధికారులను ఆదేశించారు. అలాగే కోమలి గ్రామంలో త్రాగునీటి చెరువు (వేసవిలో నింపుదల) సమస్యను కూడా శాశ్వతంగా పరిష్కరిస్తామన్నారు.ఈ ప్రాంత రైతుల దీర్ఘకాలిక సమస్యల పరిష్కారం కోసం చందోలు పెట్రోల్ బంక్ సమీపంలో సుమారు 1,000 నుంచి
1,200 ఎకరాలకు సాగునీరు అందించేలా ఒక ఎత్తిపోతల పథకాన్ని ఏర్పాటు చేయడానికి అంచనాలు సిద్ధం చేయాలని ఇంజనీరింగ్ అధికారులను ఆదేశించారు. గత ప్రభుత్వం నిర్వీర్యం చేసిన ఎత్తిపోతల పథకాల పునరుద్ధరణతో పాటు, చందోలు కొత్త ప్రాజెక్టు కోసం జలవనరుల శాఖ మంత్రి నిమ్మల రామానాయుడు, జిల్లా కలెక్టర్ తో చర్చించి నిధులు మంజూరు చేయిస్తానని రైతులకు హామీ ఇచ్చారు.క్షేత్రస్థాయిలో సమస్యలను తెలుసుకొని, రైతులకు తక్షణమే సమాధానాలు, భరోసా ఇవ్వాలనే ఉద్దేశ్యంతోనే అధికారులందరినీ వెంటబెట్టుకుని ఈ పర్యటన చేపట్టినట్లు ఎమ్మెల్యే తెలిపారు. ప్రభుత్వం సూచించిన విధంగా సరైన నీటి లభ్యత ఉంటేనే కొత్త పంటలు వేయాలని, రైతులు ఎవరూ తొందరపడి పెట్టుబడులు పెట్టి నష్టపోవద్దని బాపట్ల నియోజకవర్గ ఎమ్మెల్యే నరేంద్ర వర్మ రాజుnవిజ్ఞప్తి చేశారు.ఈ కార్యక్రమంలో స్థానిక ప్రజాప్రతినిధులు, వ్యవసాయ మరియు ఇరిగేషన్ శాఖ అధికారులు, రైతులు, నాయకులు, కార్యకర్తలు తదితరులు పాల్గొన్నారు.
- మెగాస్టార్ చిరంజీవి ఇంట్లో వినాయక చవితి సంబరాలు మెగాస్టార్ చిరంజీవి నివాసంలో వినాయక చవితి వేడుకలు అంబరాన్నంటాయి. రామ్ చరణ్, ఉపాసన, కుటుంబ సభ్యులంతా కలిసి స్వామివారికి ప్రత్యేక పూజలు నిర్వహించారు. సంప్రదాయ దుస్తుల్లో మెగా కుటుంబ సభ్యులు పాల్గొన్న ఈ దృశ్యాలు నెట్టింట వైరల్‌గా మారాయి. అభిమానులకు వినాయక చవితి శుభాకాంక్షలు తెలిపిన రామ్ చరణ్, అందరికీ ఆనందం, శ్రేయస్సు కలగాలని ఆకాంక్షించారు. చరణ్ ప్రస్తుతం సుకుమార్ దర్శకత్వంలో రాబోతున్న #RC17 వంటి భారీ చిత్రాలతో బిజీగా ఉన్నారు.1
- నిబంధనలకు విరుద్ధంగా తరగతులు నిర్వహిస్తున్న విద్యాసంస్థ పై చర్యలు తీసుకోండి. సెలవు రోజుల్లో నిబంధనలకు విరుద్ధంగా ఎటువంటి భద్రత లేకుండా ప్రిన్సిపల్ ఇంటిలో క్లాసులు నిర్వహించిన నారాయణ స్కూల్ పై చర్యలు తీసుకోవాలని రేపల్లె ఎంఈఓ కార్యాలయం వద్ద ఎస్ఎఫ్ఐ నాయకులు ధర్నా నిర్వహించి ఎంఈఓ కె.సురేష్ కి వినతిపత్రం అందజేశారు.ఈ సందర్భంగా ఎస్ఎఫ్ఐ రేపల్లె కార్యదర్శి ఎం.సూర్య ప్రకాష్,సహాయ కార్యదర్శి వై.నవీన్ మాట్లాడుతూ రేపల్లె పట్టణంలో సెలవు రోజులలో విద్యాసంస్థలు నిర్వహించవద్దని సంబంధిత విద్యాశాఖ అధికారులు ముందు రోజే ఆదేశాలు ఇచ్చినప్పటికీ ఈనెల 12వ తేదీ రెండో శనివారం,స్కూల్ నడపడానికి ప్రయత్నించిన నారాయణ విద్యాసంస్థ యాజమాన్యంతో ఎస్ఎఫ్ఐ నాయకులు డీఈఓ ద్వారా ఫోన్లో మాట్లాడించిన, మేము స్కూలు నడపాల్సిందే,మాకు ర్యాంకులే ముఖ్యం అంటు కొంతమంది తల్లిదండ్రులను ఎస్ఎఫ్ఐ నాయకులతో మరియు ఫోన్ లో విద్యాశాఖ అధికారులతో గొడవలకు ప్రేరేపించి నిబంధనలకు విరుద్ధంగా విద్యార్థులను ఒత్తిడికి గురిచేస్తూ స్కూల్ నడపడంపై చర్యలు తీసుకోవాలన్నారు.విద్యాసంస్థ నడపటానికి ముందస్తు అనుమతులు తీసుకోకుండా గాలి,వెలుతురు, మంచినీళ్లు, టాయిలెట్స్ లాంటి భద్రతా సౌకర్యాలు లేకుండా స్కూలుకి కిలో మీటర్ దూరంలో గురువు రోడ్డులో ఉన్న ప్రిన్సిపల్ ఇంటిలో మరియు మరో రెండు చోట్ల స్కూల్ సిబ్బంది ఇళ్ళ వద్ద క్లాసులు నిర్వహించారు, నిబంధనలకు విరుద్దగా స్కూల్ ప్రారంభంలో కూడా పుస్తకాలు, యూనిఫామ్ బహిరంగంగా అమ్ముకుని విద్యార్థుల దగ్గర అధిక ఫీజులు వసూలు చేశారు,నిబంధనలకు విరుద్ధంగా వ్యవహరిస్తున్న నారాయణ స్కూల్ పై చర్యలు తీసుకోవాలని ఎంఈఓ ను కోరారు. ఈ కార్యక్రమంలో ఎస్ఎఫ్ఐ నాయకులు నాగార్జున, ప్రశాంత్,వెంకటేశ్వరరావు,శ్రీకాంత్ బెన్నీ తదితరులు పాల్గొన్నారు...2
- పల్లె ప్రజల చెంతకే గౌతమీ హాస్పిటల్ .. వెస్ట్ విప్పర్రలో ఉచిత మెగా మెడికల్ క్యాంపు పెంటపాడు మండలంలోని వెస్ట్ విప్పర్ర గ్రామంలో వల్లి దేవసేన సంతాన నాగ సుబ్రహ్మణ్యేశ్వర స్వామి ఆలయం, గౌతమి మల్టీస్పెషల్టీ హాస్పిటల్ ఆధ్వర్యంలో ఉచిత మెగా మెడికల్ క్యాంపు నిర్వహించారు. శిబిరాన్ని మాజీ ఎమ్మెల్యే పసల కనకసుందరం రిబ్బన్ కట్ చేసి ప్రారంభించారు. గైనకాలజీ, పీడియాట్రిక్, ఆర్థోకేర్ అండ్ ట్రామా కేర్, జనరల్ మెడిసిన్ విభాగాల్లో వైద్య పరీక్షలు నిర్వహించి, అవసరమైన వారికి ఉచితంగా మందులు పంపిణీ చేశారు. ఈ సందర్భంగా పసల కనకసుందరం మాట్లాడుతూ గౌతమి మల్టీస్పెషల్టీ హాస్పిటల్ అందిస్తున్న సేవలు అభినందనీయమన్నారు. మరిన్ని గ్రామాల్లో వైద్య శిబిరాలు ఏర్పాటు చేసి ప్రజలకు ఉచిత వైద్య సేవలు అందించాలని కోరారు. ప్రజలకు మెరుగైన వైద్య సేవలు అందించడం ద్వారా హాస్పిటల్ మరింతగా రాణించాలని ఆకాంక్షించారు. హాస్పిటల్ మేనేజింగ్ డైరెక్టర్ సత్యనారాయణ మాట్లాడుతూ ప్రజా ఆరోగ్యానికి గౌతమి మల్టీస్పెషల్టీ హాస్పిటల్ పెద్దపీట వేస్తోందన్నారు. తాడేపల్లిగూడెంలో తక్కువ ఖర్చుతో వైద్య సేవలు అందించేందుకు హాస్పిటల్ కృషి చేస్తోందని తెలిపారు. మారుమూల గ్రామాల్లో అనారోగ్యంతో బాధపడుతున్నప్పటికీ వైద్యం పొందలేని ప్రజలకు వారి వద్దకే వెళ్లి ఉచిత వైద్య పరీక్షలు నిర్వహించి మందులు పంపిణీ చేస్తున్నామని చెప్పారు. ప్రజలు ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలని కోరారు. కార్యక్రమంలో ఆలయ కమిటీ సభ్యులు పసల చంటి, పసల సత్తి కొండలు, పసల గంగన్న, నైనాల సూర్యచంద్రరావు, గౌతమి హాస్పిటల్ సిబ్బంది తదితరులు పాల్గొన్నారు.1
- ఇంజనీరింగ్ రంగంలో మహోన్నత సేవలు అందించిన మహనీయుడు శ్రీ మోక్షగుండం విశ్వేశ్వరయ్య తాడేపల్లిగూడెం, మండల పరిషత్ కార్యాలయంలో ఇంజనీర్స్ డే కార్యక్రమాన్ని నిర్వహించారు. అందులో భాగంగా రెడ్ క్రాస్ సొసైటీ ఆధ్వర్యంలో ,రక్తదాన శిబిరాన్ని నిర్వహించారు, 20 మంది రక్తదానం చేశారు. ఇంజనీర్స్ డే. వేడుకలు భారత దేశానికి ఇంజనీరింగ్ రంగంలో మహోన్నత సేవలు అందించిన మహనీయుడుశ్రీ మోక్షగుండం విశ్వేశ్వరయ్య అని ఆధునిక మైసూర్. కర్ణాటక రూప కల్పనే కాక భారత దేశంలో అనేక ప్రాంతాలలో సేవలు అందించిన భారతరత్న సర్ మోక్షగుండం విశ్వేశ్వరయ్య 165 వ జయంతి సందర్బంగా ఇంజనీర్ వ్యవస్థ ని వారి సేవలు ను గుర్తు చేసుకుంటూ ఇంజినీర్స్ ని గౌరవించు కోవడం స్ఫూర్తి దాయకం అని పలువురు వక్తలు పేర్కొన్నారు. పంచాయితీ రాజ్ విభాగం లో మున్సిపల్ విభాగం లో విశేష సేవలు అందిస్తున్న పలువురు ఇంజినీర్స్ ని ఇంజనీర్స్ డే. వేడుకలలో జి .త్రినాథ్ బాబు రిటైర్డ్ ఎగ్జిక్యూటివ్ ఇంజనీర్, మాట్లాడుతూ భారత దేశానికి ఇంజనీరింగ్ రంగంలో మహోన్నత సేవలు అందించిన మహనీయుడు శ్రీ మోక్షగుండం విశ్వేశ్వరయ్య అని అన్నారు . ఈ కార్యక్రమంలో విశ్వనాథరెడ్డి ఎగ్జిక్యూటివ్ ఇంజనీర్ ఏలూరు జి త్రినాథ్ బాబు, రిటైర్డ్ ఎగ్జిక్యూటివ్ ఇంజనీర్, సిహెచ్ వర్మ ఏపీ ఆర్డబ్ల్యూఎస్ ఈఏ అధ్యక్షులు, శ్రీకాంత్ ప్రధాన కార్యదర్శి, కే.ధణానంద్ ఏపీ ఆర్డబ్ల్యూఎస్ ఈఏ పశ్చిమగోదావరి అధ్యక్షులు, శ్రీనివాస్ ప్రధాన కార్యదర్శి, రెడ్ క్రాస్ సొసైటీ పీఆర్వో కెవి రమణ, పెద్ద ఎత్తున ఇంజనీర్స్ పాల్గొన్నారు.1
- పల్నాడు జిల్లా..సత్తెనపల్లి *సత్తెనపల్లి పట్టణ ప్రజలకు తాగునీటి విషయంలో ఎలాంటి ఇబ్బందులు కలగకుండా చర్యలు చేపట్టినట్లు పల్నాడు జిల్లా టీడీపీ ఉపాధ్యక్షులు దరువూరి నాగేశ్వరరావు తెలిపారు.* సత్తెనపల్లి ఎమ్మెల్యే కన్నా లక్ష్మీనారాయణ చొరవతో సాగర్ కెనాల్ నుంచి తాగునీటి అవసరాల కోసం నీటిని విడుదల చేయడంతో పట్టణానికి సుమారు 100 రోజులకు సరిపడా మంచినీటిని నిల్వ చేసినట్లు పేర్కొన్నారు. ఈ సందర్భంగా దరువూరి నాగేశ్వరరావు సత్తెనపల్లిలోని మంచినీటి చెరువును సందర్శించి నీటి నిల్వలను పరిశీలించారు. పట్టణ ప్రజలకు తాగునీటి కొరత రాకుండా ఎమ్మెల్యే కన్నా లక్ష్మీనారాయణ అసెంబ్లీలో సమస్యను ప్రస్తావించి, తగిన చర్యలకు చొరవ చూపారని తెలిపారు. ప్రస్తుతం అందుబాటులో ఉన్న నీటి నిల్వలను సమర్థవంతంగా వినియోగిస్తూ పట్టణంలోని ప్రతి ఇంటికీ తాగునీరు అందేలా చూడాలని అధికారులకు సూచించారు. నీటి సరఫరాలో ఎలాంటి అంతరాయం ఏర్పడకుండా ముందస్తు చర్యలు తీసుకోవాలని, ప్రజలకు ఇబ్బందులు లేకుండా నిరంతరం పర్యవేక్షించాలని కోరారు. ఈ కార్యక్రమంలో మున్సిపల్ ఇన్చార్జి కమిషనర్ డి ఈ మధుసూదన్ రావు, కుటమి నాయకులు పాల్గొన్నారు.1
- మందు బాబుల కోసం దేవుడైన కాసుకోవాల్సిందే మనం ఏ జనరేషన్ లో ఉన్నామో అర్ధమౌతుంది..1
- 69 మంది లబ్ధిదారులకు 72.89 లక్షల సీఎం రిలీఫ్ ఫండ్ చెక్కులు అందించిన మంత్రి సత్యప్రసాద్. రాష్ట్రంలో పేద మధ్య తరగతి ప్రజలు వైద్య ఖర్చు నిమిత్తం ఆర్థికంగా ఇబ్బందులు పడకుండా ఉండేందుకు ప్రభుత్వం సకాలంలో CMRF చెక్కులను పంపిణీ చేస్తుందని రెవెన్యూ శాఖ మంత్రి అనగాని సత్యప్రసాద్ అన్నారు. టిడిపి కార్యాలయంలో మంగళవారం సీఎం రిలీఫ్ ఫండ్ కు దరఖాస్తు చేసుకున్న 69 మంది లబ్ధిదారులకు 72,89,587 రూపాయల CMRF చెక్కులను పంపిణీ చేశారు. సీఎం చంద్రబాబు నాయుడు నేతృత్వం లోని కూటమి ప్రభుత్వం పేద ప్రజల ఆరోగ్య సంరక్షణ ధ్యేయంగా అడుగులు వేస్తుందన్నారు.1
- జైనూర్‌లో భారీగా గంజాయి మొక్కలు స్వాధీనం ఆసిఫాబాద్ జిల్లా జైనూర్ మండలం పట్నాపూర్ గ్రామ శివారులో అక్రమంగా సాగు చేస్తున్న గంజాయి మొక్కలను పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. 1,245 గంజాయి మొక్కలు విలువ: రూ.1.54 కోట్లు 11 గ్రాముల ఎండు గంజాయి కూడా స్వాధీనం ఈ వ్యవహారంలో ఇద్దరిపై కేసు నమోదు చేసిన పోలీసులు ఈ వివరాలను ఎస్పీ నితిక పంత్ వెల్లడించారు.1
- మాజీ ఉప ముఖ్యమంత్రి ఆళ్ల నాని మృతి వార్తతో ఏలూరు జిల్లాలో విషాద ఛాయలు ఆళ్ల నాని మృతి వార్తతో ఏలూరు జిల్లాలో విషాద ఛాయలు అలుముకున్నాయి. 2004, 2009లో ఏలూరు ఎమ్మెల్యేగా కాంగ్రెస్ పార్టీ తరఫున విజయం సాధించిన ఆళ్ల నాని అనంతరం వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీలో చేరారు.2019 ఎన్నికల్లో ఏలూరు నుంచి విజయం సాధించి వైఎస్ జగన్ మంత్రివర్గంలో వైద్య, ఆరోగ్యశాఖ మంత్రిగా బాధ్యతలు చేపట్టారు. అదే సమయంలో డిప్యూటీ సీఎంగా కూడా పనిచేశారు. రాష్ట్ర రాజకీయాల్లో కీలక నేతగా గుర్తింపు పొందిన ఆళ్ల నాని మృతి పట్ల పలువురు రాజకీయ నాయకులు, అభిమానులు, అనుచరులు తీవ్ర దిగ్భ్రాంతి వ్యక్తం చేస్తున్నారు.1