Shuru
Apke Nagar Ki App…
ప్రసన్నకుమార్ రెడ్డి వ్యాఖ్యలకు ఏఎంసీ చైర్మన్ బెజవాడ వంశీకృష్ణారెడ్డి ఘాటైన కౌంటర్ విడవలూరు మండలంలోని స్థానిక సినిమా హాల్ సెంటర్‌లో కోవూరు ఏఎంసీ చైర్మన్ బెజవాడ వంశీకృష్ణారెడ్డి విలేకరుల సమావేశం నిర్వహించారు. ఇటీవల మాజీ ఎమ్మెల్యే నల్లపురెడ్డి ప్రసన్నకుమార్ రెడ్డి చేసిన వ్యాఖ్యలపై స్పందించిన వంశీకృష్ణారెడ్డి.. ప్రసన్నకుమార్ రెడ్డిపై తీవ్రస్థాయిలో విమర్శలు చేశారు.మహిళలను ఉద్దేశించి ఆయన చేసిన వ్యాఖ్యలను తప్పుబట్టారు. ఎమ్మెల్యే వేమిరెడ్డి ప్రశాంతి రెడ్డిపై అనుచిత వ్యాఖ్యలు చేయడం సరికాదన్నారు. అదే సమయంలో మాజీ ఏఎంసీ చైర్మన్ అచ్యుత్ రెడ్డి కూడా ప్రసన్నకుమార్ రెడ్డి భాష, వ్యవహారశైలిపై విమర్శలు చేశారు.
Ravi Teja
ప్రసన్నకుమార్ రెడ్డి వ్యాఖ్యలకు ఏఎంసీ చైర్మన్ బెజవాడ వంశీకృష్ణారెడ్డి ఘాటైన కౌంటర్ విడవలూరు మండలంలోని స్థానిక సినిమా హాల్ సెంటర్‌లో కోవూరు ఏఎంసీ చైర్మన్ బెజవాడ వంశీకృష్ణారెడ్డి విలేకరుల సమావేశం నిర్వహించారు. ఇటీవల మాజీ ఎమ్మెల్యే నల్లపురెడ్డి ప్రసన్నకుమార్ రెడ్డి చేసిన వ్యాఖ్యలపై స్పందించిన వంశీకృష్ణారెడ్డి.. ప్రసన్నకుమార్ రెడ్డిపై తీవ్రస్థాయిలో విమర్శలు చేశారు.మహిళలను ఉద్దేశించి ఆయన చేసిన వ్యాఖ్యలను తప్పుబట్టారు. ఎమ్మెల్యే వేమిరెడ్డి ప్రశాంతి రెడ్డిపై అనుచిత వ్యాఖ్యలు చేయడం సరికాదన్నారు. అదే సమయంలో మాజీ ఏఎంసీ చైర్మన్ అచ్యుత్ రెడ్డి కూడా ప్రసన్నకుమార్ రెడ్డి భాష, వ్యవహారశైలిపై విమర్శలు చేశారు.
More news from ఆంధ్రప్రదేశ్ and nearby areas
- నెల్లూరు నగరంలోని స్థానిక పప్పుల వీధి మహాలక్ష్మి దేవస్థానం నందు అంగరంగ వైభవంగా పొట్టి శ్రీరాములు జిల్లా అర్బన్ ఆర్యవైశ్య నూతన కార్యవర్గ ప్రమాణ స్వీకార కార్యక్రమాన్ని ఘనంగా నిర్వహించడం జరిగింది, సాయంత్రం వాసవి కన్కా పరమేశ్వరి దేవస్థానంలో ప్రత్యేక పూజలు నిర్వహించి అక్కడి నుండి ఊరేగింపుగా మహాలక్ష్మి దేవస్థానం కు చేరి ప్రమాణస్వీకార కార్యక్రమాన్ని ప్రారంభించారు,ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా మంత్రివర్యులు పొంగూరు నారాయణ సోమిరెడ్డి చంద్రమోహన్ రెడ్డి వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి రూప్ కుమార్ యాదవ్ మేయర్ సుజాత రాష్ట్ర ఆర్యవైశ్య మహాసభ చైర్మన్ వెంకటేష్ ఆర్యవైశ్య మహాసభ రాష్ట్ర అధ్యక్షులు లక్ష్మయ్య ఆర్యవైశ్య సంఘ ప్రముఖులు హాజరయ్యారు, అర్బన్ ఆర్యవైశ్య సంఘం కార్యవర్గ ప్రమాణస్వీకారంలో ప్రధాన కార్యదర్శి కోట రమేష్ సెక్రటరీ జె.వి చలపతిరావు అధ్యక్షులు మునగనాగేశ్వరరావు ఆర్యవైశ్య మహిళా విభాగంలో అధ్యక్షులు శేషాద్రి సువర్ణ కుమారి ప్రధాన కార్యదర్శి మెంట రేవతి కోశాధికారి లక్ష్మీ సుకన్య ఆర్యవైశ్య యువజన యువ భాగంలో అధ్యక్షులు వేముల హరిశంకర్ ప్రధాన కార్యదర్శి వెంకట సాయి మోహిత్ కోశాధికారి మెంట సాయి రమణ ఆర్యవైశ్య సంఘం ప్రముఖులు బంధుమిత్రులు శ్రేయోభిలాషులు అధిక సంఖ్యలో పాల్గొని విజయవంతంగా ఈ కార్యక్రమాన్ని కొనసాగించడం జరిగింది, పొట్టి శ్రీరాములు జిల్లా ఆర్బన్ ఆర్యవైశ్య సంఘం అభివృద్ధి కార్యక్రమాలను చేపట్టాలని అభివృద్ధి దిశలో పయనించాలని ప్రతి ఒక్కరిని అభినందిస్తూ శుభాకాంక్షలు తెలియజేశారు,1
- ప్రసన్నకుమార్ రెడ్డి వ్యాఖ్యలకు ఏఎంసీ చైర్మన్ బెజవాడ వంశీకృష్ణారెడ్డి ఘాటైన కౌంటర్ విడవలూరు మండలంలోని స్థానిక సినిమా హాల్ సెంటర్‌లో కోవూరు ఏఎంసీ చైర్మన్ బెజవాడ వంశీకృష్ణారెడ్డి విలేకరుల సమావేశం నిర్వహించారు. ఇటీవల మాజీ ఎమ్మెల్యే నల్లపురెడ్డి ప్రసన్నకుమార్ రెడ్డి చేసిన వ్యాఖ్యలపై స్పందించిన వంశీకృష్ణారెడ్డి.. ప్రసన్నకుమార్ రెడ్డిపై తీవ్రస్థాయిలో విమర్శలు చేశారు.మహిళలను ఉద్దేశించి ఆయన చేసిన వ్యాఖ్యలను తప్పుబట్టారు. ఎమ్మెల్యే వేమిరెడ్డి ప్రశాంతి రెడ్డిపై అనుచిత వ్యాఖ్యలు చేయడం సరికాదన్నారు. అదే సమయంలో మాజీ ఏఎంసీ చైర్మన్ అచ్యుత్ రెడ్డి కూడా ప్రసన్నకుమార్ రెడ్డి భాష, వ్యవహారశైలిపై విమర్శలు చేశారు.3
- పెరిగే ధరలకు హద్దే లేదు- కూటమి ప్రభుత్వానికి సిగ్గే లేదు. ఆకాశాన్ని అంటుతున్న నిత్యవసర వస్తువుల ధరలను అదుపు చేయడంలో కూటమి ప్రభుత్వం పూర్తి విఫలం. బ్లాక్ మార్కెట్ ను ప్రోత్సహిస్తూ పేదల నడ్డి విరుస్తున్న కూటమి ప్రభుత్వం. బద్వేలు, సెప్టెంబర్ 20:దుకాణాలను పరిశీలించి నిత్యావసర వస్తువుల ధరలను అడిగి తెలుసుకున్న సిపిఐ ఎంఎల్ లిబరేషన్ పార్టీ బృందం.ఆకాశాన్ని అంటుతున్న నిత్యావసర వస్తువుల ధరలను అదుపు చేయడంలో, బ్లాక్ మార్కెట్ మాఫియాను అరికట్టడంలో కూటమి ప్రభుత్వం పూర్తి వైఫల్యం చెందిందని సిపిఐ ఎంఎల్ లిబరేషన్ పార్టీ జిల్లా స్టాండింగ్ కమిటీ సభ్యులు ఎస్ చంద్రశేఖర్ నియోజకవర్గ పార్టీ కార్యదర్శి పి చంద్రమోహన్ రాజు ఘాటుగా విమర్శించారు. ఆదివారం పార్టీ నాయకులతో కలిసి పట్టణంలోని పలు దుకాణాలలో పర్యటించి నిత్యవసర వస్తువుల ధరలను అడిగి తెలుసుకున్నారు. ఈ సందర్భంగా ఎస్ చంద్రశేఖర్, చంద్రమోహన్ రాజు మాట్లాడుతూ రాష్ట్రవ్యాప్తంగా నానాటికి నిత్యవసర వస్తువుల ధరలు విపరీతంగా పెరిగి పేద మధ్యతరగతి ప్రజలకు అందని ద్రాక్షలా మారాయని వారు ఆవేదన వ్యక్తం చేశారు. ఇప్పటికే ఒకవైపు వర్షాలు లేక పంటలు పండక ప్రజలు అల్లాడుతుంటే మరోవైపు మూలుగే నక్కపై తాటికాయ పడ్డ చందంగా ప్రజలపై నిత్యవసర వస్తువుల భారాలు పడుతున్నాయని వారు ఆవేదన వ్యక్తం చేశారు. ఇప్పటికే కింటా బియ్యం పై వెయ్యి రూపాయల వరకు అదనంగా ధరలు పెంచారని దీనికి తోడు ఉల్లిపాయ దగ్గర నుండి నూనె వరకు వందల రూపాయలు ధరలు పెరిగి పేద మధ్యతరగతి ప్రజల నడ్డి విరుస్తున్నాయని కిలో ఉల్లిపాయ 80 రూపాయలు వరకు కందిపప్పు 140కి నూనె 200 రూపాయలకు దగ్గరలో ఉన్నదని దీనికంతటికి ప్రభుత్వ వైఫల్యమే ప్రధాన కారణమని వారు తీవ్రంగా మండిపడ్డారు. కూటమి ప్రభుత్వ పెద్దలు ప్రజారంజక పరిపాలనఅందిస్తున్నామని డబ్బాలుకొట్టుకుంటున్నారు తప్ప క్షేత్రస్థాయిలో దీనికి భిన్నంగా ఉన్నదని బ్లాక్ మార్కెట్ మాఫియా మరియు దళారులు ఉన్న సరుకులను దాచిపెట్టి ఉద్దేశపూర్వకంగా కొరత సృష్టిస్తూ ధరలను విపరీతంగా పెంచేలా చేస్తుంటే కూటమి ప్రభుత్వం ఏం చేస్తున్నదని వారు ప్రశ్నించారు. తక్షణమే బ్లాక్ మార్కెట్ మాఫియా పై ఉక్కు పాదం మోపి నిత్యవసర వస్తువుల ధరలను అందుబాటులోకి తీసుకురాకపోతే ప్రజా వ్యతిరేకతను ఎదుర్కోవాల్సి వస్తుంది అని హితువు పలికారు. అర్బాటపు ప్రకటనలు మాని ప్రభుత్వ రేషన్ షాపుల ద్వారా తక్కువ ధరలకు నిత్యావసర వస్తువులను పంపిణీ చేసేలా చర్యలు తీసుకొని పేద మధ్యతరగతి ప్రజలను ఆదుకోవాలని వారు డిమాండ్ చేశారు. లేనిపక్షంలో రాబోవు స్థానిక సంస్థల ఎన్నికలలో ప్రజా ఆగ్రహాన్ని చవిచూడక తప్పదని వారు హెచ్చరించారు. ఈ కార్యక్రమంలో జిల్లా కమిటీ సభ్యులు కే జకరయ్య నియోజకవర్గ కమిటీ సభ్యులు రామరాజు, విజయరావు, జయరామరాజు, గంట మహబూబ్బాషా, ఈశ్వర్, దేవదానం, పోతురాజు రమణ తదితరులు పాల్గొన్నారు.1
- కరువుకు కారణం El Niño కాదు.. ‘ఎల్లో నినో ఎఫెక్ట్’! కరువు కారణంగా పూర్వ ఆంధ్రప్రదేశ్ చీఫ్ మినిస్టర్ వైఎస్ జగన్మోహన్ రెడ్డి ఘాట్ విమర్శలు కరువుకు కారణం El Niño కాదు.. ‘ఎల్లో నినో ఎఫెక్ట్’! కరువు కారణంగా పూర్వ ఆంధ్రప్రదేశ్ చీఫ్ మినిస్టర్ వైయస్ జగన్మోహన్ రెడ్డి హాట్ అయిన విమర్శలు చేశారు1
- వైసీపీ నుంచి ముస్లిం మైనార్టీలు ఎమ్మెల్యే నల్లారి కిషోర్ కుమార్ రెడ్డి సమక్షంలో టీడీపీ లోకి భారీగా చేరికలు ముస్లిం మైనార్టీ సోదరులు తమ తండ్రి కాలం నుంచి నల్లారి కుటుంబానికి అండగా ఉన్నారని పీలేరు నియోజకవర్గం శాసనసభ్యులు నల్లారి కిషోర్ కుమార్ రెడ్డి అన్నారు. కలకడ మండల కేంద్రంలో ఓల్డ్ ఆక్స్ఫర్డ్ స్కూల్ సమీపంలో జరిగిన సమావేశంలో కలకడ మాజీ సర్పంచ్ దండు జిలాని తమ కుటుంబ సభ్యులు మరియు అనూయాయులతో 175 కుటుంబాలకు పైగా ఎమ్మెల్యే నల్లారి కిషోర్ కుమార్ రెడ్డి సమక్షంలో ఆదివారం టిడిపిలో చేరారు. అదే విధంగా కలకడ మండల కేంద్రములో సింగిల్ విండో మాజీ డైరెక్టర్ టిఎస్ సుల్తానీ భాష తమ కుటుంబ సభ్యులు మరియు అనూయాయులతో 175కుటుంబాలకు పైగా తెలుగు దేశం పార్టీ లో ఎమ్మెల్యే నల్లారి కిషోర్ కుమార్ రెడ్డి సమక్షంలో చేరగా వీరందరికీ పార్టీ కండువాలు కప్పి ఎమ్మెల్యే ఘనంగా స్వాగతం పలికారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే నల్లారి కిషోర్ కుమార్ రెడ్డి మాట్లాడుతూ ముస్లిం మైనార్టీ సోదరుల విషయంలో పొరపాటు గాని, నేనెప్పుడూ తప్పు గాని చేయలేదని చెప్పారు. కలకడ ముస్లిం సోదరులు ఇకపై తప్పు చేయవద్దని అన్నారు. మీకు ఏ పని కావాలన్నా చేసుకుని వెళ్లాలని కోరారు. కలకడలో అభివృద్ధి తాము చేసిందే అని, వైకాపా చేసింది ఏమీ లేదు అని అన్నారు. ఈ కార్యక్రమంలో టీడీపీ తెలుగు రైతు రాష్ట్ర ఉపాధ్యక్షులు మల్లారపు రవిప్రకాష్ నాయుడు, మండల పార్టీ అధ్యక్షులు పొత్తూరు ప్రభాకర్ నాయుడు, సింగిల్ విండో చైర్మన్ మద్దిపట్ల వెంకటరమణ నాయుడు, శ్రీనివాసులు రెడ్డి, వై.వెంకట్రమణ అలియాస్ పెద్దోడు, కలికిరి వ్యవసాయ మార్కెట్ కమిటీ డైరెక్టర్ ముబారక్ అలీ, యల్లమంద జిలాని, బి.జాఫర్ హుస్సేన్, ఆర్.జాకీర్ హుస్సేన్, సయ్యద్ ఇర్ఫాన్, మెడికల్ స్టోర్ బాబు, రఫీ, టీడీపీ నాయకులు కార్యకర్తలు పెద్ద ఎత్తున పాల్గొన్నారు1
- జిల్లా కేంద్రంలో భక్తిశ్రద్ధలతో వినాయకుడి నిమజ్జనోత్సవం మార్కాపురం జిల్లా కేంద్రంలోని రామలక్ష్మణ వీధిలో గణేష్ ఉత్సవాలు ఘనంగా నిర్వహించారు. ఉత్సవాలలో భాగంగా ఉభయ దాతల సమక్షంలో ప్రతిరోజు ప్రత్యేక పూజలు నిర్వహించారు. పర్యావరణం కాపాడడంలో భాగంగా మట్టి విగ్రహాన్ని ఏర్పాటు చేసి భక్తిశ్రద్ధలతో భక్తులు పూజలు చేశారు. ప్రతిరోజు సాంస్కృతిక కార్యక్రమాల్లో భాగంగా ఆటలు పాటలుతో పాటు వివిధ రకాల పోటీలు నిర్వహించి బహుమతులను అందజేశారు. నిమజ్జనం కార్యక్రమంలో భాగంగా వేలంపాటలో లడ్డును 7116 రూపాయలకు సుబ్బారావు దక్కించుకున్నారు. అనంతరం స్వామి వారిని ప్రత్యేక వాహనంపై ఏర్పాటు చేసుకొని పురవీధులలో ఊరేగింపు ఘనంగా నిర్వహించారు. మహిళా భక్తులు ఆనందంతో కేరింతల కొడుతూ డాన్సులు వేశారు. కార్యక్రమం ఉత్సాహంగా కొనసాగింది. కార్యక్రమంలో కమిటీ సభ్యులు పాల్గొన్నారు.1
- కాణిపాకం లో బ్రహ్మోత్సవాలు విద్యుత్ అలంకరణతో భక్తులను ఆకర్షిస్తుంది కాణిపాకంలో వైభవంగా బ్రహ్మోత్సవాలు కాణిపాకం శ్రీ వరసిద్ధి వినాయక స్వామివారి వార్షిక బ్రహ్మోత్సవాలు అంగరంగ వైభవంగా కొనసాగుతున్నాయి. సెప్టెంబర్ 14వ తేదీ నుంచి అక్టోబర్ 4వ తేదీ వరకు నిర్వహిస్తున్న ఈ బ్రహ్మోత్సవాలకు దేశ నలుమూలల నుంచి భక్తులు పెద్ద సంఖ్యలో తరలివస్తున్నారు. బ్రహ్మోత్సవాల్లో భాగంగా ప్రతిరోజూ స్వామివారికి ప్రత్యేక పూజలు, అభిషేకాలు నిర్వహించడంతో పాటు వివిధ రకాల వాహన సేవలను వైభవంగా నిర్వహిస్తున్నారు. అలంకరణలతో ముస్తాబైన స్వామివారు వాహనాలపై పురవీధుల్లో విహరిస్తూ భక్తులకు దర్శనమిస్తున్నారు. భక్తుల రద్దీని దృష్టిలో ఉంచుకుని ఆలయ అధికారులు ప్రత్యేక ఏర్పాట్లు చేపట్టారు. భక్తులకు ఎలాంటి అసౌకర్యం కలగకుండా తాగునీరు, వసతి, పార్కింగ్, క్యూ లైన్లు, భద్రత తదితర ఏర్పాట్లను పర్యవేక్షిస్తున్నారు. స్వామివారి వాహన సేవలను వీక్షించేందుకు పెద్ద సంఖ్యలో భక్తులు తరలిరావడంతో కాణిపాకం పురవీధులు భక్తజన సందోహంగా మారుతున్నాయి.1
- శ్రీవారి లడ్డు ప్రసాదంపై మీరు చేసిన తప్పుడు ప్రచారానికి ఏం ప్రక్షాళన చేస్తారు చంద్రబాబు? ఎలాంటి ఆధారాలు లేకుండానే లడ్డులో జంతువుల కొవ్వు కలిసిందని సీఎం హోదాలో చంద్రబాబు ఎలా చెప్తారు? ఏ జంతు కొవ్వు లడ్డులో కలవలేదని ఈడీ తేల్చింది తప్పుడు ప్రచారంతో కోట్లాది మంది భక్తుల మనోభావాలను దెబ్బ తీసినందుకు చంద్రబాబు, పవన్ కళ్యాణ్ క్షమాపణలు చెప్పాలి. -చెల్లుబోయిన వేణుగోపాలకృష్ణ గారు, మాజీ మంత్రి, శ్రీవారి లడ్డు ప్రసాదంపై మీరు చేసిన తప్పుడు ప్రచారానికి ఏం ప్రక్షాళన చేస్తారు చంద్రబాబు? ఎలాంటి ఆధారాలు లేకుండానే లడ్డులో జంతువుల కొవ్వు కలిసిందని సీఎం హోదాలో చంద్రబాబు ఎలా చెప్తారు? ఏ జంతు కొవ్వు లడ్డులో కలవలేదని ఈడీ తేల్చింది తప్పుడు ప్రచారంతో కోట్లాది మంది భక్తుల మనోభావాలను దెబ్బ తీసినందుకు చంద్రబాబు, పవన్ కళ్యాణ్ క్షమాపణలు చెప్పాలి. -చెల్లుబోయిన వేణుగోపాలకృష్ణ గారు, మాజీ మంత్రి,1