Shuru
Apke Nagar Ki App…
రాజీవ్ రహదారిపై ట్రాఫిక్ అంతరాయం...రేణికుంట టోల్ ప్లాజా నిర్లక్ష్యాన్ని నిరసిస్తూ గుండ్లపల్లి గ్రామస్తులు ఆందోళన కరీంనగర్ జిల్లా తిమ్మాపూర్ మండలం రేణికుంట టోల్ ప్లాజా వద్ద గుండ్లపల్లి గ్రామస్తుల ఆందోళన స్వల్ప ఉద్రిక్తతకు దారి తీసింది. టోల్ గేట్ యాజమాన్యం నిర్లక్ష్యం వల్ల గుండ్లపల్లి స్టేజ్ వద్ద ఇటీవల జరిగిన రోడ్డు ప్రమాదంలో ఇద్దరు మృతి చెందారని ఆందోళన వ్యక్తం చేశారు. స్టేజ్ వద్ద భారీ గేట్స్ ఏర్పాటు చేయాలని గ్రామస్తులు డిమాండ్ చేశారు. టోల్గేట్ యాజమాన్యం గ్రామస్థుల గోడు పట్టించుకోవడంలేదని రోడ్డుపై ధర్నా, రాస్తారోకో చేశారు. దీంతో రాజీవ్ రహదారిపై రెండు కిలోమీటర్ల మేర ట్రాఫిక్ జామ్ అయింది. వెంటనే పోలీసులు రంగంలోకి దిగి గుండ్లపల్లి గ్రామస్తులను సముదాయించి టోల్ గేట్ యాజమాన్యంతో భారీ గేట్స్ ఏర్పాటు చేయిస్తామని హామీ ఇవ్వడంతో ఆందోళన విరమిచ్చారు.
K.V.REDDY
రాజీవ్ రహదారిపై ట్రాఫిక్ అంతరాయం...రేణికుంట టోల్ ప్లాజా నిర్లక్ష్యాన్ని నిరసిస్తూ గుండ్లపల్లి గ్రామస్తులు ఆందోళన కరీంనగర్ జిల్లా తిమ్మాపూర్ మండలం రేణికుంట టోల్ ప్లాజా వద్ద గుండ్లపల్లి గ్రామస్తుల ఆందోళన స్వల్ప ఉద్రిక్తతకు దారి తీసింది. టోల్ గేట్ యాజమాన్యం నిర్లక్ష్యం వల్ల గుండ్లపల్లి స్టేజ్ వద్ద ఇటీవల జరిగిన రోడ్డు ప్రమాదంలో ఇద్దరు మృతి చెందారని ఆందోళన వ్యక్తం చేశారు. స్టేజ్ వద్ద భారీ గేట్స్ ఏర్పాటు చేయాలని గ్రామస్తులు డిమాండ్ చేశారు. టోల్గేట్ యాజమాన్యం గ్రామస్థుల గోడు పట్టించుకోవడంలేదని రోడ్డుపై ధర్నా, రాస్తారోకో చేశారు. దీంతో రాజీవ్ రహదారిపై రెండు కిలోమీటర్ల మేర ట్రాఫిక్ జామ్ అయింది. వెంటనే పోలీసులు రంగంలోకి దిగి గుండ్లపల్లి గ్రామస్తులను సముదాయించి టోల్ గేట్ యాజమాన్యంతో భారీ గేట్స్ ఏర్పాటు చేయిస్తామని హామీ ఇవ్వడంతో ఆందోళన విరమిచ్చారు.
More news from తెలంగాణ and nearby areas
- ఎరువుల కొరత కాకుండా చూడాల్సిన బాధ్యత కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలపైన ఉన్నదని రాష్ట్ర ప్రభుత్వం సహకరించాలి అని కేంద్ర హోం శాఖ సహాయ మంత్రి బండి సంజయ్ తంగళ్ళపల్లి మండలం అంకిరెడ్డి పల్లి గ్రామంలో అన్నారు. పలు అభివృద్ధి కార్యక్రమాలకు భూమి పూజ కార్యక్రమాలు నిర్వహించేందుకు వచ్చిన బండి సంజయ్ మీడియాతో మాట్లాడారు.1
- వరంగల్ జిల్లా: వర్ధన్నపేట నియోజకవర్గంలో మండల, డివిజన్ అధ్యక్ష పదవుల కోసం దరఖాస్తుల స్వీకరణ కార్యక్రమం నిర్వహించారు. ఈ కార్యక్రమానికి డీసీసీ అధ్యక్షుడు అయూబ్ మహమ్మద్ హాజరై అభ్యర్థుల నుండి దరఖాస్తులను స్వీకరించారు. పార్టీ సిద్ధాంతాలకు కట్టుబడి, ప్రజాసేవకు నిబద్ధత కలిగిన నాయకత్వాన్ని ఎంపిక చేస్తామని ఆయన తెలిపారు. కార్యక్రమంలో పెద్ద సంఖ్యలో పార్టీ నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు.1
- ఈ నెల 30వ తేదీన సోమవారం ములుగు జిల్లా కలెక్టరేట్ కార్యాలయంలో ప్రజావాణి - గిరివాణి (గిరిజన దర్బార్) కార్యక్రమం నిర్వహించడం జరుగుతుందని జిల్లా కలెక్టర్ దివాకర టి.ఎస్. ఒక ప్రకటనలో తెలిపారు. ప్రజల సమస్యల పరిష్కారం కోసం ప్రతి సోమవారం ఐటీడీఏ ఏటూరు నాగారం లో నిర్వహించే గిరివాణి (గిరిజన దర్బార్) కార్యక్రమాన్ని ప్రత్యేకంగా ఈనెల 30వ తేదీన కలెక్టరేట్ సమావేశ మందిరంలో నిర్వహించనున్నట్లు జిల్లా కలెక్టర్ తెలిపారు. జిల్లాలోని గిరిజనులు, గిరిజనేతరులు ఈ అవకాశాన్ని సద్వినియోగించుకొని తమ అర్జీలను సమర్పించాలని ఆ ప్రకటనలో పేర్కొన్నారు. జిల్లాలోని అన్ని శాఖల జిల్లా అధికారులు, తహశీల్దార్లు, ఎంపీడీఓలు, ఎంపీఓలు తప్పనిసరిగా ఈ కార్యక్రమానికి హాజరుకావాలని కలెక్టర్ అధికారులను ఆదేశించారు.2
- Post by Tagore1
- గజ్వేల్ సిద్దిపేట జిల్లా ఆర్చ్ 28 ప్రజా తెలంగాణ న్యూస్/ గజ్వేల్ పట్టణంలో ఇంటర్నేషనల్ హ్యూమన్ రైట్స్ కమ్యూనికేషన్ కార్యాలయంలో జరిగిన మీడియా సమావేశంలో, జగిత్యాల జిల్లాలో యూట్యూబర్ వైష్ణవి హత్యకు కారణమైన భర్త హరిబాబుకు కఠిన శిక్ష విధించాలని సిద్దిపేట జిల్లా అధ్యక్షులు షమీం శనివారం డిమాండ్ చేశారు. బాధితురాలి కుటుంబానికి న్యాయం చేయాలని ఆమె కోరారు. తల్లిదండ్రుల బాధ్యతలను కూడా ఈ సందర్భంగా ఆమె గుర్తు చేశారు. ఈ కార్యక్రమంలో సిద్దిపేట జిల్లా ఉపాధ్యక్షులు రజియా బేగం, ఆపరేషన్ ఆఫీసర్ దాసరి విమల, స్వరూప, షబానా, మసియుద్దిన్, బాబా, అజ్ హర్. తదితరులు పాల్గొన్నారు.4
- తోపన గడ్డ తండ ప్రజలు వన బోజనం కార్యక్రమం. జరిగింది. ఇందులోభాగంగా పలువురు గ్రామ ప్రజలు పాల్గొనడం జరిగింది. ఈ కార్యక్రమం లో గుగులోత్ జయరాం. భానోత్ సాగర్. రమేష్. ప్రసాద్. మాజీ వార్డు మెంబర్ బాలు. పర్సు. రాములు. వీర స్వామి. మాజీ సర్పంచ్ ఈర్య. హట్టి. బంగరు. హరి చంద్. ఆకు బాయ్. మరియు శారద మాజీ వార్డు మెంబర్. చిట్టి. గమ్మక. ఉమ. దేవులి. సునిత. ఈ దేవులి. సునిత. తదితరులు పా లోనడం జరిగింది.1
- రాజన్న సిరిసిల్ల జిల్లా కోనరావుపేట మండలం ధర్మారం చెరువులో మునిగి ఇద్దరు గొర్ల కాపర్లు మృతి చెందారు. ధర్మారం గ్రామానికి చెందిన మూడుగె లక్ష్మీరాజం, కుమ్మం మొండయ్య, గొర్రెలకు నీరు తాగించేందుకు చెరువులోకి తీసుకెళ్లారు. ఈక్రమంలో లోపలికి వెళ్లి గోర్లను బయటకు పంపించే క్రమంలో ప్రమాదవశాత్తు చెరువులో మునిగారు. స్థానికులు అప్రమత్తమై వెలికితీసేలోగా ఇద్దరు ప్రాణాలు కోల్పోయారు. పోలీసులు మృతదేహాలను బయటికి తీసి పోస్టుమార్టం అనంతరం కుటుంబ సభ్యులకు అప్పగించారు.1
- ఆశా వర్కర్ల న్యాయమైన డిమాండ్లను పరిష్కరించాలని చేపట్టిన ఆశా వర్కర్ల చలో హైదరాబాద్ ఇందిరాపార్క్ మహాధర్నాకు సిరిసిల్ల నుండి వెళ్తున్న వారిని అరెస్ట్ చేసి పోలీస్టేషన్ కు తరలించారు. ఈ సందర్భంగా సీఐటీయూ జిల్లా కార్యదర్శి కోడం రమణ మాట్లాడుతూ ప్రభుత్వం ఎన్నికల ముందు కాంగ్రెస్ అధికారంలో కి వస్తే ఆశా వర్కర్ల కి నెలకి 18 వేల రూపాయల ఫిక్స్డ్ వేతనాన్ని ఇస్తామని,పని భద్రత కల్పిస్తామని అనేక హామీలు ఇవ్వడం జరిగిందని కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చి 27 నెలలు అవుతున్న ఏ ఒక్క హామీని అమలు చేయలేదని ఆశాలకు రావలసిన పారితోషకాలు కూడా సకాలంలో ఇవ్వకుండా అన్యాయం చేస్తుందని మండిపడ్డారు. ఇప్పటికైనా ప్రభుత్వానికి ఆశ వర్కర్ల పైన చిత్తశుద్ధి ఉంటే అసెంబ్లీ బడ్జెట్ సమావేశాలలో ఆశ వర్కర్లకు ఇచ్చిన హామీల కోసం బడ్జెట్ కేటాయించాలని లేకుంటే రానున్న రోజుల్లో పోరాటాలు , ఉద్యమాలను ఉదృతం చేస్తామని హెచ్చరించారు.2
- వరంగల్ జిల్లా: వరంగల్ మిల్స్ కాలనీ పోలీస్ స్టేషన్ పరిధిలో గంజాయి మత్తులో ఇద్దరు యువకులు వీరంగం సృష్టించారు. అగ్గిపెట్టె విషయంలో తలెత్తిన వివాదం దాడికి దారితీసి, సినిమా స్టైల్లో పరస్పరం కొట్టుకున్న ఘటన సీసీ కెమెరాలో రికార్డైంది. ఈ వీడియో సామాజిక మాధ్యమాల్లో వైరల్ కావడంతో ప్రజల్లో భయాందోళన నెలకొంది. ఘటనపై మిల్స్ కాలనీ పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు.1