డిసెంబర్ 15 నుండి ఆశా వర్కర్ల నిరవధిక సమ్మె వేములవాడ ఎమ్మెల్యే , ప్రభుత్వ విప్ ఆది శ్రీనివాస్ కు సీఐటీయూ ఆధ్వర్యం లోసమ్మె నోటీస్ ఇచ్చిన ఆశా వర్కర్లు. డిసెంబర్ 15 నుండి ఆశా వర్కర్ల నిరవధిక సమ్మె వేములవాడ ఎమ్మెల్యే , ప్రభుత్వ విప్ ఆది శ్రీనివాస్ కు సీఐటీయూ ఆధ్వర్యం లోసమ్మె నోటీస్ ఇచ్చిన ఆశా వర్కర్లు. ఆశా వర్కర్లకు రాష్ట్ర ప్రభుత్వం ఇచ్చిన హామీ ప్రకారం ఫిక్స్డ్ వేతనం 18 వేల రూపాయలు అందించాలని , ఉద్యోగ భద్రత కల్పించాలని తదితర డిమాండ్లతో ఆశా వర్కర్స్ యూనియన్ సీఐటీయూ ఆధ్వర్యంలో డిసెంబర్ 15 నుంచి రాష్ట్ర వ్యాప్తంగా ఆశా వర్కర్లందరూ నిరవధిక సమ్మెకు వెళ్లనున్నట్లు తెలియజేస్తూ మంగళవారం సీఐటీయూ రాజన్న సిరిసిల్ల జిల్లా కార్యదర్శి కోడం రమణ ఆధ్వర్యంలో వేములవాడ నియోజకవర్గ పరిధిలోని వేములవాడ , చందుర్తి , కోనరావుపేట పీహెచ్ సిల ఆశా వర్కర్లతో కలిసి వేములవాడ ఎమ్మెల్యే , ప్రభుత్వ విప్ ఆది శ్రీనివాస్ నివాసానికి వెళ్లి ఆయనకు సమ్మె నోటీసు అందజేశారు. ఈ సందర్భంగా యూనియన్ నాయకులు మాట్లాడుతూ ఆశా వర్కర్ల సమస్యలను ప్రభుత్వం , రాష్ట్ర ముఖ్యమంత్రి దృష్టికి తీసుకెళ్లి వెంటనే పరిష్కరించే విధంగా ఆది శ్రీనివాస్ చర్యలు తీసుకోవాలని కోరారు.ఈ కార్యక్రమంలో జయశీల , గాయత్రి , జమున , లత , మమత , లక్ష్మీ , అరుణ , జ్యోతి , రత్నమాల , హేమలత , ఉమ , రేఖ తదితరులు పాల్గొన్నారు.
డిసెంబర్ 15 నుండి ఆశా వర్కర్ల నిరవధిక సమ్మె వేములవాడ ఎమ్మెల్యే , ప్రభుత్వ విప్ ఆది శ్రీనివాస్ కు సీఐటీయూ ఆధ్వర్యం లోసమ్మె నోటీస్ ఇచ్చిన ఆశా వర్కర్లు. డిసెంబర్ 15 నుండి ఆశా వర్కర్ల నిరవధిక సమ్మె వేములవాడ ఎమ్మెల్యే , ప్రభుత్వ విప్ ఆది శ్రీనివాస్ కు సీఐటీయూ ఆధ్వర్యం లోసమ్మె నోటీస్ ఇచ్చిన ఆశా వర్కర్లు. ఆశా వర్కర్లకు రాష్ట్ర ప్రభుత్వం ఇచ్చిన హామీ ప్రకారం ఫిక్స్డ్ వేతనం 18 వేల రూపాయలు అందించాలని , ఉద్యోగ భద్రత కల్పించాలని తదితర డిమాండ్లతో ఆశా వర్కర్స్ యూనియన్ సీఐటీయూ ఆధ్వర్యంలో డిసెంబర్ 15 నుంచి రాష్ట్ర వ్యాప్తంగా ఆశా వర్కర్లందరూ నిరవధిక సమ్మెకు వెళ్లనున్నట్లు తెలియజేస్తూ మంగళవారం సీఐటీయూ రాజన్న సిరిసిల్ల జిల్లా
కార్యదర్శి కోడం రమణ ఆధ్వర్యంలో వేములవాడ నియోజకవర్గ పరిధిలోని వేములవాడ , చందుర్తి , కోనరావుపేట పీహెచ్ సిల ఆశా వర్కర్లతో కలిసి వేములవాడ ఎమ్మెల్యే , ప్రభుత్వ విప్ ఆది శ్రీనివాస్ నివాసానికి వెళ్లి ఆయనకు సమ్మె నోటీసు అందజేశారు. ఈ సందర్భంగా యూనియన్ నాయకులు మాట్లాడుతూ ఆశా వర్కర్ల సమస్యలను ప్రభుత్వం , రాష్ట్ర ముఖ్యమంత్రి దృష్టికి తీసుకెళ్లి వెంటనే పరిష్కరించే విధంగా ఆది శ్రీనివాస్ చర్యలు తీసుకోవాలని కోరారు.ఈ కార్యక్రమంలో జయశీల , గాయత్రి , జమున , లత , మమత , లక్ష్మీ , అరుణ , జ్యోతి , రత్నమాల , హేమలత , ఉమ , రేఖ తదితరులు పాల్గొన్నారు.
- రాజన్న సిరిసిల్ల జిల్లాను కరువు ప్రాంతంగా ప్రకటించాలి. సిరిసిల్ల జిల్లాలో తీవ్రమైన నీటి ఎద్దడి, కరువు పరిస్థితులు నెలకొన్న నేపథ్యంలో జిల్లాను వెంటనే కరువు మండలంగా ప్రకటించాలని కోరుతూ కలెక్టరేట్ ఎదుట ఆందోళన నిర్వహించారు. తొమ్మిదో ప్యాకేజీ పనులను పూర్తి చేసి సాగునీరు అందించాలని, ఉపాధి కార్మికులకు రోజువారీ వేతనం రూ. 700 చేయాలని సిపిఐ నాయకులు వేణు డిమాండ్ చేశారు. పంట నష్టపోయిన రైతులను ఆదుకునేలా ఎకరానికి రూ. 50 వేల పరిహారం చెల్లించాలని కోరుతూ నాయకులు తీవ్ర నిరసన వ్యక్తం చేశారు.1
- డిసెంబర్ 15 నుండి ఆశా వర్కర్ల నిరవధిక సమ్మె వేములవాడ ఎమ్మెల్యే , ప్రభుత్వ విప్ ఆది శ్రీనివాస్ కు సీఐటీయూ ఆధ్వర్యం లోసమ్మె నోటీస్ ఇచ్చిన ఆశా వర్కర్లు. డిసెంబర్ 15 నుండి ఆశా వర్కర్ల నిరవధిక సమ్మె వేములవాడ ఎమ్మెల్యే , ప్రభుత్వ విప్ ఆది శ్రీనివాస్ కు సీఐటీయూ ఆధ్వర్యం లోసమ్మె నోటీస్ ఇచ్చిన ఆశా వర్కర్లు. ఆశా వర్కర్లకు రాష్ట్ర ప్రభుత్వం ఇచ్చిన హామీ ప్రకారం ఫిక్స్డ్ వేతనం 18 వేల రూపాయలు అందించాలని , ఉద్యోగ భద్రత కల్పించాలని తదితర డిమాండ్లతో ఆశా వర్కర్స్ యూనియన్ సీఐటీయూ ఆధ్వర్యంలో డిసెంబర్ 15 నుంచి రాష్ట్ర వ్యాప్తంగా ఆశా వర్కర్లందరూ నిరవధిక సమ్మెకు వెళ్లనున్నట్లు తెలియజేస్తూ మంగళవారం సీఐటీయూ రాజన్న సిరిసిల్ల జిల్లా కార్యదర్శి కోడం రమణ ఆధ్వర్యంలో వేములవాడ నియోజకవర్గ పరిధిలోని వేములవాడ , చందుర్తి , కోనరావుపేట పీహెచ్ సిల ఆశా వర్కర్లతో కలిసి వేములవాడ ఎమ్మెల్యే , ప్రభుత్వ విప్ ఆది శ్రీనివాస్ నివాసానికి వెళ్లి ఆయనకు సమ్మె నోటీసు అందజేశారు. ఈ సందర్భంగా యూనియన్ నాయకులు మాట్లాడుతూ ఆశా వర్కర్ల సమస్యలను ప్రభుత్వం , రాష్ట్ర ముఖ్యమంత్రి దృష్టికి తీసుకెళ్లి వెంటనే పరిష్కరించే విధంగా ఆది శ్రీనివాస్ చర్యలు తీసుకోవాలని కోరారు.ఈ కార్యక్రమంలో జయశీల , గాయత్రి , జమున , లత , మమత , లక్ష్మీ , అరుణ , జ్యోతి , రత్నమాల , హేమలత , ఉమ , రేఖ తదితరులు పాల్గొన్నారు.2
- వేములవాడ శ్రీ భీమేశ్వర స్వామి ఆలయంలో సోమవారం భక్తుల సందడి రాజన్న సిరిసిల్ల జిల్లా వేములవాడలోని శ్రీ రాజరాజేశ్వర స్వామి దేవస్థానం అనుబంధాలయమైన శ్రీ భీమేశ్వర స్వామి ఆలయంలో సోమవారం భక్తుల సందడి నెలకొంది. దీపావళి పండుగను పురస్కరించుకుని వివిధ ప్రాంతాల్లో నివసిస్తున్న ప్రజలు తమ సొంత ఊళ్లకు చేరుకున్నారు. పండుగను జరుపుకున్న అనంతరం, సోమవారం పవిత్రమైన రోజు కావడంతో భీమేశ్వర స్వామివారి దర్శనార్థం ఆలయానికి అధిక సంఖ్యలో భక్తులు తరలివచ్చారు. ఆలయానికి విచ్చేసిన భక్తులు స్వామివారికి తమ మొక్కుబడులను చెల్లించుకున్నారు. ఇందులో భాగంగా కోడె మొక్కులు, అభిషేకాలు, అన్నపూజలు, నిత్య కల్యాణం, చండీ హోమం, కుంకుమ పూజలు, గండాదీపంలో నూనె పోయడం, శ్రీ సత్యనారాయణ స్వామి వ్రతాలు మరియు లింగార్చన వంటి వివిధ రకాల పూజలు, ఆధ్యాత్మిక కార్యక్రమాలను భక్తిశ్రద్ధలతో నిర్వహించారు. దర్శనానికి వచ్చిన భక్తులకు ఎలాంటి అసౌకర్యం కలగకుండా ఆలయ అధికారులు తగిన ఏర్పాట్లు చేశారు. ఆలయ కార్యనిర్వహణాధికారి (ఈవో) రమాదేవి స్వయంగా ఆలయ ప్రాంగణంలో పర్యవేక్షిస్తూ, భక్తుల రద్దీని సమీక్షించారు. క్యూలైన్ల నిర్వహణ మరియు ఇతర వసతులపై ఆలయ అధికారులకు, సిబ్బందికి పలు ముఖ్యమైన సూచనలు అందించారు.1
- రైతులకు సాగునీరు అందించడమే లక్ష్యం: విప్ ఆది శ్రీనివాస్ రైతుల అవసరాలను దృష్టిలో ఉంచుకుని సాగునీటి ప్రాజెక్టుల పూర్తికి చర్యలు చేపడుతున్నామని ప్రభుత్వ విప్ ఆది శ్రీనివాస్ తెలిపారు. మర్రిపల్లిలో రూ.10 లక్షలతో నిర్మించిన మహిళా సమాఖ్య భవనాన్ని, మారుపాకలో వ్యవసాయ గోదాంను ప్రారంభించారు. రైతులకు నాణ్యమైన విద్యుత్, గిట్టుబాటు ధర కల్పించడంతో పాటు ఎల్నినో ప్రభావాన్ని ఎదుర్కొనేందుకు ప్రణాళికలు రూపొందిస్తున్నామని పేర్కొన్నారు. మర్రిపల్లి చెరువు ప్రాజెక్టును త్వరలో పూర్తి చేసి రైతులకు సాగునీరు అందిస్తామని హామీ ఇచ్చారు.1
- ముఖ్యమంత్రి సహాయనిధి చెక్కులను మాజీ మంత్రి కరీంనగర్ శాసనసభ్యులు గంగుల కమలాకర్ వారి క్యాంపు కార్యాలయంలో నేడు నియోజకవర్గంలోని 168 మంది లబ్ధిదారులకు సుమారు 39 లక్షల 59 వేల రూపాయల విలువగల చెక్కులను అందించారు.1
- సింహాద్రి కాలనీలో ఉచిత మెగా వైద్య శిబిరం.. ఐదుగురు వైద్య నిపుణులతో వైద్య సేవలు.. ఉచిత పరీక్షలు, మందుల పంపిణీ కరీంనగర్ 20వ డివిజన్ రేకుర్తిలోని సింహాద్రి కాలనీ డెవలప్మెంట్ కమిటీ అండ్ ట్రెండ్జ్ యూత్ ఆధ్వర్యంలో నిర్వహించిన ఉచిత మెగా వైద్య శిబిరానికి విశేష స్పందన లభించింది. ఫీడ్ దెమ్ మరియు క్రీస్టోఫర్ పౌండేషన్ సహకారంతో సింహాద్రి కాలనీలో నిర్వహించారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిధులుగా కాంగ్రెస్ పార్టీ నాయకులు పురుమాళ్ళ శ్రీనివాస్, మాజీ కార్పొరేటర్ ఏదుల్ల రాజశేఖర్, బీజేపీ నాయకులు జాడి బాల రెడ్డి హాజరయ్యారు. ఈ సందర్భంగా ఐదుగురు వైద్య నిపుణులు పాల్గొని ప్రజలకు వైద్య సేవలు అందించారు. గుండె సంబంధిత వ్యాధులు, సాధారణ ఆరోగ్య సమస్యలు, మధుమేహం, బీపీ, షుగర్, మహిళల ఆరోగ్య సమస్యలు, కంటి సంబంధిత సమస్యలకు పరీక్షలు నిర్వహించారు. అవసరమైన వారికి ఉచితంగా మందులు పంపిణీ చేశారు. ఆర్థోపెడిక్ వైద్య నిపుణుడు డాక్టర్ చొక్కారపు రాము, కార్డియాలజిస్ట్ డాక్టర్ సతీష్ కుమార్ రెంటపల్ల, సర్జికల్ గ్యాస్ట్రోఎంటరాలజిస్ట్ డాక్టర్ సంగు ప్రశాంత్, జనరల్ మెడిసిన్ వైద్యురాలు డాక్టర్ జి. శిరీష, గైనకాలజిస్ట్ డాక్టర్ ఆర్. గౌరి వైద్య సేవలందించారు. ఈ సందర్భంగా నిర్వాహకులు మాట్లాడుతూ.. కాలనీవాసుల ఆరోగ్య పరిరక్షణే లక్ష్యంగా ఉచిత వైద్య శిబిరాన్ని ఏర్పాటు చేసినట్లు తెలిపారు. ఇలాంటి సేవా కార్యక్రమాలను భవిష్యత్తులోనూ కొనసాగిస్తామని పేర్కొన్నారు. శిబిరానికి సహకరించిన వైద్యులకు, పాల్గొన్న ప్రజలకు కమిటీ సభ్యులు కృతజ్ఞతలు తెలిపారు. ఈ కార్యక్రమంలో కాలనీ అధ్యక్షుడు గడ్డం దామోదర్, ప్రధాన కార్యదర్శి గడ్డం నరేష్, కోశాధికారి గుంటి మహేందర్, ఉపాధ్యక్షుడు మల్లేశం ఉప కార్యదర్శి రామ్ సింగ్, ప్రచార కార్యదర్శి వేణు మరియు కమిటీ సభ్యులు యాకోబు యూత్ తదితరులు పాల్గొన్నారు.1
- నిరుపేదలకు ఇందిరమ్మ ఇండ్లు ఇవ్వాల్సి ఉంది. బి.సి. రవాణా శాఖ మంత్రి పొన్నం ప్రభాకర్ కోహెడ మండలం వింజ పల్లిలో ఇందిరమ్మ ఇండ్లలో గృహప్రవేశం, దీపావళి సంబరాలకు బీసీ, రవాణా శాఖ మంత్రి పొన్నం ప్రభాకర్ గౌడ్ హాజరై, లబ్ధిదారులకు ఉత్సాహాన్ని నింపారు. నిరుపేదలకు ఇందిరమ్మ ఇండ్ల ప్రాముఖ్యత ఇవ్వాలని నాయకులను కోరారు. కార్యక్రమంలోమార్కెట్ కమిటీ చైర్మన్ భోగి నిర్మల, స్థానిక సర్పంచి అన్నాడీ శ్రీజ, కాంగ్రెస్ పార్టీ మండల అధ్యక్షుడు శెట్టి సుధాకర్, తదితరులు పాల్గొన్నారు.1
- భీమేశ్వరుని సన్నిధిలో విప్ కుటుంబ సమేతంగా ప్రత్యేక పూజలు రాజన్న సిరిసిల్ల జిల్లా వేములవాడ శ్రీ రాజరాజేశ్వర స్వామి దేవస్థాన అనుబంధాలయమైన భీమేశ్వర స్వామి వారిని ప్రభుత్వ విప్, వేములవాడ శాసనసభ్యులు ఆది శ్రీనివాస్ కుటుంబ సమేతంగా దర్శించుకుని ప్రత్యేక పూజలు నిర్వహించారు.ఆలయానికి విచ్చేసిన ఎమ్మెల్యేకి ఆలయ అర్చకులు, వేద పండితులు స్వస్తి పలికి స్వాగతం అందించారు. అనంతరం ఆలయ మండపంలో వేద పండితులు ఎమ్మెల్యే దంపతులకు ఆశీర్వచనం అందజేశారు. ఆలయ అధికారులు ఎమ్మెల్యే కి స్వామివారి శేషవస్త్రం, లడ్డూ ప్రసాదాలను అందజేశారు.ఈ సందర్భంగా ఎమ్మెల్యే ఆలయంలో దీపారాధన చేసి, స్వామివారికి తమ మొక్కులు చెల్లించుకున్నారు.1