Shuru
Apke Nagar Ki App…
మృతుల కుటుంబాలకు రాజాపేట గ్రామపంచాయతీ పాలకవర్గం ఆర్థిక సాయం యాదాద్రి భువనగిరి జిల్లా రాజాపేట మండల కేంద్రంలో గ్రామపంచాయతీ పాలకవర్గం మానవతా దృక్పథాన్ని చాటుకుంది. శుక్రవారం నాడు ఇద్దరు ఉద్యోగుల కుటుంబాలకు ఆర్థిక సాయం అందజేసి అండగా నిలిచింది. గ్రామపంచాయతీ సిబ్బంది ఎర్రగోకుల అశోక్ తల్లి లలిత, అలాగే కంప్యూటర్ ఆపరేటర్ వల్లూరి కళ్యాణ్ చక్రవర్తి తండ్రి వీరస్వామి మృతి చెందడంతో, వారి కుటుంబాలకు ఒక్కొక్కరికి 8000 రూపాయల చొప్పున ఆర్థిక సాయం అందజేశారు. ఈ కార్యక్రమంలో సర్పంచ్ కోయ మధు, ఉపసర్పంచ్ నమిల కేదారి గౌడ్, పంచాయతీ కార్యదర్శి నారెడ్డి రాజమహేందర్ రెడ్డి తదితరులు పాల్గొని కుటుంబాలను ఓదార్చారు.
SHEKHAR
మృతుల కుటుంబాలకు రాజాపేట గ్రామపంచాయతీ పాలకవర్గం ఆర్థిక సాయం యాదాద్రి భువనగిరి జిల్లా రాజాపేట మండల కేంద్రంలో గ్రామపంచాయతీ పాలకవర్గం మానవతా దృక్పథాన్ని చాటుకుంది. శుక్రవారం నాడు ఇద్దరు ఉద్యోగుల కుటుంబాలకు ఆర్థిక సాయం అందజేసి అండగా నిలిచింది. గ్రామపంచాయతీ సిబ్బంది ఎర్రగోకుల అశోక్ తల్లి లలిత, అలాగే కంప్యూటర్ ఆపరేటర్ వల్లూరి కళ్యాణ్ చక్రవర్తి తండ్రి వీరస్వామి మృతి చెందడంతో, వారి కుటుంబాలకు ఒక్కొక్కరికి 8000 రూపాయల చొప్పున ఆర్థిక సాయం అందజేశారు. ఈ కార్యక్రమంలో సర్పంచ్ కోయ మధు, ఉపసర్పంచ్ నమిల కేదారి గౌడ్, పంచాయతీ కార్యదర్శి నారెడ్డి రాజమహేందర్ రెడ్డి తదితరులు పాల్గొని కుటుంబాలను ఓదార్చారు.
More news from తెలంగాణ and nearby areas
- మల్కాజిగిరి పరిధిలోని ఆర్కేపురం చెరువులో నీరు నింపాలని స్థానికుల డిమాండ్ మల్కాజిగిరి పరిధిలోని ఆర్కేపురం చెరువును గత ఏడున్నర నుంచి ఎనిమిది సంవత్సరాలుగా పలు అభివృద్ధి కార్యక్రమాల నిమిత్తం ఖాళీగా ఉంచారు. ఇప్పటివరకు చెరువులో కలుపు మొక్కలు తొలగించి, నీటిని నిల్వ చేసే చర్యలు చేపట్టకపోవడంతో చెరువు పరిసర ప్రాంతాల్లో ఈ ఏడాది నీటి ఎద్దడి ప్రారంభమైందని స్థానికులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. వర్షాకాలం ప్రారంభమయ్యేలోపు చెరువును శుభ్రపరచి నీటిని నింపితే భూగర్భ జలాలు పెరిగి, బోరుబావుల్లో నీటి లభ్యత మెరుగుపడి నీటి సమస్య తగ్గుతుందని స్థానిక ప్రజలు అభిప్రాయపడుతున్నారు.1
- నర్సంపేటకు చేరుకున్న మాజీ ఎమ్మెల్యే పెద్ది సుదర్శన్ రెడ్డి భౌతికఖాయం వరంగల్ జిల్లా నర్సంపేటకు చేరుకున్న మాజీ ఎమ్మెల్యే పెద్ది సుదర్శన్ రెడ్డి భౌతికఖాయం. పట్టణంలోని అమరవీరుల స్థూపం వద్ద పెద్ది భౌతికఖాయానికి నివాళులర్పించిన పార్టీ శ్రేణులు.కడసారి చూసేందుకు భారీగా తరలివచ్చిన ప్రజలు, ఉద్యమకారులు, బీఆర్ఎస్ శ్రేణులు.శోకసంద్రంలో మునిగిపోయిన నర్సంపేట నియోజకవర్గ ప్రజలు. కొనసాగుతున్న పెద్ది సుదర్శన్ రెడ్డి అంతిమయాత్ర.1
- జగిత్యాల జిల్లాలో వర్షం ఎఫెక్ట్ తో కూలిన ఇళ్ళు...బాధితులను ఆదుకోవాలని అధికారులను కోరిన జీవన్ రెడ్డి జగిత్యాల జిల్లా సారంగపూర్ మండలం లోని పెంబట్ల కోనపూర్ గ్రామాలలో నీట మునిగిన లోతట్టు ప్రాంతాల్లో మాజీమంత్రి బిఆర్ఎస్ నేత జీవన్ రెడ్డి పర్యటించారు. అధిక వర్షానికి కూలిపోయిన ఇళ్ళను పరిశీలించారు. MRO, RDO తో ఫోన్ లో మాట్లాడారు. ఇల్లు పూర్తిగా కూలితే నష్ట పరిహారం ఎంత వస్తుందని అడిగారు. జీవో ప్రకారం ఎంత ఉంటే అంత పూర్తిగా ఇల్లు కూలినందుకు నష్టపరిహారం అందజేయాలని సూచించారు . ఇల్లు కూలి నష్టపోయిన కుటుంబానికి ఇల్లు మంజూరు చేయాలని సూచించారు. ఇల్లు కూలినందుకు ప్రభుత్వం నుండి ఆర్థిక సహాయం అందేలా కృషి చేస్తానని ఇల్లు మంజూరు అయ్యేలా అధికారులతో మాట్లాడి చేపిస్తామని తెలిపారు.4
- ఆసుపత్రిలో ఆర్డీఓ ఆకస్మిక తనిఖీ.. రోగులతో నేరుగా ముచ్చట తూప్రాన్ 50 పడకల సామాజిక ఆసుపత్రిని ఆర్డీఓ బావయ్య శనివారం ఆకస్మికంగా తనిఖీ చేశారు. ఆసుపత్రిలో అందుతున్న వైద్య సేవలు, మౌలిక సదుపాయాలపై సూపరింటెండెంట్ డాక్టర్ అమర్ సింగ్‌ను అడిగి వివరాలు తెలుసుకున్నారు. అనంతరం వార్డులను పరిశీలించి రోగులతో నేరుగా మాట్లాడి చికిత్స, మందుల లభ్యత, వైద్య సిబ్బంది సేవలపై అభిప్రాయాలు సేకరించారు. ఈ సందర్భంగా రోగులకు సమయానికి నాణ్యమైన వైద్య సేవలు అందేలా చర్యలు తీసుకోవాలని, ప్రతి రోగితో మానవీయంగా వ్యవహరించి వారికి మనోధైర్యం కల్పించాలని వైద్యులు, సిబ్బందికి ఆర్డీఓ సూచించారు. ప్రభుత్వ ఆసుపత్రులపై ప్రజల్లో విశ్వాసం మరింత పెరిగేలా సేవలు అందించాలని ఆయన పేర్కొన్నారు.1
- *పత్రిక మరియు మీడియా మిత్రులకు నమస్కారములు* 🙏🙏🙏🙏🙏 *ఢిల్లీ లోని తెలంగాణ భవన్ అమరవీరుల స్తూపం దగ్గర పెద్ది సుదర్శన్ రెడ్డి చిత్రపటనికి నివాళులు అర్పించిన కాజిపేట్ బి ఆర్ యస్ పార్టీ నాయకులు *ఢిల్లీ లోని తెలంగాణ భవన్ అమరవీరుల స్తూపం దగ్గర పెద్ది సుదర్శన్ రెడ్డి చిత్రపటానికి నివాళులు* ఈరోజు ఢీల్లి లోని తెలంగాణ భవన్ అమరవీరుల స్థూపం దగ్గర పెద్ది సుదర్శన్ రెడ్డి చిత్రపటానికి నివాళులు అర్పించిన కాజిపేట్ బి ఆర్ ఎస్ పార్టీ నాయకులు ఈ కార్యక్రమం లో ఉద్దేశించి బి ఆర్ ఎస్ పార్టీ రాష్ట్ర మాజీ కార్యదర్శి *నార్లగిరి రమేష్* మాజీ కార్పొరేటర్ *జోరిక రమేష్* గార్లు మాట్లాడుతూ పెద్ది సుదర్శన్ రెడ్డి గారి మరణం ఉమ్మడి వరంగల్ జిల్లాకే కాకుండా బి ఆర్ ఎస్ పార్టీ కి తీరని నష్టమని పెద్ది సుదర్శన్ రెడ్డి తెలంగాణ మలిదిశ ఉద్యమాన్ని నడిపిన ఉద్యమ నాయకుడు అని మచ్చలేని ఎమ్మెల్యేగా సివిల్ సప్లై కార్పొరేషన్ చైర్మన్ గా ప్రజలకు ఎన్నో సేవలు చేశాడని పెద్దికి రైతుల పట్ల ఉద్యమకారుల పట్ల ఏదో ఒకటి చేయాలనే తపన ఉండేదని 2001 నుండి పెద్ది సుదర్శన్ రెడ్డితో ఉద్యమంలో కలిసి పనిచేసినమని పెద్దన్న మరణం నాలాంటి ఉద్యమకారులకు బి ఆర్ ఎస్ పార్టీకి తీవ్ర నష్టమని వారి కుటుంబానికి ప్రగాఢ సానుభూతి తెలియజేస్తూన్నాము అని తెలియజేసినారు ఇంకా ఈ కార్యక్రమంలో బి ఆర్ ఎస్ పార్టీ అర్బన్ జిల్లా మాజీ ప్రధాన కార్యదర్శి *గబ్బెట శ్రీనివాస్* శిరుమల్ల దశరథం సంకు నర్సింగ రావు MD ఆఫ్జాల్ MD హుస్సేన్ సుంచు అశోక్ కోండ్ర శంకర్ తండమళ్ళ వేణు కుమ్మరి రాజ్ కుమార్ పోలేపల్లి రామ్మూర్తి గడ్డం రఘు వంశీ మాచర్ల గణేష్ కనకం రమేష్ మారపాక గణేష్ రాబర్ట్ అయాన్ జుబేర్ తదితరులు పాల్గొన్నారు *మీ.. గబ్బేట శ్రీనివాస్ బి ఆర్ యస్ పార్టీ అర్బన్ జిల్లా ప్రధాన కార్యదర్శి* 86866186642
- ఫీజుల బకాయి – బీజేపీ లడాయి ఉప్పల్ మాజీ ఎమ్మెల్యే ఎన్విఎస్ఎస్ ప్రభాకర్ విద్యార్థుల హక్కుల కోసం భారతీయ జనతా యువ మోర్చా చేపట్టిన “ఫీజుల బకాయి – బీజేపీ లడాయి” కార్యక్రమంలో భాగంగా ఎన్‌వీఎస్‌ఎస్ ప్రభాకర్ నేతృత్వంలో ఈసీఐఎల్ పరిధిలోని డాక్టర్ ఏ.ఎస్. రావు నగర్ డివిజన్‌లో ఉన్న శ్రీ ఆదర్శ డిగ్రీ కాలేజ్, వసుంధర డిగ్రీ కాలేజీలను సందర్శించారు. ఈ సందర్భంగా కళాశాల యాజమాన్యాలతో పాటు విద్యార్థులతో సమావేశమై ఫీజుల బకాయిల సమస్యలు, విద్యారంగంలో ఎదురవుతున్న ఇబ్బందులపై చర్చించి ఉద్యమానికి మద్దతు ఇవ్వాలని కోరారు. కార్యక్రమంలో అంబటి వెంకటాచలం, జీవీఎన్ రావు, తుమ్మల సంధ్యారెడ్డి, సోమేశ్ నాయుడు, ఉమా శ్రీధర్, ఏనుగు రాజిరెడ్డి, నాగపురి నవీన్, జూపల్లి అరుణ్ కుమార్ తదితర బీజేపీ నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు. విద్యార్థులపై ఫీజుల భారం, బకాయిల పేరుతో జరుగుతున్న అన్యాయాలకు వ్యతిరేకంగా పోరాటం కొనసాగుతుందని నాయకులు తెలిపారు.1
- బ్రేకింగ్ న్యూస్: నర్సంపేట మాజీ ఎమ్మెల్యే, బీఆర్ఎస్ సీనియర్ నాయకుడు పెద్ది సుదర్శన్ రెడ్డి ఇక లేరు. తీవ్ర ఛాతీ నొప్పితో అస్వస్థతకు గురైన మాజీ ఎమ్మెల్యే బీఆర్ఎస్ సీనియర్ నాయకుడు హైదరాబాద్‌లోని యశోద ఆసుపత్రిలో చికిత్స పొందుతూ శుక్రవారం అర్థరాత్రి 12:51 గంటలకు తుదిశ్వాస విడిచారు.ఆయన మరణవార్త రాజకీయ, సామాజిక వర్గాలను తీవ్ర దిగ్భ్రాంతికి గురి చేసింది. ఉమ్మడి వరంగల్ జిల్లాలో విషాద ఛాయలు అలుముకున్నాయి. పెద్ది సుదర్శన్ రెడ్డి గారి ఆత్మకు శాంతి చేకూరాలని భగవంతుడిని ప్రార్థిస్తూ, వారి కుటుంబ సభ్యులకు, బంధుమిత్రులకు, అభిమానులకు ప్రగాఢ సానుభూతిని తెలియజేస్తున్నాం.1
- తూప్రాన్ మున్సిపాలిటీలో పారిశుధ్య కార్మికుల భద్రతకు ప్రాధాన్యం ఇస్తూ రెయిన్‌కోట్లు, సేఫ్టీ కిట్లను పంపిణీ తూప్రాన్ మున్సిపాలిటీలో పారిశుధ్య కార్మికుల భద్రతకు ప్రాధాన్యం ఇస్తూ రెయిన్‌కోట్లు, సేఫ్టీ కిట్లను పంపిణీ చేశారు. మున్సిపల్ కార్యాలయంలో నిర్వహించిన కార్యక్రమంలో చైర్‌పర్సన్ బొంది రజనీ, కమిషనర్ రమేష్ కుమార్ కార్మికులకు కిట్లు అందజేశారు. వర్షాకాలంలో ప్రతికూల వాతావరణ పరిస్థితుల్లోనూ విధులు నిర్వహించే పారిశుధ్య కార్మికులు సురక్షితంగా పనిచేయాలనే ఉద్దేశంతో ఈ చర్య చేపట్టినట్లు వారు తెలిపారు. ప్రజారోగ్య పరిరక్షణలో కార్మికుల సేవలు కీలకమని, వారి సంక్షేమానికి మున్సిపాలిటీ ఎల్లప్పుడూ అండగా ఉంటుందని పేర్కొన్నారు. ఈ కార్యక్రమంలో కౌన్సిలర్లు, మున్సిపల్ అధికారులు, సిబ్బంది పాల్గొన్నారు.1
- నర్సంపేట మాజీ ఎమ్మెల్యే బీఆర్ఎస్ పార్టీ నేత పెద్ది సుదర్శన్ రెడ్డి కన్నుమూత హైదరాబాద్‌లోని సికింద్రాబాద్ యశోద ఆసుపత్రిలో చికిత్స పొందుతున్న నర్సంపేట మాజీ ఎమ్మెల్యే పెద్ది సుదర్శన్ రెడ్డి కన్నుమూశారు. అర్ధరాత్రి 12 గంటల 51 నిమిషాలకు ఆయన మృతి చెందినట్లు వైద్యులు అధికారికంగా ప్రకటించారు. కొన్ని రోజులుగా ఆసుపత్రిలో చికిత్స పొందుతున్న ఆయన ఆరోగ్య పరిస్థితి విషమించడంతో వైద్యులు ప్రత్యేక చికిత్స అందించినప్పటికీ ఫలితం లేకపోయింది. పెద్ది సుదర్శన్ రెడ్డి మృతివార్తతో ఆయన అభిమానులు, బంధువులు, శ్రేయోభిలాషులు, పార్టీ కార్యకర్తలు, తీవ్ర విషాదంలో మునిగిపోయారు. యశోద ఆసుపత్రి వద్ద పెద్ద సంఖ్యలో అభిమానులు చేరుకుని కన్నీరుమున్నీరవుతున్నారు.1