logo
Shuru
Apke Nagar Ki App…
  • Latest News
  • News
  • Politics
  • Elections
  • Viral
  • Astrology
  • Horoscope in Hindi
  • Horoscope in English
  • Latest Political News
logo
Shuru
Apke Nagar Ki App…

హైదరాబాద్ యశోద హాస్పిటల్ లో చికిత్స పొందుతున్న మాజీ ఎమ్మెల్యే పెద్ది సుదర్శన్ రెడ్డిని పరామర్శించిన మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డి

1 day ago
user_Ramprasad islavath
Ramprasad islavath
Taxi Driver కల్లూరు, ఖమ్మం, తెలంగాణ•
1 day ago

హైదరాబాద్ యశోద హాస్పిటల్ లో చికిత్స పొందుతున్న మాజీ ఎమ్మెల్యే పెద్ది సుదర్శన్ రెడ్డిని పరామర్శించిన మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డి

More news from తెలంగాణ and nearby areas
  • తల్లాడ లోని నారాయణపురంలో గ్రామంలో ముత్యాలమ్మ తల్లికి శాఖాంబరి అలంకారం తల్లాడ మండలం నారాయణపురం గ్రామంలో ముత్యాలమ్మ తల్లికి వివిధ రకాల కూరగాయలతో శాఖాంబరి అలంకరణ చేసి పూజలో అందించండి ఈ కార్యక్రమంలో గ్రామస్తులు కృష్ణారెడ్డి వీర మోహన్ రెడ్డి పెద్ద ఎత్తున మహిళలకు పాల్గొని బోనాలు సమర్పించారు, వ్యాస పూర్ణిమ సందర్భంగా గురువర్యులకు సన్మానం చేసినా రు
    4
    తల్లాడ లోని నారాయణపురంలో గ్రామంలో ముత్యాలమ్మ తల్లికి శాఖాంబరి అలంకారం
తల్లాడ  మండలం నారాయణపురం గ్రామంలో ముత్యాలమ్మ తల్లికి వివిధ రకాల కూరగాయలతో శాఖాంబరి అలంకరణ చేసి పూజలో అందించండి ఈ కార్యక్రమంలో గ్రామస్తులు కృష్ణారెడ్డి వీర మోహన్ రెడ్డి పెద్ద ఎత్తున మహిళలకు పాల్గొని బోనాలు సమర్పించారు, వ్యాస పూర్ణిమ సందర్భంగా గురువర్యులకు సన్మానం చేసినా రు
    user_Chalamala narasimharao
    Chalamala narasimharao
    Court reporter పెనుబల్లి, ఖమ్మం, తెలంగాణ•
    8 hrs ago
  • మహబూబాబాద్ జిల్లా సబ్ రిజిస్ట్రార్ కార్యాలయానికి వెళ్లే ప్రధాన రహదారి పూర్తిగా దెబ్బతిని, గుంతలమయంగా మారడంతో 🚨 మహబూబాబాద్ జిల్లా ప్రజల ఆవేదన 🚨 సబ్ రిజిస్ట్రార్ కార్యాలయానికి వెళ్లే ప్రధాన రహదారి పూర్తిగా దెబ్బతింది! ❌ గుంతలమయంగా మారిన రహదారి ❌ నిత్యం ప్రమాదాలకు నిలయంగా మారిన పరిస్థితి ❌ ప్రజలు, రైతులు, వాహనదారులు తీవ్ర ఇబ్బందులు రోజూ వందలాది మంది ప్రజలు, మహిళలు, వృద్ధులు, విద్యార్థులు ఈ రహదారిపై ప్రయాణిస్తున్నారు. అయినప్పటికీ సంబంధిత అధికారులు, ప్రజాప్రతినిధులు ఈ దుస్థితిని పట్టించుకోకపోవడం బాధాకరం. మా డిమాండ్లు ✅ వెంటనే రహదారిని మరమ్మతు చేయాలి. ✅ గుంతలను శాశ్వతంగా పూడ్చి, నాణ్యమైన రహదారి నిర్మించాలి. ✅ ప్రజల ప్రాణాలకు ముప్పుగా ఉన్న ఈ సమస్యను తక్షణమే పరిష్కరించాలి. "ప్రజల భద్రతే ప్రభుత్వ బాధ్యత – నిర్లక్ష్యం కాదు!" నిమ్మనగంటి అనిల్ బాబు తెలంగాణ రాజ్యాధికార పార్టీ మహబూబాబాద్ జిల్లా యూత్ అధ్యక్షుడు
    2
    మహబూబాబాద్ జిల్లా సబ్ రిజిస్ట్రార్ కార్యాలయానికి వెళ్లే ప్రధాన రహదారి పూర్తిగా దెబ్బతిని, గుంతలమయంగా మారడంతో
🚨 మహబూబాబాద్ జిల్లా ప్రజల ఆవేదన 🚨
సబ్ రిజిస్ట్రార్ కార్యాలయానికి వెళ్లే ప్రధాన రహదారి పూర్తిగా దెబ్బతింది!
❌ గుంతలమయంగా మారిన రహదారి
❌ నిత్యం ప్రమాదాలకు నిలయంగా మారిన పరిస్థితి
❌ ప్రజలు, రైతులు, వాహనదారులు తీవ్ర ఇబ్బందులు
రోజూ వందలాది మంది ప్రజలు, మహిళలు, వృద్ధులు, విద్యార్థులు ఈ రహదారిపై ప్రయాణిస్తున్నారు. అయినప్పటికీ సంబంధిత అధికారులు, ప్రజాప్రతినిధులు ఈ దుస్థితిని పట్టించుకోకపోవడం బాధాకరం.
మా డిమాండ్లు
✅ వెంటనే రహదారిని మరమ్మతు చేయాలి.
✅ గుంతలను శాశ్వతంగా పూడ్చి, నాణ్యమైన రహదారి నిర్మించాలి.
✅ ప్రజల ప్రాణాలకు ముప్పుగా ఉన్న ఈ సమస్యను తక్షణమే పరిష్కరించాలి.
"ప్రజల భద్రతే ప్రభుత్వ బాధ్యత – నిర్లక్ష్యం కాదు!"
నిమ్మనగంటి అనిల్ బాబు
తెలంగాణ రాజ్యాధికార పార్టీ
మహబూబాబాద్ జిల్లా యూత్ అధ్యక్షుడు
    user_NIMMANAGANTI ANIL BABU
    NIMMANAGANTI ANIL BABU
    Local News Reporter డోర్నకల్, మహబూబాబాద్, తెలంగాణ•
    8 hrs ago
  • ఖమ్మం జిల్లా ఖమ్మం రూరల్ ఏదులాపురం: అభివృద్ధి పనులకు శంకుస్థాపన చేసిన మంత్రి ఏదులాపురం మున్సిపాలిటీ పరిధిలోని గిరిజన సంక్షేమ ఇంజినీరింగ్ విభాగంలో రూ.15 లక్షల అంచనా వ్యయంతో చేపట్టిన అదనపు వసతి గృహ నిర్మాణం, డైనింగ్ హాల్, షెడ్డు నిర్మాణాలకు రాష్ట్ర రెవెన్యూ శాఖ మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డి శంకుస్థాపన చేశారు. విద్యార్థినులతో కలిసి డిజిటల్ బ్లాక్ బోర్డు ప్రారంభించారు. అనంతరం పిల్లలతో కలిసి టేబుల్ టెన్నిస్ ఆడారు.
    1
    ఖమ్మం జిల్లా ఖమ్మం రూరల్ ఏదులాపురం: అభివృద్ధి పనులకు శంకుస్థాపన చేసిన మంత్రి
ఏదులాపురం మున్సిపాలిటీ పరిధిలోని గిరిజన సంక్షేమ ఇంజినీరింగ్ విభాగంలో రూ.15 లక్షల అంచనా వ్యయంతో చేపట్టిన అదనపు వసతి గృహ నిర్మాణం, డైనింగ్ హాల్, షెడ్డు నిర్మాణాలకు రాష్ట్ర రెవెన్యూ శాఖ మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డి శంకుస్థాపన చేశారు. విద్యార్థినులతో కలిసి డిజిటల్ బ్లాక్ బోర్డు ప్రారంభించారు. అనంతరం పిల్లలతో కలిసి టేబుల్ టెన్నిస్ ఆడారు.
    user_Kasani Venkatesh
    Kasani Venkatesh
    Local News Reporter నేలకొండపల్లి, ఖమ్మం, తెలంగాణ•
    3 hrs ago
  • ఇల్లందు.. కొత్తగూడెం ఓపెన్ కాస్ట్ లో వర్షం కారణంగా 3వేల టన్నుల బొగ్గు ఉత్పత్తికి అంతరాయం భద్రాద్రి కొత్తగూడెం జిల్లా ఇల్లందు..వర్షం కారణంగా బొగ్గు ఉత్పత్తికి అంతరాయం యాంకర్ వాయిస్ భద్రాద్రి కొత్తగూడెం జిల్లా ఇల్లందు ఎడతెరిపి లేకుండా రాత్రి నుండి కురుస్తున్న వర్షానికి ఇల్లందు సింగరేణి ఏరియా కోయగూడెం ఉపరితల గనిలో వర్షం కారణంగా 3 వేల టన్నుల బొగ్గు ఉత్పత్తికి నష్టం వాటిల్లింది. వాతావరణ పరిస్థితుల నేపథ్యంలో ఓబి పనులు ప్రారంభం కాలేదు. ఈ వర్షాకాలంలో ఇప్పుడిప్పుడే కురుస్తున్న వర్షాలతో అధికారులు బొగు రవాణాకు ఎటువంటి ఇబ్బందులు తలెత్తకుండా అధికారులు చర్యలు తీసుకుంటున్నారు.
    1
    ఇల్లందు.. కొత్తగూడెం ఓపెన్ కాస్ట్ లో వర్షం కారణంగా 3వేల టన్నుల బొగ్గు ఉత్పత్తికి అంతరాయం 
భద్రాద్రి కొత్తగూడెం జిల్లా  
ఇల్లందు..వర్షం కారణంగా బొగ్గు ఉత్పత్తికి అంతరాయం 
యాంకర్ వాయిస్
భద్రాద్రి కొత్తగూడెం జిల్లా ఇల్లందు ఎడతెరిపి లేకుండా రాత్రి నుండి కురుస్తున్న వర్షానికి ఇల్లందు  సింగరేణి ఏరియా కోయగూడెం ఉపరితల గనిలో వర్షం కారణంగా 3 వేల టన్నుల బొగ్గు ఉత్పత్తికి నష్టం వాటిల్లింది. వాతావరణ పరిస్థితుల నేపథ్యంలో ఓబి పనులు ప్రారంభం కాలేదు. ఈ వర్షాకాలంలో ఇప్పుడిప్పుడే కురుస్తున్న వర్షాలతో అధికారులు బొగు రవాణాకు ఎటువంటి ఇబ్బందులు తలెత్తకుండా అధికారులు చర్యలు తీసుకుంటున్నారు.
    user_Shekar Thaduri
    Shekar Thaduri
    ఎల్లందు, భద్రాద్రి కొత్తగూడెం, తెలంగాణ•
    6 hrs ago
  • పాత బస్టాండ్‌ పై ఆర్టీసీ నిర్లక్ష్యం.. ప్రజలకు నిత్యం ఇక్కట్లు నేలకొండపల్లి మేజర్ గ్రామపంచాయతీ పరిధిలోని పాత బస్టాండ్ వద్ద ఆర్టీసీ బస్సులు ఆగకపోవడంతో ప్రయాణికులు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. గత కొన్ని సంవత్సరాలుగా ఇదే పరిస్థితి కొనసాగుతున్నప్పటికీ ఆర్టీసీ అధికారులు సమస్యను పట్టించుకోవడం లేదని స్థానికులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. పాత బస్టాండ్‌లో ఆగాల్సిన బస్సులు సైతం చేయి చూపించినా ఆపకుండా వెళ్లిపోతున్నాయని, దీంతో విద్యార్థులు, ఉద్యోగులు, మహిళలు, వృద్ధులు సహా వందలాది మంది ప్రయాణికులు నిత్యం ఇబ్బందులు పడుతున్నారని తెలిపారు. ముఖ్యంగా పాఠశాలలు, కళాశాలలకు వెళ్లే విద్యార్థులు సమయానికి చేరుకోలేక ఇబ్బందులు ఎదుర్కొంటున్నారని పేర్కొన్నారు. ఈ సమస్యపై పలుమార్లు సంబంధిత ఆర్టీసీ డిపో అధికారులకు వినతిపత్రాలు అందజేసినా, ఫిర్యాదులు చేసినా ఎలాంటి చర్యలు తీసుకోలేదని స్థానికులు ఆరోపిస్తున్నారు. దీంతో బస్సులు ఎక్కేందుకు దూర ప్రాంతాలకు వెళ్లాల్సిన పరిస్థితి ఏర్పడిందని వాపోతున్నారు. ఇప్పటికైనా ఆర్టీసీ ఉన్నతాధికారులు స్పందించి పాత బస్టాండ్‌లో అన్ని నిర్ణీత బస్సులు తప్పనిసరిగా ఆగేలా చర్యలు తీసుకోవాలని, డ్రైవర్లు, కండక్టర్లకు స్పష్టమైన ఆదేశాలు జారీ చేయాలని స్థానిక ప్రజలు, విద్యార్థులు, ప్రయాణికులు కోరుతున్నారు.
    1
    పాత బస్టాండ్‌ పై ఆర్టీసీ నిర్లక్ష్యం.. ప్రజలకు నిత్యం ఇక్కట్లు

నేలకొండపల్లి మేజర్ గ్రామపంచాయతీ పరిధిలోని పాత బస్టాండ్ వద్ద ఆర్టీసీ బస్సులు ఆగకపోవడంతో ప్రయాణికులు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. గత కొన్ని సంవత్సరాలుగా ఇదే పరిస్థితి కొనసాగుతున్నప్పటికీ ఆర్టీసీ అధికారులు సమస్యను పట్టించుకోవడం లేదని స్థానికులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు.
పాత బస్టాండ్‌లో ఆగాల్సిన బస్సులు సైతం చేయి చూపించినా ఆపకుండా వెళ్లిపోతున్నాయని, దీంతో విద్యార్థులు, ఉద్యోగులు, మహిళలు, వృద్ధులు సహా వందలాది మంది ప్రయాణికులు నిత్యం ఇబ్బందులు పడుతున్నారని తెలిపారు. ముఖ్యంగా పాఠశాలలు, కళాశాలలకు వెళ్లే విద్యార్థులు సమయానికి చేరుకోలేక ఇబ్బందులు ఎదుర్కొంటున్నారని పేర్కొన్నారు.
ఈ సమస్యపై పలుమార్లు సంబంధిత ఆర్టీసీ డిపో అధికారులకు వినతిపత్రాలు అందజేసినా, ఫిర్యాదులు చేసినా ఎలాంటి చర్యలు తీసుకోలేదని స్థానికులు ఆరోపిస్తున్నారు. దీంతో బస్సులు ఎక్కేందుకు దూర ప్రాంతాలకు వెళ్లాల్సిన పరిస్థితి ఏర్పడిందని వాపోతున్నారు.
ఇప్పటికైనా ఆర్టీసీ ఉన్నతాధికారులు స్పందించి పాత బస్టాండ్‌లో అన్ని నిర్ణీత బస్సులు తప్పనిసరిగా ఆగేలా చర్యలు తీసుకోవాలని, డ్రైవర్లు, కండక్టర్లకు స్పష్టమైన ఆదేశాలు జారీ చేయాలని స్థానిక ప్రజలు, విద్యార్థులు, ప్రయాణికులు కోరుతున్నారు.
    user_ARUNKUMAR
    ARUNKUMAR
    Local News Reporter నేలకొండపల్లి, ఖమ్మం, తెలంగాణ•
    7 hrs ago
  • ప్రజల మధ్య... ప్రజల సమస్యలపై... ప్రజలతోనే ముందుకు సాగుతున్న నాయకుడు తీన్మార్ మల్లన్న.**దేవరకద్ర పర్యటనలో ప్రజల మధ్య తీన్మార్ మల్లన్న..!* *దేవరకద్ర పర్యటనలో ప్రజల మధ్య తీన్మార్ మల్లన్న..!* *దేవరకద్ర పర్యటనకు వెళ్తున్న క్రమంలో మార్గమధ్యలో ఓ టీ షాప్ వద్ద ఆగిన టీఆర్పీ అధినేత, ఎమ్మెల్సీ తీన్మార్ మల్లన్న గారు అక్కడి కార్మికులు, స్థానిక ప్రజలతో ఆప్యాయంగా ముచ్చటించారు.* *బీసీ ఉద్యమం, తెలంగాణ రాజ్యాధికార పార్టీ (TRP) ప్రజల్లోకి ఎలా వెళ్తోంది? ప్రజల స్పందన ఎలా ఉంది? అనే అంశాలపై నేరుగా ప్రజలను అడిగి తెలుసుకుంటూ వారి అభిప్రాయాలను స్వయంగా విన్నారు.* *ప్రజల మధ్య... ప్రజల సమస్యలపై... ప్రజలతోనే ముందుకు సాగుతున్న నాయకుడు తీన్మార్ మల్లన్న.*
    1
    ప్రజల మధ్య... ప్రజల సమస్యలపై... ప్రజలతోనే ముందుకు సాగుతున్న నాయకుడు తీన్మార్ మల్లన్న.**దేవరకద్ర పర్యటనలో ప్రజల మధ్య తీన్మార్ మల్లన్న..!*
*దేవరకద్ర పర్యటనలో ప్రజల మధ్య తీన్మార్ మల్లన్న..!*
*దేవరకద్ర పర్యటనకు వెళ్తున్న క్రమంలో మార్గమధ్యలో ఓ టీ షాప్ వద్ద ఆగిన టీఆర్పీ అధినేత, ఎమ్మెల్సీ తీన్మార్ మల్లన్న గారు అక్కడి కార్మికులు, స్థానిక ప్రజలతో ఆప్యాయంగా ముచ్చటించారు.*
*బీసీ ఉద్యమం, తెలంగాణ రాజ్యాధికార పార్టీ (TRP) ప్రజల్లోకి ఎలా వెళ్తోంది? ప్రజల స్పందన ఎలా ఉంది? అనే అంశాలపై నేరుగా ప్రజలను అడిగి తెలుసుకుంటూ వారి అభిప్రాయాలను స్వయంగా విన్నారు.*
*ప్రజల మధ్య... ప్రజల సమస్యలపై... ప్రజలతోనే ముందుకు సాగుతున్న నాయకుడు తీన్మార్ మల్లన్న.*
    user_NIMMANAGANTI ANIL BABU
    NIMMANAGANTI ANIL BABU
    Local News Reporter డోర్నకల్, మహబూబాబాద్, తెలంగాణ•
    9 hrs ago
  • భద్రాద్రి జిల్లా:తాలిపేరుకు పొంగిపొర్లుతున్న వరద.. 22 గేట్లు ఎత్తివేత! 30 వేల క్యూసెక్కుల నీరు దిగువకు విడుదల భద్రాద్రి జిల్లా చర్ల మండలంలోని తాలిపేరు ఇరిగేషన్ ప్రాజెక్టుకు భారీగా వరద నీరు వచ్చి చేరుతోంది. బుధవారం నీటి మట్టం 73.39 మీటర్లకు చేరింది. ప్రాజెక్టు దాదాపు పూర్తి స్థాయికి చేరుకోవడంతో అధికారులు 22 గేట్లను 2 అడుగుల మేర ఎత్తి 30,024 క్యూసెక్కుల నీటిని దిగువకు విడుదల చేస్తున్నారు. నీటి మట్టం క్రమంగా పెరుగుతుండటంతో అదనపు నీటిని దిగువకు వదులుతున్నామని అధికారులు తెలిపారు.
    1
    భద్రాద్రి జిల్లా:తాలిపేరుకు పొంగిపొర్లుతున్న వరద.. 22 గేట్లు ఎత్తివేత! 30 వేల క్యూసెక్కుల నీరు దిగువకు విడుదల
భద్రాద్రి జిల్లా చర్ల మండలంలోని తాలిపేరు ఇరిగేషన్ ప్రాజెక్టుకు భారీగా వరద నీరు వచ్చి చేరుతోంది. బుధవారం నీటి మట్టం 73.39 మీటర్లకు చేరింది. ప్రాజెక్టు దాదాపు పూర్తి స్థాయికి చేరుకోవడంతో అధికారులు 22 గేట్లను 2 అడుగుల మేర ఎత్తి 30,024 క్యూసెక్కుల నీటిని దిగువకు విడుదల చేస్తున్నారు. నీటి మట్టం క్రమంగా పెరుగుతుండటంతో అదనపు నీటిని దిగువకు వదులుతున్నామని అధికారులు తెలిపారు.
    user_Kasani Venkatesh
    Kasani Venkatesh
    Local News Reporter నేలకొండపల్లి, ఖమ్మం, తెలంగాణ•
    4 hrs ago
  • ఇల్లందులో వైభవంగా గురుపౌర్ణమి వేడుకలు: సాయిబాబా ఆలయంలో ప్రత్యేక పూజలు, అన్నదానం ఇల్లందులో వైభవంగా గురుపౌర్ణమి వేడుకలు: సాయిబాబా ఆలయంలో ప్రత్యేక పూజలు, అన్నదానం ​ ఇల్లందు పట్టణంలోని జగదాంబ సెంటర్ నందు వేంచేసియున్న శ్రీ షిర్డీ సాయిబాబా ఆలయంలో గురుపౌర్ణమి పర్వదినాన్ని పురస్కరించుకుని బుధవారం ప్రత్యేక పూజా కార్యక్రమాలను అత్యంత వైభవంగా నిర్వహించారు. ​ఉదయం నుంచే ఆలయ అర్చకులు స్వామివారికి కాకడ హారతి, క్షీరాభిషేకం, మహన్యాస పూర్వక రుద్రాభిషేకం, మరియు ప్రత్యేక అలంకరణలు చేపట్టారు. అనంతరం భక్తుల దర్శనార్థం ఆలయ తలుపులు తెరిచారు. గురుపౌర్ణమి సందర్భంగా జగదాంబ సెంటర్ ప్రాంతం "ఓం సాయి రామ్" నామస్మరణతో మారుమోగింది. స్వామివారిని దర్శించుకుని, తారక మంత్రాన్ని జపించేందుకు ఇల్లందు పట్టణంతో పాటు చుట్టుపక్కల గ్రామాల నుంచి భక్తులు భారీ సంఖ్యలో తరలివచ్చారు. ఆలయ ప్రాంగణంలో సాయిబాబా ప్రత్యేక పూజలు, తీర్థప్రసాద వితరణలో భక్తులు పెద్ద ఎత్తున పాల్గొన్నారు. ​పూజా కార్యక్రమాల అనంతరం ఆలయ నిర్వాహకుల ఆధ్వర్యంలో విచ్చేసిన భక్తులందరికీ భారీ అన్నదాన కార్యక్రమం నిర్వహించారు. వేలాదిమంది భక్తులు పాల్గొని ప్రసాదాన్ని స్వీకరించారు. ఆలయ కమిటీ సభ్యులు భక్తులకు ఎలాంటి అసౌకర్యం కలగకుండా ప్రత్యేక సదుపాయాలు ఏర్పాటు చేశారు. ఈ కార్యక్రమంలో స్థానిక ప్రజలు, ఆధ్యాత్మిక వేత్తలు మరియు పెద్ద సంఖ్యలో భక్తజనం పాల్గొన్నారు
    2
    ఇల్లందులో వైభవంగా గురుపౌర్ణమి వేడుకలు: సాయిబాబా ఆలయంలో ప్రత్యేక పూజలు, అన్నదానం
ఇల్లందులో వైభవంగా గురుపౌర్ణమి వేడుకలు: సాయిబాబా ఆలయంలో ప్రత్యేక పూజలు, అన్నదానం
​
ఇల్లందు పట్టణంలోని జగదాంబ సెంటర్ నందు వేంచేసియున్న శ్రీ షిర్డీ సాయిబాబా ఆలయంలో గురుపౌర్ణమి పర్వదినాన్ని పురస్కరించుకుని బుధవారం ప్రత్యేక పూజా కార్యక్రమాలను అత్యంత వైభవంగా నిర్వహించారు.
​ఉదయం నుంచే ఆలయ అర్చకులు స్వామివారికి కాకడ హారతి, క్షీరాభిషేకం, మహన్యాస పూర్వక రుద్రాభిషేకం, మరియు ప్రత్యేక అలంకరణలు చేపట్టారు. అనంతరం భక్తుల దర్శనార్థం ఆలయ తలుపులు తెరిచారు. గురుపౌర్ణమి సందర్భంగా జగదాంబ సెంటర్ ప్రాంతం "ఓం సాయి రామ్" నామస్మరణతో మారుమోగింది. స్వామివారిని దర్శించుకుని, తారక మంత్రాన్ని జపించేందుకు ఇల్లందు పట్టణంతో పాటు చుట్టుపక్కల గ్రామాల నుంచి భక్తులు భారీ సంఖ్యలో తరలివచ్చారు. ఆలయ ప్రాంగణంలో సాయిబాబా ప్రత్యేక పూజలు, తీర్థప్రసాద వితరణలో భక్తులు పెద్ద ఎత్తున పాల్గొన్నారు.
​పూజా కార్యక్రమాల అనంతరం ఆలయ నిర్వాహకుల ఆధ్వర్యంలో విచ్చేసిన భక్తులందరికీ భారీ అన్నదాన కార్యక్రమం నిర్వహించారు. వేలాదిమంది భక్తులు పాల్గొని ప్రసాదాన్ని స్వీకరించారు. ఆలయ కమిటీ సభ్యులు భక్తులకు ఎలాంటి అసౌకర్యం కలగకుండా ప్రత్యేక సదుపాయాలు ఏర్పాటు చేశారు. ఈ కార్యక్రమంలో స్థానిక ప్రజలు, ఆధ్యాత్మిక వేత్తలు మరియు పెద్ద సంఖ్యలో భక్తజనం పాల్గొన్నారు
    user_Shekar Thaduri
    Shekar Thaduri
    ఎల్లందు, భద్రాద్రి కొత్తగూడెం, తెలంగాణ•
    6 hrs ago
  • ప్రజా ప్రెస్ క్లబ్ ప్రోద్బలం ప్రజా ప్రెస్ క్లబ్ సభ్యులు భారత్ న్యూస్, పత్రిక వార్త కథనానికి స్పందించిన 108 సిబ్బంది. ఎన్టీఆర్ జిల్లా ఇబ్రహీంపట్నం, జులై, 29, ఇబ్రహీంపట్నం హైదరాబాద్ వెళ్ళు జాతీయ రహదారిలో బస్ స్టాప్ లో గత కొద్ది రోజులుగా ఒక వృద్ధుడు అనాధగా కాలికి గాయమై కాలికి చీ మీ ఇన్ఫెక్షన్ వచ్చి కాలు అంతా తినేసి దుర్వాసన కొడుతూ ప్రయాణికులకు ఇబ్బందికరంగా ఉండటాన్ని గమనించిన ప్రజాప్రస్ క్లబ్ పత్రికా మిత్రులు స్పందించి వారి వార్త కథనంతో 108 సిబ్బంది ఎమర్జెన్సీ మెడికల్ ఫస్ట్ ఎయిడ్ చేసి పి వెంకట శివ, సురేష్ గోపి లు మానవతాదృక్పథంతో విజయవాడ ప్రభుత్వ ఆసుపత్రిలో చేర్పించి వచ్చినట్టు సమాచారం. పరిసర ప్రాంత ప్రజలు ప్రయాణికులు పత్రికా మిత్రులకు కృతజ్ఞతలు తెలియపరుస్తూ ఇలాంటి సమస్యలపై మరింత మీరు సేవ చేయాలని కోరుకుంటూ హర్షం వ్యక్తం చేశారు.
    1
    ప్రజా ప్రెస్ క్లబ్ ప్రోద్బలం ప్రజా ప్రెస్ క్లబ్ సభ్యులు భారత్ న్యూస్, పత్రిక వార్త కథనానికి స్పందించిన 108 సిబ్బంది.

 ఎన్టీఆర్ జిల్లా
 ఇబ్రహీంపట్నం, జులై, 29, 


 ఇబ్రహీంపట్నం హైదరాబాద్ వెళ్ళు జాతీయ రహదారిలో బస్ స్టాప్ లో గత కొద్ది రోజులుగా ఒక వృద్ధుడు అనాధగా కాలికి గాయమై కాలికి చీ మీ ఇన్ఫెక్షన్ వచ్చి కాలు అంతా తినేసి దుర్వాసన కొడుతూ ప్రయాణికులకు ఇబ్బందికరంగా ఉండటాన్ని గమనించిన ప్రజాప్రస్ క్లబ్ పత్రికా మిత్రులు స్పందించి వారి వార్త కథనంతో 108 సిబ్బంది ఎమర్జెన్సీ మెడికల్ ఫస్ట్ ఎయిడ్ చేసి పి వెంకట శివ, సురేష్ గోపి లు మానవతాదృక్పథంతో విజయవాడ ప్రభుత్వ ఆసుపత్రిలో చేర్పించి వచ్చినట్టు సమాచారం. పరిసర ప్రాంత ప్రజలు ప్రయాణికులు పత్రికా మిత్రులకు కృతజ్ఞతలు తెలియపరుస్తూ ఇలాంటి సమస్యలపై మరింత మీరు సేవ చేయాలని కోరుకుంటూ హర్షం వ్యక్తం చేశారు.
    user_పల్లె నరేష్
    పల్లె నరేష్
    ఇబ్రహీంపట్నం, ఎన్టీఆర్, ఆంధ్రప్రదేశ్•
    1 hr ago
View latest news on Shuru App
Download_Android
  • Terms & Conditions
  • Career
  • Privacy Policy
  • Blogs
Shuru, a product of Close App Private Limited.