కరీంనగర్ లో ఆర్టీసీ సమ్మె ఎఫెక్ట్...అదుపుతప్పి లారీని ఢీ కొట్టిన అద్దెబస్సు... ఆరుగురికి గాయాలు. ఆర్టీసీ సమ్మె కరీంనగర్ లో బస్సు ప్రమాదానికి దారి తీసింది. డ్రైవర్ టిక్కెట్ ఇస్తూ డ్రైవింగ్ చేయగా అదుపుతప్పిన బస్సు లారీని ఢీ కొట్టింది. బస్సులో ప్రయాణిస్తున్న ఆరుగురి కి గాయాలయ్యాయి వెంటనే స్థానికులు ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. ఆర్టీసీ ఉద్యోగులు సమ్మె చేస్తుండగా అద్దె బస్సులను నడిపిస్తున్నారు. కరీంనగర్ టు డిపోకు చెందిన ఆర్టీసీ అద్దె బస్సు నిజామాబాద్ నుంచి కరీంనగర్ మీదుగా వరంగల్ కు వెళ్తుండగా కరీంనగర్ లోని ఎన్టీఆర్ విగ్రహం వద్ద అదుపుతప్పి లారీని ఢీకొట్టింది. లారీ ముందు భాగం నుజ్జునుజ్జు కావడంతో ముందు సీట్లో ఉన్న ఆరుగురికి స్వల్ప గాయాలయ్యాయి. కండక్టర్ లేకుండా అద్దె బస్సులో డ్రైవర్ టిమ్స్ మిషన్ ద్వారా టిక్కెట్లు ఇస్తూ డ్రైవింగ్ చేస్తుండగా బస్సు అదుపుతప్పి లారీని ఢీకొట్టింది. ప్రమాదానికి ఆర్టీసీ యాజమాన్యం నిర్లక్ష్యమే కారణమని కార్మికులు ఆరోపించారు. ఆర్టీసీ ఉద్యోగులు సమ్మె చేస్తుండగా అద్దె బస్సులు నడుపుతూ ఇబ్బందులకు గురిచేయడం సమంజసం కాదన్నారు.
కరీంనగర్ లో ఆర్టీసీ సమ్మె ఎఫెక్ట్...అదుపుతప్పి లారీని ఢీ కొట్టిన అద్దెబస్సు... ఆరుగురికి గాయాలు. ఆర్టీసీ సమ్మె కరీంనగర్ లో బస్సు ప్రమాదానికి దారి తీసింది. డ్రైవర్ టిక్కెట్ ఇస్తూ డ్రైవింగ్ చేయగా అదుపుతప్పిన బస్సు లారీని ఢీ కొట్టింది. బస్సులో ప్రయాణిస్తున్న ఆరుగురి కి గాయాలయ్యాయి వెంటనే స్థానికులు ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు.
ఆర్టీసీ ఉద్యోగులు సమ్మె చేస్తుండగా అద్దె బస్సులను నడిపిస్తున్నారు. కరీంనగర్ టు డిపోకు చెందిన ఆర్టీసీ అద్దె బస్సు నిజామాబాద్ నుంచి కరీంనగర్ మీదుగా వరంగల్ కు వెళ్తుండగా కరీంనగర్ లోని ఎన్టీఆర్ విగ్రహం వద్ద అదుపుతప్పి లారీని ఢీకొట్టింది. లారీ ముందు భాగం నుజ్జునుజ్జు కావడంతో ముందు సీట్లో ఉన్న ఆరుగురికి
స్వల్ప గాయాలయ్యాయి. కండక్టర్ లేకుండా అద్దె బస్సులో డ్రైవర్ టిమ్స్ మిషన్ ద్వారా టిక్కెట్లు ఇస్తూ డ్రైవింగ్ చేస్తుండగా బస్సు అదుపుతప్పి లారీని ఢీకొట్టింది. ప్రమాదానికి ఆర్టీసీ యాజమాన్యం నిర్లక్ష్యమే కారణమని కార్మికులు ఆరోపించారు. ఆర్టీసీ ఉద్యోగులు సమ్మె చేస్తుండగా అద్దె బస్సులు నడుపుతూ ఇబ్బందులకు గురిచేయడం సమంజసం కాదన్నారు.
- కరీంనగర్ జిల్లా హుజూరాబాద్ శివారులో డంపింగ్ యార్డు రద్దు చేయాలని కోరుతూ బిజెపి నిర్వహించిన ఆందోళన స్వల్ప ఉద్రిక్తతకు దారి తీసింది. బిజేపి జిల్లా అధ్యక్షులు గంగాడి కృష్ణారెడ్డి ఆద్వర్యంలో బైక్ ర్యాలీ నిర్వహించి అంబేద్కర్ చౌరస్తాలో ధర్నా రాస్తారోకో చేపట్టారు. డంపింగ్ యార్డు ను రద్దు చేయాలని వరంగల్ - కరీంనగర్ జాతీయ రహదారిపై పై బైఠాయించారు. ప్రభుత్వానికి వ్యతిరేకంగా డంపింగ్ యార్డు రద్దు చేయాలంటూ నినాదాలు చేశారు. సిఎం రేవంత్ రెడ్డి దిష్టిబొమ్మ దగ్ధం చేశారు. దీంతో వరంగల్ - కరీంనగర్ జాతీయ రహదారిపై ట్రాఫిక్ కు అంతరాయం ఏర్పడడంతో పోలీసులు బిజెపి శ్రేణులకు సముదాయించిన ఆందోళన విరమించకపోవడంతో పోలీసులకు బిజెపి కార్యకర్తల మధ్య తోపులాట జరిగి స్వల్ప ఉద్రిక్తతకు దారి తీసింది. చివరకు పోలీసులు బిజేపి జిల్లా అధ్యక్షుడితో సహా పలువురిని అరెస్టు చేసి స్టేషన్ కు తరలించారు. ట్రాఫిక్ ను క్లియర్ చేశారు.1
- బెజ్జంకి మండలంలోని గుండారం ప్రాథమిక పాఠశాలలో బుధవారం UKG విద్యార్థులకు గ్రాడ్యుయేషన్ డే వేడుకలు ఘనంగా నిర్వహించారు. ప్రధానోపాధ్యాయులు ఉండ్రాళ్ల తిరుపతి అధ్యక్షతన జరిగిన ఈ కార్యక్రమంలో చిన్నారులు ఉత్సాహంగా పాల్గొన్నారు. ప్రభుత్వ పాఠశాలలో ఇలాంటి కార్యక్రమం అరుదని ఆయన పేర్కొన్నారు. పాఠశాలలో నాణ్యమైన విద్యతో పాటు వినూత్న కార్యక్రమాలు నిర్వహిస్తున్నామని తెలిపారు. ఉపాధ్యాయులు జంగోని శ్రీనివాస్, శిరీష, హరీష పాల్గొన్నారు. తల్లిదండ్రులు అధిక సంఖ్యలో హాజరయ్యారు.1
- కరీంనగర్ లోని కోతి రాంపూర్ బైపాస్ రోడ్డు వద్ద బుధవారం ప్రమాదం చోటుచేసుకుంది. వేగంగా వెళ్తున్న ఆర్టీసీ బస్సు అదుపుతప్పి రోడ్డు మధ్యలోని డివైడర్‌ను బలంగా ఢీకొట్టింది. ఈ ఘటనలో బస్సు ముందుభాగం పూర్తిగా ధ్వంసం కాగా, పలువురు ప్రయాణికులకు స్వల్ప గాయాలయ్యాయి. గమనించిన స్థానికులు వెంటనే స్పందించి ప్రయాణికులను సురక్షితంగా కిందకు దించారు. పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.1
- కాళేశ్వరం ప్రాజెక్టు విషయంలో జస్టిస్ పీసీ ఘోష్ నివేదికపై హైకోర్టు తీర్పును స్వాగతిస్తూ కరీంనగర్ లో బి ఆర్ ఎస్ శ్రేణులు సంబరాలు నిర్వహించాయి. నగరంలోని తెలంగాణ చౌక్ లో టపాసులు కాల్చి స్వీట్లు పంచిపెట్టారు. హై కోర్టు తీర్పు కాంగ్రెస్ ప్రభుత్వానికి చెంపపెట్టులాంటిదని ఈ సందర్భంగా నేతలు పేర్కొన్నారు. రేవంత్ రెడ్డి కుట్ర పూరితంగా ఏర్పాటు చేసిన పీసీ ఘోష్ నివేదిక అంతా తప్పుల తడకగా భావించి తొలి సీఎం కేసీఆర్, మాజీ మంత్రి హరీష్ రావులపై ఎలాంటి చర్యలు తీసుకోవద్దని హై కోర్టు తీర్పు ఇచ్చిందన్నారు. హై కోర్టు తీర్పు ప్రభుత్వానికి వ్యతిరేకంగా వస్తుందనే భావనతో రెండున్నరేళ్లుగా కాళేశ్వరం ప్రాజెక్టును పట్టించుకొని రేవంత్ రెడ్డి రిపేరింగ్ పేరిట హడావుడి చేశారని అన్నారు.1
- జగిత్యాల జిల్లా..... RTC నాయకులు, ప్రభుత్వ అధికారుల మధ్య నిన్న జరిగిన చర్చలు విఫలం..... సమ్మె యధాతథంగా కొనసాగుతుందని ప్రకటించిన RTC JAC..... కోరుట్ల, మెట్టుపల్లి పట్టణాల్లో డిపోలకే పరిమితమైన RTC బస్సులు.1
- ఎల్లారెడ్డి పేట మండల కేంద్రంలోని పాత బస్ స్టాండ్ సమీపంలో మల్లికార్జున్ కార్గే దిష్టి బొమ్మను దగ్గదం చేసిన బీజేపీ నాయకులు. ప్రధానమంత్రి నరేంద్ర మోడీ పై కాంగ్రెస్ పార్టీ ప్రధాన కార్యదర్శి మల్లికార్జున్ కార్గే చేసిన వ్యాఖ్యలు తీవ్ర వివాదానికి దారితీశాయి. ఖర్గే ప్రధాని మోదీని టెర్రరిస్టుగా వ్యాఖ్యానించడాన్ని తీవ్రంగా ఖండిస్తూ ఎల్లారెడ్డిపేట మండల బీజేపీ నాయకులు ఆందోళనకు దిగారు.ఈ సందర్భంగా పాత బస్టాండ్ వద్ద ఖర్గే దిష్టిబొమ్మను దగ్ధం చేసి తమ నిరసనను వ్యక్తం చేశారు.మండల అధ్యక్షుడు రేపాక రామచంద్రం ఆధ్వర్యంలో జరిగిన ఈ కార్యక్రమంలో పలువురు బీజేపీ నాయకులు, కార్యకర్తలు పెద్ద ఎత్తున పాల్గొన్నారు.ఈ సందర్భంగా బీజేపీ నేతలు మాట్లాడుతూ… దేశ ప్రధానమంత్రిపై ఇలాంటి వ్యాఖ్యలు చేయడం చాలా దురదృష్టకరమని, కాంగ్రెస్ పార్టీ వెంటనే క్షమాపణ చెప్పాలని డిమాండ్ చేశారు.ఇలాంటి వ్యాఖ్యలు దేశ రాజకీయ విలువలను దెబ్బతీస్తాయని ఆగ్రహం వ్యక్తం చేశారు.1
- వరంగల్:వరంగల్ నగరంలోని ఎంజీఎం సర్కిల్ వద్ద కానిస్టేబుల్ సంగీత మృతదేహంతో కుటుంబ సభ్యులు నిరసన తెలిపారు. పోలీస్ శాఖలోనే మహిళా కానిస్టేబుళ్లకు రక్షణ కరువైందని వారు ఆవేదన వ్యక్తం చేశారు. ఈ ఘటనల నేపథ్యంలో శాంతి భద్రతల నిర్వహణలో ప్రభుత్వం విఫలమైందని, పోలీస్ వ్యవస్థలో మహిళల భద్రతపై ప్రశ్నలు తలెత్తుతున్నాయని బీజేపీ వరంగల్ జిల్లా అధ్యక్షుడు గంట రవికుమార్ విమర్శించారు.1
- ఆర్టీసీ ఉద్యోగుల సమ్మెకు ఉమ్మడి కరీంనగర్ జిల్లాలో మిశ్రమ స్పందన లభించింది. పలుచోట్ల అద్దె బస్సులను అడ్డుకునేందుకు ఆర్టీసీ ఉద్యోగులు ప్రయత్నించడంతో స్వల్ప ఉద్రతకు దారి తీసింది. అర్థరాత్రి నుంచి ఆర్టీసీ కార్మికులు సమ్మెకు దిగారు. వేకువజాము నుంచే ఆర్టీసి ఉద్యోగులు రోడ్లపైకి వచ్చి బస్సులు డిపోల నుంచి బయటకు వెళ్ళకుండా అడ్డుకున్నారు. విధులను బహిష్కరించి సమ్మె బాట పట్టిన ఉద్యోగులు డిపోల ముందు నిరసన ఆందోళనకు దిగారు. దీంతో ఉదయం 9 గంటల వరకు డిపోలకే బస్సులు పరిమితమయ్యాయి. ఉమ్మడి జిల్లాలోని 11 డిపోలలో 920 బస్సులు ఉండగా 450 బస్సులు నడిచాయని అధికారులు ప్రకటించారు. 414 అద్దె బస్సులతోపాటు 36 ఆర్టీసీ బస్సులు నడిచాయని తెలిపారు. సమ్మేలో 3236 మంది ఉద్యోగులు పాల్గొన్నారు. అద్దె బస్సులో డ్రైవర్లకే టికెట్లు ఇచ్చే అవకాశం కల్పించి బస్సులు నడిపించడాన్ని నిరసిస్తూ ఆర్టిసి ఉద్యోగులు ఆందోళన వ్యక్తం చేశారు. సమ్మె ప్రభావం లేకుండా ఉండేందుకు అధికారులు పోలీసులు పకడ్బందీ చర్యలు చేపట్టారు. డిమాండ్ లు పరిష్కారం అయ్యే వరకు సమ్మె కొనసాగిస్తామని కార్మిక సంఘాల జేఏసీ ప్రతినిధులు హెచ్చరించారు. ఆర్టీసీ సమ్మెతో పూర్తి స్థాయిలో బస్సులు నడవక, ఆరకొర బస్సులతో ప్రయాణికులు ఇబ్బందులు ఎదుర్కొన్నారు. ఉద్యోగుల సమస్య సత్వరమే పరిష్కరించి ప్రయాణీకుల ఇక్కట్లను తొలగించాలని ప్రయాణీకులు కోరారు.4