Shuru
Apke Nagar Ki App…
RFCL ప్రధాన కార్యాలయాన్ని రామగుండంకు తరలించాలని ఎంపీ బలరాం నాయక్ డిమాండ్ మహబూబాబాద్ జిల్లా:రామగుండం ఫెర్టిలైజర్స్ అండ్ కెమికల్స్ లిమిటెడ్ (RFCL) ప్రధాన కార్యాలయాన్ని నోయిడా నుంచి రామగుండంకు తక్షణమే తరలించాలని మహబూబాబాద్ ఎంపీ బలరాం నాయక్ లోకసభలో డిమాండ్ చేశారు. 2021లో ఉత్పత్తి ప్రారంభించిన ఈ ప్లాంటు 12.7 లక్షల మెట్రిక్ టన్నుల యూరియా ఉత్పత్తి లక్ష్యంతో పనిచేస్తోందని తెలిపారు. RFCL కేవలం ఎరువుల కర్మాగారం మాత్రమే కాదని, తెలంగాణ రైతుల ఆశలకు ప్రతీకగా, ఈ ప్రాంత అభివృద్ధికి మూలస్థంభంగా ఉందని ఆయన పేర్కొన్నారు.
M D Azizuddin
RFCL ప్రధాన కార్యాలయాన్ని రామగుండంకు తరలించాలని ఎంపీ బలరాం నాయక్ డిమాండ్ మహబూబాబాద్ జిల్లా:రామగుండం ఫెర్టిలైజర్స్ అండ్ కెమికల్స్ లిమిటెడ్ (RFCL) ప్రధాన కార్యాలయాన్ని నోయిడా నుంచి రామగుండంకు తక్షణమే తరలించాలని మహబూబాబాద్ ఎంపీ బలరాం నాయక్ లోకసభలో డిమాండ్ చేశారు. 2021లో ఉత్పత్తి ప్రారంభించిన ఈ ప్లాంటు 12.7 లక్షల మెట్రిక్ టన్నుల యూరియా ఉత్పత్తి లక్ష్యంతో పనిచేస్తోందని తెలిపారు. RFCL కేవలం ఎరువుల కర్మాగారం మాత్రమే కాదని, తెలంగాణ రైతుల ఆశలకు ప్రతీకగా, ఈ ప్రాంత అభివృద్ధికి మూలస్థంభంగా ఉందని ఆయన పేర్కొన్నారు.
More news from తెలంగాణ and nearby areas
- మహబూబాబాద్ జిల్లా, కురవి మండలం: రోడ్డు ప్రమాదాలను తగ్గించాలనే లక్ష్యంతో మహబూబాబాద్ జిల్లా ఎస్పీ డాక్టర్ శబరీష్ పిలుపుకు స్పందించిన తిర్మలాపురం గ్రామ ప్రజలు ఆదర్శప్రాయ నిర్ణయం తీసుకున్నారు. హెల్మెట్ ధరించని ద్విచక్ర వాహనదారులకు గ్రామంలోకి అనుమతి ఇవ్వబోమని గ్రామస్థులు ఏకగ్రీవంగా తీర్మానం చేశారు. ఈ నిర్ణయాన్ని ప్రజలకు తెలియజేసేందుకు గ్రామ ప్రవేశద్వారంలో ప్రత్యేక స్వాగత ఆర్చ్‌ను ఏర్పాటు చేశారు. హెల్మెట్ అవసరాన్ని వివరించే సందేశాలతో రూపొందించిన ఈ స్వాగత ద్వారం ప్రస్తుతం అందరి దృష్టిని ఆకర్షిస్తూ, భద్రతపై అవగాహన కల్పిస్తోంది. ఈ కార్యక్రమాన్ని మహబూబాబాద్ రూరల్ సీఐ అంజలి, కురవి ఎస్ఐ గండ్రాతి సతీష్ పరిశీలించారు. అనంతరం మహబూబాబాద్ డీఎస్పీ తిరుపతిరావు గ్రామాన్ని సందర్శించి, హెల్మెట్ ధరించిన ద్విచక్ర వాహనదారులను అభినందించారు. తిర్మలాపురం గ్రామప్రజలను, కురవి ఎస్ఐ గండ్రాతి సతీష్‌ను ప్రత్యేకంగా ప్రశంసించిన మహబూబాబాద్ డీఎస్పీ తిరుపతిరావు, రోడ్డు భద్రతపై చూపిన చొరవ ఇతర గ్రామాలకు ఆదర్శంగా నిలుస్తుందని తెలిపారు.1
- భూగర్భజలాలు అడుగంటి సాగునీరు అందక జగిత్యాల కొడిమ్యాల మండలం తిరుమలాపూర్ లో చేతికందే దశలో ఉన్న పంటలు ఎండిపోతున్నాయి. ఎండుతున్న పంటలను చూసి రైతన్నలు ఆవేదనతో ఆందోళన చెందుతున్నారు. పశువులకు మేతగా పచ్చటి పొలాలను వదిలేయాల్సిన పరిస్థితి ఏర్పడింది. బావులు పూర్తిగా ఎండిపోవడం, వేసిన బోర్లు కూడా వట్టి పోవడంతో పంటలు ఎండిపోతున్నాయి. ఆరుగాలం శ్రమించి పండించిన పంటలను కాపాడలేక, చివరికి పశువులకు మేతకు వదిలేయాల్సిన పరిస్థితి ఏర్పడింది. గ్రామానికి అతి సమీపంలో పోతారం రిజర్వాయర్ ఉన్నప్పటికీ, సాగునీరు అందకపోవడం రైతులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. గత ప్రభుత్వం కుడి-ఎడమ కాలువల పనులు పూర్తి చేసి నీరు అందిస్తామని హామీ ఇచ్చిందని, కానీ అవి అమలు కాలేదని రైతులు తెలిపారు. భూ నిర్వాసితులకు కూడా పూర్తిస్థాయిలో నష్టపరిహారం అందలేదని వాపోతున్నారు. తదుపరి ఎన్నికల సమయంలో ప్రస్తుత ఎమ్మెల్యే ఇచ్చిన హామీలు కూడా నెరవేర్చలేదని గ్రామస్తులు ఆరోపిస్తున్నారు. పలుమార్లు విన్నవించినా చర్యలు తీసుకోలేదని అసంతృప్తి వ్యక్తం చేస్తున్నారు. ఇప్పటికైనా సంబంధిత అధికారులు స్పందించి కుడి-ఎడమ కాలువల పనులను త్వరితగతిన ప్రారంభించి రైతులకు సాగునీరు అందించాలని కోరుతున్నారు.4
- Post by Tagore3
- *నల్లగొండ మున్సిపల్ కార్పొరేషన్ లోని 32వ డివిజన్ శ్రీనగర్ కాలనీ పార్క్ లో జరిగిన ప్రజా పాలన- ప్రగతి ప్రణాళిక 99 రోజుల యాక్షన్ ప్లాన్ వార్డు సభలో పాల్గొని ప్రసంగించిన శ్రీమతి మేయర్ బుర్రి చైతన్య శ్రీనివాసరెడ్డి గారు* *ఈ కార్యక్రమంలో మాజీ మున్సిపల్ చైర్మన్ బుర్రి శ్రీనివాస్ రెడ్డి,మున్సిపల్ సిబ్బంది పాల్గొన్నారు*1
- రాజన్న సిరిసిల్ల జిల్లా వేములవాడలోని శ్రీ రాజరాజేశ్వర స్వామి దేవస్థానం పరిధిలో తిప్పాపురంలో ఉన్న గోశాలను ఆలయ ఈవో రమాదేవి ఆకస్మికంగా తనిఖీ చేశారు.గోశాలకు వచ్చే డీసీఎం వాహనంలో లోడ్ చేసి తీసుకువచ్చిన Heritage Bypass Cattle Feed బ్యాగులను పరిశీలించారు. అందులోని కొన్ని బ్యాగులను తెరిపించి, అందులో ఉన్న పశుగ్రాసాన్ని స్వయంగా చేతులతో తీసి కోడెలకు పెట్టి అవి తింటున్నాయా లేదా, ఆహార నాణ్యత ఎలా ఉందో ప్రత్యక్షంగా పరిశీలించారు.కోడెలకు అందించే ఆహారంలో ఎలాంటి లోపాలు ఉండకూడదని, వాటి సంరక్షణలో నిర్లక్ష్యం చోటు చేసుకోకూడదని అధికారులకు, సిబ్బందికి ఈవో సూచనలు చేశారు. గోశాలలోని షెడ్లు, ఇతర సౌకర్యాలు మరియు వివిధ ప్రాంతాలను కూడా పరిశీలించారు.అలాగే కోడెల నుంచి వచ్చే పెండను ఉపయోగించి బయోగ్యాస్ ఉత్పత్తి జరుగుతుందా లేదా అనే విషయాన్ని కూడా ఈవో తెలుసుకున్నారు.ఈ తనిఖీ సందర్భంగా పరివేక్షకులు విజయ్, జూనియర్ అసిస్టెంట్ గొట్టం రవి మరియు గోశాల సిబ్బంది పాల్గొన్నారు.1
- ములకలకాలువ గ్రామ సభ1
- ఉమ్మడి వరంగల్‌లో అభివృద్ధి వేగం పెరుగుతుందన్న అధికారుల వాదనల మధ్య, కాగ్ నివేదికలో పలు భారీ లోపాలు బయటపడ్డాయి. నిధుల దుర్వినియోగం, ప్రాజెక్టుల ఆలస్యం, శాఖల నిర్లక్ష్యం అభివృద్ధిని నెమ్మదింపజేస్తున్నాయని నివేదిక పేర్కొంది. గ్రేటర్ వరంగల్‌లో అమృత్ నిధులను ఇతర పనులకు మళ్లించి రూ.21.30 కోట్లు ఖర్చు చేసినట్లు గుర్తించగా, వజ్ర బస్సుల వల్ల రూ.22.04 కోట్ల నష్టం జరిగినట్లు కాగ్ వెల్లడించింది.1
- పౌర్ణమి రోజున, చిన్న హనుమాన్ జయంతి సందర్భంగా కొండగట్టులో గిరి ప్రదక్షిణ వైభవంగా సాగింది. సురేష్ ఆత్మారామ్ ఆద్వర్యంలో 39వ సారి గిరిప్రదక్షిణ కన్నులపండువలా నిర్వహించారు. కొండగట్టు దిగువ ప్రారంభమైన గిరిప్రదక్షిణ రెండున్నర కిలోమీటర్లు ఘాట్ రోడ్డు మీదుగా టెంపుల్ వై జంక్షన్ వరకు అక్కడి నుంచి ఫారెస్ట్ ఏరియా లో ఐదు కిలోమీటర్లు సాగింది. సరైన దారి లేకపోయినా రాళ్ళు రప్పల మద్య పది వేల మంది భక్తులు గిరిప్రదక్షిణలో పాల్గొన్నారు. దారి మధ్యలో సీతమ్మ వారి భావి వద్ద భక్తులు పవిత్ర జలాన్ని తలపై చల్లుకున్నారు. ఆ బావి నీళ్ళే నిత్యం ఆంజనేయస్వామి అభిషేకానికి భక్తుల తీర్థానికి వినియోగిస్తారు. రామలక్ష్మణ జానకి.. జై బోలో హనుమాన్ కి” , " జై శ్రీరామ్ " అనే నినాదాలతో కొండగట్టు మార్మోగింది. చిన్నా పెద్దా అనే తేడా లేకుండా మహిళలు, పురుషులు ఉత్సాహంగా పాల్గొని భక్తి పారవశ్యంలో మునిగిపోయారు. ఇదే రోజు చిన్న హనుమాన్ జయంతి కావడంతో అంజన్న దర్శనానికి స్వాములు వివిధ ప్రాంతాల నుంచి భారీ సంఖ్యలో తరలివచ్చారు. పౌర్ణమి రోజున హనుమాన్ జయంతి సందర్భంగా గిరిప్రదక్షిణ చేసిన భక్తులకు కోరిన కోర్కెలు తీరుతాయని భక్తుల ప్రగాఢ నమ్మకం. దాదాపు ఎనమిదిన్నర కిలోమీటర్లు సాగే గిరిప్రదక్షిణ సాగే దారిలో సౌకర్యాలు కల్పిస్తే అరుణాచలం కంటే అద్భుతమైన గిరి ప్రదక్షిణ కొండగట్టులో చేయవచ్చని భక్తుల అభిప్రాయపడ్డారు.4
- Post by Tagore1