logo
Shuru
Apke Nagar Ki App…
  • Latest News
  • News
  • Politics
  • Elections
  • Viral
  • Astrology
  • Horoscope in Hindi
  • Horoscope in English
  • Latest Political News
logo
Shuru
Apke Nagar Ki App…

అమలాపురం చెంచుగూడెం లో పాఠశాల భవనం నిర్మించాలనీ ఎంపీడీవో కు వినతి పత్రం - జవహర్ నాయక్ (గిరిజన ఉపాధ్యాయ సంఘం రాష్ట్ర అధ్యక్షుడు) నంద్యాల జిల్లా, ఆత్మకూరు డివిజన్ పరిధిలోని, అమలాపురం చెంచుగూడెంలో పాఠశాల భవనం నిర్మించాలని గిరిజన ఉపాధ్యాయ సంఘం రాష్ట్ర అధ్యక్షుడు జవహర్ నాయక్ కోరుతూ మంగళవారం ఆత్మకూరు పట్టణంలో మండల అభివృద్ధి అధికారి- పి.నాగేంద్రుడు కి కలిసి వినతి పత్రం ఇవ్వడం జరిగింది. ఈ సందర్భంగా గిరిజన ఉపాధ్యాయ సంఘం రాష్ట్ర అధ్యక్షుడు జవహర్ నాయక్ ఎంపీడీవో- పి.నాగేంద్రుడు కు విన్నవిస్తూ గత 30 సంవత్సరాల నుంచి అమలాపురం చెంచుగూడెంలో 50 కుటుంబాల చెంచు గిరిజనులు స్థిర నివాసం ఏర్పాటు చేసుకుని జీవనం కొనసాగిస్తున్నారని, .వారికి ప్రభుత్వం పక్కా గృహాలు నిర్మించి మంచినీటి సౌకర్యం, విద్యుత్ సౌకర్యం సిమెంట్ రోడ్లు అన్ని సౌకర్యాలు కల్పించిందని ఆయన అన్నారు. అక్కడ చదువుకునే చాలా మంది విద్యార్థులు ఉన్నారనీ, ప్రభుత్వం ఒక ఉపాధ్యాయురాలుని కూడా నియమించిందన్నారు. పది సెంట్లు పాఠశాల స్థలం కూడా ఉందనీ. కానీ పాఠశాల భవనం మాత్రం లేదనీ. చదువుతోనే గిరిజనుల అభివృద్ధి అని అన్నారు. ప్రభుత్వాలు మారుతున్నాయి కానీ గిరిజనుల తలరాతలు మాత్రం మారటం లేదనీ. ఎన్నికల సమయంలో మాత్రమే చెంచు గిరిజనులు గుర్తుకు వస్తారనీ ఆవేదన వ్యక్తం చేశారు. అమలాపురం చెంచుగూడెంలో పాఠశాల భవనం నిర్మించుటకు తగిన చర్యలు తీసుకోవాలని ఆయన కోరారు. ఈ కార్యక్రమంలో ఈరమ్మ, నాగరాజు, నరేష్ ‌, బయ్యన్న పాల్గొన్నారు.

2 hrs ago
user_Naga kanth
Naga kanth
బండి ఆత్మకూరు, నంద్యాల, ఆంధ్రప్రదేశ్•
2 hrs ago
3f56334e-6d4a-4d6c-8e69-03ace6b5f52a

అమలాపురం చెంచుగూడెం లో పాఠశాల భవనం నిర్మించాలనీ ఎంపీడీవో కు వినతి పత్రం - జవహర్ నాయక్ (గిరిజన ఉపాధ్యాయ సంఘం రాష్ట్ర అధ్యక్షుడు) నంద్యాల జిల్లా, ఆత్మకూరు డివిజన్ పరిధిలోని, అమలాపురం చెంచుగూడెంలో పాఠశాల భవనం నిర్మించాలని గిరిజన ఉపాధ్యాయ సంఘం రాష్ట్ర అధ్యక్షుడు జవహర్ నాయక్ కోరుతూ మంగళవారం ఆత్మకూరు పట్టణంలో మండల అభివృద్ధి అధికారి- పి.నాగేంద్రుడు కి కలిసి వినతి పత్రం ఇవ్వడం జరిగింది. ఈ సందర్భంగా గిరిజన ఉపాధ్యాయ సంఘం రాష్ట్ర అధ్యక్షుడు జవహర్ నాయక్ ఎంపీడీవో- పి.నాగేంద్రుడు కు విన్నవిస్తూ గత 30 సంవత్సరాల నుంచి అమలాపురం చెంచుగూడెంలో 50 కుటుంబాల చెంచు గిరిజనులు స్థిర నివాసం ఏర్పాటు చేసుకుని జీవనం కొనసాగిస్తున్నారని, .వారికి ప్రభుత్వం పక్కా గృహాలు నిర్మించి మంచినీటి సౌకర్యం, విద్యుత్ సౌకర్యం సిమెంట్ రోడ్లు అన్ని సౌకర్యాలు కల్పించిందని ఆయన అన్నారు. అక్కడ చదువుకునే చాలా మంది విద్యార్థులు ఉన్నారనీ, ప్రభుత్వం ఒక ఉపాధ్యాయురాలుని కూడా నియమించిందన్నారు. పది సెంట్లు పాఠశాల స్థలం కూడా ఉందనీ. కానీ పాఠశాల భవనం మాత్రం లేదనీ. చదువుతోనే గిరిజనుల అభివృద్ధి అని అన్నారు. ప్రభుత్వాలు మారుతున్నాయి కానీ గిరిజనుల తలరాతలు మాత్రం మారటం లేదనీ. ఎన్నికల సమయంలో మాత్రమే చెంచు గిరిజనులు గుర్తుకు వస్తారనీ ఆవేదన వ్యక్తం చేశారు. అమలాపురం చెంచుగూడెంలో పాఠశాల భవనం నిర్మించుటకు తగిన చర్యలు తీసుకోవాలని ఆయన కోరారు. ఈ కార్యక్రమంలో ఈరమ్మ, నాగరాజు, నరేష్ ‌, బయ్యన్న పాల్గొన్నారు.

More news from ఆంధ్రప్రదేశ్ and nearby areas
  • నంద్యాలకు చెందిన ప్రముఖ చిత్రకారుడు కళారత్న చింతలపల్లె కోటేష్ ప్రపంచ ధరిత్రి దినోత్సవం (ఎర్త్ డే )సందర్బంగా బాదంపప్పు బద్ద పై మైక్రో బ్రష్ ల తో వాటర్ కలర్ పెయింటిగ్స్ ద్వారా నలబై సూక్ష్మ చిత్రాలను ఒక గంటలో వేసి మంచి సందేశాన్ని ఇచ్చారు. ఈ చిత్రంలో భూమాత భూమిని కాపాడండి, పర్యావరణాన్ని రక్షించండి అంటూ చేతులు జోడిస్తూ వేదనతో వేడుకున్నట్లు, అలాగే వన్య ప్రాణులు చెట్లు లేక, ఆహారం లేక, నీటి కొరతతో అలమటించి పోయి భూమాతకు మొర పెట్టుకున్నట్లు, ఎండి పోయిన చెట్లు, నరికివేసిన చెట్లు, మనుషుల,జంతువుల కళే బరాలు వున్నట్లు, అలాగే నీటి బొట్టులో చెట్టు వున్నట్లు అంటే నీరును, చెట్లను కాపాడు కోవాలని అర్థం. ఇలా చిన్న బాదం పప్పు పై ఇన్ని సూక్ష్మ చిత్రాలను వేసానని తెలిపారు .ఈ సందర్బంగా కోటేష్ మాట్లాడుతూ సకల జీవరాశులకు భూమి నిలయం. కాని మానవులు తమ అవసరాల కోసం భూమికి హాని కలిగిస్తున్నారు. పర్యావరణంలో సమతుల్యం లేకనే భూమి అత్యంత వేడిమి వుంది. వాతావరణంలో మార్పు వచ్చింది. ప్రకృతి విలయతాండవం చేస్తుంది.. భూమి మీద దృష్టి పెట్టకుంటే భవిష్యత్ లో మరెన్నో ప్రమాదాలు జరుగుతాయి. మనిషి మనుగడకు ముప్పు వాటిల్లుతుంది.అందుకే ప్రతి ఒక్కరు బాధ్యతగా పర్యావరణాన్ని కాపాడుకోవాలి. నీటిని వృధా చేయకూడదు, విపరీతంగా చెట్లను పెంచాలి. పర్యావరణం పచ్చగా వుంటేనే భూమిలోని వేడి తగ్గి చల్ల బరుస్తుంది. ప్రతి జీవరాశికి భూమిలో నివసించే హక్కు వుంది. భూమి రక్షణ కొరకు ప్రతి ఒక్కరూ భాగస్వామి కావాలి. ప్రభుత్వం కూడా పర్యావరణంపై ప్రత్యేక దృష్టి పెట్టి ప్రజలకు అవగాహన కల్పించి భూమిని కాపాడుకోవాలని తెలియ చెప్పాలి . భూమి నుండి అన్ని అవసరాలు తీర్చుకొని మనం భూమిని కాపాడుకోలేక పోతున్నాము . నేను వేసిన ఈ బాదం పప్పు కూడా భూమినుండి వచ్చిందే. భూమి అంటే మనకు కావాలిసినది ఇచ్చే అక్షయపాత్ర.మన భూమిని చేయకు - మరు భూమి.అందరూ పర్యావరణాన్ని కాపాడుకొని భూమిని రక్షించు కొందాం అని పిలుపునిచ్చారు.
    1
    నంద్యాలకు చెందిన ప్రముఖ చిత్రకారుడు కళారత్న చింతలపల్లె కోటేష్ ప్రపంచ ధరిత్రి దినోత్సవం (ఎర్త్ డే )సందర్బంగా బాదంపప్పు బద్ద పై మైక్రో బ్రష్ ల తో వాటర్ కలర్ పెయింటిగ్స్ ద్వారా నలబై సూక్ష్మ చిత్రాలను ఒక గంటలో వేసి మంచి సందేశాన్ని ఇచ్చారు. ఈ చిత్రంలో భూమాత భూమిని కాపాడండి, పర్యావరణాన్ని రక్షించండి అంటూ చేతులు జోడిస్తూ వేదనతో వేడుకున్నట్లు, అలాగే వన్య ప్రాణులు చెట్లు లేక, ఆహారం లేక, నీటి కొరతతో అలమటించి పోయి భూమాతకు మొర పెట్టుకున్నట్లు, ఎండి పోయిన చెట్లు, నరికివేసిన చెట్లు, మనుషుల,జంతువుల కళే బరాలు వున్నట్లు, అలాగే నీటి బొట్టులో చెట్టు వున్నట్లు అంటే నీరును, చెట్లను కాపాడు కోవాలని అర్థం. ఇలా చిన్న బాదం పప్పు పై ఇన్ని సూక్ష్మ చిత్రాలను వేసానని తెలిపారు .ఈ సందర్బంగా కోటేష్ మాట్లాడుతూ సకల జీవరాశులకు భూమి నిలయం. కాని మానవులు తమ అవసరాల కోసం భూమికి హాని కలిగిస్తున్నారు. పర్యావరణంలో సమతుల్యం లేకనే భూమి అత్యంత వేడిమి వుంది. వాతావరణంలో మార్పు వచ్చింది. ప్రకృతి విలయతాండవం చేస్తుంది.. భూమి మీద దృష్టి పెట్టకుంటే భవిష్యత్ లో మరెన్నో ప్రమాదాలు జరుగుతాయి.  మనిషి మనుగడకు ముప్పు వాటిల్లుతుంది.అందుకే ప్రతి ఒక్కరు బాధ్యతగా పర్యావరణాన్ని కాపాడుకోవాలి. నీటిని వృధా చేయకూడదు, విపరీతంగా చెట్లను పెంచాలి. పర్యావరణం పచ్చగా వుంటేనే భూమిలోని వేడి తగ్గి చల్ల బరుస్తుంది. ప్రతి జీవరాశికి భూమిలో నివసించే హక్కు వుంది. భూమి రక్షణ కొరకు ప్రతి ఒక్కరూ భాగస్వామి కావాలి. ప్రభుత్వం కూడా పర్యావరణంపై ప్రత్యేక దృష్టి పెట్టి ప్రజలకు అవగాహన కల్పించి భూమిని కాపాడుకోవాలని తెలియ చెప్పాలి . భూమి నుండి అన్ని అవసరాలు తీర్చుకొని మనం భూమిని కాపాడుకోలేక పోతున్నాము . నేను వేసిన ఈ బాదం పప్పు కూడా భూమినుండి వచ్చిందే. భూమి అంటే మనకు కావాలిసినది ఇచ్చే అక్షయపాత్ర.మన భూమిని చేయకు - మరు భూమి.అందరూ పర్యావరణాన్ని కాపాడుకొని భూమిని రక్షించు కొందాం అని పిలుపునిచ్చారు.
    user_Naga kanth
    Naga kanth
    బండి ఆత్మకూరు, నంద్యాల, ఆంధ్రప్రదేశ్•
    3 hrs ago
  • చివరి ఆయకట్టు వరకు సాగునీరు అందించాలన్నదే లక్ష్యం అని శ్రీశైలం ఎమ్మెల్యే బుడ్డా రాజశేఖర రెడ్డి అన్నారు. మంగళవారం ఆత్మకూరు మండలం కరివేన చెరువు పంట కాలువ వద్ద " జలధార " కార్యక్రమంలో ఎమ్మెల్యే పాల్గొన్నారు. అనంతరం ఉపాధి హామీ కూలీలతో కలిసి పంట కాలువలో పూడికతీత, సాగునీటి కాలువలను శుభ్రం చేశారు.భావితరాలకు నీటి ఎద్దడి లేకుండా చేయాలన్నదే జలధార ధ్యేయం అన్నారు.చెరువుల పునరుద్ధరణతో వర్షపునీటిని వడిసిపట్టి రైతులకు అందిస్తామన్నారు.
    1
    చివరి ఆయకట్టు వరకు సాగునీరు అందించాలన్నదే లక్ష్యం అని శ్రీశైలం ఎమ్మెల్యే బుడ్డా రాజశేఖర రెడ్డి అన్నారు. మంగళవారం ఆత్మకూరు మండలం కరివేన చెరువు పంట కాలువ వద్ద " జలధార " కార్యక్రమంలో ఎమ్మెల్యే  పాల్గొన్నారు. అనంతరం ఉపాధి హామీ కూలీలతో కలిసి పంట కాలువలో పూడికతీత, సాగునీటి కాలువలను  శుభ్రం చేశారు.భావితరాలకు నీటి ఎద్దడి లేకుండా చేయాలన్నదే జలధార ధ్యేయం అన్నారు.చెరువుల పునరుద్ధరణతో  వర్షపునీటిని వడిసిపట్టి రైతులకు అందిస్తామన్నారు.
    user_Syed Rafi
    Syed Rafi
    Photographer మహానంది, నంద్యాల, ఆంధ్రప్రదేశ్•
    6 hrs ago
  • స్వల్పకాల వ్యవధిలోనే తక్కువ పెట్టుబడితో బంతిపూల సాగులో అధిక దిగుబడి సాధించవచ్చని వీపనగండ్లలో బంతిపూలు సాగు చేసిన రైతులు ఆశాభావం వ్యక్తం చేశారు. ఇతర పంటలతో పోలిస్తే బంతిపూల సాగుకు ఎకరాకు రూ.20 వేల నుంచి రూ.30 వేల వరకు పెట్టుబడి వస్తుందన్నారు. పంట దిగుబడిలో సరైన చర్యలు తీసుకుంటే ఎకరాకు రూ.50 వేల నుంచి రూ.70 వేల వరకు లాభాలు ఆర్జించవచ్చని పేర్కొంటున్నారు.
    1
    స్వల్పకాల వ్యవధిలోనే తక్కువ పెట్టుబడితో బంతిపూల సాగులో అధిక దిగుబడి సాధించవచ్చని వీపనగండ్లలో బంతిపూలు సాగు చేసిన రైతులు ఆశాభావం వ్యక్తం చేశారు. ఇతర పంటలతో పోలిస్తే బంతిపూల సాగుకు ఎకరాకు  రూ.20 వేల నుంచి రూ.30 వేల వరకు పెట్టుబడి వస్తుందన్నారు. పంట దిగుబడిలో సరైన చర్యలు తీసుకుంటే ఎకరాకు రూ.50 వేల నుంచి రూ.70 వేల వరకు లాభాలు ఆర్జించవచ్చని పేర్కొంటున్నారు.
    user_Dinesh Pedisela
    Dinesh Pedisela
    Local News Reporter జూపాడు బంగ్లా, నంద్యాల, ఆంధ్రప్రదేశ్•
    6 hrs ago
  • 2026-2027 విద్యా సంవత్సరానికి ఆంధ్ర ప్రదేశ్ ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా ఈ నెల 17 నుండి 23 వరకు ఏర్పాటు చేసిన"బడి పిలుస్తోంది" "విద్యార్థుల ఎన్రోల్మెంట్ డ్రైవ్"లో భాగంగా నందికొట్కూరు పట్టణంలోని స్థానిక బైరెడ్డి నగర్ జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాల ; కోట (బాలురు) ప్రధానోపాధ్యాయులు ; ఉపాధ్యాయులు మరియు విద్యార్థులు నేటి ఉదయ కాల సమయంలో బైరెడ్డి నగర్ కాలనీ నందు భారీ ఎత్తున ర్యాలీ నిర్వహించారు.. ఇందులో భాగంగా బైరెడ్డి నగర్ కాలనీలోని వీధుల గుండా రంగు రంగుల జెండాలు చేత బట్టి,విద్యకు ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా చేయబడుతున్న పథకాలు, విద్య ఆవశ్యకత తెలిపే బ్యానర్లు పట్టుకుని, పెద్ద ఎత్తున నినాదాలు చేస్తూ ర్యాలీ కొనసాగాంచారు.అనంతరం బైరెడ్డి నగర్ కూడలి లో మానవ హారంగా ఏర్పడి నినాదాలు చేశారు. ఈ సందర్భంగా కాలనీ లోని ఇళ్ల v వద్ద ప్రధానోపాధ్యాయులు కౌసల్యా బాయి మాట్లాడుతూ ప్రభుత్వ పాఠశాలల్లో సకల సౌకర్యాలు ఉన్నాయని,అత్యున్నత విద్యార్హతలు , అపార అనుభవం కలిగిన ఉపాధ్యాయులు ఉన్నారని కావున బడి ఈడు పిల్లలను ప్రభుత్వ బడిలో తప్పకుండా చేర్పించాలని తల్లి తండ్రులను కోరారు.* పాఠశాల ఫిజికల్ డైరెక్టర్ పెరుమాళ్ళ శ్రీనాథ్ నిర్వహణలో జరిగిన.ఈ ఎన్రోల్మెంట్ డ్రైవ్ ర్యాలీ లో పాఠశాప్రధానోపాధ్యాయురాలు కౌసల్యా బాయి, పాఠశాల ప్రథమ సహాయకులు సాలమ్మ , ఉపాధ్యాయినులు విజయ కుమారి, లలితమ్మ, లలిత కుమారి, సరోజిని దేవి, క్రాఫ్ట్ టీచర్ అనిత ఉపాధ్యాయులు వెంకట రమణ,ఈశ్వరయ్య, మల్లికార్జున రెడ్డి,వెంకటేశ్వర్లు, రామి రెడ్డి, నాగేశేషులు కంప్యూటర్ ఆపరేటర్ అజయ్ తదితరులు పాల్గొన్నారు.*
    1
    2026-2027 విద్యా సంవత్సరానికి ఆంధ్ర ప్రదేశ్ ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా ఈ నెల 17 నుండి 23 వరకు ఏర్పాటు చేసిన"బడి పిలుస్తోంది" "విద్యార్థుల ఎన్రోల్మెంట్ డ్రైవ్"లో భాగంగా నందికొట్కూరు పట్టణంలోని స్థానిక  బైరెడ్డి నగర్ జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాల ; కోట (బాలురు) ప్రధానోపాధ్యాయులు ; ఉపాధ్యాయులు మరియు  విద్యార్థులు నేటి ఉదయ కాల సమయంలో బైరెడ్డి నగర్ కాలనీ నందు భారీ ఎత్తున ర్యాలీ నిర్వహించారు.. ఇందులో భాగంగా బైరెడ్డి నగర్ కాలనీలోని వీధుల గుండా రంగు రంగుల జెండాలు చేత బట్టి,విద్యకు ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా చేయబడుతున్న పథకాలు, విద్య ఆవశ్యకత తెలిపే బ్యానర్లు పట్టుకుని, పెద్ద ఎత్తున నినాదాలు చేస్తూ ర్యాలీ కొనసాగాంచారు.అనంతరం బైరెడ్డి నగర్ కూడలి లో మానవ హారంగా ఏర్పడి నినాదాలు చేశారు. ఈ సందర్భంగా కాలనీ లోని ఇళ్ల v వద్ద ప్రధానోపాధ్యాయులు కౌసల్యా బాయి మాట్లాడుతూ ప్రభుత్వ పాఠశాలల్లో సకల సౌకర్యాలు ఉన్నాయని,అత్యున్నత విద్యార్హతలు , అపార అనుభవం కలిగిన ఉపాధ్యాయులు ఉన్నారని కావున బడి ఈడు పిల్లలను ప్రభుత్వ బడిలో తప్పకుండా చేర్పించాలని తల్లి తండ్రులను కోరారు.*
పాఠశాల ఫిజికల్ డైరెక్టర్ పెరుమాళ్ళ శ్రీనాథ్  నిర్వహణలో జరిగిన.ఈ ఎన్రోల్మెంట్ డ్రైవ్ ర్యాలీ లో పాఠశాప్రధానోపాధ్యాయురాలు కౌసల్యా బాయి, పాఠశాల ప్రథమ సహాయకులు సాలమ్మ , ఉపాధ్యాయినులు విజయ కుమారి, లలితమ్మ, లలిత కుమారి, సరోజిని దేవి, క్రాఫ్ట్ టీచర్ అనిత ఉపాధ్యాయులు వెంకట రమణ,ఈశ్వరయ్య, మల్లికార్జున రెడ్డి,వెంకటేశ్వర్లు, రామి రెడ్డి, నాగేశేషులు కంప్యూటర్ ఆపరేటర్ అజయ్ తదితరులు పాల్గొన్నారు.*
    user_Reporter
    Reporter
    Nandikotkur, Nandyal•
    10 hrs ago
  • పెద్దపెల్లి జిల్లా వీధి కుక్కల స్వైరవిహారం మరో పసి ప్రాణాన్ని బలితీసుకుంది. పెద్దపల్లి జిల్లా సుల్తానాబాద్ మండలం కాట్నపల్లిలో కుక్కల దాడిలో మూడేళ్ల చిన్నారి ప్రాణాలు కోల్పోయింది. తోటి పిల్లలతో ఆడుకుంటున్న సమయంలో కుక్కలు వెంటాడటంతో, భయంతో పొలం వైపు పరుగులు తీసిన చిన్నారిని కుక్కలు చుట్టుముట్టి చంపేశాయి. కాట్నపల్లిలోని BBI ఇటుక బట్టీ వద్ద ఒరిస్సాకు చెందిన వలస కార్మికులు సరస్వతి, భూబన్ దంపతులు నివాసముంటున్నారు. వీరికి మూడు సంవత్సరాల కుమార్తె దివ్య బెహరా ఉంది. ఈరోజు ఉదయం దివ్య మరో చిన్నారితో కలిసి ఆడుకుంటుండగా ఒక్కసారిగా కుక్కల మంద దాడి చేశాయి. భయపడిన మరో చిన్నారి ఇంటి వైపు పరిగెత్తి ప్రాణాలు దక్కించుకోగా, చిన్నారి దివ్య భయంతో పంట పొలాల వైపు పరుగులు తీసింది. దీంతో కుక్కలన్నీ బాలికను వెంబడించి చుట్టుముట్టాయి. ఒళ్లంతా పీక్కీతినడంతో బాలికకు తీవ్ర గాయాలయ్యాయి. గమనించిన తల్లిదండ్రులు వెంటనే సుల్తానాబాద్ ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. అయితే అప్పటికే చిన్నారి మృతి చెందినట్లు వైద్యులు ప్రకటించారు. కంటికి రెప్పలా కాపాడుకోవాల్సిన బిడ్డ, కళ్లముందే కుక్కల బారిన పడి విగతజీవిగా మారడంతో ఆ తల్లిదండ్రుల రోదనలు చూసి స్థానికులు కన్నీరు పెడుతున్నారు. జిల్లాలో కుక్కల బెడద విపరీతంగా పెరిగిపోయిందని, అధికారులు వెంటనే చర్యలు తీసుకోవాలని గ్రామస్తులు డిమాండ్ చేస్తున్నారు
    1
    పెద్దపెల్లి జిల్లా
వీధి కుక్కల స్వైరవిహారం మరో పసి ప్రాణాన్ని బలితీసుకుంది. పెద్దపల్లి జిల్లా సుల్తానాబాద్ మండలం కాట్నపల్లిలో కుక్కల దాడిలో మూడేళ్ల చిన్నారి ప్రాణాలు కోల్పోయింది. తోటి పిల్లలతో ఆడుకుంటున్న సమయంలో కుక్కలు వెంటాడటంతో, భయంతో పొలం వైపు పరుగులు తీసిన చిన్నారిని కుక్కలు చుట్టుముట్టి చంపేశాయి.
కాట్నపల్లిలోని BBI ఇటుక బట్టీ వద్ద ఒరిస్సాకు చెందిన వలస కార్మికులు సరస్వతి, భూబన్ దంపతులు నివాసముంటున్నారు. వీరికి మూడు సంవత్సరాల కుమార్తె దివ్య బెహరా ఉంది. ఈరోజు ఉదయం దివ్య మరో చిన్నారితో కలిసి ఆడుకుంటుండగా ఒక్కసారిగా కుక్కల మంద దాడి చేశాయి.
భయపడిన మరో చిన్నారి ఇంటి వైపు పరిగెత్తి ప్రాణాలు దక్కించుకోగా, చిన్నారి దివ్య భయంతో పంట పొలాల వైపు పరుగులు తీసింది. దీంతో కుక్కలన్నీ బాలికను వెంబడించి చుట్టుముట్టాయి. ఒళ్లంతా పీక్కీతినడంతో బాలికకు తీవ్ర గాయాలయ్యాయి. గమనించిన తల్లిదండ్రులు వెంటనే సుల్తానాబాద్ ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. అయితే అప్పటికే చిన్నారి మృతి చెందినట్లు వైద్యులు ప్రకటించారు. కంటికి రెప్పలా కాపాడుకోవాల్సిన బిడ్డ, కళ్లముందే కుక్కల బారిన పడి విగతజీవిగా మారడంతో ఆ తల్లిదండ్రుల రోదనలు చూసి స్థానికులు కన్నీరు పెడుతున్నారు. జిల్లాలో కుక్కల బెడద విపరీతంగా పెరిగిపోయిందని, అధికారులు వెంటనే చర్యలు తీసుకోవాలని గ్రామస్తులు డిమాండ్ చేస్తున్నారు
    user_Thiru goud
    Thiru goud
    పెద్దపల్లె, పెద్దపల్లి, తెలంగాణ•
    15 hrs ago
  • ప్రభుత్వ ఆసుపత్రుల్లో పేదలకు నాణ్యమైన వైద్యం అందాలని జిల్లా కలెక్టర్ బాదావత్ సంతోష్ పేర్కొన్నారు. మన్ననూరు పీహెచ్‌సీని సందర్శించిన ఆయన లేబర్ రూమ్, ల్యాబ్, మెడికల్ స్టోర్లను క్షుణ్ణంగా పరిశీలించారు. రికార్డుల నిర్వహణలో నిర్లక్ష్యం వహిస్తే చర్యలు తప్పవని హెచ్చరించారు. ఓపీ సంఖ్యను పెంచి, పరీక్షలు సక్రమంగా నిర్వహించాలని ఆదేశించారు. ఈ తనిఖీలో ఐటీడీఏ మేనేజర్ జాఫర్ హుస్సేన్ తదితరులు పాల్గొన్నారు.
    1
    ప్రభుత్వ ఆసుపత్రుల్లో పేదలకు నాణ్యమైన వైద్యం అందాలని జిల్లా కలెక్టర్ బాదావత్ సంతోష్ పేర్కొన్నారు. మన్ననూరు పీహెచ్‌సీని సందర్శించిన ఆయన లేబర్ రూమ్, ల్యాబ్, మెడికల్ స్టోర్లను క్షుణ్ణంగా పరిశీలించారు. రికార్డుల నిర్వహణలో నిర్లక్ష్యం వహిస్తే చర్యలు తప్పవని హెచ్చరించారు. ఓపీ సంఖ్యను పెంచి, పరీక్షలు సక్రమంగా నిర్వహించాలని ఆదేశించారు. ఈ తనిఖీలో ఐటీడీఏ మేనేజర్ జాఫర్ హుస్సేన్ తదితరులు పాల్గొన్నారు.
    user_MALLIKARJUN T
    MALLIKARJUN T
    Insurance Agent Nagarkurnool, Telangana•
    21 min ago
  • ధరూర్: తెలంగాణ రాష్ట్రంలో నూతన రాజకీయ శక్తిగా ఈ నెల 25న తెలంగాణ జాగృతి అధ్యక్షురాలు కల్వకుంట్ల కవిత గారు ఆవిర్భవించే నూతన రాజకీయ పార్టీ ఆవిర్భావ సభకు పెద్ద ఎత్తున కదలిరావాలని *నడిగడ్డ హక్కుల పోరాట సమితి ధరూర్ మండల అధ్యక్షుడు మరియు తెలంగాణ జాగృతి నాయకులు నెట్టెంపాడు గోవిందు పిలుపునిచ్చారు. మంగళవారం ధరూర్ మండల కేంద్రంలోని నడిగడ్డ హక్కుల పోరాట సమితి కార్యాలయంలో సమితి నాయకులతో కలిసి ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో నూతన రాజకీయ పార్టీ ఆవిర్భావ సభ గోడ పత్రికలను వారు విడుదల చేశారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ... తెలంగాణ గడ్డపై ప్రశ్నించే గొంతుకగా బడుగు,బలహీన వర్గాల కోసం, అమరుల ఆశయ సాధన కోసం తెలంగాణ జాగృతి అధ్యక్షురాలు శ్రీమతి కల్వకుంట్ల కవిత గారు కృషి చేస్తున్నారని వారు తెలిపారు. తెలంగాణ గడ్డపై రాబోయే రోజుల్లో నూతన రాజకీయ శక్తిగా పెద్ద ఎత్తున ఆవిర్భవించే సభకు ప్రజలు తరలిరావాలని కోరారు. ఈ కార్యక్రమంలో నడిగడ్డ హక్కుల పోరాట సమితి మరియు తెలంగాణ జాగృతి జిల్లా నాయకులు వెంకట్రాములు, మండల ఉపాధ్యక్షులు అడివి ఆంజనేయులు, మల్దకల్, మునెప్ప, ఆంజనేయులు,మండల కార్యదర్శి రాము, మండల నాయకులు వెంకటేష్, సుదర్శన్,శాంతన్న,వీరన్న, ఆంజనేయులు, గోవిందు,కృష్ణ,మద్దిలేటి,తదితరులు పాల్గొన్నారు.
    1
    ధరూర్: తెలంగాణ రాష్ట్రంలో నూతన రాజకీయ శక్తిగా ఈ నెల 25న తెలంగాణ జాగృతి అధ్యక్షురాలు కల్వకుంట్ల కవిత గారు ఆవిర్భవించే నూతన రాజకీయ పార్టీ ఆవిర్భావ సభకు పెద్ద ఎత్తున కదలిరావాలని *నడిగడ్డ హక్కుల పోరాట సమితి ధరూర్ మండల అధ్యక్షుడు మరియు తెలంగాణ జాగృతి నాయకులు నెట్టెంపాడు గోవిందు పిలుపునిచ్చారు. 
మంగళవారం ధరూర్ మండల కేంద్రంలోని నడిగడ్డ హక్కుల పోరాట సమితి కార్యాలయంలో సమితి నాయకులతో కలిసి ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో నూతన రాజకీయ పార్టీ ఆవిర్భావ సభ గోడ పత్రికలను వారు విడుదల చేశారు. 
ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ...
తెలంగాణ గడ్డపై ప్రశ్నించే గొంతుకగా బడుగు,బలహీన వర్గాల కోసం, అమరుల ఆశయ సాధన కోసం తెలంగాణ జాగృతి అధ్యక్షురాలు శ్రీమతి కల్వకుంట్ల కవిత గారు కృషి చేస్తున్నారని వారు తెలిపారు.
తెలంగాణ గడ్డపై రాబోయే రోజుల్లో నూతన రాజకీయ శక్తిగా పెద్ద ఎత్తున ఆవిర్భవించే సభకు ప్రజలు తరలిరావాలని కోరారు.
ఈ కార్యక్రమంలో నడిగడ్డ హక్కుల పోరాట సమితి మరియు తెలంగాణ జాగృతి జిల్లా నాయకులు వెంకట్రాములు, మండల ఉపాధ్యక్షులు అడివి ఆంజనేయులు, మల్దకల్, మునెప్ప, ఆంజనేయులు,మండల కార్యదర్శి రాము, మండల నాయకులు వెంకటేష్, సుదర్శన్,శాంతన్న,వీరన్న, ఆంజనేయులు, గోవిందు,కృష్ణ,మద్దిలేటి,తదితరులు పాల్గొన్నారు.
    user_Ram  Ram
    Ram Ram
    Journalist గద్వాల్, జోగులాంబ గద్వాల్, తెలంగాణ•
    7 hrs ago
  • నంద్యాల జిల్లా సంజామల మండలం రెడ్డిపల్లి దగ్గర రాంకో సిమెంట్ ఫ్యాక్టరీ గూడ్స్ రైలు ట్రాక్టర్ను ఢీకొంది. ఈ ప్రమాదంలో రైతు రామచంద్రారెడ్డికి తీవ్ర గాయాలవ్వగా, కోవెలకుంట్ల ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. బాధితుడి కుటుంబ సభ్యుల ఫిర్యాదు మేరకు పోలీసులు కేసు నమోదు చేశారు.
    1
    నంద్యాల జిల్లా సంజామల మండలం రెడ్డిపల్లి దగ్గర రాంకో సిమెంట్ ఫ్యాక్టరీ గూడ్స్ రైలు ట్రాక్టర్ను ఢీకొంది. ఈ ప్రమాదంలో రైతు రామచంద్రారెడ్డికి తీవ్ర గాయాలవ్వగా, కోవెలకుంట్ల ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. బాధితుడి కుటుంబ సభ్యుల ఫిర్యాదు మేరకు పోలీసులు కేసు నమోదు చేశారు.
    user_Naga kanth
    Naga kanth
    బండి ఆత్మకూరు, నంద్యాల, ఆంధ్రప్రదేశ్•
    10 hrs ago
View latest news on Shuru App
Download_Android
  • Terms & Conditions
  • Career
  • Privacy Policy
  • Blogs
Shuru, a product of Close App Private Limited.