Shuru
Apke Nagar Ki App…
ప్రసన్న కుమార్ రెడ్డి పై విరుచుకుపడ్డ తెలుగు యువత..... బుచ్చిరెడ్డిపాలెం లోని స్థానిక తెలుగుదేశం పార్టీ కార్యాలయంలో తెలుగు యువత నాయకులు విలేకరుల సమావేశం నిర్వహించారు. ఈ సమావేశంలో తెలుగు యువత నాయకులు మాట్లాడుతూ ప్రసన్న కుమార్ రెడ్డి విమర్శలు చేసే ముందు తన స్థితిని గుర్తు తెచ్చుకోవాలని అన్నారు. 2019లో వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి ఇంట్లో బాత్రూంలో కడిగే తమరు ఎమ్మెల్యే అయ్యారంటూ విమర్శించారు. ఎంపీ వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డిని మగాడివైతే అంటూ మాట్లాడడం సమన్యాసం కాదని అన్నారు. మగతనం అంటే మాటల్లో కాదు ప్రజలకు మంచి చేయడం అని విమర్శించారు. నెల్లూరు జిల్లా ప్రజలను ఎవరు అడిగినా వేమిరెడ్డి మనస్తత్వం ఏమిటో తెలుస్తుంది అని అన్నారు. అటువంటి వ్యక్తిని నోటికొచ్చినట్లు దూషించడం విమర్శించడం సరికాదని ఇకనైనా మాట్లాడేటప్పుడు ఒళ్ళు దగ్గర పెట్టుకోవాలని హెచ్చరించారు.
Shafi ahamed baig mogal
ప్రసన్న కుమార్ రెడ్డి పై విరుచుకుపడ్డ తెలుగు యువత..... బుచ్చిరెడ్డిపాలెం లోని స్థానిక తెలుగుదేశం పార్టీ కార్యాలయంలో తెలుగు యువత నాయకులు విలేకరుల సమావేశం నిర్వహించారు. ఈ సమావేశంలో తెలుగు యువత నాయకులు మాట్లాడుతూ ప్రసన్న కుమార్ రెడ్డి విమర్శలు చేసే ముందు తన స్థితిని గుర్తు తెచ్చుకోవాలని అన్నారు. 2019లో వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి ఇంట్లో బాత్రూంలో కడిగే తమరు ఎమ్మెల్యే అయ్యారంటూ విమర్శించారు. ఎంపీ వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డిని మగాడివైతే అంటూ మాట్లాడడం సమన్యాసం కాదని అన్నారు. మగతనం అంటే మాటల్లో కాదు ప్రజలకు మంచి చేయడం అని విమర్శించారు. నెల్లూరు జిల్లా ప్రజలను ఎవరు అడిగినా వేమిరెడ్డి మనస్తత్వం ఏమిటో తెలుస్తుంది అని అన్నారు. అటువంటి వ్యక్తిని నోటికొచ్చినట్లు దూషించడం విమర్శించడం సరికాదని ఇకనైనా మాట్లాడేటప్పుడు ఒళ్ళు దగ్గర పెట్టుకోవాలని హెచ్చరించారు.
More news from ఆంధ్రప్రదేశ్ and nearby areas
- డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ పుట్టినరోజు సందర్భంగా సీడ్ బాల్స్ పంపిణీ, మొక్కలు నాటే కార్యక్రమం బద్వేలు, సెప్టెంబర్ 02: ఆంధ్రప్రదేశ్ ఉప ముఖ్యమంత్రి మరియు అటవీ శాఖ మంత్రి శ్రీ కొణిదెల పవన్ కళ్యాణ్ గారి పుట్టినరోజు సందర్భంగా బద్వేలులో ఘనంగా మొక్కలు నాటే కార్యక్రమం నిర్వహించారు. బద్వేలు ఎఫ్.ఆర్.ఓ కె.ఎం. నయీమ్ అలీ ఆధ్వర్యంలో, వారి సిబ్బంది, శ్రీ లలితమ్మ ఆలయ కమిటీ చైర్మన్, కొత్త చెరువు గ్రామ పెద్దలు, బద్వేలు పబ్లిక్ స్కూల్, కొత్తవారిపేట ఉపాధ్యాయులు, విద్యార్థులతో కలిసి సీడ్ బాల్స్ (విత్తనపు ఉండలు) తయారీ మరియు తాటి విత్తనాలు నాటే కార్యక్రమాన్ని నిర్వహించారు. "తరగతి గదిలో ఒక చెట్టు" కార్యక్రమంలో భాగంగా విద్యార్థులందరినీ శ్రీ లలితమ్మ అభయకారిణి ఆలయం వద్దకు తీసుకెళ్లి తాటి చెట్ల ప్రాముఖ్యత, సీడ్ బాల్స్ తయారీ విధానం, వాటి వల్ల కలిగే ప్రయోజనాలు మరియు అడవుల పెంపకం ఆవశ్యకతపై క్లుప్తంగా వివరించారు. విద్యార్థులు, ప్రజలతో కలిసి ప్లాంటేషన్ కార్యక్రమాన్ని ఘనంగా నిర్వహించారు.3
- తిరుపతి తిరుపతిలోని డిప్యూటీవో లోకనాథం ఇంటిలో సోదాలు చేస్తున్న ఏసీబీ డీఎస్పీ శ్రీనివాస్ ప్రెస్ మీట్ పాయింట్స్ తిరుమల తిరుపతి దేవస్థానం (TTD) ఉద్యోగి మెండు లోకనాథం నివాసంతో పాటు ఆయన బంధువుల ఇళ్లపై ఏసీబీ అధికారులు సోదాలు నిర్వహిస్తున్నారు. ఆదాయానికి మించిన ఆస్తులు ఉన్నాయన్న సమాచారంతో నెల్లూరు ఏసీబీ కోర్టు నుంచి సెర్చ్ వారెంట్లు పొంది ఈ తనిఖీలు చేపట్టాము. జూనియర్ అసిస్టెంట్‌గా ఉద్యోగంలో చేరి ప్రస్తుతం డిప్యూటీ ఈఓగా పనిచేస్తున్న లోకనాథం ఆస్తులపై విచారణ సాగుతోంది. తిరుపతితో పాటు ఆయన బంధువులు, తమ్ముడి ఇళ్లతో సహా మొత్తం 5 ప్రాంతాల్లో ఏసీబీ బృందాలు తనిఖీలు చేస్తున్నాయి. విచారణలో భాగంగా లభించిన బంగారం, ఆస్తి పత్రాలు మరియు ఇతర పత్రాలను ఏసీబీ అధికారులు వెరిఫై చేస్తున్నారు. ప్రభుత్వ ఉద్యోగులు ఎవరైనా లంచం అడిగితే ప్రజలు వెంటనే 1064 టోల్ ఫ్రీ నెంబర్‌కు ఫిర్యాదు చేయాలని ఏసీబీ డీఎస్పీ కోరారు. ఏసీబీ అధికారులమని చెప్పి డబ్బులు వసూలు చేసే నకిలీ వ్యక్తుల మాటలు నమ్మవద్దని, అలా అడిగితే ఏసీబీ టోల్ ఫ్రీ కి కాల్ చేయాలని కోరిన డిఎస్పి తిరుపతి తిరుపతిలోని డిప్యూటీవో లోకనాథం ఇంటిలో సోదాలు చేస్తున్న ఏసీబీ డీఎస్పీ శ్రీనివాస్ ప్రెస్ మీట్ పాయింట్స్ తిరుమల తిరుపతి దేవస్థానం (TTD) ఉద్యోగి మెండు లోకనాథం నివాసంతో పాటు ఆయన బంధువుల ఇళ్లపై ఏసీబీ అధికారులు సోదాలు నిర్వహిస్తున్నారు. ఆదాయానికి మించిన ఆస్తులు ఉన్నాయన్న సమాచారంతో నెల్లూరు ఏసీబీ కోర్టు నుంచి సెర్చ్ వారెంట్లు పొంది ఈ తనిఖీలు చేపట్టాము. జూనియర్ అసిస్టెంట్‌గా ఉద్యోగంలో చేరి ప్రస్తుతం డిప్యూటీ ఈఓగా పనిచేస్తున్న లోకనాథం ఆస్తులపై విచారణ సాగుతోంది. తిరుపతితో పాటు ఆయన బంధువులు, తమ్ముడి ఇళ్లతో సహా మొత్తం 5 ప్రాంతాల్లో ఏసీబీ బృందాలు తనిఖీలు చేస్తున్నాయి. విచారణలో భాగంగా లభించిన బంగారం, ఆస్తి పత్రాలు మరియు ఇతర పత్రాలను ఏసీబీ అధికారులు వెరిఫై చేస్తున్నారు. ప్రభుత్వ ఉద్యోగులు ఎవరైనా లంచం అడిగితే ప్రజలు వెంటనే 1064 టోల్ ఫ్రీ నెంబర్‌కు ఫిర్యాదు చేయాలని ఏసీబీ డీఎస్పీ కోరారు. ఏసీబీ అధికారులమని చెప్పి డబ్బులు వసూలు చేసే నకిలీ వ్యక్తుల మాటలు నమ్మవద్దని, అలా అడిగితే ఏసీబీ టోల్ ఫ్రీ కి కాల్ చేయాలని కోరిన డిఎస్పి2
- ఉప్పరపల్లిలో ఘనంగా పవన్ కళ్యాణ్ జన్మదిన వేడుకలు సిద్ధవటం,సెప్టెంబర్ 02 సిద్ధవటం మండలం ఉప్పరపల్లెలోని ఎస్టీ కాలనీలో పేదల మధ్య ఏపీ డిప్యూటీ సీఎం, జనసేన అధినేత పవన్ కళ్యాణ్ జన్మదిన వేడుకలను బుధవారం ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా జనసేన రాష్ట్ర చేనేత వికాస కార్యదర్శి రాటాల రామయ్య పవన్ కళ్యాణ్ చిత్రపటానికి పాలాభిషేకం చేశారు. అనంతరం కాలనీలోని మహిళలకు చీరలు పంపిణీ చేశారు.ఈ సందర్భంగా రాటాల రామయ్య మాట్లాడుతూ.. పవన్ కళ్యాణ్ పేదలు, బడుగు బలహీన వర్గాల సంక్షేమం కోసం నిరంతరం కృషి చేస్తున్నారని అన్నారు. ప్రజా సేవే లక్ష్యంగా ముందుకు సాగుతున్న పవన్ కళ్యాణ్ కు ప్రతి ఒక్కరూ అండగా నిలవాలని కోరారు. ఆయన జన్మదినాన్ని పురస్కరించుకుని పేదలకు సేవా కార్యక్రమాలు నిర్వహించడం ఆనందంగా ఉందన్నారు. కార్యక్రమంలో జనసేన నాయకులు, కార్యకర్తలు, స్థానికులు పాల్గొన్నారు. ఉప్పరపల్లిలో ఘనంగా పవన్ కళ్యాణ్ జన్మదిన వేడుకలు సిద్ధవటం,సెప్టెంబర్ 02 సిద్ధవటం మండలం ఉప్పరపల్లెలోని ఎస్టీ కాలనీలో పేదల మధ్య ఏపీ డిప్యూటీ సీఎం, జనసేన అధినేత పవన్ కళ్యాణ్ జన్మదిన వేడుకలను బుధవారం ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా జనసేన రాష్ట్ర చేనేత వికాస కార్యదర్శి రాటాల రామయ్య పవన్ కళ్యాణ్ చిత్రపటానికి పాలాభిషేకం చేశారు. అనంతరం కాలనీలోని మహిళలకు చీరలు పంపిణీ చేశారు.ఈ సందర్భంగా రాటాల రామయ్య మాట్లాడుతూ.. పవన్ కళ్యాణ్ పేదలు, బడుగు బలహీన వర్గాల సంక్షేమం కోసం నిరంతరం కృషి చేస్తున్నారని అన్నారు. ప్రజా సేవే లక్ష్యంగా ముందుకు సాగుతున్న పవన్ కళ్యాణ్ కు ప్రతి ఒక్కరూ అండగా నిలవాలని కోరారు. ఆయన జన్మదినాన్ని పురస్కరించుకుని పేదలకు సేవా కార్యక్రమాలు నిర్వహించడం ఆనందంగా ఉందన్నారు. కార్యక్రమంలో జనసేన నాయకులు, కార్యకర్తలు, స్థానికులు పాల్గొన్నారు.1
- దర్శిలో కనిపిస్తున్న వింత వింత వాతావరణంతో తల పట్టుకుంటున్న ప్రజానీకం దర్శిలో వాతావరణం వింత వింతగా కనిపిస్తోంది. ఆకాశమంత నల్లటి కారు మబ్బులతో కూడుకొని ఉన్నది. రోడ్లపై ఎండ తీవ్రత మరోవైపు కనిపిస్తున్నది. వర్షాకాలం అయినప్పటికీ వర్షాలు పడకపోగా, ఇటువంటి వింత వింత విధానాలతో వాతావరణం కనిపిస్తుంది.1
- పవన్ కళ్యాణ్ జన్మదినం సందర్భంగా పీలేరు పట్టణంలో ర్యాలీ అనంతరం అన్న క్యాంటీన్లో పేదలకు ఉచిత భోజనం పీలేరు: అంగరంగ వైభవంగా డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ గారి జన్మదిన వేడుకలు. పీలేరులో ఘనంగా డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ జన్మదిన వేడుకలుజరిగాయి. భారీ బైక్ ర్యాలీ ,ప్రత్యేక పూజలు, అన్నదాన కార్యక్రమం ఏర్పాటుచేశారు. జనసేన పార్టీ అధినేత రాష్ట్ర ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ జన్మదిన వేడుకలు పీలేరు జనసేన పార్టీ ఇంచార్జ్ బెజవాడ దినేష్ ఆధ్వర్యంలో ఘనంగా నిర్వహించారు. పీలేరులో జనసేన కార్యకర్తలు ఉదయం 6 గంటలకు ఆలయానికి వెళ్లి పవన్ కళ్యాణ్ పేరున ప్రత్యేక పూజలు అర్చనలు చేశారు. అనంతరం పీలేరు HP పెట్రోల్ బంక్ నుండి యల్లమంద cross వరకు జనసేనకులతో భారీ బైక్ ర్యాలీ నిర్వహించారు. అనంతరం మార్కెట్ యార్డులో ప్రత్యకంగా ఏర్పాటు చేసిన ఎల్ఈడి TV లో PAC చైర్మన్ మరియు పౌరసరఫరాల శాఖ మంత్రి ఆధ్వర్యంలో జరిగిన జై కొట్టు (యువజన విభాగ) ఆవిష్కరణ కార్యక్రమాన్ని కార్యకర్తలు అందరూ కలిసి వీక్షించారు. అనంతరం కేక్ కట్ చేసి ఒకరికి ఒకరు తినిపించుకొని పవన్ కళ్యాణ్ గారికి పుట్టినరోజు శుభాకాంక్షలు తెలియజేసి అక్కడే అన్నదాన కార్యక్రమం కూడా చేయటం జరిగింది. ఈ కార్యక్రమంలో కలప రవి, బాటసారి జిల్లా కార్యదర్శి, మోహనకృష్ణ పీలేరు మండల అధ్యక్షులు, గురు మోహన్ పీలేరు మండల ఉపాధ్యక్షులు, గజేంద్ర పీలేరు మండల ప్రధాన కార్యదర్శి, ధన శేఖర్ ప్రధాన కార్యదర్శి, మున్నా, రాజేష్, షఫీ, కామిశెట్టి సుధాకర్, నరేష్, మోకాటి సుబ్బయ్య, గాలి మహేష్, నక్కా గోపి, కోల్ కోల్ విజయ్ కుమార్, బెజవాడ భాస్కర ,తోట బాలాజీ, మున్నా, రాఘవ, వాయల్పాడు ఎంసీ డైరెక్టర్ దీపాని ప్రభాకర్, తదితరులు పాల్గొన్నారు.1
- చెరుకుపల్లి మండలంలో దంచి కొడుతున్న వర్షం. రైతులకి ఉపశమనం. చెరుకుపల్లి మండలంలో బుధవారం భారీ వర్షం దంచి కొట్టింది. గడిచిన కొన్ని రోజులుగా తీవ్ర ఎండలు, ఉక్కపోతతో అల్లాడిపోయిన ప్రజలకు ఈ వర్షం గొప్ప ఉపశమనాన్ని ఇచ్చింది. చాలా రోజుల విరామం తర్వాత ఒక్కసారిగా కురిసిన వర్షంతో వాతావరణం ఒక్కసారిగా చల్లబడింది.ప్రస్తుతం సాగు పనుల్లో నిమగ్నమైన రైతులకు ఈ వర్షం అమృతంతో సమానంగా మారింది. ముఖ్యంగా నారుమడులు వేసి, వరి నాట్లు ప్రారంభించిన రైతులకు ఈ వాన ఎంతో మేలు చేస్తుందని హర్షం వ్యక్తం చేస్తున్నారు. నీటి కొరతతో ఎండిపోతున్న పైర్లకు జీవం పోసినట్లయిందని, రాబోయే రోజుల్లో నాట్లు వేయడానికి నేల అనుకూలంగా మారుతుందని రైతులు ఆనందం వ్యక్తం చేస్తున్నారు. ఇన్నాళ్లూ వర్షాభావ పరిస్థితులతో దిగులు చెందిన రైతాంగం, ఈ వర్షంతో పొలం పనులను మరింత వేగవంతం చేసేందుకు సమాయత్తమవుతున్నారు.2
- సాల్మన్ పురంలో ఘనంగా రాజశేఖర్ రెడ్డి 17వ వర్ధంతి వేడుకలు..... వైఎస్ఆర్సిపి నాయకులు బుచ్చిరెడ్డిపాలెం మండలం సాల్మన్ పురం గ్రామంలో వైఎస్ఆర్సిపి నాయకులు మాజీ ముఖ్యమంత్రి వైయస్ రాజశేఖర్ రెడ్డి 17వ వర్ధంతి వేడుకలు అత్యంత ఘనంగా నిర్వహించారు. తొలిత రాజశేఖర్ రెడ్డి విగ్రహానికి పూలమాలవేసి నివాళులర్పించారు. రాజశేఖర్ రెడ్డి ఆశయాలు సాధిస్తాం అంటూ నినాదాలు చేశారు.1
- బద్వేలులో దుకాణంలో చోరీ - రూ.34 వేల సరుకు అపహరణ....... బద్వేలు, సెప్టెంబర్ 1: బద్వేలు పట్టణంలోని కెనరా బ్యాంక్ సమీపంలో చోరీ ఘటన చోటుచేసుకుంది. జిరాక్స్, చిల్లర అంగడి నిర్వహిస్తున్న అంకయ్యకు చెందిన దుకాణంలో గుర్తుతెలియని వ్యక్తులు చోరీకి పాల్పడ్డారు. దుకాణంలో ఉన్న సుమారు రూ.34 వేల విలువైన సీక్రెట్ ప్యాకెట్లనుఅపహరించినట్లు బాధితుడుఆరోపిస్తున్నాడు. ఘటనపై బాధితుడు స్థానిక పోలీసులకు ఫిర్యాదు చేశాడు. చోరీకి పాల్పడిన వారిని గుర్తించి, సొత్తును ఇప్పించి న్యాయం చేయాలని కోరుతున్నాడు. పరిసర సీసీ కెమెరాలను పరిశీలిస్తే నిందితులను గుర్తించే అవకాశం ఉందని స్థానికులు భావిస్తున్నారు.2
- తిరుపతి జిల్లా... రామచంద్రాపురం మండలంలో తెలంగాణ గవర్నర్ శివప్రతాప్ శుక్ల పర్యటన తిరుపతి జిల్లా రామచంద్రాపురం మండలంలో తెలంగాణ గవర్నర్ శివప్రతాప్ శుక్ల పర్యటించారు. సి.రామాపురం సమీపంలోని శ్రీ బ్రహ్మశ్రీ గురూజీ ఆశ్రమాన్ని గవర్నర్ సందర్శించారు. ఈ సందర్భంగా ఆశ్రమంలోని లక్ష్మీనారాయణ మందిరంలో ప్రత్యేక పూజలు నిర్వహించారు. అనంతరం స్వామివారిని దర్శించుకుని ప్రత్యేక ప్రార్థనలు చేశారు. ఆశ్రమంలో శ్రీ బ్రహ్మశ్రీ గురూజీని కలిసి గవర్నర్ శివప్రతాప్ శుక్ల ఆశీర్వాదం తీసుకున్నారు. గవర్నర్‌కు ఆశ్రమ నిర్వాహకులు ఘన స్వాగతం పలికారు. అనంతరం తీర్థప్రసాదాలను అందజేశారు. గవర్నర్ పర్యటన సందర్భంగా ఆశ్రమ పరిసరాల్లో ఆధ్యాత్మిక వాతావరణం నెలకొంది. తిరుపతి జిల్లా... రామచంద్రాపురం మండలంలో తెలంగాణ గవర్నర్ శివప్రతాప్ శుక్ల పర్యటన తిరుపతి జిల్లా రామచంద్రాపురం మండలంలో తెలంగాణ గవర్నర్ శివప్రతాప్ శుక్ల పర్యటించారు. సి.రామాపురం సమీపంలోని శ్రీ బ్రహ్మశ్రీ గురూజీ ఆశ్రమాన్ని గవర్నర్ సందర్శించారు. ఈ సందర్భంగా ఆశ్రమంలోని లక్ష్మీనారాయణ మందిరంలో ప్రత్యేక పూజలు నిర్వహించారు. అనంతరం స్వామివారిని దర్శించుకుని ప్రత్యేక ప్రార్థనలు చేశారు. ఆశ్రమంలో శ్రీ బ్రహ్మశ్రీ గురూజీని కలిసి గవర్నర్ శివప్రతాప్ శుక్ల ఆశీర్వాదం తీసుకున్నారు. గవర్నర్‌కు ఆశ్రమ నిర్వాహకులు ఘన స్వాగతం పలికారు. అనంతరం తీర్థప్రసాదాలను అందజేశారు. గవర్నర్ పర్యటన సందర్భంగా ఆశ్రమ పరిసరాల్లో ఆధ్యాత్మిక వాతావరణం నెలకొంది.4