Shuru
Apke Nagar Ki App…
భారత్ మాత కి జై 🇮🇳
Shyam sunder Yadav Pulapally
భారత్ మాత కి జై 🇮🇳
More news from తెలంగాణ and nearby areas
- 👉గజ్వేల్ సిద్దిపేట జిల్లా జనవరి 9 ప్రజా తెలంగాణ న్యూస్/ గజ్వేల్ మున్సిపల్ వార్డులను పెంచాలని సిద్దిపేట కలెక్టర్ కార్యాలయంలో వినతిపత్రం ఇచ్చిన ఎంపీటీసీల ఫోరం రాష్ట్ర అధ్యక్షులు దేవీ రవీందర్ సిద్దిపేట జిల్లా కలెక్టర్ కార్యాలయంలో గజ్వేల్ మున్సిపల్ వార్డులను పెంచాలని కలెక్టర్ గారిని కలవడానికి వెళ్ళినటువంటి సమయంలో కలెక్టర్ గారు అందుబాటులో లేకపోవడంతో జిల్లా కలెక్టర్ కార్యాలయ పరిపాలన అధికారి రాజేష్ గారికి వార్డులను పెంచాలని వినతిపత్రం ఇవ్వడం జరిగింది.1
- సంగారెడ్డి పట్టణం లోని ప్రభుత్వ బాలుర ఉన్నత పాఠశాలలో ముగ్గుల పోటీలు గెలుపొందిన వారికి బహుమతులు అందజేత1
- నల్గొండ జిల్లా కేంద్రంలోని ఐబిసి న్యూస్ ఛానల్ లో జర్నలిస్టుగా పనిచేస్తున్న తిప్పర్తికి చెందిన సైదులు గౌడ్ ను బిజెపి రాష్ట్ర సీనియర్ నేత పిల్లి రామరాజు యాదవ్ పరామర్శించారు. అనారోగ్య పరిస్థితులతో ఉన్న సైదులు గౌడ్ కుటుంబానికి ఆర్థిక సహాయం అందజేశారు. కార్యక్రమంలో స్థానిక నాయకులు పాల్గొన్నారు.1
- వర్కర్ టు ఓనర్ పథకాన్ని అమలు చేయడంతో పాటు ఇతర సమస్యలను పరిష్కరించాలని సిఐటియు తెలంగాణ పవర్లూమ్ వర్కర్స్ యూనియన్ ఆధ్వర్యంలో రాజన్న సిరిసిల్లలో చేనేత జౌళి శాఖ కార్యాలయం వద్ద నిరసన చేపట్టారు1
- హన్మకొండ:నడికుడ మండల కేంద్రంలోని మండల ప్రజా పరిషత్ కార్యాలయంలో శాశ్వత ఆధార్ నమోదు కేంద్రాన్ని శుక్రవారం ప్రారంభించిన ఎమ్మెల్యే రేవూరి ప్రకాష్ రెడ్డి.వారు మాట్లాడుతూ ప్రజలకు అవసరమైన సేవలు సులభంగా, సమయానుకూలంగా అందించాలనే లక్ష్యంతో ఈ కేంద్రాన్ని ఏర్పాటు చేశామని తెలిపారు. ప్రజలు ఈ సౌకర్యాన్ని పూర్తిగా వినియోగించుకోవాలని ఎమ్మెల్యే కోరారు.1
- కరాటే పోటీలు ప్రారంభించిన మాజీ మంత్రి ఎర్రబెల్లి.. వర్ధన్నపేట మండలం ఇల్లంద గ్రామంలో జరిగిన కరాటే పోటీలను మాజీ మంత్రి ఎర్రబెల్లి దయాకర్ రావు ప్రారంభించారు. పిల్లలు చదువుతో పాటు క్రీడల్లోనూ రాణించాలని, ఆటలు, ధ్యానం వంటివి వారి మేధస్సును మెరుగుపరుస్తాయని ఆయన అన్నారు. పాఠశాల నుండి వచ్చిన తర్వాత పిల్లలకు సమయం కేటాయించి, సెల్ ఫోన్లకు అలవాటు పడకుండా చూడాల్సిన బాధ్యత తల్లిదండ్రులదేనని ఆయన సూచించారు.1
- భారత్ మాత కి జై 🇮🇳1
- 👉గజ్వేల్ సిద్దిపేట జిల్లా జనవరి 9 ప్రజా తెలంగాణ న్యూస్/ కొంపముంచిన అ*క్రమ సంబంధం.. | : కట్టుకున్నవాడిని కాదని కట్టుకథలు చెప్పే కాలయముడిని నమ్మినట్లుగా అయ్యింది ఓ వివాహిత జీవితం. పరిచయమైన నెల రోజుల్లోనే నమ్మిన ప్రియుడే డిసెంబర్ 31వ రోజు వేడుకల పేరిట నమ్మించి గొంతు నుమిలి చంపాడు వివాహిత కల్పన అనే మహిళను. సిద్దిపేట జిల్లా వర్గల్ మండలం నాచారం గ్రామ శివారులో ఈ నెల 1వ తేదీన అనుమానాస్పద స్థితిలో ఓ మహిళ మృత దేహాన్ని పోలీసులు గుర్తించారు. విచారణ జరుపగా చేగుంట మండలం ఇస్లాంపూర్ గ్రామానికి చెందిన మంతూరు కల్పన(26) గా పోలీసులు గుర్తించారు. అయితే కల్పనకు గత కొద్ది నెలల కిందట కుటుంబీకులు నిచ్చయించిన వ్యక్తితో వివాహం జరిగింది. అయితే కుటుంబంలో నెలకొన్న గొడవల కారణంగా తల్లివారి ఇంటి వద్దే కల్పన నివసిస్తుంది. ఈ క్రమంలో చేగుంటలోని ఓ కళ్ళు దుకాణంలో మాసాయి పేట మండలం కొప్పుల పల్లి గ్రామానికి చెందిన పెంటయ్య(30) తో కల్పనకు నెల రోజుల కిందట పరిచయం ఏర్పడింది. దీంతో తరచూ ఫోన్ లు మాట్లాడుతుండటంతో ఇరువురి బంధం బలపడింది. కాగా ఈ నెల 31 వ తేదీన కల్పన హైదరాబాద్ లోని ఆసుపత్రిలో ఆరోగ్య పరీక్షల పేరిట వెళ్లి నాచారం బ్రిడ్జ్ వద్ద శవమై తేలింది. దీంతో కేసు నమోదు చేసుకున్న పోలీసులు విచారణ చేపట్టగా తన ప్రియుడు పెంటయ్య హత్య చేసినట్లుగా గుర్తించామని ఏసిపి నర్సింలు తెలిపారు. ప్రియుడి బొలెరో వాహనంలో నాచారం బ్రిడ్జ్ వద్ద ఇరువురు చేరుకుని మద్యం సేవించి, తమ వెంట తెచ్చుకున్న బిర్యానీనీ తిన్నారు. ఇక తనకు పదివేల రూపాయలు కావాలని లేదంటే నీ పై మానభంగం కేసు పెడతానని తనను కల్పన బెదిరించిందని పెంటయ్య పోలీసుల విచారణలో తెలిపాడు. కాగా తన వద్ద అంత డబ్బు లేదని,నా పై ఇప్పటికే పలు చోరీ కేసులు ఉన్నాయనే భయాందోళనలో కల్పనను మెడకు త్రాడు వేసి బలంగా లాగి హత్య చేశాడు ఆయన అన్నారు. విచారణ అనంతరం నిందితుడు పెంటయ్యను రిమాండ్ చేసినట్లుగా ఏసిపి పేర్కొన్నారు. B.నర్సింలు(గజ్వేల్) మీడియా సమావేశంలో1
- పుల్కల్ మండల పరిధిలోని సింగూరు ప్రాజెక్టు వద్ద మాంజీర నదిలో గుర్తుతెలియని మహిళ మృతదేహం లభ్యం1