logo
Shuru
Apke Nagar Ki App…
  • Latest News
  • News
  • Politics
  • Elections
  • Viral
  • Astrology
  • Horoscope in Hindi
  • Horoscope in English
  • Latest Political News
logo
Shuru
Apke Nagar Ki App…

తక్కువ ధరకే బియ్యం.. స్కీమ్ ప్రారంభించిన మంత్రి నాదెండ్ల మనోహర్ AP: ప్రజలకు తక్కువ ధరకే బియ్యం అందించే పథకాన్ని మంత్రి నాదెండ్ల మనోహర్ ఇవాళ విజయవాడలో ప్రారంభించారు. కేజీ రూ.62 విలువ గల BPT సూపర్ ఫైన్ బియ్యం రూ.52కు, రూ.58 ధర పలికే గ్రేడ్-1 రా రైస్ రూ.50కి అందుబాటులో ఉంటాయి. రాష్ట్రంలోని 130 రైతు బజార్లు, 500 రైస్ మిల్లర్ల ప్రత్యేక కౌంటర్లలో విక్రయాలు కొనసాగుతాయి. ఆధార్ కార్డు ఆధారంగా ఒక్కో కుటుంబానికి నెలకు 10 కిలోల బియ్యం ఇస్తారు.

2 hrs ago
user_Saddala Adi
Saddala Adi
ధర్మవరం, శ్రీ సత్య సాయి, ఆంధ్రప్రదేశ్•
2 hrs ago

తక్కువ ధరకే బియ్యం.. స్కీమ్ ప్రారంభించిన మంత్రి నాదెండ్ల మనోహర్ AP: ప్రజలకు తక్కువ ధరకే బియ్యం అందించే పథకాన్ని మంత్రి నాదెండ్ల మనోహర్ ఇవాళ విజయవాడలో ప్రారంభించారు. కేజీ రూ.62 విలువ గల BPT సూపర్ ఫైన్ బియ్యం రూ.52కు, రూ.58 ధర పలికే గ్రేడ్-1 రా రైస్ రూ.50కి అందుబాటులో ఉంటాయి. రాష్ట్రంలోని 130 రైతు బజార్లు, 500 రైస్ మిల్లర్ల ప్రత్యేక కౌంటర్లలో విక్రయాలు కొనసాగుతాయి. ఆధార్ కార్డు ఆధారంగా ఒక్కో కుటుంబానికి నెలకు 10 కిలోల బియ్యం ఇస్తారు.

More news from ఆంధ్రప్రదేశ్ and nearby areas
  • అడుగడుగునా కూటమి ప్రభుత్వం హామీలు నెరవేర్చకుండా ప్రజలను మోసం చేస్తూ ఇంటింటికి తెలుగుదేశం పేరుతో వెళ్లడం దుర్మార్గం రాష్ట్రంలోని కూటమి ప్రభుత్వం అమలు గాని హామీలను ఇచ్చి గద్దెనెక్కిన ప్రభుత్వం హామీలను నెరవేర్చకుండా అడుగడుగునా కూటమి ప్రభుత్వం మోసం చేస్తోందని రాయదుర్గం కాంగ్రెస్ పార్టీ ఇన్చార్జి గౌని ప్రతాప్ రెడ్డి పేర్కొన్నారు.రాయదుర్గం పట్టణంలోని కాంగ్రెస్ పార్టీ కార్యాలయంలో ఆయన మీడియాతో మాట్లాడారు. ప్రజలను అడుగడుగునా మోసం చేస్తున్న కూటమినేతలు ఇంటింటికి తెలుగుదేశం పేరుతో ఏ ముఖంతో వెళ్తున్నారని ప్రశ్నించారు.
    1
    అడుగడుగునా కూటమి ప్రభుత్వం హామీలు నెరవేర్చకుండా ప్రజలను మోసం చేస్తూ ఇంటింటికి తెలుగుదేశం పేరుతో వెళ్లడం దుర్మార్గం
రాష్ట్రంలోని కూటమి ప్రభుత్వం అమలు గాని హామీలను ఇచ్చి గద్దెనెక్కిన ప్రభుత్వం హామీలను నెరవేర్చకుండా అడుగడుగునా కూటమి ప్రభుత్వం మోసం చేస్తోందని రాయదుర్గం కాంగ్రెస్ పార్టీ ఇన్చార్జి గౌని ప్రతాప్ రెడ్డి పేర్కొన్నారు.రాయదుర్గం పట్టణంలోని కాంగ్రెస్ పార్టీ కార్యాలయంలో ఆయన మీడియాతో మాట్లాడారు. ప్రజలను అడుగడుగునా మోసం చేస్తున్న కూటమినేతలు ఇంటింటికి తెలుగుదేశం పేరుతో ఏ ముఖంతో వెళ్తున్నారని ప్రశ్నించారు.
    user_PHANI JOURNALIST
    PHANI JOURNALIST
    Local News Reporter రాయదుర్గం, అనంతపురం, ఆంధ్రప్రదేశ్•
    7 hrs ago
  • మహానివేదన మందిరంలో ప్రెస్ మీట్‌కు అనుమతి లేదన్న మఠాధిపతి కార్యాలయం 1968లో కడప జిల్లా కోర్టు ఇచ్చిన మఠం కాంప్రమైజ్ డిక్రీ ప్రకారం మహానివేదన మందిరంలో మఠాధిపతి కుటుంబ సభ్యులు మాత్రమే నివాసం ఉండాలని నిబంధన ఉందని మఠాధిపతి కార్యాలయం తెలిపింది.ఈ నేపథ్యంలో, మారుతి మహాలక్ష్మి గారు దాఖలు చేసిన హైకోర్టు రిట్ పిటిషన్ WP No. 2625/2026లో, మహానివేదన మందిరం నుంచి తనను ఖాళీ చేయించకుండా మధ్యంతర ఉత్తర్వులు ఇవ్వాలని కోరగా, హైకోర్టు ఆమెకు అనుకూలంగా మధ్యంతర ఉత్తర్వులు జారీ చేయలేదని కార్యాలయం పేర్కొంది.దీంతో, మహానివేదన మందిరంలో అక్రమ నివాసం కొనసాగుతోందనే అభిప్రాయంతో సంబంధిత అధికారులకు ఫిర్యాదు చేసినట్లు తెలిపింది.ఇదే సమయంలో, మారుతి మహాలక్ష్మి గారు మహానివేదన మందిరంలో పత్రికా సమావేశం నిర్వహించనున్నట్లు సోషల్ మీడియా ద్వారా తెలిసిందని పేర్కొంటూ, మఠాధిపతికి పూర్తి హక్కులు కల్పించిన ఆ ప్రాంగణంలో ఎలాంటి ప్రెస్ మీట్ నిర్వహణకు అనుమతి లేదని మఠాధిపతి కార్యాలయం స్పష్టం చేసింది.
    1
    మహానివేదన మందిరంలో ప్రెస్ మీట్‌కు అనుమతి లేదన్న మఠాధిపతి కార్యాలయం
1968లో కడప జిల్లా కోర్టు ఇచ్చిన మఠం కాంప్రమైజ్ డిక్రీ ప్రకారం మహానివేదన మందిరంలో మఠాధిపతి కుటుంబ సభ్యులు మాత్రమే నివాసం ఉండాలని నిబంధన ఉందని మఠాధిపతి కార్యాలయం తెలిపింది.ఈ నేపథ్యంలో, మారుతి మహాలక్ష్మి గారు దాఖలు చేసిన హైకోర్టు రిట్ పిటిషన్ WP No. 2625/2026లో, మహానివేదన మందిరం నుంచి తనను ఖాళీ చేయించకుండా మధ్యంతర ఉత్తర్వులు ఇవ్వాలని కోరగా, హైకోర్టు ఆమెకు అనుకూలంగా మధ్యంతర ఉత్తర్వులు జారీ చేయలేదని కార్యాలయం పేర్కొంది.దీంతో, మహానివేదన మందిరంలో అక్రమ నివాసం కొనసాగుతోందనే అభిప్రాయంతో సంబంధిత అధికారులకు ఫిర్యాదు చేసినట్లు తెలిపింది.ఇదే సమయంలో, మారుతి మహాలక్ష్మి గారు మహానివేదన మందిరంలో పత్రికా సమావేశం నిర్వహించనున్నట్లు సోషల్ మీడియా ద్వారా తెలిసిందని పేర్కొంటూ, మఠాధిపతికి పూర్తి హక్కులు కల్పించిన ఆ ప్రాంగణంలో ఎలాంటి ప్రెస్ మీట్ నిర్వహణకు అనుమతి లేదని మఠాధిపతి కార్యాలయం స్పష్టం చేసింది.
    user_VEMULURIMALAKONDAIAH
    VEMULURIMALAKONDAIAH
    Hindu temple ఖాజీపేట, వై.ఎస్.ఆర్., ఆంధ్రప్రదేశ్•
    4 hrs ago
  • రోడ్డును పగలగొట్టి తవ్వడానికి ప్రైవేట్ కేబుల్ వారికి ఎవరు పర్మిషన్ ఇచ్చారు సిపిఐ పట్టణ కార్యదర్శి శేషు కుమార్ వెల్లడి.. (కోడుమూరు సూర్ న్యూస్ ప్రతినిధి) పట్టణంలో ఒక ప్రైవేట్ సంస్థకు చెందిన కేబుల్ ఉద్యోగులు దగ్గరుండి వారి పని కొరకు తారు రోడ్డు ఇష్టం వచ్చినట్టు యంత్రాలతో పగలగొట్టడంతో భూమిలో ఉన్న గ్రామపంచాయతీ అందించే మంచి నీటి పైపులు పగలడంతో ప్రజలకు ఒకవైపు పగిలిన పైపుల నుంచి ఎర్రమట్టి నీరు అందుతున్నాయి. మరోవైపు గుంతలు పడి అలానే వదిలేసి వెళుతున్నారు. గుంతలు త్రవ్వడంతో చాలా జనం రాత్రిపూట కాలినడక వెళ్లే బాటసారులు అందులో పడి గాయాల పాలు అవుతున్నారు.ఈ విషయంపై స్థానిక సిపిఐ పట్టణ కార్యదర్శి శేషు కుమార్.సహాయ కార్యదర్శి ధూళ భాస్కర్ సంబంధిత కేబుల్ అధికారులను, గ్రామపంచాయతీ అధికారులను ఎంపీడీవోను మీడియా ద్వారా ప్రశ్నిస్తూ ఉద్యమం చేసి తారు రోడ్డును కోడుమూరు పట్టణంకు వేయించుకున్నాం. ఇలాంటి తారు రోడ్డును ప్రైవేట్ కేబుల్ వారు ఎలాంటి పర్మిషన్ తీసుకోకుండా ఇష్టం వచ్చినట్టు రోడ్డును పగలగొట్టి గుంతలు పడేసి మంచినీటి పైపులను పగలగొట్టి అలానే వదిలి పెట్టి వెళ్తే ఎలా అంటూ వారు ప్రశ్నించారు. పగిలిన నీటి పైపులను మరమ్మతులు చేయించాలి. గుంతలను పూడ్చాలి లేదంటే పెద్ద ఎత్తున ఉద్యమం చేస్తామని వారు వాట్సాప్ ద్వారా సందేశాన్ని ఒక ప్రకటనలో తెలియజేశారు.
    1
    రోడ్డును పగలగొట్టి తవ్వడానికి ప్రైవేట్ కేబుల్ వారికి ఎవరు పర్మిషన్ ఇచ్చారు సిపిఐ పట్టణ కార్యదర్శి శేషు కుమార్ వెల్లడి..
(కోడుమూరు సూర్ న్యూస్ ప్రతినిధి) పట్టణంలో ఒక ప్రైవేట్ సంస్థకు చెందిన కేబుల్ ఉద్యోగులు దగ్గరుండి వారి పని కొరకు తారు రోడ్డు ఇష్టం వచ్చినట్టు యంత్రాలతో పగలగొట్టడంతో భూమిలో ఉన్న  గ్రామపంచాయతీ అందించే మంచి నీటి పైపులు పగలడంతో  ప్రజలకు ఒకవైపు పగిలిన పైపుల నుంచి ఎర్రమట్టి నీరు అందుతున్నాయి. మరోవైపు గుంతలు పడి అలానే వదిలేసి వెళుతున్నారు. గుంతలు త్రవ్వడంతో చాలా జనం రాత్రిపూట కాలినడక వెళ్లే బాటసారులు అందులో పడి గాయాల పాలు అవుతున్నారు.ఈ విషయంపై స్థానిక సిపిఐ పట్టణ కార్యదర్శి శేషు కుమార్.సహాయ కార్యదర్శి ధూళ భాస్కర్ సంబంధిత కేబుల్ అధికారులను, గ్రామపంచాయతీ అధికారులను ఎంపీడీవోను మీడియా ద్వారా ప్రశ్నిస్తూ  ఉద్యమం చేసి తారు రోడ్డును కోడుమూరు పట్టణంకు వేయించుకున్నాం. ఇలాంటి తారు రోడ్డును ప్రైవేట్ కేబుల్ వారు ఎలాంటి పర్మిషన్ తీసుకోకుండా ఇష్టం వచ్చినట్టు రోడ్డును పగలగొట్టి గుంతలు పడేసి మంచినీటి పైపులను పగలగొట్టి అలానే వదిలి పెట్టి వెళ్తే ఎలా అంటూ వారు ప్రశ్నించారు. పగిలిన నీటి పైపులను మరమ్మతులు చేయించాలి. గుంతలను పూడ్చాలి లేదంటే పెద్ద ఎత్తున ఉద్యమం చేస్తామని వారు వాట్సాప్ ద్వారా సందేశాన్ని ఒక ప్రకటనలో తెలియజేశారు.
    user_BANDA Nagaraju News repor
    BANDA Nagaraju News repor
    కోడుమూరు, కర్నూలు, ఆంధ్రప్రదేశ్•
    2 hrs ago
  • ధర్మవరం గ్రామదేవత దుర్గమ్మ పెద్ద ఎత్తున బోనాలు సమర్పించిన మహిళలు ధర్మవరం శివరాం నగర్‌కు చెందిన మహిళలు గ్రామదేవత శ్రీ దుర్గమ్మ తల్లికి ఆదివారం భక్తిశ్రద్ధలతో బోనాల ఉత్సవాన్ని ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా ఆలయ అర్చకులు అమ్మవారికి ప్రత్యేక పూజలు నిర్వహించి, నైవేద్యాలు సమర్పించారు. అనంతరం అధిక సంఖ్యలో మహిళలు సంప్రదాయ వస్త్రధారణలో బోనాలు చేతపట్టుకుని భక్తిగీతాల నడుమ ఊరేగింపుగా ఆలయానికి చేరుకుని అమ్మవారికి బోనాలను సమర్పించారు. బోనాల ఉత్సవానికి భక్తులు పెద్ద సంఖ్యలో తరలిరావడంతో ఆలయ ప్రాంగణం భక్తులతో కిక్కిరిసిపోయింది. భక్తులు అమ్మవారి దర్శనం చేసుకుని ప్రత్యేక పూజల్లో పాల్గొని ఆశీర్వాదాలు పొందారు. ఉత్సవం భక్తిపారవశ్య వాతావరణంలో వైభవంగా జరిగింది.
    1
    ధర్మవరం గ్రామదేవత దుర్గమ్మ పెద్ద ఎత్తున బోనాలు సమర్పించిన మహిళలు 
ధర్మవరం  శివరాం నగర్‌కు చెందిన మహిళలు గ్రామదేవత శ్రీ దుర్గమ్మ తల్లికి ఆదివారం భక్తిశ్రద్ధలతో బోనాల ఉత్సవాన్ని ఘనంగా నిర్వహించారు.
ఈ సందర్భంగా ఆలయ అర్చకులు అమ్మవారికి ప్రత్యేక పూజలు నిర్వహించి, నైవేద్యాలు సమర్పించారు. అనంతరం అధిక సంఖ్యలో మహిళలు సంప్రదాయ వస్త్రధారణలో బోనాలు చేతపట్టుకుని భక్తిగీతాల నడుమ ఊరేగింపుగా ఆలయానికి చేరుకుని అమ్మవారికి బోనాలను సమర్పించారు.
బోనాల ఉత్సవానికి భక్తులు పెద్ద సంఖ్యలో తరలిరావడంతో ఆలయ ప్రాంగణం భక్తులతో కిక్కిరిసిపోయింది. భక్తులు అమ్మవారి దర్శనం చేసుకుని ప్రత్యేక పూజల్లో పాల్గొని ఆశీర్వాదాలు పొందారు. ఉత్సవం భక్తిపారవశ్య వాతావరణంలో వైభవంగా జరిగింది.
    user_Saddala Adi
    Saddala Adi
    ధర్మవరం, శ్రీ సత్య సాయి, ఆంధ్రప్రదేశ్•
    9 hrs ago
  • ఎకరాకు 50 వేల రూపాయలు నష్టపరిహారం అందించండి రాష్ట్ర వ్యవసాయ కార్మిక సంఘం నాయకుడు రామాంజనేయులు (కోడుమూరు షూర్ న్యూస్ ప్రతినిధి) రాష్ట్రంలో వర్షాధారం లేక ఏదో పడిన చిన్న చినుకులకు రైతులు ఆశపడి అప్పు చేసి విత్తనాలను తెచ్చి భూమిలో వితుకున్నారు. వర్షం పూర్తిగా వెనక్కు వెళ్లడంతో భూమిలో విత్తిన విత్తనాలు మొలకెత్తి నాలుగు వేళ ఎత్తు మొక్క పెరిగి నీరు లేక భూమిలో తేమ శాతం ఎండిపోయి చివరకు మొక్కలు ఎండిపోతున్నది. ఈ పరిస్థితిని గమనించిన సిపిఐ పార్టీ అనుబంధ సంస్థ రాష్ట్ర వ్యవసాయ కార్మిక సంఘం కార్యవర్గ సభ్యుడు రామాంజనేయులు జగన్నాథం కోడుమూరు మండల వ్యవసాయ కార్మిక సంఘం కార్యదర్శి ఈశ్వరయ్య ఆచారి మాజీ వార్డు మెంబర్ జి.రామాంజనేయులు సిపిఐ పట్టణ కార్యదర్శి శేషు కుమార్, బోయ రాజు తదితరులు జీపు జాతను ఏర్పాటు చేసి పట్టణంలో ఉన్న వ్యవసాయ భూమిలోకి వెళ్లి నాయకులు ఎండిన మొక్కలను చూసి రైతుతో కలిసి మీడియా ముందు మాట్లాడుతూ రాష్ట్రంలో కర్నూలు జిల్లా అత్యధికంగా వెనుకబడి ఉన్నది వర్షము లేక రైతులు నెత్తిన బట్ట వేసుకొని కంటతడి పెడుతున్నారు.గౌరవ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు జిల్లాకు తొమ్మిది సార్లు పర్యటన చేశారు ఒక్కసారి అయినా రైతు గురించి రైతు పొలాల్లో దిగి పరిశీలించారా.? అని నేను కూటమి ప్రభుత్వం లో పనిచేస్తున్న గౌరవ ముఖ్యమంత్రిని ప్రశ్నిస్తున్న. లేదు ఆయనకి ఎంతసేపు ఉన్నా రైతులను ప్రజలను అడ్డం పెట్టుకొని ముసలి కన్నీరు కారుస్తూ ముందుకు సాగిపోతున్నారే తప్ప ఏమీ లేదు. సిపిఐ పార్టీ గా రైతుల పక్షాన నిలబడి కర్నూలు జిల్లాలో ఉన్న ప్రతి రైతుకు కూటమి ప్రభుత్వం ఎకరాకు 50,000 వేల రూపాయలు నష్టపరిహారం అందించాలి. లేదంటే ఉద్యమం పెద్ద ఎత్తున కొనసాగిస్తాం అంటూ మీడియా ముందు పత్రిక విలేకరుల ముందు నాయకులు మాట్లాడరు. ఈ కార్యక్రమంలో విద్యార్థి సంఘం జిల్లా నాయకుడు రంగస్వామి, చేనేత సంఘం రాష్ట్ర అధ్యక్షుడు బుగుడే మాధవస్వామి,రైతులు పాల్గొన్నారు
    2
    ఎకరాకు 50 వేల రూపాయలు నష్టపరిహారం అందించండి రాష్ట్ర వ్యవసాయ కార్మిక సంఘం నాయకుడు రామాంజనేయులు
(కోడుమూరు షూర్ న్యూస్ ప్రతినిధి) రాష్ట్రంలో వర్షాధారం లేక ఏదో పడిన చిన్న చినుకులకు రైతులు ఆశపడి అప్పు చేసి విత్తనాలను తెచ్చి భూమిలో వితుకున్నారు. వర్షం పూర్తిగా వెనక్కు వెళ్లడంతో భూమిలో విత్తిన విత్తనాలు మొలకెత్తి నాలుగు వేళ ఎత్తు మొక్క పెరిగి నీరు లేక భూమిలో తేమ శాతం ఎండిపోయి చివరకు మొక్కలు ఎండిపోతున్నది. ఈ పరిస్థితిని గమనించిన సిపిఐ పార్టీ అనుబంధ సంస్థ రాష్ట్ర వ్యవసాయ కార్మిక సంఘం కార్యవర్గ సభ్యుడు రామాంజనేయులు జగన్నాథం కోడుమూరు మండల వ్యవసాయ కార్మిక సంఘం కార్యదర్శి ఈశ్వరయ్య ఆచారి మాజీ వార్డు మెంబర్ జి.రామాంజనేయులు సిపిఐ పట్టణ కార్యదర్శి శేషు కుమార్, బోయ రాజు తదితరులు జీపు జాతను ఏర్పాటు చేసి పట్టణంలో ఉన్న వ్యవసాయ భూమిలోకి వెళ్లి నాయకులు ఎండిన మొక్కలను చూసి రైతుతో కలిసి మీడియా ముందు మాట్లాడుతూ రాష్ట్రంలో కర్నూలు జిల్లా అత్యధికంగా వెనుకబడి ఉన్నది వర్షము లేక రైతులు నెత్తిన బట్ట వేసుకొని కంటతడి పెడుతున్నారు.గౌరవ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు జిల్లాకు తొమ్మిది సార్లు పర్యటన చేశారు ఒక్కసారి అయినా రైతు గురించి రైతు పొలాల్లో దిగి పరిశీలించారా.? అని నేను కూటమి ప్రభుత్వం లో పనిచేస్తున్న గౌరవ ముఖ్యమంత్రిని ప్రశ్నిస్తున్న. లేదు ఆయనకి ఎంతసేపు ఉన్నా రైతులను ప్రజలను అడ్డం పెట్టుకొని ముసలి కన్నీరు కారుస్తూ ముందుకు సాగిపోతున్నారే తప్ప ఏమీ లేదు. సిపిఐ పార్టీ గా రైతుల పక్షాన నిలబడి కర్నూలు జిల్లాలో ఉన్న ప్రతి రైతుకు కూటమి ప్రభుత్వం ఎకరాకు 50,000 వేల రూపాయలు నష్టపరిహారం అందించాలి. లేదంటే ఉద్యమం పెద్ద ఎత్తున కొనసాగిస్తాం అంటూ మీడియా ముందు పత్రిక విలేకరుల ముందు నాయకులు మాట్లాడరు. ఈ కార్యక్రమంలో  విద్యార్థి సంఘం జిల్లా నాయకుడు రంగస్వామి, చేనేత సంఘం రాష్ట్ర అధ్యక్షుడు బుగుడే మాధవస్వామి,రైతులు పాల్గొన్నారు
    user_BANDA Nagaraju News repor
    BANDA Nagaraju News repor
    కోడుమూరు, కర్నూలు, ఆంధ్రప్రదేశ్•
    5 hrs ago
  • వర్షాలకోసం జమ్మలమడుగులో రజకుల పూజలు.. 108 బిందెలు నీళ్ల అభిషేకం కడప జిల్లాలో వర్షాలు లేక కరువు పరిస్థితులు నెలకొనడంతో వర్షం కురవాలని కోరుతూ ప్రజలు దేవుళ్లకు మొక్కులు చెల్లిస్తున్నారు. ఇందులో భాగంగా ఆదివారం జమ్మలమడుగులో రజకులు గంగమ్మ తల్లికి నిండు బిందెలతో ప్రత్యేక అభిషేకం నిర్వహించారు.అనంతరం అమ్మవారికి చీర సారె సమర్పించి పూజలు చేశారు. వరుణ దేవుడు కరుణించి త్వరలోనే సమృద్ధిగా వర్షాలు కురిపించాలని వారు ఈ సందర్భంగా ప్రార్థించారు.
    1
    వర్షాలకోసం జమ్మలమడుగులో రజకుల పూజలు.. 108 బిందెలు నీళ్ల అభిషేకం 
కడప జిల్లాలో వర్షాలు లేక కరువు పరిస్థితులు నెలకొనడంతో వర్షం కురవాలని కోరుతూ ప్రజలు దేవుళ్లకు మొక్కులు చెల్లిస్తున్నారు. ఇందులో భాగంగా ఆదివారం జమ్మలమడుగులో రజకులు గంగమ్మ తల్లికి
నిండు బిందెలతో ప్రత్యేక అభిషేకం నిర్వహించారు.అనంతరం అమ్మవారికి చీర సారె సమర్పించి పూజలు చేశారు. వరుణ దేవుడు కరుణించి త్వరలోనే సమృద్ధిగా
వర్షాలు కురిపించాలని వారు ఈ సందర్భంగా ప్రార్థించారు.
    user_LAKKU SIVA SANKAR reddy
    LAKKU SIVA SANKAR reddy
    Court reporter పులివెందుల, వై.ఎస్.ఆర్., ఆంధ్రప్రదేశ్•
    9 hrs ago
View latest news on Shuru App
Download_Android
  • Terms & Conditions
  • Career
  • Privacy Policy
  • Blogs
Shuru, a product of Close App Private Limited.