ఆంధ్ర ప్రదేశ్ హాకీ రాష్ట్ర జట్టుకు సత్యసాయి జిల్లా క్రీడాకారులు శ్రీ సత్యసాయి జిల్లా,ధర్మవరం,ఏప్రిల్ 1వ తేదీ నుండి 11వ తేదీ వరకు జార్ఖండ్ రాష్ట్రంలోని రాంచి పట్టణంలో జరుగనున్న 16వ జాతీయస్థాయి సబ్ జూనియర్ బాలికల హాకీ ఛాంపియన్ షిప్ లో పాల్గొనే హాకీ ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర జట్టుకు సత్యసాయి జిల్లా ధర్మవరం కు చెందిన వైష్ణవి,నవ్య, శ్రీలేఖ, భవ్య, ఎంపికైనట్లు హాకీ ఆంధ్రప్రదేశ్ వైస్ ప్రెసిడెంట్ బి.సూర్యప్రకాష్ తెలియజేశారు. రాష్ట్ర జట్టుకు ఎంపికైన క్రీడాకారులను హాకీ ఆంధ్రప్రదేశ్ వైస్ ప్రెసిడెంట్, హాకీ సత్యసాయి జిల్లా జనరల్ సెక్రటరీ బి. సూర్య ప్రకాష్, హాకీ సత్యసాయి జిల్లా గౌరవ అధ్యక్షులు బండి వేణుగోపాల్, పళ్ళెం వేణుగోపాల్, హాకీ సత్యసాయి జిల్లా ప్రెసిడెంట్ బీ.వీ శ్రీనివాసులు, వైస్ ప్రెసిడెంట్ ఉడుముల రామచంద్ర, గౌరీ ప్రసాద్, మహమ్మద్, అస్లాం, ఊకా రాఘవేంద్ర, ట్రెజరర్ అంజన్న, జాయింట్ సెక్రటరీ అరవింద్ గౌడ్, జెన్నే చంద్రశేఖర్, డైరెక్టర్లు మారుతి ప్రసాద్, ఇర్షాద్, అమునొద్దీన్, కిరణ్, సత్యసాయి జిల్లా హాకీ కోచ్ హస్సేన్ అభినందన శుభాకాంక్షలు తెలియజేసారు.

- గాండ్లపెంట కటారుపల్లి గ్రామంలో జరిగిన వేమన బ్రహ్మోత్సవాలలో భాగంగా మంగ ళవారం ఉట్ల తిరుణాల జరిగింది. మద్ది వారిగొంది గ్రామానికి చెందిన సాయికుమార్ నాయుడు టీం సభ్యులు సాధించుకున్నారు. గత ఐదు సంవత్సరాలుగా వేమన ఉట్ల తిరుణాల ఆ గ్రామానికి చెందిన వారే సాధించుకుంటున్నట్లు గ్రామస్తులు తెలిపారు. వేమన భక్తులు యువతకు ప్రశంసించారు. వేమన ఆలయ పీఠాధిపతులు నందవేమారెడ్డి మరి కొంతమంది అర్చకులు యువత పాల్గొన్నారు.1
- అనంతపురం జిల్లా కళ్యాణదుర్గంలో మాజీ ఎంపీ, వైసీపీ సమన్వయకర్త తలారి రంగయ్యకు సోమవారం ప్రజలు బ్రహ్మరథం పట్టారు. భారీగా తరలివచ్చి రంగయ్యపై పూల వర్షం కురిపించారు. వైసీపీ నేతలతో పాటు ప్రజాసంఘాల నాయకులు, న్యాయవాదులు కూడా ఉన్నారు. ఆర్డీటీకి ఎఫ్సీఆర్ఎ రెన్యువల్ కావడానికి రంగయ్య కారణమంటూ జనాలు నినాదాలు చేశారు. జై జగన్, జై తలారి రంగయ్య అంటూ నినాదాలు చేశారు.1
- రామవరం గ్రామం ముద్దనూరు మండలం కడప జిల్లా వాస్తవ్యులైన సాయికుమార్ మరియు లక్ష్మీదేవి గారి కుమారుడైన శ్రీ విష్ణు అనే బాలుడు పుట్టుకతోనే అంతుచిక్కని వ్యాధితో జన్మించడం జరిగింది బాబుకి చెకప్ చేపించగా LAD బిగ్ డిసీస్ వచ్చిందని డాక్టర్లు చెప్పారు. పిల్లాడికి ఆపరేషన్ చేయకపోతే ప్రాణాలకే ప్రమాదం అని వారు సూచించారు కానీ ఆపరేషన్ కి 30 లక్షల దాకా ఖర్చవుతుంది అని డాక్టర్లు చెప్పారు. కావున దాతలు ముందుకు వచ్చి తమకు తోచినంత సహాయం చేయాలని ఆ తల్లిదండ్రులు కోరుకుంటున్నారు మానవతా వాదంతో ప్రతి ఒక్కరూ ముందుకొచ్చి ఆ పసిబిడ్డ ప్రాణాలని కాపాడాలని అందరూ భావిస్తున్నారు. వీడియోలో కనిపిస్తున్న స్కానర్ కి గాని కింద ఇవ్వబడిన 7207217664 నెంబర్ కి ఫోన్ పే చేసి పిల్లవాడి ప్రాణం కాపాడిన వారు అవుతారు.1
- రాయదుర్గం నియోజకవర్గంలోని బొమ్మనహాళ్ మండలం నేమకల్ గ్రామ సమీపంలో జరిగిన దారి దోపిడీ రేసును పోలీసులు వేదించి ముగ్గురు నిందితులను అరెస్టు చేశారు. రాయదుర్గం రూరల్ సీఐ వెంకటరమణ ఆధ్వర్యంలో బొమ్మనహాళ్ ఇంచార్జ్ ఎస్పై గురు ప్రసాద్ రెడ్డి, కనేకల్ ఎస్పై నాగ మధు బృందం ఆదివారం కనేకల్ మండలం ఎర్రగుంట వద్ద నిందితులను అరెస్టు చేసినట్లు ఆదివారం మీడియా సమావేశంలో వెల్లడించారు. పోలీసుల వివరాల ప్రకారం, నేపుకల్ గ్రామానికి చెందిన రైతు బోయ గోవిందు 2026 జనవరి 11న గొర్రెల విక్రయించి రూ.1.50 లక్షల నగదుతో ద్విచక్ర వాహనంలో గ్రామానికి వెళ్తుండగా ముగ్గురు నిందితులు బ్లాక్ స్కార్పియో వాహనంలో వచ్చి కత్తితో బెదిరించి నగదును దోచుకెళ్లారు. ఈ ఘటనపై కేసు నమోదు చేసి పోలీసులు దర్యాప్తు చేపట్టారు. అరెస్టు చేసిన నిందితుల్లో గార్లదిన్నె మండలం కొప్పలకొండ గ్రామానికి చెందిన బెస్త ఓబులేసు ఇలియాన్ మనోహర రెడ్డి, మహేష్ రెడ్డి, భాస్కర్ రెడ్డి, చక్కెర రెడ్డి, పామిడి పట్టణం నెహ్రు నగర్కు చెందిన పెరుమాళ్ల రామకృష్ణారెడ్డి, నార్పల మండలం కర్ణపుడి గ్రామానికి చెందిన బెస్త మహేంద్ర ఉన్నారు. ప్రధాన నిందితుడు ఓబులేసు గత జనవరిలో బొమ్మనహాళ్ మండలం ఉద్దేహాల్ గ్రామంలో హోల్సేల్ చక్కెర, ఐటీసీ సిగరెట్లు ఏజెంటుగా వ్యాపారం ప్రారంభించి స్థానికుల నమ్మకాన్ని పొందినట్లు పోలీసులు తెలిపారు.1
- ఆలూరు లో మంగళవారం మధ్యాహ్నం వర్షం పడింది ఉదయం నుండి విపరీతమైన ఎండ ఉన్నప్పటికీ ఒక్కసారిగా ఆకాశం నల్లబడి పెద్ద పెద్దగా గాలులు వేస్తూ వర్షం కురిసింది. వేరుశనగ, మొక్కజొన్న, పంట చేతికి వచ్చే సమయంలో వర్షం రావడంతో పంట నష్టపోయి ప్రమాదం ఉందని పలువురు రైతులు తెలిపారు.1
- *అన్నమయ్య జిల్లా: మాజీ మంత్రి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి కాన్వాయ్‌లో తృటిలో తప్పిన పెనుప్రమాదం* తిరుపతి–బెంగళూరు జాతీయ రహదారిపై మదనపల్లి పట్టణంలోని ఎస్టేట్ కరెంట్ ఆఫీస్ సమీపంలో మాజీ మంత్రి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి కాన్వాయ్‌లో ప్రమాదం చోటుచేసుకుంది. కాన్వాయ్‌లో ఉన్న మూడు కార్లు ఒకదానికొకటి ఢీకొనడంతో ఉద్రిక్త పరిస్థితి ఏర్పడింది. ఈ ఘటనలో మూడు వాహనాలు దెబ్బతిన్నప్పటికీ, ఎటువంటి ప్రాణ నష్టం జరగకపోవడంతో పెద్ద ప్రమాదం తృటిలో తప్పింది. కాన్వాయ్‌లో ఉన్న మదనపల్లి నియోజకవర్గ యువజన విభాగం అధ్యక్షుడు, వైసీపీ మదనపల్లి రూరల్ మండల పార్టీ పరిశీలకుడు హర్షవర్ధన్ రెడ్డి ప్రయాణిస్తున్న ఫార్చ్యూనర్ వాహనం కూడా తీవ్రంగా దెబ్బతింది.2
- మాజీ మంత్రి, పుంగనూరు ఎమ్మెల్యే పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి కాన్వాయ్‌లో మంగళవారం ప్రమాదం జరిగింది. మదనపల్లి పట్టణం ఎస్టేట్లో గల కరెంట్ ఆఫీస్ వద్ద ఈ ఘటన చోటుచేసుకుంది. ఈ ప్రమాదంలో మూడు కార్లు దెబ్బతిన్నట్లు సమాచారం. కాన్వాయ్‌లో ఉన్న మదనపల్లి నియోజకవర్గ యువజన విభాగం అధ్యక్షులు, వైసిపి మదనపల్లి మండల పార్టీ పరిశీలకులు హర్షవర్ధన్ రెడ్డికి చెందిన ఫార్చునర్ వాహనం కూడా దెబ్బతిన్నట్లు స్థానికులు తెలిపారు.1
- గాండ్లపెంట మండల పరిధిలోని కటారుపల్లి గ్రామంలో యోగివేమన ఉత్సవాలు మూడవరోజు వైభవంగా నిర్వహించారు. మంగళవారం మెట్ల తిరుణాల వైభవంగా నిర్వహించారు. ఉట్ల తిరుణాలకు భారీ ఎత్తున పలు ప్రదేశాల నుంచి తిలకించడానికి తరలివచ్చారు. ఎలాంటి సంఘటనలు చోటు చేసుకోకుండా భారీ ఎత్తున పోలీసులు భద్రతా ఏర్పాట్లు ఏర్పాటు చేశారు. పీఠాధిపతి నంద వేమారెడ్డి ప్రత్యేక పూజలు చేశారు.1