Shuru
Apke Nagar Ki App…
తెలుగు మూవీ ఆర్టిస్ట్స్ అసోసియేషన్ (తెలుగు మా) 3వ వార్షికోత్సవ పోస్టర్‌ను ప్రముఖ నటుడు, దర్శకుడు సత్య ప్రకాష్ శనివారం నగరంలోని మేఘాలయ హోటల్‌లో ఆవిష్కరించారు. ఈ సందర్భంగా, తెలుగు మా అసోసియేషన్ ఉపాధ్యక్షుడు, ఉత్తరాంధ్ర జిల్లాల ఇంచార్జ్ ఎం.కృష్ణకిషోర్, కళాకారుల సంక్షేమానికి అసోసియేషన్ భవిష్యత్తులో చేపట్టబోయే కార్యక్రమాల వివరాలను నటుడు సత్య ప్రకాష్‌కు వివరించారు. రాష్ట్రంలోని కళాకారుల సంక్షేమానికి, వారి సమస్యల పరిష్కారానికై “తెలుగు మూవీ ఆర్టిస్ట్స్ అసోసియేషన్” ఆంధ్రప్రదేశ్‌లో ఏర్పాటు చేయడం అభినందనీయమని నటుడు సత్య ప్రకాష్ ఈ సందర్భగా ప్రశంసించారు.
Y.S.RAJ KUMAR PATNAIK
తెలుగు మూవీ ఆర్టిస్ట్స్ అసోసియేషన్ (తెలుగు మా) 3వ వార్షికోత్సవ పోస్టర్‌ను ప్రముఖ నటుడు, దర్శకుడు సత్య ప్రకాష్ శనివారం నగరంలోని మేఘాలయ హోటల్‌లో ఆవిష్కరించారు. ఈ సందర్భంగా, తెలుగు మా అసోసియేషన్ ఉపాధ్యక్షుడు, ఉత్తరాంధ్ర జిల్లాల ఇంచార్జ్ ఎం.కృష్ణకిషోర్, కళాకారుల సంక్షేమానికి అసోసియేషన్ భవిష్యత్తులో చేపట్టబోయే కార్యక్రమాల వివరాలను నటుడు సత్య ప్రకాష్‌కు వివరించారు. రాష్ట్రంలోని కళాకారుల సంక్షేమానికి, వారి సమస్యల పరిష్కారానికై “తెలుగు మూవీ ఆర్టిస్ట్స్ అసోసియేషన్” ఆంధ్రప్రదేశ్‌లో ఏర్పాటు చేయడం అభినందనీయమని నటుడు సత్య ప్రకాష్ ఈ సందర్భగా ప్రశంసించారు.
More news from Kakinada and nearby areas
- రాష్ట్ర ఉప ముఖ్యమంత్రి, జనసేన పార్టీ అధ్యక్షుడు పవన్ కళ్యాణ్‌పై విమర్శలు చేసే నైతిక అర్హత వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీకి లేదని రామచంద్రపురం నియోజకవర్గ కూటమి పార్టీ నాయకులు తీవ్ర స్థాయిలో మండిపడ్డారు. అధికారంలో ఉన్నప్పుడు కాపు సమాజానికి ఇచ్చిన హామీలను విస్మరించి, ఇప్పుడు కాపుల పేరుతో సమావేశాలు నిర్వహించడం రాజకీయ దివాళాకోరుతనానికి నిదర్శనమని వారు విమర్శించారు. రామచంద్రపురం లయన్స్ క్లబ్ కళ్యాణ మండపంలో నిర్వహించిన మీడియా సమావేశంలో జనసేన ఇన్‌చార్జ్ పోలిశెట్టి చంద్రశేఖర్, కాపు నాయకులు కంచుమర్తి బాబురావు, అన్యం శ్రీరామ్, కొట్టువాడ హరిబాబు, దేవు వెంకటరాజు, ఆళ్ళ బుజ్జి సహా పలువురు కూటమి పార్టీ నాయకులు మాట్లాడారు. కాపు వర్గానికి బీసీ రిజర్వేషన్లు కల్పిస్తామని చెప్పి అధికారంలోకి వచ్చిన వైసీపీ, ఆ హామీని పూర్తిగా విస్మరించి కాపులను మోసం చేసిందని ఆరోపించారు. కాపు కార్పొరేషన్‌ను నిర్వీర్యం చేసి, యువత ఆశయాలను దెబ్బతీసిన పార్టీ వైసీపీనే అని విమర్శించారు. పవన్ కళ్యాణ్‌ను ఒక కులానికి పరిమితం చేసే ప్రయత్నాలు దురుద్దేశపూరితమైనవని వారు పేర్కొన్నారు. ఆయన కాపుల నాయకుడు మాత్రమే కాదని, రైతు, కార్మికుడు, యువకుడు, మహిళ, మధ్యతరగతి కుటుంబం సహా అన్ని వర్గాల ఆశయాలకు ప్రతినిధిగా ఎదిగిన నాయకుడని స్పష్టం చేశారు. ప్రజల కోసం తన వ్యక్తిగత జీవితాన్ని, సినీ జీవితాన్ని పక్కన పెట్టి రాజకీయాల్లోకి వచ్చిన పవన్ కళ్యాణ్, అధికారం కోసం కాకుండా బాధ్యత కోసం రాజకీయాలు చేస్తున్న అరుదైన నాయకుడని కొనియాడారు. దేశ ప్రధానమంత్రి స్వయంగా పవన్ కళ్యాణ్ నివాసానికి వెళ్లి పరామర్శించడం ఆయన రాజకీయ స్థాయి, జాతీయ ప్రాధాన్యతను తెలియజేస్తుందని, నిజాయితీ, నిబద్ధత, ధైర్యం, తెగింపు, దేశభక్తి ఆయన వ్యక్తిత్వానికి ప్రతీకలని తెలిపారు. వెంకటాయపాలెంలో తోట త్రిమూర్తులు నిర్వహించిన సమావేశం కాపు సంక్షేమం కోసం కాదని, కొందరు నాయకుల రాజకీయ ఉనికిని కాపాడుకునేందుకు చేసిన ప్రయత్నమని కూటమి నాయకులు విమర్శించారు. రాష్ట్రం నలుమూలల నుంచి వైసీపీ నాయకులను సమీకరించి సమావేశం నిర్వహించడం వెనుక ఉన్న అసలు ఉద్దేశాన్ని ప్రజలు ఇప్పటికే అర్థం చేసుకున్నారని అన్నారు. గతంలో కాపు ఉద్యమాల సమయంలో కేసులు నమోదై యువత ఇబ్బందులు పడుతున్నప్పుడు మౌనం వహించిన నాయకులు, ఇప్పుడు కాపులపై కపట ప్రేమ చూపించడం రాజకీయ అవకాశవాదమేనన్నారు. “వైఎస్ఆర్ కాపులు” అనే పేరుతో కాపు సమాజాన్ని రాజకీయంగా విభజించేందుకు ప్రయత్నించడం హాస్యాస్పదమని, కాపులు ఒక పార్టీకి బానిసలు కారని, తమ భవిష్యత్తును తామే నిర్ణయించుకునే సామర్థ్యం ఉన్న సమాజమని స్పష్టం చేశారు. రామచంద్రపురం నియోజకవర్గంలో రాష్ట్ర మంత్రి వాసంశెట్టి సుభాష్ అన్ని వర్గాల ప్రజలకు సమాన న్యాయం చేస్తూ అభివృద్ధి, సామాజిక సేవ కార్యక్రమాలు చేపడుతున్నారని కూటమి నాయకులు తెలిపారు. బడుగు, బలహీన వర్గాలు, కాపు సమాజ అభ్యున్నతి కోసం పనిచేస్తున్న నాయకత్వానికి మద్దతు ఇవ్వడం తమ బాధ్యతగా భావించామని పేర్కొన్నారు. తాము పదవుల కోసం, వ్యక్తిగత ప్రయోజనాల కోసం కాకుండా, సమాజ ప్రయోజనాలు, రాష్ట్ర అభివృద్ధి, కాపు యువత భవిష్యత్తు కోసం మాత్రమే కూటమిని బలపరిచామని స్పష్టం చేశారు. వైసీపీ నాయకులు కులాల మధ్య చిచ్చు పెట్టే ప్రయత్నాలు విరమించుకోవాలని, ప్రజా సమస్యలపై పోరాటం చేయాలని కూటమి నాయకులు సూచించారు. కులాలను రెచ్చగొట్టి రాజకీయ లబ్ధి పొందే రోజులు ముగిశాయని, ప్రజలు చైతన్య వంతులయ్యారని పేర్కొంటూ, "కులాలను విభజించే రాజకీయాలు జగన్‌కు సాధ్యమైతే... కులాలను కలిపే రాజకీయాలు పవన్ కళ్యాణ్‌తోనే సాధ్యం" అని నాయకులు స్పష్టం చేశారు.1
- పాతపట్నం నియోజకవర్గం పరిధిలోని కొత్తూరు పోలీస్ స్టేషన్ సీఐ, ఎమ్మెల్సీ దువ్వాడ శ్రీనివాస్‌ను అక్రమంగా అరెస్టు చేశారు.1
- బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్, పార్టీ కార్యకర్తలకు తన హృదయపూర్వక ధన్యవాదాలు తెలియజేశారు. గులాబీ జెండాను గుండెల్లో మోస్తూ, కేసీఆర్ గారిపై నిండైన అభిమానంతో, నిస్వార్థంగా పనిచేస్తున్న కార్యకర్తల కృషిని ఆయన ప్రశంసించారు. కేటీఆర్ తన సందేశంలో, కేసీఆర్ దళానికి కార్యకర్తలే నిజమైన సైనికులు అని నొక్కి చెప్పారు.1
- తెలంగాణ రాష్ట్ర వ్యవసాయ శాఖ మంత్రి శ్రీ తుమ్మల నాగేశ్వరరావు గారు, అలాగే మంత్రి శ్రీ ఉత్తమ్ కుమార్ రెడ్డి ఈరోజు తమ ఢిల్లీ పర్యటనలో భాగంగా కేంద్ర పౌరయాన శాఖ మంత్రి శ్రీ కింజారపు రామ్మోహన్ నాయుడుని మర్యాదపూర్వకంగా కలిశారు. ఈ భేటీలో తెలంగాణ రాష్ట్రానికి రావాల్సిన నిధులు, వివిధ ప్రాజెక్టుల గురించి మంత్రులు చర్చించారు.1
- కృష్ణలంకకు చెందిన సాయి కృష్ణ మిస్సింగ్ కేసులో సిట్ అధికారులు ముమ్మరంగా దర్యాప్తు చేస్తున్నారు. ఈ క్రమంలో, కస్టడీలో ఉన్న సాయికృష్ణ అదృశ్యమైన నేపథ్యంలో, సిట్ అధికారులు మంగళవారం విజయవాడలోని సింగ్నగర్‌లో సీఐ నాగరాజు ఇంట్లో విచారణ చేపట్టారు. మంగళవారం సీఐ నాగరాజును అరెస్ట్ చేస్తారనే ప్రచారం జోరుగా సాగుతోంది. దీంతో కృష్ణలంక పోలీస్ స్టేషన్ పరిధిలోని సింగ్నగర్‌లోని సీఐ ఇంటి వద్ద తీవ్ర ఉత్కంఠ నెలకొంది. ఈ సిట్ విచారణపై సర్వత్రా ఆసక్తి నెలకొంది.1
- 😭🙏1
- పాతపట్నం నియోజకవర్గంలోని కొత్తూరు పోలీస్ స్టేషన్ C I, MLC దువ్వాడ శ్రీనివాస్‌ను అక్రమంగా అరెస్ట్ చేశారు.1
- ఖమ్మం జిల్లాలో అనుమతులు లేకుండా నడుస్తున్న ప్రైవేట్ కార్పొరేట్ స్కూళ్లపై వెంటనే చర్యలు తీసుకోవాలని PDSU జిల్లా అధ్యక్షుడు గోగినేపల్లి మస్తాన్ డిమాండ్ చేశారు. PDSU (ప్రోగ్రెసివ్ డెమోక్రటిక్ స్టూడెంట్స్ యూనియన్) ఈ అక్రమ పాఠశాలలపై కఠిన చర్యలు తీసుకోవాలని పట్టుబట్టింది. ఈ ప్రధాన డిమాండ్‌తో పాటు, ఫీజుల నియంత్రణ చట్టాన్ని పకడ్బందీగా అమలు చేయాలని, ప్రభుత్వ స్కూళ్లను బలోపేతం చేయాలని కూడా PDSU ప్రభుత్వాన్ని కోరింది. ఈ నెల 30న ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి జిల్లా పర్యటన సందర్భంగా తమ డిమాండ్లపై స్పష్టమైన హామీ ఇవ్వకపోతే, పెద్ద ఎత్తున ఆందోళన కార్యక్రమాలు చేపడతామని జిల్లా అధ్యక్షుడు గోగినేపల్లి మస్తాన్ తీవ్రంగా హెచ్చరించారు.1
- కంచిలి ఫ్లైఓవర్ బ్రిడ్జి పైన ఒక లారీ అడ్డంగా నిలిచిపోవడంతో ట్రాఫిక్‌కు తీవ్ర అంతరాయం ఏర్పడింది. ఈ పరిణామంతో పలువురు ప్రయాణికులు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు.1