logo
Shuru
Apke Nagar Ki App…
  • Latest News
  • News
  • Politics
  • Elections
  • Viral
  • Astrology
  • Horoscope in Hindi
  • Horoscope in English
  • Latest Political News
logo
Shuru
Apke Nagar Ki App…

భారత సమానం నరేంద్ర మోడీ హైదరాబాద్ రాకతో మేడ్చల్ జిల్లా వ్యాప్తంగా ఏఐవైఎఫ్ నేతలను హౌస్ అరెస్టులు చేశారు.(నాచారం)మే 10: దేశ ప్రధాని నరేంద్ర మోదీ తెలంగాణ, హైదరాబాద్ పర్యటన నేపథ్యంలో ముందస్తు అక్రమ అరెస్టులకు పాల్పడుతున్న రాష్ట్ర ప్రభుత్వం, పోలీసుల చర్యలను ఏఐవైఎఫ్ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి కల్లూరు ధర్మేంద్ర, ఏఐవైఎఫ్ మేడ్చల్ జిల్లా కార్యదర్శి టి. సత్య ప్రసాద్ తీవ్రంగా ఖండించారు.మేడ్చల్ జిల్లా వ్యాప్తంగా ఏఐవైఎఫ్ నేతలను అక్రమ హౌస్ అరెస్టులు చేశారని,ఈ చర్యలు అప్రజాస్వామికమన్నారు.ఈ సందర్బంగా వారు మాట్లాడుతూ ప్రజాస్వామ్య హక్కుల కోసం పోరాడుతున్న యువజన, ప్రజాసంఘాల నాయకులను ముందస్తుగా అక్రమంగా అరెస్టు చేయడం పూర్తిగా రాజ్యాంగ విరుద్ధమని, ప్రజాస్వామ్య విలువలకు వ్యతిరేకమని వారు పేర్కొన్నారు.ప్రజల సమస్యలపై ప్రశ్నించే గొంతులను అణచివేయడానికి పోలీసు వ్యవస్థను ఉపయోగించడం రాష్ట్ర ప్రభుత్వ నియంతృత్వ ధోరణికి నిదర్శనమని విమర్శించారు. ప్రజాస్వామ్య హక్కులను కాపాడాల్సిన కాంగ్రెస్ ప్రభుత్వం ప్రజా ఉద్యమాలపై నిర్బంధాలకు పాల్పడటం తీవ్ర ఆందోళనకరమన్నారు. కేంద్రంలోని బీజేపీ ప్రభుత్వ ప్రజా వ్యతిరేక,యువత వ్యతిరేక విధానాలను ప్రశ్నిస్తున్న యువజన సంఘాలపై కేసులు పెట్టడం, అరెస్టులు చేయడం ద్వారా కాంగ్రెస్ ప్రభుత్వం పరోక్షంగా బీజేపీకి మద్దతు ఇస్తుందా అని ప్రశ్నించారు. అక్రమ అరెస్టులు, నిర్బంధాలతో ప్రజా ఉద్యమాలను అడ్డుకోలేరని, ప్రజల హక్కుల కోసం ఏఐవైఎఫ్ పోరాటాలు మరింత ఉద్ధృతం చేస్తుందని హెచ్చరించారు.అరెస్ట్ అయిన వారిలో ఏఐవైఎఫ్ జిల్లా కార్యవర్గ సభ్యులు శేఖర్, రాజ్ కుమార్, శివ కుమార్,గిరి బాబు, వికాస్, ఇస్మాయిల్, ప్రదీప్, ఏఐఎస్ఎఫ్ ఉప్పల్ మండల నేత అజీమ్ పాషా తదితరులు ఉన్నారు.

5 hrs ago
user_Nitturi Ravi
Nitturi Ravi
అంబర్‌పేట్, హైదరాబాద్, తెలంగాణ•
5 hrs ago
66655ec4-c804-42fa-8af7-e5625e34d68d

More news from Hyderabad and nearby areas
  • నామీద వస్తున్న తప్పుడు ప్రచారాలు నమ్మకండి:బీజేపీ ఎంపీ బండి సంజయ్ నా మీద వస్తున్న తప్పుడు ప్రచారాలను బిజెపి కార్యకర్తలు ప్రజలు నమ్మవద్దని కేంద్రమంత్రి బండి సంజయ్ తెలిపారు. రాజకీయంగా నన్ను ఎదుర్కోలేక ఇలా తప్పుడు ప్రచారాలు చేస్తున్నారని పరేడ్ గ్రౌండ్ లో నిర్వహించిన మోడీ బహిరంగ సభలో ఆయన మాట్లాడారు. తాను సామాన్యంగా కార్యకర్తగా కాషాయం జెండాను భుజంపై ఎత్తుకొని కేంద్రమంత్రి అయ్యానని కాలర్ ఎగర వేసుకొని నేను బిజెపి కార్యకర్తలు అని చెప్పుకుంటానని తెలిపారు. తండ్రుల పేర్లు చెప్పి నేను ఎప్పుడూ రాజకీయాల్లోకి రాలేదని తెలిపారు.
    1
    నామీద వస్తున్న తప్పుడు ప్రచారాలు నమ్మకండి:బీజేపీ ఎంపీ బండి సంజయ్
నా మీద వస్తున్న తప్పుడు ప్రచారాలను బిజెపి కార్యకర్తలు ప్రజలు నమ్మవద్దని కేంద్రమంత్రి బండి సంజయ్ తెలిపారు. రాజకీయంగా నన్ను ఎదుర్కోలేక ఇలా తప్పుడు ప్రచారాలు చేస్తున్నారని పరేడ్ గ్రౌండ్ లో నిర్వహించిన మోడీ బహిరంగ సభలో ఆయన మాట్లాడారు. తాను సామాన్యంగా కార్యకర్తగా కాషాయం జెండాను భుజంపై ఎత్తుకొని కేంద్రమంత్రి అయ్యానని కాలర్ ఎగర వేసుకొని నేను బిజెపి కార్యకర్తలు అని చెప్పుకుంటానని తెలిపారు. తండ్రుల పేర్లు చెప్పి నేను ఎప్పుడూ రాజకీయాల్లోకి రాలేదని తెలిపారు.
    user_Sangareddy News
    Sangareddy News
    జర్నలిస్ట్ Saidabad, Hyderabad•
    2 hrs ago
  • సిద్దిపేట జిల్లా దాతర్‌పల్లి గ్రామంలో పెద్దమ్మ తల్లి విగ్రహ ప్రతిష్ట, కళ్యాణ మహోత్సవం అత్యంత భక్తిశ్రద్ధలతో జరిగింది. ఈ కార్యక్రమంలో ముదిరాజ్ కుల పెద్దలు, టెంపుల్ చైర్మన్‌తో పాటు వందలాది భక్తులు పాల్గొని అమ్మవారి ఆశీస్సులు పొందారు.
    4
    సిద్దిపేట జిల్లా దాతర్‌పల్లి గ్రామంలో పెద్దమ్మ తల్లి విగ్రహ ప్రతిష్ట, కళ్యాణ మహోత్సవం అత్యంత భక్తిశ్రద్ధలతో జరిగింది. ఈ కార్యక్రమంలో ముదిరాజ్ కుల పెద్దలు, టెంపుల్ చైర్మన్‌తో పాటు వందలాది భక్తులు పాల్గొని అమ్మవారి ఆశీస్సులు పొందారు.
    user_Gousuddin Md
    Gousuddin Md
    అంబర్‌పేట్, హైదరాబాద్, తెలంగాణ•
    11 hrs ago
  • నెల రోజులు అవుతుంది ప్రభుత్వం పంట కొనడం లేదు ప్రభుత్వం పంట కొనకున్నా బాగున్ను.. ప్రైవేట్ వాళ్లకు అయినా అమ్మేవాళ్ళము ఇప్పుడు ప్రభుత్వం కొనకుండా ప్రైవేట్ వాళ్ళని కొనకుండా చేసారు తెలివి లేక కాంగ్రెస్ పార్టీకి ఓటు వేశాము నెల రోజులు అవుతుంది ప్రభుత్వం పంట కొనడం లేదు ప్రభుత్వం పంట కొనకున్నా బాగున్ను.. ప్రైవేట్ వాళ్లకు అయినా అమ్మేవాళ్ళము ఇప్పుడు ప్రభుత్వం కొనకుండా ప్రైవేట్ వాళ్ళని కొనకుండా చేసారు తెలివి లేక కాంగ్రెస్ పార్టీకి ఓటు వేశాము
    1
    నెల రోజులు అవుతుంది ప్రభుత్వం పంట కొనడం లేదు 

ప్రభుత్వం పంట కొనకున్నా బాగున్ను.. ప్రైవేట్ వాళ్లకు అయినా అమ్మేవాళ్ళము 

ఇప్పుడు ప్రభుత్వం కొనకుండా ప్రైవేట్ వాళ్ళని కొనకుండా చేసారు 

తెలివి లేక కాంగ్రెస్ పార్టీకి ఓటు వేశాము

    user_TGN BHARAT NEWS
    TGN BHARAT NEWS
    కూకట్‌పల్లి, మేడ్చల్ మల్కాజ్‌గిరి, తెలంగాణ•
    3 hrs ago
  • సికింద్రాబాద్‌లోని జవహర్‌నగర్‌లో ప్రేమ వ్యవహారం కారణంగా 23 ఏళ్ల బీటెక్ విద్యార్థి యావన్‌ను దారుణంగా కత్తితో పొడిచి చంపారు. యువతి కుటుంబ సభ్యులు హెచ్చరించినా కలుస్తుండటంతో, ఆరుగురు దుండగులు అతడిని 17 సార్లు కత్తితో పొడిచి హత్య చేశారు. ఈ ఘటనకు సంబంధించి పలు కీలక వివరాలు వెలుగులోకి వచ్చాయి.
    1
    సికింద్రాబాద్‌లోని జవహర్‌నగర్‌లో ప్రేమ వ్యవహారం కారణంగా 23 ఏళ్ల బీటెక్ విద్యార్థి యావన్‌ను దారుణంగా కత్తితో పొడిచి చంపారు. యువతి కుటుంబ సభ్యులు హెచ్చరించినా కలుస్తుండటంతో, ఆరుగురు దుండగులు అతడిని 17 సార్లు కత్తితో పొడిచి హత్య చేశారు. ఈ ఘటనకు సంబంధించి పలు కీలక వివరాలు వెలుగులోకి వచ్చాయి.
    user_Telangana news
    Telangana news
    మేడ్చల్, మేడ్చల్ మల్కాజ్‌గిరి, తెలంగాణ•
    12 hrs ago
  • Post by Mana Velugu
    1
    Post by Mana Velugu
    user_Mana Velugu
    Mana Velugu
    Teacher యాదగిరిగుట్ట, యాదాద్రి భువనగిరి, తెలంగాణ•
    1 hr ago
  • యాదగిరిగుట్ట లక్ష్మీనరసింహస్వామి దేవస్థానం ఆదివారం ఆదాయం యాదగిరిగుట్ట శ్రీ లక్ష్మీనరసింహ స్వామి ఆదివారం ఆదాయ వివరాలు ఇలా ఉన్నాయి. అందులో ప్రసాద విక్రయాలతో రూ.16,83,760, VIP దర్శనాలతో రూ.9,29,700, కార్ పార్కింగ్తో రూ.7,27,500, బ్రేక్ దర్శనాలతో రూ.4,21,500, ప్రధాన బుకింగ్తో రూ.3,57,950, వ్రతాలతో రూ.2,79,000, యాదరుషి నిలయం రూ.2,71,150, తదితర విభాగాల నుంచి మొత్తం రూ.51,80,379 ఆదాయం సమకూరినట్లు ఈవో భవాని శంకర్ తెలిపారు.
    1
    యాదగిరిగుట్ట లక్ష్మీనరసింహస్వామి దేవస్థానం ఆదివారం ఆదాయం 
యాదగిరిగుట్ట శ్రీ లక్ష్మీనరసింహ స్వామి ఆదివారం ఆదాయ వివరాలు ఇలా ఉన్నాయి. అందులో ప్రసాద విక్రయాలతో
రూ.16,83,760, VIP దర్శనాలతో రూ.9,29,700, కార్ పార్కింగ్తో రూ.7,27,500, బ్రేక్ దర్శనాలతో రూ.4,21,500, ప్రధాన బుకింగ్తో రూ.3,57,950, వ్రతాలతో రూ.2,79,000, యాదరుషి నిలయం రూ.2,71,150, తదితర విభాగాల నుంచి మొత్తం రూ.51,80,379 ఆదాయం సమకూరినట్లు ఈవో భవాని
శంకర్ తెలిపారు.
    user_P.srinu
    P.srinu
    యాదగిరిగుట్ట, యాదాద్రి భువనగిరి, తెలంగాణ•
    1 hr ago
  • పటాన్చెరు పట్టణంలో హోటల్ లో అగ్ని ప్రమాదం తప్పిన ప్రమాదం పటాన్ చెరు బస్టాండ్ సమీపంలోని ఖానవల్లి హోటల్ లో షార్ట్ సర్క్యూట్ తో ఆదివారం అగ్నిప్రమాదం జరిగింది. మంటలు వేగంగా వ్యాపించడంతో స్థానికులు భయాందోళన చెందారు. వెంటనే స్పందించిన యాజమాన్యం హోటల్లో ఉన్న వారిని వెంటనే బయటకు పంపించింది. సమాచారం అందుకున్న అగ్నిమాపక సిబ్బంది వెంటనే మంటలను ఆర్పి వేశారు. హోటల్ యజమాని జరప్పకు శిల్ప గాయాలు అయ్యాయి.
    1
    పటాన్చెరు పట్టణంలో హోటల్ లో అగ్ని ప్రమాదం తప్పిన ప్రమాదం
పటాన్ చెరు బస్టాండ్ సమీపంలోని ఖానవల్లి హోటల్ లో షార్ట్ సర్క్యూట్ తో ఆదివారం అగ్నిప్రమాదం జరిగింది. మంటలు వేగంగా వ్యాపించడంతో స్థానికులు భయాందోళన చెందారు. వెంటనే స్పందించిన యాజమాన్యం హోటల్లో ఉన్న వారిని వెంటనే బయటకు పంపించింది. సమాచారం అందుకున్న అగ్నిమాపక సిబ్బంది వెంటనే మంటలను ఆర్పి వేశారు. హోటల్ యజమాని జరప్పకు శిల్ప గాయాలు అయ్యాయి.
    user_Praveen
    Praveen
    మున్‌పల్లె, సంగారెడ్డి, తెలంగాణ•
    5 hrs ago
  • నాతో కలువు.. రేవంత్ రెడ్డికి ఆఫర్ ఇచ్చిన మోడీ నాతో కలిస్తే నువ్వు వెళ్ళాలి అనుకుంటున్న స్థానానికి తీసుకెళ్త.. పరేడ్ గ్రౌండ్ లో నిర్వహించిన బహిరంగ సభలో మాట్లాడిన ప్రధానమంత్రి నరేంద్ర మోడీ
    1
    నాతో కలువు.. రేవంత్ రెడ్డికి ఆఫర్ ఇచ్చిన మోడీ
నాతో కలిస్తే నువ్వు వెళ్ళాలి అనుకుంటున్న స్థానానికి తీసుకెళ్త.. పరేడ్ గ్రౌండ్ లో  నిర్వహించిన బహిరంగ సభలో మాట్లాడిన ప్రధానమంత్రి నరేంద్ర మోడీ
    user_Sangareddy News
    Sangareddy News
    జర్నలిస్ట్ Saidabad, Hyderabad•
    4 hrs ago
View latest news on Shuru App
Download_Android
  • Terms & Conditions
  • Career
  • Privacy Policy
  • Blogs
Shuru, a product of Close App Private Limited.