గ్రామీణ యువతకు సివిల్ సర్వీసెస్ దిశగా బంగారు అవకాశం,వెంకటపాటి విద్యా దీవెన ద్వారా సివిల్ సర్వీసెస్ కోచింగ్ – యువతకు మంత్రి సత్య కుమార్ యాదవ్ ప్రోత్సాహం శ్రీ సత్యసాయి జిల్లా,ధర్మవరం, మార్చి 08:– ధర్మవరం నియోజకవర్గం లోని యువతకు ఉన్నత విద్యా అవకాశాలు కల్పిస్తూ, వారిని దేశ సేవ దిశగా ప్రోత్సహించే ఒక ముఖ్యమైన కార్యక్రమానికి రాష్ట్ర వైద్య, ఆరోగ్య శాఖ మంత్రి సత్య కుమార్ యాదవ్ గారు శ్రీకారం చుట్టినట్లు ఆయన కార్యాలయం ఒక ప్రకటనలో తెలిపింది. సంస్కృతి సేవా సమితి సహకారంతో, మంత్రి సత్య కుమార్ యాదవ్ గారి చొరవతో, పారా అసోసియేషన్ ఫర్ రూరల్ డెవలప్మెంట్ (PARA) ఆధ్వర్యంలో నిర్వహిస్తున్న వెంకటపాటి విద్యా దీవెన కార్యక్రమం ద్వారా సివిల్ సర్వీసెస్ మరియు ఇతర పోటీ పరీక్షలకు సన్నద్ధమవుతున్న అభ్యర్థులకు ఉచిత కోచింగ్ అందించే కార్యక్రమం ప్రారంభించబడినట్లు మంత్రి కార్యాలయం పేర్కొంది. ఈ కార్యక్రమం ముఖ్య లక్ష్యం గ్రామీణ ప్రాంతాల నుండి వచ్చిన ప్రతిభావంతమైన యువతకు సరైన మార్గదర్శకత్వం, శిక్షణ మరియు వనరులు అందించి వారిని సివిల్ సర్వీసెస్ వంటి అత్యున్నత పరీక్షలకు సిద్ధం చేయడం అని మంత్రి కార్యాలయం వివరించింది. ఈ కార్యక్రమానికి మొదటిగా మంత్రి సత్య కుమార్ యాదవ్ గారు సహకారం అందించారని, అలాగే డాక్టర్ లక్ష్మయ్య IAS స్టడీ సర్కిల్ సహకారంతో తొలి విడతలో 28 మంది విద్యార్థులకు పూర్తి స్థాయి మద్దతు అందించబడిందని మంత్రి కార్యాలయం వెల్లడించింది. అదేవిధంగా పలువురు ప్రజాప్రతినిధులు, దాతలు ముందుకు వచ్చి ఈ కార్యక్రమాన్ని మరింత బలోపేతం చేస్తూ సుమారు 200 మంది సివిల్ సర్వీసెస్ అభ్యర్థులకు ఉచిత వసతి మరియు భోజన సౌకర్యాలు కల్పిస్తున్నారని మంత్రి కార్యాలయం తెలిపింది. సమాజానికి సేవ చేయాలనే లక్ష్యంతో ఈ కార్యక్రమానికి అందుతున్న సహకారం ఎంతో ప్రోత్సాహకరమని కూడా పేర్కొంది. ఈ కార్యక్రమం ద్వారా ధర్మవరం నియోజకవర్గ పరిసర ప్రాంతాలకు చెందిన యువతి, యువకులు సివిల్ సర్వీసెస్ తో పాటు ఇతర పోటీ పరీక్షలకు మెరుగైన శిక్షణతో సిద్ధమయ్యే అవకాశం పొందగలరని మంత్రి కార్యాలయం వివరించింది. గ్రామీణ ప్రాంతాల నుండి ప్రతిభావంతులైన యువత ఉన్నత స్థానాలకు ఎదగడానికి ఈ కార్యక్రమం ఒక మంచి వేదికగా మారుతుందని కూడా పేర్కొంది. సివిల్ సర్వీసెస్ మరియు ఇతర పోటీ పరీక్షలకు సిద్ధమవుతున్న ఆసక్తి గల యువతి, యువకులు 7842054669, 7998256789 ఫోన్ నంబర్లకు సందేశం పంపి తమ పేరును నమోదు చేసుకోవాలని మంత్రి కార్యాలయం కోరింది. ఈ కార్యక్రమానికి దరఖాస్తు చేసుకునేందుకు చివరి తేదీ మార్చి 10 అని మంత్రి కార్యాలయం వెల్లడించింది. గ్రామీణ ప్రాంతాల యువతకు ఉన్నత లక్ష్యాలను సాధించేందుకు మార్గదర్శకంగా నిలిచే ఈ కార్యక్రమాన్ని సద్వినియోగం చేసుకోవాలని మంత్రి కార్యాలయం విజ్ఞప్తి చేసింది.

- కదిరి లక్ష్మీనరసింహస్వామి అంగరంగ వైభవంగా స్వామివారు దర్శనమిచ్చారు లక్ష్మీ నరసింహస్వామి ఎమ్మెల్యే కందికుంట వెంకటప్రసాద్ దర్శించుకున్నారు1
- Post by Magathala Siddhartha2
- గిద్దలూరు మండల పరిసర ప్రాంతాలలో గంజాయి విక్రయిస్తున్న ముగ్గురు యువకులను మంగళవారం స్థానిక పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. అదుపులోకి తీసుకున్న ముగ్గురు వ్యక్తులు వద్ద నుంచి మూడు కేజీల గంజాయి స్వాధీనం చేసుకున్నారు. మరికొద్ది సేపట్లో డిఎస్పి నాగరాజు కేసు పూర్తి వివరాలు వెల్లడించనున్నారు. చెడు అలవాట్లకు బానిసై యువకులు ఈజీగా మనీ సంపాదించేందుకు విజయనగరం నుంచి గంజాయి దిగుమతి చేసుకొని యువకులు స్థానికంగా విక్రయిస్తున్నట్లు పోలీసులు గుర్తించారు.1
- roja That’s YS Jagan for you! ♥️👏🏻🫶🏻👌🏻1
- విజయనగరంన్యూస్.. టీపీవో చేతివాటం...పసిగట్టేసిన ఏసీబీ.. ఏసీబీ అధికారుల కన్నుగప్పేందుకు ప్రయత్నించిన విజయనగరం మున్సిపల్ కార్పోరేషన్ టౌన్ ప్లానింగ్ అధికారి (TPO) రమణమూర్తి బాత్ రూమ్ కని బయటకు వెళ్లి, తన ప్యాంటు జేబులో ఉన్న తాళం చెవిని కిందకి విసిరేసిన టీపీవో రమణమూర్తి వెంటనే గమనించి తాళం చెవిని స్వాధీనం చేసుకున్న ఏసీబీ అధికారులు తాళం చెవిని తనకి ఇచ్చేయాలని కోరిన టీపీవో నిరాకరించిన ఏసీబీ అధికారులు ఆ తాళం చెవి కథ వెనుక ఉన్న రహస్యంపై విచారణ చేస్తోన్న ఏసీబీ1
- మంగళవారం రోజున కాల్వ శ్రీరాంపూర్ మండల కేంద్రంలో నూతన తాసిల్దార్ కార్యాలయాన్ని పెద్దపెల్లి ఎమ్మెల్యే చింతకుంట విజయన్నరతో కలిసి ప్రారంభించారు పెద్దపెల్లి జిల్లా కలెక్టర్ కోయ శ్రీహర్ష రెవెన్యూ శాఖ పనులు చేరువలో త్వరతరగతిన వినియోగించుకోవచ్చని రైతులకు సంబంధించిన పెండింగ్ వర్కులు సకాలంలో చేయాలని సంబంధిత అధికారులకు సూచనలు చేశారు1
- నెల్లూరు నగరంలోని స్థానిక స్టోన్ హౌస్ పేట సమీపంలో ప్లాస్టిక్ కవర్లను నిషేధించే క్రమంలో ఇప్పటికీ అమ్మకాలు కొనసాగిస్తున్న దుకాణాలపై ఆకస్మిక దాడుల నిర్వహించిన కార్పొరేషన్ అధికారులు. అధిక సంఖ్యలో 60 మైక్రోన్ కంటే తక్కువ ఉన్న కవర్స్ ను సీజ్ చేసిన అధికారులు. ఆ దుకాణాల యజమానులకు పెనాల్టీను విధించారు. కాలుష్యాన్ని నిర్మూలించే క్రమంలో కవర్లను అరికట్టాలి వాతావరణాన్ని పరిరక్షించాలి అని దిశలో ఈ కార్యక్రమాలను చేపడుతున్నట్లు తెలిపారు. ఈ కార్యక్రమంలో మున్సిపల్ హెల్త్ ఆఫీసర్ దినేష్ సానిటరీ సూపర్వైజర్ ఎస్ కె మహబూబ్ సానిటరీ ఇన్స్పెక్టర్ శ్రీనివాసులు ఎస్ కే జిలాని భాష అశోక్ తదితరులు పాల్గొని ఈ కార్యక్రమాన్ని కొనసాగించారు.1
- అనంతపురం జిల్లా కళ్యాణదుర్గం మండలం కామక్కపల్లిలో తాగు నీటి సమస్యతో ఇబ్బందులు పడుతున్నారు. గ్రామస్థులు కళ్యాణదుర్గం ఎమ్మెల్యే అమిలినేని సురేంద్ర బాబు దృష్టికి నీటి సమస్యను తీసుకెళ్లగా.. ఆయన వెంటనే పంచాయతీ సెక్రెటరీతో మాట్లాడి యుద్ధప్రాతిపదికన బోర్ వేయించి దాహార్తిని తీర్చారు. సమస్య విన్నవించిన వెంటనే పరిష్కారం చూపిన ఎమ్మెల్యే కు గ్రామస్థులు కృతజ్ఞతలు తెలిపారు.1