చింతపల్లిలో జనసేన ముఖ్య నాయకులతో డా. వంపూరు గంగులయ్య కీలక సమావేశం స్థానిక ఎన్నికలకు జనసేన సమరశంఖం చింతపల్లి: స్థానిక సంస్థల ఎన్నికలు సమీపిస్తున్న నేపథ్యంలో జనసేన పార్టీ ఎన్నికల కార్యాచరణకు సిద్ధమవుతోంది. ఇందులో భాగంగా చింతపల్లి జడ్పీ గెస్ట్‌హౌస్‌లో చింతపల్లి, గూడెం మండలాలకు చెందిన జనసేన పార్టీ ముఖ్య నాయకులతో అత్యవసర సమావేశం నిర్వహించనున్నారు. ఉదయం 10 గంటలకు జరగనున్న ఈ సమావేశానికి జానపద కళలు మరియు సృజనాత్మక అకాడమీ చైర్మన్, పాడేరు నియోజకవర్గ జనసేన పార్టీ ఇన్‌చార్జి డా. వంపూరు గంగులయ్య హాజరై పార్టీ శ్రేణులకు దిశానిర్దేశం చేయనున్నారు. స్థానిక సంస్థల ఎన్నికల్లో అనుసరించాల్సిన వ్యూహం, నియోజకవర్గ స్థాయి కార్యాచరణ, పొత్తు ధర్మం, క్షేత్రస్థాయిలో పార్టీ బలోపేతం తదితర అంశాలపై సమావేశంలో కీలకంగా చర్చించనున్నట్లు పార్టీ వర్గాలు వెల్లడించాయి. అలాగే ఎన్నికలను సమర్థవంతంగా ఎదుర్కొనేందుకు జనసేన నాయకులు, కార్యకర్తలను సమాయత్తం చేయడంతో పాటు భవిష్యత్ కార్యాచరణపై పలు కీలక నిర్ణయాలు తీసుకునే అవకాశం ఉంది. చింతపల్లి, గూడెం మండలాలకు చెందిన జనసేన పార్టీ ముఖ్య నాయకులు, కార్యకర్తలు తప్పక హాజరై సమావేశాన్ని విజయవంతం చేయాలని పార్టీ పాడేరు నియోజకవర్గం IT & సోషల్ మీడియా టీమ్ పిలుపునిచ్చింది.
చింతపల్లిలో జనసేన ముఖ్య నాయకులతో డా. వంపూరు గంగులయ్య కీలక సమావేశం స్థానిక ఎన్నికలకు జనసేన సమరశంఖం చింతపల్లి: స్థానిక సంస్థల ఎన్నికలు సమీపిస్తున్న నేపథ్యంలో జనసేన పార్టీ ఎన్నికల కార్యాచరణకు సిద్ధమవుతోంది. ఇందులో భాగంగా చింతపల్లి జడ్పీ గెస్ట్‌హౌస్‌లో చింతపల్లి, గూడెం మండలాలకు చెందిన జనసేన పార్టీ ముఖ్య నాయకులతో అత్యవసర సమావేశం నిర్వహించనున్నారు. ఉదయం 10 గంటలకు జరగనున్న ఈ సమావేశానికి జానపద కళలు మరియు సృజనాత్మక అకాడమీ చైర్మన్, పాడేరు నియోజకవర్గ జనసేన పార్టీ ఇన్‌చార్జి డా. వంపూరు గంగులయ్య హాజరై పార్టీ శ్రేణులకు దిశానిర్దేశం చేయనున్నారు. స్థానిక సంస్థల ఎన్నికల్లో అనుసరించాల్సిన వ్యూహం, నియోజకవర్గ స్థాయి కార్యాచరణ, పొత్తు ధర్మం, క్షేత్రస్థాయిలో పార్టీ బలోపేతం తదితర అంశాలపై సమావేశంలో కీలకంగా చర్చించనున్నట్లు పార్టీ వర్గాలు వెల్లడించాయి. అలాగే ఎన్నికలను సమర్థవంతంగా ఎదుర్కొనేందుకు జనసేన నాయకులు, కార్యకర్తలను సమాయత్తం చేయడంతో పాటు భవిష్యత్ కార్యాచరణపై పలు కీలక నిర్ణయాలు తీసుకునే అవకాశం ఉంది. చింతపల్లి, గూడెం మండలాలకు చెందిన జనసేన పార్టీ ముఖ్య నాయకులు, కార్యకర్తలు తప్పక హాజరై సమావేశాన్ని విజయవంతం చేయాలని పార్టీ పాడేరు నియోజకవర్గం IT & సోషల్ మీడియా టీమ్ పిలుపునిచ్చింది.
- అనకాపల్లి నుండి శ్రీకాకుళం పుణ్యక్షేత్రాలకు ఉచిత తీర్థ యాత్ర ఎం.వి.ర్ చారిటబుల్ ట్రస్ట్ ఆధ్వర్యంలో భక్తులకు సేవ అనకాపల్లి, సెప్టెంబర్ 16:ప్రజల సేవే పరమ ధర్మం అనే లక్ష్యంతో ఎం.వి.ర్ చారిటబుల్ ట్రస్ట్ ఆధ్వర్యంలో ఉచిత దేవాలయ దర్శన బస్సు యాత్రలు కొనసాగుతున్నాయి. అనకాపల్లి జిల్లా, జీవీఎంసీ పరిధి 82వ వార్డు, నర్సింగరావుపేట, సాయి పద్మ అపార్ట్మెంట్ (BSNL ఆఫీస్ సమీపం) వాస్తవ్యులు మంగళవారం శ్రీకాకుళం జిల్లాలోని ప్రసిద్ధ పుణ్యక్షేత్రాలైన అరసవల్లి శ్రీ సూర్యనారాయణ స్వామి ఆలయం, శ్రీ కూర్మం, శ్రీ కోటిలింగేశ్వర స్వామి ఆలయాల దర్శనానికి బయలుదేరారు. ఈ యాత్రను MVR ట్రస్ట్ అధినేత, బీజేపీ నాయకులు ముత్యాల వెంకటేశ్వరరావు ఏర్పాటు చేశారు. ఈ సందర్భంగా ముత్యాల సూర్యకుమారి కి సన్నిహితురాలైన శ్రీమతి తాటికొండ శ్రీ లక్ష్మి గారు మాట్లాడుతూ, MVR చేస్తున్న సేవా కార్యక్రమాలు అభినందనీయమని కొనియాడారు. ఈ కార్యక్రమంలో MVR చారిటబుల్ ట్రస్ట్ అనకాపల్లి ఇంచార్జి గైపురి రాజు , తాటికొండ కృష్ణమోహన్ , శాంతి , తీగల నగేష్ తదితరులు పాల్గొన్నారు.2
- స్వచ్చత హి సేవా కార్యక్రమాలు విజయవంతం చేయాలి: కలెక్టర్ విజయనగరం జిల్లాలో సెప్టెంబరు 17 నుంచి అక్టోబర్ 2 వరకు ‘స్వచ్ఛత హి సేవా–2026’ కార్యక్రమాలను విజయవంతం చేయాలని కలెక్టర్ ఎస్. రాంసుందర్ రెడ్డి అధికారులను ఆదేశించారు. బుధవారం కలెక్టరేట్ నుంచి నిర్వహించిన వీడియో కాన్ఫరెన్స్‌లో పాఠశాలల పరిశుభ్రత, పబ్లిక్ ప్లేసెస్ డ్రైవ్‌లు, శ్రమదానం, సఫాయి మిత్రుల సంక్షేమ కార్యక్రమాలను షెడ్యూల్ ప్రకారం నిర్వహించాలన్నారు. అధికారులు, ప్రజాప్రతినిధులు సమన్వయంతో పాల్గొని కార్యక్రమాలను విజయవంతం చేయాలని పిలుపునిచ్చారు.1
- విజయనగరం జిల్లా స్వచ్ఛత హే సేవ 2026 విజయవంతం చేయండి : జిల్లా కలెక్టర్ ఎస్ రామ్ సుందర్ రెడ్డి.. విజయనగరం, సెప్టెంబరు 16: జిల్లాలో సెప్టెంబరు 17 నుంచి అక్టోబర్ 2 వరకు నిర్వహించనున్న ‘స్వచ్ఛత హి సేవా - 2026’ కార్యక్రమాలను సమర్థవంతంగా చేపట్టాలని జిల్లా కలెక్టర్ ఎస్. రాంసుందర్ రెడ్డి అధికారులను ఆదేశించారు. బుధవారం కలెక్టరేట్ నుంచి నిర్వహించిన వీడియో కాన్ఫరెన్స్‌లో ఆయన ఈ కార్యక్రమాల షెడ్యూల్ మరియు విధివిధానాలను వెల్లడించారు. *స్వచ్ఛత కార్యక్రమాల షెడ్యూల్ :* సెప్టెంబరు 17 - 18 (స్వచ్ఛ పాఠశాల – యువ ఫర్ స్వచ్ఛత): వ్యర్థాల విభజనపై విద్యార్థులకు అవగాహన, స్వచ్ఛత జ్ఞాన యాత్రలు, వర్షపు నీటి సంరక్షణపై చర్చలు. సెప్టెంబరు 19 - 20 (టార్గెట్ యూనిట్ల సుందరీకరణ): అపరిశుభ్ర ప్రాంతాలను శుభ్రపరచడం, సెల్ఫీలు మరియు సోషల్ మీడియా ద్వారా ప్రచారం. సెప్టెంబరు 21 - 22 (క్లీన్ పబ్లిక్ ప్లేసెస్): బస్టాండ్లు, మార్కెట్లు, ఆసుపత్రులు, నీటి వనరులు మరియు పర్యాటక ప్రాంతాల్లో ప్రత్యేక పారిశుద్ధ్య డ్రైవ్‌లు, సింగిల్ యూజ్ ప్లాస్టిక్ నిరోధక చర్యలు. సెప్టెంబరు 23 - 24 (జన్ భాగీదారి అడ్వొకేసీ డ్రైవ్స్): డోర్-టు-డోర్ ప్రచారం, 4-వే సెగ్రిగేషన్, హోమ్ కంపోస్టింగ్, గుడ్డ సంచుల వాడకంపై అవగాహన. సెప్టెంబరు 25 - 26 (స్పోర్ట్స్ ఫర్ స్వచ్ఛత): వినాయక నిమజ్జనం తర్వాత ఘాట్ల పరిశుభ్రత, క్రీడా మైదానాల్లో జీరో-వేస్ట్ పోటీలు మరియు స్వచ్ఛతా డ్రైవ్‌లు. సెప్టెంబరు 27 (ప్రపంచ పర్యాటక దినోత్సవం): చారిత్రక, పర్యాటక ప్రదేశాల శుభ్రత మరియు పబ్లిక్ టాయిలెట్ల వద్ద దీపాలంకరణ. సెప్టెంబరు 28 - 29 (వ్యర్థాల నుండి సంపద - RRR): వ్యర్థాలతో కళాఖండాలు ('కబాడ్ సే కలా'), రీసైక్లింగ్ మేళాలు, ఉత్తమ సృష్టికర్తల సత్కారం. సెప్టెంబరు 30 (సఫాయి మిత్ర సురక్షా): పారిశుద్ధ్య కార్మికులకు ఆరోగ్య పరీక్షలు, రక్షణ పరికరాల అందజేత, సన్మానం. అక్టోబర్ 1 (శ్రమదానం): ‘ఏక్ దిన్, ఏక్ ఘంటా, ఏక్ సాత్’ కార్యక్రమంలో భాగంగా ప్రజలు, అధికారుల సమిష్టి శ్రమదానం. అక్టోబర్ 2 (స్వచ్ఛ భారత్ దివస్): ప్రత్యేక గ్రామసభలు, పట్టణ కౌన్సిల్ సమావేశాలు, మొక్కలు నాటే కార్యక్రమాలు. *అధికారులకు ముఖ్యమైన ఆదేశాలు:* పట్టణ, గ్రామీణ ప్రాంతాల్లో ముందుగానే స్పష్టమైన షెడ్యూల్ రూపొందించి పూర్తిస్థాయిలో డాక్యుమెంటేషన్ చేయాలి. ప్రజా మరుగుదొడ్లను సురక్షితమైన, శుభ్రమైన ప్రమాణాలకు అనుగుణంగా నిర్వహించాలి. అధికారులు, స్థానిక సంస్థలు, ప్రజాప్రతినిధులు సమన్వయంతో పనిచేసి ఈ కార్యక్రమాన్ని విజయవంతం చేయాలని కలెక్టర్ పిలుపునిచ్చారు. ఈ సమావేశంలో డీఈవో మాణిక్యం నాయుడు, డీపీవో మల్లికార్జునరావు, మున్సిపల్ కమిషనర్ బాలస్వామి, సీపీవో పీ. బాలాజీ తదితర అధికారులు, ఆన్లైన్ ద్వారా ఎంపిడివోలు, మున్సిపల్ కమిషనర్లు పాల్గొన్నారు.1
- మహిళ హత్య కేసులో నిందితుడు అరెస్టు వివాహేతర సంబంధం కొనసాగించాలంటూ ఒత్తిడి.. నిరాకరించడంతో హత్య విజయనగరం, సెప్టెంబరు 16: పూసపాటిరేగ పోలీస్‌స్టేషన్ పరిధిలో నమోదైన మహిళ హత్య కేసును పోలీసులు ఛేదించారు. కేసులో నిందితుడైన పూసపాటిరేగ మండలం పెద్ద నడిపల్లి గ్రామానికి చెందిన లంకలపల్లి బంగారుబాబు (28)ను అరెస్టు చేశారు. ఈ వివరాలను జిల్లా ఎస్పీ ఎ.ఆర్. దామోదర్, ఐపీఎస్ బుధవారం జిల్లా పోలీసు కార్యాలయంలో నిర్వహించిన మీడియా సమావేశంలో వెల్లడించారు. ఎస్పీ తెలిపిన వివరాల ప్రకారం.. పెద్ద నడిపల్లి గ్రామానికి చెందిన శీల అప్పారావు తన భార్య శీల రమ (37) కనిపించడం లేదని సెప్టెంబరు 14న పోలీసులకు ఫిర్యాదు చేశారు. దీంతో పూసపాటిరేగ పోలీసులు మహిళ అదృశ్యంపై కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు. అనంతరం శీల రమ మృతదేహం లభించడంతో కేసును హత్య కేసుగా మార్చారు. డీఎస్పీలు పి.వి.వి. నరసింహారావు, ఎస్. రాఘవులు ఆధ్వర్యంలో భోగాపురం రూరల్ సీఐ ఎన్. శ్రీనివాసరావు దర్యాప్తు చేపట్టారు. పోలీసుల కథనం ప్రకారం.. మృతురాలు శీల రమ, నిందితుడు బంగారుబాబుకు గత నాలుగేళ్లుగా వివాహేతర సంబంధం ఉంది. అయితే గత నాలుగు నెలలుగా రమ అతడిని దూరం పెట్టింది. అతడి ఫోన్ కాల్స్‌కు సరిగా స్పందించలేదు. దీంతో ఆమె మరొకరితో సంబంధం పెట్టుకుందనే అనుమానం బంగారుబాబులో పెరిగింది. దీంతో ఆమెపై కక్ష పెంచుకున్నాడు. సెప్టెంబరు 14న ఉదయం 11 గంటల సమయంలో బంగారుబాబు రమకు ఫోన్ చేశాడు. కొద్దిసేపు మాట్లాడిన అనంతరం ఆమె ఫోన్ పెట్టేసింది. మధ్యాహ్నం 2 గంటల సమయంలో రమ మరోసారి బంగారుబాబుకు ఫోన్ చేసింది. ఇంట్లో ఎవరూ లేరని చెప్పిన అతడు, తనతో మాట్లాడేందుకు ఇంటికి రావాలని ఆమెను కోరాడు. అతడి మాటలు నమ్మిన రమ అతడి ఇంటికి వెళ్లింది. వివాహేతర సంబంధాన్ని కొనసాగించాలని బంగారుబాబు ఆమెపై ఒత్తిడి చేసినట్లు పోలీసులు తెలిపారు. సంబంధాన్ని కొనసాగించకపోతే ఈ విషయాన్ని భర్తకు చెబుతానని బెదిరించినట్లు పేర్కొన్నారు. ఈ క్రమంలో ఇద్దరి మధ్య ఘర్షణ జరిగింది. ఆగ్రహానికి గురైన బంగారుబాబు దిండుతో రమ ముక్కు, నోటిని అదిమి ఊపిరాడకుండా చేసి హత్య చేసినట్లు పోలీసులు తెలిపారు. అనంతరం మృతదేహాన్ని మాయం చేయాలని భావించాడు. గోనె సంచిలో మృతదేహాన్ని ఉంచాడు. మోటార్‌సైకిల్‌పై సారిపల్లి కొండ సమీప ప్రాంతానికి తీసుకెళ్లి అక్కడ పడేసినట్లు ఎస్పీ తెలిపారు. సాంకేతిక ఆధారాలతో ఛేదింపు దర్యాప్తులో భాగంగా పోలీసులు సాంకేతిక ఆధారాలను సేకరించారు. బంగారుబాబుపై అనుమానంతో అదుపులోకి తీసుకుని విచారించారు. విచారణలో నేరాన్ని అంగీకరించినట్లు ఎస్పీ తెలిపారు. క్లూస్ టీం సహకారంతో నేరస్థలాన్ని క్షుణ్ణంగా పరిశీలించారు. సాంకేతిక, శాస్త్రీయ ఆధారాలను సేకరించారు. మృతదేహాన్ని తరలించేందుకు ఉపయోగించిన మోటార్‌సైకిల్, నిందితుడు వినియోగించిన మొబైల్‌ఫోన్‌ను ఫోరెన్సిక్ నిపుణుల సహకారంతో స్వాధీనం చేసుకున్నారు. కేసు దర్యాప్తును వేగవంతం చేసి త్వరలో న్యాయస్థానంలో అభియోగపత్రం దాఖలు చేయనున్నట్లు ఎస్పీ తెలిపారు. నిందితుడికి శిక్ష పడేలా చట్టపరమైన చర్యలు చేపడుతున్నామన్నారు. కేసులో చురుకుగా పనిచేసిన భోగాపురం రూరల్ సీఐ ఎన్. శ్రీనివాసరావు, పూసపాటిరేగ ఎస్‌ఐ అరుణ్ కిరణ్, కానిస్టేబుళ్లు సతీష్, వాసులను ఎస్పీ ప్రత్యేకంగా అభినందించారు. వివాహేతర సంబంధాలకు దూరంగా ఉండాలి వివాహేతర సంబంధాలు కుటుంబాలను విచ్ఛిన్నం చేస్తాయని ఎస్పీ ఎ.ఆర్. దామోదర్ తెలిపారు. చిన్న వయసులోనే పిల్లలను నిరాశ్రయులను చేసి వారి జీవితాలపై తీవ్ర ప్రభావం చూపుతాయని పేర్కొన్నారు. ప్రజలు ఇటువంటి సంబంధాలకు దూరంగా ఉండాలని సూచించారు. మీడియా సమావేశంలో డీఎస్పీలు ఎస్. రాఘవులు, మహిళా పోలీస్‌స్టేషన్ డీఎస్పీ పి.వి.వి. నరసింహారావు, భోగాపురం రూరల్ సీఐ ఎన్. శ్రీనివాసరావు, స్పెషల్ బ్రాంచ్ సీఐ ఎ.వి. లీలారావు, పూసపాటిరేగ ఎస్‌ఐ అరుణ్ కిరణ్, నెల్లిమర్ల ఎస్‌ఐ గోపాలరావు పాల్గొన్నారు.1
- ఆఫీస్‌లోకి కత్తితో వచ్చి దాడికి యత్నం................. మంగమారిపేటలో అడ్వకేట్ సూరాడ నరసింగరావుపై కత్తితో దాడికి యత్నించారంటూ చల్లపిల్లి అప్పలరాజుపై ఆరోపణలు వచ్చాయి. తాను కార్యాలయంలో ఉండగా అప్పలరాజు కత్తితో ఆఫీస్‌లోకి వచ్చి తనపై దాడికి ప్రయత్నించాడని నరసింగరావు ఆరోపించారు. ఈ ఘటనకు సంబంధించిన వీడియో ఆధారాలు తమ వద్ద ఉన్నాయని పేర్కొంటూ బాధితుడు విశాఖ పోలీస్ కమిషనర్‌కు ఫిర్యాదు చేశారు. తనపై కక్షతోనే దాడికి యత్నించారని ఆరోపించిన ఆయన.. అప్పలరాజుతో పాటు ఈ ఘటనకు సహకరించిన వారిపైనా చట్టపరమైన చర్యలు తీసుకోవాలని కోరారు.1
- నెల్లిమర్ల నగరం లో వినాయక మండపంలో పిల్లలకు ఆటల పోటీలు.. నెల్లిమర్ల నగర పంచాయతీ పరిధి జిమ్ గ్రౌండ్ వద్ద ఉన్న గణేష్ మండపం వద్ద బుధవారం సాయంత్రం పిల్లలకు ఆటల పోటీలు నిర్వహించారు. వినాయకుని ఐదు రోజుల్లో భాగంగా.. ఈరోజు సాయంత్రం పిల్లలకు క్రికెట్, మ్యూజికల్ చైర్, టగ్ ఆఫ్ వార్, లెమన్ స్పూన్ తదితర ఆటలు ఆడించడంతో పిల్లలు ఆనందంగా పాల్గొన్నారు. పిల్లలు ఆడిన ఆటలు చూసి తమ తల్లిదండ్రులు వాళ్ళలో ఉత్సాహం నింపారు.1
- బొబ్బిలి మండల పరిషత్ కార్యాలయం ఆవరణలోని హౌసింగ్, వెలుగు, వ్యవసాయ శాఖ కార్యాలయాలు నీట మునిగాయి. పట్టణంలో కురిసిన వర్షానికి వరదనీరు కార్యాలయాల చుట్టూ నిలవడంతో రాకపోకలకు అధికారులు, ప్రజలు, రైతులు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. వరదనీరు వెళ్లేందుకు సరైన సౌకర్యం లేకపోవడంతో ఈ సమస్య తలెత్తిందని తెలిపారు. అధికారులు స్పందించి నీరు నిలవకుండా తగిన చర్యలు తీసుకోవాలని కోరుతున్నారు. జలదిగ్బంధంలో ప్రభుత్వ కార్యాలయాలు1
- మహిళ హత్య కేసులో నిందితుడు అరెస్టు వివాహేతర సంబంధం కొనసాగించాలంటూ ఒత్తిడి.. నిరాకరించడంతో హత్య విజయనగరం, సెప్టెంబరు 16: పూసపాటిరేగ పోలీస్‌స్టేషన్ పరిధిలో నమోదైన మహిళ హత్య కేసును పోలీసులు ఛేదించారు. కేసులో నిందితుడైన పూసపాటిరేగ మండలం పెద్ద నడిపల్లి గ్రామానికి చెందిన లంకలపల్లి బంగారుబాబు (28)ను అరెస్టు చేశారు. ఈ వివరాలను జిల్లా ఎస్పీ ఎ.ఆర్. దామోదర్, ఐపీఎస్ బుధవారం జిల్లా పోలీసు కార్యాలయంలో నిర్వహించిన మీడియా సమావేశంలో వెల్లడించారు. ఎస్పీ తెలిపిన వివరాల ప్రకారం.. పెద్ద నడిపల్లి గ్రామానికి చెందిన శీల అప్పారావు తన భార్య శీల రమ (37) కనిపించడం లేదని సెప్టెంబరు 14న పోలీసులకు ఫిర్యాదు చేశారు. దీంతో పూసపాటిరేగ పోలీసులు మహిళ అదృశ్యంపై కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు. అనంతరం శీల రమ మృతదేహం లభించడంతో కేసును హత్య కేసుగా మార్చారు. డీఎస్పీలు పి.వి.వి. నరసింహారావు, ఎస్. రాఘవులు ఆధ్వర్యంలో భోగాపురం రూరల్ సీఐ ఎన్. శ్రీనివాసరావు దర్యాప్తు చేపట్టారు. పోలీసుల కథనం ప్రకారం.. మృతురాలు శీల రమ, నిందితుడు బంగారుబాబుకు గత నాలుగేళ్లుగా వివాహేతర సంబంధం ఉంది. అయితే గత నాలుగు నెలలుగా రమ అతడిని దూరం పెట్టింది. అతడి ఫోన్ కాల్స్‌కు సరిగా స్పందించలేదు. దీంతో ఆమె మరొకరితో సంబంధం పెట్టుకుందనే అనుమానం బంగారుబాబులో పెరిగింది. దీంతో ఆమెపై కక్ష పెంచుకున్నాడు. సెప్టెంబరు 14న ఉదయం 11 గంటల సమయంలో బంగారుబాబు రమకు ఫోన్ చేశాడు. కొద్దిసేపు మాట్లాడిన అనంతరం ఆమె ఫోన్ పెట్టేసింది. మధ్యాహ్నం 2 గంటల సమయంలో రమ మరోసారి బంగారుబాబుకు ఫోన్ చేసింది. ఇంట్లో ఎవరూ లేరని చెప్పిన అతడు, తనతో మాట్లాడేందుకు ఇంటికి రావాలని ఆమెను కోరాడు. అతడి మాటలు నమ్మిన రమ అతడి ఇంటికి వెళ్లింది. వివాహేతర సంబంధాన్ని కొనసాగించాలని బంగారుబాబు ఆమెపై ఒత్తిడి చేసినట్లు పోలీసులు తెలిపారు. సంబంధాన్ని కొనసాగించకపోతే ఈ విషయాన్ని భర్తకు చెబుతానని బెదిరించినట్లు పేర్కొన్నారు. ఈ క్రమంలో ఇద్దరి మధ్య ఘర్షణ జరిగింది. ఆగ్రహానికి గురైన బంగారుబాబు దిండుతో రమ ముక్కు, నోటిని అదిమి ఊపిరాడకుండా చేసి హత్య చేసినట్లు పోలీసులు తెలిపారు. అనంతరం మృతదేహాన్ని మాయం చేయాలని భావించాడు. గోనె సంచిలో మృతదేహాన్ని ఉంచాడు. మోటార్‌సైకిల్‌పై సారిపల్లి కొండ సమీప ప్రాంతానికి తీసుకెళ్లి అక్కడ పడేసినట్లు ఎస్పీ తెలిపారు. సాంకేతిక ఆధారాలతో ఛేదింపు దర్యాప్తులో భాగంగా పోలీసులు సాంకేతిక ఆధారాలను సేకరించారు. బంగారుబాబుపై అనుమానంతో అదుపులోకి తీసుకుని విచారించారు. విచారణలో నేరాన్ని అంగీకరించినట్లు ఎస్పీ తెలిపారు.క్లూస్ టీం సహకారంతో నేరస్థలాన్ని క్షుణ్ణంగా పరిశీలించారు. సాంకేతిక, శాస్త్రీయ ఆధారాలను సేకరించారు. మృతదేహాన్ని తరలించేందుకు ఉపయోగించిన మోటార్‌సైకిల్, నిందితుడు వినియోగించిన మొబైల్‌ఫోన్‌ను ఫోరెన్సిక్ నిపుణుల సహకారంతో స్వాధీనం చేసుకున్నారు.కేసు దర్యాప్తును వేగవంతం చేసి త్వరలో న్యాయస్థానంలో అభియోగపత్రం దాఖలు చేయనున్నట్లు ఎస్పీ తెలిపారు. నిందితుడికి శిక్ష పడేలా చట్టపరమైన చర్యలు చేపడుతున్నామన్నారు. కేసులో చురుకుగా పనిచేసిన భోగాపురం రూరల్ సీఐ ఎన్. శ్రీనివాసరావు, పూసపాటిరేగ ఎస్‌ఐ అరుణ్ కిరణ్, కానిస్టేబుళ్లు సతీష్, వాసులను ఎస్పీ ప్రత్యేకంగా అభినందించారు. వివాహేతర సంబంధాలకు దూరంగా ఉండాలి వివాహేతర సంబంధాలు కుటుంబాలను విచ్ఛిన్నం చేస్తాయని ఎస్పీ ఎ.ఆర్. దామోదర్ తెలిపారు. చిన్న వయసులోనే పిల్లలను నిరాశ్రయులను చేసి వారి జీవితాలపై తీవ్ర ప్రభావం చూపుతాయని పేర్కొన్నారు. ప్రజలు ఇటువంటి సంబంధాలకు దూరంగా ఉండాలని సూచించారు. మీడియా సమావేశంలో డీఎస్పీలు ఎస్. రాఘవులు, మహిళా పోలీస్‌స్టేషన్ డీఎస్పీ పి.వి.వి. నరసింహారావు, భోగాపురం రూరల్ సీఐ ఎన్. శ్రీనివాసరావు, స్పెషల్ బ్రాంచ్ సీఐ ఎ.వి. లీలారావు, పూసపాటిరేగ ఎస్‌ఐ అరుణ్ కిరణ్, నెల్లిమర్ల ఎస్‌ఐ గోపాలరావు పాల్గొన్నారు.1