నర్సంపేట గడ్డపై 1000 రోజుల కాంగ్రెస్ పాలనపై బగ్గుమన్న బీఆర్ఎస్ సమరభేరి 1000 రోజుల కాంగ్రెస్ పాలనపై బగ్గుమన్న బీఆర్ఎస్ శ్రేణులుఎన్నికల ముందు ఇచ్చిన హామీల అమలులో వైఫల్యంపై నిరసన6 గ్యారెంటీల అమలు ఎక్కడ అంటూ ప్రభుత్వాన్ని నిలదీస్తూ బిఆర్ఎస్ పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ గౌరవ శ్రీ కేటీఆర్ గారి ఆదేశాల మేరకు నర్సంపేట పట్టణంలోని అమరవీరుల స్తూపం వద్ద ప్లకార్డులతో నిరసన తెలియజేసిన నియోజకవర్గ బిఆర్ఎస్ పార్టీ శ్రేణులు ఈ కార్యక్రమానికి పరిశీలకలుగా మాజీ శాసనసభ్యులు ముత్తిరెడ్డి యాదగిరిరెడ్డి, రాష్ట్ర నాయకులు ఏనుగల రాకేష్ రెడ్డి హాజరైనారు. ఈ సందర్భంగా మాజీ శాసనసభ్యులు ముత్తిరెడ్డి యాదగిరి రెడ్డి మాట్లాడుతూ అటకెక్కిన ఆరు గ్యారెంటీలు ఎగవేసిన హామీలు. అతీగతీ లేనిడిక్లరేషన్లు మాట మార్చిన మేనిఫెస్టో! అధికారం కోసం అలవికాని హామీలిచ్చిన కాంగ్రెస్ ఏరుదాటాకతెప్ప తగలేసింది. 420 హామీలు నెరవేర్చకపోగా పలు సంక్షేమ పథకాలను నీరుగార్చింది. ఆరు గ్యారంటీలు ఇచ్చి 1000 రోజులు దాటినా హామీల అమలులో కాంగ్రెస్ ప్రభుత్వం విఫలం ఎన్నికల సమయంలో తెలంగాణ ప్రజలకు ఆరు గ్యారంటీల పేరుతో అనేక హామీలు ఇచ్చి అధికారంలోకి వచ్చిన కాంగ్రెస్ ప్రభుత్వం, 1000 రోజులు దాటినా ఇచ్చిన హామీలను పూర్తిస్థాయిలో అమలు చేయడంలో విఫలమైంది. కాంగ్రెస్ పార్టీ ఎన్నికల సమయంలో ఇచ్చిన ఆరు గ్యారంటీలను ప్రజలు విశ్వసించి అధికారాన్ని అప్పగించారు. అధికారంలోకి వచ్చిన తర్వాత అనేక హామీలను పూర్తిస్థాయిలో అమలు చేయకుండా ప్రజలను మోసం చేసింది కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం. మహిళలకు నెలకు రూ.2,500 ఆర్థిక సహాయం, వృద్ధులు, వితంతువులకు రూ.4,000 పెన్షన్, రైతులు, కౌలు రైతులకు ఇచ్చిన హామీలు, విద్యార్థులకు రూ.5 లక్షల విద్యా భరోసా కార్డు, ఇందిరమ్మ ఇళ్ల హామీ వంటి అంశాలను ప్రభుత్వం వెంటనే అమలు చేయాలని ఆయన డిమాండ్ చేశారు. బీఆర్‌ఎస్ పాలన లో రైతు బంధు, రైతు బీమా, 24 గంటల ఉచిత విద్యుత్, ఆసరా పెన్షన్లు, కల్యాణ లక్ష్మి, మిషన్ భగీరథ వంటి అనేక సంక్షేమ, అభివృద్ధి కార్యక్రమాలు అమలు చేశామని అన్నారు.... రాష్ట్ర నాయకులు ఏనుగుల రాకేష్ రెడ్డి మాట్లాడుతూ అసమర్థ కాంగ్రెస్ 1000 రోజుల పాలనను ఎండగడుతూ బీఆర్ఎస్ పార్టీ ఆధ్వర్యంలో నర్సంపేట లో సమరభేరి నిర్వహించడం జరిగింది. దగాకోరు కాంగ్రెస్ విధానాలను 1000 రోజుల విధ్వంసాన్ని నర్సంపేట గులాబీ సైనికులు నియోజకవర్గ నలుమూలల నుండి విచ్చేసి కథం తొక్కినారు. 100 తప్పులతో శిశుపాలుని తల తెగిపడినట్టు, ఈ రోజు 1000 రోజుల కాంగ్రెస్ విధ్వంస పాలనతో 420 అబద్ధాల కాంగ్రెస్ సర్కార్ కూలిపోవడం ఖాయం. మూడేళ్ల పాలనలోనే ముప్పై ఏళ్ళు తెలంగాణను వెనక్కి నెట్టిన కాంగ్రెస్ ప్రభుత్వ పాలన వైఫల్యాలను అడుగడుగునా ఎండగట్టడానికి ప్రతీ గులాభి సైనికుడు కదిలి రావాలని పిలుపునివ్వడం జరిగింది.
నర్సంపేట గడ్డపై 1000 రోజుల కాంగ్రెస్ పాలనపై బగ్గుమన్న బీఆర్ఎస్ సమరభేరి 1000 రోజుల కాంగ్రెస్ పాలనపై బగ్గుమన్న బీఆర్ఎస్ శ్రేణులుఎన్నికల ముందు ఇచ్చిన హామీల అమలులో వైఫల్యంపై నిరసన6 గ్యారెంటీల అమలు ఎక్కడ అంటూ ప్రభుత్వాన్ని నిలదీస్తూ బిఆర్ఎస్ పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ గౌరవ శ్రీ కేటీఆర్ గారి ఆదేశాల మేరకు నర్సంపేట పట్టణంలోని అమరవీరుల స్తూపం వద్ద ప్లకార్డులతో నిరసన తెలియజేసిన నియోజకవర్గ బిఆర్ఎస్ పార్టీ శ్రేణులు ఈ కార్యక్రమానికి పరిశీలకలుగా మాజీ శాసనసభ్యులు ముత్తిరెడ్డి యాదగిరిరెడ్డి, రాష్ట్ర నాయకులు ఏనుగల రాకేష్ రెడ్డి హాజరైనారు. ఈ సందర్భంగా మాజీ శాసనసభ్యులు ముత్తిరెడ్డి యాదగిరి రెడ్డి మాట్లాడుతూ అటకెక్కిన ఆరు గ్యారెంటీలు ఎగవేసిన హామీలు. అతీగతీ లేనిడిక్లరేషన్లు మాట మార్చిన మేనిఫెస్టో! అధికారం కోసం అలవికాని హామీలిచ్చిన కాంగ్రెస్ ఏరుదాటాకతెప్ప తగలేసింది. 420 హామీలు నెరవేర్చకపోగా పలు సంక్షేమ పథకాలను నీరుగార్చింది. ఆరు గ్యారంటీలు ఇచ్చి 1000 రోజులు దాటినా హామీల అమలులో కాంగ్రెస్ ప్రభుత్వం విఫలం ఎన్నికల సమయంలో తెలంగాణ ప్రజలకు ఆరు గ్యారంటీల పేరుతో అనేక హామీలు ఇచ్చి అధికారంలోకి వచ్చిన కాంగ్రెస్ ప్రభుత్వం, 1000 రోజులు దాటినా ఇచ్చిన హామీలను పూర్తిస్థాయిలో అమలు చేయడంలో విఫలమైంది. కాంగ్రెస్ పార్టీ ఎన్నికల సమయంలో ఇచ్చిన ఆరు గ్యారంటీలను ప్రజలు విశ్వసించి అధికారాన్ని అప్పగించారు. అధికారంలోకి వచ్చిన తర్వాత అనేక హామీలను పూర్తిస్థాయిలో అమలు చేయకుండా ప్రజలను మోసం చేసింది కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం. మహిళలకు నెలకు రూ.2,500 ఆర్థిక సహాయం, వృద్ధులు, వితంతువులకు రూ.4,000 పెన్షన్, రైతులు, కౌలు రైతులకు ఇచ్చిన హామీలు, విద్యార్థులకు రూ.5 లక్షల విద్యా భరోసా కార్డు, ఇందిరమ్మ ఇళ్ల హామీ వంటి అంశాలను ప్రభుత్వం వెంటనే అమలు చేయాలని ఆయన డిమాండ్ చేశారు. బీఆర్‌ఎస్ పాలన లో రైతు బంధు, రైతు బీమా, 24 గంటల ఉచిత విద్యుత్, ఆసరా పెన్షన్లు, కల్యాణ లక్ష్మి, మిషన్ భగీరథ వంటి అనేక సంక్షేమ, అభివృద్ధి కార్యక్రమాలు అమలు చేశామని అన్నారు.... రాష్ట్ర నాయకులు ఏనుగుల రాకేష్ రెడ్డి మాట్లాడుతూ అసమర్థ కాంగ్రెస్ 1000 రోజుల పాలనను ఎండగడుతూ బీఆర్ఎస్ పార్టీ ఆధ్వర్యంలో నర్సంపేట లో సమరభేరి నిర్వహించడం జరిగింది. దగాకోరు కాంగ్రెస్ విధానాలను 1000 రోజుల విధ్వంసాన్ని నర్సంపేట గులాబీ సైనికులు నియోజకవర్గ నలుమూలల నుండి విచ్చేసి కథం తొక్కినారు. 100 తప్పులతో శిశుపాలుని తల తెగిపడినట్టు, ఈ రోజు 1000 రోజుల కాంగ్రెస్ విధ్వంస పాలనతో 420 అబద్ధాల కాంగ్రెస్ సర్కార్ కూలిపోవడం ఖాయం. మూడేళ్ల పాలనలోనే ముప్పై ఏళ్ళు తెలంగాణను వెనక్కి నెట్టిన కాంగ్రెస్ ప్రభుత్వ పాలన వైఫల్యాలను అడుగడుగునా ఎండగట్టడానికి ప్రతీ గులాభి సైనికుడు కదిలి రావాలని పిలుపునివ్వడం జరిగింది.
- ప్రజలు సంతోషంగా ఉన్నారు : కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు పైడాకుల అశోక్ ప్రజలంతా సంతోషంగా ఉంటే.. బీఆర్ఎస్ నేతలకు ఎందుకు బాధ? వెయ్యి రోజుల ప్రజాపాలనపై బీఆర్ఎస్‌కు ఘాటు కౌంటర్.. ములుగు జిల్లా కాంగ్రెస్ అధ్యక్షులు పైడాకుల అశోక్ ములుగు: తెలంగాణ రాష్ట్రంలో కాంగ్రెస్ ప్రభుత్వం ప్రజాపాలనకు శ్రీకారం చుట్టి వెయ్యి రోజులు పూర్తిచేసుకున్న సందర్భంగా రాష్ట్ర ప్రజలు సంతోషంగా ఉన్నారని, అయితే ప్రజల సంతోషాన్ని చూసి బీఆర్ఎస్ పార్టీ నాయకులు, ఆ పార్టీ సోషల్ మీడియా ఇన్‌చార్జులు మాత్రం అసహనంతో ఉన్నారని ములుగు జిల్లా కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు పైడాకుల అశోక్ ఘాటుగా విమర్శించారు. ప్రజలకు ఇచ్చిన హామీలను ఒక్కొక్కటిగా అమలు చేస్తూ కాంగ్రెస్ ప్రభుత్వం ముందుకు సాగుతుంటే బీఆర్ఎస్ నాయకులు ఎందుకు సంతోషంగా లేరని ఆయన ప్రశ్నించారు. “మీరు ఇచ్చిన హామీలను మీరు నెరవేర్చకపోతే.. మేము నెరవేరుస్తున్నందుకు కూడా సంతోషంగా లేరా?” అంటూ బీఆర్ఎస్ నేతలను నిలదీశారు. మహిళలకు ఉచిత బస్సు ప్రయాణం కల్పించినా బాధేనా? తెలంగాణలో మహిళలకు ఆర్టీసీ బస్సుల్లో ఉచిత ప్రయాణ సౌకర్యం కల్పించి వారి ఆర్థిక భారాన్ని తగ్గించినా బీఆర్ఎస్ నాయకులకు సంతోషం కలగడం లేదా అని అశోక్ ప్రశ్నించారు. మహిళలు రాష్ట్రవ్యాప్తంగా స్వేచ్ఛగా ప్రయాణిస్తూ ఈ పథకం ద్వారా ప్రయోజనం పొందుతున్నారని తెలిపారు. పేదలకు ఇందిరమ్మ ఇళ్లు ఇచ్చినా ఓర్వలేరా? రాష్ట్రవ్యాప్తంగా ఏడు లక్షలకు పైగా ఇందిరమ్మ ఇళ్లను మంజూరు చేయడం, ములుగు నియోజకవర్గానికి 5 వేల ఇళ్లను కేటాయించడం ద్వారా పేదల సొంతింటి కలను సాకారం చేసే దిశగా కాంగ్రెస్ ప్రభుత్వం ముందుకు సాగుతోందని అశోక్ అన్నారు. “పేద కుటుంబానికి సొంత ఇల్లు వస్తే సంతోషించాల్సింది పోయి.. దానిపై కూడా రాజకీయాలు చేయడం ఎందుకు?” అని బీఆర్ఎస్ నాయకులను ప్రశ్నించారు. రేషన్ కార్డులు, సన్నబియ్యం ఇచ్చినా బాధేనా? అర్హులైన పేద కుటుంబాలకు రేషన్ కార్డులు అందించడం, పేదలకు నాణ్యమైన సన్నబియ్యం అందించేందుకు ప్రభుత్వం చర్యలు తీసుకోవడం కూడా బీఆర్ఎస్ నాయకులకు నచ్చడం లేదా అని ఆయన ప్రశ్నించారు. పేదల కడుపు నిండితే సంతోషించాల్సిన బాధ్యత ప్రతిపక్షానిదని, కానీ ప్రజలకు మేలు జరుగుతుంటే దాన్ని కూడా రాజకీయం చేయడం బీఆర్ఎస్ నాయకుల వైఖరికి నిదర్శనమని విమర్శించారు. ఉద్యోగాలు భర్తీ చేసినా అసంతృప్తేనా? యువతకు ఉద్యోగ అవకాశాలు కల్పించే దిశగా ఉపాధ్యాయ పోస్టులు, గ్రూప్-1 వంటి ఉద్యోగ నియామక ప్రక్రియలను చేపట్టినప్పటికీ బీఆర్ఎస్ నాయకులు సంతోషంగా లేరని అశోక్ అన్నారు. “నిరుద్యోగ యువతకు ఉద్యోగం వస్తే అది ఏ పార్టీకి చెందిన ప్రభుత్వ విజయమో కాదు.. తెలంగాణ యువత విజయం. మరి యువతకు ఉద్యోగాలు వస్తుంటే ఎందుకు ఓర్వలేకపోతున్నారు?” అని ప్రశ్నించారు. రైతులకు రూ.2 లక్షల రుణమాఫీ చేసినా బాధేనా? రైతులకు ఏకకాలంలో రూ.2 లక్షల వరకు రుణమాఫీ చేసి రైతు కుటుంబాలకు కాంగ్రెస్ ప్రభుత్వం అండగా నిలిచిందని అశోక్ తెలిపారు. రైతులు పండించిన ధాన్యాన్ని కొనుగోలు కేంద్రాల ద్వారా సేకరిస్తూ, రైతులకు మద్దతుగా ప్రభుత్వం పనిచేస్తోందన్నారు. “రైతు రుణభారం తగ్గితే.. రైతు కుటుంబంలో ఆనందం కనిపిస్తే.. ఆ ఆనందాన్ని చూసి కూడా బీఆర్ఎస్ నాయకులు ఎందుకు సంతోషించలేకపోతున్నారు?” అని ఆయన నిలదీశారు. మహిళా సంఘాలకు వడ్డీలేని రుణాలు ఇచ్చినా అసూయేనా? మహిళా సంఘాలను ఆర్థికంగా బలోపేతం చేసేందుకు వడ్డీలేని రుణాలు అందిస్తూ మహిళలకు స్వయం ఉపాధి, ఆర్థిక స్వావలంబన దిశగా ప్రభుత్వం ప్రోత్సాహం అందిస్తోందని అశోక్ అన్నారు. మహిళలు ఆర్థికంగా ఎదగడం, కుటుంబాలకు అండగా నిలవడం కూడా బీఆర్ఎస్ నాయకులకు నచ్చడం లేదా అని ప్రశ్నించారు. ప్రగతి భవన్ కంచె తొలగించినా బాధేనా? అధికార కేంద్రాల చుట్టూ ఉన్న అడ్డంకులను తొలగించి ప్రజలకు పాలనను చేరువ చేయాలనే ఉద్దేశంతో ప్రగతి భవన్ ముందు ఉన్న కంచెను తొలగించి ప్రజా భవన్‌గా మార్చిన విషయాన్ని అశోక్ గుర్తుచేశారు. “ప్రజలు తమ సమస్యలు చెప్పుకోవడానికి ప్రభుత్వాన్ని కలిసే అవకాశం కల్పిస్తే.. అది కూడా బీఆర్ఎస్ నాయకులకు బాధగా ఉందా?” అని ప్రశ్నించారు. “ప్రజల సంతోషమే కాంగ్రెస్ ప్రభుత్వానికి అసలైన విజయచిహ్నం” వెయ్యి రోజుల ప్రజాపాలనలో మహిళలు, రైతులు, పేదలు, యువత, ఉద్యోగులు, కార్మికులు ఇలా అన్ని వర్గాల సంక్షేమానికి కాంగ్రెస్ ప్రభుత్వం కృషి చేస్తోందని పైడాకుల అశోక్ అన్నారు. “తెలంగాణ ప్రజలు సంతోషంగా ఉన్నారు. పేదలకు ఇళ్లు వస్తున్నాయి.. మహిళలకు ఉచిత బస్సు ప్రయాణం అందుతోంది.. రైతులకు రుణమాఫీ జరుగుతోంది.. యువతకు ఉద్యోగాలు వస్తున్నాయి.. మహిళా సంఘాలకు వడ్డీలేని రుణాలు అందుతున్నాయి.. రేషన్ కార్డులు, సన్నబియ్యం అందుతున్నాయి. మరి ప్రజలంతా సంతోషంగా ఉంటే బీఆర్ఎస్ నాయకులకు, వారి సోషల్ మీడియా బృందాలకు మాత్రమే ఎందుకు బాధ?” అని ఆయన ఘాటుగా ప్రశ్నించారు. ప్రజలకు మంచి జరిగితే ప్రతిపక్షం అభినందించాలి.. కానీ ప్రజల సంతోషాన్ని చూసి ఓర్వలేక విమర్శలు చేయడం బీఆర్ఎస్ రాజకీయ దుస్థితికి నిదర్శనమని అశోక్ విమర్శించారు. వెయ్యి రోజుల ప్రజాపాలనకు ప్రజలే సాక్ష్యం.. ప్రజల సంక్షేమమే కాంగ్రెస్ ప్రభుత్వానికి కొలమానం.. ప్రజల సంతోషమే తమకు అసలైన విజయమని ములుగు జిల్లా కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు పైడాకుల అశోక్ స్పష్టం చేశారు.1
- యాంగ్ ఇండియా స్కిల్ యూనివర్సిటీ వీసీ కే స్కిల్ లేదు ఆయనకు పిహెచ్డీ లేదు,డాక్టరేట్ లేదు యూనివర్సిటీలో వందల మంది స్టాఫ్ యాంగ్ ఇండియా స్కిల్ యూనివర్సిటీ వీసీ కే స్కిల్ లేదు ఆయనకు పిహెచ్డీ లేదు,డాక్టరేట్ లేదు యూనివర్సిటీలో వందల మంది స్టాఫ్ ఉండాలి కానీ ఉన్నది కేవలం ఆరుగురు పాలిటెక్నిక్ వ్యవస్థను డిస్టర్బ్ చేస్తే ఊరుకోను చెల్లెమ్మ.... అది జరగకుండా చూస్తా ఇది తీన్మార్ మల్లన్నగా నా హామీ1
- ఖమ్మంలో బీఆర్ఎస్ ధర్నా.. కాంగ్రెస్ ప్రభుత్వంపై పువ్వాడ అజయ్ ఫైర్ ఖమ్మం జడ్పీ సెంటర్‌లో మాజీ మంత్రి, బీఆర్ఎస్ నేత పువ్వాడ అజయ్ కుమార్ ఆధ్వర్యంలో బీఆర్ఎస్ పార్టీ నిరసన కార్యక్రమం చేపట్టింది. కాంగ్రెస్ ప్రభుత్వ వైఫల్యాలను ఎండగడుతూ బీఆర్ఎస్ నాయకులు, కార్యకర్తలు ఆందోళన నిర్వహించారు. ఈ సందర్భంగా మాజీ మంత్రి పువ్వాడ అజయ్ కుమార్ కాంగ్రెస్ ప్రభుత్వంపై తీవ్రస్థాయిలో విమర్శలు గుప్పించారు. కాంగ్రెస్ అంటేనే దగా, మోసం అని ఆరోపించిన ఆయన.. కేసీఆర్ ముందే కాంగ్రెస్ వస్తే మోసపోవడం ఖాయమని గతంలో చెప్పారని గుర్తుచేశారు. వాయిస్ ఓవర్: వ్యవసాయాన్ని పండుగ చేయాలనే ఉద్దేశంతో కేసీఆర్ అనేక సంస్కరణలు తీసుకొచ్చారని పువ్వాడ అజయ్ కుమార్ అన్నారు. రైతుల సంక్షేమం కోసం అనేక పథకాలను ప్రవేశపెట్టారని తెలిపారు. అయితే కాంగ్రెస్ ప్రభుత్వం రైతు బంధు పథకాన్ని అరకొరగా అమలు చేస్తోందని, రైతు రుణమాఫీ కూడా సక్రమంగా చేయలేదని విమర్శించారు. పండించిన పంటకు గిట్టుబాటు ధర లేక రైతులు నష్టపోతున్నారని.. రైతాంగం పరిస్థితి ఆందోళనకరంగా మారిందని అన్నారు. విద్యార్థులకు ఫీజు రీయింబర్స్‌మెంట్ అందక ఇబ్బందులు పడుతున్నారని, గురుకులాల్లో చదువుతున్న విద్యార్థులు అనేక సమస్యలు ఎదుర్కొంటున్నారని ఆరోపించారు. ఆరు గ్యారంటీలు, 420 హామీలు ఇచ్చి తెలంగాణ ప్రజలను కాంగ్రెస్ ప్రభుత్వం మోసం చేసిందని పువ్వాడ అజయ్ కుమార్ మండిపడ్డారు. మహిళలు, విద్యార్థులకు ఇచ్చిన హామీల్లో ఏ ఒక్కటీ పూర్తిగా నెరవేర్చలేదని ఆరోపించారు. ఆర్టీసీ కార్మికులకు కూడా న్యాయం చేయకుండా మోసం చేశారని విమర్శించారు. రాష్ట్రంలో కాంగ్రెస్ పాలన ఘోరంగా విఫలమైందని ఆరోపించిన పువ్వాడ.. కాంగ్రెస్ నేతలు భూ కబ్జాలు, భూ దోపిడీలకు పాల్పడుతున్నారని విమర్శించారు. ఖమ్మం జిల్లాలో గతంలో ఒక్క మంత్రిగా చేసిన పనులను ప్రస్తుతం ముగ్గురు మంత్రులు ఉండి కూడా చేయలేకపోతున్నారని అన్నారు. సీతారామ ప్రాజెక్టు విషయంలో కాంగ్రెస్ ప్రభుత్వం నిర్లక్ష్యంగా వ్యవహరిస్తోందని ఆరోపించారు. గత బీఆర్ఎస్ ప్రభుత్వం సీతారామ ప్రాజెక్టుకు వేల కోట్ల రూపాయలు ఖర్చు చేసిందని, ప్రస్తుత ప్రభుత్వం కనీస నిర్వహణపై కూడా దృష్టి పెట్టడం లేదని విమర్శించారు. అలాగే ఖమ్మం జర్నలిస్టులకు గత బీఆర్ఎస్ ప్రభుత్వం మంజూరు చేసిన 23 ఎకరాల భూమిని జర్నలిస్టులకు కేటాయించాలని డిమాండ్ చేశారు.కేసీఆర్ తిరిగి అధికారంలోకి రావడం ఖాయమని, తెలంగాణలో రామరాజ్యం రావడం పక్కా అని పువ్వాడ అజయ్ కుమార్ ధీమా వ్యక్తం చేశారు. రాబోయే రోజుల్లో కాంగ్రెస్ ప్రభుత్వానికి ప్రజలు కర్రు కాల్చి వాత పెడతారని ఘాటు వ్యాఖ్యలు చేశారు. కాంగ్రెస్ ప్రభుత్వ ప్రజా వ్యతిరేక విధానాలకు నిరసనగా ఖమ్మం జడ్పీ సెంటర్‌లో నిర్వహించిన బీఆర్ఎస్ ధర్నాలో పార్టీ నాయకులు, కార్యకర్తలు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు.1
- బిఆర్ఎస్ ఆధ్వర్యంలో కాంగ్రెస్ బాకీ కార్డుల పంపిణీ..... జనగామ జిల్లా బచ్చన్నపేట మండలం కొడవటూరు గ్రామ బిఆర్ఎస్ పార్టీ ఆధ్వర్యంలో కాంగ్రెస్ ప్రభుత్వం గత ఎన్నికల్లో ఇచ్చిన ఆరు గ్యారెంటీలపై కాంగ్రెస్ బాకీ కార్డును ప్రతి ఇంటి ఇంటికీ పంపిణీ చేసారు.బుధవారం ఈ సందర్భంగా స్థానిక బిఆర్ఎస్ పార్టీ నాయకులు మాట్లాడుతూ ప్రజా సమస్యలు,హామీల అమలు కోసం ప్రజల తరఫున నిరంతరం పోరాటం కొనసాగుతుందన్నారు. ఈ కార్యక్రమంలో పలువురు బిఆర్ఎస్ పార్టీ నాయకులు కార్యకర్తలు తదితరులు పాల్గొన్నారు.1
- ఖమ్మం వ్యవసాయ మార్కెట్లో స్థిరంగా కొనసాగుతున్న మిర్చి, పత్తి ధరలు ఖమ్మం వ్యవసాయ మార్కెట్‌లో బుధవారం మిర్చి, పత్తి ధరలు ఈ విధంగా ఉన్నాయి. క్వింటా ఏసీ మిర్చి ధర రూ.22,700, నాన్ ఏసీ మిర్చి ధర రూ.16,500, అటు క్వింటా పత్తి ధర రూ.9,250గా జెండాపాట పలికినట్లు మార్కెట్ కమిటీ సభ్యులు తెలిపారు. నిన్నటితో పోల్చితే ఏసీ మిర్చి ధర, నాన్ ఏసీ మిర్చి ధర, పత్తి ధరలు స్థిరంగా కొనసాగుతున్నాయని వ్యాపారులు తెలిపారు.1
- వేములవాడ ఆలయ అభివృద్ధి పనులపై ఈనెల 6న సీఎం సమక్షంలో సమావేశం...మరో సమావేశంలోగా రాజన్న దర్శనం కల్పించేలా ఏర్పాట్లు చేస్తామని ఆది శ్రీనివాస వెల్లడి వేములవాడ శ్రీ రాజరాజేశ్వర స్వామి ఆలయ విస్తరణ అభివృద్ధి పనులు శరవేగంగా జరుగుతున్నాయని ప్రభుత్వ విప్, వేములవాడ ఎమ్మెల్యే ఆది శ్రీనివాస్ తెలిపారు. ఆలయ విస్తరణ పనులను సీఎం ఓఎస్డీ శ్రీనివాసులు, దేవాదాయ ధర్మాదాయ శాఖ కమిషనర్ హనుమంతరావు, జిల్లా కలెక్టర్ గరీమా అగ్రవాల్ తో పాటు వివిధ శాఖల అధికారులతో పరిశీలించి పనుల పురోగతిపై సమీక్ష సమావేశం నిర్వహించారు. అనంతరం ఆయన మీడియాతో మాట్లాడుతూ రాజన్న ఆలయ విస్తరణ పనులు ఇప్పటివరకు జరిగిన పనులపై చర్చించామని, త్వరలో జరగబోయే పనులపై చర్చించి, ఈనెల 6న హైదరాబాద్ లో సీఎం క్యాంప్ ఆఫీస్ లో సమావేశం అనంతరం టెండర్ల ప్రక్రియకు వెళ్తామన్నారు. విస్తరణ పనులు త్వరితగతిన పూర్తి చేసి మరో సమావేశంలోగా రాజన్న దర్శనం కల్పించడానికి చర్యలు తీసుకుంటామన్నారు. అలాగే వచ్చే సంవత్సరం జరిగే గోదావరి పుష్కరాలకు 1000 కోట్లు నిధులు మంజూరు చేసి భక్తులకు సౌకర్యాలు కల్పిస్తామన్నారు.2
- డిసిసి కార్యాలయంలో వై.ఎస్.ఆర్ వర్ధంతి సంక్షేమానికి చిరునామా వై.ఎస్.ఆర్ - ఎమ్మెల్యే, డిసిసి అధ్యక్షులు మేడిపల్లి సత్యం మాజీ ముఖ్యమంత్రి, దివంగత మహానేత డా. వై.ఎస్. రాజశేఖర్ రెడ్డి గారి వర్ధంతి సందర్భంగా నేడు కరీంనగర్ డిసిసి కార్యాలయంలో ఘనంగా నివాళుల కార్యక్రమం నిర్వహించారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా చొప్పదండి ఎమ్మెల్యే, జిల్లా కాంగ్రెస్ అధ్యక్షులు డా. మేడిపల్లి సత్యం హాజరై, కరీంనగర్ కార్పొరేషన్ కాంగ్రెస్ అధ్యక్షులు వైద్యుల అంజన్ కుమార్, మాజీ సుడా చైర్మన్ కోమటిరెడ్డి నరేందర్ రెడ్డి, మాజీ ఎమ్మెల్యే ఆరెపల్లి మోహన్, అర్బన్ బ్యాంక్ చైర్మన్, గడ్డం విలాస్ రెడ్డి, మాజీ ఏఎంసీ చైర్మన్ ఆకారపు భాస్కర్ రెడ్డి తదితరులతో కలిసి వై.ఎస్.ఆర్ చిత్రపటానికి పూలమాల వేసి ఘన నివాళులర్పించారు. అనంతరం డిసిసి అధ్యక్షులు డా. మేడిపల్లి సత్యం మాట్లాడుతూ.. స్వర్గీయ డా. వై.ఎస్. రాజశేఖర్ రెడ్డి గారు ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రిగా పనిచేసి ఏ ప్రభుత్వం, ఏ ముఖ్యమంత్రి చేయని విధంగా అభివృద్ధి, సంక్షేమానికి చిరునామాగా నిలిచారని అన్నారు. విద్య, వైద్యం, వ్యవసాయం, మహిళా సాధికారత వంటి ప్రతి రంగంలోనూ చెరగని ముద్ర వేశారన్నారు. ఫీజు రీయింబర్స్ మెంట్, 108, ఆరోగ్యశ్రీ, రైతులకు ఉచిత విద్యుత్, రుణమాఫీ వంటి ఎన్నో సంక్షేమ పథకాలు ఆయన హయాంలోనే ప్రవేశపెట్టారని, దేశంలో సంక్షేమం అంటే గుర్తుకొచ్చే ఏకైక పేరు వై.ఎస్.ఆర్ అని కొనియాడారు. ముఖ్యంగా కరీంనగర్ జిల్లా అభివృద్ధిలో వై.ఎస్.ఆర్ పాత్ర మరువలేనిదని, ఆనాడు ఆయన నిర్మించిన ప్రాజెక్టులు, కాలువల వల్లే నేడు జిల్లాలో వ్యవసాయం సుభిక్షంగా ఉందని, శాతవాహన యూనివర్సిటీ తో పాటు కొండగట్టు, మంథనిలో JNTU, కోరుట్లలో వెటర్నరీ యూనివర్సిటీ వంటివి ఆయన హయాంలోనే ఏర్పాటయ్యాయని గుర్తు చేశారు. 2009లో హెలికాప్టర్ ప్రమాదంలో ఆయన మరణించడం చాలా బాధాకరమని, వై.ఎస్.ఆర్ ఆశయం రాహుల్ గాంధీ గారిని ప్రధానమంత్రిగా చూడాలని ఉండేదని, ప్రతి కాంగ్రెస్ కార్యకర్త ఆ ఆశయాన్ని నెరవేర్చి ఆ మహనీయుడికి ఘన నివాళి అర్పించాలని పిలుపునిచ్చారు. ఈ కార్యక్రమంలో నాయకులు మడుపు మోహన్, బానోతు శ్రావణ్ నాయక్, వరాల నర్సింగం, పర్వత మల్లేశం, అన్నమనేని నర్సింగారావు, వెన్న రజిత రెడ్డి, అహమ్మద్ అలీ, విక్టర్, వంగల విద్యాసాగర్, కుంభాల రాజకుమార్, మాదాసు శ్రీనివాస్, గంగుల దిలీప్, మూల కృష్ణారెడ్డి, కర్రె పావని, ఫజల్, హాజీ, వసీం,ఇమ్రాన్ గని, సుంకే రాజు, దాసరి సందీప్, తోట అంజయ్య, కుర్ర పోచయ్య, మల్లారెడ్డి, ఫహద్, స్వప్న శ్రీ, మాలోతు మహాలక్ష్మి, పెంట శేఖర్, రాచర్ల పద్మ, సిరిపురం నాగప్రసాద్, సత్తినేని శ్రీకాంత్, మల్లారెడ్డి, కాశి పాక రాకేష్, శిల్పా, కూస రవీందర్, సుంకరి గణపతి, సుధాకర్ నాయక్ తదితరులు పాల్గొన్నారు.1
- 1000 రోజులైనా ప్రజా సంక్షేమం శూన్యం:మాజీ MLA కందాళ ఉపేందర్ రెడ్డి కాంగ్రెస్ ప్రభుత్వంపై పాలేరు మాజీ ఎమ్మెల్యే కందాళ ఉపేందర్ రెడ్డి విరుచుకుపడ్డారు. పాలేరు రిజర్వాయర్ వద్ద బీఆర్ఎస్ చేపట్టిన మహాధర్నాలో ఆయన మాట్లాడుతూ.. 100 రోజుల్లో హామీలంటూ ఓట్ల నాటకాలాడారని మండిపడ్డారు. తన తుది శ్వాస వరకు పాలేరు ప్రజల కోసమే జీవిస్తానన్నారు. ప్రభుత్వం తక్షణమే కళ్ళు తెరిచి హామీలు నెరవేర్చకపోతే పాలేరు గడ్డపై పెద్ద ఎత్తున ఆందోళనలు ఉధృతం చేస్తామని హెచ్చరించారు.1
- రాజన్న సిరిసిల్ల జిల్లాలో దారుణం...భార్య అత్త పై కత్తితో దాడి చేసిన భర్త...భార్య మృతి రాజన్న సిరిసిల్ల జిల్లా ఎల్లారెడ్డిపేట మండలం పదిరలో దారుణం జరిగింది. భార్య, ఆమే తల్లి పై కత్తితో భర్త సురేష్ దాడి చేశారు. భార్య జ్యోతి అక్కడికక్కడే మృతి చెందగా అత్త ఎల్లవ్వకు తీవ్ర గాయాలు అయ్యాయి. ఆమెను సిరిసిల్ల ఏరియా ఆసుపత్రికి తరలించారు. కుటుంబ కలహాల నేపథ్యంలో దాడి చేసినట్లు సమాచారం. సురేష్, జ్యోతి కి ఏడు సంవత్సరాల క్రితం జరిగిన వివాహం కాగా గత ఏడు నెలలుగా తల్లిగారింట్లోనే జ్యోతి ఉంటున్నారు. జ్యోతి ఆమె తల్లి ఎల్లవ్వ ఇద్దరు ఆసుపత్రి వెళ్ళే క్రమంలో పదిర వద్ద రోడ్డుపైనే కారులో వచ్చి భర్త సురేష్ కత్తితో దాడి చేసినట్లు ప్రత్యక్ష సాక్షులు తెలిపారు. మృతి చెందిన జ్యోతికి ఇద్దరు అబ్బాయిలు ఒక అమ్మాయి సంతానం. సంఘటన స్థలానికి చేరుకొని పోలీసులు చేరుకుని విచారణ చేపట్టారు. నిందితుడు సురేష్ సిరిసిల్ల స్టేషన్ లో లొంగిపోయినట్లు సమాచారం.4