logo
Shuru
Apke Nagar Ki App…
  • Latest News
  • News
  • Politics
  • Elections
  • Viral
  • Astrology
  • Horoscope in Hindi
  • Horoscope in English
  • Latest Political News
logo
Shuru
Apke Nagar Ki App…

ప్రజలు సంతోషంగా ఉన్నారు : కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు పైడాకుల అశోక్ ప్రజలంతా సంతోషంగా ఉంటే.. బీఆర్ఎస్ నేతలకు ఎందుకు బాధ? వెయ్యి రోజుల ప్రజాపాలనపై బీఆర్ఎస్‌కు ఘాటు కౌంటర్.. ములుగు జిల్లా కాంగ్రెస్ అధ్యక్షులు పైడాకుల అశోక్ ములుగు: తెలంగాణ రాష్ట్రంలో కాంగ్రెస్ ప్రభుత్వం ప్రజాపాలనకు శ్రీకారం చుట్టి వెయ్యి రోజులు పూర్తిచేసుకున్న సందర్భంగా రాష్ట్ర ప్రజలు సంతోషంగా ఉన్నారని, అయితే ప్రజల సంతోషాన్ని చూసి బీఆర్ఎస్ పార్టీ నాయకులు, ఆ పార్టీ సోషల్ మీడియా ఇన్‌చార్జులు మాత్రం అసహనంతో ఉన్నారని ములుగు జిల్లా కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు పైడాకుల అశోక్ ఘాటుగా విమర్శించారు. ప్రజలకు ఇచ్చిన హామీలను ఒక్కొక్కటిగా అమలు చేస్తూ కాంగ్రెస్ ప్రభుత్వం ముందుకు సాగుతుంటే బీఆర్ఎస్ నాయకులు ఎందుకు సంతోషంగా లేరని ఆయన ప్రశ్నించారు. “మీరు ఇచ్చిన హామీలను మీరు నెరవేర్చకపోతే.. మేము నెరవేరుస్తున్నందుకు కూడా సంతోషంగా లేరా?” అంటూ బీఆర్ఎస్ నేతలను నిలదీశారు. మహిళలకు ఉచిత బస్సు ప్రయాణం కల్పించినా బాధేనా? తెలంగాణలో మహిళలకు ఆర్టీసీ బస్సుల్లో ఉచిత ప్రయాణ సౌకర్యం కల్పించి వారి ఆర్థిక భారాన్ని తగ్గించినా బీఆర్ఎస్ నాయకులకు సంతోషం కలగడం లేదా అని అశోక్ ప్రశ్నించారు. మహిళలు రాష్ట్రవ్యాప్తంగా స్వేచ్ఛగా ప్రయాణిస్తూ ఈ పథకం ద్వారా ప్రయోజనం పొందుతున్నారని తెలిపారు. పేదలకు ఇందిరమ్మ ఇళ్లు ఇచ్చినా ఓర్వలేరా? రాష్ట్రవ్యాప్తంగా ఏడు లక్షలకు పైగా ఇందిరమ్మ ఇళ్లను మంజూరు చేయడం, ములుగు నియోజకవర్గానికి 5 వేల ఇళ్లను కేటాయించడం ద్వారా పేదల సొంతింటి కలను సాకారం చేసే దిశగా కాంగ్రెస్ ప్రభుత్వం ముందుకు సాగుతోందని అశోక్ అన్నారు. “పేద కుటుంబానికి సొంత ఇల్లు వస్తే సంతోషించాల్సింది పోయి.. దానిపై కూడా రాజకీయాలు చేయడం ఎందుకు?” అని బీఆర్ఎస్ నాయకులను ప్రశ్నించారు. రేషన్ కార్డులు, సన్నబియ్యం ఇచ్చినా బాధేనా? అర్హులైన పేద కుటుంబాలకు రేషన్ కార్డులు అందించడం, పేదలకు నాణ్యమైన సన్నబియ్యం అందించేందుకు ప్రభుత్వం చర్యలు తీసుకోవడం కూడా బీఆర్ఎస్ నాయకులకు నచ్చడం లేదా అని ఆయన ప్రశ్నించారు. పేదల కడుపు నిండితే సంతోషించాల్సిన బాధ్యత ప్రతిపక్షానిదని, కానీ ప్రజలకు మేలు జరుగుతుంటే దాన్ని కూడా రాజకీయం చేయడం బీఆర్ఎస్ నాయకుల వైఖరికి నిదర్శనమని విమర్శించారు. ఉద్యోగాలు భర్తీ చేసినా అసంతృప్తేనా? యువతకు ఉద్యోగ అవకాశాలు కల్పించే దిశగా ఉపాధ్యాయ పోస్టులు, గ్రూప్-1 వంటి ఉద్యోగ నియామక ప్రక్రియలను చేపట్టినప్పటికీ బీఆర్ఎస్ నాయకులు సంతోషంగా లేరని అశోక్ అన్నారు. “నిరుద్యోగ యువతకు ఉద్యోగం వస్తే అది ఏ పార్టీకి చెందిన ప్రభుత్వ విజయమో కాదు.. తెలంగాణ యువత విజయం. మరి యువతకు ఉద్యోగాలు వస్తుంటే ఎందుకు ఓర్వలేకపోతున్నారు?” అని ప్రశ్నించారు. రైతులకు రూ.2 లక్షల రుణమాఫీ చేసినా బాధేనా? రైతులకు ఏకకాలంలో రూ.2 లక్షల వరకు రుణమాఫీ చేసి రైతు కుటుంబాలకు కాంగ్రెస్ ప్రభుత్వం అండగా నిలిచిందని అశోక్ తెలిపారు. రైతులు పండించిన ధాన్యాన్ని కొనుగోలు కేంద్రాల ద్వారా సేకరిస్తూ, రైతులకు మద్దతుగా ప్రభుత్వం పనిచేస్తోందన్నారు. “రైతు రుణభారం తగ్గితే.. రైతు కుటుంబంలో ఆనందం కనిపిస్తే.. ఆ ఆనందాన్ని చూసి కూడా బీఆర్ఎస్ నాయకులు ఎందుకు సంతోషించలేకపోతున్నారు?” అని ఆయన నిలదీశారు. మహిళా సంఘాలకు వడ్డీలేని రుణాలు ఇచ్చినా అసూయేనా? మహిళా సంఘాలను ఆర్థికంగా బలోపేతం చేసేందుకు వడ్డీలేని రుణాలు అందిస్తూ మహిళలకు స్వయం ఉపాధి, ఆర్థిక స్వావలంబన దిశగా ప్రభుత్వం ప్రోత్సాహం అందిస్తోందని అశోక్ అన్నారు. మహిళలు ఆర్థికంగా ఎదగడం, కుటుంబాలకు అండగా నిలవడం కూడా బీఆర్ఎస్ నాయకులకు నచ్చడం లేదా అని ప్రశ్నించారు. ప్రగతి భవన్ కంచె తొలగించినా బాధేనా? అధికార కేంద్రాల చుట్టూ ఉన్న అడ్డంకులను తొలగించి ప్రజలకు పాలనను చేరువ చేయాలనే ఉద్దేశంతో ప్రగతి భవన్ ముందు ఉన్న కంచెను తొలగించి ప్రజా భవన్‌గా మార్చిన విషయాన్ని అశోక్ గుర్తుచేశారు. “ప్రజలు తమ సమస్యలు చెప్పుకోవడానికి ప్రభుత్వాన్ని కలిసే అవకాశం కల్పిస్తే.. అది కూడా బీఆర్ఎస్ నాయకులకు బాధగా ఉందా?” అని ప్రశ్నించారు. “ప్రజల సంతోషమే కాంగ్రెస్ ప్రభుత్వానికి అసలైన విజయచిహ్నం” వెయ్యి రోజుల ప్రజాపాలనలో మహిళలు, రైతులు, పేదలు, యువత, ఉద్యోగులు, కార్మికులు ఇలా అన్ని వర్గాల సంక్షేమానికి కాంగ్రెస్ ప్రభుత్వం కృషి చేస్తోందని పైడాకుల అశోక్ అన్నారు. “తెలంగాణ ప్రజలు సంతోషంగా ఉన్నారు. పేదలకు ఇళ్లు వస్తున్నాయి.. మహిళలకు ఉచిత బస్సు ప్రయాణం అందుతోంది.. రైతులకు రుణమాఫీ జరుగుతోంది.. యువతకు ఉద్యోగాలు వస్తున్నాయి.. మహిళా సంఘాలకు వడ్డీలేని రుణాలు అందుతున్నాయి.. రేషన్ కార్డులు, సన్నబియ్యం అందుతున్నాయి. మరి ప్రజలంతా సంతోషంగా ఉంటే బీఆర్ఎస్ నాయకులకు, వారి సోషల్ మీడియా బృందాలకు మాత్రమే ఎందుకు బాధ?” అని ఆయన ఘాటుగా ప్రశ్నించారు. ప్రజలకు మంచి జరిగితే ప్రతిపక్షం అభినందించాలి.. కానీ ప్రజల సంతోషాన్ని చూసి ఓర్వలేక విమర్శలు చేయడం బీఆర్ఎస్ రాజకీయ దుస్థితికి నిదర్శనమని అశోక్ విమర్శించారు. వెయ్యి రోజుల ప్రజాపాలనకు ప్రజలే సాక్ష్యం.. ప్రజల సంక్షేమమే కాంగ్రెస్ ప్రభుత్వానికి కొలమానం.. ప్రజల సంతోషమే తమకు అసలైన విజయమని ములుగు జిల్లా కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు పైడాకుల అశోక్ స్పష్టం చేశారు.

16 hrs ago
user_KOMURAIAH ANAGANDULA
KOMURAIAH ANAGANDULA
ములుగు, ములుగు, తెలంగాణ•
16 hrs ago

ప్రజలు సంతోషంగా ఉన్నారు : కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు పైడాకుల అశోక్ ప్రజలంతా సంతోషంగా ఉంటే.. బీఆర్ఎస్ నేతలకు ఎందుకు బాధ? వెయ్యి రోజుల ప్రజాపాలనపై బీఆర్ఎస్‌కు ఘాటు కౌంటర్.. ములుగు జిల్లా కాంగ్రెస్ అధ్యక్షులు పైడాకుల అశోక్ ములుగు: తెలంగాణ రాష్ట్రంలో కాంగ్రెస్ ప్రభుత్వం ప్రజాపాలనకు శ్రీకారం చుట్టి వెయ్యి రోజులు పూర్తిచేసుకున్న సందర్భంగా రాష్ట్ర ప్రజలు సంతోషంగా ఉన్నారని, అయితే ప్రజల సంతోషాన్ని చూసి బీఆర్ఎస్ పార్టీ నాయకులు, ఆ పార్టీ సోషల్ మీడియా ఇన్‌చార్జులు మాత్రం అసహనంతో ఉన్నారని ములుగు జిల్లా కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు పైడాకుల అశోక్ ఘాటుగా విమర్శించారు. ప్రజలకు ఇచ్చిన హామీలను ఒక్కొక్కటిగా అమలు చేస్తూ కాంగ్రెస్ ప్రభుత్వం ముందుకు సాగుతుంటే బీఆర్ఎస్ నాయకులు ఎందుకు సంతోషంగా లేరని ఆయన ప్రశ్నించారు. “మీరు ఇచ్చిన హామీలను మీరు నెరవేర్చకపోతే.. మేము నెరవేరుస్తున్నందుకు కూడా సంతోషంగా లేరా?” అంటూ బీఆర్ఎస్ నేతలను నిలదీశారు. మహిళలకు ఉచిత బస్సు ప్రయాణం కల్పించినా బాధేనా? తెలంగాణలో మహిళలకు ఆర్టీసీ బస్సుల్లో ఉచిత ప్రయాణ సౌకర్యం కల్పించి వారి ఆర్థిక భారాన్ని తగ్గించినా బీఆర్ఎస్ నాయకులకు సంతోషం కలగడం లేదా అని అశోక్ ప్రశ్నించారు. మహిళలు రాష్ట్రవ్యాప్తంగా స్వేచ్ఛగా ప్రయాణిస్తూ ఈ పథకం ద్వారా ప్రయోజనం పొందుతున్నారని తెలిపారు. పేదలకు ఇందిరమ్మ ఇళ్లు ఇచ్చినా ఓర్వలేరా? రాష్ట్రవ్యాప్తంగా ఏడు లక్షలకు పైగా ఇందిరమ్మ ఇళ్లను మంజూరు చేయడం, ములుగు నియోజకవర్గానికి 5 వేల ఇళ్లను కేటాయించడం ద్వారా పేదల సొంతింటి కలను సాకారం చేసే దిశగా కాంగ్రెస్ ప్రభుత్వం ముందుకు సాగుతోందని అశోక్ అన్నారు. “పేద కుటుంబానికి సొంత ఇల్లు వస్తే సంతోషించాల్సింది పోయి.. దానిపై కూడా రాజకీయాలు చేయడం ఎందుకు?” అని బీఆర్ఎస్ నాయకులను ప్రశ్నించారు. రేషన్ కార్డులు, సన్నబియ్యం ఇచ్చినా బాధేనా? అర్హులైన పేద కుటుంబాలకు రేషన్ కార్డులు అందించడం, పేదలకు నాణ్యమైన సన్నబియ్యం అందించేందుకు ప్రభుత్వం చర్యలు తీసుకోవడం కూడా బీఆర్ఎస్ నాయకులకు నచ్చడం లేదా అని ఆయన ప్రశ్నించారు. పేదల కడుపు నిండితే సంతోషించాల్సిన బాధ్యత ప్రతిపక్షానిదని, కానీ ప్రజలకు మేలు జరుగుతుంటే దాన్ని కూడా రాజకీయం చేయడం బీఆర్ఎస్ నాయకుల వైఖరికి నిదర్శనమని విమర్శించారు. ఉద్యోగాలు భర్తీ చేసినా అసంతృప్తేనా? యువతకు ఉద్యోగ అవకాశాలు కల్పించే దిశగా ఉపాధ్యాయ పోస్టులు, గ్రూప్-1 వంటి ఉద్యోగ నియామక ప్రక్రియలను చేపట్టినప్పటికీ బీఆర్ఎస్ నాయకులు సంతోషంగా లేరని అశోక్ అన్నారు. “నిరుద్యోగ యువతకు ఉద్యోగం వస్తే అది ఏ పార్టీకి చెందిన ప్రభుత్వ విజయమో కాదు.. తెలంగాణ యువత విజయం. మరి యువతకు ఉద్యోగాలు వస్తుంటే ఎందుకు ఓర్వలేకపోతున్నారు?” అని ప్రశ్నించారు. రైతులకు రూ.2 లక్షల రుణమాఫీ చేసినా బాధేనా? రైతులకు ఏకకాలంలో రూ.2 లక్షల వరకు రుణమాఫీ చేసి రైతు కుటుంబాలకు కాంగ్రెస్ ప్రభుత్వం అండగా నిలిచిందని అశోక్ తెలిపారు. రైతులు పండించిన ధాన్యాన్ని కొనుగోలు కేంద్రాల ద్వారా సేకరిస్తూ, రైతులకు మద్దతుగా ప్రభుత్వం పనిచేస్తోందన్నారు. “రైతు రుణభారం తగ్గితే.. రైతు కుటుంబంలో ఆనందం కనిపిస్తే.. ఆ ఆనందాన్ని చూసి కూడా బీఆర్ఎస్ నాయకులు ఎందుకు సంతోషించలేకపోతున్నారు?” అని ఆయన నిలదీశారు. మహిళా సంఘాలకు వడ్డీలేని రుణాలు ఇచ్చినా అసూయేనా? మహిళా సంఘాలను ఆర్థికంగా బలోపేతం చేసేందుకు వడ్డీలేని రుణాలు అందిస్తూ మహిళలకు స్వయం ఉపాధి, ఆర్థిక స్వావలంబన దిశగా ప్రభుత్వం ప్రోత్సాహం అందిస్తోందని అశోక్ అన్నారు. మహిళలు ఆర్థికంగా ఎదగడం, కుటుంబాలకు అండగా నిలవడం కూడా బీఆర్ఎస్ నాయకులకు నచ్చడం లేదా అని ప్రశ్నించారు. ప్రగతి భవన్ కంచె తొలగించినా బాధేనా? అధికార కేంద్రాల చుట్టూ ఉన్న అడ్డంకులను తొలగించి ప్రజలకు పాలనను చేరువ చేయాలనే ఉద్దేశంతో ప్రగతి భవన్ ముందు ఉన్న కంచెను తొలగించి ప్రజా భవన్‌గా మార్చిన విషయాన్ని అశోక్ గుర్తుచేశారు. “ప్రజలు తమ సమస్యలు చెప్పుకోవడానికి ప్రభుత్వాన్ని కలిసే అవకాశం కల్పిస్తే.. అది కూడా బీఆర్ఎస్ నాయకులకు బాధగా ఉందా?” అని ప్రశ్నించారు. “ప్రజల సంతోషమే కాంగ్రెస్ ప్రభుత్వానికి అసలైన విజయచిహ్నం” వెయ్యి రోజుల ప్రజాపాలనలో మహిళలు, రైతులు, పేదలు, యువత, ఉద్యోగులు, కార్మికులు ఇలా అన్ని వర్గాల సంక్షేమానికి కాంగ్రెస్ ప్రభుత్వం కృషి చేస్తోందని పైడాకుల అశోక్ అన్నారు. “తెలంగాణ ప్రజలు సంతోషంగా ఉన్నారు. పేదలకు ఇళ్లు వస్తున్నాయి.. మహిళలకు ఉచిత బస్సు ప్రయాణం అందుతోంది.. రైతులకు రుణమాఫీ జరుగుతోంది.. యువతకు ఉద్యోగాలు వస్తున్నాయి.. మహిళా సంఘాలకు వడ్డీలేని రుణాలు అందుతున్నాయి.. రేషన్ కార్డులు, సన్నబియ్యం అందుతున్నాయి. మరి ప్రజలంతా సంతోషంగా ఉంటే బీఆర్ఎస్ నాయకులకు, వారి సోషల్ మీడియా బృందాలకు మాత్రమే ఎందుకు బాధ?” అని ఆయన ఘాటుగా ప్రశ్నించారు. ప్రజలకు మంచి జరిగితే ప్రతిపక్షం అభినందించాలి.. కానీ ప్రజల సంతోషాన్ని చూసి ఓర్వలేక విమర్శలు చేయడం బీఆర్ఎస్ రాజకీయ దుస్థితికి నిదర్శనమని అశోక్ విమర్శించారు. వెయ్యి రోజుల ప్రజాపాలనకు ప్రజలే సాక్ష్యం.. ప్రజల సంక్షేమమే కాంగ్రెస్ ప్రభుత్వానికి కొలమానం.. ప్రజల సంతోషమే తమకు అసలైన విజయమని ములుగు జిల్లా కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు పైడాకుల అశోక్ స్పష్టం చేశారు.

More news from తెలంగాణ and nearby areas
  • నర్సంపేట: కాంగ్రెస్‌ పాలనపై బీఆర్‌ఎస్‌ ధర్నా........... నర్సంపేటలోని అమరవీరుల స్తూపం (వరంగల్‌ రోడ్డు జంక్షన్‌) వద్ద బీఆర్‌ఎస్‌ ఆధ్వర్యంలో ధర్నా, నిరసన కార్యక్రమం నిర్వహించారు. మాజీ ఎమ్మెల్యే ముత్తిరెడ్డి యాదగిరిరెడ్డి, రాష్ట్ర నాయకుడు ఏనుగుల రాకేశ్‌రెడ్డి పాల్గొన్నారు. ఈ సందర్భంగా నాయకులు మాట్లాడుతూ కాంగ్రెస్‌ ప్రభుత్వం వెయ్యి రోజుల పాలనలో పూర్తిగా విఫలమైందని ఆరోపించారు. ఎన్నికల సమయంలో ప్రజలకు ఇచ్చిన హామీలను అమలు చేయడంలో ప్రభుత్వం విఫలమైందని విమర్శించారు. ప్రజా సమస్యలను పరిష్కరించడంలో ప్రభుత్వం నిర్లక్ష్యంగా వ్యవహరిస్తోందని ఆరోపించారు. కార్యక్రమంలో బీఆర్‌ఎస్‌ నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు.
    1
    నర్సంపేట: కాంగ్రెస్‌ పాలనపై బీఆర్‌ఎస్‌ ధర్నా...........
నర్సంపేటలోని అమరవీరుల స్తూపం (వరంగల్‌ రోడ్డు జంక్షన్‌) వద్ద బీఆర్‌ఎస్‌ ఆధ్వర్యంలో ధర్నా, నిరసన కార్యక్రమం నిర్వహించారు. మాజీ ఎమ్మెల్యే ముత్తిరెడ్డి యాదగిరిరెడ్డి, రాష్ట్ర నాయకుడు ఏనుగుల రాకేశ్‌రెడ్డి పాల్గొన్నారు.
ఈ సందర్భంగా నాయకులు మాట్లాడుతూ కాంగ్రెస్‌ ప్రభుత్వం వెయ్యి రోజుల పాలనలో పూర్తిగా విఫలమైందని ఆరోపించారు. ఎన్నికల సమయంలో ప్రజలకు ఇచ్చిన హామీలను అమలు చేయడంలో ప్రభుత్వం విఫలమైందని విమర్శించారు. ప్రజా సమస్యలను పరిష్కరించడంలో ప్రభుత్వం నిర్లక్ష్యంగా వ్యవహరిస్తోందని ఆరోపించారు. కార్యక్రమంలో బీఆర్‌ఎస్‌ నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు.
    user_Chetty:Ramesh
    Chetty:Ramesh
    నర్సంపేట, వరంగల్, తెలంగాణ•
    12 hrs ago
  • రామగుండం ప్రాంతంలో విస్తృతంగా పర్యటించిన జిల్లా కలెక్టర్ కోయశ్రీ హర్ష పాఠశాలల్లో పెండింగ్ పనులను నిర్ణీత గడువులోగా పూర్తి చేయాలి : జిల్లా కలెక్టర్ కోయ శ్రీహర్ష **పెండింగ్ పునరుద్ధరణ పనులను 15 రోజుల్లో పూర్తి చేయాలి** **కిచెన్ షెడ్లు, మరమ్మతులు, మరుగుదొడ్ల పనులను నెల రోజుల్లోగా పూర్తి చేయాలి** **అల్లూరు ,యూపీహెచ్‌సీలో ఎన్‌సీడీ స్క్రీనింగ్‌ను పెంచాలి** **లక్ష్మీపురం–వీర్లపల్లి రహదారి పనులను 3 నెలల్లో పూర్తి చేయాలి**.. రామగుండం ప్రాంతంలో చేపడుతున్న వివిధ అభివృద్ధి పనులను వేగవంతం చేసి ప్రజలకు, విద్యార్థులకు మెరుగైన సౌకర్యాలు అందుబాటులోకి తీసుకురావాలని *జిల్లా కలెక్టర్ కోయ శ్రీహర్ష* అధికారులను ఆదేశించారు. బుధవారం రామగుండం ప్రాంతంలో విస్తృతంగా పర్యటించిన *జిల్లా కలెక్టర్* పలు ప్రభుత్వ పాఠశాలలు, అల్లూరు యూపీహెచ్‌సీ, లక్ష్మీపురం–వీర్లపల్లి రహదారి పనులను పరిశీలించారు. *రామగుండం మండలంలోని మండల పరిషత్ ప్రాథమిక పాఠశాల, మార్కండేయ కాలనీ గోదావరిఖని ఉర్దూ మీడియం పాఠశాల, అడ్డగుంటపల్లి ఎం.పీ.పీ.ఎస్ పాఠశాల, సంజయ్ నగర్ ఎం.పీ.పీ.ఎస్ పాఠశాల, అల్లూరు ఎం.పీ.పీ.ఎస్ పాఠశాల, జడ్పీహెచ్‌ఎస్ నరసింహపురం (న్యూ మారేడుపాక), వీర్లపల్లి ఎం.పీ.పీ.ఎస్ పాఠశాల, చైతన్యపురి ఎం.పీ.పీ.ఎస్ పాఠశాల, 46వ డివిజన్ శాంతినగర్ ఎం.పీ.పీ.ఎస్ పాఠశాలలను* పరిశీలించారు. ఈ సందర్భంగా *జిల్లా కలెక్టర్ కోయ శ్రీహర్ష మాట్లాడుతూ,* పాఠశాలల్లో విద్యార్థులకు అందుతున్న మౌలిక వసతులు, పాఠశాల భవనాల పరిస్థితి, మరమ్మతు పనులు, కిచెన్ షెడ్లు, మరుగుదొడ్ల నిర్మాణం తదితర పనుల పురోగతిని కలెక్టర్ పరిశీలించారు. గోదావరిఖని ఉర్దూ మీడియం పాఠశాలలో నూతనంగా ఏర్పాటు చేసిన ప్రీ-ప్రైమరీ తరగతి గదిని ప్రారంభించారు. పాఠశాలల్లో పెండింగ్‌లో ఉన్న పునరుద్ధరణ పనులను 15 రోజుల్లోగా పూర్తి చేయాలని జిల్లా కలెక్టర్ అధికారులను ఆదేశించారు. వివిధ పాఠశాలల్లో కొనసాగుతున్న కిచెన్ షెడ్లు, ఇతర మరమ్మతు పనులు, మరుగుదొడ్ల పనులను యుద్ధప్రాతిపదికన పూర్తి చేసి నెల రోజుల్లోగా విద్యార్థులకు అందుబాటులోకి తీసుకురావాలని సూచించారు. విద్యార్థులకు అవసరమైన మౌలిక వసతుల కల్పనలో ఎలాంటి జాప్యం ఉండకూడదని, పనుల నాణ్యత విషయంలో రాజీ పడకుండా నిర్దేశిత గడువులోగా పూర్తి చేయాలని తెలిపారు. అనంతరం *రామగుండం మండలంలోని అల్లూరు యూపీహెచ్‌సీ ఆరోగ్య కేంద్రాన్ని ఆకస్మికంగా తనిఖీ చేశారు.* ఆరోగ్య కేంద్రంలో అందుతున్న ఓపీ సేవలు, వైద్యుల అందుబాటు, రోగులకు అందుతున్న వైద్య సేవలు, ఎన్‌సీడీ స్క్రీనింగ్ తదితర అంశాలను పరిశీలించారు. అల్లూరు యూపీహెచ్‌సీలో ఎన్‌సీడీ స్క్రీనింగ్ చాలా తక్కువగా ఉందని, అర్హులైన ప్రతి ఒక్కరికీ స్క్రీనింగ్ నిర్వహించేలా చర్యలు తీసుకొని స్క్రీనింగ్ శాతాన్ని పెంచాలని ఆదేశించారు. ఆరోగ్య కేంద్రానికి వచ్చే రోగులకు మెరుగైన వైద్య సేవలు అందించాలని, ఓపీ సేవలను మరింత మెరుగుపరచాలని సూచించారు. వైద్యులు నిర్ణీత సమయానికి విధులకు హాజరై రోగులకు అందుబాటులో ఉండేలా చర్యలు తీసుకోవాలని ఆదేశించారు. అనంతరం *లక్ష్మీపురం నుంచి వీర్లపల్లి వరకు జరుగుతున్న రహదారి అభివృద్ధి పనులను* పరిశీలించారు. సింగిల్ రోడ్డును డబుల్ రోడ్డుగా విస్తరించే పనులను వివరించారు. రహదారి పనుల పురోగతిని పరిశీలించిన పనులను వేగవంతం చేసి మూడు నెలల్లోగా పూర్తి చేయాలని సంబంధిత అధికారులను ఆదేశించారు. రహదారి పనులను నాణ్యతా ప్రమాణాలతో చేపట్టాలని, పనులలో ఎలాంటి జాప్యం లేకుండా నిర్దేశిత గడువులోగా పూర్తి చేసి ప్రజలకు మెరుగైన రవాణా సౌకర్యం అందుబాటులోకి తీసుకురావాలని సూచించారు. పాఠశాలలు, ఆరోగ్య కేంద్రాలు, రహదారుల అభివృద్ధి పనులపై సంబంధిత అధికారులు నిరంతరం పర్యవేక్షణ చేపట్టాలని, క్షేత్రస్థాయిలో పనుల పురోగతిని ఎప్పటికప్పుడు పరిశీలిస్తూ నిర్ణీత గడువులోగా పనులు పూర్తయ్యేలా చర్యలు తీసుకోవాలని ఆదేశించారు. ఈ పర్యటనలో టీజీఈడబ్ల్యూఐడీసీ ఈఈ అశోక్ కుమార్, డిప్యూటీ ఇంజనీర్ మారుతి, ఏఈ నరేష్, యూపీహెచ్‌సీ డా.దివేన, ఆర్‌అండ్‌బీ ఏఈ జావిద్, ఇతర సంబంధిత అధికారులు పాల్గొన్నారు.
    1
    రామగుండం ప్రాంతంలో విస్తృతంగా పర్యటించిన జిల్లా కలెక్టర్ కోయశ్రీ హర్ష
పాఠశాలల్లో పెండింగ్ పనులను నిర్ణీత గడువులోగా పూర్తి చేయాలి : జిల్లా కలెక్టర్ కోయ శ్రీహర్ష
**పెండింగ్ పునరుద్ధరణ పనులను 15 రోజుల్లో పూర్తి చేయాలి**
**కిచెన్ షెడ్లు, మరమ్మతులు, మరుగుదొడ్ల పనులను నెల రోజుల్లోగా పూర్తి చేయాలి**
**అల్లూరు ,యూపీహెచ్‌సీలో ఎన్‌సీడీ స్క్రీనింగ్‌ను పెంచాలి**
**లక్ష్మీపురం–వీర్లపల్లి రహదారి పనులను 3 నెలల్లో పూర్తి చేయాలి**..
రామగుండం ప్రాంతంలో చేపడుతున్న వివిధ అభివృద్ధి పనులను వేగవంతం చేసి ప్రజలకు, విద్యార్థులకు మెరుగైన సౌకర్యాలు అందుబాటులోకి తీసుకురావాలని *జిల్లా కలెక్టర్ కోయ శ్రీహర్ష* అధికారులను ఆదేశించారు. 
బుధవారం రామగుండం ప్రాంతంలో విస్తృతంగా పర్యటించిన *జిల్లా కలెక్టర్* పలు ప్రభుత్వ పాఠశాలలు, అల్లూరు యూపీహెచ్‌సీ, లక్ష్మీపురం–వీర్లపల్లి రహదారి పనులను పరిశీలించారు.
*రామగుండం మండలంలోని మండల పరిషత్ ప్రాథమిక పాఠశాల, మార్కండేయ కాలనీ గోదావరిఖని ఉర్దూ మీడియం పాఠశాల, అడ్డగుంటపల్లి ఎం.పీ.పీ.ఎస్ పాఠశాల, సంజయ్ నగర్ ఎం.పీ.పీ.ఎస్ పాఠశాల, అల్లూరు ఎం.పీ.పీ.ఎస్ పాఠశాల, జడ్పీహెచ్‌ఎస్ నరసింహపురం (న్యూ మారేడుపాక), వీర్లపల్లి ఎం.పీ.పీ.ఎస్ పాఠశాల, చైతన్యపురి ఎం.పీ.పీ.ఎస్ పాఠశాల, 46వ డివిజన్ శాంతినగర్ ఎం.పీ.పీ.ఎస్ పాఠశాలలను* పరిశీలించారు.
ఈ సందర్భంగా  *జిల్లా కలెక్టర్ కోయ శ్రీహర్ష మాట్లాడుతూ,*  పాఠశాలల్లో విద్యార్థులకు అందుతున్న మౌలిక వసతులు, పాఠశాల భవనాల పరిస్థితి, మరమ్మతు పనులు, కిచెన్ షెడ్లు, మరుగుదొడ్ల నిర్మాణం తదితర పనుల పురోగతిని కలెక్టర్ పరిశీలించారు. గోదావరిఖని ఉర్దూ మీడియం పాఠశాలలో నూతనంగా ఏర్పాటు చేసిన ప్రీ-ప్రైమరీ తరగతి గదిని  ప్రారంభించారు.
పాఠశాలల్లో పెండింగ్‌లో ఉన్న పునరుద్ధరణ పనులను 15 రోజుల్లోగా పూర్తి చేయాలని జిల్లా కలెక్టర్ అధికారులను ఆదేశించారు. వివిధ పాఠశాలల్లో కొనసాగుతున్న కిచెన్ షెడ్లు, ఇతర మరమ్మతు పనులు, మరుగుదొడ్ల పనులను యుద్ధప్రాతిపదికన పూర్తి చేసి నెల రోజుల్లోగా విద్యార్థులకు అందుబాటులోకి తీసుకురావాలని సూచించారు. విద్యార్థులకు అవసరమైన మౌలిక వసతుల కల్పనలో ఎలాంటి జాప్యం ఉండకూడదని, పనుల నాణ్యత విషయంలో రాజీ పడకుండా నిర్దేశిత గడువులోగా పూర్తి చేయాలని తెలిపారు.
అనంతరం *రామగుండం మండలంలోని అల్లూరు యూపీహెచ్‌సీ ఆరోగ్య కేంద్రాన్ని ఆకస్మికంగా తనిఖీ చేశారు.* ఆరోగ్య కేంద్రంలో అందుతున్న ఓపీ సేవలు, వైద్యుల అందుబాటు, రోగులకు అందుతున్న వైద్య సేవలు, ఎన్‌సీడీ స్క్రీనింగ్ తదితర అంశాలను పరిశీలించారు.
అల్లూరు యూపీహెచ్‌సీలో ఎన్‌సీడీ స్క్రీనింగ్ చాలా తక్కువగా ఉందని, అర్హులైన ప్రతి ఒక్కరికీ స్క్రీనింగ్ నిర్వహించేలా చర్యలు తీసుకొని స్క్రీనింగ్ శాతాన్ని పెంచాలని ఆదేశించారు. ఆరోగ్య కేంద్రానికి వచ్చే రోగులకు మెరుగైన వైద్య సేవలు అందించాలని, ఓపీ సేవలను మరింత మెరుగుపరచాలని సూచించారు. వైద్యులు నిర్ణీత సమయానికి విధులకు హాజరై రోగులకు అందుబాటులో ఉండేలా చర్యలు తీసుకోవాలని ఆదేశించారు.
అనంతరం *లక్ష్మీపురం నుంచి వీర్లపల్లి వరకు జరుగుతున్న రహదారి అభివృద్ధి పనులను* పరిశీలించారు. సింగిల్ రోడ్డును డబుల్ రోడ్డుగా విస్తరించే పనులను  వివరించారు. రహదారి పనుల పురోగతిని పరిశీలించిన పనులను వేగవంతం చేసి మూడు నెలల్లోగా పూర్తి చేయాలని సంబంధిత అధికారులను ఆదేశించారు.
రహదారి పనులను నాణ్యతా ప్రమాణాలతో చేపట్టాలని, పనులలో ఎలాంటి జాప్యం లేకుండా నిర్దేశిత గడువులోగా పూర్తి చేసి ప్రజలకు మెరుగైన రవాణా సౌకర్యం అందుబాటులోకి తీసుకురావాలని  సూచించారు.
పాఠశాలలు, ఆరోగ్య కేంద్రాలు, రహదారుల అభివృద్ధి పనులపై సంబంధిత అధికారులు నిరంతరం పర్యవేక్షణ చేపట్టాలని, క్షేత్రస్థాయిలో పనుల పురోగతిని ఎప్పటికప్పుడు పరిశీలిస్తూ నిర్ణీత గడువులోగా పనులు పూర్తయ్యేలా చర్యలు తీసుకోవాలని  ఆదేశించారు.
ఈ పర్యటనలో టీజీఈడబ్ల్యూఐడీసీ ఈఈ అశోక్ కుమార్, డిప్యూటీ ఇంజనీర్ మారుతి, ఏఈ నరేష్, యూపీహెచ్‌సీ డా.దివేన, ఆర్‌అండ్‌బీ ఏఈ జావిద్, ఇతర సంబంధిత అధికారులు పాల్గొన్నారు.
    user_Telangana reporter
    Telangana reporter
    Local News Reporter రామగుండం, పెద్దపల్లి, తెలంగాణ•
    1 hr ago
  • వేములవాడ ఆలయ అభివృద్ధి పనులపై ఈనెల 6న సీఎం సమక్షంలో సమావేశం...మరో సమావేశంలోగా రాజన్న దర్శనం కల్పించేలా ఏర్పాట్లు చేస్తామని ఆది శ్రీనివాస వెల్లడి వేములవాడ శ్రీ రాజరాజేశ్వర స్వామి ఆలయ విస్తరణ అభివృద్ధి పనులు శరవేగంగా జరుగుతున్నాయని ప్రభుత్వ విప్, వేములవాడ ఎమ్మెల్యే ఆది శ్రీనివాస్ తెలిపారు. ఆలయ విస్తరణ పనులను సీఎం ఓఎస్డీ శ్రీనివాసులు, దేవాదాయ ధర్మాదాయ శాఖ కమిషనర్ హనుమంతరావు, జిల్లా కలెక్టర్ గరీమా అగ్రవాల్ తో పాటు వివిధ శాఖల అధికారులతో పరిశీలించి పనుల పురోగతిపై సమీక్ష సమావేశం నిర్వహించారు. అనంతరం ఆయన మీడియాతో మాట్లాడుతూ రాజన్న ఆలయ విస్తరణ పనులు ఇప్పటివరకు జరిగిన పనులపై చర్చించామని, త్వరలో జరగబోయే పనులపై చర్చించి, ఈనెల 6న హైదరాబాద్ లో సీఎం క్యాంప్ ఆఫీస్ లో సమావేశం అనంతరం టెండర్ల ప్రక్రియకు వెళ్తామన్నారు. విస్తరణ పనులు త్వరితగతిన పూర్తి చేసి మరో సమావేశంలోగా రాజన్న దర్శనం కల్పించడానికి చర్యలు తీసుకుంటామన్నారు. అలాగే వచ్చే సంవత్సరం జరిగే గోదావరి పుష్కరాలకు 1000 కోట్లు నిధులు మంజూరు చేసి భక్తులకు సౌకర్యాలు కల్పిస్తామన్నారు.
    2
    వేములవాడ ఆలయ అభివృద్ధి పనులపై ఈనెల 6న సీఎం సమక్షంలో సమావేశం...మరో సమావేశంలోగా రాజన్న దర్శనం కల్పించేలా ఏర్పాట్లు చేస్తామని ఆది శ్రీనివాస వెల్లడి
వేములవాడ శ్రీ రాజరాజేశ్వర స్వామి ఆలయ విస్తరణ అభివృద్ధి పనులు శరవేగంగా  జరుగుతున్నాయని ప్రభుత్వ విప్, వేములవాడ ఎమ్మెల్యే ఆది శ్రీనివాస్ తెలిపారు. ఆలయ విస్తరణ పనులను సీఎం ఓఎస్డీ శ్రీనివాసులు, దేవాదాయ ధర్మాదాయ శాఖ  కమిషనర్ హనుమంతరావు, జిల్లా కలెక్టర్ గరీమా అగ్రవాల్ తో పాటు వివిధ శాఖల అధికారులతో పరిశీలించి పనుల పురోగతిపై సమీక్ష సమావేశం నిర్వహించారు. అనంతరం ఆయన మీడియాతో మాట్లాడుతూ రాజన్న ఆలయ విస్తరణ పనులు ఇప్పటివరకు జరిగిన పనులపై చర్చించామని, త్వరలో జరగబోయే పనులపై చర్చించి, ఈనెల 6న హైదరాబాద్ లో సీఎం క్యాంప్ ఆఫీస్ లో సమావేశం అనంతరం టెండర్ల ప్రక్రియకు వెళ్తామన్నారు. విస్తరణ పనులు త్వరితగతిన పూర్తి చేసి మరో సమావేశంలోగా రాజన్న దర్శనం కల్పించడానికి చర్యలు తీసుకుంటామన్నారు. అలాగే వచ్చే సంవత్సరం జరిగే  గోదావరి పుష్కరాలకు 1000 కోట్లు నిధులు మంజూరు చేసి భక్తులకు సౌకర్యాలు కల్పిస్తామన్నారు.
    user_K.V.REDDY
    K.V.REDDY
    చిగురుమామిడి, కరీంనగర్, తెలంగాణ•
    6 hrs ago
  • తిర్రి పనులు చేస్తూ విద్యార్థుల జీవితాలతో చెలగాటం ఆడుతున్న రేవంత్ రెడ్డి GO.97 తో పాలిటెక్నిక్ విద్యా వ్యవస్థను నాశనం చేయడం తగదు.. తిర్రి పనులు చేస్తూ విద్యార్థుల జీవితాలతో చెలగాటం ఆడుతున్న రేవంత్ రెడ్డి GO.97 తో పాలిటెక్నిక్ విద్యా వ్యవస్థను నాశనం చేయడం తగదు.. విద్యార్థులు కన్నీళ్లు పెడుతున్నరు..ఇది మంచిది కాదు ఈ పిచ్చి పని బంద్ చేయాలి...GO.97 వెంటనే ఉపసంహరించుకోవాలే *_ టీఆర్పీ చీఫ్ ఎమ్మెల్సీ తీన్మార్ మల్లన్న డిమాండ్*
    1
    తిర్రి పనులు చేస్తూ విద్యార్థుల జీవితాలతో చెలగాటం ఆడుతున్న రేవంత్ రెడ్డి

GO.97 తో పాలిటెక్నిక్ విద్యా వ్యవస్థను నాశనం చేయడం తగదు..
తిర్రి పనులు చేస్తూ విద్యార్థుల జీవితాలతో చెలగాటం ఆడుతున్న రేవంత్ రెడ్డి
GO.97 తో పాలిటెక్నిక్ విద్యా వ్యవస్థను నాశనం చేయడం తగదు..
విద్యార్థులు కన్నీళ్లు పెడుతున్నరు..ఇది మంచిది కాదు
ఈ పిచ్చి పని బంద్ చేయాలి...GO.97 వెంటనే ఉపసంహరించుకోవాలే
*_ టీఆర్పీ చీఫ్ ఎమ్మెల్సీ తీన్మార్ మల్లన్న డిమాండ్*
    user_NIMMANAGANTI ANIL BABU
    NIMMANAGANTI ANIL BABU
    Local News Reporter డోర్నకల్, మహబూబాబాద్, తెలంగాణ•
    13 hrs ago
  • డిసిసి కార్యాలయంలో వై.ఎస్.ఆర్ వర్ధంతి సంక్షేమానికి చిరునామా వై.ఎస్.ఆర్ - ఎమ్మెల్యే, డిసిసి అధ్యక్షులు మేడిపల్లి సత్యం మాజీ ముఖ్యమంత్రి, దివంగత మహానేత డా. వై.ఎస్. రాజశేఖర్ రెడ్డి గారి వర్ధంతి సందర్భంగా నేడు కరీంనగర్ డిసిసి కార్యాలయంలో ఘనంగా నివాళుల కార్యక్రమం నిర్వహించారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా చొప్పదండి ఎమ్మెల్యే, జిల్లా కాంగ్రెస్ అధ్యక్షులు డా. మేడిపల్లి సత్యం హాజరై, కరీంనగర్ కార్పొరేషన్ కాంగ్రెస్ అధ్యక్షులు వైద్యుల అంజన్ కుమార్, మాజీ సుడా చైర్మన్ కోమటిరెడ్డి నరేందర్ రెడ్డి, మాజీ ఎమ్మెల్యే ఆరెపల్లి మోహన్, అర్బన్ బ్యాంక్ చైర్మన్, గడ్డం విలాస్ రెడ్డి, మాజీ ఏఎంసీ చైర్మన్ ఆకారపు భాస్కర్ రెడ్డి తదితరులతో కలిసి వై.ఎస్.ఆర్ చిత్రపటానికి పూలమాల వేసి ఘన నివాళులర్పించారు. అనంతరం డిసిసి అధ్యక్షులు డా. మేడిపల్లి సత్యం మాట్లాడుతూ.. స్వర్గీయ డా. వై.ఎస్. రాజశేఖర్ రెడ్డి గారు ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రిగా పనిచేసి ఏ ప్రభుత్వం, ఏ ముఖ్యమంత్రి చేయని విధంగా అభివృద్ధి, సంక్షేమానికి చిరునామాగా నిలిచారని అన్నారు. విద్య, వైద్యం, వ్యవసాయం, మహిళా సాధికారత వంటి ప్రతి రంగంలోనూ చెరగని ముద్ర వేశారన్నారు. ఫీజు రీయింబర్స్ మెంట్, 108, ఆరోగ్యశ్రీ, రైతులకు ఉచిత విద్యుత్, రుణమాఫీ వంటి ఎన్నో సంక్షేమ పథకాలు ఆయన హయాంలోనే ప్రవేశపెట్టారని, దేశంలో సంక్షేమం అంటే గుర్తుకొచ్చే ఏకైక పేరు వై.ఎస్.ఆర్ అని కొనియాడారు. ముఖ్యంగా కరీంనగర్ జిల్లా అభివృద్ధిలో వై.ఎస్.ఆర్ పాత్ర మరువలేనిదని, ఆనాడు ఆయన నిర్మించిన ప్రాజెక్టులు, కాలువల వల్లే నేడు జిల్లాలో వ్యవసాయం సుభిక్షంగా ఉందని, శాతవాహన యూనివర్సిటీ తో పాటు కొండగట్టు, మంథనిలో JNTU, కోరుట్లలో వెటర్నరీ యూనివర్సిటీ వంటివి ఆయన హయాంలోనే ఏర్పాటయ్యాయని గుర్తు చేశారు. 2009లో హెలికాప్టర్ ప్రమాదంలో ఆయన మరణించడం చాలా బాధాకరమని, వై.ఎస్.ఆర్ ఆశయం రాహుల్ గాంధీ గారిని ప్రధానమంత్రిగా చూడాలని ఉండేదని, ప్రతి కాంగ్రెస్ కార్యకర్త ఆ ఆశయాన్ని నెరవేర్చి ఆ మహనీయుడికి ఘన నివాళి అర్పించాలని పిలుపునిచ్చారు. ఈ కార్యక్రమంలో నాయకులు మడుపు మోహన్, బానోతు శ్రావణ్ నాయక్, వరాల నర్సింగం, పర్వత మల్లేశం, అన్నమనేని నర్సింగారావు, వెన్న రజిత రెడ్డి, అహమ్మద్ అలీ, విక్టర్, వంగల విద్యాసాగర్, కుంభాల రాజకుమార్, మాదాసు శ్రీనివాస్, గంగుల దిలీప్, మూల కృష్ణారెడ్డి, కర్రె పావని, ఫజల్, హాజీ, వసీం,ఇమ్రాన్ గని, సుంకే రాజు, దాసరి సందీప్, తోట అంజయ్య, కుర్ర పోచయ్య, మల్లారెడ్డి, ఫహద్, స్వప్న శ్రీ, మాలోతు మహాలక్ష్మి, పెంట శేఖర్, రాచర్ల పద్మ, సిరిపురం నాగప్రసాద్, సత్తినేని శ్రీకాంత్, మల్లారెడ్డి, కాశి పాక రాకేష్, శిల్పా, కూస రవీందర్, సుంకరి గణపతి, సుధాకర్ నాయక్ తదితరులు పాల్గొన్నారు.
    1
    డిసిసి కార్యాలయంలో వై.ఎస్.ఆర్ వర్ధంతి

సంక్షేమానికి చిరునామా వై.ఎస్.ఆర్ - ఎమ్మెల్యే, డిసిసి అధ్యక్షులు మేడిపల్లి సత్యం
మాజీ ముఖ్యమంత్రి, దివంగత మహానేత డా. వై.ఎస్. రాజశేఖర్ రెడ్డి గారి వర్ధంతి సందర్భంగా నేడు కరీంనగర్ డిసిసి కార్యాలయంలో ఘనంగా నివాళుల కార్యక్రమం నిర్వహించారు.
ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా చొప్పదండి ఎమ్మెల్యే, జిల్లా కాంగ్రెస్ అధ్యక్షులు డా. మేడిపల్లి సత్యం హాజరై, కరీంనగర్ కార్పొరేషన్ కాంగ్రెస్ అధ్యక్షులు వైద్యుల అంజన్ కుమార్, మాజీ సుడా చైర్మన్ కోమటిరెడ్డి నరేందర్ రెడ్డి, మాజీ ఎమ్మెల్యే ఆరెపల్లి మోహన్, అర్బన్ బ్యాంక్ చైర్మన్, గడ్డం విలాస్ రెడ్డి, మాజీ ఏఎంసీ చైర్మన్ ఆకారపు  భాస్కర్ రెడ్డి తదితరులతో కలిసి వై.ఎస్.ఆర్ చిత్రపటానికి పూలమాల వేసి ఘన నివాళులర్పించారు.
అనంతరం డిసిసి అధ్యక్షులు డా. మేడిపల్లి సత్యం మాట్లాడుతూ..
స్వర్గీయ డా. వై.ఎస్. రాజశేఖర్ రెడ్డి గారు ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రిగా పనిచేసి ఏ ప్రభుత్వం, ఏ ముఖ్యమంత్రి చేయని విధంగా అభివృద్ధి, సంక్షేమానికి చిరునామాగా నిలిచారని అన్నారు. విద్య, వైద్యం, వ్యవసాయం, మహిళా సాధికారత వంటి ప్రతి రంగంలోనూ చెరగని ముద్ర వేశారన్నారు.
ఫీజు రీయింబర్స్ మెంట్, 108, ఆరోగ్యశ్రీ, రైతులకు ఉచిత విద్యుత్, రుణమాఫీ వంటి ఎన్నో సంక్షేమ పథకాలు ఆయన హయాంలోనే ప్రవేశపెట్టారని, దేశంలో సంక్షేమం అంటే గుర్తుకొచ్చే ఏకైక పేరు వై.ఎస్.ఆర్ అని కొనియాడారు.
ముఖ్యంగా కరీంనగర్ జిల్లా అభివృద్ధిలో వై.ఎస్.ఆర్ పాత్ర మరువలేనిదని, ఆనాడు ఆయన నిర్మించిన ప్రాజెక్టులు, కాలువల వల్లే నేడు జిల్లాలో వ్యవసాయం సుభిక్షంగా ఉందని, శాతవాహన యూనివర్సిటీ తో పాటు కొండగట్టు, మంథనిలో JNTU, కోరుట్లలో వెటర్నరీ యూనివర్సిటీ వంటివి ఆయన హయాంలోనే ఏర్పాటయ్యాయని గుర్తు చేశారు.
2009లో హెలికాప్టర్ ప్రమాదంలో ఆయన మరణించడం చాలా బాధాకరమని, వై.ఎస్.ఆర్ ఆశయం రాహుల్ గాంధీ గారిని ప్రధానమంత్రిగా చూడాలని ఉండేదని, ప్రతి కాంగ్రెస్ కార్యకర్త ఆ ఆశయాన్ని నెరవేర్చి ఆ మహనీయుడికి ఘన నివాళి అర్పించాలని పిలుపునిచ్చారు.
ఈ కార్యక్రమంలో నాయకులు మడుపు మోహన్, బానోతు శ్రావణ్ నాయక్, వరాల నర్సింగం, పర్వత మల్లేశం, అన్నమనేని నర్సింగారావు, వెన్న రజిత రెడ్డి, అహమ్మద్ అలీ, విక్టర్, వంగల విద్యాసాగర్, కుంభాల రాజకుమార్, మాదాసు శ్రీనివాస్, గంగుల దిలీప్, మూల కృష్ణారెడ్డి, కర్రె పావని, ఫజల్, హాజీ, వసీం,ఇమ్రాన్ గని, సుంకే రాజు, దాసరి సందీప్, తోట అంజయ్య, కుర్ర పోచయ్య, మల్లారెడ్డి, ఫహద్, స్వప్న శ్రీ, మాలోతు మహాలక్ష్మి, పెంట శేఖర్, రాచర్ల పద్మ, సిరిపురం నాగప్రసాద్, సత్తినేని శ్రీకాంత్, మల్లారెడ్డి, కాశి పాక రాకేష్, శిల్పా, కూస రవీందర్, సుంకరి గణపతి, సుధాకర్ నాయక్ తదితరులు పాల్గొన్నారు.
    user_శాతవాహన కరీంనగర్
    శాతవాహన కరీంనగర్
    కరీంనగర్ రూరల్, కరీంనగర్, తెలంగాణ•
    1 hr ago
  • టిఆర్ఎస్ పార్టీ ఆధ్వర్యంలో రైతులుపంటలకు నీటిని విడుదల చేయాలని రాస్తారోకో. ఖమ్మం జిల్లా కూసుమంచి మండలం పాలేరు రిజర్వాయర్ వద్ద ఈరోజు టిఆర్ఎస్ పార్టీ ఆధ్వర్యంలో నిర్వహించ తలపెట్టిన రైతు ధర్నాను టిఆర్ఎస్ శ్రేణులు రైతులు విజయవంతంగా నిర్వహించారు. సందర్భంగా పాలేరు నియోజకవర్గం మాజీ ఎమ్మెల్యే కందల ఉపేందర్ రెడ్డి మాట్లాడుతూ పాలేరు నీటిని తక్షణమే పాలేరు ఆయకట్ట కింద ఉన్న రైతులకు పంట పొలాలకు ఆరుతరులు పంట నిమిత్తమైన అందించాలని శాంతియుత రాస్తారోకోలు చేసినారు. తక్షణమే ప్రభుత్వం స్పందించి రైతులను ఆదుకోవాలని లేని ఇంకా ఉధృతం చేస్తామని రైతులు టిఆర్ఎస్ నాయకులు గట్టిగా హెచ్చరికలు చేసినారు. ఈ కార్యక్రమంలో పాలేరు నియోజకవర్గంలోని టిఆర్ఎస్ పార్టీ నాయకులు కార్యకర్తలు. రైతులు స్వచ్ఛందంగా పాల్గొనినరు.ఈ కార్యక్రమంలో రైతులు ప్రభుత్వంపై విమర్శలతో కూడిన ఫ్లాకార్డులు ప్రదర్శించారు. తెలంగాణ మొదటి ముఖ్యమంత్రి కేసీఆర్ అన్నవాళ్లను తుడిచి వేయడమే లక్ష్యంమా, రైతులను మళ్లీ కూలీలుగా మారుస్తారా అంటూ నేతలు నినాదాలు చేశారు.
    1
    టిఆర్ఎస్ పార్టీ ఆధ్వర్యంలో రైతులుపంటలకు నీటిని విడుదల చేయాలని రాస్తారోకో.

ఖమ్మం జిల్లా కూసుమంచి మండలం పాలేరు రిజర్వాయర్ వద్ద ఈరోజు టిఆర్ఎస్ పార్టీ ఆధ్వర్యంలో నిర్వహించ తలపెట్టిన రైతు ధర్నాను టిఆర్ఎస్ శ్రేణులు రైతులు విజయవంతంగా నిర్వహించారు. సందర్భంగా పాలేరు నియోజకవర్గం మాజీ ఎమ్మెల్యే కందల ఉపేందర్ రెడ్డి మాట్లాడుతూ  పాలేరు నీటిని తక్షణమే పాలేరు ఆయకట్ట కింద ఉన్న రైతులకు పంట పొలాలకు ఆరుతరులు పంట నిమిత్తమైన అందించాలని శాంతియుత రాస్తారోకోలు చేసినారు. తక్షణమే ప్రభుత్వం స్పందించి రైతులను ఆదుకోవాలని లేని ఇంకా ఉధృతం చేస్తామని రైతులు టిఆర్ఎస్ నాయకులు గట్టిగా హెచ్చరికలు చేసినారు. ఈ కార్యక్రమంలో పాలేరు నియోజకవర్గంలోని టిఆర్ఎస్ పార్టీ నాయకులు కార్యకర్తలు. రైతులు స్వచ్ఛందంగా పాల్గొనినరు.ఈ కార్యక్రమంలో రైతులు ప్రభుత్వంపై విమర్శలతో కూడిన ఫ్లాకార్డులు ప్రదర్శించారు. తెలంగాణ మొదటి ముఖ్యమంత్రి కేసీఆర్ అన్నవాళ్లను తుడిచి వేయడమే లక్ష్యంమా, రైతులను మళ్లీ కూలీలుగా మారుస్తారా అంటూ నేతలు నినాదాలు చేశారు.
    user_YELLIMALLI SRINIVASARAO
    YELLIMALLI SRINIVASARAO
    Local News Reporter తిరుమలాయపాలెం, ఖమ్మం, తెలంగాణ•
    4 hrs ago
  • ప్రశ్నిస్తున్న రామగుండం., కాంగ్రెస్ ప్రభుత్వ 6 గ్యారంటీలు, 420 హామీల వైఫల్యలపై నిలదీసిన బిజెపి రాష్ట్ర నాయకురాలు శ్రీమతి సోమారపు లావణ్య ?*బీజేపీ వారం రోజుల కార్యచరణలో భాగంగా కాంగ్రెస్ ప్రభుత్వ 6 గ్యారంటీలు, 420 హామీల వైఫల్యలపై నిలదీసిన బిజెపి రాష్ట్ర నాయకురాలు శ్రీమతి *సోమారపు లావణ్య* గారి ఆధ్వర్యంలో రామగుండం నియోజకవర్గం 8 ఇంక్లైన్ కాలనీలో స్థానిక కాంగ్రెస్ పార్టీ నుండి ఎన్నికైన 14వ డివిజన్ కార్పొరేటర్ బడావాత్ శంకర్ నాయక్ గారికి, 17వ డివిజన్ కార్పొరేటర్ అనుము స్వరూప- రాములు గారికి,18వ డివిజన్ కార్పొరేటర్ దేవనపల్లి చక్రపాణి గారికి 19వ డివిజన్ కార్పొరేటర్ మారెల్లి సుశీల గారికి వినతిపత్రం అందజేసిన అనంతరం వారు మాట్లాడుతూ కాంగ్రెస్ పార్టీ ఎన్నికల సమయంలో ప్రజలకు ఇచ్చిన హమీలను అమలు చేయడంలో పూర్తిగా విఫలమైందని విమర్శించారు. కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చి 3 సంవత్సరాలు గడుస్తున్నా, ప్రజలకు ఇచ్చిన వాగ్దానాలు గాలికి వదిలేసిందని ధ్వజమెత్తారు. రైతు భరోసా, రుణమాఫీ, మహిళలకు నెలకు ₹2,500 మహాలక్ష్మి పథకం, తులం బంగారం, నిరుద్యోగ భృతి, వృద్ధాప్య పింఛన్ల పెంపు వంటి ఏ ఒక్క హామీని సరైన రీతిలో అమలు చేయలేదని ఆరోపించారు. 420 వాగ్దానాలతో ప్రజలను మోసం చేసిన అసలైన 420 కాంగ్రెస్ పార్టీ వైఖరిని ప్రజల్లో ఎండగట్టడానికే *ప్రశ్నిస్తున్నరామగుండం* పేరిట ఈ యొక్క కార్యక్రమాన్ని చేపట్టినట్లు తెలిపారు. కార్పొరేటర్లు ప్రజా సమస్యలపై కౌన్సిల్ సమావేశాల్లో కాంగ్రెస్ ప్రభుత్వ వైఫల్యాలను నిలదీయాలని, 8 ఇంక్లైన్ కాలనీ ప్రాంతంలోని మౌలిక వసతుల కల్పన మరియు అభివృద్ధి పనులపై దృష్టి సారించాలని విజ్ఞప్తి చేశారు. ఈ యొక్క కార్యక్రమంలో మాజీ జిల్లా ఉపాధ్యక్షురాలు మాతంగి రేణుక, సీనియర్ నాయకులు &మాజీ కౌన్సిలర్ దాసరి శ్రీనివాస్, -సుశీల, నాయకులు కన్నూరి భాస్కర్ ,కొమ్మ శ్రీనివాస్ యాదవ్,అరిగేలా శ్రావణ్ యాదవ్ ,పొట్ల వెంకటేష్,మారేపెల్లి శ్రీనివాస్,అంకం కుమార్, పంగ రవి,బోటుకు మల్లేష్ ,పొట్ల శశాంక్, మెరుగు శ్రీనివాస్ ,రాజేష్ నాయక్,నాగేందర్,ఎడ్లపురం రమేష్, నారీ,కుందరపు సత్యనారాయణ,ఇల్లందులా మహేష్, భాస్కర్,క్రాంతి,పొట్ల సాయితేజ,శాంతిరాజ్, వివేక్,సాయికుమార్,మహిళా నాయకురాళ్లు,పానుగంటి అంజలి,కరుపాకుల మాధవి గార్లు అధిక సంఖ్యలో కార్యకర్తలు మరియు తదితరులు పాల్గొన్నారు.
    1
    ప్రశ్నిస్తున్న రామగుండం., 
కాంగ్రెస్ ప్రభుత్వ 6 గ్యారంటీలు, 420 హామీల వైఫల్యలపై నిలదీసిన బిజెపి రాష్ట్ర నాయకురాలు శ్రీమతి సోమారపు లావణ్య
?*బీజేపీ వారం రోజుల కార్యచరణలో భాగంగా
కాంగ్రెస్ ప్రభుత్వ 6 గ్యారంటీలు, 420 హామీల వైఫల్యలపై నిలదీసిన బిజెపి రాష్ట్ర నాయకురాలు శ్రీమతి *సోమారపు లావణ్య* గారి ఆధ్వర్యంలో
రామగుండం నియోజకవర్గం 8 ఇంక్లైన్ కాలనీలో స్థానిక కాంగ్రెస్ పార్టీ నుండి ఎన్నికైన     14వ డివిజన్ కార్పొరేటర్ బడావాత్ శంకర్ నాయక్ గారికి, 17వ డివిజన్ కార్పొరేటర్ అనుము స్వరూప- రాములు గారికి,18వ డివిజన్ కార్పొరేటర్ దేవనపల్లి చక్రపాణి గారికి 19వ డివిజన్ కార్పొరేటర్ మారెల్లి సుశీల గారికి వినతిపత్రం అందజేసిన అనంతరం వారు మాట్లాడుతూ
కాంగ్రెస్ పార్టీ ఎన్నికల సమయంలో ప్రజలకు ఇచ్చిన హమీలను అమలు చేయడంలో పూర్తిగా విఫలమైందని విమర్శించారు. కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చి 3 సంవత్సరాలు గడుస్తున్నా, ప్రజలకు ఇచ్చిన వాగ్దానాలు గాలికి వదిలేసిందని ధ్వజమెత్తారు. రైతు భరోసా, రుణమాఫీ, మహిళలకు నెలకు ₹2,500 మహాలక్ష్మి పథకం, తులం బంగారం, నిరుద్యోగ భృతి, వృద్ధాప్య పింఛన్ల పెంపు వంటి ఏ ఒక్క హామీని సరైన రీతిలో అమలు చేయలేదని ఆరోపించారు. 420 వాగ్దానాలతో ప్రజలను మోసం చేసిన అసలైన 420 కాంగ్రెస్ పార్టీ వైఖరిని ప్రజల్లో ఎండగట్టడానికే *ప్రశ్నిస్తున్నరామగుండం* పేరిట ఈ యొక్క కార్యక్రమాన్ని చేపట్టినట్లు తెలిపారు.
కార్పొరేటర్లు ప్రజా సమస్యలపై కౌన్సిల్ సమావేశాల్లో కాంగ్రెస్ ప్రభుత్వ వైఫల్యాలను నిలదీయాలని, 8 ఇంక్లైన్ కాలనీ ప్రాంతంలోని మౌలిక వసతుల కల్పన మరియు అభివృద్ధి పనులపై దృష్టి సారించాలని విజ్ఞప్తి చేశారు. ఈ యొక్క కార్యక్రమంలో మాజీ జిల్లా ఉపాధ్యక్షురాలు మాతంగి రేణుక, సీనియర్ నాయకులు &మాజీ కౌన్సిలర్ దాసరి శ్రీనివాస్, -సుశీల, నాయకులు కన్నూరి భాస్కర్ ,కొమ్మ శ్రీనివాస్ యాదవ్,అరిగేలా శ్రావణ్ యాదవ్ ,పొట్ల వెంకటేష్,మారేపెల్లి శ్రీనివాస్,అంకం కుమార్, పంగ రవి,బోటుకు మల్లేష్ ,పొట్ల శశాంక్, మెరుగు శ్రీనివాస్ ,రాజేష్ నాయక్,నాగేందర్,ఎడ్లపురం రమేష్, నారీ,కుందరపు సత్యనారాయణ,ఇల్లందులా మహేష్, భాస్కర్,క్రాంతి,పొట్ల సాయితేజ,శాంతిరాజ్, వివేక్,సాయికుమార్,మహిళా నాయకురాళ్లు,పానుగంటి అంజలి,కరుపాకుల మాధవి గార్లు అధిక సంఖ్యలో కార్యకర్తలు మరియు తదితరులు పాల్గొన్నారు.
    user_Telangana reporter
    Telangana reporter
    Local News Reporter రామగుండం, పెద్దపల్లి, తెలంగాణ•
    1 hr ago
  • PFI కేసులో అరెస్టు అయిన అబ్దుల్ సలీంకు ఒక రోజు పెరోల్...చంచల్ గూడ జైల్ నుంచి జగిత్యాలకు తరలించిన పోలీసులు జగిత్యాలకు చెందిన అబ్దుల్ సలీంను మూడేళ్ల క్రితం పిఎఫ్ఐ కేసులో ఎన్ఐఏ అధికారులు అరెస్ట్ చేసి చంచల్ గూడ జైల్లో పెట్టారు. జైల్లో ఉన్న అబ్దుల్ సలీంను ఒక రోజు పెరోల్ పై పోలీసులు జగిత్యాలకు తీసుకొచ్చారు. సలీం చిన్నమ్మ మృతి, కుటుంబ సభ్యుల అనారోగ్య పరిస్థితుల నేపథ్యంలో ఒక రోజు ఫెరోల్ మంజూరు చేశారు. దీంతో గట్టి బందోబస్తు మధ్య జగిత్యాలకి తీసుకు వచ్చిన పోలీసులు పెరోల్ గడువు ముగిసిన అనంతరం తిరిగి జైల్ కు తరలించారు.
    2
    PFI కేసులో అరెస్టు అయిన అబ్దుల్ సలీంకు ఒక రోజు పెరోల్...చంచల్ గూడ జైల్ నుంచి జగిత్యాలకు తరలించిన పోలీసులు
జగిత్యాలకు చెందిన అబ్దుల్ సలీంను మూడేళ్ల క్రితం పిఎఫ్ఐ కేసులో ఎన్ఐఏ అధికారులు అరెస్ట్ చేసి చంచల్ గూడ జైల్లో పెట్టారు. జైల్లో ఉన్న అబ్దుల్ సలీంను ఒక రోజు పెరోల్ పై పోలీసులు జగిత్యాలకు తీసుకొచ్చారు. సలీం చిన్నమ్మ మృతి, కుటుంబ సభ్యుల అనారోగ్య పరిస్థితుల నేపథ్యంలో ఒక రోజు ఫెరోల్ మంజూరు చేశారు. దీంతో గట్టి బందోబస్తు మధ్య జగిత్యాలకి తీసుకు వచ్చిన పోలీసులు పెరోల్ గడువు ముగిసిన అనంతరం తిరిగి జైల్ కు తరలించారు.
    user_K.V.REDDY
    K.V.REDDY
    చిగురుమామిడి, కరీంనగర్, తెలంగాణ•
    6 hrs ago
  • యాంగ్ ఇండియా స్కిల్ యూనివర్సిటీ వీసీ కే స్కిల్ లేదు ఆయనకు పిహెచ్డీ లేదు,డాక్టరేట్ లేదు యూనివర్సిటీలో వందల మంది స్టాఫ్ యాంగ్ ఇండియా స్కిల్ యూనివర్సిటీ వీసీ కే స్కిల్ లేదు ఆయనకు పిహెచ్డీ లేదు,డాక్టరేట్ లేదు యూనివర్సిటీలో వందల మంది స్టాఫ్ ఉండాలి కానీ ఉన్నది కేవలం ఆరుగురు పాలిటెక్నిక్ వ్యవస్థను డిస్టర్బ్ చేస్తే ఊరుకోను చెల్లెమ్మ.... అది జరగకుండా చూస్తా ఇది తీన్మార్ మల్లన్నగా నా హామీ
    1
    యాంగ్ ఇండియా స్కిల్ యూనివర్సిటీ వీసీ కే స్కిల్ లేదు

ఆయనకు పిహెచ్డీ లేదు,డాక్టరేట్ లేదు

యూనివర్సిటీలో వందల మంది స్టాఫ్
యాంగ్ ఇండియా స్కిల్ యూనివర్సిటీ వీసీ కే స్కిల్ లేదు
ఆయనకు పిహెచ్డీ లేదు,డాక్టరేట్ లేదు
యూనివర్సిటీలో వందల మంది స్టాఫ్ ఉండాలి కానీ ఉన్నది కేవలం ఆరుగురు
పాలిటెక్నిక్ వ్యవస్థను డిస్టర్బ్ చేస్తే ఊరుకోను చెల్లెమ్మ.... అది జరగకుండా చూస్తా
ఇది తీన్మార్ మల్లన్నగా నా హామీ
    user_NIMMANAGANTI ANIL BABU
    NIMMANAGANTI ANIL BABU
    Local News Reporter డోర్నకల్, మహబూబాబాద్, తెలంగాణ•
    17 hrs ago
View latest news on Shuru App
Download_Android
  • Terms & Conditions
  • Career
  • Privacy Policy
  • Blogs
Shuru, a product of Close App Private Limited.