రామగుండం ప్రాంతంలో విస్తృతంగా పర్యటించిన జిల్లా కలెక్టర్ కోయశ్రీ హర్ష పాఠశాలల్లో పెండింగ్ పనులను నిర్ణీత గడువులోగా పూర్తి చేయాలి : జిల్లా కలెక్టర్ కోయ శ్రీహర్ష **పెండింగ్ పునరుద్ధరణ పనులను 15 రోజుల్లో పూర్తి చేయాలి** **కిచెన్ షెడ్లు, మరమ్మతులు, మరుగుదొడ్ల పనులను నెల రోజుల్లోగా పూర్తి చేయాలి** **అల్లూరు ,యూపీహెచ్‌సీలో ఎన్‌సీడీ స్క్రీనింగ్‌ను పెంచాలి** **లక్ష్మీపురం–వీర్లపల్లి రహదారి పనులను 3 నెలల్లో పూర్తి చేయాలి**.. రామగుండం ప్రాంతంలో చేపడుతున్న వివిధ అభివృద్ధి పనులను వేగవంతం చేసి ప్రజలకు, విద్యార్థులకు మెరుగైన సౌకర్యాలు అందుబాటులోకి తీసుకురావాలని *జిల్లా కలెక్టర్ కోయ శ్రీహర్ష* అధికారులను ఆదేశించారు. బుధవారం రామగుండం ప్రాంతంలో విస్తృతంగా పర్యటించిన *జిల్లా కలెక్టర్* పలు ప్రభుత్వ పాఠశాలలు, అల్లూరు యూపీహెచ్‌సీ, లక్ష్మీపురం–వీర్లపల్లి రహదారి పనులను పరిశీలించారు. *రామగుండం మండలంలోని మండల పరిషత్ ప్రాథమిక పాఠశాల, మార్కండేయ కాలనీ గోదావరిఖని ఉర్దూ మీడియం పాఠశాల, అడ్డగుంటపల్లి ఎం.పీ.పీ.ఎస్ పాఠశాల, సంజయ్ నగర్ ఎం.పీ.పీ.ఎస్ పాఠశాల, అల్లూరు ఎం.పీ.పీ.ఎస్ పాఠశాల, జడ్పీహెచ్‌ఎస్ నరసింహపురం (న్యూ మారేడుపాక), వీర్లపల్లి ఎం.పీ.పీ.ఎస్ పాఠశాల, చైతన్యపురి ఎం.పీ.పీ.ఎస్ పాఠశాల, 46వ డివిజన్ శాంతినగర్ ఎం.పీ.పీ.ఎస్ పాఠశాలలను* పరిశీలించారు. ఈ సందర్భంగా *జిల్లా కలెక్టర్ కోయ శ్రీహర్ష మాట్లాడుతూ,* పాఠశాలల్లో విద్యార్థులకు అందుతున్న మౌలిక వసతులు, పాఠశాల భవనాల పరిస్థితి, మరమ్మతు పనులు, కిచెన్ షెడ్లు, మరుగుదొడ్ల నిర్మాణం తదితర పనుల పురోగతిని కలెక్టర్ పరిశీలించారు. గోదావరిఖని ఉర్దూ మీడియం పాఠశాలలో నూతనంగా ఏర్పాటు చేసిన ప్రీ-ప్రైమరీ తరగతి గదిని ప్రారంభించారు. పాఠశాలల్లో పెండింగ్‌లో ఉన్న పునరుద్ధరణ పనులను 15 రోజుల్లోగా పూర్తి చేయాలని జిల్లా కలెక్టర్ అధికారులను ఆదేశించారు. వివిధ పాఠశాలల్లో కొనసాగుతున్న కిచెన్ షెడ్లు, ఇతర మరమ్మతు పనులు, మరుగుదొడ్ల పనులను యుద్ధప్రాతిపదికన పూర్తి చేసి నెల రోజుల్లోగా విద్యార్థులకు అందుబాటులోకి తీసుకురావాలని సూచించారు. విద్యార్థులకు అవసరమైన మౌలిక వసతుల కల్పనలో ఎలాంటి జాప్యం ఉండకూడదని, పనుల నాణ్యత విషయంలో రాజీ పడకుండా నిర్దేశిత గడువులోగా పూర్తి చేయాలని తెలిపారు. అనంతరం *రామగుండం మండలంలోని అల్లూరు యూపీహెచ్‌సీ ఆరోగ్య కేంద్రాన్ని ఆకస్మికంగా తనిఖీ చేశారు.* ఆరోగ్య కేంద్రంలో అందుతున్న ఓపీ సేవలు, వైద్యుల అందుబాటు, రోగులకు అందుతున్న వైద్య సేవలు, ఎన్‌సీడీ స్క్రీనింగ్ తదితర అంశాలను పరిశీలించారు. అల్లూరు యూపీహెచ్‌సీలో ఎన్‌సీడీ స్క్రీనింగ్ చాలా తక్కువగా ఉందని, అర్హులైన ప్రతి ఒక్కరికీ స్క్రీనింగ్ నిర్వహించేలా చర్యలు తీసుకొని స్క్రీనింగ్ శాతాన్ని పెంచాలని ఆదేశించారు. ఆరోగ్య కేంద్రానికి వచ్చే రోగులకు మెరుగైన వైద్య సేవలు అందించాలని, ఓపీ సేవలను మరింత మెరుగుపరచాలని సూచించారు. వైద్యులు నిర్ణీత సమయానికి విధులకు హాజరై రోగులకు అందుబాటులో ఉండేలా చర్యలు తీసుకోవాలని ఆదేశించారు. అనంతరం *లక్ష్మీపురం నుంచి వీర్లపల్లి వరకు జరుగుతున్న రహదారి అభివృద్ధి పనులను* పరిశీలించారు. సింగిల్ రోడ్డును డబుల్ రోడ్డుగా విస్తరించే పనులను వివరించారు. రహదారి పనుల పురోగతిని పరిశీలించిన పనులను వేగవంతం చేసి మూడు నెలల్లోగా పూర్తి చేయాలని సంబంధిత అధికారులను ఆదేశించారు. రహదారి పనులను నాణ్యతా ప్రమాణాలతో చేపట్టాలని, పనులలో ఎలాంటి జాప్యం లేకుండా నిర్దేశిత గడువులోగా పూర్తి చేసి ప్రజలకు మెరుగైన రవాణా సౌకర్యం అందుబాటులోకి తీసుకురావాలని సూచించారు. పాఠశాలలు, ఆరోగ్య కేంద్రాలు, రహదారుల అభివృద్ధి పనులపై సంబంధిత అధికారులు నిరంతరం పర్యవేక్షణ చేపట్టాలని, క్షేత్రస్థాయిలో పనుల పురోగతిని ఎప్పటికప్పుడు పరిశీలిస్తూ నిర్ణీత గడువులోగా పనులు పూర్తయ్యేలా చర్యలు తీసుకోవాలని ఆదేశించారు. ఈ పర్యటనలో టీజీఈడబ్ల్యూఐడీసీ ఈఈ అశోక్ కుమార్, డిప్యూటీ ఇంజనీర్ మారుతి, ఏఈ నరేష్, యూపీహెచ్‌సీ డా.దివేన, ఆర్‌అండ్‌బీ ఏఈ జావిద్, ఇతర సంబంధిత అధికారులు పాల్గొన్నారు.

- కరీంనగర్ జిల్లా చిగురుమామిడి మండలం సుందరగిరి గ్రామ శివారులో వ్యవసాయ బావిపైకి దూసుకెళ్లిన ఆర్టీసీ బస్సు కరీంనగర్ నుండి హుస్నాబాద్ కు ప్రయాణికులతో వెళ్తున్న ఆర్టీసీ బస్సు..* త్రుటిలో తప్పిన భారీ ప్రమాదం,స్వల్ప గాయాలతో బయటపడ్డ ప్రయాణికులు1
- వేములవాడ ఆలయ అభివృద్ధి పనులపై ఈనెల 6న సీఎం సమక్షంలో సమావేశం...మరో సమావేశంలోగా రాజన్న దర్శనం కల్పించేలా ఏర్పాట్లు చేస్తామని ఆది శ్రీనివాస వెల్లడి వేములవాడ శ్రీ రాజరాజేశ్వర స్వామి ఆలయ విస్తరణ అభివృద్ధి పనులు శరవేగంగా జరుగుతున్నాయని ప్రభుత్వ విప్, వేములవాడ ఎమ్మెల్యే ఆది శ్రీనివాస్ తెలిపారు. ఆలయ విస్తరణ పనులను సీఎం ఓఎస్డీ శ్రీనివాసులు, దేవాదాయ ధర్మాదాయ శాఖ కమిషనర్ హనుమంతరావు, జిల్లా కలెక్టర్ గరీమా అగ్రవాల్ తో పాటు వివిధ శాఖల అధికారులతో పరిశీలించి పనుల పురోగతిపై సమీక్ష సమావేశం నిర్వహించారు. అనంతరం ఆయన మీడియాతో మాట్లాడుతూ రాజన్న ఆలయ విస్తరణ పనులు ఇప్పటివరకు జరిగిన పనులపై చర్చించామని, త్వరలో జరగబోయే పనులపై చర్చించి, ఈనెల 6న హైదరాబాద్ లో సీఎం క్యాంప్ ఆఫీస్ లో సమావేశం అనంతరం టెండర్ల ప్రక్రియకు వెళ్తామన్నారు. విస్తరణ పనులు త్వరితగతిన పూర్తి చేసి మరో సమావేశంలోగా రాజన్న దర్శనం కల్పించడానికి చర్యలు తీసుకుంటామన్నారు. అలాగే వచ్చే సంవత్సరం జరిగే గోదావరి పుష్కరాలకు 1000 కోట్లు నిధులు మంజూరు చేసి భక్తులకు సౌకర్యాలు కల్పిస్తామన్నారు.2
- కోరుట్లలో ఔట్‌సోర్సింగ్ ఉద్యోగుల ఆందోళన 1181 జీవోను రద్దు చేయాలని డిమాండ్ జగిత్యాల జిల్లా కోరుట్ల: ఔట్‌సోర్సింగ్ ఉద్యోగుల సమస్యలను పరిష్కరించాలని, ఉద్యోగ భద్రత కల్పించాలని కోరుతూ కోరుట్లలో మున్సిపల్ ఔట్‌సోర్సింగ్ ఉద్యోగులు ఆందోళన చేపట్టారు. ప్రభుత్వం జారీ చేసిన 1181 జీవోను వెంటనే రద్దు చేయాలని వారు డిమాండ్ చేశారు. ఏళ్ల తరబడి ప్రభుత్వ శాఖల్లో సేవలందిస్తున్న ఔట్‌సోర్సింగ్ సిబ్బందిని ఉద్యోగ భద్రత లేకుండా చేయడం అన్యాయమని ఆవేదన వ్యక్తం చేశారు. ఔట్‌సోర్సింగ్ విధానాన్ని రద్దు చేసి, తమ సేవలను కొనసాగిస్తూ ఉద్యోగ భద్రత కల్పించాలని ప్రభుత్వాన్ని కోరారు. తమ సమస్యలను ప్రభుత్వం వెంటనే పరిష్కరించకపోతే ఆందోళనలను మరింత ఉధృతం చేస్తామని హెచ్చరించారు.1
- ములుగు గడ్డపై గుబాలించిన గులాబీ జెండా - కాంగ్రెస్ ప్రభుత్వం పై మొదలైన నిరసనలు - 420 ఫీట్ల ఫ్లెక్సీ తో భారీ ర్యాలీ : బీఆర్ఎస్ ములుగు జిల్లా అధ్యక్షుడు కాకులమర్రి లక్ష్మీనరసింహారావు, నియోజకవర్గ ఇన్చార్జి నాగజ్యోతి ములుగు జిల్లా ప్రతినిధి, సెప్టెంబర్ 02 (భారత శక్తి) : తెలంగాణ ఉద్యమానికి పురుడుపోసిన ములుగు గడ్డపై గులాబీ జెండా గుబాలించింది. ఇచ్చిన హామీలను తుంగలో తొక్కి తెలంగాణ ప్రజలపై సవతి తల్లి ప్రేమను కనబరుస్తున్న కాంగ్రెస్ వైఫల్యాలను ఎండగడుతూ బిఆర్ఎస్ రాష్ట్ర వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ ఆదేశాల మేరకు ములుగు జిల్లా కేంద్రంలోని 163 వ జాతీయ రహదారిపై 420 ఫీట్ల తో కాంగ్రెస్ పార్టీ హామీలు గుర్తు చేసే విధంగా ఫ్లెక్సీ ఏర్పాటు చేసి భారీ ర్యాలీ నిర్వహించారు. ఈ కార్యక్రమానికి బిఆర్ ఎస్ ములుగు అధ్యక్షుడు కాకులమర్రి లక్ష్మీనరసింహారావుములుగు నియోజకవర్గ ఇన్చార్జి బడే నాగజ్యోతిలు హాజరయ్యారు. ములుగు జిల్లా కేంద్రంలోని డిఎల్ఆర్ ఫంక్షన్ హాల్ నుండి ప్రభుత్వ ఆసుపత్రి వరకు కొనసాగింది. ఈ సందర్భంగా జిల్లా కేంద్రంలోని ప్రధాన చౌరస్తాలో కాసేపు చేపట్టిన నిరసనకార్యక్రమంలో వారు మాట్లాడారు. అడవి బిడ్డల ఆత్మగౌరవానికి ప్రతీక అయిన ఈ గడ్డపై నిన్నటి వరకు ప్రశాంతంగా ఉన్న గులాబీ జెండా బుధవారం తిరగబడిందన్నారు. ఇది కేవలం ఒక పార్టీ జెండా తిరుగుబాటు కాదని,మోసపోయిన తెలంగాణ ప్రజల తిరుగుబాటని పేర్కొన్నారు. ములుగు కేంద్రంలో జరిగిన భారీ ర్యాలీ కాంగ్రెస్ ప్రభుత్వానికి చెంపపెట్టు లాంటిదని అన్నారు. "100 రోజుల్లో చేస్తామని చెప్పి,1000 రోజులైనా కాంగ్రెస్ ప్రభుత్వం ఇచ్చిన ఒక్క హామీని నిలబెట్టుకోలేదని మండిపడ్డారు. కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి రావడానికి ముందు ఇచ్చిన ఆరు గ్యారెంటీలు, అనేక ఉప హామీలు నేడు కాగితాలకే పరిమితమయ్యాయని వారు ఎద్దేవా చేశారు. మహాలక్ష్మి పథకం ద్వారా ప్రతి మహిళకు నెలకు రూ.2500 అన్నారు. ఏ మహిళకు అందుతోందో చెప్పాలని అన్నారు. తులం బంగారం, స్కూటీ హామీలు ఏమయ్యాయని వారు ప్రశ్నించారు. రైతు భరోసా రైతుబంధు స్థానంలో రైతు భరోసా పేరుతో రూ.15,000 ఇస్తామన్నారని,కానీ వానాకాలం, యాసంగి సీజన్లు గడిచిపోతున్నా రైతు ఖాతాలో పడేది శూన్యమన్నారు.కౌలు రైతులకు భరోసా ఎక్కడ ఉందని అన్నారు.యువతకు 2 లక్షల ఉద్యోగాలు అన్నారని,నేటికి నోటిఫికేషన్లు ఇవ్వలేదని అన్నారు.నిరుద్యోగ భృతి రూ.4000 ఏమైందని,పేపర్ లీకేజీలతో యువత జీవితాలతో కాంగ్రెస్ ప్రభుత్వం చెలగాటమాడుతున్నారు.పాలన చేతకాక కేసీఆర్ పై నిందలు వేసే కాంగ్రెస్ ది దివాలాకోరు రాజకీయమని అన్నారు.మూడేళ్లకు చేరువవుతున్న కాంగ్రెస్ పాలనలో సొంతంగా చెప్పుకోవడానికి ఒక్క విజయం లేదని పేర్కొన్నారు.ప్రతి వైఫల్యాన్ని కప్పిపుచ్చుకోవడానికి ఒకే ఒక్క ఆయుధం కేసీఆర్ పై నిందలు వేయవటమేనని ఆరోపించారు.కాళేశ్వరం కూలిందని, అప్పులు పెరిగాయని, ఉద్యోగాలు ఇవ్వలేదని అంటూ తెలంగాణను 10 ఏళ్లు అభివృద్ధి పథంలో నడిపిన నాయకుడిపై బురద జల్లడమే పనిగా పెట్టుకున్నారని అన్నారు.ప్రజలు అమాయకులు కారని,కాళేశ్వరం లో భాగమైన సమ్మక్క బ్యారేజ్ వల్లే ములుగు లాంటి ఏజెన్సీ ప్రాంతాల్లో కూడా చెరువులు నిండాయని అన్నారు.మిషన్ భగీరథ వల్ల ప్రతి గిరిజన గూడెంలో నల్లా వచ్చిందని తెలిపారు.రైతుబంధు వల్ల రైతు ఆత్మగౌరవంగా బతికాడని,అభివృద్ధిని చూసిన కళ్ళు అబద్ధాలను నమ్మవని పేర్కొన్నారు.కాంగ్రెస్ ప్రభుత్వం ఇంకా నిద్రమత్తులో ఉందని , ఈ తిరుగుబాటు ములుగుకే పరిమితం కాదని అన్నారు.తెలంగాణలోని ప్రతి గడ్డపై, ప్రతి గ్రామంలో ఇదే గులాబీ తిరుగుబాటు తప్పదని తెలిపారు.హామీలతో గెలిచి, మోసంతో పాలించాలని చూస్తే ప్రజలు క్షమించరని హెచ్చరించారు.ములుగు గడ్డపై ఎగిసిన ఈ గులాబీ జెండా, తెలంగాణ ఆత్మగౌరవ పునరుద్ధరణకు నాంది అని అన్నారు.కాంగ్రెస్ ప్రభుత్వం ఇప్పటికైనా మేల్కొని ఇచ్చిన హామీలను నెరవేర్చాలని,లేదంటే ప్రజా తిరుగుబాటు తప్పదని అని హెచ్చరించారు. ఈ కార్యక్రమంలో పాటు మండల స్థాయి నాయకులు కార్యకర్తలు అధిక సంఖ్యలో పాల్గొన్నారు1
- జన్న సిరిసిల్ల జిల్లా. *సైబర్ భద్రతలో ముందస్తు అప్రమత్తతే ముఖ్యం.* *సైబర్ నేరాల నివారణలో విద్యార్థుల భాగస్వామ్యమే కీలకం.* *సైబర్ నేరాలపై అవగాహన పెంపొందించుకోవాలి: జిల్లా ఎస్పీ మహేష్ బి. గితే.* తెలంగాణ సైబర్ సెక్యూరిటీ బ్యూరో (TGCSB) ఆధ్వర్యంలో ప్రతి నెల మొదటి బుధవారం నిర్వహించే కార్యాక్రమంలో భాగంగా జిల్లా సైబర్ టీమ్ ఆధ్వర్యంలో బుధవారం రోజున నర్సింగ్ కళాశాలలో విద్యార్థుల కోసం నిర్వహించిన సైబర్ నేరాల అవగాహన కార్యక్రమనికి జిల్లా ఎస్పీ గారు ముఖ్య అతిథిగా హాజరై అవగాహన కల్పించారు. అనంతరం ఎస్పీ గారు విద్యార్థులను ఉద్దేశించి మాట్లాడాతు..నేటి డిజిటల్ యుగంలో సాంకేతికత ఎంత వేగంగా అభివృద్ధి చెందుతోందో, అదే స్థాయిలో సైబర్ నేరాలు కూడా పెరుగుతున్నాయని , సైబర్ నేరాల బారిన పడకుండా ఉండేందుకు ముందస్తు అప్రమత్తతే ముఖ్యమని తెలిపారు. సైబర్ నేరగాళ్లు అనుసరిస్తున్న నూతన మోసపూరిత విధానాలపై ప్రతి ఒక్కరూ అవగాహన పెంపొందించుకోవాలని , ముఖ్యంగా విద్యార్థులను లక్ష్యంగా చేసుకుని సోషల్ మీడియా ద్వారా నకిలీ అకౌంట్లు, ఫేక్ లింకులు, పార్ట్‌టైమ్ ఉద్యోగాలు, స్కాలర్‌షిప్‌లు, గిఫ్ట్ ఆఫర్లు, లక్కీ డ్రా పేర్లతో మోసాలు జరుగుతున్నాయని తెలిపారు.తెలియని వ్యక్తుల నుంచి వచ్చే ఫోన్ కాల్స్, వీడియో కాల్స్, సందేశాలు లేదా లింకులను నమ్మవద్దని, ఓటీపీ, బ్యాంకు ఖాతా వివరాలు, ఏటీఎం పిన్, సీవీవీ నంబర్, ఆధార్ వివరాలు, పాస్‌వర్డ్‌లు వంటి వ్యక్తిగత సమాచారాన్ని ఎట్టి పరిస్థితుల్లోనూ ఇతరులతో పంచుకోవద్దని సూచించారు. అత్యాశ, భయం, అత్యవసర పరిస్థితులను ఆసరాగా చేసుకుని సైబర్ నేరగాళ్లు మోసాలు చేస్తున్నారన్నారు. విద్యార్థులు చదువుతో పాటు సైబర్ నేరాలపై అవగాహన పెంపొందించుకోని, కుటుంబ సభ్యులు, స్నేహితులకు సైబర్ భద్రతపై అవగాహన కల్పించి , సైబర్ నేరాల నివారణలో కీలక పాత్ర పోషించాలన్నారు. సైబర్ మోసానికి గురైన వెంటనే భయబ్రాంతులకు గురికాకుండా 1930కు కాల్ చేసి లేదా National Cyber Crime Reporting Portal ద్వారా ఫిర్యాదు చేయాలని జిల్లా ఎస్పీ గారు తెలిపారు. *వినాయకుడి బోధనలతో సైబర్ భద్రతపై అవగాహన పోస్టర్‌ను ఆవిష్కరించిన జిల్లా ఎస్పీ.* తెలంగాణ సైబర్ సెక్యూరిటీ బ్యూరో ఆధ్వర్యంలో వినాయక చవితి సందర్భంగా రూపొందించిన సైబర్ భద్రత అవగాహన పోస్టర్‌ను విద్యార్థులతో కలిసి ఆవిష్కరించారు.వినాయకుడి నుంచి సైబర్ భద్రత పాఠాలు’ అనే సందేశంతో రూపొందించిన పోస్టర్‌లో సైబర్ మోసాల పట్ల ప్రజలు తీసుకోవాల్సిన జాగ్రత్తలను వినూత్నంగా వివరించారు. *జిల్లా సైబర్ సెల్ టీమ్ పవర్ పాయింట్ ప్రజెంటేషన్ ద్వారా అవగాహన.* విద్యార్థులకు లోన్ యాప్స్, షేర్ మార్కెట్, ఏపీకే ఫైల్స్, కొరియర్ ,క్రెడిట్ కార్డ్,మ్యాట్రి మోని,లాటరీ గిఫ్ట్,మల్టీ లెవల్ మార్కెటింగ్ ,క్రిప్టో కరెన్సీ, డిజిటల్ అరెస్ట్, లాటరీ ఫ్రాడ్, గిఫ్ట్ ఫ్రాడ్ సోషల్ మీడియా తదితర మోసలపై విద్యార్థులకు అవగాహన కల్పించారు. *ఈసందర్భంగా విద్యార్థులు మాట్లాడుతూ...* “Prevention is Better than Cure” అనే విధంగా సైబర్ భద్రతలో ముందస్తు అప్రమత్తతే ముఖ్యమని, సైబర్ నేరాలపై తమకు కల్పించిన అవగాహన ఎంతో ఉపయోగకరంగా ఉందని విద్యార్థులు తెలిపారు.సైబర్ నేరాల నివారణలో విద్యార్థులు కూడా తమ వంతు బాధ్యతగా తీసుకుని, కుటుంబ సభ్యులు, స్నేహితులకు సైబర్ భద్రతపై అవగాహన కల్పిస్తామని తెలిపారు. అవగాహన సదస్సులో డిఎస్పీ నాగేంద్రచారి, సి.ఐ శ్రీనివాస్, సైబర్ క్రైమ్ ఎస్.ఐ జునైద్,నర్సింగ్ కళాశాల ప్రిన్సిపాల్ అనిత, సైబర్ సెల్ సిబ్బంది గంగిరెడ్డి, రాజు,శ్రీకాంత్ , విజేయ్, కలశాల అధ్యాపక బృదం, విద్యార్థులు పాల్గొన్నారు.4
- “పాలిటెక్నిక్ విద్యార్థుల ఆందోళన 17వ రోజుకు.. శక్తిలో కలుపొద్దంటూ నిరసన”1
- ప్రశ్నిస్తున్న రామగుండం., కాంగ్రెస్ ప్రభుత్వ 6 గ్యారంటీలు, 420 హామీల వైఫల్యలపై నిలదీసిన బిజెపి రాష్ట్ర నాయకురాలు శ్రీమతి సోమారపు లావణ్య ?*బీజేపీ వారం రోజుల కార్యచరణలో భాగంగా కాంగ్రెస్ ప్రభుత్వ 6 గ్యారంటీలు, 420 హామీల వైఫల్యలపై నిలదీసిన బిజెపి రాష్ట్ర నాయకురాలు శ్రీమతి *సోమారపు లావణ్య* గారి ఆధ్వర్యంలో రామగుండం నియోజకవర్గం 8 ఇంక్లైన్ కాలనీలో స్థానిక కాంగ్రెస్ పార్టీ నుండి ఎన్నికైన 14వ డివిజన్ కార్పొరేటర్ బడావాత్ శంకర్ నాయక్ గారికి, 17వ డివిజన్ కార్పొరేటర్ అనుము స్వరూప- రాములు గారికి,18వ డివిజన్ కార్పొరేటర్ దేవనపల్లి చక్రపాణి గారికి 19వ డివిజన్ కార్పొరేటర్ మారెల్లి సుశీల గారికి వినతిపత్రం అందజేసిన అనంతరం వారు మాట్లాడుతూ కాంగ్రెస్ పార్టీ ఎన్నికల సమయంలో ప్రజలకు ఇచ్చిన హమీలను అమలు చేయడంలో పూర్తిగా విఫలమైందని విమర్శించారు. కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చి 3 సంవత్సరాలు గడుస్తున్నా, ప్రజలకు ఇచ్చిన వాగ్దానాలు గాలికి వదిలేసిందని ధ్వజమెత్తారు. రైతు భరోసా, రుణమాఫీ, మహిళలకు నెలకు ₹2,500 మహాలక్ష్మి పథకం, తులం బంగారం, నిరుద్యోగ భృతి, వృద్ధాప్య పింఛన్ల పెంపు వంటి ఏ ఒక్క హామీని సరైన రీతిలో అమలు చేయలేదని ఆరోపించారు. 420 వాగ్దానాలతో ప్రజలను మోసం చేసిన అసలైన 420 కాంగ్రెస్ పార్టీ వైఖరిని ప్రజల్లో ఎండగట్టడానికే *ప్రశ్నిస్తున్నరామగుండం* పేరిట ఈ యొక్క కార్యక్రమాన్ని చేపట్టినట్లు తెలిపారు. కార్పొరేటర్లు ప్రజా సమస్యలపై కౌన్సిల్ సమావేశాల్లో కాంగ్రెస్ ప్రభుత్వ వైఫల్యాలను నిలదీయాలని, 8 ఇంక్లైన్ కాలనీ ప్రాంతంలోని మౌలిక వసతుల కల్పన మరియు అభివృద్ధి పనులపై దృష్టి సారించాలని విజ్ఞప్తి చేశారు. ఈ యొక్క కార్యక్రమంలో మాజీ జిల్లా ఉపాధ్యక్షురాలు మాతంగి రేణుక, సీనియర్ నాయకులు &మాజీ కౌన్సిలర్ దాసరి శ్రీనివాస్, -సుశీల, నాయకులు కన్నూరి భాస్కర్ ,కొమ్మ శ్రీనివాస్ యాదవ్,అరిగేలా శ్రావణ్ యాదవ్ ,పొట్ల వెంకటేష్,మారేపెల్లి శ్రీనివాస్,అంకం కుమార్, పంగ రవి,బోటుకు మల్లేష్ ,పొట్ల శశాంక్, మెరుగు శ్రీనివాస్ ,రాజేష్ నాయక్,నాగేందర్,ఎడ్లపురం రమేష్, నారీ,కుందరపు సత్యనారాయణ,ఇల్లందులా మహేష్, భాస్కర్,క్రాంతి,పొట్ల సాయితేజ,శాంతిరాజ్, వివేక్,సాయికుమార్,మహిళా నాయకురాళ్లు,పానుగంటి అంజలి,కరుపాకుల మాధవి గార్లు అధిక సంఖ్యలో కార్యకర్తలు మరియు తదితరులు పాల్గొన్నారు.1
- కరీంనగర్‌లో బీఆర్ఎస్ భారీ నిరసన.. 420 హామీల ఫ్లెక్సీతో హోరెత్తిన తెలంగాణ చౌక్ కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం అధికారంలోకి వచ్చి వెయ్యి రోజులు పూర్తయిన సందర్భంగా.. ప్రజలు ఎదుర్కొంటున్న కష్టాలకు అండగా నిలిచేందుకు బీఆర్ఎస్ పార్టీ రాష్ట్ర నాయకత్వం పిలుపు మేరకు కరీంనగర్ జిల్లా కేంద్రంలో పెద్దఎత్తున నిరసన కార్యక్రమం చేపట్టారు. మాజీ మంత్రి, కరీంనగర్ ఎమ్మెల్యే గంగుల కమలాకర్ ఆధ్వర్యంలో సుమారు ఐదువందల మంది కార్యకర్తలు, ప్రజలతో కలిసి తెలంగాణ చౌక్ వద్ద కాంగ్రెస్ ప్రభుత్వ వైఫల్యాలను ఎండగడుతూ నిరసన ప్రదర్శన నిర్వహించారు. ప్రభుత్వం ఇచ్చిన 420 హామీలతో కూడిన భారీ ఫ్లెక్సీని ప్రదర్శిస్తూ వినూత్న రీతిలో నిరసన తెలిపారు. వార రోజుల పాటు నిర్వహించనున్న నిరసన కార్యక్రమాల్లో భాగంగా తొలి రోజు ప్రభుత్వానికి వ్యతిరేకంగా బీఆర్ఎస్ శ్రేణులు పెద్దపెట్టున నినాదాలు హోరెత్తించాయి. తెలంగాణలో అబద్ధపు హామీలతో ప్రజలకు మాయమాటలు చెప్పి కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చిందని మాజీ మంత్రి గంగుల కమలాకర్ తీవ్ర స్థాయిలో మండిపడ్డారు. నేడు రాష్ట్రంలో ఏ ఒక్క వర్గం కూడా సంతోషంగా లేదని, ఎన్నికల సమయంలో ఇచ్చిన హామీల్లో కనీసం ఒక్కటంటే ఒక్కటి కూడా నెరవేర్చలేదని ధ్వజమెత్తారు. అన్నదాతలను ఆదుకుంటామన్న కాంగ్రెస్ సర్కార్.. రైతు భీమా పథకానికి తూట్లు పొడిచి మోసం చేసిందన్నారు పేదింటి ఆడబిడ్డకు అండగా నిలవాల్సిన 'కల్యాణ లక్ష్మి' పథకాన్ని తుంగలో తొక్కారు. చదువుకునే విద్యార్థులకు ఫీజు రీయింబర్స్‌మెంట్ అందక వారి భవిష్యత్తును అగమ్యగోచరంలోకి నెట్టారు రిటైర్డ్ ఉద్యోగులకు రావాల్సిన బెనిఫిట్స్ ఇవ్వకుండా వారికి కష్టాలు మిగిలాయి ఆసరా పెన్షన్ల పెంపుదల జాడ లేదు.యువతులకు స్కూటీలు ఇస్తామన్న హామీ నీటి మీద రాతలయ్యాయనీ అన్ని రంగాల్లోనూ ఘోరంగా విఫలమైన ఈ ప్రభుత్వాన్ని ఎప్పటికప్పుడు బీఆర్ఎస్ పార్టీ తరుఫున ప్రశ్నిస్తూనే ఉంటామని గంగుల స్పష్టం చేశారు. కాంగ్రెస్ ఇచ్చిన 420 హామీల మోసాన్ని రాబోయే అసెంబ్లీ వేదికగా గట్టిగా ఎత్తిచూపుతామన్నారు. ప్రభుత్వం ఇచ్చిన ప్రతీ హామీని నెరవేర్చే వరకు ప్రజల పక్షాన నిలబడి తీవ్ర పోరాటాలు చేస్తామని సర్కార్‌ను గట్టిగా హెచ్చరించారు. ప్రజలకు కాంగ్రెస్ ప్రభుత్వం ఇవ్వాల్సిన డబ్బులను భాకీ కార్డు రూపంలో ముద్రించి బాటసారులకు వాహనాదారులకు, బస్సులోని ప్రయాణికులకు స్వయంగా ఎమ్మెల్యే అందించారు. ఈ కార్యక్రమం లో.. బారసా కార్పొరేటర్లుమాజీ ప్రజా ప్రతినిధులు, పెద్ద ఎత్తున పార్టీ శ్రేణులు పాల్గొన్నారు.2
- PFI కేసులో అరెస్టు అయిన అబ్దుల్ సలీంకు ఒక రోజు పెరోల్...చంచల్ గూడ జైల్ నుంచి జగిత్యాలకు తరలించిన పోలీసులు జగిత్యాలకు చెందిన అబ్దుల్ సలీంను మూడేళ్ల క్రితం పిఎఫ్ఐ కేసులో ఎన్ఐఏ అధికారులు అరెస్ట్ చేసి చంచల్ గూడ జైల్లో పెట్టారు. జైల్లో ఉన్న అబ్దుల్ సలీంను ఒక రోజు పెరోల్ పై పోలీసులు జగిత్యాలకు తీసుకొచ్చారు. సలీం చిన్నమ్మ మృతి, కుటుంబ సభ్యుల అనారోగ్య పరిస్థితుల నేపథ్యంలో ఒక రోజు ఫెరోల్ మంజూరు చేశారు. దీంతో గట్టి బందోబస్తు మధ్య జగిత్యాలకి తీసుకు వచ్చిన పోలీసులు పెరోల్ గడువు ముగిసిన అనంతరం తిరిగి జైల్ కు తరలించారు.2