ములుగు గడ్డపై గుబాలించిన గులాబీ జెండా - కాంగ్రెస్ ప్రభుత్వం పై మొదలైన నిరసనలు - 420 ఫీట్ల ఫ్లెక్సీ తో భారీ ర్యాలీ : బీఆర్ఎస్ ములుగు జిల్లా అధ్యక్షుడు కాకులమర్రి లక్ష్మీనరసింహారావు, నియోజకవర్గ ఇన్చార్జి నాగజ్యోతి ములుగు జిల్లా ప్రతినిధి, సెప్టెంబర్ 02 (భారత శక్తి) : తెలంగాణ ఉద్యమానికి పురుడుపోసిన ములుగు గడ్డపై గులాబీ జెండా గుబాలించింది. ఇచ్చిన హామీలను తుంగలో తొక్కి తెలంగాణ ప్రజలపై సవతి తల్లి ప్రేమను కనబరుస్తున్న కాంగ్రెస్ వైఫల్యాలను ఎండగడుతూ బిఆర్ఎస్ రాష్ట్ర వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ ఆదేశాల మేరకు ములుగు జిల్లా కేంద్రంలోని 163 వ జాతీయ రహదారిపై 420 ఫీట్ల తో కాంగ్రెస్ పార్టీ హామీలు గుర్తు చేసే విధంగా ఫ్లెక్సీ ఏర్పాటు చేసి భారీ ర్యాలీ నిర్వహించారు. ఈ కార్యక్రమానికి బిఆర్ ఎస్ ములుగు అధ్యక్షుడు కాకులమర్రి లక్ష్మీనరసింహారావుములుగు నియోజకవర్గ ఇన్చార్జి బడే నాగజ్యోతిలు హాజరయ్యారు. ములుగు జిల్లా కేంద్రంలోని డిఎల్ఆర్ ఫంక్షన్ హాల్ నుండి ప్రభుత్వ ఆసుపత్రి వరకు కొనసాగింది. ఈ సందర్భంగా జిల్లా కేంద్రంలోని ప్రధాన చౌరస్తాలో కాసేపు చేపట్టిన నిరసనకార్యక్రమంలో వారు మాట్లాడారు. అడవి బిడ్డల ఆత్మగౌరవానికి ప్రతీక అయిన ఈ గడ్డపై నిన్నటి వరకు ప్రశాంతంగా ఉన్న గులాబీ జెండా బుధవారం తిరగబడిందన్నారు. ఇది కేవలం ఒక పార్టీ జెండా తిరుగుబాటు కాదని,మోసపోయిన తెలంగాణ ప్రజల తిరుగుబాటని పేర్కొన్నారు. ములుగు కేంద్రంలో జరిగిన భారీ ర్యాలీ కాంగ్రెస్ ప్రభుత్వానికి చెంపపెట్టు లాంటిదని అన్నారు. "100 రోజుల్లో చేస్తామని చెప్పి,1000 రోజులైనా కాంగ్రెస్ ప్రభుత్వం ఇచ్చిన ఒక్క హామీని నిలబెట్టుకోలేదని మండిపడ్డారు. కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి రావడానికి ముందు ఇచ్చిన ఆరు గ్యారెంటీలు, అనేక ఉప హామీలు నేడు కాగితాలకే పరిమితమయ్యాయని వారు ఎద్దేవా చేశారు. మహాలక్ష్మి పథకం ద్వారా ప్రతి మహిళకు నెలకు రూ.2500 అన్నారు. ఏ మహిళకు అందుతోందో చెప్పాలని అన్నారు. తులం బంగారం, స్కూటీ హామీలు ఏమయ్యాయని వారు ప్రశ్నించారు. రైతు భరోసా రైతుబంధు స్థానంలో రైతు భరోసా పేరుతో రూ.15,000 ఇస్తామన్నారని,కానీ వానాకాలం, యాసంగి సీజన్లు గడిచిపోతున్నా రైతు ఖాతాలో పడేది శూన్యమన్నారు.కౌలు రైతులకు భరోసా ఎక్కడ ఉందని అన్నారు.యువతకు 2 లక్షల ఉద్యోగాలు అన్నారని,నేటికి నోటిఫికేషన్లు ఇవ్వలేదని అన్నారు.నిరుద్యోగ భృతి రూ.4000 ఏమైందని,పేపర్ లీకేజీలతో యువత జీవితాలతో కాంగ్రెస్ ప్రభుత్వం చెలగాటమాడుతున్నారు.పాలన చేతకాక కేసీఆర్ పై నిందలు వేసే కాంగ్రెస్ ది దివాలాకోరు రాజకీయమని అన్నారు.మూడేళ్లకు చేరువవుతున్న కాంగ్రెస్ పాలనలో సొంతంగా చెప్పుకోవడానికి ఒక్క విజయం లేదని పేర్కొన్నారు.ప్రతి వైఫల్యాన్ని కప్పిపుచ్చుకోవడానికి ఒకే ఒక్క ఆయుధం కేసీఆర్ పై నిందలు వేయవటమేనని ఆరోపించారు.కాళేశ్వరం కూలిందని, అప్పులు పెరిగాయని, ఉద్యోగాలు ఇవ్వలేదని అంటూ తెలంగాణను 10 ఏళ్లు అభివృద్ధి పథంలో నడిపిన నాయకుడిపై బురద జల్లడమే పనిగా పెట్టుకున్నారని అన్నారు.ప్రజలు అమాయకులు కారని,కాళేశ్వరం లో భాగమైన సమ్మక్క బ్యారేజ్ వల్లే ములుగు లాంటి ఏజెన్సీ ప్రాంతాల్లో కూడా చెరువులు నిండాయని అన్నారు.మిషన్ భగీరథ వల్ల ప్రతి గిరిజన గూడెంలో నల్లా వచ్చిందని తెలిపారు.రైతుబంధు వల్ల రైతు ఆత్మగౌరవంగా బతికాడని,అభివృద్ధిని చూసిన కళ్ళు అబద్ధాలను నమ్మవని పేర్కొన్నారు.కాంగ్రెస్ ప్రభుత్వం ఇంకా నిద్రమత్తులో ఉందని , ఈ తిరుగుబాటు ములుగుకే పరిమితం కాదని అన్నారు.తెలంగాణలోని ప్రతి గడ్డపై, ప్రతి గ్రామంలో ఇదే గులాబీ తిరుగుబాటు తప్పదని తెలిపారు.హామీలతో గెలిచి, మోసంతో పాలించాలని చూస్తే ప్రజలు క్షమించరని హెచ్చరించారు.ములుగు గడ్డపై ఎగిసిన ఈ గులాబీ జెండా, తెలంగాణ ఆత్మగౌరవ పునరుద్ధరణకు నాంది అని అన్నారు.కాంగ్రెస్ ప్రభుత్వం ఇప్పటికైనా మేల్కొని ఇచ్చిన హామీలను నెరవేర్చాలని,లేదంటే ప్రజా తిరుగుబాటు తప్పదని అని హెచ్చరించారు. ఈ కార్యక్రమంలో పాటు మండల స్థాయి నాయకులు కార్యకర్తలు అధిక సంఖ్యలో పాల్గొన్నారు

- నర్సంపేట: కాంగ్రెస్ పాలనపై బీఆర్‌ఎస్ ధర్నా........... నర్సంపేటలోని అమరవీరుల స్తూపం (వరంగల్ రోడ్డు జంక్షన్) వద్ద బీఆర్‌ఎస్ ఆధ్వర్యంలో ధర్నా, నిరసన కార్యక్రమం నిర్వహించారు. మాజీ ఎమ్మెల్యే ముత్తిరెడ్డి యాదగిరిరెడ్డి, రాష్ట్ర నాయకుడు ఏనుగుల రాకేశ్‌రెడ్డి పాల్గొన్నారు. ఈ సందర్భంగా నాయకులు మాట్లాడుతూ కాంగ్రెస్ ప్రభుత్వం వెయ్యి రోజుల పాలనలో పూర్తిగా విఫలమైందని ఆరోపించారు. ఎన్నికల సమయంలో ప్రజలకు ఇచ్చిన హామీలను అమలు చేయడంలో ప్రభుత్వం విఫలమైందని విమర్శించారు. ప్రజా సమస్యలను పరిష్కరించడంలో ప్రభుత్వం నిర్లక్ష్యంగా వ్యవహరిస్తోందని ఆరోపించారు. కార్యక్రమంలో బీఆర్‌ఎస్ నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు.1
- రామగుండం ప్రాంతంలో విస్తృతంగా పర్యటించిన జిల్లా కలెక్టర్ కోయశ్రీ హర్ష పాఠశాలల్లో పెండింగ్ పనులను నిర్ణీత గడువులోగా పూర్తి చేయాలి : జిల్లా కలెక్టర్ కోయ శ్రీహర్ష **పెండింగ్ పునరుద్ధరణ పనులను 15 రోజుల్లో పూర్తి చేయాలి** **కిచెన్ షెడ్లు, మరమ్మతులు, మరుగుదొడ్ల పనులను నెల రోజుల్లోగా పూర్తి చేయాలి** **అల్లూరు ,యూపీహెచ్‌సీలో ఎన్‌సీడీ స్క్రీనింగ్‌ను పెంచాలి** **లక్ష్మీపురం–వీర్లపల్లి రహదారి పనులను 3 నెలల్లో పూర్తి చేయాలి**.. రామగుండం ప్రాంతంలో చేపడుతున్న వివిధ అభివృద్ధి పనులను వేగవంతం చేసి ప్రజలకు, విద్యార్థులకు మెరుగైన సౌకర్యాలు అందుబాటులోకి తీసుకురావాలని *జిల్లా కలెక్టర్ కోయ శ్రీహర్ష* అధికారులను ఆదేశించారు. బుధవారం రామగుండం ప్రాంతంలో విస్తృతంగా పర్యటించిన *జిల్లా కలెక్టర్* పలు ప్రభుత్వ పాఠశాలలు, అల్లూరు యూపీహెచ్‌సీ, లక్ష్మీపురం–వీర్లపల్లి రహదారి పనులను పరిశీలించారు. *రామగుండం మండలంలోని మండల పరిషత్ ప్రాథమిక పాఠశాల, మార్కండేయ కాలనీ గోదావరిఖని ఉర్దూ మీడియం పాఠశాల, అడ్డగుంటపల్లి ఎం.పీ.పీ.ఎస్ పాఠశాల, సంజయ్ నగర్ ఎం.పీ.పీ.ఎస్ పాఠశాల, అల్లూరు ఎం.పీ.పీ.ఎస్ పాఠశాల, జడ్పీహెచ్‌ఎస్ నరసింహపురం (న్యూ మారేడుపాక), వీర్లపల్లి ఎం.పీ.పీ.ఎస్ పాఠశాల, చైతన్యపురి ఎం.పీ.పీ.ఎస్ పాఠశాల, 46వ డివిజన్ శాంతినగర్ ఎం.పీ.పీ.ఎస్ పాఠశాలలను* పరిశీలించారు. ఈ సందర్భంగా *జిల్లా కలెక్టర్ కోయ శ్రీహర్ష మాట్లాడుతూ,* పాఠశాలల్లో విద్యార్థులకు అందుతున్న మౌలిక వసతులు, పాఠశాల భవనాల పరిస్థితి, మరమ్మతు పనులు, కిచెన్ షెడ్లు, మరుగుదొడ్ల నిర్మాణం తదితర పనుల పురోగతిని కలెక్టర్ పరిశీలించారు. గోదావరిఖని ఉర్దూ మీడియం పాఠశాలలో నూతనంగా ఏర్పాటు చేసిన ప్రీ-ప్రైమరీ తరగతి గదిని ప్రారంభించారు. పాఠశాలల్లో పెండింగ్‌లో ఉన్న పునరుద్ధరణ పనులను 15 రోజుల్లోగా పూర్తి చేయాలని జిల్లా కలెక్టర్ అధికారులను ఆదేశించారు. వివిధ పాఠశాలల్లో కొనసాగుతున్న కిచెన్ షెడ్లు, ఇతర మరమ్మతు పనులు, మరుగుదొడ్ల పనులను యుద్ధప్రాతిపదికన పూర్తి చేసి నెల రోజుల్లోగా విద్యార్థులకు అందుబాటులోకి తీసుకురావాలని సూచించారు. విద్యార్థులకు అవసరమైన మౌలిక వసతుల కల్పనలో ఎలాంటి జాప్యం ఉండకూడదని, పనుల నాణ్యత విషయంలో రాజీ పడకుండా నిర్దేశిత గడువులోగా పూర్తి చేయాలని తెలిపారు. అనంతరం *రామగుండం మండలంలోని అల్లూరు యూపీహెచ్‌సీ ఆరోగ్య కేంద్రాన్ని ఆకస్మికంగా తనిఖీ చేశారు.* ఆరోగ్య కేంద్రంలో అందుతున్న ఓపీ సేవలు, వైద్యుల అందుబాటు, రోగులకు అందుతున్న వైద్య సేవలు, ఎన్‌సీడీ స్క్రీనింగ్ తదితర అంశాలను పరిశీలించారు. అల్లూరు యూపీహెచ్‌సీలో ఎన్‌సీడీ స్క్రీనింగ్ చాలా తక్కువగా ఉందని, అర్హులైన ప్రతి ఒక్కరికీ స్క్రీనింగ్ నిర్వహించేలా చర్యలు తీసుకొని స్క్రీనింగ్ శాతాన్ని పెంచాలని ఆదేశించారు. ఆరోగ్య కేంద్రానికి వచ్చే రోగులకు మెరుగైన వైద్య సేవలు అందించాలని, ఓపీ సేవలను మరింత మెరుగుపరచాలని సూచించారు. వైద్యులు నిర్ణీత సమయానికి విధులకు హాజరై రోగులకు అందుబాటులో ఉండేలా చర్యలు తీసుకోవాలని ఆదేశించారు. అనంతరం *లక్ష్మీపురం నుంచి వీర్లపల్లి వరకు జరుగుతున్న రహదారి అభివృద్ధి పనులను* పరిశీలించారు. సింగిల్ రోడ్డును డబుల్ రోడ్డుగా విస్తరించే పనులను వివరించారు. రహదారి పనుల పురోగతిని పరిశీలించిన పనులను వేగవంతం చేసి మూడు నెలల్లోగా పూర్తి చేయాలని సంబంధిత అధికారులను ఆదేశించారు. రహదారి పనులను నాణ్యతా ప్రమాణాలతో చేపట్టాలని, పనులలో ఎలాంటి జాప్యం లేకుండా నిర్దేశిత గడువులోగా పూర్తి చేసి ప్రజలకు మెరుగైన రవాణా సౌకర్యం అందుబాటులోకి తీసుకురావాలని సూచించారు. పాఠశాలలు, ఆరోగ్య కేంద్రాలు, రహదారుల అభివృద్ధి పనులపై సంబంధిత అధికారులు నిరంతరం పర్యవేక్షణ చేపట్టాలని, క్షేత్రస్థాయిలో పనుల పురోగతిని ఎప్పటికప్పుడు పరిశీలిస్తూ నిర్ణీత గడువులోగా పనులు పూర్తయ్యేలా చర్యలు తీసుకోవాలని ఆదేశించారు. ఈ పర్యటనలో టీజీఈడబ్ల్యూఐడీసీ ఈఈ అశోక్ కుమార్, డిప్యూటీ ఇంజనీర్ మారుతి, ఏఈ నరేష్, యూపీహెచ్‌సీ డా.దివేన, ఆర్‌అండ్‌బీ ఏఈ జావిద్, ఇతర సంబంధిత అధికారులు పాల్గొన్నారు.1
- వేములవాడ ఆలయ అభివృద్ధి పనులపై ఈనెల 6న సీఎం సమక్షంలో సమావేశం...మరో సమావేశంలోగా రాజన్న దర్శనం కల్పించేలా ఏర్పాట్లు చేస్తామని ఆది శ్రీనివాస వెల్లడి వేములవాడ శ్రీ రాజరాజేశ్వర స్వామి ఆలయ విస్తరణ అభివృద్ధి పనులు శరవేగంగా జరుగుతున్నాయని ప్రభుత్వ విప్, వేములవాడ ఎమ్మెల్యే ఆది శ్రీనివాస్ తెలిపారు. ఆలయ విస్తరణ పనులను సీఎం ఓఎస్డీ శ్రీనివాసులు, దేవాదాయ ధర్మాదాయ శాఖ కమిషనర్ హనుమంతరావు, జిల్లా కలెక్టర్ గరీమా అగ్రవాల్ తో పాటు వివిధ శాఖల అధికారులతో పరిశీలించి పనుల పురోగతిపై సమీక్ష సమావేశం నిర్వహించారు. అనంతరం ఆయన మీడియాతో మాట్లాడుతూ రాజన్న ఆలయ విస్తరణ పనులు ఇప్పటివరకు జరిగిన పనులపై చర్చించామని, త్వరలో జరగబోయే పనులపై చర్చించి, ఈనెల 6న హైదరాబాద్ లో సీఎం క్యాంప్ ఆఫీస్ లో సమావేశం అనంతరం టెండర్ల ప్రక్రియకు వెళ్తామన్నారు. విస్తరణ పనులు త్వరితగతిన పూర్తి చేసి మరో సమావేశంలోగా రాజన్న దర్శనం కల్పించడానికి చర్యలు తీసుకుంటామన్నారు. అలాగే వచ్చే సంవత్సరం జరిగే గోదావరి పుష్కరాలకు 1000 కోట్లు నిధులు మంజూరు చేసి భక్తులకు సౌకర్యాలు కల్పిస్తామన్నారు.2
- తిర్రి పనులు చేస్తూ విద్యార్థుల జీవితాలతో చెలగాటం ఆడుతున్న రేవంత్ రెడ్డి GO.97 తో పాలిటెక్నిక్ విద్యా వ్యవస్థను నాశనం చేయడం తగదు.. తిర్రి పనులు చేస్తూ విద్యార్థుల జీవితాలతో చెలగాటం ఆడుతున్న రేవంత్ రెడ్డి GO.97 తో పాలిటెక్నిక్ విద్యా వ్యవస్థను నాశనం చేయడం తగదు.. విద్యార్థులు కన్నీళ్లు పెడుతున్నరు..ఇది మంచిది కాదు ఈ పిచ్చి పని బంద్ చేయాలి...GO.97 వెంటనే ఉపసంహరించుకోవాలే *_ టీఆర్పీ చీఫ్ ఎమ్మెల్సీ తీన్మార్ మల్లన్న డిమాండ్*1
- డిసిసి కార్యాలయంలో వై.ఎస్.ఆర్ వర్ధంతి సంక్షేమానికి చిరునామా వై.ఎస్.ఆర్ - ఎమ్మెల్యే, డిసిసి అధ్యక్షులు మేడిపల్లి సత్యం మాజీ ముఖ్యమంత్రి, దివంగత మహానేత డా. వై.ఎస్. రాజశేఖర్ రెడ్డి గారి వర్ధంతి సందర్భంగా నేడు కరీంనగర్ డిసిసి కార్యాలయంలో ఘనంగా నివాళుల కార్యక్రమం నిర్వహించారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా చొప్పదండి ఎమ్మెల్యే, జిల్లా కాంగ్రెస్ అధ్యక్షులు డా. మేడిపల్లి సత్యం హాజరై, కరీంనగర్ కార్పొరేషన్ కాంగ్రెస్ అధ్యక్షులు వైద్యుల అంజన్ కుమార్, మాజీ సుడా చైర్మన్ కోమటిరెడ్డి నరేందర్ రెడ్డి, మాజీ ఎమ్మెల్యే ఆరెపల్లి మోహన్, అర్బన్ బ్యాంక్ చైర్మన్, గడ్డం విలాస్ రెడ్డి, మాజీ ఏఎంసీ చైర్మన్ ఆకారపు భాస్కర్ రెడ్డి తదితరులతో కలిసి వై.ఎస్.ఆర్ చిత్రపటానికి పూలమాల వేసి ఘన నివాళులర్పించారు. అనంతరం డిసిసి అధ్యక్షులు డా. మేడిపల్లి సత్యం మాట్లాడుతూ.. స్వర్గీయ డా. వై.ఎస్. రాజశేఖర్ రెడ్డి గారు ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రిగా పనిచేసి ఏ ప్రభుత్వం, ఏ ముఖ్యమంత్రి చేయని విధంగా అభివృద్ధి, సంక్షేమానికి చిరునామాగా నిలిచారని అన్నారు. విద్య, వైద్యం, వ్యవసాయం, మహిళా సాధికారత వంటి ప్రతి రంగంలోనూ చెరగని ముద్ర వేశారన్నారు. ఫీజు రీయింబర్స్ మెంట్, 108, ఆరోగ్యశ్రీ, రైతులకు ఉచిత విద్యుత్, రుణమాఫీ వంటి ఎన్నో సంక్షేమ పథకాలు ఆయన హయాంలోనే ప్రవేశపెట్టారని, దేశంలో సంక్షేమం అంటే గుర్తుకొచ్చే ఏకైక పేరు వై.ఎస్.ఆర్ అని కొనియాడారు. ముఖ్యంగా కరీంనగర్ జిల్లా అభివృద్ధిలో వై.ఎస్.ఆర్ పాత్ర మరువలేనిదని, ఆనాడు ఆయన నిర్మించిన ప్రాజెక్టులు, కాలువల వల్లే నేడు జిల్లాలో వ్యవసాయం సుభిక్షంగా ఉందని, శాతవాహన యూనివర్సిటీ తో పాటు కొండగట్టు, మంథనిలో JNTU, కోరుట్లలో వెటర్నరీ యూనివర్సిటీ వంటివి ఆయన హయాంలోనే ఏర్పాటయ్యాయని గుర్తు చేశారు. 2009లో హెలికాప్టర్ ప్రమాదంలో ఆయన మరణించడం చాలా బాధాకరమని, వై.ఎస్.ఆర్ ఆశయం రాహుల్ గాంధీ గారిని ప్రధానమంత్రిగా చూడాలని ఉండేదని, ప్రతి కాంగ్రెస్ కార్యకర్త ఆ ఆశయాన్ని నెరవేర్చి ఆ మహనీయుడికి ఘన నివాళి అర్పించాలని పిలుపునిచ్చారు. ఈ కార్యక్రమంలో నాయకులు మడుపు మోహన్, బానోతు శ్రావణ్ నాయక్, వరాల నర్సింగం, పర్వత మల్లేశం, అన్నమనేని నర్సింగారావు, వెన్న రజిత రెడ్డి, అహమ్మద్ అలీ, విక్టర్, వంగల విద్యాసాగర్, కుంభాల రాజకుమార్, మాదాసు శ్రీనివాస్, గంగుల దిలీప్, మూల కృష్ణారెడ్డి, కర్రె పావని, ఫజల్, హాజీ, వసీం,ఇమ్రాన్ గని, సుంకే రాజు, దాసరి సందీప్, తోట అంజయ్య, కుర్ర పోచయ్య, మల్లారెడ్డి, ఫహద్, స్వప్న శ్రీ, మాలోతు మహాలక్ష్మి, పెంట శేఖర్, రాచర్ల పద్మ, సిరిపురం నాగప్రసాద్, సత్తినేని శ్రీకాంత్, మల్లారెడ్డి, కాశి పాక రాకేష్, శిల్పా, కూస రవీందర్, సుంకరి గణపతి, సుధాకర్ నాయక్ తదితరులు పాల్గొన్నారు.1
- టిఆర్ఎస్ పార్టీ ఆధ్వర్యంలో రైతులుపంటలకు నీటిని విడుదల చేయాలని రాస్తారోకో. ఖమ్మం జిల్లా కూసుమంచి మండలం పాలేరు రిజర్వాయర్ వద్ద ఈరోజు టిఆర్ఎస్ పార్టీ ఆధ్వర్యంలో నిర్వహించ తలపెట్టిన రైతు ధర్నాను టిఆర్ఎస్ శ్రేణులు రైతులు విజయవంతంగా నిర్వహించారు. సందర్భంగా పాలేరు నియోజకవర్గం మాజీ ఎమ్మెల్యే కందల ఉపేందర్ రెడ్డి మాట్లాడుతూ పాలేరు నీటిని తక్షణమే పాలేరు ఆయకట్ట కింద ఉన్న రైతులకు పంట పొలాలకు ఆరుతరులు పంట నిమిత్తమైన అందించాలని శాంతియుత రాస్తారోకోలు చేసినారు. తక్షణమే ప్రభుత్వం స్పందించి రైతులను ఆదుకోవాలని లేని ఇంకా ఉధృతం చేస్తామని రైతులు టిఆర్ఎస్ నాయకులు గట్టిగా హెచ్చరికలు చేసినారు. ఈ కార్యక్రమంలో పాలేరు నియోజకవర్గంలోని టిఆర్ఎస్ పార్టీ నాయకులు కార్యకర్తలు. రైతులు స్వచ్ఛందంగా పాల్గొనినరు.ఈ కార్యక్రమంలో రైతులు ప్రభుత్వంపై విమర్శలతో కూడిన ఫ్లాకార్డులు ప్రదర్శించారు. తెలంగాణ మొదటి ముఖ్యమంత్రి కేసీఆర్ అన్నవాళ్లను తుడిచి వేయడమే లక్ష్యంమా, రైతులను మళ్లీ కూలీలుగా మారుస్తారా అంటూ నేతలు నినాదాలు చేశారు.1
- ప్రశ్నిస్తున్న రామగుండం., కాంగ్రెస్ ప్రభుత్వ 6 గ్యారంటీలు, 420 హామీల వైఫల్యలపై నిలదీసిన బిజెపి రాష్ట్ర నాయకురాలు శ్రీమతి సోమారపు లావణ్య ?*బీజేపీ వారం రోజుల కార్యచరణలో భాగంగా కాంగ్రెస్ ప్రభుత్వ 6 గ్యారంటీలు, 420 హామీల వైఫల్యలపై నిలదీసిన బిజెపి రాష్ట్ర నాయకురాలు శ్రీమతి *సోమారపు లావణ్య* గారి ఆధ్వర్యంలో రామగుండం నియోజకవర్గం 8 ఇంక్లైన్ కాలనీలో స్థానిక కాంగ్రెస్ పార్టీ నుండి ఎన్నికైన 14వ డివిజన్ కార్పొరేటర్ బడావాత్ శంకర్ నాయక్ గారికి, 17వ డివిజన్ కార్పొరేటర్ అనుము స్వరూప- రాములు గారికి,18వ డివిజన్ కార్పొరేటర్ దేవనపల్లి చక్రపాణి గారికి 19వ డివిజన్ కార్పొరేటర్ మారెల్లి సుశీల గారికి వినతిపత్రం అందజేసిన అనంతరం వారు మాట్లాడుతూ కాంగ్రెస్ పార్టీ ఎన్నికల సమయంలో ప్రజలకు ఇచ్చిన హమీలను అమలు చేయడంలో పూర్తిగా విఫలమైందని విమర్శించారు. కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చి 3 సంవత్సరాలు గడుస్తున్నా, ప్రజలకు ఇచ్చిన వాగ్దానాలు గాలికి వదిలేసిందని ధ్వజమెత్తారు. రైతు భరోసా, రుణమాఫీ, మహిళలకు నెలకు ₹2,500 మహాలక్ష్మి పథకం, తులం బంగారం, నిరుద్యోగ భృతి, వృద్ధాప్య పింఛన్ల పెంపు వంటి ఏ ఒక్క హామీని సరైన రీతిలో అమలు చేయలేదని ఆరోపించారు. 420 వాగ్దానాలతో ప్రజలను మోసం చేసిన అసలైన 420 కాంగ్రెస్ పార్టీ వైఖరిని ప్రజల్లో ఎండగట్టడానికే *ప్రశ్నిస్తున్నరామగుండం* పేరిట ఈ యొక్క కార్యక్రమాన్ని చేపట్టినట్లు తెలిపారు. కార్పొరేటర్లు ప్రజా సమస్యలపై కౌన్సిల్ సమావేశాల్లో కాంగ్రెస్ ప్రభుత్వ వైఫల్యాలను నిలదీయాలని, 8 ఇంక్లైన్ కాలనీ ప్రాంతంలోని మౌలిక వసతుల కల్పన మరియు అభివృద్ధి పనులపై దృష్టి సారించాలని విజ్ఞప్తి చేశారు. ఈ యొక్క కార్యక్రమంలో మాజీ జిల్లా ఉపాధ్యక్షురాలు మాతంగి రేణుక, సీనియర్ నాయకులు &మాజీ కౌన్సిలర్ దాసరి శ్రీనివాస్, -సుశీల, నాయకులు కన్నూరి భాస్కర్ ,కొమ్మ శ్రీనివాస్ యాదవ్,అరిగేలా శ్రావణ్ యాదవ్ ,పొట్ల వెంకటేష్,మారేపెల్లి శ్రీనివాస్,అంకం కుమార్, పంగ రవి,బోటుకు మల్లేష్ ,పొట్ల శశాంక్, మెరుగు శ్రీనివాస్ ,రాజేష్ నాయక్,నాగేందర్,ఎడ్లపురం రమేష్, నారీ,కుందరపు సత్యనారాయణ,ఇల్లందులా మహేష్, భాస్కర్,క్రాంతి,పొట్ల సాయితేజ,శాంతిరాజ్, వివేక్,సాయికుమార్,మహిళా నాయకురాళ్లు,పానుగంటి అంజలి,కరుపాకుల మాధవి గార్లు అధిక సంఖ్యలో కార్యకర్తలు మరియు తదితరులు పాల్గొన్నారు.1
- PFI కేసులో అరెస్టు అయిన అబ్దుల్ సలీంకు ఒక రోజు పెరోల్...చంచల్ గూడ జైల్ నుంచి జగిత్యాలకు తరలించిన పోలీసులు జగిత్యాలకు చెందిన అబ్దుల్ సలీంను మూడేళ్ల క్రితం పిఎఫ్ఐ కేసులో ఎన్ఐఏ అధికారులు అరెస్ట్ చేసి చంచల్ గూడ జైల్లో పెట్టారు. జైల్లో ఉన్న అబ్దుల్ సలీంను ఒక రోజు పెరోల్ పై పోలీసులు జగిత్యాలకు తీసుకొచ్చారు. సలీం చిన్నమ్మ మృతి, కుటుంబ సభ్యుల అనారోగ్య పరిస్థితుల నేపథ్యంలో ఒక రోజు ఫెరోల్ మంజూరు చేశారు. దీంతో గట్టి బందోబస్తు మధ్య జగిత్యాలకి తీసుకు వచ్చిన పోలీసులు పెరోల్ గడువు ముగిసిన అనంతరం తిరిగి జైల్ కు తరలించారు.2
- యాంగ్ ఇండియా స్కిల్ యూనివర్సిటీ వీసీ కే స్కిల్ లేదు ఆయనకు పిహెచ్డీ లేదు,డాక్టరేట్ లేదు యూనివర్సిటీలో వందల మంది స్టాఫ్ యాంగ్ ఇండియా స్కిల్ యూనివర్సిటీ వీసీ కే స్కిల్ లేదు ఆయనకు పిహెచ్డీ లేదు,డాక్టరేట్ లేదు యూనివర్సిటీలో వందల మంది స్టాఫ్ ఉండాలి కానీ ఉన్నది కేవలం ఆరుగురు పాలిటెక్నిక్ వ్యవస్థను డిస్టర్బ్ చేస్తే ఊరుకోను చెల్లెమ్మ.... అది జరగకుండా చూస్తా ఇది తీన్మార్ మల్లన్నగా నా హామీ1