Shuru
Apke Nagar Ki App…
రేవంత్ రెడ్డిపై హరీష్ రావు తీవ్ర విమర్శలు : దేవాలయాల కూల్చివేతపై ఆరోపణలు వరంగల్ జిల్లా ఖానాపురం మండలం అశోక్‌నగర్‌లో ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో మాజీ మంత్రి, బీఆర్ఎస్ నేత హరీష్ రావు రాష్ట్ర ప్రభుత్వంపై తీవ్ర విమర్శలు చేశారు. నర్సంపేటలో 800 ఏళ్ల నాటి పురాతన శివాలయాన్ని కూల్చివేశారని ఆయన ఆరోపించారు. ఇది తెలియక జరిగిన చర్య కాదని, తెలిసే ఉద్దేశపూర్వకంగా చేశారని అన్నారు. రాష్ట్రంలో దేవాలయాల పట్ల ప్రభుత్వ వైఖరి సరిగా లేదని విమర్శించిన ఆయన, గత ప్రభుత్వంలో దేవాలయాల అభివృద్ధి జరిగితే, ప్రస్తుతం కూల్చివేతలు జరుగుతున్నాయని వ్యాఖ్యానించారు.
M D Azizuddin
రేవంత్ రెడ్డిపై హరీష్ రావు తీవ్ర విమర్శలు : దేవాలయాల కూల్చివేతపై ఆరోపణలు వరంగల్ జిల్లా ఖానాపురం మండలం అశోక్‌నగర్‌లో ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో మాజీ మంత్రి, బీఆర్ఎస్ నేత హరీష్ రావు రాష్ట్ర ప్రభుత్వంపై తీవ్ర విమర్శలు చేశారు. నర్సంపేటలో 800 ఏళ్ల నాటి పురాతన శివాలయాన్ని కూల్చివేశారని ఆయన ఆరోపించారు. ఇది తెలియక జరిగిన చర్య కాదని, తెలిసే ఉద్దేశపూర్వకంగా చేశారని అన్నారు. రాష్ట్రంలో దేవాలయాల పట్ల ప్రభుత్వ వైఖరి సరిగా లేదని విమర్శించిన ఆయన, గత ప్రభుత్వంలో దేవాలయాల అభివృద్ధి జరిగితే, ప్రస్తుతం కూల్చివేతలు జరుగుతున్నాయని వ్యాఖ్యానించారు.
More news from తెలంగాణ and nearby areas
- కరీంనగర్ లో శ్రీశైలం మూలిక వైద్యం...దీర్ఘకాల వ్యాధులకు ఆయుర్వేదిక్ ట్రీట్ మెంట్ సర్వరోగ నివారిణిగా ఆయుర్వేదిక్ మందులు పనిచేస్తాయని శ్రీశైలం మూలిక వైద్యం నిర్వాహకులు ఎం.కే నిఖిల్ తెలిపారు. కరీంనగర్ తిరుమలనగర్ లోని వాసవి ఎలైట్ అపార్ట్మెంట్ లో శ్రీశైల మూలిక వైద్య శిబిరం నిర్వహించారు. శిబిరంలో ఆయుర్వేద వైద్యులు ఎంకే నిఖిల్, క్యాంప్ ఆర్గనైజర్ నాగేంద్ర కుమార్ పాల్గొని ఆయుర్వేద వైద్యం గురించి వివరించారు. మోకాళ్ళ నొప్పులకు, కీళ్ల నొప్పులకు, వాతం, నడుము నొప్పి తలనొప్పి, సయాటికా, స్పాండిలైటీస్, గ్యాస్ ట్రబుల్, షుగర్, స్త్రీలకు సంబంధించిన వ్యాధులకు దీర్ఘకాల వ్యాధులకు మందులు పంపిణీ చేశారు. మూలికల యొక్క గుణం ఏ రోజుకు ఆ రోజు రక్తాన్ని శుద్ధి చేస్తాయని తెలిపారు. ఆయుర్వేద మందులతో సైడ్ ఎఫెక్ట్స్ ఉండవని ఆహారంలో ఒక భాగమని స్పష్టం చేశారు. ప్రతి నెల 11వ తేదీన కరీంనగర్లో శిబిరం ఉంటుందని తెలిపారు. అన్ని రకాల వ్యాధులకు తక్కువ ధరలో మందులు ఇచ్చి నయం చేయడం జరుగుతుందని స్పష్టం చేశారు.4
- ములుగు కలెక్టరేట్‌లో నిర్వహించిన ప్రజావాణికి మొత్తం 67 దరఖాస్తులు అందాయి. ఇందిరమ్మ ఇళ్లు, పింఛన్లు, భూ సమస్యలు సహా పలు అంశాలపై వచ్చిన వీటిని ప్రాధాన్యతతో పరిష్కరించాలని కలెక్టర్ భోర్కడే అధికారులను ఆదేశించారు. అర్జీదారులు తమ దరఖాస్తుల స్థితిని ఆన్‌లైన్‌లో తెలుసుకోవచ్చు.1
- యాదగిరిగుట్ట పరిసర ప్రాంతాలకు చిన్న విన్నపం దీని దీని వెంటనే స్పందించి డిఈ గారు దీనిపై తగు చర్యలు తీసుకోవాలి అట్లనే ఏఈ గారు యాదగిరిగుట్ట గారికి చిన్న విన్నపిస్తున్నాము దయచేసి దీనిపై వెంటనే చర్యలు తీసుకోండి ఎందుకంటే ఇది ఇలా మధ్యలోకి వెళ్లి పాస్ అయితే లైన్ ఇది చాలా అంటే చాలా వైబ్రేట్ అవుతుంది. ఒక్కసారి మీరు వచ్చి అధికారులతో నిధిని పరిశీలించి తగు చర్యలు తీసుకోవాలని వినిపిస్తున్నాం 🙏🏼🙏🏼🙏🏼🙏🏼🙏🏼🙏🏼🙏🏼🙏🏼🙏🏼🙏🏼1
- మానకొండూరు ఎమ్మెల్యే కవ్వంపల్లి సత్యనారాయణ సోమవారం బెజ్జంకి మండలంలో రూ.91 లక్షలతో పలు అభివృద్ధి పనులను ప్రారంభించారు. విద్యా వారోత్సవాల్లో భాగంగా అదనపు తరగతి గదులకు శంకుస్థాపన చేయగా, లక్ష్మీపూర్ గ్రామంలో సీసీ రోడ్డు, పాఠశాల వంటగదిని ప్రారంభించారు. పేద విద్యార్థులకు నాణ్యమైన విద్య, గ్రామీణ ప్రాంతాల్లో మౌలిక వసతుల కల్పనే ప్రభుత్వ లక్ష్యమని ఎమ్మెల్యే ఈ సందర్భంగా పేర్కొన్నారు.5
- నల్గొండ: కొత్తపల్లిలో ప్రమాదకరంగా బోరు నీటి పైప్ లైన్ గుంత నల్గొండ: నల్గొండ మండలంలోని కొత్తపల్లి గ్రామంలో 4వ వార్డులో బోరు నీటి పైప్ లైన్ మరమ్మత్తుల కోసం ప్రధాన రహదారి పక్కన తీసిన గుంత ప్రమాదకరంగా మారింది. వారం రోజుల క్రితం తీసిన ఈ గుంతను మరమ్మత్తులు చేపట్టకుండా నిర్లక్ష్యంగా వదిలి వేయడంతో చిన్నారులు అందులో పడే ప్రమాదం ఉంది. స్థానికులు వాహనదారులు, పాదచారులు, రాకపోకలకు ఇబ్బందులు ఎదురవుతున్నాయి. ప్రమాదాలు జరగకముందే సంబంధిత అధికారులు తక్షణమే స్పందించి పైప్ లైన్ కు మరమ్మత్తులు పూర్తిచేసి, గుంతను పూడ్చాలని స్థానికులు, వాహనదారులు కోరుతున్నారు.1
- ధాన్యం కొనుగోళ్లలో 43 కిలోల తూకాన్ని అంగీకరించం డిసిసి అధ్యక్షులు మేడిపల్లి సత్యం వార్నింగ్* *రైస్ మిల్లర్లు ఇబ్బంది పెడితే రైతులతో కలిసి ధర్నాకు సిద్ధం* *కేంద్ర జీపీఎస్ విధానంతో లారీల కొరత: ధాన్యం సేకరణ వేగవంతం చేయాలి* *రైతు సమస్యలపై కలెక్టర్‌తో ఎమ్మెల్యే మేడిపల్లి సత్యం భేటీ - ప్రతి కొనుగోలు కేంద్రంలో ప్రత్యేక అధికారి నియామకానికి డిమాండ్* *రూ.1.6 లక్షల కోట్లు రైతు సంక్షేమానికి ఖర్చు: రేవంత్ సర్కార్ చిత్తశుద్ధికి నిదర్శనం* - *మేడిపల్లి సత్యం* *రైతు సంక్షేమమే కాంగ్రెస్ ప్రభుత్వ లక్ష్యం: ధాన్యం కొనుగోళ్లలో కోతలు లేకుండా చర్యలు - ఎమ్మెల్యే డా. మేడిపల్లి సత్యం* ముఖ్యమంత్రి శ్రీ రేవంత్ రెడ్డి నాయకత్వంలో రాష్ట్రంలో ప్రజా పాలన అధికారంలోకి వచ్చిన తర్వాత రైతు సంక్షేమమే ప్రథమ ప్రాధాన్యంగా ప్రభుత్వం పనిచేస్తోందని చొప్పదండి ఎమ్మెల్యే, కరీంనగర్ డిసిసి అధ్యక్షులు డాక్టర్ మేడిపల్లి సత్యం పేర్కొన్నారు. ఈరోజు కరీంనగర్ ప్రజావాణిలో జిల్లా కలెక్టర్ ని కలిసి రైతాంగ సమస్యలపై చర్చించిన అనంతరం ఆయన మీడియాతో మాట్లాడారు. "గతంలో బిఆర్ఎస్ పాలనలో రైతు వ్యతిరేక విధానాలతో రైతులు విసిగిపోయారు. ఒక సంచికి నాలుగు కిలోలు అదనంగా తూకం వేసి రైతులను నట్టేట ముంచిన ఉదంతాలు అనేకం చూశాం. కానీ కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన గత రెండు సంవత్సరాల నుంచి రైతులకు ఎలాంటి ఇబ్బంది పెట్టకుండా తప్ప-తాలుతో సంబంధం లేకుండా, కోతలు లేకుండా ధాన్యాన్ని కొనుగోలు చేయడం జరిగింది. ఈ విషయం ప్రతి రైతన్నకు తెలుసు" అని అన్నారు. దురదృష్టవశాత్తు ఈసారి కేంద్ర ప్రభుత్వం తీసుకువచ్చిన *జిపిఎస్ విధానం* వల్ల ధాన్యం కొనుగోలు కేంద్రాల వద్దకు లారీలు రాలేకపోవడంతో క్షేత్రస్థాయిలో రైతుల నుండి ఫిర్యాదులు వచ్చాయని తెలిపారు. ఈ నేపథ్యంలో ఒక ఎమ్మెల్యేగా, జిల్లా కాంగ్రెస్ అధ్యక్షుడిగా తప్ప-తాలుతో సంబంధం లేకుండా కోత లేకుండా ధాన్యాన్ని కొనాలని కలెక్టర్ని కోరడం జరిగిందన్నారు. *ధాన్యం సేకరణ వేగవంతం చేసేందుకు లారీల సంఖ్య పెంచాలి. *ప్రతి మండల స్థాయి కొనుగోలు కేంద్రం వద్ద, రైస్ మిల్లు వద్ద ఒక ప్రత్యేక అధికారిని నియమించాలి. *ప్రతిరోజు సమీక్షించేందుకు ఒక ప్రత్యేక అధికారిని, డాష్ బోర్డును ఏర్పాటు చేయాలి. *ప్రతి కొనుగోలు కేంద్రం, రైస్ మిల్లు వద్ద సీనియర్ అసిస్టెంట్ స్థాయి అధికారిని నియమించాలని జిల్లా కలెక్టర్ ని విజ్ఞప్తి చేశారు.* "ఇది రైతు పక్షపాత కాంగ్రెస్ ప్రభుత్వం. గడిచిన రెండు సంవత్సరాలలో *రూ.1,60,000 కోట్ల బడ్జెట్‌ను రైతు సంక్షేమం* కోసం ఖర్చుపెట్టిన సర్కార్ రేవంత్ రెడ్డి సర్కార్. రైతు రుణమాఫీ, రైతు భరోసా, బోనస్, ఇన్‌పుట్ సబ్సిడీ విషయంలో పెద్ద ఎత్తున నిధులు కేటాయించాం. భవిష్యత్తులో కూడా రైతు సంక్షేమం కోసం రైతులకు ఎక్కడ అన్యాయం జరిగినా సహించేది లేదు" అని స్పష్టం చేశారు. "గతంలో ప్రతిపక్ష హోదాలో రైతులకు అన్యాయం జరిగినప్పుడు పోరాటాలు, ఉద్యమాలు చేశాం. ప్రస్తుతం ప్రభుత్వంలో ఉన్నప్పటికీ రైతన్న సమస్యల గురించి కలెక్టర్ గారికి వివరించి మా చిత్తశుద్ధిని నిరూపించుకున్నాం. కలెక్టర్ క్షేత్రస్థాయిలో తిరుగుతున్నారు, నిరంతరం సమీక్షిస్తున్నారు" అని తెలిపారు. అధికారులు, ప్రభుత్వం బాగా పనిచేసినప్పటికీ *రైస్ మిల్లర్లు ఇబ్బందులు పెడుతున్నారని* ఆరోపించారు. "అలా ఇబ్బందులు పెట్టిన చోట నేను స్వయంగా వెళ్లి రైతు సోదరులతో కలిసి ధర్నా చేయడానికి సిద్ధంగా ఉన్నాను. ఎట్టి పరిస్థితుల్లోనూ 43 కిలోల తూకాన్ని అంగీకరించబోం" అని హెచ్చరించారు. మరో గంటలో రైస్ మిల్లర్లతో సమావేశం ఏర్పాటు చేస్తామని జిల్లా కలెక్టర్ తెలిపారని, దాని తర్వాత కూడా వారి ప్రవర్తనలో మార్పు రాకపోతే భవిష్యత్తు కార్యాచరణ ప్రకటిస్తామని ఎమ్మెల్యే సత్యం పేర్కొన్నారు. జిల్లా నలుమూలల నుండి రైతుల ద్వారా, ప్రచార మాధ్యమాల ద్వారా వచ్చిన ఫిర్యాదులను కలెక్టర్ గారి దృష్టికి తీసుకువెళ్లామని, రేపటి నుండి ఇలాంటి సమస్యలు లేకుండా ధాన్యం కొనుగోలు జరుగుతుందని భావిస్తున్నామని తెలిపారు.1
- గుప్తనిధుల వేట కోసమే అశోక్‌నగర్ శివాలయం కూల్చివేత : మాజీ మంత్రి హరీష్‌రావు తీవ్ర ఆరోపణలు వరంగల్ జిల్లా ఖానాపురం మండలం అశోక్‌నగర్‌లో మట్టికోట శివాలయం ముందు బీఆర్‌ఎస్ రాష్ట్ర నాయకుడు హరీష్‌రావు మీడియాతో మాట్లాడారు. రేవంత్ ప్రభుత్వం దేవాలయాలపై భక్తి లేకుండా వ్యవహరిస్తోందని ఆరోపించారు. గుప్తనిధుల వేట కోసమే శివాలయాన్ని కూల్చారని విమర్శించారు. శివాలయం కూల్చివేతపై ఇప్పటివరకు కేసు నమోదు చేయలేదని, గర్భగుడి కింద ఎందుకు తవ్వకాలు చేశారో ప్రభుత్వం చెప్పాలని డిమాండ్ చేశారు. స్కూల్ నిర్మాణానికి తమకు వ్యతిరేకం లేదని, అయితే చుట్టుపక్కల స్థలం ఉండగా శివాలయాన్ని ఎందుకు కూల్చారో స్పష్టం చేయాలని అన్నారు. శివాలయాన్ని తిరిగి పునర్నిర్మించాలని కోరారు.1
- ప్రేమ వ్యవహారంపై వేధింపుల కారణంగా హైదరాబాద్‌లో జూల వంశీ అనే యువకుడిని హత్య చేసి, పెద్దపల్లి జిల్లా మంథని అటవీ ప్రాంతంలో పడేశారు. 11 రోజుల తర్వాత కుళ్ళిన స్థితిలో మృతదేహాన్ని వెలికితీసిన పోలీసులు, యువతి భర్తతో సహా ముగ్గురు నిందితులను అరెస్టు చేశారు. మృతుడు దళితుడు కావడంతో నిందితులపై ఎస్సీ, ఎస్టీ అట్రాసిటీ కేసు కూడా నమోదు చేశారు.3
- సిద్దిపేట జిల్లా బెజ్జంకి మోడల్ స్కూల్‌లో రాష్ట్ర ప్రభుత్వ ఆధ్వర్యంలో ఉచిత వేసవి ప్రత్యేక శిబిరం ప్రారంభమైంది. ఆరవ తరగతి నుండి పదవ తరగతి వరకు విద్యార్థులకు స్పోకెన్ ఇంగ్లీష్, చిత్రలేఖనం, వ్యక్తిత్వ వికాసంతో పాటు పలు అంశాల్లో శిక్షణ అందిస్తారు. మే 11 నుండి 20వ తేదీ వరకు జరిగే ఈ శిబిరాన్ని సద్వినియోగం చేసుకోవాలని సర్పంచ్ బొల్లం శ్రీధర్ విద్యార్థులకు సూచించారు.4