Shuru
Apke Nagar Ki App…
గుప్తనిధుల వేట కోసమే అశోక్‌నగర్ శివాలయం కూల్చివేత : మాజీ మంత్రి హరీష్‌రావు తీవ్ర ఆరోపణలు వరంగల్ జిల్లా ఖానాపురం మండలం అశోక్‌నగర్‌లో మట్టికోట శివాలయం ముందు బీఆర్‌ఎస్ రాష్ట్ర నాయకుడు హరీష్‌రావు మీడియాతో మాట్లాడారు. రేవంత్ ప్రభుత్వం దేవాలయాలపై భక్తి లేకుండా వ్యవహరిస్తోందని ఆరోపించారు. గుప్తనిధుల వేట కోసమే శివాలయాన్ని కూల్చారని విమర్శించారు. శివాలయం కూల్చివేతపై ఇప్పటివరకు కేసు నమోదు చేయలేదని, గర్భగుడి కింద ఎందుకు తవ్వకాలు చేశారో ప్రభుత్వం చెప్పాలని డిమాండ్ చేశారు. స్కూల్ నిర్మాణానికి తమకు వ్యతిరేకం లేదని, అయితే చుట్టుపక్కల స్థలం ఉండగా శివాలయాన్ని ఎందుకు కూల్చారో స్పష్టం చేయాలని అన్నారు. శివాలయాన్ని తిరిగి పునర్నిర్మించాలని కోరారు.
M D Azizuddin
గుప్తనిధుల వేట కోసమే అశోక్‌నగర్ శివాలయం కూల్చివేత : మాజీ మంత్రి హరీష్‌రావు తీవ్ర ఆరోపణలు వరంగల్ జిల్లా ఖానాపురం మండలం అశోక్‌నగర్‌లో మట్టికోట శివాలయం ముందు బీఆర్‌ఎస్ రాష్ట్ర నాయకుడు హరీష్‌రావు మీడియాతో మాట్లాడారు. రేవంత్ ప్రభుత్వం దేవాలయాలపై భక్తి లేకుండా వ్యవహరిస్తోందని ఆరోపించారు. గుప్తనిధుల వేట కోసమే శివాలయాన్ని కూల్చారని విమర్శించారు. శివాలయం కూల్చివేతపై ఇప్పటివరకు కేసు నమోదు చేయలేదని, గర్భగుడి కింద ఎందుకు తవ్వకాలు చేశారో ప్రభుత్వం చెప్పాలని డిమాండ్ చేశారు. స్కూల్ నిర్మాణానికి తమకు వ్యతిరేకం లేదని, అయితే చుట్టుపక్కల స్థలం ఉండగా శివాలయాన్ని ఎందుకు కూల్చారో స్పష్టం చేయాలని అన్నారు. శివాలయాన్ని తిరిగి పునర్నిర్మించాలని కోరారు.
More news from తెలంగాణ and nearby areas
- గుప్తనిధుల వేట కోసమే అశోక్‌నగర్ శివాలయం కూల్చివేత : మాజీ మంత్రి హరీష్‌రావు తీవ్ర ఆరోపణలు వరంగల్ జిల్లా ఖానాపురం మండలం అశోక్‌నగర్‌లో మట్టికోట శివాలయం ముందు బీఆర్‌ఎస్ రాష్ట్ర నాయకుడు హరీష్‌రావు మీడియాతో మాట్లాడారు. రేవంత్ ప్రభుత్వం దేవాలయాలపై భక్తి లేకుండా వ్యవహరిస్తోందని ఆరోపించారు. గుప్తనిధుల వేట కోసమే శివాలయాన్ని కూల్చారని విమర్శించారు. శివాలయం కూల్చివేతపై ఇప్పటివరకు కేసు నమోదు చేయలేదని, గర్భగుడి కింద ఎందుకు తవ్వకాలు చేశారో ప్రభుత్వం చెప్పాలని డిమాండ్ చేశారు. స్కూల్ నిర్మాణానికి తమకు వ్యతిరేకం లేదని, అయితే చుట్టుపక్కల స్థలం ఉండగా శివాలయాన్ని ఎందుకు కూల్చారో స్పష్టం చేయాలని అన్నారు. శివాలయాన్ని తిరిగి పునర్నిర్మించాలని కోరారు.1
- ప్రజావాణి దరఖాస్తులను పరిశీలించి వెంటనే పరిష్కరించాలి, శాఖల వారీగా అందిన ప్రజావాణి దరఖాస్తులను పరిష్కరిస్తూ నివేదిక సమర్పించాలి, మహబూబాబాద్ జిల్లా కలెక్టర్ స్నేహ శబరిష్, సోమవారం *జిల్లా కలెక్టర్ స్నేహ శబరిష్,* సంబంధిత అధికారులతో కలిసి ప్రజావాణి కార్యక్రమాన్ని నిర్వహించారు, ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ ప్రజావాణి కార్యక్రమం, ఇతర వేదికల ద్వారా ప్రజల సమస్య పరిష్కారం నిమిత్తం సామాన్య ప్రజలు చేసుకున్న ప్రతి ఒక దరఖాస్తుకు అధిక ప్రాధాన్యత ఇస్తూ తక్షణమే పరిష్కరించి నివేదికను తమకు సమర్పించాలని, తమ పరిధిలో లేని పక్షంలో సంబంధిత విభాగానికి సిఫారసు చేయాలని సంబంధిత అధికారులను ఆదేశించారు, ప్రభుత్వ ఆదేశాలు ప్రకారం మహబూబాబాద్ జిల్లా కేంద్రంలోని కలెక్టర్ కార్యాలయం తో పాటు తొర్రూరు రెవిన్యూ డివిజనల్ అధికారి కార్యాలయం, మహబూబాబాద్ రెవిన్యూ డివిజనల్ అధికారి కార్యాలయాలలో కూడా ప్రజావాణి కార్యక్రమాన్ని నిర్వహించడం జరిగిందని కలెక్టర్ తెలిపారు, అట్టి దరఖాస్తుల పరిష్కారం నిమిత్తం సంబంధిత అధికారులకు తగు ఆదేశాలు జారీ చేయడం జరిగిందని తెలిపారు, హైదరాబాద్ నుండి వచ్చిన ప్రజావాణి ప్రాజెక్ట్ డైరెక్టర్ రాకేష్ మహబూబాబాద్ జిల్లాలో అమలు చేస్తున్న ప్రజావాణి ప్రక్రియ యాప్ విధానాన్ని కలెక్టర్ స్నేహ శబరిష్ ను అడిగి తెలుసుకుని స్వయంగా పరిశీలించారు, ఈ సోమవారం ప్రజావాణి కార్యక్రమంలో భాగంగా ఈ రోజు రెవెన్యూ విభాగానికి చెందినవి 58, పంచాయతీరాజ్ 14, డిఆర్డిఓ 12, హౌసింగ్, డబుల్ బెడ్ రూమ్ 24, మున్సిపల్ 9, మొత్తం అన్ని విభాగాలు కలిపి (133) దరఖాస్తులు వచ్చాయని కలెక్టర్ తెలిపారు, మహబూబాబాద్ రెవెన్యూ డివిజనల్ డివిజనల్ అధికారి కార్యాలయంలో నిర్వహించిన ప్రజావాణిలో (9) దరఖాస్తులు వచ్చాయని ఆర్డీవో క్రిష్ణవేణి తెలిపారు, తొర్రూరు రెవెన్యూ డివిజనల్ అధికారి కార్యాలయంలో నిర్వహించిన ప్రజావాణి కార్యక్రమంలో ( 14 ) దరఖాస్తులు వచ్చాయని ఆర్డిఓ గణేష్ తెలిపారు, ప్రజలకు నాణ్యమైన, సత్వర సేవలు అందించాలనే మంచి ఉద్దేశంతో ప్రజల సమస్యల పరిష్కారం నిమిత్తం డివిజనల్ స్థాయిలో ప్రజావాణి కార్యక్రమాలను నిర్వహించడం జరుగుతుందని, అందువలన ప్రతి ఒక్కరూ ప్రజలకు జవాబుదారీతనంగా ఉంటూ తెవలు అందించాలని అధికారులకు సూచించారు. కలెక్టర్ కార్యాలయంలో నిర్వహించిన ప్రజావాణి కార్యక్రమంలో అదనపు కలెక్టర్ రెవెన్యూ కె.అనిల్ కుమార్, జడ్పీ సీఈవో (హౌసింగ్ పీడీ) పురుషోత్తం, డి ఆర్ డి ఓ ప్రాజెక్ట్ డైరెక్టర్ మధుసూదన రాజు, డిసిఓ వెంకటేశ్వర్లు, అన్ని విభాగాల అధికారులు, కలెక్టరేట్ పరిపాలన అధికారి పవన్ కుమార్, డివిజన్ కార్యాలయాలలో డివిజన్ స్థాయి అన్ని విభాగాల అధికారులు పాల్గొన్నారు.1
- వరంగల్ జిల్లా నెక్కొండ రైల్వే స్టేషన్ సమీపంలోని పొలానికి గుర్తు తెలియని వ్యక్తులు నిప్పు పెట్టారు. మంటలు ఎగసిపడటంతో సికింద్రాబాద్-భద్రాచలం కాకతీయ ఎక్స్‌ప్రెస్ 30 నిమిషాలు నిలిచిపోయింది, పలు రైళ్లు ఆలస్యమయ్యాయి. ఈ ఘటనతో ప్రయాణికులు తీవ్ర భయాందోళనలకు గురయ్యారు; రైల్వే అధికారులు వెంటనే మంటలను అదుపులోకి తెచ్చారు.2
- బండి సంజయ్ దిష్టిబొమ్మ దహనం: రామన్నపేటలో మాజీ ఎమ్మెల్యే చిరుమర్తి లింగయ్య ఆధ్వర్యంలో భారీ నిరసన మైనర్ బాలికను లైంగిక వేధింపులను గురి చేసిన కేంద్ర సహాయ మంత్రి బండి సంజయ్ కుమార్ కుమారుడు బండి భగీరథ్‌పై నమోదైన పోక్సో కేసులో వెంటనే అరెస్ట్ చేయాలని డిమాండ్ చేస్తూ నకిరేకల్ మాజీ ఎమ్మెల్యే చిరుమర్తి లింగయ్య గారి ఆధ్వర్యంలో రామన్నపేట మండల కేంద్రంలో బండి సంజయ్ దిష్టిబొమ్మ దహనం చేశారు.1
- రైస్ మిల్లర్ల వల్లనే రైతులకు ఇబ్బందులు ఏర్పడుతున్నాయని ప్రజావాణిలో కలెక్టర్ కు కరీంనగర్ జిల్లా కాంగ్రెస్ అధ్యక్షులు ఎమ్మెల్యే మేడిపల్లి సత్యం పిర్యాదు..రైతులను ఇబ్బంది పెడితే ధర్నా చేస్తామని హెచ్చరిక ఆరుగాలం శ్రమించి పంటలు పండించిన రైతులు ధాన్యం అమ్ముకోవడానికి అష్ట కష్టాలు పడడానికి ప్రధాన కారణం రైస్ మిల్లర్లేనని కరీంనగర్ జిల్లా కాంగ్రెస్ అధ్యక్షులు చొప్పదండి ఎమ్మెల్యే మేడిపల్లి సత్యం ఆరోపించారు. రైతు సమస్యలపై కరీంనగర్ కలెక్టరేట్ లో ప్రజావాణిలో కలెక్టర్ కు ఎమ్మెల్యే మేడిపల్లి సత్యం పిర్యాదు చేశారు. రైతులు ఇబ్బంది పడకుండా త్వరితగతిన కొనుగోలు పూర్తి చేసేలా చర్యలు చేపట్టాలని కోరారు. బ్యాగ్ లో 40 కిలోలకు బదులు 43 కేజీల ధాన్యం తూకం వేయడాన్ని వెంటనే అరికట్టాలని డిమాండ్ చేశారు. రైస్ మిల్లర్స్ నిర్లక్ష్యం వల్ల రైతులకు సమస్యలు తప్పడం లేదని ఎమ్మెల్యే ఆందోళన వ్యక్తం చేశారు. ప్రతి మండలానికి ఒక స్పెషల్ ఆఫీసర్ ను పెట్టి నిరంతరం ధాన్యం కొనుగోలను పర్యవేక్షించాలని, టోల్ ఫ్రీ ఏర్పాటు చేసి రైతులకు సమస్యలు లేకుండా చూడాలని కోరారు. రైతులకు ఇబ్బంది లేకుండా ధాన్యం కొనుగోలు వేగవంతం చేయాలని డిమాండ్ చేశారు. రైతులకు ఇబ్బంది కలిగితే తామే స్వయంగా ధర్నా చేస్తామని హెచ్చరించారు. ఎమ్మెల్యే ప్రస్తావించిన సమస్యలపై చర్యలు చేపడుతామని కలెక్టర్ చిత్రమిశ్రా ప్రకటించారు.3
- గోదావరి బాధిత కుటుంబాలకు బి ఆర్ ఎస్ జిల్లా అధ్యక్షుడు లక్ష్మణ్ బాబు పరామర్శ MLG: కన్నాయిగూడెం మండలం లక్ష్మీపురం గోదావరి ప్రమాదంలో మృతి చెందిన కుటుంబాలను బీఆర్‌ఎస్ పార్టీ జిల్లా అధ్యక్షుడు కాకులమర్రి లక్ష్మణ్ బాబు సోమవారం పరామర్శించారు. రోయ్యూరు గ్రామంలో మృతుని కుటుంబ సభ్యులను ఓదార్చి అంతిమయాత్రలో పాల్గొన్నారు. ఈ విషాదాన్ని తట్టుకునే ధైర్యం కుటుంబ సభ్యులకు కలగాలని ఆకాంక్షిస్తూ తన ప్రగాఢ సానుభూతి తెలిపారు. కార్యక్రమంలో బీఆర్‌ఎస్ నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు.1
- బిగ్ బ్రేకింగ్ న్యూస్ పరారీలో బండి సంజయ్ కొడుకు బండి భగీరథ్ మూడు రోజులుగా ఫోన్ స్విచ్ ఆఫ్ నిందితుడు పరారీలో ఉన్నాడు, అతని CDR పరిశీలిస్తుస్తున్నాం, ఆచూకీ కోసం గాలిస్తున్నాము బాధితురాలి స్టేట్మెంట్ రికార్డ్ చేసాము, మరిన్ని వివరాల కోసం ఇంకోసారి స్టేట్మెంట్ రికార్డ్ చేయాల్సి వస్తుంది – బండి సంజయ్ కొడుకు POCSO కేసు విచారణాధికారి రితిరాజ్1
- బండి భగీరథ్ కేసుపై ఎస్‌ఐటీ ఏర్పాటు అంటే కేసును నీరుగార్చడమే : హరీష్ రావు వరంగల్ జిల్లా ఖానాపురం మండలం అశోక్‌నగర్‌లో ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో మాజీ మంత్రి, ఎమ్మెల్యే హరీష్ రావు సంచలన వ్యాఖ్యలు చేశారు. బండి భగీరథ్‌పై ఫిర్యాదు వచ్చి నాలుగు రోజులు గడిచినా ఇప్పటివరకు అరెస్ట్ ఎందుకు చేయలేదని ప్రశ్నించారు. “మా క్రిశాంక్, నల్లబాలు రీట్వీట్ చేసినా వెంటనే ఇంటికి వెళ్లి ఎత్తుకెళ్లారు. మరి రేప్ కేసులో ఫిర్యాదు వచ్చిన వ్యక్తిని ఎందుకు అరెస్ట్ చేయడం లేదు?” అంటూ ప్రభుత్వాన్ని నిలదీశారు. రాష్ట్ర ప్రభుత్వం ఇప్పటివరకు పది ఎస్‌ఐటీలు వేసిందని, ముందుగా వాటి నివేదికలను బయట పెట్టాలని డిమాండ్ చేశారు. సీఎం రేవంత్ రెడ్డి బండి సంజయ్ కుమారుడిని కాపాడేందుకు లీకులు ఇస్తూ అసలు విషయాన్ని ప్రజలు చర్చించకుండా పక్కదారి పట్టిస్తున్నారని ఆరోపించారు.1