Shuru
Apke Nagar Ki App…
బండి సంజయ్ దిష్టిబొమ్మ దహనం: రామన్నపేటలో మాజీ ఎమ్మెల్యే చిరుమర్తి లింగయ్య ఆధ్వర్యంలో భారీ నిరసన మైనర్ బాలికను లైంగిక వేధింపులను గురి చేసిన కేంద్ర సహాయ మంత్రి బండి సంజయ్ కుమార్ కుమారుడు బండి భగీరథ్‌పై నమోదైన పోక్సో కేసులో వెంటనే అరెస్ట్ చేయాలని డిమాండ్ చేస్తూ నకిరేకల్ మాజీ ఎమ్మెల్యే చిరుమర్తి లింగయ్య గారి ఆధ్వర్యంలో రామన్నపేట మండల కేంద్రంలో బండి సంజయ్ దిష్టిబొమ్మ దహనం చేశారు.
PRK
బండి సంజయ్ దిష్టిబొమ్మ దహనం: రామన్నపేటలో మాజీ ఎమ్మెల్యే చిరుమర్తి లింగయ్య ఆధ్వర్యంలో భారీ నిరసన మైనర్ బాలికను లైంగిక వేధింపులను గురి చేసిన కేంద్ర సహాయ మంత్రి బండి సంజయ్ కుమార్ కుమారుడు బండి భగీరథ్‌పై నమోదైన పోక్సో కేసులో వెంటనే అరెస్ట్ చేయాలని డిమాండ్ చేస్తూ నకిరేకల్ మాజీ ఎమ్మెల్యే చిరుమర్తి లింగయ్య గారి ఆధ్వర్యంలో రామన్నపేట మండల కేంద్రంలో బండి సంజయ్ దిష్టిబొమ్మ దహనం చేశారు.
More news from తెలంగాణ and nearby areas
- బండి సంజయ్ దిష్టిబొమ్మ దహనం: రామన్నపేటలో మాజీ ఎమ్మెల్యే చిరుమర్తి లింగయ్య ఆధ్వర్యంలో భారీ నిరసన మైనర్ బాలికను లైంగిక వేధింపులను గురి చేసిన కేంద్ర సహాయ మంత్రి బండి సంజయ్ కుమార్ కుమారుడు బండి భగీరథ్‌పై నమోదైన పోక్సో కేసులో వెంటనే అరెస్ట్ చేయాలని డిమాండ్ చేస్తూ నకిరేకల్ మాజీ ఎమ్మెల్యే చిరుమర్తి లింగయ్య గారి ఆధ్వర్యంలో రామన్నపేట మండల కేంద్రంలో బండి సంజయ్ దిష్టిబొమ్మ దహనం చేశారు.1
- నల్గొండ: కొత్తపల్లిలో ప్రమాదకరంగా బోరు నీటి పైప్ లైన్ గుంత నల్గొండ: నల్గొండ మండలంలోని కొత్తపల్లి గ్రామంలో 4వ వార్డులో బోరు నీటి పైప్ లైన్ మరమ్మత్తుల కోసం ప్రధాన రహదారి పక్కన తీసిన గుంత ప్రమాదకరంగా మారింది. వారం రోజుల క్రితం తీసిన ఈ గుంతను మరమ్మత్తులు చేపట్టకుండా నిర్లక్ష్యంగా వదిలి వేయడంతో చిన్నారులు అందులో పడే ప్రమాదం ఉంది. స్థానికులు వాహనదారులు, పాదచారులు, రాకపోకలకు ఇబ్బందులు ఎదురవుతున్నాయి. ప్రమాదాలు జరగకముందే సంబంధిత అధికారులు తక్షణమే స్పందించి పైప్ లైన్ కు మరమ్మత్తులు పూర్తిచేసి, గుంతను పూడ్చాలని స్థానికులు, వాహనదారులు కోరుతున్నారు.1
- నల్గొండ జిల్లాలో బత్తాయి తోటల అభివృద్ధి, దిగుబడి పెంపు కోసం రైతులకు ప్రత్యేక శిక్షణ తరగతులు నిర్వహిస్తున్నారు. రికార్డు స్థాయిలో ధర ఉన్నప్పటికీ, దిగుబడి తగ్గి రైతులు నష్టపోతున్నారని అధికారులు గుర్తించారు. భూసారం పెంపు, సరైన సాగు పద్ధతులు పాటించి అధిక లాభాలు పొందాలని ఉద్యానవన శాఖ సూచించింది.1
- గుప్తనిధుల వేట కోసమే అశోక్‌నగర్ శివాలయం కూల్చివేత : మాజీ మంత్రి హరీష్‌రావు తీవ్ర ఆరోపణలు వరంగల్ జిల్లా ఖానాపురం మండలం అశోక్‌నగర్‌లో మట్టికోట శివాలయం ముందు బీఆర్‌ఎస్ రాష్ట్ర నాయకుడు హరీష్‌రావు మీడియాతో మాట్లాడారు. రేవంత్ ప్రభుత్వం దేవాలయాలపై భక్తి లేకుండా వ్యవహరిస్తోందని ఆరోపించారు. గుప్తనిధుల వేట కోసమే శివాలయాన్ని కూల్చారని విమర్శించారు. శివాలయం కూల్చివేతపై ఇప్పటివరకు కేసు నమోదు చేయలేదని, గర్భగుడి కింద ఎందుకు తవ్వకాలు చేశారో ప్రభుత్వం చెప్పాలని డిమాండ్ చేశారు. స్కూల్ నిర్మాణానికి తమకు వ్యతిరేకం లేదని, అయితే చుట్టుపక్కల స్థలం ఉండగా శివాలయాన్ని ఎందుకు కూల్చారో స్పష్టం చేయాలని అన్నారు. శివాలయాన్ని తిరిగి పునర్నిర్మించాలని కోరారు.1
- ఖమ్మం లో మైనర్ బాలికపైన అత్యాచారానికి పాల్పడిన బండి సాయి భగీరథ్ ను తక్షణమే అరెస్టు చేయాలి : ఐద్వా జిల్లా కార్యదర్శి బండి పద్మ1
- బిగ్ బ్రేకింగ్ న్యూస్ పరారీలో బండి సంజయ్ కొడుకు బండి భగీరథ్ మూడు రోజులుగా ఫోన్ స్విచ్ ఆఫ్ నిందితుడు పరారీలో ఉన్నాడు, అతని CDR పరిశీలిస్తుస్తున్నాం, ఆచూకీ కోసం గాలిస్తున్నాము బాధితురాలి స్టేట్మెంట్ రికార్డ్ చేసాము, మరిన్ని వివరాల కోసం ఇంకోసారి స్టేట్మెంట్ రికార్డ్ చేయాల్సి వస్తుంది – బండి సంజయ్ కొడుకు POCSO కేసు విచారణాధికారి రితిరాజ్1
- ప్రజావాణి దరఖాస్తులను పరిశీలించి వెంటనే పరిష్కరించాలి, శాఖల వారీగా అందిన ప్రజావాణి దరఖాస్తులను పరిష్కరిస్తూ నివేదిక సమర్పించాలి, మహబూబాబాద్ జిల్లా కలెక్టర్ స్నేహ శబరిష్, సోమవారం *జిల్లా కలెక్టర్ స్నేహ శబరిష్,* సంబంధిత అధికారులతో కలిసి ప్రజావాణి కార్యక్రమాన్ని నిర్వహించారు, ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ ప్రజావాణి కార్యక్రమం, ఇతర వేదికల ద్వారా ప్రజల సమస్య పరిష్కారం నిమిత్తం సామాన్య ప్రజలు చేసుకున్న ప్రతి ఒక దరఖాస్తుకు అధిక ప్రాధాన్యత ఇస్తూ తక్షణమే పరిష్కరించి నివేదికను తమకు సమర్పించాలని, తమ పరిధిలో లేని పక్షంలో సంబంధిత విభాగానికి సిఫారసు చేయాలని సంబంధిత అధికారులను ఆదేశించారు, ప్రభుత్వ ఆదేశాలు ప్రకారం మహబూబాబాద్ జిల్లా కేంద్రంలోని కలెక్టర్ కార్యాలయం తో పాటు తొర్రూరు రెవిన్యూ డివిజనల్ అధికారి కార్యాలయం, మహబూబాబాద్ రెవిన్యూ డివిజనల్ అధికారి కార్యాలయాలలో కూడా ప్రజావాణి కార్యక్రమాన్ని నిర్వహించడం జరిగిందని కలెక్టర్ తెలిపారు, అట్టి దరఖాస్తుల పరిష్కారం నిమిత్తం సంబంధిత అధికారులకు తగు ఆదేశాలు జారీ చేయడం జరిగిందని తెలిపారు, హైదరాబాద్ నుండి వచ్చిన ప్రజావాణి ప్రాజెక్ట్ డైరెక్టర్ రాకేష్ మహబూబాబాద్ జిల్లాలో అమలు చేస్తున్న ప్రజావాణి ప్రక్రియ యాప్ విధానాన్ని కలెక్టర్ స్నేహ శబరిష్ ను అడిగి తెలుసుకుని స్వయంగా పరిశీలించారు, ఈ సోమవారం ప్రజావాణి కార్యక్రమంలో భాగంగా ఈ రోజు రెవెన్యూ విభాగానికి చెందినవి 58, పంచాయతీరాజ్ 14, డిఆర్డిఓ 12, హౌసింగ్, డబుల్ బెడ్ రూమ్ 24, మున్సిపల్ 9, మొత్తం అన్ని విభాగాలు కలిపి (133) దరఖాస్తులు వచ్చాయని కలెక్టర్ తెలిపారు, మహబూబాబాద్ రెవెన్యూ డివిజనల్ డివిజనల్ అధికారి కార్యాలయంలో నిర్వహించిన ప్రజావాణిలో (9) దరఖాస్తులు వచ్చాయని ఆర్డీవో క్రిష్ణవేణి తెలిపారు, తొర్రూరు రెవెన్యూ డివిజనల్ అధికారి కార్యాలయంలో నిర్వహించిన ప్రజావాణి కార్యక్రమంలో ( 14 ) దరఖాస్తులు వచ్చాయని ఆర్డిఓ గణేష్ తెలిపారు, ప్రజలకు నాణ్యమైన, సత్వర సేవలు అందించాలనే మంచి ఉద్దేశంతో ప్రజల సమస్యల పరిష్కారం నిమిత్తం డివిజనల్ స్థాయిలో ప్రజావాణి కార్యక్రమాలను నిర్వహించడం జరుగుతుందని, అందువలన ప్రతి ఒక్కరూ ప్రజలకు జవాబుదారీతనంగా ఉంటూ తెవలు అందించాలని అధికారులకు సూచించారు. కలెక్టర్ కార్యాలయంలో నిర్వహించిన ప్రజావాణి కార్యక్రమంలో అదనపు కలెక్టర్ రెవెన్యూ కె.అనిల్ కుమార్, జడ్పీ సీఈవో (హౌసింగ్ పీడీ) పురుషోత్తం, డి ఆర్ డి ఓ ప్రాజెక్ట్ డైరెక్టర్ మధుసూదన రాజు, డిసిఓ వెంకటేశ్వర్లు, అన్ని విభాగాల అధికారులు, కలెక్టరేట్ పరిపాలన అధికారి పవన్ కుమార్, డివిజన్ కార్యాలయాలలో డివిజన్ స్థాయి అన్ని విభాగాల అధికారులు పాల్గొన్నారు.1
- ధాన్యం కొనుగోళ్లలో రైతులు ఎదుర్కొంటున్న అన్యాయాన్ని నిరసిస్తూ బీఆర్ఎస్ పార్టీ నల్గొండ కలెక్టరేట్‌ను ముట్టడించింది. కాంగ్రెస్ ప్రభుత్వం రైతులను మోసం చేస్తోందని, కాంటాలు వేయడంలో నిర్లక్ష్యం కారణంగా రైతులు రోజుల తరబడి వేచి చూడాల్సి వస్తుందని మాజీ ఎమ్మెల్యే చిరుమర్తి లింగయ్య ఆరోపించారు. కొనుగోళ్లను వేగవంతం చేయాలని వారు డిమాండ్ చేశారు.1