Shuru
Apke Nagar Ki App…
టిఆర్ఎస్ పార్టీ ఆధ్వర్యంలో నల్గొండ జిల్లా కలెక్టరేట్ ముట్టడి ధాన్యం కొనుగోలలో రైతులకు జరుగుతున్న అన్యాయాన్ని నిరసిస్తూ సోమవారం బిఆర్ఎస్ పార్టీ ఆధ్వర్యంలో కలెక్టరేట్ ను ముట్టడించారు. ఈ కార్యక్రమంలో పాల్గొన్న నకిరేకల్ మాజీ ఎమ్మెల్యే చిరుమర్తి లింగయ్య మాట్లాడుతూ.. కాంగ్రెస్ ప్రభుత్వం రైతులను మోసం చేస్తుందని ఆరోపించారు. కాంటాలు వేయడంలో నిర్లక్ష్యం చేస్తున్న కారణంగా రోజుల తరబడి రైతులు నిరీక్షించాల్సిన పరిస్థితి ఏర్పడిందని ఆవేదన వ్యక్తం చేశారు. ధాన్యం కొనుగోలు చేయడంలో కాంగ్రెస్ ప్రభుత్వం పూర్తిగా విఫలమైందన్నారు. కొనుగోలు వేగవంతం చేయాలని డిమాండ్ చేశారు.
T Shankar Public News Reporter Nalgonda
టిఆర్ఎస్ పార్టీ ఆధ్వర్యంలో నల్గొండ జిల్లా కలెక్టరేట్ ముట్టడి ధాన్యం కొనుగోలలో రైతులకు జరుగుతున్న అన్యాయాన్ని నిరసిస్తూ సోమవారం బిఆర్ఎస్ పార్టీ ఆధ్వర్యంలో కలెక్టరేట్ ను ముట్టడించారు. ఈ కార్యక్రమంలో పాల్గొన్న నకిరేకల్ మాజీ ఎమ్మెల్యే చిరుమర్తి లింగయ్య మాట్లాడుతూ.. కాంగ్రెస్ ప్రభుత్వం రైతులను మోసం చేస్తుందని ఆరోపించారు. కాంటాలు వేయడంలో నిర్లక్ష్యం చేస్తున్న కారణంగా రోజుల తరబడి రైతులు నిరీక్షించాల్సిన పరిస్థితి ఏర్పడిందని ఆవేదన వ్యక్తం చేశారు. ధాన్యం కొనుగోలు చేయడంలో కాంగ్రెస్ ప్రభుత్వం పూర్తిగా విఫలమైందన్నారు. కొనుగోలు వేగవంతం చేయాలని డిమాండ్ చేశారు.
More news from Telangana and nearby areas
- బత్తాయి తోటల అభివృద్ధి కోసం శిక్షణ తరగతులు నిర్వహిస్తున్నాం: సుభాషిని నల్గొండ జిల్లాలో బత్తాయి తోటల అభివృద్ధి కోసం శిక్షణ తరగతులు నిర్వహిస్తున్నామని జిల్లా ఉద్యానవన & పట్టు పరిశ్రమల శాఖ అధికారి సుభాషిని తెలిపారు. సోమవారం ఆమె మాట్లాడుతూ.. బత్తాయి తోటలో దిగుబడి తక్కువగా వచ్చి నష్టపోతున్నామని అనేక మంది రైతులు చెబుతున్నారని, భూమి సారం కోల్పోవడం ద్వారా దిగుబడి తగ్గుతుందని అధికారులు చెప్పే సలహాలు సూచనలు పాటిస్తూ దిగుబడిని పెంచుకోవాలని సూచించారు. గతంలో కంటే ఈసారి రికార్డు స్థాయిలో బత్తాయికి రేటు ఉందని తెలిపారు.1
- నల్గొండ జిల్లాలోని కొత్తపల్లి గ్రామం మీదుగా వెళ్లే ప్రధాన రహదారిపై ఉన్న కనిపించని స్పీడ్ బ్రేకర్లు వాహనదారులకు తీవ్ర ఇబ్బందులు కలిగిస్తున్నాయి. రాత్రి వేళల్లో ఇవి అస్సలు కనిపించక అనేక ప్రమాదాలకు కారణమవుతున్నాయి. అధికారులు వెంటనే మార్కింగ్ ఏర్పాటు చేయాలని స్థానికులు కోరుతున్నారు.1
- తెలంగాణలో 17 ఏళ్ల పోక్సో బాధితురాలిపై బండి సంజయ్ తీవ్ర దిగజారుడు వ్యాఖ్యలు చేసి, బెదిరించినట్లు ఆరోపణలు వెల్లువెత్తాయి. బాలిక చరित्रంపై ప్రశ్నిస్తూ, తనతో పెట్టుకోవద్దని బాధితులను భయపెట్టినట్లు సమాచారం. ఈ ఘటనపై బండి సంజయ్ ఇంటి సీసీ ఫుటేజ్, కాల్ రికార్డ్స్‌ను తనిఖీ చేయాలని ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ డిమాండ్ చేశారు.1
- Post by Mana Velugu1
- తెలంగాణలోని ప్రముఖ యాదగిరిగుట్ట శ్రీ లక్ష్మీనరసింహస్వామి ఆలయానికి ఆదివారం ఒక్కరోజే రూ.51.80 లక్షలకు పైగా ఆదాయం సమకూరింది. ప్రసాద విక్రయాలు, VIP దర్శనాలు, కార్ పార్కింగ్ వంటి వివిధ విభాగాల ద్వారా ఈ భారీ ఆదాయం లభించిందని ఈవో భవాని శంకర్ తెలిపారు.1
- మాజీ మంత్రి హరీష్‌రావు పర్యటనతో ఖానాపూర్‌లో ఉద్రిక్తత.. టెంట్లు తొలగించిన పోలీసులు.. బీఆర్‌ఎస్ నేతల ఆందోళన వరంగల్ జిల్లా ఖానాపూర్ మండలంలో ఉద్రిక్త పరిస్థితులు నెలకొన్నాయి. అశోక్‌నగర్ గ్రామంలోని చారిత్రక మట్టి కోట శివాలయం విధ్వంసం జరిగిన ప్రాంతాన్ని పరిశీలించేందుకు మాజీ మంత్రి హరీష్‌రావు పర్యటించనున్న నేపథ్యంలో బీఆర్‌ఎస్ నేతలు ఏర్పాట్లు చేపట్టారు. పర్యటన కోసం ఏర్పాటు చేసిన టెంటులను పోలీసులు తొలగించగా, స్థానిక బీఆర్‌ఎస్ నాయకులు అడ్డుకోవడంతో ఉద్రిక్తత ఏర్పడింది. భారీగా పోలీసులు మోహరించి పరిస్థితిని అదుపులోకి తీసుకువచ్చారు.1
- కేంద్రమంత్రి బండి సంజయ్ తనపై జరుగుతున్న తప్పుడు ప్రచారాలను నమ్మవద్దని ప్రజలను, బీజేపీ కార్యకర్తలను కోరారు. రాజకీయంగా తనను ఎదుర్కోలేకనే ఇలాంటి ప్రచారాలు చేస్తున్నారని హైదరాబాద్‌లోని పరేడ్ గ్రౌండ్‌లో జరిగిన మోడీ బహిరంగ సభలో ఆయన అన్నారు. తాను సామాన్య కార్యకర్తగా ఎదిగానని, తండ్రుల పేర్లతో రాజకీయాల్లోకి రాలేదని స్పష్టం చేశారు.1
- టిఆర్ఎస్ పార్టీ ఆధ్వర్యంలో నల్గొండ జిల్లా కలెక్టరేట్ ముట్టడి ధాన్యం కొనుగోలలో రైతులకు జరుగుతున్న అన్యాయాన్ని నిరసిస్తూ సోమవారం బిఆర్ఎస్ పార్టీ ఆధ్వర్యంలో కలెక్టరేట్ ను ముట్టడించారు. ఈ కార్యక్రమంలో పాల్గొన్న నకిరేకల్ మాజీ ఎమ్మెల్యే చిరుమర్తి లింగయ్య మాట్లాడుతూ.. కాంగ్రెస్ ప్రభుత్వం రైతులను మోసం చేస్తుందని ఆరోపించారు. కాంటాలు వేయడంలో నిర్లక్ష్యం చేస్తున్న కారణంగా రోజుల తరబడి రైతులు నిరీక్షించాల్సిన పరిస్థితి ఏర్పడిందని ఆవేదన వ్యక్తం చేశారు. ధాన్యం కొనుగోలు చేయడంలో కాంగ్రెస్ ప్రభుత్వం పూర్తిగా విఫలమైందన్నారు. కొనుగోలు వేగవంతం చేయాలని డిమాండ్ చేశారు.1