Shuru
Apke Nagar Ki App…
పి4 కార్యక్రమంపై సి. ఎం. సమీక్ష : పాల్గొన్న కేంద్రమంత్రి, జిల్లా అధికారులు శ్రీకాకుళం : రాష్ట్ర రాజధాని అమరావతి నుండి పి4 కార్యక్రమంపై రాష్ట్ర ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు శుక్రవారం సమగ్ర సమీక్ష నిర్వహించారు. శ్రీకాకుళం కలెక్టరేట్ సమావేశ మందిరం నుండి వర్చువల్ గా ఈ సమీక్షలో కేంద్ర విమానయాన శాఖ మంత్రి కింజరాపు రామ్మోహన్ నాయుడు పాల్గొన్నారు. జిల్లాలో పి4 కార్యక్రమం అమలుతీరును ఈ సందర్భంగా జిల్లా కలెక్టర్ స్వప్నిల్ దినకర్ పుండ్కర్, జేసీ. ఫర్మోన్ అహ్మద్ ఖాన్ కేంద్రమంత్రికి వివరించారు. ఈ కార్యక్రమంలో జిల్లా అధికారులు పాల్గొన్నారు.
Venkata Ramana Murthy K
పి4 కార్యక్రమంపై సి. ఎం. సమీక్ష : పాల్గొన్న కేంద్రమంత్రి, జిల్లా అధికారులు శ్రీకాకుళం : రాష్ట్ర రాజధాని అమరావతి నుండి పి4 కార్యక్రమంపై రాష్ట్ర ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు శుక్రవారం సమగ్ర సమీక్ష నిర్వహించారు. శ్రీకాకుళం కలెక్టరేట్ సమావేశ మందిరం నుండి వర్చువల్ గా ఈ సమీక్షలో కేంద్ర విమానయాన శాఖ మంత్రి కింజరాపు రామ్మోహన్ నాయుడు పాల్గొన్నారు. జిల్లాలో పి4 కార్యక్రమం అమలుతీరును ఈ సందర్భంగా జిల్లా కలెక్టర్ స్వప్నిల్ దినకర్ పుండ్కర్, జేసీ. ఫర్మోన్ అహ్మద్ ఖాన్ కేంద్రమంత్రికి వివరించారు. ఈ కార్యక్రమంలో జిల్లా అధికారులు పాల్గొన్నారు.
More news from ఆంధ్రప్రదేశ్ and nearby areas
- పి4 కార్యక్రమంపై సి. ఎం. సమీక్ష : పాల్గొన్న కేంద్రమంత్రి, జిల్లా అధికారులు శ్రీకాకుళం : రాష్ట్ర రాజధాని అమరావతి నుండి పి4 కార్యక్రమంపై రాష్ట్ర ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు శుక్రవారం సమగ్ర సమీక్ష నిర్వహించారు. శ్రీకాకుళం కలెక్టరేట్ సమావేశ మందిరం నుండి వర్చువల్ గా ఈ సమీక్షలో కేంద్ర విమానయాన శాఖ మంత్రి కింజరాపు రామ్మోహన్ నాయుడు పాల్గొన్నారు. జిల్లాలో పి4 కార్యక్రమం అమలుతీరును ఈ సందర్భంగా జిల్లా కలెక్టర్ స్వప్నిల్ దినకర్ పుండ్కర్, జేసీ. ఫర్మోన్ అహ్మద్ ఖాన్ కేంద్రమంత్రికి వివరించారు. ఈ కార్యక్రమంలో జిల్లా అధికారులు పాల్గొన్నారు.1
- రేగిడి ఆమదాలవలస సంకిలి షుగర్ ఫ్యాక్టరీ దగ్గర రైతుల ఆందోళన1
- సంతకవిటి : అల్పపీడనం ప్రభావంతో నాగావళి నది కి భారీ గా వరద నీరు సంతకవిటి మండలం రంగరాయ పురం వద్ద ఉన్న నారాయణపురం ఆనకట్టు కు 10460 క్యూసిక్కుల నీరు ప్రవహిస్తుoదని ఆయకట్టు ఏ ఈ శివాజీ తెలిపారు. దీంతో దిగివకు నీరు విడిచిపెడుతున్నామని నదిలోకి ఎవరు దిగొద్దని తీర గ్రామాల ప్రజలకు హెచ్చరిక జారీ చేశారు.1
- నెల్లిమర్ల: కందర్ప కాలనీ స్కూల్ పిల్లలు ఘనంగా రాఖీ పండగ నెల్లిమర్ల నగర పంచాయతీ పరిధి కందర్ప కాలనీ శ్రీ సరస్వతి విద్యాపీట్ పిల్లలు ఘనంగా రాఖీ పౌర్ణమి పండగ శుక్రవారం జరిపారు. స్కూల్ పిల్లలు నేను నీకు రక్ష,నువ్వు నాకు రక్ష ,మనము దేశానికి రక్ష అనే నినాదంతో ఒకరికి ఒకరు రాఖీలు కట్టుకొని ఆనందంగా గడిపారు. కందర్ప, గాంధీ నగర్ కాలనీలు తదితర ప్రాంతాలకి పిల్లలు వెళ్లి స్థానికులకు రాఖీలు కట్టి శుభాకాంక్షలు తెలియజేశారు. ఈ కార్యక్రమంలో స్కూల్ సిబ్బంది పాల్గొన్నారు1
- A small thread. ❤️ A lifelong bond. 🪢 Wishing all brothers and sisters a very Happy Raksha Bandhan! May your bond always be filled with love, care and happiness. MGM Vests — Crafted for Comfort. #RakshaBandhan #HappyRakshaBandhan #BrotherSisterLove #SiblingLove #MGMVests #IndianFestivals1
- విజయనగరం జిల్లా రాజాం :దివంగత మహా నేత వైస్సార్ మానస పుత్రిక ఆరోగ్యశ్రీ లో డాక్టరేట్ పట్టా పొందిన ఆరోగ్యశ్రీ గుమ్మడి జిల్లా మేనేజర్ గా సేవ చేసినందుకు రాజాంకి చెందిన దూబ రాంబాబు.. డాక్టరేట్ పట్టా పొందిన ఆరోగ్యశ్రీ ఉమ్మడి జిల్లా మేనేజర్. దివంగత మహానేత వైయస్సార్ మానస పుత్రిక ఆరోగ్యశ్రీలో జిల్లా మేనేజర్ గా సేవ చేసినందుకు రాజాం కి చెందిన దూబ రాంబాబు డాక్టరేట్ పట్టా అందుకున్నారు. విజయనగరం, పార్వతీపురం మన్యం జిల్లాలలో వైద్య రంగంలో విశేష సేవలందించడంతో పాటు ట్రెబల్ ప్రాంతాల్లోకి ఆరోగ్యశ్రీ సేవలను విస్తృతం చేయడంలో ప్రైవేటు ఆస్పత్రుల సహకారంతో వైద్య శిబిరాల ఏర్పాటు చేసి బడుగు బలహీన వర్గాల వారికి సామాజిక సేవా కార్యక్రమాలు చేసినందుకు అమెరికాకు చెందిన డే స్ప్రింగ్ ఇంటర్నేషనల్ యూనివర్సిటీ రాంబాబుకు డాక్టరేట్ ప్రదానం చేసింది. విశాఖపట్నంలోని పబ్లిక్ లైబ్రరీ హాల్ లో డే స్ప్రింగ్ ఇంటర్నేషనల్ యూనివర్సిటీ చాన్స్లర్ డాక్టర్ అమోస్ చేతులుమీదుగా డాక్టరేట్ అందుకున్నారు. రాంబాబుకు స్వచ్ఛంద సంస్థల ప్రముఖులు అభినందనలు తెలిపారు.1
- అవకాశాలను అందిపుచ్చుకొని యువత ఉన్నత శిఖరాలకు చేరుకోవాలి : జిల్లా ఎస్పీ ఏ.ఆర్. దామోదర్ విజయనగరం, ఆగస్టు 27: యువత తలచుకుంటే సాధించలేనిది ఏదీ లేదని, అందుబాటులో ఉన్న అవకాశాలను సద్వినియోగం చేసుకొని ఉన్నత శిఖరాలకు చేరుకోవాలని విజయనగరం జిల్లా ఎస్పీ ఎ.ఆర్. దామోదర్ అన్నారు. యువతలో స్ఫూర్తి నింపడంతో పాటు వారిని సన్మార్గంలో నడిపించేందుకు జిల్లా పోలీసుశాఖ ఆధ్వర్యంలో “యువ చైతన్యం” కార్యక్రమానికి శ్రీకారం చుట్టినట్లు తెలిపారు. డెంకాడ మండల కేంద్రంలో గురువారం నిర్వహించిన కార్యక్రమంలో ఎస్పీ యువతతో మమేకమై పలు అంశాలపై అవగాహన కల్పించారు. యువతే సారథులుగా వ్యవహరిస్తూ ప్రజలు, పోలీసులకు మధ్య వారధులుగా నిలిచి గ్రామీణ ప్రాంతాల్లో సామాజిక మార్పు తీసుకురావాలని సూచించారు. దురలవాట్ల నిర్మూలన, నేరాల నియంత్రణ, మహిళల భద్రత, సైబర్ నేరాలపై అవగాహన కల్పించడంలో యువత కీలక పాత్ర పోషించాలని పిలుపునిచ్చారు. ప్రస్తుతం నేరాల స్వరూపం, విధానం మారుతున్నాయని, ముఖ్యంగా యువతను ప్రభావితం చేసే వ్యసనాలు, సైబర్ మోసాలు పెరుగుతున్న నేపథ్యంలో ప్రతి ఒక్కరూ అప్రమత్తంగా ఉండాలని ఎస్పీ సూచించారు. తల్లిదండ్రులు తమ పిల్లలకు మంచి భవిష్యత్తు అందించాలనే ఉద్దేశంతో ఉన్నత విద్యను అందిస్తున్నప్పటికీ, కొందరు యువత చెడు స్నేహాలు, స్నేహితుల ఒత్తిడి, దురలవాట్ల కారణంగా తమ భవిష్యత్తును నాశనం చేసుకుంటున్నారని అన్నారు. గంజాయి వంటి మాదక ద్రవ్యాలకు యువత దూరంగా ఉండాలని సూచించారు. డ్రగ్స్ కేసుల్లో నిందితులుగా మారితే విద్య, ఉద్యోగ అవకాశాలతో పాటు భవిష్యత్తుపైనా తీవ్ర ప్రభావం పడుతుందని హెచ్చరించారు. మద్యం, గంజాయి తదితర వ్యసనాలకు బానిసలు కాకుండా యువత అప్రమత్తంగా ఉండాలని కోరారు. మహిళలను ప్రేమ పేరుతో వేధించడం, వెంటపడటం, అసభ్యంగా ప్రవర్తించడం, మైనర్ బాలికల పట్ల అనుచితంగా వ్యవహరించడం వంటి చర్యలకు పాల్పడితే కఠినమైన చట్టపరమైన చర్యలు తప్పవని ఎస్పీ స్పష్టం చేశారు. ఇటువంటి చర్యలతో యువత తమ భవిష్యత్తును నాశనం చేసుకోవద్దని హితవు పలికారు. జూదం, క్రికెట్ బెట్టింగ్‌లకు యువత దూరంగా ఉండాలని సూచించారు. బెట్టింగ్‌లకు అలవాటుపడి ఆర్థికంగా నష్టపోయి, అప్పులు తీర్చేందుకు దొంగతనాలు, మోసాలకు పాల్పడి పోలీసు కేసుల్లో చిక్కుకుంటున్న ఘటనలు జరుగుతున్నాయని తెలిపారు. సులభంగా డబ్బు సంపాదించాలనే ఆలోచనను విడనాడి, విద్యతో పాటు నైపుణ్యాలను పెంపొందించుకొని మంచి భవిష్యత్తును నిర్మించుకోవాలని సూచించారు. చదువుతోనే సమాజంలో ఉన్నతమైన గుర్తింపు లభిస్తుందని ఎస్పీ అన్నారు. ఉన్నత లక్ష్యాలను చేరుకోవాలన్నా, మంచి ఉద్యోగాలు సాధించాలన్నా, సమాజంలో గౌరవప్రదమైన స్థానం పొందాలన్నా విద్య ఎంతో ముఖ్యమన్నారు. నేరాలకు పాల్పడే యువతపై చట్ట ప్రకారం కఠిన చర్యలు తీసుకుంటామని, అవసరమైతే రౌడీషీట్లు తెరిచి వారి కదలికలపై నిఘా పెంచుతామని హెచ్చరించారు. సైబర్ నేరాల పట్ల అప్రమత్తంగా ఉండాలని ఎస్పీ సూచించారు. గుర్తుతెలియని వ్యక్తుల నుంచి వచ్చే ఫోన్ కాల్స్, మెసేజ్‌లు, అనుమానాస్పద లింకులు, యాప్‌లు, ఆన్‌లైన్ పెట్టుబడులు, ఉద్యోగాల పేరుతో వచ్చే ప్రలోభాలకు లొంగవద్దన్నారు. సైబర్ మోసానికి గురైన వెంటనే ఆలస్యం చేయకుండా 1930 సైబర్ హెల్ప్‌లైన్‌కు ఫిర్యాదు చేసి పోలీసులకు సమాచారం అందించాలని సూచించారు. మహిళల భద్రతలో ప్రతి ఒక్కరూ భాగస్వాములు కావాలని, మహిళలు తమ మొబైల్ ఫోన్లలో శక్తి యాప్ను అందుబాటులో ఉంచుకొని అత్యవసర పరిస్థితుల్లో SOS సదుపాయాన్ని వినియోగించి పోలీసుల సహాయం పొందాలని సూచించారు. రహదారి భద్రతకు యువత ప్రాధాన్యత ఇవ్వాలని ఎస్పీ కోరారు. ద్విచక్ర వాహనదారులు తప్పనిసరిగా హెల్మెట్ ధరించాలని, అతివేగం, నిర్లక్ష్యపు డ్రైవింగ్, మద్యం సేవించి వాహనాలు నడపడం వంటి చర్యలకు దూరంగా ఉండాలని సూచించారు. రోడ్డు ప్రమాదం ఒక వ్యక్తిని మాత్రమే కాకుండా రెండు కుటుంబాలను తీవ్రంగా ప్రభావితం చేస్తుందని, కుటుంబానికి ఆధారమైన వ్యక్తి ప్రమాదంలో మరణిస్తే ఆ కుటుంబం ఆర్థికంగా, సామాజికంగా తీవ్రంగా నష్టపోతుందని వివరించారు. “యువత దేశానికి పట్టుకొమ్మలు.. దేశ భవిష్యత్తు యువత చేతుల్లోనే ఉంది” అని ఎస్పీ పేర్కొన్నారు. యువత సన్మార్గంలో నడిచి సమాజాన్ని మంచి మార్గంలో నడిపించే దిక్సూచిగా నిలవాలని పిలుపునిచ్చారు. తాము నేర్చుకున్న మంచి విషయాలను స్నేహితులు, కుటుంబ సభ్యులు, బంధువులతో పంచుకొని సమాజంలో సానుకూల మార్పుకు కృషి చేయాలన్నారు. ప్రభుత్వం అందిస్తున్న విద్య, ఉపాధి, నైపుణ్యాభివృద్ధి తదితర అవకాశాలను సద్వినియోగం చేసుకొని ఉన్నత స్థాయికి ఎదగాలని ఆకాంక్షించారు. గ్రామ స్థాయిలో యువతే సారథులుగా, ప్రజలు–పోలీసుల మధ్య వారధులుగా వ్యవహరిస్తూ మంచి సమాజ నిర్మాణంలో భాగస్వాములు కావాలని ఎస్పీ పిలుపునిచ్చారు. కార్యక్రమంలో పాల్గొన్న యువతకు డెంకాడ పోలీసులు “మీతో–మీ ఎస్పీ” కరపత్రాలను అందజేశారు. కార్యక్రమంలో విజయనగరం ఇన్‌చార్జి డీఎస్పీ ఎస్. రాఘవులు, భోగాపురం రూరల్ సీఐ ఎన్. శ్రీనివాసరావు, స్పెషల్ బ్రాంచ్ సీఐ ఏ.వి. లీలారావు, డెంకాడ ఎస్సై ఎ. సన్యాసి నాయుడు, ఇతర పోలీసు అధికారులు, సిబ్బంది, పెద్ద సంఖ్యలో యువత పాల్గొన్నారు.1
- పెయ్య దూడలకు విశ్రాంతి విడిదిగా మారిన ట్రాఫిక్ సిగ్నల్స్ పోస్టు..! శ్రీకాకుళం నగరంలోని సూర్య మహల్ జంక్షన్ వాహనాల రద్దీతో ఎప్పుడు కిటికీటలాడుతూ కనిపిస్తాది. అయినా ఇక్కడ ట్రాఫిక్ నియంత్రణకు పోలీసుని గాని ట్రాఫిక్ సిగ్నల్స్ గాని ఏర్పాటు చేయలేదు. ఫలితంగా తరచు ఈ జంక్షన్లో ట్రాఫిక్ జామ్ ఏర్పడడం, రోడ్డు దుర్ఘటనలు జరగడం ఆనవాయితీగా మారింది. ఒకప్పుడు ఇక్కడ ట్రాఫిక్ పోలీస్ పోస్ట్, సిగ్నలింగ్ వ్యవస్థ ఉండేవి. అయితే కాలక్రమంలో అవి కనుమరుగైపోయాయి. అప్పట్లో ఏర్పాటు చేసిన పోలీస్ పోస్ట్ ప్రస్తుతం పెయ్య దూడలకు విశ్రాంతి హబ్ గా తయారైంది! ఈ ఈ జంక్షన్లో ట్రాఫిక్ నియంత్రణ ఏర్పాట్లు వెంటనే పునరుద్ధరించాలని స్థానికులు కోరుతున్నారు.1