మేడే కాలనీ ప్రజల ఏళ్లనాటి డ్రైనేజీ సమస్యకు మోక్షం ప్రారంభమైన డ్రైనేజీ నిర్మాణ పనులు సారపాక పరిధిలోని మేడే కాలనీ ప్రజలు ఏళ్లుగా ఎదుర్కొంటున్న మురుగునీటి కాలువల సమస్యకు ఎట్టకేలకు పరిష్కారం లభించింది. కాలనీలో డ్రైనేజీ వ్యవస్థ లేకపోవడంతో వర్షాకాలంలో మురుగునీరు నిలిచిపోయి ప్రజలు తీవ్ర ఇబ్బందులు పడుతున్న విషయాన్ని గుర్తించిన సారపాక మేజర్ గ్రామపంచాయతీ సర్పంచ్ గూగులోత్ కిషోర్ శివరాం నాయక్ డ్రైనేజీ నిర్మాణ పనులకు సోమవారం శ్రీకారం చుట్టారు. ఈ సందర్భంగా భూమిపూజ నిర్వహించి పనులను ప్రారంభించారు. ఈ సందర్భంగా సర్పంచ్ మాట్లాడుతూ.. మేడే కాలనీ ప్రజలు ఎదుర్కొంటున్న ప్రధాన సమస్యల్లో డ్రైనేజీ సమస్య ఒకటని తెలిపారు. వర్షాకాలంలో మురుగునీరు నిలిచిపోవడం వల్ల ప్రజలకు ఇబ్బందులు కలగడంతో పాటు వ్యాధులు వ్యాపించే ప్రమాదం ఉందన్నారు. ప్రజల సమస్యను గుర్తించి ప్రాధాన్యత క్రమంలో డ్రైనేజీ నిర్మాణ పనులను మంజూరు చేయించినట్లు తెలిపారు. నాణ్యతా ప్రమాణాలు పాటిస్తూ పనులను త్వరితగతిన పూర్తి చేసి ప్రజలకు అందుబాటులోకి తీసుకురావాలని గుత్తేదారులు, అధికారులను ఆదేశించారు. ఏళ్ల తరబడి తమను వేధిస్తున్న మురుగునీటి సమస్యను గుర్తించి, స్పందించి డ్రైనేజీ నిర్మాణ పనులు ప్రారంభించినందుకు మేడే కాలనీ ప్రజలు, స్థానిక పెద్దలు సర్పంచ్ గూగులోత్ కిషోర్ శివరాం నాయక్‌కు ప్రత్యేక ధన్యవాదాలు తెలిపారు. ఈ కార్యక్రమంలో ఐటీసీ పీఎస్‌పీడీ భద్రాచలం యూనిట్ డీజీఎం చెంగల్ రావు, 15వ వార్డు సభ్యురాలు భుక్య కళ్యాణి, సీపీఎం మండల అధ్యక్షుడు బత్తుల వెంకటేశ్వర్లు, స్థానిక ప్రజాప్రతినిధులు, వార్డు సభ్యులు, కాలనీ పెద్దలు, గ్రామస్తులు తదితరులు పాల్గొన్నారు.

- కరెంట్ తీగలు తగిలి ట్రాక్టర్ దగ్ధం సంబేపల్లి మండలం మోటాకట్ల గ్రామం కాకరపల్లి సమీపంలో ట్రాక్టర్‌లో కరెంట్ తీగలు తగిలి ట్రాక్టర్ దగ్ధం సంబేపల్లి మండలం మోటాకట్ల గ్రామం కాకరపల్లి సమీపంలో ట్రాక్టర్‌లో తరలిస్తున్న పశువుల మేతకు విద్యుత్ తీగలు తగిలి మంటలు చెలరేగాయి. మంటలు వేగంగా వ్యాపించడంతో ట్రాక్టర్ ఇంజన్‌తో సహా పూర్తిగా దగ్ధమైంది. ప్రమాదాన్ని గుర్తించిన స్థానికులు వెంటనే అగ్నిమాపక సిబ్బందికి సమాచారం అందించారు. సమాచారం అందుకున్న అగ్నిమాపక సిబ్బంది ఘటనాస్థలానికి చేరుకుని మంటలను అదుపులోకి తీసుకువచ్చారు. ప్రమాదానికి సంబంధించిన మిగతా వివరాలు తెలియాల్సి ఉంది.1
- పేదల ఇళ్లను కూల్చవద్దని మాజీ మంత్రి పువ్వాడ అజయ్ కుమార్ ప్రభుత్వాన్ని కోరారు పేదల ఇళ్లను కూల్చవద్దని మాజీ మంత్రి పువ్వాడ అజయ్ కుమార్ ప్రభుత్వాన్ని కోరారు. ఖమ్మం శ్రీనివాస్ నగర్ నివాసితుల పక్షాన తాను అండగా నిలబడి తమకు న్యాయం జరిగే వరకు కోట్లాడుతానని భరోసా ఇచ్చారు. BRS పార్టీ, లీగల్ సెల్ ద్వారా కోర్టులో పోరాడి న్యాయం చేస్తామని, ఎవరికీ భయపడి తెల్ల కాగితాలపై సంతకాలు చేయవద్దని బాధితులకు సూచించారు. ధైర్యంగా ఉండాలని, ఎవరూ ఏం చెప్పినా నమ్మొద్దన్నారు.1
- కరీంనగర్ దగ్గర ఉన్న చింతకుంట్ల దగ్గర గణేష్ భక్తులు గణేష్ నిమజ్జనానికి ఎస్సార్ బీసీ నుంచి నీళ్లు వదలని పెద్ద ఎత్తున ధర్నా చేపట్టిన భక్తులు: వంగవీటి1
- రాష్ట్రంలో ప్రతిష్టాత్మకంగా ప్రభుత్వం తొలి దశలో 25 లేబర్ అడ్డాలను ఏర్పాటు ,.రాష్ట్ర భవన, ఇతర నిర్మాణ కార్మిక బోర్డు చైర్మన్ వలవల బాబ్జీ మరో 200 లేబర్ అడ్డాలు రాష్ట్రంలో ఏర్పాటుకు అవకాశం తాడేపల్లిగూడెం , గణేష్ నగర్ లో రూ.26లక్షలు ఏర్పాటు చేస్తున్న లేబర్ అడ్డా పనులను ఆయన పరిశీలించారు. ఈ సందర్భంగా బాబ్జీ మాట్లాడుతూ జిల్లా కేంద్రాల్లో వీటిని ఏర్పాటు చేయాలని ప్రభుత్వం నిర్ణయించిందన్నారు. అయితే, తాడేపల్లిగూడెంలో ఎక్కువ మంది కార్మికులు ఉండటంతో ఇక్కడ ఏర్పాటు చేసినట్లు తెలిపారు. తాపీ, వడ్రంగి, ప్లంబర్, ఎలక్ట్రికల్ కార్మికులంతా ఒక్క చోటకు చేరుకునే ప్రాంతమే లేబర్ అడ్డా అని పేర్కొన్నారు. లేబర్ అడ్డా ముఖ్యోద్దేశాన్ని లేబర్ కమిషనర్, ఇతర అధికారులు రూపొందించడం జరిగిందన్నారు. తమిళనాడులో ముందుగా 50 లేబర్ అడ్డాలను ఏర్పాటు చేసినట్లు వివరించారు. దేశంలో ఎక్కడా లేని విధంగా లేబర్ అడ్డా నమూనాకు సీఎం చంద్రబాబు రూపకల్పన చేశారన్నారు. మరో 200 లేబర్ అడ్డాలు రాష్ట్రంలో ఏర్పాటుకు అవకాశం కల్పించారన్నారు. లేబర్ అడ్డాలలో ఒక కంప్యూటర్ ఆపరేటర్, కోఆర్డినేటర్, ముగ్గురు వాచ్ మెన్ , వ్యాను, డ్రైవర్, స్వీపర్ ఉంటారన్నారు. లేబర్ అడ్డాకు సంబంధించి ప్రత్యేకమైన యాప్ రూపొందించినట్లు తెలిపారు. ప్రజలు తమ అవసరాలకు యాప్ ద్వారా కార్మికులను వినియోగించుకోవచ్చన్నారు. లేబర్ అడ్డా ప్రారంభానికి ముందుగానే విధివిధానాలు త్వరలో తెలియజేస్తామన్నారు. సీఎం సమక్షంలో జరిగే సమీక్ష సమావేశంలో విషయాలను వెల్లడిస్తారన్నారు. రాజమహేంద్రవరం, మంగళగిరిలో లేబర్ అడ్డాలు సిద్ధమయ్యాయని బాబ్జీ వివరించారు. సీఎం అపాయింట్ మెంట్ రాగానే 25 లేబర్ అడ్డాలను ప్రారంభిస్తామన్నారు. ప్రధానంగా లేబర్ అడ్డాలలో రిజిస్ట్రేషన్, సంక్షేమ పథకాలు, కార్మికుల గుర్తింపు కార్డు నవీకరణ, నైపుణ్య శిక్షణ వంటి కార్యకలాపాలు నిర్వహిస్తారన్నారు. ఆంధ్రప్రదేశ్, తమిళనాడును స్పూర్తిగా తీసుకొని మిగిలిన రాష్ట్రాల్లో లేబర్ అడ్డాలు ఏర్పాటుకు సుముఖంగా ఉన్నారన్నారు. లేబర్ అడ్డాల ద్వారా తమిళనాడు ప్రభుత్వం అమలు చేస్తున్న మంచి కార్యక్రమాలు మన రాష్ట్రం అమలుకు ఏపీబీవోసీడబ్ల్యూడబ్ల్యూ బోర్డు, కార్మిక శాఖ మంత్రి సుభాష్, కమిషనర్, సెక్రటరీ తరపున కృషి చేస్తామన్నారు. ఇక్కడ మంచి స్థలం సమకూర్చిన తహశీల్దార్, మున్సిపల్ కమిషనర్లకు ఆయన కృతజ్ఞతలు తెలిపారు. కార్మిక శాఖ అధికారి గోపి కుమార్, టైలర్స్ ఫెడరేషన్ చైర్మన్ ఆకాశపు స్వామి, బ్రాహ్మణ, ఆర్యవైశ్య కార్పొరేషన్ డైరెక్టర్లు కృష్ణమోహన్, పద్మనాభుని మురళి, టీడీపీ నాయకులు పట్నాల రాంపండు, లీల, వాసు, పాతూరి రాంప్రసాద్ చౌదరి తదితరులు పాల్గొన్నారు.2
- మిషన్ భగీరథ పైప్ లైన్ లీకేజ్ అయి పంట నష్టం అవుతుందంటూ రైతు ఆందోళన ములుగు జిల్లా జగ్గన్నపేట గ్రామపంచాయతీ పరిధిలోని అన్నం పల్లి గ్రామం వద్ద మిషన్ భగీరథ పైప్ లైన్ లీకేజీ మీరు వృధాగా పోతుందని అంతేకాకుండా గేట్ వాల్ కోసం ఏర్పాటుచేసిన పూడిక లో నీరు చేరి పంటకు నష్టం వాటిల్లుతుందని రైతు ఆవేదన వ్యక్తం చేశారు ఇప్పటికైనా అధికారులు స్పందించి పోడికతీతను మూయాలని లేకపోతే నష్టపరిహారం చెల్లించాలని రైతు ఆవేదన వ్యక్తం చేశాడు1
- ఖమ్మంలో AIKMS భారీ ప్రదర్శన.. రెడ్ ఫ్లాగ్స్‌తో హోరెత్తిన ర్యాలీ! 🚩 ఖమ్మంలో అఖిల భారత రైతు కూలీ సంఘం ఆధ్వర్యంలో భారీ ప్రదర్శన నిర్వహించారు. AIKMS జాతీయ మహాసభల సందర్భంగా ఖమ్మం నగరంలోని అమరవీరుల స్తూపం నుంచి SR BG NR కళాశాల వరకు రెడ్ ఫ్లాగ్స్‌తో ప్రదర్శన చేపట్టారు. ఈ ప్రదర్శనలో అఖిల భారత రైతు కూలీ సంఘం జాతీయ ఉపాధ్యక్షులు జేవీ చలపతిరావు పాల్గొన్నారు. రైతులు, కూలీలు, కార్మికుల సమస్యలను ప్రస్తావిస్తూ నినాదాలతో ప్రదర్శన కొనసాగింది. AIKMS జాతీయ మహాసభల నేపథ్యంలో నిర్వహించిన ఈ కార్యక్రమానికి సంఘం నాయకులు, కార్యకర్తలు పెద్ద సంఖ్యలో హాజరయ్యారు. ఖమ్మం జిల్లా AIKMS అధ్యక్ష, కార్యదర్శులు వై. ప్రకాష్, వెంకటరామిరెడ్డి ఆధ్వర్యంలో ఈ కార్యక్రమం నిర్వహించారు.1
- *మునిగిన బోటు* కోనసీమ జిల్లా భైరవపాలెం మొగలో మత్స్యకారుల బోటు మునిగి *మునిగిన బోటు* కోనసీమ జిల్లా భైరవపాలెం మొగలో మత్స్యకారుల బోటు మునిగిపోయింది. గ్రామానికి చెందిన చింత శ్రీను బోటుపై తొమ్మిది మంది మత్సకారులు వేటకు బయలుదేరారు. అయితే గాలి వేగంగా వీయడంతో సదరు బోటు ప్రమాదవశాత్తు సముద్రంలో మునిగిపోయింది. మరొక బోటు సహాయంతో జాలర్లు సురక్షితంగా బయటపడ్డారు.1
- ఒరాకిల్ లేఆఫ్స్ ఉద్యోగాలు కోల్పోయిన వారి ఆవేదన ⚡ వాడుకున్నంత కాలం వాడుకుని ఇష్టమొచ్చినట్లు ఉద్యోగాల్లోంచి తీసేస్తే తమ పరిస్థితి ఏంటని ఒరాకిల్ లేఆఫ్స్‌లో ఉద్యోగాలు కోల్పోయిన ఉద్యోగులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు.1
- పంటలు ఎండిపోతున్నాయని నీళ్లను అడిగినందుకు గల్లా పట్టుకుని రైతును ఈడ్చుకుని వెళ్తున్న పోలీసులు!1