Shuru
Apke Nagar Ki App…
పంటలు ఎండిపోతున్నాయని నీళ్లను అడిగినందుకు గల్లా పట్టుకుని రైతును ఈడ్చుకుని వెళ్తున్న పోలీసులు!
Seelam Ashok Reddy Flex Print
పంటలు ఎండిపోతున్నాయని నీళ్లను అడిగినందుకు గల్లా పట్టుకుని రైతును ఈడ్చుకుని వెళ్తున్న పోలీసులు!
More news from ఆంధ్రప్రదేశ్ and nearby areas
- వైసీపీ నాయకుల గోబెల్స్ ప్రచారం నమ్మే స్థితిలో ప్రజలు లేరు-శాసనసభ్యులు కందుల నారాయణరెడ్డి మార్కాపురం శాసనసభ్యులు కందుల నారాయణరెడ్డి సోమవారం మార్కాపురం పట్టణంలోని 10,11, 12 వార్డులలో తెలుగుదేశం నాయకులతో కలిసి పర్యటించారు. ఈ సందర్భంగా వార్డుల్లో ప్రజలను అడిగి సమస్యలు ఏమున్నాయో అని వాకాబు చేసి అప్పటికప్పుడు కొన్ని సమస్యలకు పరిష్కారం చూపారు. వార్డుల్లో అప్పటికప్పుడు 15 th ఫైనాన్స్ నిధులు మరియు hybrid annuity model (HAM) నిధులతో కొన్ని సీసీ రోడ్లకు శంకుస్థాపనలు చేశారు.ఈ సందర్భంగా వార్డు ప్రజలు ఆనందం వ్యక్తం చేశారు.మార్కాపురం శాసనసభ్యులు కందుల నారాయణరెడ్డి మాట్లాడుతూ 10, 11,12 వ వార్డుల్లో పర్యటించానని ఈ సందర్భంగా ప్రజలు మార్కాపురం ప్రత్యేక జిల్లాతో తమ ఆస్తుల విలువ కొన్ని రేట్లు పెరిగాయని, వెలుగొండ ప్రాజెక్టు నుండి నీటి విడుదలతో తామంతా సంతోషంగా ఉన్నామని సూపర్ సిక్స్ పథకాలు ప్రజలకు సక్రమంగా అందుతున్నాయని ప్రజలు తెలిపారు అని అన్నారు.పోయిన వైసీపీ పాలనలో ఈ క్షణం ఏం జరుగుతుందో తెలియక వైసిపి పాలనలో దౌర్జన్యాలు, ఆస్తులు లాక్కోవడం, నిరుద్యోగ యువతకు మొండి చేయి, అప్పుల ఊభి లోకి వైసీపీ పాలకులు రాష్ట్రాన్ని నెట్టారు అని ఇప్పుడు ప్రజలు సుఖ సంతోషాలతో జీవిస్తున్నారని అన్నారు. వైసీపీ నాయకుల తప్పుడు ప్రచారాన్ని ప్రజలు నమ్మే స్థితిలో లేరని కూటమి ప్రభుత్వ పాలన పట్ల ప్రజలు పూర్తి సంతృప్తి వ్యక్తం చేస్తున్నారని అన్నారు. ఈ కార్యక్రమంలో పట్టణ తెలుగుదేశం నాయకులు, ఆయా వార్డు తెలుగుదేశం నాయకులు, ప్రజలు పాల్గొన్నారు.1
- మారెళ్లపాడు లిఫ్ట్ ప్రారంభానికి ముహూర్తం ఖరారు •ఈ నెల 23 న మంత్రుల చేతుల మీదగా ప్రారంభోత్సవం •16,180 ఎకరాలకు సాగునీరు.. •తీరనున్న దశాబ్దాల రైతుల కల •ఎమ్మెల్యే పాయం ఆహ్వానం మేరకు ప్రారంభోత్సవం లో పాల్గొననున్న మంత్రి తుమ్మల •ముఖ్య అతిథిగా మంత్రి ఉత్తమ్‌కుమార్‌రెడ్డి.. భద్రాద్రి కొత్తగూడెం, మణుగూరు: మణుగూరు, అశ్వాపురం మండలాల రైతుల దశాబ్దాల నిరీక్షణకు తెరపడనుంది. గోదావరి జలాలను ఆయకట్టుకు తరలించే మారెళ్లపాడు లిఫ్ట్ ఇరిగేషన్ పథకం ఈ నెల 23న ఉదయం 11 గంటలకు ప్రారంభం కానుంది. . స్థానిక ఎమ్మెల్యే పాయం వెంకటేశ్వర్లు ఆహ్వానం మేరకు ప్రారంభోత్సవంలో మంత్రి తుమ్మల నాగేశ్వరరావుగారు పాల్గొనున్నారు..రాష్ట్ర నీటిపారుదల శాఖ మంత్రి ఉత్తమ్‌కుమార్‌రెడ్డి ముఖ్య అతిథిగా పాల్గొంటారు. ఇప్పటికే ట్రయల్‌రన్ విజయవంతం కావడంతో రైతుల్లో హర్షం వ్యక్తమవుతోంది. వరప్రదాయినిగా మారెళ్లపాడు సీతారామ ప్రాజెక్టుకు ప్రభుత్వం అత్యంత ప్రాధాన్యం ఇస్తోంది. ఇందులో భాగంగా సీతారామ ప్రధాన కాలువ నుంచి నీటిని ఎత్తిపోసి ఆయకట్టుకు అందించేలా ఈ పథకాన్ని చేపట్టారు. మణుగూరు, అశ్వాపురం మండలాల్లోని సుమారు 16,180 ఎకరాలకు సాగునీరు అందనుంది. పథకంలో భాగంగా హెడ్‌వర్క్స్‌కు రూ.25 కోట్లు, కాలువల నిర్మాణానికి రూ.113.17 కోట్లు, భూసేకరణకు రూ.42.30 కోట్లు ప్రభుత్వం కేటాయించింది. రూ.25 కోట్లతో పంప్‌హౌస్ మెఘా ఇంజినీరింగ్ సంస్థ రూ.25 కోట్లతో పంప్‌హౌస్ నిర్మాణాన్ని చేపట్టగా, పనులు దాదాపు పూర్తయ్యాయి. 1.80 మెగావాట్ల సామర్థ్యం గల రెండు మోటార్ల ద్వారా 46 మీటర్ల ఎత్తు నుంచి 85 మీటర్ల ఎత్తు వరకు, అంటే సుమారు 39 మీటర్ల మేర 180 క్యూసెక్కుల నీటిని ఎత్తిపోస్తారు. పంప్‌హౌస్ నుంచి 2.4 కి.మీ. దూరంలో కొండ కింద డెలివరీ సిస్టర్న్‌ను నిర్మించారు. అక్కడి నుంచి నీరు కాలువల్లోకి చేరుతుంది. కాలువలు.. ఆయకట్టు వివరాలు సిస్టర్న్ నుంచి 10.070 కి.మీ. మేర రెండు ప్రధాన కాలువలు నిర్మించాల్సి ఉంది. 9.650 కి.మీ. పొడవైన కుడి కాలువ ద్వారా 11,915 ఎకరాలకు సాగునీరు అందుతుంది. 420 మీటర్ల ఎడమ కాలువ ద్వారా తుమ్మల చెరువు నిండనుండగా, దాని కింద ఇప్పటికే ఉన్న 4,266 ఎకరాల పాత ఆయకట్టు స్థిరీకరణ కానుంది. మొత్తం 16,180 ఎకరాల్లో సుమారు 11 వేల ఎకరాలు కొత్త ఆయకట్టు కావడం విశేషం. తొలిదశలో 7 వేల ఎకరాలు ప్రధాన కాలువ పనులు ప్రస్తుతం టెండర్ దశలో ఉన్నాయి. అందుకే తొలిదశలో లిఫ్ట్ ద్వారా తుమ్మల చెరువుకు నీటిని తరలించి, ఆ చెరువు కింద 5 వేల ఎకరాలకు పైగా ఆయకట్టుకు సాగునీరు అందించనున్నారు. మరో 2 వేల ఎకరాలకు కూడా నీరందుతుంది. కాలువ పనులు పూర్తయితే మొత్తం 16,180 ఎకరాలకు నీరు అందుతుంది. తొమ్మిది గ్రామాలు, పది చెరువులకు లబ్ధి ఈ పథకం ద్వారా తొమ్మిది గ్రామాలు, పది చెరువులకు ప్రయోజనం చేకూరనుంది. అమెర్దాలో 1,877, అమ్మగారిపల్లిలో 958, అశ్వాపురంలో 2,474, గొందిగూడెంలో 8, కేశవాపురంలో 23, కుమ్మరిగూడెంలో 90, నెల్లిపాకలో 4,281 ఎకరాలకు సాగునీరు అందనుంది. మంత్రి తుమ్మల ప్రత్యేక శ్రద్ధ ప్రాజెక్టు ప్రతిపాదనల దశ నుంచి పనుల పురోగతి వరకు మంత్రి తుమ్మల ప్రత్యేక శ్రద్ధ చూపారు. పనుల పరిశీలనకు ఇప్పటివరకు అనేక సార్లు ప్రాజెక్టు వద్దకు వచ్చారు. అధికారులతో పలుమార్లు సమీక్షలు నిర్వహించి దిశానిర్దేశం చేశారు. ఆయన చొరవతో పనులు వేగంగా పూర్తయి ట్రయల్‌రన్ సఫలమైంది. ఎమ్మెల్యే పాయం పర్యవేక్షణ మంత్రి సూచనల మేరకు ఎమ్మెల్యే పాయం వెంకటేశ్వర్లు పనులను నిరంతరం పర్యవేక్షించారు. దాదాపు 20 రోజుల పాటు రేయింబవళ్లు ప్రాజెక్టు వద్దే ఉండి, ఎదురైన సమస్యలను అధికారుల దృష్టికి తీసుకెళ్లి పరిష్కరించారు. దీంతో నిర్దేశిత గడువులోగా ట్రయల్‌రన్ పూర్తయింది. రైతన్నల్లో హర్షం గోదావరి జలాలు కాలువల్లోకి చేరడంతో రైతులు ఆనందం వ్యక్తం చేస్తున్నారు. గోదావరి జలాలతో బీడు భూములు పచ్చని పొలాలుగా మారుతాయని ఆశాభావం వ్యక్తం చేస్తున్నారు1
- పెనుబల్లి మండలం లో గంగదేవిపాడు గ్రామంలో సరైన వర్షాలు లేకపోవడం వలన రైతుల ఎదుర్కొంటున్న ఇబ్బందులు మర్రికుంట చెరువులో నీరు లేక ఎండిపోయిన పరిస్థితి పంట పొలాలకు సరైన నీరు లేక ఆవేదన చెందుతున్న రైతులు ఆవేదన.. పెనుబల్లి మండలం ఖమ్మం జిల్లా లో గల గంగదేవిపాడు గ్రామంలో గల రైతుల పంట పొలాలకు పంట పొలాల మీద ఆధారపడే రైతులు ఈ సంవత్సరం మరికుంట చెరువు లో సరైన నీరు చేరక సరేనా వర్షాలు లేకపోవడం వలన చెరువు చుట్టూ ప్రక్కల ఉన్న రైతులు ఈ సంవత్సరము పంటలు పండుతాయో లేదో అన్న ఆందోళనతో రైతన్నలు ఆవేదన చెందుతున్నారు ఈ ప్రాంతంలో ఉన్న రైతులకు ప్రభుత్వమే ఆదుకొని వారికి సహాయం అందించాలని రైతులు ఆవేదన చెందుతున్నారు...4
- ఎన్టీఆర్ కాలనీలో అదరగొట్టిన ప్రభుత్వ పాఠశాల విద్యార్థినీలు ఖమ్మం జిల్లా సత్తుపల్లి ఎన్టీఆర్ కాలనీలో ప్రభుత్వ పాఠశాల విద్యార్థినీలు తమ ప్రతిభతో ఆకట్టుకున్నారు. సాంస్కృతిక కార్యక్రమాల్లో భాగంగా కేవలం మూడు రోజుల్లో నేర్చుకున్న నృత్యాలను ప్రదర్శించి.. మేమేమీ తక్కువ కాదు అంటూ ఆటపాటలతో అలరించారు. విద్యార్థినీల నృత్యాలను చూసిన స్థానికులు చప్పట్లతో వారిని అభినందిస్తూ ఉత్సాహపరిచారు. విద్యార్థినీల ప్రతిభకు ఉపాధ్యాయులు, తల్లిదండ్రులు కూడా హర్షం వ్యక్తం చేశారు. మరోవైపు స్థానిక ఉపాధ్యాయుడు నరసింహారావు విద్యార్థులకు చదువుతో పాటు ఆటపాటల్లోనూ శిక్షణ ఇస్తున్నారు. ఆన్‌లైన్ క్లాసులు నిర్వహిస్తూ.. విద్యార్థుల్లో సృజనాత్మకతను ప్రోత్సహిస్తున్నారు. చదువుతో పాటు ఆటపాటలు.. ప్రతిభకు ప్రోత్సాహం అనే విధంగా ప్రభుత్వ పాఠశాలను ముందుకు తీసుకెళ్తున్న నరసింహారావు ప్రయత్నాన్ని స్థానికులు అభినందిస్తున్నారు.3
- కన్నెగండ్లలో గణనాథుడికి ప్రత్యేక పూజలు. . . కన్నెగండ్లలో గణనాథుడికి ప్రత్యేక పూజలు. . పెదకూరపాడు. మండలం కన్నెగండ్ల గ్రామంలో సోమవారం గణనాథుడికి ప్రత్యేక పూజలు నిర్వహించారు. గణపతి ఆశీస్సులతో గ్రామాలు సుభిక్షంగా ఉండాలని భక్తులు ఆకాంక్షించారు. విఘ్నేశ్వరుడు తమ విఘ్నాలను తొలగించి కాపాడాలని ప్రార్థించారు. పూజల్లో భక్తులు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు. అనంతరం భక్తులకు తీర్థప్రసాదాలు పంపిణీ చేశారు.1
- జగన్ ఇంటి వద్ద వెటర్నరీ డాక్టర్ల నిరసన తాడేపల్లిలోని మాజీ సీఎం వైఎస్ జగన్ నివాసం వద్ద నిరుద్యోగ వెటర్నరీ డాక్టర్లు సోమవారం ఆందోళన చేపట్టారు. 164 వెటర్నరీ అసిస్టెంట్ సర్జన్ పోస్టుల భర్తీపై వైసీపీ తప్పుడు ప్రచారం చేస్తోందని వారు మండిపడ్డారు. గత వైసీపీ ప్రభుత్వ ఐదేళ్ల హయాంలో ఒక్క వెటర్నరీ అసిస్టెంట్ సర్జన్ పోస్టు కూడా భర్తీ చేయలేదని, ఇప్పుడు అనవసర రాద్ధాంతం చేస్తున్నారని నిరసనకారులు తీవ్రంగా విమర్శించారు.1
- ఒరాకిల్ లేఆఫ్స్ ఉద్యోగాలు కోల్పోయిన వారి ఆవేదన ⚡ వాడుకున్నంత కాలం వాడుకుని ఇష్టమొచ్చినట్లు ఉద్యోగాల్లోంచి తీసేస్తే తమ పరిస్థితి ఏంటని ఒరాకిల్ లేఆఫ్స్‌లో ఉద్యోగాలు కోల్పోయిన ఉద్యోగులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు.1
- పంటలు ఎండిపోతున్నాయని నీళ్లను అడిగినందుకు గల్లా పట్టుకుని రైతును ఈడ్చుకుని వెళ్తున్న పోలీసులు!1