Shuru
Apke Nagar Ki App…
భోగాపురం విమానాశ్రయం నుంచి ఎయిర్ ఇండియా ఫ్లైట్ షెడ్యూల్ విడుదల ప్రధాని నరేంద్రమోదీ శనివారం ప్రారంభించనున్న భోగాపురం ఎయిర్‌పోర్టులో ఆగస్టు 17 నుంచి విమానాల రాకపోకలు మొదలవుతాయి. ఈమేరకు ఎయిరిండియా ఫ్లైట్ అక్టోబర్ 24 వరకు షెడ్యూల్‌ను ప్రకటించింది. ఎయిర్ఇండియా విమానాలు హైదరాబాద్-భోగాపురం మధ్య రోజుకు 5 సర్వీసులు, బెంగళూరు-భోగాపురం మధ్య రోజుకు రెండు సర్వీసులతో పాటు, ఆది, శుక్రవారాలు మినహా మిగిలిన 5 రోజులు మూడో సర్వీసును నడుపుతామన్నారు. విజయవాడ-భోగాపురం మధ్య రోజుకు 4 సర్వీసులు నడపనున్నట్లు ఎయిరిండియా తెలియజేసింది.
Ramprasad Pothuganti
భోగాపురం విమానాశ్రయం నుంచి ఎయిర్ ఇండియా ఫ్లైట్ షెడ్యూల్ విడుదల ప్రధాని నరేంద్రమోదీ శనివారం ప్రారంభించనున్న భోగాపురం ఎయిర్‌పోర్టులో ఆగస్టు 17 నుంచి విమానాల రాకపోకలు మొదలవుతాయి. ఈమేరకు ఎయిరిండియా ఫ్లైట్ అక్టోబర్ 24 వరకు షెడ్యూల్‌ను ప్రకటించింది. ఎయిర్ఇండియా విమానాలు హైదరాబాద్-భోగాపురం మధ్య రోజుకు 5 సర్వీసులు, బెంగళూరు-భోగాపురం మధ్య రోజుకు రెండు సర్వీసులతో పాటు, ఆది, శుక్రవారాలు మినహా మిగిలిన 5 రోజులు మూడో సర్వీసును నడుపుతామన్నారు. విజయవాడ-భోగాపురం మధ్య రోజుకు 4 సర్వీసులు నడపనున్నట్లు ఎయిరిండియా తెలియజేసింది.
More news from తెలంగాణ and nearby areas
- పెద్ది సుదర్శన్ రెడ్డి అంత్యక్రియల్లో కన్నీళ్లు పెట్టుకున్న మాజీ మంత్రి హరీష్ రావు * వరంగల్ జిల్లా మాజీ ఎమ్మెల్యే పెద్ది సుదర్శన్ రెడ్డి, అంతిమయాత్రలో మాజీ మంత్రి హరీశ్ రావు కన్నీళ్లు పెట్టు కున్నారు. బీఆర్‌ఎస్ నాయకుల తో కలిసి అంతిమ యాత్రలో పాల్గొన్న ఆయన ఆప్త మిత్రుడితో ఉన్న అనుంబంధాన్ని గుర్తు చేసుకొని భావోద్వేగా నికి లోనై కన్నీటి పర్యంతమయ్యారు. కాగా, సుదర్శన్ రెడ్డికి తుది వీడ్కోలు పలికేందుకు వేలాది గా ప్రజలు నర్సంపేట కు తరలివచ్చారు. అభిమాన నాయకు డిని చివరిసారిగా చూసేందుకు జనం పోటెత్తడంతో పట్టణ మంతా జనసంద్రంగా మారింది. పెద్ది అంతిమయాత్ర సందర్భంగా ప్రధాన రహదారులపై సుమా రు రెండు కిలోమీటర్ల మేర ట్రాఫిక్ స్తంభించ గా, ఎటు చూసినా పెద్ది అభిమానులే కనిపించారు.పెద్ది సుదర్శన్ రెడ్డి పార్థివ దేహం వరంగల్ జిల్లాలోని నర్సంపేట కు చేరుకున్నప్పటి నుంచి పట్టణంలోని వీధులు జనంతో కిక్కిరిసిపోయాయి. చిన్నా,పెద్దా తేడా లేకుండా అన్ని వర్గాల ప్రజలు తమ అభిమాన నాయకు డికి చివరి వీడ్కోలు పలికేందుకు బారులు తీరారు.అభిమానుల రద్దీతో నర్సంపేట ప్రధాన రహదారులపై సుమారు రెండు కిలోమీటర్ల మేర ట్రాఫిక్1
- తమ అభిమాన నాయకుడి కోసం నర్సంపేట కన్నీటిపర్యంతం 😔 అడుగడుగునా అండగా నిలిచిన నాయకుడు పెద్ది సుదర్శన్ రెడ్డి గారిని ఆఖరిసారిగా చూస్తూ, గుండెలు పగిలేలా ఏడుస్తున్న ప్రజలు 😥 తమ అభిమాన నాయకుడి కోసం నర్సంపేట కన్నీటిపర్యంతం 😔 అడుగడుగునా అండగా నిలిచిన నాయకుడు పెద్ది సుదర్శన్ రెడ్డి గారిని ఆఖరిసారిగా చూస్తూ, గుండెలు పగిలేలా ఏడుస్తున్న ప్రజలు 😥1
- వరంగల్ జిల్లా: ప్రతి శుక్రవారం... పార్టీ లోని ఒక కుటుంబంతో కలిసి భోజనం, ఒక కార్యకర్తకు అండగా మొత్తం పార్టీ కుటుంబం!*❤️ *✊ ప్రతి శుక్రవారం... పార్టీ లోని ఒక కుటుంబంతో కలిసి భోజనం, ఒక కార్యకర్తకు అండగా మొత్తం పార్టీ కుటుంబం!*❤️ *మాధం రజినీ కుమార్ యాదవ్ గారి అధ్యక్షతన, పల్లెబోయిన అశోక్ ముదిరాజ్ గారి పర్యవేక్షణలో ప్రతి శుక్రవారం రాత్రి @8 PM నిర్వహిస్తున్న TRP డిన్నర్ హోమ్ మీట్ కార్యక్రమం నిజంగా ఆదర్శప్రాయమైనది.* *పార్టీలోని కార్యకర్తలు, నాయకులు ప్రతి వారం ఒక TRP కుటుంబం ఇంటికి వెళ్లి కలిసి భోజనం చేస్తూ, "మీ కుటుంబానికి మేమంతా అండగా ఉన్నాం" అనే భరోసాను కల్పిస్తున్నారు.* *ఇది కేవలం భోజన కార్యక్రమం కాదు... కుటుంబాల మధ్య అనుబంధాన్ని పెంచే, కార్యకర్తలో ఆత్మవిశ్వాసాన్ని నింపే ఉద్యమం.* *ఉమ్మడి వరంగల్ జిల్లాలోని ప్రతి TRP నాయకుడు, కార్యకర్త వెనుక ఇంత పెద్ద కుటుంబం అండగా ఉందనే ధైర్యంతో ముందుకు సాగుతున్నాడు.* *ఇదే TRP కుటుంబం... ఇదే కార్యకర్తకు ఇచ్చే గౌరవం... ఇదే ఐక్యతకు నిదర్శనం! 🔥✊*1
- ఖమ్మం కలెక్టరేట్ ముట్టడి చేసిన PDSU....ఉద్రిక్తత పరిస్థితి పెండింగ్ లో ఉన్న ఫీజు రియంబర్స్మెంట్, స్కాలర్షిప్స్, బెస్ట్ అవైలబుల్ స్కూల్స్ నిధులను విడుదల చేయాలని PDSU ఆధ్వర్యంలో శుక్రవారం ఖమ్మం కలెక్టరేట్ ని ముట్టడించారు. ముందుగా ప్రదర్శన ర్యాలీ నిర్వహించి, కలెక్టరేట్ లోపలికి వెళ్లేందుకు యత్నించగా పోలీసులు అడ్డుకొని అరెస్ట్ చేశారు. దీంతో అక్కడ కొంత ఉద్రిక్త నెలకొంది. జిల్లా అధ్యక్షుడు జి.మస్తాన్ మాట్లాడుతూ.. పెండింగ్ బకాయిలు వెంటనే విడుదల చేయాలని కోరారు.1
- ప్రభుత్వ పాఠశాలల సమస్యలపై వ్యవసాయ కార్మిక సంఘం, ఐద్వా ఆధ్వర్యంలో సర్వే బూర్గంపాడు మండల పరిధిలోని తాళ్లగొమ్మూరు పంచాయతీ ప్రభుత్వ పాఠశాలల్లో వ్యవసాయ కార్మిక సంఘం, ఐద్వా సంఘం ఆధ్వర్యంలో పాఠశాలల సమస్యలపై శుక్రవారం సర్వే నిర్వహించారు. తాళ్లగొమ్మూరు ప్రభుత్వ ప్రాథమిక పాఠశాలలో ఒక ఇన్‌చార్జి ప్రధానోపాధ్యాయురాలు, ముగ్గురు ఉపాధ్యాయులు, 31 మంది విద్యార్థులు ఉన్నట్లు గుర్తించారు. ఒకటో తరగతి నుంచి ఐదో తరగతి వరకు శాశ్వత ప్రధానోపాధ్యాయుడు లేకపోవడంతో విజయకుమారి ఇన్‌చార్జి హెడ్‌మిస్ట్రెస్‌గా విధులు నిర్వహిస్తున్నారని తెలిపారు. విద్యార్థులకు ఇప్పటివరకు పాఠశాల యూనిఫాంలు అందలేదని, త్వరలో కొత్త యూనిఫాంలు వస్తాయని ఆమె పేర్కొన్నారు.మధ్యాహ్న భోజన పథకం వర్కర్లు రాయల లక్ష్మి, మారం పుష్ప మాట్లాడుతూ తమకు నెలకు కేవలం రూ.3,000 మాత్రమే వేతనం అందుతోందని ఆవేదన వ్యక్తం చేశారు. వంటగది భవనాలు శిథిలావస్థలో ఉండటంతో వర్షాకాలంలో వర్షం పడుతున్నా అదే పరిస్థితుల్లో వంట చేసి విద్యార్థులకు భోజనం అందించాల్సి వస్తోందన్నారు.కోడిగుడ్డుకు ప్రభుత్వం రూ.6 మాత్రమే చెల్లిస్తుండగా, మార్కెట్ ధర రూ.9.50 ఉండటంతో ఒక్కో గుడ్డుపై రూ.3.50 తమ జేబు నుంచి భరించాల్సి వస్తోందని తెలిపారు. ఎన్నికల సమయంలో రూ.10,000 వేతనం ఇస్తామని హామీ ఇచ్చినప్పటికీ ప్రస్తుతం రూ.3,000 మాత్రమే ఇస్తున్నారని, అది కూడా ప్రతి నెల సకాలంలో అందడం లేదని వాపోయారు.గ్యాస్ ధరలు విపరీతంగా పెరిగాయని, పాఠశాలలో ఒక్క గ్యాస్ సిలిండర్ మాత్రమే ఉండటంతో అది అయిపోతే వెంటనే కొత్త సిలిండర్ అందడం లేదని, ప్రత్యామ్నాయంగా ఉపయోగించేందుకు కట్టెలు కూడా అందుబాటులో లేవని మధ్యాహ్న భోజన వర్కర్లు తెలిపారు.ఈ సర్వేలో వ్యవసాయ కార్మిక సంఘం జిల్లా కమిటీ సభ్యురాలు ఎస్.కే. అబీద, మండల కమిటీ సభ్యురాలు మరియమ్మ, సంఘం జిల్లా నాయకురాలు పాపినేని సరోజినీ ,మండల నాయకురాలు, కవులూరి నాగమణి ,మడకం లత, తదితరులు పాల్గొనడం జరిగింది3
- కన్నీటి సంద్రంలో మునిగిపోయిన నర్సంపేట 😔 తమ కష్టసుఖాల్లో తోడుగా నిలిచిన జననేత పెద్ది సుదర్శన్ రెడ్డి భౌతికకాయాన్ని చూసి గుండెలు పగిలేలా రోదిస్తున్న నర్సంపేట బిడ్డలు 😢 కన్నీటి సంద్రంలో మునిగిపోయిన నర్సంపేట 😔 తమ కష్టసుఖాల్లో తోడుగా నిలిచిన జననేత పెద్ది సుదర్శన్ రెడ్డి భౌతికకాయాన్ని చూసి గుండెలు పగిలేలా రోదిస్తున్న నర్సంపేట బిడ్డలు 😢1
- గోదావరిలో చిక్కుకున్న 60 మందిని సురక్షితంగా ఒడ్డుకు చేర్చిన అధికారులు చర్ల: మండలంలోని వీరాపురం వద్ద గోదావరిలో ఒక్కసారిగా వరద ఉద్ధృతి పెరగడంతో చిక్కుకున్న 60 మందిని అధికారులు జేసీబీల సహాయంతో సురక్షితంగా ఒడ్డుకు తరలించారు. విషయం తెలుసుకున్న తహసీల్దార్ శ్రీనివాస్, సీఐ రాజువర్మ, ఎస్‌ఐ నర్సిరెడ్డి, ఎంపీడీవో ఇదయ్య సిబ్బందితో సంఘటనా స్థలానికి చేరుకున్నారు. సీఐ రాజువర్మ, ఎస్‌ఐ నర్సిరెడ్డి తెప్పలతో గోదావరి దాటి వెళ్లి బాధితులను ఒడ్డుకు చేర్చారు.1