నాగర్ కర్నూల్ కలెక్టరేట్లో ఘనంగా బసవేశ్వరుని జయంతి వేడుకలు నాగర్‌కర్నూల్: సమాజంలోని కుల వివక్ష, లింగ భేదాలకు వ్యతిరేకంగా పోరాడిన గొప్ప అభ్యుదయవాది మహాత్మా బసవేశ్వరుడని ఎమ్మెల్యే డాక్టరు కూచుకుళ్ల రాజేష్ రెడ్డి కొనియాడారు. సోమవారం కలెక్టరేట్‌లో నిర్వహించిన బసవేశ్వరుని 893వ జయంతోత్సవంలో కలెక్టర్ బాదావత్ సంతోష్‌తో కలిసి ఆయన పాల్గొన్నారు. బసవేశ్వరుని చిత్రపటానికి పూలమాలలు వేసి నివాళులర్పించారు. 12వ శతాబ్దంలోనే లింగాయత ధర్మాన్ని స్థాపించి, సామాజిక సమానత్వం కోసం బసవన్న కృషి చేశారని ఎమ్మెల్యే స్మరించుకున్నారు.ఈ కార్యక్రమంలో మునిసిపల్ వైస్ చైర్మన్ బాదం రమేష్ , టౌన్ ప్రెసిడెంట్ జక్కా రాజు ,యూత్ కాంగ్రెస్ అధ్యక్షుడు వినోద్ ,డిసిసి కార్యదర్శి శ్రీనివాసులు ,సర్పంచ్ లు ,స్థానిక కౌన్సిలర్స్ ,జిల్లా గౌరవ అధ్యక్షుడు జెమిని సురేష్, జిల్లా ప్రెసిడెంట్ గిరిజ శంకర్, ప్రధాన కార్యదర్శి కెంచే రాజేష్, కోశాధికారి శంకర్ మమ్మాయిపల్లి రాజు, రవిశంకర్, రాజేష్ ప్రసాద్ వీరశైవ లింగాయత్ సభ్యులు పాల్గొన్నారు.స్థానిక నాయకులు తదితరులు పాల్గొన్నారు..

- మండలంలో ఎండలు నిప్పులు చెరుగుతున్నాయని, ప్రజలు తగు జాగ్రత్తలు పాటించాలని కోడేరు వైద్యాధికారి రాఘవేంద్ర తెలిపారు. 16 గ్రామ పంచాయతీల పరిధిలో తీవ్ర ఉష్ణోగ్రతలు నమోదవుతున్న నేపథ్యంలో ప్రజలు నీడపట్టునే ఉండాలని సూచించారు. దాహం వేయకున్నా తరచూ మంచినీరు తాగడం ద్వారా డీహైడ్రేషన్‌ను నివారించవచ్చన్నారు. వడదెబ్బ బారిన పడకుండా జాగ్రత్త పడాలని, lఅనారోగ్యంగా అనిపిస్తే కాలయాపన చేయకుండా వెంటనే డాక్టర్లను సంప్రదించాలని సూచించారు.1
- యాంకర్ వాయిస్: వీధి కుక్కల స్వైరవిహారం మరో పసి ప్రాణాన్ని బలితీసుకుంది. పెద్దపల్లి జిల్లా సుల్తానాబాద్ మండలం కాట్నపల్లిలో కుక్కల దాడిలో మూడేళ్ల చిన్నారి ప్రాణాలు కోల్పోయింది. తోటి పిల్లలతో ఆడుకుంటున్న సమయంలో కుక్కలు వెంటాడటంతో, భయంతో పొలం వైపు పరుగులు తీసిన చిన్నారిని కుక్కలు చుట్టుముట్టి చంపేశాయి. కాట్నపల్లిలోని BBI ఇటుక బట్టీ వద్ద ఒరిస్సాకు చెందిన వలస కార్మికులు సరస్వతి, భూబన్ దంపతులు నివాసముంటున్నారు. వీరికి మూడు సంవత్సరాల కుమార్తె దివ్య బెహరా ఉంది. ఈరోజు ఉదయం దివ్య మరో చిన్నారితో కలిసి ఆడుకుంటుండగా ఒక్కసారిగా కుక్కల మంద దాడి చేశాయి. భయపడిన మరో చిన్నారి ఇంటి వైపు పరిగెత్తి ప్రాణాలు దక్కించుకోగా, చిన్నారి దివ్య భయంతో పంట పొలాల వైపు పరుగులు తీసింది. దీంతో కుక్కలన్నీ బాలికను వెంబడించి చుట్టుముట్టాయి. ఒళ్లంతా పీక్కీతినడంతో బాలికకు తీవ్ర గాయాలయ్యాయి. గమనించిన తల్లిదండ్రులు వెంటనే సుల్తానాబాద్ ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. అయితే అప్పటికే చిన్నారి మృతి చెందినట్లు వైద్యులు ప్రకటించారు. కంటికి రెప్పలా కాపాడుకోవాల్సిన బిడ్డ, కళ్లముందే కుక్కల బారిన పడి విగతజీవిగా మారడంతో ఆ తల్లిదండ్రుల రోదనలు చూసి స్థానికులు కన్నీరు పెడుతున్నారు. జిల్లాలో కుక్కల బెడద విపరీతంగా పెరిగిపోయిందని, అధికారులు వెంటనే చర్యలు తీసుకోవాలని గ్రామస్తులు డిమాండ్ చేస్తున్నారు1
- రైతు భరోసా ఇప్పటివరకు రిలీజ్ కాలేదు. దానికి సంబంధించిన ఈ వీడియో ప్రస్తుతం ఈరోజు రైతు భరోసా విడుదల చేస్తామని ప్రభుత్వం తెలిపింది కానీ ఈ వీడియో అంతకుముందు షూట్ చేశాం.1
- ఆకాశంలో ఫైటింగ్ రైల్వే స్టేషన్లో రచ్చ.. కరెంట్ తీగలు ఎక్కి మరీ ఫైట్! "గురూజీ.. మీరు సరేనంటే ఆకాశంలోకి తీసుకెళ్లి కొడతా" అని ఓ మూవీలో డైలాగ్ చెప్పినట్టు ఛాలెంజ్ చేసుకున్నారేమో.. దారా చూసుకుందాం అంటూ కొందరు ఆకతాయిలు గొడవను నెక్స్ లెవల్కు తీసుకెళ్లారు. మహారాష్ట్రలోని మన్మాడ్ రైల్వే స్టేషన్లో కొందరు హై-టెన్షన్ తీగలు ఎక్కి కొట్టుకున్నారు. కిందకి దిగమని పోలీసులు హెచ్చరిస్తున్నా వినలేదు. దీంతో కాసేపు స్టేషన్లో హైడ్రామా నెలకొంది. విద్యుత్ సరఫరా నిలిపివేయడంతో ఎవరికీ ప్రాణహాని జరగలేదు.1
- జహీరాబాద్ నియోజకవర్గం లోని ప్రభుత్వ ఆసుపత్రిలో మెరుగైన మౌలిక సౌకర్యాలు కల్పించాలని వైద్య ఆరోగ్య శాఖ మంత్రి దామోదర రాజ నరసింహ ను కోరిన జహీరాబాద్ ఎమ్మెల్యే మాణిక్ రావు1
- Hi1
- బ్యూరో ఆఫ్ ఇండియన్ స్టాండర్డ్ అధికారులు సోమవారం నంద్యాలలో మహానంది జూవెలర్ దుకాణంలో తనిఖీలు చేశారు. ఆల్ మార్కు లేని 3 కేజీల బంగారు ఆభరణాలు సీజ్ చేశారు. తనిఖీలు నిర్వహిస్తున్నారని తెలిసి నంద్యాలలో ఉన్న అన్ని బంగారు దుకాణాలు మూసివేశారు.1
- తిరుపతి భాకరపేట ఘాట్ రోడ్డులో ప్రమాదం ఘాట్ రోడ్డులో లోయలోకి దూసుకెళ్లిన లారీ లోయలోకి దూసుకెళ్లడంతో బయటకు దూకేసిన డ్రైవర్ లారీలోని క్లీనర్ కు స్వల్ప గాయాలు....1