logo
Shuru
Apke Nagar Ki App…
  • Latest News
  • News
  • Politics
  • Elections
  • Viral
  • Astrology
  • Horoscope in Hindi
  • Horoscope in English
  • Latest Political News
logo
Shuru
Apke Nagar Ki App…

విలీనం చేయకుంటే ఈనెల 22 నుండి సమ్మె చేస్తాం... నర్సంపేట RTC డిపో జేఏసీ.... వరంగల్ జిల్లా, ఏప్రిల్ 17, నర్సంపేట: ఎన్నికల మేనిఫెస్టోలో ఇచ్చిన హామీ ప్రకారం కాంగ్రెస్ ప్రభుత్వం వెంటనే ఆర్టీసీని ప్రభుత్వంలో విలీనం చేయకుంటే ఈనెల 22 నుండి యధావిధిగా సమ్మె జరుగుతుందని ఆర్టీసీ నర్సంపేట డిపో జాయింట్ యాక్షన్ కమిటీ (జేఏసీ) ప్రకటించింది. సమ్మె సన్నాహక కార్యక్రమంలో భాగంగా ఆర్టీసీ వరంగల్ రీజియన్ జేఏసీ నాయకులు పాల్గొనగా శుక్రవారం జేఏసీ బ్యానర్ చేతబూని డిపో ప్రధాన ద్వారం వద్ద " ఆర్టీసీని ప్రభుత్వంలో విలీనం చేయాలి ", 2021, 2025 రెండు పీఆర్సీలను వెంటనే ప్రకటించాలి, సిద్ధం సిద్ధం... సమ్మెకు సిద్ధం" అని కార్మికులు పెద్ద ఎత్తున నినాదాలు చేశారు. ఈ సందర్భంగా నర్సంపేట డిపో జేఏసీ ముఖ్య నాయకుడు గొలనకొండ వేణు మాట్లాడుతూ... అసెంబ్లీ ఎన్నికల మేనిఫెస్టోలో పెట్టిన హామీలనే అమలు చేయాలని ప్రభుత్వాన్ని అడుగుతున్నామని ఆయన అన్నారు. గొంతెమ్మ కోరికలు కోరడం లేదని, 90 శాతం పూర్తయిన ఆర్టీసీ ప్రభుత్వ విలీనాన్ని రేవంత్ రెడ్డి ప్రభుత్వం అపాయింటెడ్ డేట్ ఎందుకు ప్రకటించడం లేదోనని ఆయన ప్రశ్నించారు. 28 నెలలు దాటినా కూడా ఆర్టీసీ కార్మికుల సమస్యలు ఎందుకు పరిష్కరించడం లేదని వేణు అన్నారు. కాంగ్రెస్ ఎజెండాలో లేని ఎన్నో సంక్షేమ పథకాలను అమలు చేస్తున్న సీఎం రేవంత్ రెడ్డి కార్మిక సమస్యలను ఎందుకు పరిష్కరించడం లేదని వేణు ప్రశ్నించారు. సమ్మె చేయాలనే ఉద్దేశం కార్మికులకు లేదని, సమ్మె నివారించవలసిన బాధ్యత ప్రభుత్వమే తీసుకోవాలని ఆయన అన్నారు. శ్రీకాంత్, పాలన్, రవి మాట్లాడుతూ... ఎన్ని కష్టాలు ఎదురైనా, చిన్న చిన్న తప్పులకు ఉద్యోగాలు పోతున్నా మహాలక్ష్మి పథకాన్ని విజయవంతంగా అమలు చేస్తున్న ఘనత ఆర్టీసీ కార్మికులకే చెందుతుందని వారన్నారు. పెండింగ్ లోనున్న రెండు పీఆర్సీలను కూడా అమలు చేసి కార్మిక కుటుంబాలకు న్యాయం చేయాలని వారు కోరారు. ఈ కార్యక్రమంలో వరంగల్ రీజియన్ శ్రీనివాస్, ఓరుగంటి కొమ్మాలు, శంకరయ్య, ఏడీసీలు రఘువీర్, ఆకుల స్వామి, మంచిక మల్లికార్జున్, బొడిగె రాజు, బత్తుల శ్రీనివాస్, వేమునూరి గణేష్, బూర ప్రవీణ్ కుమార్, మంద రాజు, శ్రీలత, రాజేశ్వరి, సాంబయ్య, చారీ పెద్ద ఎత్తున పాల్గొన్నారు.

21 hrs ago
user_Venkatgoud kallepu
Venkatgoud kallepu
Press advisory రైపర్తి, వరంగల్, తెలంగాణ•
21 hrs ago
79b1d4c1-53ad-416d-80f5-35c7b7b0ac25

విలీనం చేయకుంటే ఈనెల 22 నుండి సమ్మె చేస్తాం... నర్సంపేట RTC డిపో జేఏసీ.... వరంగల్ జిల్లా, ఏప్రిల్ 17, నర్సంపేట: ఎన్నికల మేనిఫెస్టోలో ఇచ్చిన హామీ ప్రకారం కాంగ్రెస్ ప్రభుత్వం వెంటనే ఆర్టీసీని ప్రభుత్వంలో విలీనం చేయకుంటే ఈనెల 22 నుండి యధావిధిగా సమ్మె జరుగుతుందని ఆర్టీసీ నర్సంపేట డిపో జాయింట్ యాక్షన్ కమిటీ (జేఏసీ) ప్రకటించింది. సమ్మె సన్నాహక కార్యక్రమంలో భాగంగా ఆర్టీసీ వరంగల్ రీజియన్ జేఏసీ నాయకులు పాల్గొనగా శుక్రవారం జేఏసీ బ్యానర్ చేతబూని డిపో ప్రధాన ద్వారం వద్ద " ఆర్టీసీని ప్రభుత్వంలో విలీనం చేయాలి ", 2021, 2025 రెండు పీఆర్సీలను వెంటనే ప్రకటించాలి, సిద్ధం సిద్ధం... సమ్మెకు సిద్ధం" అని కార్మికులు పెద్ద ఎత్తున నినాదాలు చేశారు. ఈ సందర్భంగా నర్సంపేట డిపో జేఏసీ ముఖ్య నాయకుడు గొలనకొండ వేణు మాట్లాడుతూ... అసెంబ్లీ ఎన్నికల మేనిఫెస్టోలో పెట్టిన హామీలనే అమలు చేయాలని ప్రభుత్వాన్ని అడుగుతున్నామని ఆయన అన్నారు. గొంతెమ్మ కోరికలు కోరడం లేదని, 90 శాతం పూర్తయిన ఆర్టీసీ ప్రభుత్వ విలీనాన్ని రేవంత్ రెడ్డి ప్రభుత్వం అపాయింటెడ్ డేట్ ఎందుకు ప్రకటించడం లేదోనని ఆయన ప్రశ్నించారు. 28 నెలలు దాటినా కూడా ఆర్టీసీ కార్మికుల సమస్యలు ఎందుకు పరిష్కరించడం లేదని వేణు అన్నారు. కాంగ్రెస్ ఎజెండాలో లేని ఎన్నో సంక్షేమ పథకాలను అమలు చేస్తున్న సీఎం రేవంత్ రెడ్డి కార్మిక సమస్యలను ఎందుకు పరిష్కరించడం లేదని వేణు ప్రశ్నించారు. సమ్మె చేయాలనే ఉద్దేశం కార్మికులకు లేదని, సమ్మె నివారించవలసిన బాధ్యత ప్రభుత్వమే తీసుకోవాలని ఆయన అన్నారు. శ్రీకాంత్, పాలన్, రవి మాట్లాడుతూ... ఎన్ని కష్టాలు ఎదురైనా, చిన్న చిన్న తప్పులకు ఉద్యోగాలు పోతున్నా మహాలక్ష్మి పథకాన్ని విజయవంతంగా అమలు చేస్తున్న ఘనత ఆర్టీసీ కార్మికులకే చెందుతుందని వారన్నారు. పెండింగ్ లోనున్న రెండు పీఆర్సీలను కూడా అమలు చేసి కార్మిక కుటుంబాలకు న్యాయం చేయాలని వారు కోరారు. ఈ కార్యక్రమంలో వరంగల్ రీజియన్ శ్రీనివాస్, ఓరుగంటి కొమ్మాలు, శంకరయ్య, ఏడీసీలు రఘువీర్, ఆకుల స్వామి, మంచిక మల్లికార్జున్, బొడిగె రాజు, బత్తుల శ్రీనివాస్, వేమునూరి గణేష్, బూర ప్రవీణ్ కుమార్, మంద రాజు, శ్రీలత, రాజేశ్వరి, సాంబయ్య, చారీ పెద్ద ఎత్తున పాల్గొన్నారు.

More news from తెలంగాణ and nearby areas
  • వర్దన్నపేట (వరంగల్ జిల్లా): ప్రజా పాలన - ప్రగతి ప్రణాళికలో భాగంగా వర్దన్నపేట మండలం కొత్తపల్లి క్రాస్ రోడ్డులోని జాతీయ రహదారి (NH-563) పై వర్దన్నపేట పోలీసులు రోడ్డు ప్రమాదాల నివారణపై అవగాహన కార్యక్రమం నిర్వహించారు. ఈ సందర్భంగా అధికారులు డెమో ప్రమాదాన్ని సృష్టించి, ప్రమాదం జరిగిన వెంటనే తీసుకోవాల్సిన జాగ్రత్తలు, బాధితులకు అందించాల్సిన ప్రాథమిక సహాయంపై ప్రజలకు వివరించారు. కార్యక్రమంలో ACP, CI, SIలతో పాటు హైవే, R&B మరియు MVI అధికారులు పాల్గొని యువతకు రోడ్డు భద్రతపై అవగాహన కల్పించారు.
    1
    వర్దన్నపేట (వరంగల్ జిల్లా):
ప్రజా పాలన - ప్రగతి ప్రణాళికలో భాగంగా వర్దన్నపేట మండలం కొత్తపల్లి క్రాస్ రోడ్డులోని జాతీయ రహదారి (NH-563) పై వర్దన్నపేట పోలీసులు రోడ్డు ప్రమాదాల నివారణపై అవగాహన కార్యక్రమం నిర్వహించారు.
ఈ సందర్భంగా అధికారులు డెమో ప్రమాదాన్ని సృష్టించి, ప్రమాదం జరిగిన వెంటనే తీసుకోవాల్సిన జాగ్రత్తలు, బాధితులకు అందించాల్సిన ప్రాథమిక సహాయంపై ప్రజలకు వివరించారు.
కార్యక్రమంలో ACP, CI, SIలతో పాటు హైవే, R&B మరియు MVI అధికారులు పాల్గొని యువతకు రోడ్డు భద్రతపై అవగాహన కల్పించారు.
    user_Mediya wgl medical wgl
    Mediya wgl medical wgl
    Doctor రైపర్తి, వరంగల్, తెలంగాణ•
    23 hrs ago
  • జయశంకర్ భూపాలపల్లి జిల్లా మేడిగడ్డ లక్ష్మీ బ్యారేజీని ఉమ్మడి వరంగల్ జిల్లా బీఆర్ఎస్ పార్టీ నాయకులు సందర్శించారు. మాజీ మంత్రి ఎర్రబెల్లి దయాకర్ రావు, మాజీ ఎంపీ మాలోత్ కవిత, మాజీ ఎమ్మెల్యేలు ఆరూరి రమేష్, వినయ్ భాస్కర్, గండ్ర వెంకటరమణ రెడ్డి, తాటికొండ రాజయ్య, శంకర్ నాయక్, పుట్ట మధు తదితరులు బ్యారేజీలో కుంగిన పిల్లర్లను పరిశీలించారు. ఈ సందర్భంగా ఎర్రబెల్లి దయాకర్ రావు మాట్లాడుతూ రేవంత్ రెడ్డి ప్రభుత్వం కాళేశ్వరం ప్రాజెక్టును నిర్లక్ష్యం చేస్తోందని విమర్శించారు. మరమ్మతులు చేపట్టకుండా రైతులను ఇబ్బందులకు గురి చేస్తున్నారని ఆరోపించారు. సన్న వడ్లకు బోనస్, రైతు బంధు కూడా అమలు కావడం లేదని అన్నారు. కాళేశ్వరం ప్రాజెక్టుతో రాష్ట్రానికి నీటి భరోసా లభించిందని, ప్రపంచ స్థాయి ప్రాజెక్టుగా గుర్తింపు పొందిందని తెలిపారు. ఈ ప్రభుత్వంపై ప్రజలు, అధికారులు నమ్మకం కోల్పోయారని, త్వరలోనే ప్రజలు బుద్ధి చెబుతారని వ్యాఖ్యానించారు.
    1
    జయశంకర్ భూపాలపల్లి జిల్లా మేడిగడ్డ లక్ష్మీ బ్యారేజీని ఉమ్మడి వరంగల్ జిల్లా బీఆర్ఎస్ పార్టీ నాయకులు సందర్శించారు. మాజీ మంత్రి ఎర్రబెల్లి దయాకర్ రావు, మాజీ ఎంపీ మాలోత్ కవిత, మాజీ ఎమ్మెల్యేలు ఆరూరి రమేష్, వినయ్ భాస్కర్, గండ్ర వెంకటరమణ రెడ్డి, తాటికొండ రాజయ్య, శంకర్ నాయక్, పుట్ట మధు తదితరులు బ్యారేజీలో కుంగిన పిల్లర్లను పరిశీలించారు.
ఈ సందర్భంగా ఎర్రబెల్లి దయాకర్ రావు మాట్లాడుతూ రేవంత్ రెడ్డి ప్రభుత్వం కాళేశ్వరం ప్రాజెక్టును నిర్లక్ష్యం చేస్తోందని విమర్శించారు. మరమ్మతులు చేపట్టకుండా రైతులను ఇబ్బందులకు గురి చేస్తున్నారని ఆరోపించారు. సన్న వడ్లకు బోనస్, రైతు బంధు కూడా అమలు కావడం లేదని అన్నారు.
కాళేశ్వరం ప్రాజెక్టుతో రాష్ట్రానికి నీటి భరోసా లభించిందని, ప్రపంచ స్థాయి ప్రాజెక్టుగా గుర్తింపు పొందిందని తెలిపారు. ఈ ప్రభుత్వంపై ప్రజలు, అధికారులు నమ్మకం కోల్పోయారని, త్వరలోనే ప్రజలు బుద్ధి చెబుతారని వ్యాఖ్యానించారు.
    user_M D Azizuddin
    M D Azizuddin
    జర్నలిస్ట్ వర్ధన్నపేట, వరంగల్, తెలంగాణ•
    2 hrs ago
  • ప్రజల సమస్యలను పరిష్కరించడానికి గ్రామాలకే స్వయంగా వస్తానని రాష్ట్ర సాంఘిక సంక్షేమ శాఖ మంత్రి అడ్లూరి లక్ష్మణ్ కుమార్ తెలిపారు. ధర్మారం మండల కేంద్రంలోని వ్యవసాయ మార్కెట్‌లో సుమారు 2 కోట్లతో చేపట్టిన అభివృద్ధి కార్యక్రమాలకు మంత్రి లక్ష్మణ్ కుమార్ జిల్లా కలెక్టర్ కోయ శ్రీహర్షతో కలిసి శంకుస్థాపన చేసి, ధాన్యం కొనుగోలు కేంద్రాన్ని ప్రారంభించారు. ధర్మారం మండలంలోని అన్ని గ్రామాల్లో మౌలిక సదుపాయాల కల్పనకు కృషి చేస్తున్నామని తెలిపారు. గ్రామాల అభివృద్ధికి ప్రత్యేక నిధులు ఇవ్వడానికి ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి హామీ ఇచ్చారని చెప్పారు. విద్యార్థులకు సాంకేతిక విద్య అందించేందుకు ఎర్రగుంటపల్లిలో అడ్వాన్స్ టెక్నాలజీ సెంటర్ ఏర్పాటు చేస్తున్నట్లు మంత్రి వివరించారు. ధర్మారం మండల కేంద్రంలోని ఎస్టీ మినీ గురుకుల పాఠశాలను పదవ తరగతి వరకు అప్‌గ్రేడ్ చేసి, 75 శాతం ట్రైబల్ విద్యార్థులకు, 25 శాతం ఇతర వర్గాలకు సీట్లు కేటాయిస్తామని తెలిపారు. మండల కేంద్రంలో మినీ స్టేడియం ఏర్పాటు చర్యలు తీసుకుంటున్నామని, ఇది యువతకు క్రీడల్లో ప్రోత్సాహం కలిగిస్తుందని మంత్రి పేర్కొన్నారు. పార్టీలకు అతీతంగా నియోజకవర్గ అభివృద్ధి లక్ష్యంగా ముందుకు సాగుతున్నామని మంత్రి తెలిపారు. ప్రజలు తమ సమస్యల పరిష్కారం కోసం హైదరాబాద్ వెళ్లాల్సిన అవసరం లేకుండా వారంలో మూడు రోజుల పాటు నియోజకవర్గంలో పర్యటిస్తూ సమస్యలు పరిష్కరిస్తానని హామీ ఇచ్చారు. ప్రభుత్వం ఏర్పాటు చేసిన ధాన్యం కొనుగోలు కేంద్రాలను రైతులు సద్వినియోగం చేసుకోవాలని మంత్రి కోరారు. మొక్కజొన్న రైతులు ఆందోళన చెందాల్సిన అవసరం లేదని, అవసరమైతే ధర్మారం మండల కేంద్రంలో కూడా మక్కజొన్న కొనుగోలు కేంద్రం ఏర్పాటు చేస్తామని తెలిపారు.
    1
    ప్రజల సమస్యలను పరిష్కరించడానికి గ్రామాలకే స్వయంగా వస్తానని రాష్ట్ర సాంఘిక సంక్షేమ శాఖ మంత్రి అడ్లూరి లక్ష్మణ్ కుమార్ తెలిపారు. ధర్మారం మండల కేంద్రంలోని వ్యవసాయ మార్కెట్‌లో సుమారు 2 కోట్లతో చేపట్టిన అభివృద్ధి కార్యక్రమాలకు మంత్రి లక్ష్మణ్ కుమార్ జిల్లా కలెక్టర్ కోయ శ్రీహర్షతో కలిసి శంకుస్థాపన చేసి, ధాన్యం కొనుగోలు కేంద్రాన్ని ప్రారంభించారు. ధర్మారం మండలంలోని అన్ని గ్రామాల్లో మౌలిక సదుపాయాల కల్పనకు కృషి చేస్తున్నామని తెలిపారు.
గ్రామాల అభివృద్ధికి ప్రత్యేక నిధులు ఇవ్వడానికి ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి హామీ ఇచ్చారని చెప్పారు. విద్యార్థులకు సాంకేతిక విద్య అందించేందుకు ఎర్రగుంటపల్లిలో అడ్వాన్స్ టెక్నాలజీ సెంటర్ ఏర్పాటు చేస్తున్నట్లు మంత్రి వివరించారు. ధర్మారం మండల కేంద్రంలోని ఎస్టీ మినీ గురుకుల పాఠశాలను పదవ తరగతి వరకు అప్‌గ్రేడ్ చేసి, 75 శాతం ట్రైబల్ విద్యార్థులకు, 25 శాతం ఇతర వర్గాలకు సీట్లు కేటాయిస్తామని తెలిపారు.
మండల కేంద్రంలో మినీ స్టేడియం ఏర్పాటు చర్యలు తీసుకుంటున్నామని, ఇది యువతకు క్రీడల్లో ప్రోత్సాహం కలిగిస్తుందని మంత్రి పేర్కొన్నారు.
పార్టీలకు అతీతంగా నియోజకవర్గ అభివృద్ధి లక్ష్యంగా ముందుకు సాగుతున్నామని మంత్రి తెలిపారు. ప్రజలు తమ సమస్యల పరిష్కారం కోసం హైదరాబాద్ వెళ్లాల్సిన అవసరం లేకుండా వారంలో మూడు రోజుల పాటు నియోజకవర్గంలో పర్యటిస్తూ సమస్యలు పరిష్కరిస్తానని హామీ ఇచ్చారు.
ప్రభుత్వం ఏర్పాటు చేసిన ధాన్యం కొనుగోలు కేంద్రాలను రైతులు సద్వినియోగం చేసుకోవాలని మంత్రి కోరారు. మొక్కజొన్న రైతులు ఆందోళన చెందాల్సిన అవసరం లేదని, అవసరమైతే ధర్మారం మండల కేంద్రంలో కూడా మక్కజొన్న కొనుగోలు కేంద్రం ఏర్పాటు చేస్తామని తెలిపారు.
    user_K.V.REDDY
    K.V.REDDY
    చిగురుమామిడి, కరీంనగర్, తెలంగాణ•
    11 min ago
  • ఉమ్మడి వరంగల్ జిల్లా BRS పార్టీ ప్రతినిధులతో కలిసి మేడిగడ్డ బ్యారేజినీ సందర్శించిన. మహబూబాబాద్ మాజీ ఎంపీ. మాలోత్ కవిత మేడి గడ్డ మరమ్మత్తు పనులను పూర్తి చేసి రైతులకు సాగు తాగు తాగునీరు అందించాలని డిమాండ్ చేశారు జగిత్యాలలో కేసీఆర్ సభ నుండి ప్రజల దృష్టి మరల్చేందుకే సీఎం రేవంత్ రెడ్డి మేడిగడ్డ పర్యటన చేపట్టారని అన్నారు ఈ కార్యక్రమంలో మాజీమంత్రి ఎర్రబెల్లి దయాకర్ రావు ఉమ్మడి వరంగల్ జిల్లా సీనియర్ బీఆర్ఎస్ నేతలు పాల్గొన్నారు
    1
    ఉమ్మడి వరంగల్ జిల్లా BRS పార్టీ ప్రతినిధులతో కలిసి మేడిగడ్డ బ్యారేజినీ సందర్శించిన. మహబూబాబాద్ మాజీ ఎంపీ. మాలోత్ కవిత 
మేడి గడ్డ మరమ్మత్తు పనులను పూర్తి చేసి రైతులకు సాగు తాగు తాగునీరు అందించాలని డిమాండ్ చేశారు జగిత్యాలలో కేసీఆర్ సభ నుండి ప్రజల దృష్టి మరల్చేందుకే సీఎం రేవంత్ రెడ్డి మేడిగడ్డ పర్యటన చేపట్టారని అన్నారు ఈ కార్యక్రమంలో మాజీమంత్రి ఎర్రబెల్లి దయాకర్ రావు ఉమ్మడి వరంగల్ జిల్లా సీనియర్ బీఆర్ఎస్ నేతలు పాల్గొన్నారు
    user_Mogulagani Mahendar Mogulagani Mahendar
    Mogulagani Mahendar Mogulagani Mahendar
    మహబూబాబాద్, మహబూబాబాద్, తెలంగాణ•
    2 hrs ago
  • ఎంపీ కడియం కావ్యగారు మాట్లాడుతూ ఉమెన్ రిజర్వేషన్ గత కాంగ్రెస్ హయాంలోనే జరిగింది 2004లో కూడా అమలు చేయాలని నరేంద్ర మోడీని ప్రశ్నించడం జరిగింది
    1
    ఎంపీ కడియం కావ్యగారు మాట్లాడుతూ ఉమెన్ రిజర్వేషన్ గత కాంగ్రెస్ హయాంలోనే జరిగింది 2004లో కూడా అమలు చేయాలని నరేంద్ర మోడీని ప్రశ్నించడం జరిగింది
    user_Meenakshi construction Civil c
    Meenakshi construction Civil c
    లింగాలఘన్‌పూర్, జనగాం, తెలంగాణ•
    22 hrs ago
  • Devi
    5
    Devi
    user_Devi
    Devi
    బచ్చన్నపేట, జనగాం, తెలంగాణ•
    1 hr ago
  • సాధన సురుల ఇంద్రజాల విన్యాసాలు... గన్నేరువరం మండల కేంద్రంలో పద్మశాలి సంఘం ఆధ్వర్యంలో సాధనసురుల ఇంద్రజాల విన్యాసాలు. సాధన సూర్యుల విన్యాసాలలో శత్రువుల నుండి మనం ఎలా రక్షించుకోవాలో కర్రతో కళాకారులు చేసిన విన్యాసాలు. అలాగే మట్టి తో మాణిక్యాలు తయారు చేసి రాళ్లతో దేవుళ్లను తయారు చేసి ప్రజలను ఆశ్చర్యపరుస్తున్న ఇంద్రజాల విన్యాసాలకు మండల కేంద్రంలో చప్పట్ల కేరింతల మధ్యన విన్యాసాలు చేశారు చివరిలో దయ్యం గెటప్తో అందర్నీ ఆశ్చర్యపరిచారు..
    1
    సాధన సురుల  ఇంద్రజాల విన్యాసాలు...
గన్నేరువరం మండల కేంద్రంలో పద్మశాలి సంఘం ఆధ్వర్యంలో  సాధనసురుల ఇంద్రజాల విన్యాసాలు.
సాధన సూర్యుల విన్యాసాలలో శత్రువుల నుండి మనం ఎలా రక్షించుకోవాలో కర్రతో కళాకారులు చేసిన విన్యాసాలు. అలాగే మట్టి తో మాణిక్యాలు తయారు చేసి రాళ్లతో దేవుళ్లను తయారు చేసి ప్రజలను ఆశ్చర్యపరుస్తున్న ఇంద్రజాల విన్యాసాలకు మండల కేంద్రంలో చప్పట్ల కేరింతల మధ్యన విన్యాసాలు చేశారు చివరిలో దయ్యం గెటప్తో అందర్నీ ఆశ్చర్యపరిచారు..
    user_Vodnala thirupthi
    Vodnala thirupthi
    గన్నేరువరం, కరీంనగర్, తెలంగాణ•
    21 hrs ago
  • వరంగల్ జిల్లా:రాయపర్తి మండల కేంద్రంలో భారతీయ జనతా పార్టీ ఆధ్వర్యంలో ప్రతిపక్ష నేత రాహుల్ గాంధీ దిష్టిబొమ్మను దహనం చేశారు. మహిళల అభ్యున్నతి కోసం కేంద్ర ప్రభుత్వం ప్రవేశపెట్టిన 33 శాతం మహిళా రిజర్వేషన్ బిల్లును కాంగ్రెస్, ఇండీ కూటమి నేతలు అడ్డుకోవడాన్ని నిరసిస్తూ ఈ కార్యక్రమం నిర్వహించారు. ఈ సందర్భంగా బీజేపీ రాయపర్తి మండల అధ్యక్షుడు నూనె అనిల్ యాదవ్ మాట్లాడుతూ, మహిళల ఆత్మగౌరవాన్ని దెబ్బతీసే విధంగా కాంగ్రెస్ పార్టీ వ్యవహరించిందని ఆరోపించారు. మహిళా రిజర్వేషన్ బిల్లును అడ్డుకోవడం దేశ చరిత్రలో నల్ల దినంగా నిలుస్తుందని పేర్కొన్నారు. మహిళలకు చట్టసభల్లో ప్రాతినిధ్యం కల్పించేందుకు ప్రధాని నరేంద్ర మోడీ నేతృత్వంలోని కేంద్ర ప్రభుత్వం ప్రయత్నాలు చేస్తుండగా, కాంగ్రెస్ పార్టీ దానిని అడ్డుకుని మహిళా ద్రోహం చేసిందని విమర్శించారు. వెంటనే కాంగ్రెస్, ఇండీ కూటమి నేతలు క్షమాపణలు చెప్పాలని ఆయన డిమాండ్ చేశారు. మహిళా లోకం ఏకమై కాంగ్రెస్ పార్టీని దేశంలో నుండి తరిమికొట్టాలని పిలుపునిచ్చారు. ఈ కార్యక్రమంలో జిల్లా నాయకులు వడ్లకొండ రవి, గడ్డం నరేందర్, రావుల అనిల్, మైస మహేందర్, మందపూరి రాజు, బూరుగు నవీన్, వీరబ్రహ్మం, గోరంట్ల ప్రభాకర్, చిర్ర నాగరాజు, పెండ్యాల గణేష్, మంచాల సుమన్ యాదవ్, బండారి దినేష్, జక్కుల సందీప్ యాదవ్, సిద్దు రాకేష్ తదితరులు పాల్గొన్నారు.
    1
    వరంగల్ జిల్లా:రాయపర్తి మండల కేంద్రంలో భారతీయ జనతా పార్టీ ఆధ్వర్యంలో ప్రతిపక్ష నేత రాహుల్ గాంధీ దిష్టిబొమ్మను దహనం చేశారు. మహిళల అభ్యున్నతి కోసం కేంద్ర ప్రభుత్వం ప్రవేశపెట్టిన 33 శాతం మహిళా రిజర్వేషన్ బిల్లును కాంగ్రెస్, ఇండీ కూటమి నేతలు అడ్డుకోవడాన్ని నిరసిస్తూ ఈ కార్యక్రమం నిర్వహించారు.
ఈ సందర్భంగా బీజేపీ రాయపర్తి మండల అధ్యక్షుడు నూనె అనిల్ యాదవ్ మాట్లాడుతూ, మహిళల ఆత్మగౌరవాన్ని దెబ్బతీసే విధంగా కాంగ్రెస్ పార్టీ వ్యవహరించిందని ఆరోపించారు. మహిళా రిజర్వేషన్ బిల్లును అడ్డుకోవడం దేశ చరిత్రలో నల్ల దినంగా నిలుస్తుందని పేర్కొన్నారు.
మహిళలకు చట్టసభల్లో ప్రాతినిధ్యం కల్పించేందుకు ప్రధాని నరేంద్ర మోడీ నేతృత్వంలోని కేంద్ర ప్రభుత్వం ప్రయత్నాలు చేస్తుండగా, కాంగ్రెస్ పార్టీ దానిని అడ్డుకుని మహిళా ద్రోహం చేసిందని విమర్శించారు. వెంటనే కాంగ్రెస్, ఇండీ కూటమి నేతలు క్షమాపణలు చెప్పాలని ఆయన డిమాండ్ చేశారు.
మహిళా లోకం ఏకమై కాంగ్రెస్ పార్టీని దేశంలో నుండి తరిమికొట్టాలని పిలుపునిచ్చారు.
ఈ కార్యక్రమంలో జిల్లా నాయకులు వడ్లకొండ రవి, గడ్డం నరేందర్, రావుల అనిల్, మైస మహేందర్, మందపూరి రాజు, బూరుగు నవీన్, వీరబ్రహ్మం, గోరంట్ల ప్రభాకర్, చిర్ర నాగరాజు, పెండ్యాల గణేష్, మంచాల సుమన్ యాదవ్, బండారి దినేష్, జక్కుల సందీప్ యాదవ్, సిద్దు రాకేష్ తదితరులు పాల్గొన్నారు.
    user_M D Azizuddin
    M D Azizuddin
    జర్నలిస్ట్ వర్ధన్నపేట, వరంగల్, తెలంగాణ•
    5 hrs ago
View latest news on Shuru App
Download_Android
  • Terms & Conditions
  • Career
  • Privacy Policy
  • Blogs
Shuru, a product of Close App Private Limited.