logo
Shuru
Apke Nagar Ki App…
  • Latest News
  • News
  • Politics
  • Elections
  • Viral
  • Astrology
  • Horoscope in Hindi
  • Horoscope in English
  • Latest Political News
logo
Shuru
Apke Nagar Ki App…

అంగన్ వాడిల సమస్యలను అసెంబ్లీలో ప్రస్తావించాలని ఎమ్మెల్యే కి వినతి నెరడిగొండ : మండల అంగన్ వాడి అసోసియేషన్ సభ్యులు బోథ్ ఎమ్మెల్యే అనిల్ జాదవ్ ని మర్యాద పూర్వకంగా కలిసి కాంగ్రెస్ ప్రభుత్వం ఎన్నికల సమయంలో మేనిఫెస్టోలో ఇచ్చిన హామీలను నెరవేర్చాలని అంగన్ వాడిల తరపున అసెంబ్లీలో ప్రస్తావించాలని వినతిపత్రం అందజేశారు.ఈ సందర్భంగా ఎమ్మెల్యే అనిల్ జాదవ్ మాట్లాడుతూ.. అంగన్ వాడిలకు న్యాయం జరిగేంత వరకు బీఆర్ఎస్ పార్టీ తరపున అండగా ఉంటామని,కాంగ్రెస్ పార్టీ ఎన్నికల మేనిఫెస్టోలో ఇచ్చిన హామీ ప్రకారం 1. ప్రి ప్రైమరిని అంగన్ వాడిల ద్వారానే నడిపించాలని. 2. కనీస వేతనం రూ. 26,000/- చెల్లించాలని, 3. రిటైర్మెంట్ టీచర్లకు 2 లక్షలు, ఆయాలకు 1 లక్ష చెల్లించాలని డిమాండ్లను నెరవేర్చాలని అన్నారు.

3 hrs ago
user_AlluriMahesh
AlluriMahesh
Local News Reporter Neradigonda, Adilabad•
3 hrs ago

అంగన్ వాడిల సమస్యలను అసెంబ్లీలో ప్రస్తావించాలని ఎమ్మెల్యే కి వినతి నెరడిగొండ : మండల అంగన్ వాడి అసోసియేషన్ సభ్యులు బోథ్ ఎమ్మెల్యే అనిల్ జాదవ్ ని మర్యాద పూర్వకంగా కలిసి కాంగ్రెస్ ప్రభుత్వం ఎన్నికల సమయంలో మేనిఫెస్టోలో ఇచ్చిన హామీలను నెరవేర్చాలని అంగన్ వాడిల తరపున అసెంబ్లీలో ప్రస్తావించాలని వినతిపత్రం అందజేశారు.ఈ సందర్భంగా ఎమ్మెల్యే అనిల్ జాదవ్ మాట్లాడుతూ.. అంగన్ వాడిలకు న్యాయం జరిగేంత వరకు బీఆర్ఎస్ పార్టీ తరపున అండగా ఉంటామని,కాంగ్రెస్ పార్టీ ఎన్నికల మేనిఫెస్టోలో ఇచ్చిన హామీ ప్రకారం 1. ప్రి ప్రైమరిని అంగన్ వాడిల ద్వారానే నడిపించాలని. 2. కనీస వేతనం రూ. 26,000/- చెల్లించాలని, 3. రిటైర్మెంట్ టీచర్లకు 2 లక్షలు, ఆయాలకు 1 లక్ష చెల్లించాలని డిమాండ్లను నెరవేర్చాలని అన్నారు.

More news from తెలంగాణ and nearby areas
  • మ్యాదరిపేటలో విషాదం: ఇనుప స్టాండ్‌కు తగిలిన హైఓల్టేజ్ వైర్లు.. ఒకరు సజీవ దహనం, మరొకరు అక్కడికక్కడే మృతి. ​ మంచిర్యాల జిల్లా దండేపల్లి మండలం మ్యాదరిపేట గ్రామంలో సోమవారం ఒక పెను విషాదం చోటుచేసుకుంది. పని నిమిత్తం వెళ్ళిన ఇద్దరు యువకులను విద్యుత్ రూపంలో మృత్యువు కబళించింది. హైఓల్టేజ్ విద్యుత్ తీగలు తగలడంతో ఒక యువకుడు కళ్లెదుటే మంటల్లో కాలిపోగా, మరొకరు తీవ్రమైన షాక్‌తో ప్రాణాలు విడిచారు. ​అసలేం జరిగింది? ​స్థానికుల కథనం ప్రకారం.. మ్యాదరిపేటలోని ఇండియన్ పెట్రోల్ బంక్ సమీపంలో ఒక భారీ ఇనుప స్టాండ్ ఉంది. మ్యాదరిపేటకు చెందిన సల్ల లక్ష్మీనారాయణ (ఎడ్డన్న), వెల్గనూర్ గ్రామానికి చెందిన చందనగిరి నాగరాజు ఆ స్టాండ్‌ను రోడ్డుపై నుంచి జరుపుతున్నారు. అయితే, పైన తక్కువ ఎత్తులో వేలాడుతున్న హైఓల్టేజ్ విద్యుత్ మెయిన్ లైన్లను వారు గమనించలేదు. ​ఆ ఇనుప స్టాండ్ ఒక్కసారిగా విద్యుత్ తీగలకు తగలడంతో భారీ స్థాయిలో కరెంట్ ప్రవహించింది. ఈ క్రమంలో: ​సజీవ దహనం: విద్యుత్ తీవ్రత ఏ స్థాయిలో ఉందంటే.. స్టాండ్‌ను పట్టుకుని ఉన్న లక్ష్మీనారాయణ శరీరం ఒక్కసారిగా మంటల్లో చిక్కుకుంది. అందరూ చూస్తుండగానే ఆయన సజీవ దహనమయ్యాడు. ​అక్కడికక్కడే మృతి: మరో యువకుడు నాగరాజు తీవ్ర విద్యుదాఘాతానికి గురై అక్కడికక్కడే కుప్పకూలి ప్రాణాలు కోల్పోయాడు. ​గ్రామాల్లో మిన్నంటిన రోదనలు ​చేతికొచ్చిన కొడుకులు కళ్లెదుటే విగతజీవులుగా పడి ఉండటంతో మృతుల కుటుంబ సభ్యుల ఆర్తనాదాలు అక్కడి వారిని కలచివేశాయి. మ్యాదరిపేట, వెల్గనూర్ గ్రామాల్లో విషాద ఛాయలు అలుముకున్నాయి. సమాచారం అందిన వెంటనే పోలీసులు, విద్యుత్ శాఖాధికారులు ఘటనా స్థలానికి చేరుకుని వివరాలు సేకరించారు. ​"విద్యుత్ అధికారుల నిర్లక్ష్యం వల్లే ఈ ఘోరం జరిగింది. వైర్లు తక్కువ ఎత్తులో వేలాడుతున్నా పట్టించుకోకపోవడం వల్లే ఇద్దరు యువకులు బలైపోయారు." > — స్థానికుల ఆవేదన ​విచారణ చేపట్టిన పోలీసులు ​ఈ ఘటనపై పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు ప్రారంభించారు. మృతదేహాలను పోస్టుమార్టం నిమిత్తం ఆసుపత్రికి తరలించారు. విద్యుత్ శాఖ అధికారుల నిర్లక్ష్యంపై విచారణ జరిపి బాధ్యులపై చర్యలు తీసుకోవాలని మృతుల బంధువులు డిమాండ్ చేస్తున్నారు.
    1
    మ్యాదరిపేటలో విషాదం: ఇనుప స్టాండ్‌కు తగిలిన హైఓల్టేజ్ వైర్లు.. ఒకరు సజీవ దహనం, మరొకరు అక్కడికక్కడే మృతి.
​
మంచిర్యాల జిల్లా దండేపల్లి మండలం మ్యాదరిపేట గ్రామంలో సోమవారం ఒక పెను విషాదం చోటుచేసుకుంది. పని నిమిత్తం వెళ్ళిన ఇద్దరు యువకులను విద్యుత్ రూపంలో మృత్యువు కబళించింది. హైఓల్టేజ్ విద్యుత్ తీగలు తగలడంతో ఒక యువకుడు కళ్లెదుటే మంటల్లో కాలిపోగా, మరొకరు తీవ్రమైన షాక్‌తో ప్రాణాలు విడిచారు.
​అసలేం జరిగింది?
​స్థానికుల కథనం ప్రకారం.. మ్యాదరిపేటలోని ఇండియన్ పెట్రోల్ బంక్ సమీపంలో ఒక భారీ ఇనుప స్టాండ్ ఉంది. మ్యాదరిపేటకు చెందిన సల్ల లక్ష్మీనారాయణ (ఎడ్డన్న), వెల్గనూర్ గ్రామానికి చెందిన చందనగిరి నాగరాజు ఆ స్టాండ్‌ను రోడ్డుపై నుంచి జరుపుతున్నారు. అయితే, పైన తక్కువ ఎత్తులో వేలాడుతున్న హైఓల్టేజ్ విద్యుత్ మెయిన్ లైన్లను వారు గమనించలేదు.
​ఆ ఇనుప స్టాండ్ ఒక్కసారిగా విద్యుత్ తీగలకు తగలడంతో భారీ స్థాయిలో కరెంట్ ప్రవహించింది. ఈ క్రమంలో:
​సజీవ దహనం: విద్యుత్ తీవ్రత ఏ స్థాయిలో ఉందంటే.. స్టాండ్‌ను పట్టుకుని ఉన్న లక్ష్మీనారాయణ శరీరం ఒక్కసారిగా మంటల్లో చిక్కుకుంది. అందరూ చూస్తుండగానే ఆయన సజీవ దహనమయ్యాడు.
​అక్కడికక్కడే మృతి: మరో యువకుడు నాగరాజు తీవ్ర విద్యుదాఘాతానికి గురై అక్కడికక్కడే కుప్పకూలి ప్రాణాలు కోల్పోయాడు.
​గ్రామాల్లో మిన్నంటిన రోదనలు
​చేతికొచ్చిన కొడుకులు కళ్లెదుటే విగతజీవులుగా పడి ఉండటంతో మృతుల కుటుంబ సభ్యుల ఆర్తనాదాలు అక్కడి వారిని కలచివేశాయి. మ్యాదరిపేట, వెల్గనూర్ గ్రామాల్లో విషాద ఛాయలు అలుముకున్నాయి. సమాచారం అందిన వెంటనే పోలీసులు, విద్యుత్ శాఖాధికారులు ఘటనా స్థలానికి చేరుకుని వివరాలు సేకరించారు.
​"విద్యుత్ అధికారుల నిర్లక్ష్యం వల్లే ఈ ఘోరం జరిగింది. వైర్లు తక్కువ ఎత్తులో వేలాడుతున్నా పట్టించుకోకపోవడం వల్లే ఇద్దరు యువకులు బలైపోయారు." > — స్థానికుల ఆవేదన
​విచారణ చేపట్టిన పోలీసులు
​ఈ ఘటనపై పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు ప్రారంభించారు. మృతదేహాలను పోస్టుమార్టం నిమిత్తం ఆసుపత్రికి తరలించారు. విద్యుత్ శాఖ అధికారుల నిర్లక్ష్యంపై విచారణ జరిపి బాధ్యులపై చర్యలు తీసుకోవాలని మృతుల బంధువులు డిమాండ్ చేస్తున్నారు.
    user_తుడుం జితేందర్
    తుడుం జితేందర్
    Local News Reporter జన్నారం, మంచిర్యాల, తెలంగాణ•
    21 hrs ago
  • सोमवार को दांडेपल्ली मंडल के मेदिरिपेट में एक पेट्रोल पंप से भारी लोहे का स्टैंड हटाते समय 11 kV बिजली की लाइन से टकराने के बाद ड्राइवर नागराजू और दिहाड़ी मजदूर नारायण की मौके पर ही मौत हो गई। इस दिल दहला देने वाली घटना का वीडियो फुटेज अब जारी किया गया है।
    1
    सोमवार को दांडेपल्ली मंडल के मेदिरिपेट में एक पेट्रोल पंप से भारी लोहे का स्टैंड हटाते समय 11 kV बिजली की लाइन से टकराने के बाद ड्राइवर नागराजू और दिहाड़ी मजदूर नारायण की मौके पर ही मौत हो गई। इस दिल दहला देने वाली घटना का वीडियो फुटेज अब जारी किया गया है।
    user_Ramesh Solanki
    Ramesh Solanki
    स्वतंत्र पत्रकार Asifabad, Kumuram Bheem Asifabad•
    16 hrs ago
  • తెలంగాణ యునైటెడ్ ఎలక్ట్రిసిటీ ఎంప్లాయిస్ యూనియన్ సిఐటియు ఆధ్వర్యంలో సిరిసిల్లలో సెస్ విద్యుత్ కార్మికుల 72 గంటల విధులు బహిష్కరణ. తమ న్యాయమైన డిమాండ్లను పరిష్కరించాలని కోరుతూ విధులు బహిష్కరించి సెస్ కార్యాలయం ఆవరణలో నిరసన తెలుపుతున్న విద్యుత్ కార్మికులు.
    1
    తెలంగాణ యునైటెడ్ ఎలక్ట్రిసిటీ ఎంప్లాయిస్ యూనియన్ సిఐటియు ఆధ్వర్యంలో సిరిసిల్లలో సెస్ విద్యుత్ కార్మికుల 72 గంటల విధులు బహిష్కరణ.
తమ న్యాయమైన డిమాండ్లను పరిష్కరించాలని కోరుతూ విధులు బహిష్కరించి సెస్ కార్యాలయం ఆవరణలో నిరసన తెలుపుతున్న విద్యుత్ కార్మికులు.
    user_Satheesh gangu
    Satheesh gangu
    జర్నలిస్ట్ సిరిసిల్ల, రాజన్న సిరిసిల్ల, తెలంగాణ•
    3 hrs ago
  • పత్రికా ప్రకటన తేది:10.03.2026 కామారెడ్డి జిల్లా మంగళవారం త్రైమాసిక తనిఖీలో భాగంగా మంగళవారం జిల్లా కలెక్టర్ ఆశిష్ సంగ్వాన్ జిల్లా కేంద్రంలోని ఈవీఎం (EVM) గోదాంను తనిఖీ చేశారు. ఈ సందర్భంగా జిల్లా కలెక్టర్ అదనపు కలెక్టర్ విక్టర్, వివిధ రాజకీయ పార్టీల ప్రతినిధులతో కలసి గోదాంలో భద్రపరిచిన ఈవీఎం యంత్రాల భద్రతా ఏర్పాట్లు పరిశీలించారు. సీసీ కెమెరాలు, ఫైర్ సేఫ్టీ ఏర్పాట్లు భద్రతా నిబంధనల అమలు గురించి అధికారులను అడిగి తెలుసుకున్నారు. గోదాంలో ఉన్న రికార్డులను పరిశీలించి, భద్రతా ప్రమాణాలను కచ్చితంగా పాటించాలని అధికారులకు సూచించారు. ఎన్నికల సామగ్రి భద్రతపై ఎప్పటికప్పుడు అప్రమత్తంగా ఉండాలని, సంబంధిత అధికారులు నిబంధనలను పూర్తిగా అమలు చేయాలని జిల్లా కలెక్టర్ సూచించారు. ఈ కార్యక్రమంలో అదనపు కలెక్టర్ విక్టర్, RDO వీణ, MRO హిమబిందు, వివిధ రాజకీయ పార్టీల ప్రతినిధులు, సంబంధిత అధికారులు , తదితరులు పాల్గొన్నారు.
    1
    పత్రికా ప్రకటన
తేది:10.03.2026
కామారెడ్డి జిల్లా మంగళవారం
త్రైమాసిక తనిఖీలో భాగంగా మంగళవారం జిల్లా కలెక్టర్ ఆశిష్ సంగ్వాన్ జిల్లా కేంద్రంలోని ఈవీఎం (EVM) గోదాంను తనిఖీ చేశారు.
ఈ సందర్భంగా జిల్లా కలెక్టర్ అదనపు కలెక్టర్ విక్టర్, వివిధ రాజకీయ పార్టీల ప్రతినిధులతో కలసి గోదాంలో భద్రపరిచిన ఈవీఎం యంత్రాల భద్రతా ఏర్పాట్లు పరిశీలించారు.
సీసీ కెమెరాలు, ఫైర్ సేఫ్టీ ఏర్పాట్లు భద్రతా నిబంధనల అమలు గురించి అధికారులను అడిగి తెలుసుకున్నారు. గోదాంలో ఉన్న రికార్డులను పరిశీలించి, భద్రతా ప్రమాణాలను కచ్చితంగా పాటించాలని అధికారులకు సూచించారు.
ఎన్నికల సామగ్రి భద్రతపై ఎప్పటికప్పుడు అప్రమత్తంగా ఉండాలని, సంబంధిత అధికారులు నిబంధనలను పూర్తిగా అమలు చేయాలని జిల్లా కలెక్టర్ సూచించారు. ఈ కార్యక్రమంలో  అదనపు కలెక్టర్ విక్టర్, RDO వీణ, MRO హిమబిందు, వివిధ రాజకీయ పార్టీల ప్రతినిధులు, సంబంధిత అధికారులు , తదితరులు పాల్గొన్నారు.
    user_Narmala Swapna
    Narmala Swapna
    Tour operator నాగారెడ్డిపేట్, కామారెడ్డి, తెలంగాణ•
    21 hrs ago
  • అంబేద్కర్ రాజ్యాంగాన్ని అవమానిస్తున్న బీజేపీ – పార్లమెంట్‌లో ప్రతిపక్ష గొంతును అణిచివేస్తున్నారు: ఎంపీ గడ్డం వంశీకృష్ణ పార్లమెంట్ ప్రజల సభగా పనిచేయాలని, అక్కడ ప్రజల సమస్యలపై స్వేచ్ఛగా చర్చ జరగాల్సిన అవసరం ఉందని పెద్దపల్లి ఎంపీ గడ్డం వంశీకృష్ణ అన్నారు. ప్రస్తుతం పార్లమెంట్‌లో ప్రతిపక్ష సభ్యులకు మాట్లాడే అవకాశం ఇవ్వకుండా బీజేపీ ప్రభుత్వం వ్యవహరిస్తోందని ఆయన విమర్శించారు. భారత రాజ్యాంగ నిర్మాత బి.ర్.అంబేద్కర్ రూపొందించిన రాజ్యాంగాన్ని గౌరవించడం ప్రతి ప్రభుత్వ బాధ్యత అని ఆయన చెప్పారు. రాజ్యాంగంలోని ఆర్టికల్ 95, 96 ప్రకారం లోక్‌సభలో డిప్యూటీ స్పీకర్ తప్పనిసరిగా ఉండాలని స్పష్టంగా ఉన్నప్పటికీ, బీజేపీ ప్రభుత్వం ఇప్పటివరకు డిప్యూటీ స్పీకర్‌ను నియమించకపోవడం రాజ్యాంగానికి అవమానమని గడ్డం వంశీకృష్ణ పేర్కొన్నారు. ఇది ముఖ్యంగా దళితులు మరియు బలహీన వర్గాల హక్కులను నిర్లక్ష్యం చేస్తున్నట్టే అని ఆయన అన్నారు. దేశంలో కోట్లాది మంది ప్రజలు ప్రతిపక్ష పార్టీలను ఎన్నుకుని పార్లమెంట్‌కు పంపించినప్పటికీ, వారి గొంతును వినిపించకుండా అడ్డుకోవడం ప్రజాస్వామ్యానికి విరుద్ధమని ఆయన తెలిపారు. గత రెండు సంవత్సరాలుగా స్పీకర్ ఓం బిర్లా ప్రతిపక్ష సభ్యులను పలుమార్లు అడ్డుకోవడం సరైంది కాదని ఆయన విమర్శించారు. ప్రతిపక్ష నాయకుడు రాహుల్ గాంధీ జాతీయ భద్రత మరియు ఇతర ముఖ్యమైన అంశాలపై మాట్లాడే సమయంలో కూడా మైక్ కట్ చేయడం ప్రజాస్వామ్యానికి మంచిది కాదని అన్నారు. బీజేపీ ప్రభుత్వం పార్లమెంట్‌ను ఒక పార్టీ సభలా మార్చే ప్రయత్నం చేస్తోందని, ఇది ప్రజాస్వామ్యానికి ప్రమాదకరమని ఎంపీ గడ్డం వంశీకృష్ణ అన్నారు. డాక్టర్ అంబేద్కర్ రూపొందించిన రాజ్యాంగ విలువలను కాపాడాల్సిన బాధ్యత అందరిపై ఉందని ఆయన తెలిపారు. దేశ ప్రయోజనాలకు సంబంధించిన ముఖ్యమైన అంశాలపై పార్లమెంట్‌లో స్వేచ్ఛగా చర్చ జరగాలని ఆయన డిమాండ్ చేశారు.
    1
    అంబేద్కర్ రాజ్యాంగాన్ని అవమానిస్తున్న బీజేపీ – పార్లమెంట్‌లో ప్రతిపక్ష గొంతును అణిచివేస్తున్నారు: ఎంపీ గడ్డం వంశీకృష్ణ
పార్లమెంట్ ప్రజల సభగా పనిచేయాలని, అక్కడ ప్రజల సమస్యలపై స్వేచ్ఛగా చర్చ జరగాల్సిన అవసరం ఉందని పెద్దపల్లి ఎంపీ గడ్డం వంశీకృష్ణ అన్నారు. ప్రస్తుతం పార్లమెంట్‌లో ప్రతిపక్ష సభ్యులకు మాట్లాడే అవకాశం ఇవ్వకుండా బీజేపీ ప్రభుత్వం వ్యవహరిస్తోందని ఆయన విమర్శించారు.
భారత రాజ్యాంగ నిర్మాత బి.ర్.అంబేద్కర్ రూపొందించిన రాజ్యాంగాన్ని గౌరవించడం ప్రతి ప్రభుత్వ బాధ్యత అని ఆయన చెప్పారు. రాజ్యాంగంలోని ఆర్టికల్ 95, 96 ప్రకారం లోక్‌సభలో డిప్యూటీ స్పీకర్ తప్పనిసరిగా ఉండాలని స్పష్టంగా ఉన్నప్పటికీ, బీజేపీ ప్రభుత్వం ఇప్పటివరకు డిప్యూటీ స్పీకర్‌ను నియమించకపోవడం రాజ్యాంగానికి అవమానమని గడ్డం వంశీకృష్ణ పేర్కొన్నారు.
ఇది ముఖ్యంగా దళితులు మరియు బలహీన వర్గాల హక్కులను నిర్లక్ష్యం చేస్తున్నట్టే అని ఆయన అన్నారు. దేశంలో కోట్లాది మంది ప్రజలు ప్రతిపక్ష పార్టీలను ఎన్నుకుని పార్లమెంట్‌కు పంపించినప్పటికీ, వారి గొంతును వినిపించకుండా అడ్డుకోవడం ప్రజాస్వామ్యానికి విరుద్ధమని ఆయన తెలిపారు.
గత రెండు సంవత్సరాలుగా స్పీకర్ ఓం బిర్లా ప్రతిపక్ష సభ్యులను పలుమార్లు అడ్డుకోవడం సరైంది కాదని ఆయన విమర్శించారు. ప్రతిపక్ష నాయకుడు రాహుల్ గాంధీ జాతీయ భద్రత మరియు ఇతర ముఖ్యమైన అంశాలపై మాట్లాడే సమయంలో కూడా మైక్ కట్ చేయడం ప్రజాస్వామ్యానికి మంచిది కాదని అన్నారు.
బీజేపీ ప్రభుత్వం పార్లమెంట్‌ను ఒక పార్టీ సభలా మార్చే ప్రయత్నం చేస్తోందని, ఇది ప్రజాస్వామ్యానికి ప్రమాదకరమని ఎంపీ గడ్డం వంశీకృష్ణ అన్నారు. డాక్టర్ అంబేద్కర్ రూపొందించిన రాజ్యాంగ విలువలను కాపాడాల్సిన బాధ్యత అందరిపై ఉందని ఆయన తెలిపారు.
దేశ ప్రయోజనాలకు సంబంధించిన ముఖ్యమైన అంశాలపై పార్లమెంట్‌లో స్వేచ్ఛగా చర్చ జరగాలని ఆయన డిమాండ్ చేశారు.
    user_RAJESH KUMAR (GODsSON)
    RAJESH KUMAR (GODsSON)
    Social Media Manager మంచిర్యాల, మంచిర్యాల, తెలంగాణ•
    15 hrs ago
  • రాజన్న సిరిసిల్ల జిల్లా కేంద్రంలో విద్యుత్ కార్మికులు 72 గంటల విధులు బహిష్కరణ చేపట్టారు. ఎలక్ట్రిసిటీ ఎంప్లాయిస్ యూనియన్ (సీఐటీయూ) ఆధ్వర్యంలో తమ న్యాయమైన డిమాండ్లను పరిష్కరించాలని కోరుతూ ఈ నిరసన కార్యక్రమాన్ని నిర్వహిస్తున్నారు.
    1
    రాజన్న సిరిసిల్ల జిల్లా కేంద్రంలో విద్యుత్ కార్మికులు 72 గంటల విధులు బహిష్కరణ చేపట్టారు. ఎలక్ట్రిసిటీ ఎంప్లాయిస్ యూనియన్ (సీఐటీయూ) ఆధ్వర్యంలో తమ న్యాయమైన డిమాండ్లను పరిష్కరించాలని కోరుతూ ఈ నిరసన కార్యక్రమాన్ని నిర్వహిస్తున్నారు.
    user_ఉమ్మడి కరీంనగర్ జిల్లా న్యూస్
    ఉమ్మడి కరీంనగర్ జిల్లా న్యూస్
    జర్నలిస్ట్ కరీంనగర్ రూరల్, కరీంనగర్, తెలంగాణ•
    2 hrs ago
  • బజార్ హత్నూర్ మండలంలోని గంగాపూర్ గ్రామంలో నూతనంగా నిర్మించిన శ్రీ హనుమంతుని ఆలయంలో విగ్రహ ప్రతిష్టాపన కార్యక్రమానికి ముఖ్యఅతిథిగా బోథ్ ఎమ్మెల్యే అనిల్ జాదవ్ హాజరై ఆలయంలో ప్రత్యేక పూజలు నిర్వహించి శిఖర ఆవిష్కరణ వీక్షించారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే అనిల్ జాదవ్ మాట్లాడుతూ.. తెలంగాణలో కేసీఆర్ పథకం అందని ఇండ్లు లేదని హనుమంతుని గుడి లేని ఊరు లేదని గ్రామానికి అండగా ప్రతీ గ్రామంలో హనుమంతుని గుడి ఉంటుందని ఈరోజు గంగాపూర్ గ్రామం చిన్న గ్రామమైన భక్తి శ్రద్ధలతో గ్రామంలో అద్భుతమైన హనుమాన్ ఆలయాన్ని నిర్మించడం గొప్ప విషయమని ఆలస్యంగా కట్టిన గంగాపూర్ గ్రామస్తులు అద్భుతంగా నిర్మించారని,కలియుగంలో గ్రామాలు బాగుండాలని కలిని తొక్కడానికే ఆంజనేయ స్వామిగా శివుడు అవతరించారని తెలిపారు. ఈ కార్యక్రమంలో మండల నాయకులు కార్యకర్తలు తదితరులు పాల్గొన్నారు.
    2
    బజార్ హత్నూర్ మండలంలోని గంగాపూర్ గ్రామంలో నూతనంగా నిర్మించిన శ్రీ హనుమంతుని ఆలయంలో విగ్రహ ప్రతిష్టాపన కార్యక్రమానికి ముఖ్యఅతిథిగా బోథ్ ఎమ్మెల్యే అనిల్ జాదవ్ హాజరై ఆలయంలో ప్రత్యేక పూజలు నిర్వహించి శిఖర ఆవిష్కరణ వీక్షించారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే అనిల్ జాదవ్ మాట్లాడుతూ.. తెలంగాణలో కేసీఆర్ పథకం అందని ఇండ్లు లేదని హనుమంతుని గుడి లేని ఊరు లేదని గ్రామానికి అండగా ప్రతీ గ్రామంలో హనుమంతుని గుడి ఉంటుందని ఈరోజు గంగాపూర్ గ్రామం చిన్న గ్రామమైన భక్తి శ్రద్ధలతో గ్రామంలో అద్భుతమైన హనుమాన్ ఆలయాన్ని నిర్మించడం గొప్ప విషయమని ఆలస్యంగా కట్టిన గంగాపూర్ గ్రామస్తులు అద్భుతంగా నిర్మించారని,కలియుగంలో గ్రామాలు బాగుండాలని కలిని తొక్కడానికే ఆంజనేయ స్వామిగా శివుడు అవతరించారని తెలిపారు. ఈ కార్యక్రమంలో మండల నాయకులు కార్యకర్తలు తదితరులు పాల్గొన్నారు.
    user_AlluriMahesh
    AlluriMahesh
    Local News Reporter Bazarhatnoor, Adilabad•
    58 min ago
  • పత్రిక ప్రకటన తేది:10.03.2026 కామారెడ్డి జిల్లా మంగళవారం కొత్త డ్రెయిన్ చివర సోక్‌పిట్ ఏర్పాటు పనులకు భూమి పూజ చేసిన జిల్లా కలెక్టర్ ఆశిష్ సాంగ్వాన్ మంగళవారం కామారెడ్డి జిల్లా మాచారెడ్డి మండలం లో పలు కార్యక్రమాలలో పాల్గొని పరిశీలించారు. ప్రజా పాలన ప్రగతి ప్రణాళిక కార్యక్రమంలో భాగంగా మాచరెడ్డి మండలంలో నిర్వహించిన పలు కార్యక్రమాలలో జిల్లా కలెక్టర్ ఆశిష్ సంగ్వాన్ పాల్గొని గ్రామంలో చేపడుతున్న అభివృద్ధి కార్యక్రమాలను పరిశీలించి అధికారులకు అవసరమైన సూచనలు చేశారు. గ్రామంలో పారిశుధ్య కార్యక్రమాలు, మురికి కాలువలు, వీధుల శుభ్రపరిచే పనులు, బ్లీచింగ్ పౌడర్ చల్లడం వంటి చర్యలను పరిశీలించారు. అదేవిధంగా ఎన్‌ఆర్‌ఈజీఎస్ పథకం కింద కొత్త డ్రెయిన్ చివర సోక్‌పిట్ ఏర్పాటు పనులకు మార్కింగ్ కు కొబ్బరికాయలు కొట్టి భూమి పూజ చేశారు. ఈ పనికి సుమారు రూ. 92 వేల వ్యయం అంచనా వేయడం జరిగిందని, గ్రామంలోని అయ్యవారి గుట్టం సమీపంలో ఉన్న పనికిరాని బోర్‌వెల్‌ను మూసివేయడం కూడా ఈ సందర్భంగా నిర్వహించారు. గ్రామాల్లో పారిశుధ్యం, మౌలిక సదుపాయాల మెరుగుదలపై అధికారులు ప్రత్యేక దృష్టి పెట్టాలని జిల్లా కలెక్టర్ సూచించారు. 99 రోజుల ప్రణాళికలో రోజు వారి కార్యక్రమాలను పకడ్బందీగా నిర్వహించాలని, ఈ కార్యక్రమం లో అందరూ భాగస్వాములు కావాలని అన్నారు. ఈ కార్యక్రమం లో dpo మురళీ, dlpo శ్రీనివాస్, MRO, సరళ, మండల అధికారులు, సిబ్బంది పాల్గొన్నారు.
    1
    పత్రిక ప్రకటన
తేది:10.03.2026
కామారెడ్డి జిల్లా మంగళవారం
కొత్త డ్రెయిన్ చివర సోక్‌పిట్ ఏర్పాటు పనులకు భూమి పూజ చేసిన జిల్లా కలెక్టర్ ఆశిష్ సాంగ్వాన్ 
మంగళవారం కామారెడ్డి జిల్లా మాచారెడ్డి మండలం లో పలు కార్యక్రమాలలో పాల్గొని పరిశీలించారు.
ప్రజా పాలన ప్రగతి ప్రణాళిక కార్యక్రమంలో భాగంగా మాచరెడ్డి మండలంలో నిర్వహించిన పలు కార్యక్రమాలలో జిల్లా కలెక్టర్  ఆశిష్ సంగ్వాన్ పాల్గొని  గ్రామంలో చేపడుతున్న అభివృద్ధి కార్యక్రమాలను పరిశీలించి అధికారులకు అవసరమైన సూచనలు చేశారు. గ్రామంలో పారిశుధ్య కార్యక్రమాలు, మురికి కాలువలు,  వీధుల శుభ్రపరిచే పనులు, బ్లీచింగ్ పౌడర్ చల్లడం వంటి చర్యలను పరిశీలించారు.
అదేవిధంగా ఎన్‌ఆర్‌ఈజీఎస్ పథకం కింద కొత్త డ్రెయిన్ చివర సోక్‌పిట్ ఏర్పాటు పనులకు మార్కింగ్ కు కొబ్బరికాయలు కొట్టి భూమి పూజ చేశారు.
ఈ పనికి సుమారు రూ. 92 వేల వ్యయం అంచనా వేయడం జరిగిందని, 
గ్రామంలోని అయ్యవారి గుట్టం సమీపంలో ఉన్న పనికిరాని బోర్‌వెల్‌ను మూసివేయడం కూడా ఈ సందర్భంగా నిర్వహించారు.
గ్రామాల్లో పారిశుధ్యం, మౌలిక సదుపాయాల మెరుగుదలపై అధికారులు ప్రత్యేక దృష్టి పెట్టాలని జిల్లా కలెక్టర్ సూచించారు. 99 రోజుల ప్రణాళికలో  రోజు వారి కార్యక్రమాలను  పకడ్బందీగా నిర్వహించాలని, ఈ కార్యక్రమం లో అందరూ భాగస్వాములు కావాలని అన్నారు. ఈ కార్యక్రమం లో dpo మురళీ, dlpo శ్రీనివాస్, MRO, సరళ, మండల అధికారులు, సిబ్బంది పాల్గొన్నారు.
    user_Narmala Swapna
    Narmala Swapna
    Tour operator నాగారెడ్డిపేట్, కామారెడ్డి, తెలంగాణ•
    21 hrs ago
  • తంగళ్లపల్లి మండలం 11వ ప్యాకేజీ కింద ఎల్ ఎం -6, ఎల్ ఎం -4 కెనాల్ పనులను వెంటనే పూర్తి చేయాలని డిమాండ్ చేస్తూ తంగళ్లపల్లి మండల రైతులు ధర్నా చేపట్టారు. సిరిసిల్ల - తంగళ్లపల్లి మానేరు వాగు బ్రిడ్జిపై ధర్నా, రాస్తారోకో నిర్వహించారు. ఈ ధర్నాకు బిజెపి జిల్లా అధ్యక్షులు రెడ్డబోయిన గోపి, నాయకులు మద్దతు పలికి ధర్నాలో పాల్గొన్నారు. ఈ సంధర్బంగా బిజెపి జిల్లా అధ్యక్షులు రెడ్డబోయిన గోపి మాట్లాడారు.
    1
    తంగళ్లపల్లి మండలం 11వ ప్యాకేజీ కింద ఎల్ ఎం -6, ఎల్ ఎం -4 కెనాల్ పనులను వెంటనే   పూర్తి చేయాలని డిమాండ్ చేస్తూ తంగళ్లపల్లి మండల రైతులు ధర్నా చేపట్టారు. సిరిసిల్ల - తంగళ్లపల్లి మానేరు వాగు బ్రిడ్జిపై ధర్నా, రాస్తారోకో నిర్వహించారు. ఈ ధర్నాకు బిజెపి జిల్లా అధ్యక్షులు రెడ్డబోయిన గోపి, నాయకులు మద్దతు పలికి ధర్నాలో పాల్గొన్నారు. ఈ సంధర్బంగా బిజెపి జిల్లా అధ్యక్షులు రెడ్డబోయిన గోపి మాట్లాడారు.
    user_Satheesh gangu
    Satheesh gangu
    జర్నలిస్ట్ సిరిసిల్ల, రాజన్న సిరిసిల్ల, తెలంగాణ•
    1 day ago
View latest news on Shuru App
Download_Android
  • Terms & Conditions
  • Career
  • Privacy Policy
  • Blogs
Shuru, a product of Close App Private Limited.