జగిత్యాలలో మృతి చెందిన శతాధిక వృద్ధురాలు అర్వపెల్లి అమృతా భాయి మృత దేహాన్ని కరీంనగర్ మెడికల్ కాలేజీకి అందజేసిన కుటుంబ సభ్యులు జగిత్యాల అరవింద్ నగర్ కు చెందిన శతాధిక వృద్ధురాలు అర్వపెల్లి అమృతాభాయి గత కొంతకాలంగా అనారోగ్యంతో బాధపడుతూ మృతి చెందారు. శతాధిక వృద్ధురాలు కుటుంబ సభ్యులు ఆమె మృతదేహాన్ని రెడ్ క్రాస్ సొసైటీ సభ్యులు, సిరిసిల్ల శ్రీనివాస్, మంచాల కృష్ణ, ఎమ్మెల్యే సంజయ్ సమక్షంలో కరీంనగర్ మెడికల్ కాలేజీ కు అందజేశారు. ఈ సందర్బంగా ఎమ్మెల్యే డా సంజయ్ కుమార్ మాట్లాడుతూ, మానవ శరీర దానం అనేది వైద్య విద్య, శాస్త్రీయ పరిశోధన కోసం మనిషి సహజ మరణానంతరం మొత్తం మృత శరీరాన్ని వైద్య విద్యార్థులకోసం వైద్య కళాశాలకు దానం గా ఇవ్వడం హర్షించదగ్గ విషయమన్నారు. దేశంలోని అనాటమీ చట్టం భవిష్యత్ వైద్యులకు శిక్షణ ఇవ్వడానికి మరియు కొత్త శస్త్రచికిత్సా పద్ధతులను అభివృద్ధి చేయడానికి ఇది చాలా ముఖ్యమైందని వెల్లడించారు. దానం చేయబడిన మృత శరీరాలను వైద్య విద్యార్థులు శరీర నిర్మాణ శాస్త్రాన్ని అధ్యయనం చేయడానికి ఉపయోగిస్తారనీ, మానవ శరీర నిర్మాణం, అది ఎలా పనిచేస్తుందో అర్థం చేసుకోవడానికి వారికి ఎంతగానో సహాయపడుతుందన్నారు., కొత్త వైద్య పరికరాలను అభివృద్ధి చేయడానికి వినూత్న శస్త్రచికిత్సా విధానాలను అభ్యసించడానికి వైద్య పరిశోధకులు కూడా వీటిని ఉపయోగిస్తారని ఎమ్మెల్యే డా సంజయ్ కుమార్ తెలిపారు.
జగిత్యాలలో మృతి చెందిన శతాధిక వృద్ధురాలు అర్వపెల్లి అమృతా భాయి మృత దేహాన్ని కరీంనగర్ మెడికల్ కాలేజీకి అందజేసిన కుటుంబ సభ్యులు జగిత్యాల అరవింద్ నగర్ కు చెందిన శతాధిక వృద్ధురాలు అర్వపెల్లి అమృతాభాయి గత కొంతకాలంగా అనారోగ్యంతో బాధపడుతూ మృతి చెందారు. శతాధిక వృద్ధురాలు కుటుంబ సభ్యులు ఆమె మృతదేహాన్ని
రెడ్ క్రాస్ సొసైటీ సభ్యులు, సిరిసిల్ల శ్రీనివాస్, మంచాల కృష్ణ, ఎమ్మెల్యే సంజయ్ సమక్షంలో కరీంనగర్ మెడికల్ కాలేజీ కు అందజేశారు. ఈ సందర్బంగా ఎమ్మెల్యే డా సంజయ్ కుమార్ మాట్లాడుతూ, మానవ శరీర దానం అనేది వైద్య విద్య, శాస్త్రీయ పరిశోధన కోసం మనిషి సహజ మరణానంతరం మొత్తం మృత
శరీరాన్ని వైద్య విద్యార్థులకోసం వైద్య కళాశాలకు దానం గా ఇవ్వడం హర్షించదగ్గ విషయమన్నారు. దేశంలోని అనాటమీ చట్టం భవిష్యత్ వైద్యులకు శిక్షణ ఇవ్వడానికి మరియు కొత్త శస్త్రచికిత్సా పద్ధతులను అభివృద్ధి చేయడానికి ఇది చాలా ముఖ్యమైందని వెల్లడించారు. దానం చేయబడిన మృత శరీరాలను వైద్య విద్యార్థులు శరీర నిర్మాణ శాస్త్రాన్ని
అధ్యయనం చేయడానికి ఉపయోగిస్తారనీ, మానవ శరీర నిర్మాణం, అది ఎలా పనిచేస్తుందో అర్థం చేసుకోవడానికి వారికి ఎంతగానో సహాయపడుతుందన్నారు., కొత్త వైద్య పరికరాలను అభివృద్ధి చేయడానికి వినూత్న శస్త్రచికిత్సా విధానాలను అభ్యసించడానికి వైద్య పరిశోధకులు కూడా వీటిని ఉపయోగిస్తారని ఎమ్మెల్యే డా సంజయ్ కుమార్ తెలిపారు.
- కాళేశ్వరం ప్రాజెక్ట్ 11వ ప్యాకేజ్‌లోని ఎల్‌ఎం–6, ఎల్‌ఎం–4 కెనాల్ పనులు పూర్తి చేయాలని డిమాండ్ చేస్తూ రాజన్న సిరిసిల్ల జిల్లాలో బిజెపి ఆధ్వర్యంలో రైతులు ఆందోళనకు దిగారు. తంగళ్ళపల్లి మండలంలో మానేరు బ్రిడ్జ్ పై రైతులు, బీజేపీ నాయకులు బైఠాయించారు. కాలువ పనులు వెంటనే చేపట్టి పంట పొలాలను కాపాడాలని డిమాండ్ చేశారు. ప్రభుత్వ వైఖరి స్థానిక ఎమ్మెల్యే తీరును నిరసిస్తూ ఆందోళన వ్యక్తం చేశారు. ప్రభుత్వానికి వ్యతిరేకంగా నినాదాలు చేశారు. కాలువ పనులు త్వరగా పూర్తి చేయాలని డిమాండ్ చేశారు. కలెక్టర్ రావాలని కోరారు. ధర్నా రాస్తారోకో మానేరు బ్రిడ్జ్ పై భారీగా వాహనాలు నిలిచిపోయాయి. పోలీసులు సముదాయించిన వినకపోవడంతో బిజెపి జిల్లా అధ్యక్షుడు గోపి తో సహా పలువురిని అరెస్టు చేసి స్టేషన్ కు తరలించారు. రైతులు బిజెపి నాయకుల అరెస్టుపై కేంద్ర మంత్రి బండి సంజయ్ స్పందించారు. తక్షణమే రంగనాయక్ సాగర్ 11వ ప్యాకేజీ నుండి ఎల్ఎం 4, ఎల్ఎం 6 ద్వారా కెనాల్ పనులను పూర్తి చేయాలని డిమాండ్ చేశారు. రైతులపై కేసులు నమోదు చేస్తే తీవ్ర పరిణామాలుంటాయని హెచ్చరించారు. న్యాయం చేయాలని అడిగిన రైతులను అరెస్ట్ చేయడం అన్యాయమన్నారు. రైతులకు సంఘీభావం తెలిపిన బీజేపీ జిల్లా అధ్యక్షులు గోపీసహా పార్టీ నాయకులను స్టేషన్ కు తరలించడం అక్రమమన్నారు. తక్షణమే రైతులను, బీజేపీ నేతలను బేషరతుగా విడుదల చేయాలని కోరారు. ఇచ్చిన హామీని నిలబెట్టుకోవాలని రైతులు నిరసన చేస్తే అరెస్ట్ చేస్తారా? అని ప్రశ్నించారు. రంగనాయక్ సాగర్ నుండి పెద్దలింగాపూర్, తంగళ్లపల్లి మండలానికి నీళ్లిచ్చే కెనాల్ పనులను ఎందుకు పూర్తి చేయడం లేదన్నారు. 3 కోట్ల నిధులు విడుదలయ్యాయని స్థానిక ఎమ్మెల్యే ప్రకటించి ఏడాది దాటినా పనులెందుకు ప్రారంభించలేదని ప్రశ్నించారు. కాలువ పనులు పూర్తి చేసి ఉంటే 9,500 ఎకరాలకు సాగునీరందేదని తెలిపారు. అధికారంలో ఉన్నన్నాళ్లు రంగనాయక్ సాగర్ ద్వారా సిరిసిల్ల జిల్లాకు నీరివ్వని కేటీఆర్ రైతు ద్రోహి అని ఆరోపించారు. కాంగ్రెస్, బీఆర్ఎస్ పాలకుల వైఫల్యాలవల్ల రైతులు నష్టపోతున్నారని తెలిపారు. తక్షణమే పనులు ప్రారంభించాలని లేనిచో రైతుల పక్షాన బిజేపి పోరుబాట పట్టాక తప్పదని హెచ్చరించారు.4
- జగిత్యాల జిల్లా కేంద్రంలో మాజీ మంత్రి జీవన్ రెడ్డి ప్రెస్ మీట్ నిర్వహించారు. పార్టీ మారుతున్నారన్న ప్రచారంపై మీడియా ప్రశ్నలకు స్పందించిన ఆయన, కాంగ్రెస్ పార్టీలో కొనసాగాలా లేదా అనే విషయంపై ఆలోచించాల్సిన పరిస్థితి ఉందన్నారు. అయితే ఇప్పటివరకు ఎలాంటి నిర్ణయం తీసుకోలేదని తెలిపారు. సరైన సమయం, సందర్భం వచ్చినప్పుడు నిర్ణయం తీసుకుంటానని, ఏ నిర్ణయం తీసుకున్నా మీడియా ద్వారానే వెల్లడిస్తానని స్పష్టం చేశారు.1
- తంగళ్లపల్లి మండలం 11వ ప్యాకేజీ కింద ఎల్ ఎం -6, ఎల్ ఎం -4 కెనాల్ పనులను వెంటనే పూర్తి చేయాలని డిమాండ్ చేస్తూ తంగళ్లపల్లి మండల రైతులు ధర్నా చేపట్టారు. సిరిసిల్ల - తంగళ్లపల్లి మానేరు వాగు బ్రిడ్జిపై ధర్నా, రాస్తారోకో నిర్వహించారు. ఈ ధర్నాకు బిజెపి జిల్లా అధ్యక్షులు రెడ్డబోయిన గోపి, నాయకులు మద్దతు పలికి ధర్నాలో పాల్గొన్నారు. ఈ సంధర్బంగా బిజెపి జిల్లా అధ్యక్షులు రెడ్డబోయిన గోపి మాట్లాడారు.1
- వరంగల్ జిల్లా వర్ధన్నపేట పట్టణానికి చెందిన వడ్లకొండ శ్రీనివాస్–సరిత దంపతుల కుమారుడు సాయి చరణ్ రెండేళ్ల క్రితం అనారోగ్యంతో మృతి చెందాడు. కొడుకు జ్ఞాపకాలను శాశ్వతంగా నిలుపుకోవాలనే ఉద్దేశంతో తల్లిదండ్రులు అతని రూపంలో నిలువెత్తు విగ్రహాన్ని తయారు చేయించి ఇంట్లో ప్రతిష్టించారు. నేడు కుమారుడి జన్మదినం సందర్భంగా ఆ విగ్రహానికి కొత్త రంగులు వేసి పూలమాలలతో అలంకరించి కుటుంబ సభ్యులు, బంధుమిత్రుల సమక్షంలో కేక్ కట్ చేసి పుట్టినరోజు వేడుకలను భావోద్వేగభరితంగా నిర్వహించారు. కుమారుడు తమతోనే ఉన్నాడన్న భావనతో ప్రతి ఏడాది ఇలాంటి వేడుకలు నిర్వహిస్తున్నట్లు కుటుంబ సభ్యులు తెలిపారు.1
- అందులో భాగంగా ఈరోజు రాత్రి 10 గంటలకు లక్ష్మీనరసింహస్వామి వార్ల తిరు కళ్యాణ మహోత్సవం అంగరంగ వైభవంగా భక్తుల జయ జయ ద్వానాల నడుమ నిర్వహించనున్నారు. కాబట్టి చుట్టుపక్క గ్రామాల ప్రజలతో పాటు హైదరాబాద్ సికింద్రాబాద్ జంట నగరాల నుంచి పెద్ద సంఖ్యలో భక్తులు తరలివచ్చి స్వామివారి కృపకు పాత్రులు కాగలరని ఆలయ అర్చకులు, నిర్వాహకులు కోరుతున్నారు. భక్తులకు ఎలాంటి ఇబ్బందులు కలగకుండా ఏర్పాట్లు పూర్తి చేసినట్లు ఆలయ చైర్మన్, ధర్మకర్తలు, ఈవో, సిబ్బంది భక్తులను ఆహ్వానిస్తున్నారు.1
- అశోక్ నగర్ వినాయకుని ఆలయంలో చోరీ సంగారెడ్డి జిల్లాలోని రామచంద్రపురం పోలీస్ స్టేషన్ పరిధిలో ఆలయంలో చోరీ జరిగింది. అశోక్ నగర్ వినాయక ఆలయంలో మంగళ వారం తెల్లవారుజామున దొంగలు తాళాలు పగులగొట్టి లోపలికి ప్రవేశించారు. స్థానికుల సమాచారం ప్రకారం దొంగలు ఆలయంలోని సుమారు 3 తులాల బంగారు ఆభరణాలు, 8 కిలోల వెండి వస్తువులు అపహరించారు. అంతేకాకుండా ఆలయ హుండీని పగులగొట్టి అందులో ఉన్న సుమారు 90 వేల రూపాయల నగదును కూడా తీసుకెళ్లినట్లు తెలుస్తోంది. ఉదయం ఆలయానికి వచ్చిన స్థానికులు తాళాలు పగులగొట్టబడినట్టు గుర్తించి వెంటనే పోలీసులకు సమాచారం అందించారు.సమాచారం అందుకున్న వెంటనే పోలీసులు సంఘటనా స్థలానికి చేరుకుని పరిశీలనలు ప్రారంభించారు. క్లూస్ టీం సహాయంతో వేలిముద్రలు మరియు ఇతర ఆధారాలను సేకరిస్తున్నారు. ఆలయ పరిసరాల్లో ఉన్న సీసీటీవీ కెమెరాలను పోలీసులు పరిశీలిస్తూ దొంగల కోసం గాలింపు చర్యలు చేపట్టారు.ఈ ఘటనపై రామచంద్రాపురం పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు కొనసాగిస్తున్నారు.4
- గజ్వేల్ సిద్దిపేట జిల్లా మార్చు 10 ప్రజా తెలంగాణ న్యూస్/ విద్యతో పాటు, శాస్త్ర సాంకేతికత సమాజం పట్ల గౌరవం ఉండే విధంగా ప్రతి విద్యార్థి లక్ష్యంతో ముందుకు వెళ్లాలని కావేరి వ్యవసాయ యూనివర్సిటీ వ్యవస్థాపకులు భాస్కర్ రావు అన్నారు. సిద్దిపేట జిల్లా గౌరారం వద్ద గల కావేరి వ్యవసాయ కళాశాలలో అంతర్జాతీయ మహిళా దినోత్సవం సందర్భంగా వివిధ రంగాలలో గుర్తింపు పొందిన మహిళలకు ఘనంగా సన్మానం చేశారు. ఈ సందర్భంగా వక్తలు మాట్లాడుతూ విద్యార్థి దశ నుండే లక్ష్యంతో ఉన్నతమైన శిఖరాలకు చేరే విధంగా పట్టుదలతో చదువుకోవాలని సూచించారు అనంతరం వివిధ రంగాల్లో గుర్తింపు పైన మహిళలకు శాలువాలతో సన్మానం చేశారు విద్యార్థులచే వివిధ నాటక కళారూపాలు, నృత్య ప్రదర్శనలు నిర్వహించారు ఈ కార్యక్రమంలో కళాశాల సిబ్బంది విద్యార్థులు పాల్గొన్నారు.4
- రాష్ట్ర మంత్రి పొన్నం ప్రభాకర్ హుస్నాబాద్ లోని సాంఘిక సంక్షేమ గురుకుల బాలికల పాఠశాలను ఆకస్మికంగా సందర్శించి ఆహారం నాణ్యతను తనిఖీ చేశారు. సోమవారం మెనూ లో ఉన్న వంటకాలు.. విద్యార్థినులకు మధ్యాహ్న భోజనంలో వడ్డిస్తున్నా మెనూ పరిశీలించారు. స్వయంగా మంత్రి ప్లేట్ తీసుకొని క్యూ లైన్ లో నిలబడి వడ్డించుకొని విద్యార్థినులతో కలిసి భోజనం చేశారు. మధ్యాహ్న భోజనం తయారు చేసే కుక్ లతో మాట్లాడి విద్యార్థినులకు నాణ్యమైన భోజనం అందించాలని.. విద్యార్థినులు ఆహారం విషయంలో రాజిలేదని ఆదేశించారు. విద్యార్థులకు వడ్డిస్తున్న ఆహారాన్ని ప్రతిరోజూ పరిశీలించాలని ప్రిన్సిపల్ విజయ ను ఆదేశించారు. ప్రభుత్వం రూపొందించిన మెను ప్రకారం విద్యార్థులకు ఆహారం అందించాలని సూచించారు. పాఠశాల తరగతి గదులను ,పాఠశాల పరిసరాలను పరిశీలించారు.. డ్రింకింగ్ వాటర్ ట్యాంక్స్ పరిశీలించారు.. మెయింటెన్స్ చేయాలని సూచించారు. విద్యా సంవత్సరం ముగింపు కు చేరుకుండడం తో పదవ తరగతి పరీక్షలు రాసే విద్యార్థులు బాగా రాయాలని సూచించారు.ఇతర తరగతులకు సిలబస్ పూర్తయిందని దానిని రివిజన్ చేయాలని సూచించారు. వెనుకబడిన విద్యార్థులపై ప్రత్యేక శ్రద్ధ వహించాలని ఉపాధ్యాయులకు సూచించారు.. టాయిలెట్స్ కి,అదనపు గదికి అవసరమైన షెడ్డు నిర్మాణం పూర్తి చేస్తామని తెలిపారు.. విద్యార్థులతో ముచ్చటించారు..విద్యార్థులు బాగా చదువుకోవాలని సూచించారు... ఇటీవల జరిగిన సర్వే లో కులం డబ్బు ప్రభావం లేదని ఎక్కడైతే చదువుకున్నారో ఆ కుటుంబాలు మాత్రమే అభివృద్ధి చెందాయని తెలిపారు. హుస్నాబాద్ స్పోర్ట్స్ గ్రౌండ్ లో త్వరలోనే స్విమ్మింగ్ పూల్ అందుబాటులోకి రానుందని దాని ద్వారా అందరూ స్విమ్మింగ్ నేర్చుకోవాలని సూచించారు. విద్యార్థినులు పాటలు ,కథలు చెప్పించారు.. పాటలు పాడి ,కథలు చెప్పిన విద్యార్థులను అభినందించి సత్కరించారు. పదవ తరగతి విద్యార్థులు పరీక్షలు సమీపిస్తుండటంతో బాగా రాసి మంచి మార్కులు తెచ్చుకోవాలని సూచించారు.. లక్ష్యాన్ని నిర్దేశించుకుని చదవాలని సూచించారు.3