logo
Shuru
Apke Nagar Ki App…
  • Latest News
  • News
  • Politics
  • Elections
  • Viral
  • Astrology
  • Horoscope in Hindi
  • Horoscope in English
  • Latest Political News
logo
Shuru
Apke Nagar Ki App…

ఎస్‌ఎఫ్‌ఐ రాజన్న సిరిసిల్ల జిల్లా కమిటీ ఆధ్వర్యంలో జిల్లావ్యాప్తంగా విద్యాసంస్థల బంద్ విజయవంతంగా జరిగింది. ఈ సందర్భంగా ఎస్‌ఎఫ్‌ఐ జిల్లా కార్యదర్శి మల్లారపు ప్రశాంత్ మాట్లాడుతూ, జూన్ 12 నాటికి ప్రభుత్వ పాఠశాల విద్యార్థులకు యూనిఫాంలు, పాఠ్యపుస్తకాలు మరియు నోట్‌బుక్స్‌ అందజేస్తామని ప్రభుత్వం ప్రకటించినప్పటికీ, పాఠశాలలు ప్రారంభమై 20 రోజులు గడిచినా పూర్తిస్థాయిలో సౌకర్యాలు అందలేదని ఆవేదన వ్యక్తం చేశారు. పాఠ్యపుస్తకాలలో కొన్ని టైటిల్స్ అందుబాటులో లేకపోవడం వల్ల విద్యార్థులు ఇబ్బందులు పడుతున్నారని, అలాగే పెరిగిన ధరలకు అనుగుణంగా మధ్యాహ్న భోజన పథకానికి నిధులు పెంచకపోవడంతో నాణ్యమైన ఆహారం అందించడం కష్టంగా మారిందని ఆయన పేర్కొన్నారు. ప్రైవేట్, కార్పొరేట్ విద్యాసంస్థలు విద్యను వ్యాపారంగా మార్చి, విద్యార్థులపై బలవంతంగా వస్తువులను కొనుగోలు చేయిస్తున్నాయని మల్లారపు ప్రశాంత్ విమర్శించారు. ఎన్నికల సమయంలో ఇచ్చిన హామీ మేరకు ప్రైవేట్ విద్యాసంస్థల ఫీజులను నియంత్రించే ప్రత్యేక చట్టాన్ని వెంటనే అమలు చేయాలని డిమాండ్ చేశారు. రాష్ట్రంలోని సుమారు 27 వేల ప్రభుత్వ పాఠశాలలను 4 వేల పాఠశాలలుగా కుదించే ప్రతిపాదన విద్యా వ్యవస్థకు నష్టం కలిగిస్తుందని, ఈ నిర్ణయాన్ని ఉపసంహరించుకుని జనాభా ప్రాతిపదికన కొత్త పాఠశాలలను ఏర్పాటు చేయాలని కోరారు. అద్దె భవనాల్లో నడుస్తున్న ఎస్సీ, ఎస్టీ, బీసీ గురుకులాలు మరియు సంక్షేమ హాస్టళ్లకు సొంత భవనాలు నిర్మించాలని, అలాగే పెండింగ్‌లో ఉన్న స్కాలర్షిప్‌లు, ఫీజు రీయింబర్స్‌మెంట్ బకాయిలను వెంటనే విడుదల చేయాలని ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. ఈ కార్యక్రమంలో ఎస్‌ఎఫ్‌ఐ జిల్లా నాయకులు ముబారక్, మహేష్, నిఖిల్, అన్వేష్, రాహుల్, సాయి, శివ, వెన్నెల, అఖిల, స్నేహిత మరియు విద్యార్థులు పాల్గొన్నారు.

3 hrs ago
user_సిరిసిల్ల స్వరం
సిరిసిల్ల స్వరం
సిరిసిల్ల, రాజన్న సిరిసిల్ల, తెలంగాణ•
3 hrs ago

ఎస్‌ఎఫ్‌ఐ రాజన్న సిరిసిల్ల జిల్లా కమిటీ ఆధ్వర్యంలో జిల్లావ్యాప్తంగా విద్యాసంస్థల బంద్ విజయవంతంగా జరిగింది. ఈ సందర్భంగా ఎస్‌ఎఫ్‌ఐ జిల్లా కార్యదర్శి మల్లారపు ప్రశాంత్ మాట్లాడుతూ, జూన్ 12 నాటికి ప్రభుత్వ పాఠశాల విద్యార్థులకు యూనిఫాంలు, పాఠ్యపుస్తకాలు మరియు నోట్‌బుక్స్‌ అందజేస్తామని ప్రభుత్వం ప్రకటించినప్పటికీ, పాఠశాలలు ప్రారంభమై 20 రోజులు గడిచినా పూర్తిస్థాయిలో సౌకర్యాలు అందలేదని ఆవేదన వ్యక్తం

చేశారు. పాఠ్యపుస్తకాలలో కొన్ని టైటిల్స్ అందుబాటులో లేకపోవడం వల్ల విద్యార్థులు ఇబ్బందులు పడుతున్నారని, అలాగే పెరిగిన ధరలకు అనుగుణంగా మధ్యాహ్న భోజన పథకానికి నిధులు పెంచకపోవడంతో నాణ్యమైన ఆహారం అందించడం కష్టంగా మారిందని ఆయన పేర్కొన్నారు. ప్రైవేట్, కార్పొరేట్ విద్యాసంస్థలు విద్యను వ్యాపారంగా మార్చి, విద్యార్థులపై బలవంతంగా వస్తువులను కొనుగోలు చేయిస్తున్నాయని మల్లారపు ప్రశాంత్ విమర్శించారు. ఎన్నికల సమయంలో ఇచ్చిన

హామీ మేరకు ప్రైవేట్ విద్యాసంస్థల ఫీజులను నియంత్రించే ప్రత్యేక చట్టాన్ని వెంటనే అమలు చేయాలని డిమాండ్ చేశారు. రాష్ట్రంలోని సుమారు 27 వేల ప్రభుత్వ పాఠశాలలను 4 వేల పాఠశాలలుగా కుదించే ప్రతిపాదన విద్యా వ్యవస్థకు నష్టం కలిగిస్తుందని, ఈ నిర్ణయాన్ని ఉపసంహరించుకుని జనాభా ప్రాతిపదికన కొత్త పాఠశాలలను ఏర్పాటు చేయాలని కోరారు. అద్దె భవనాల్లో నడుస్తున్న ఎస్సీ,

ఎస్టీ, బీసీ గురుకులాలు మరియు సంక్షేమ హాస్టళ్లకు సొంత భవనాలు నిర్మించాలని, అలాగే పెండింగ్‌లో ఉన్న స్కాలర్షిప్‌లు, ఫీజు రీయింబర్స్‌మెంట్ బకాయిలను వెంటనే విడుదల చేయాలని ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. ఈ కార్యక్రమంలో ఎస్‌ఎఫ్‌ఐ జిల్లా నాయకులు ముబారక్, మహేష్, నిఖిల్, అన్వేష్, రాహుల్, సాయి, శివ, వెన్నెల, అఖిల, స్నేహిత మరియు విద్యార్థులు పాల్గొన్నారు.

More news from Telangana and nearby areas
  • కరీంనగర్‌లోని డా. బీఆర్ అంబేద్కర్ జీఎంఆర్ పాలిటెక్నిక్ మహిళా కళాశాలలో ప్రతిమ ఫౌండేషన్ ఆధ్వర్యంలో శుక్రవారం ప్రత్యేక కార్యక్రమాన్ని నిర్వహించారు. ఈ సందర్భంగా విద్యార్థినుల కోసం ఒక నాప్కిన్ డిస్పోజల్ మెషిన్‌ను విరాళంగా అందజేశారు. దీనితో పాటు నెలసరి సమయంలో విద్యార్థినులు తీసుకోవాల్సిన ఆరోగ్య మరియు పరిశుభ్రత జాగ్రత్తలపై అవగాహన సదస్సును ఏర్పాటు చేశారు. ప్రతిమ ఫౌండేషన్ వ్యవస్థాపకురాలు డాక్టర్ బోయినపల్లి హరిణి మాట్లాడుతూ, బాలికల ఆరోగ్యం, పరిశుభ్రత మరియు ఆత్మవిశ్వాసాన్ని పెంపొందించడమే తమ లక్ష్యమని పేర్కొన్నారు. నెలసరి అనేది ఒక సహజ ప్రక్రియ అని, దీనిని చూసి ఎటువంటి భయాలు లేదా అపోహలు పెట్టుకోవద్దని ఆమె విద్యార్థినులకు సూచించారు. ఈ కార్యక్రమంలో భాగంగానే విద్యార్థినుల సౌకర్యార్థం ఉచిత శానిటరీ ప్యాడ్ డిస్పోజల్ మెషిన్‌ను కళాశాలకు అందించారు. డాక్టర్ గీతారెడ్డి విద్యార్థినులకు నెలసరి సమయంలో పాటించాల్సిన జాగ్రత్తలు, పరిశుభ్రత మరియు పోషకాహారం యొక్క ప్రాధాన్యతపై వివరించారు. ఈ కార్యక్రమంలో కళాశాల ప్రిన్సిపల్ డి. శోభారాణి, వివిధ విభాగాల హెచ్‌వోడీలు, అధ్యాపకులు, విద్యార్థినులు మరియు ప్రతిమ ఫౌండేషన్ సిబ్బంది పాల్గొన్నారు.
    3
    కరీంనగర్‌లోని డా. బీఆర్ అంబేద్కర్ జీఎంఆర్ పాలిటెక్నిక్ మహిళా కళాశాలలో ప్రతిమ ఫౌండేషన్ ఆధ్వర్యంలో శుక్రవారం ప్రత్యేక కార్యక్రమాన్ని నిర్వహించారు. ఈ సందర్భంగా విద్యార్థినుల కోసం ఒక నాప్కిన్ డిస్పోజల్ మెషిన్‌ను విరాళంగా అందజేశారు. దీనితో పాటు నెలసరి సమయంలో విద్యార్థినులు తీసుకోవాల్సిన ఆరోగ్య మరియు పరిశుభ్రత జాగ్రత్తలపై అవగాహన సదస్సును ఏర్పాటు చేశారు.

ప్రతిమ ఫౌండేషన్ వ్యవస్థాపకురాలు డాక్టర్ బోయినపల్లి హరిణి మాట్లాడుతూ, బాలికల ఆరోగ్యం, పరిశుభ్రత మరియు ఆత్మవిశ్వాసాన్ని పెంపొందించడమే తమ లక్ష్యమని పేర్కొన్నారు. నెలసరి అనేది ఒక సహజ ప్రక్రియ అని, దీనిని చూసి ఎటువంటి భయాలు లేదా అపోహలు పెట్టుకోవద్దని ఆమె విద్యార్థినులకు సూచించారు. ఈ కార్యక్రమంలో భాగంగానే విద్యార్థినుల సౌకర్యార్థం ఉచిత శానిటరీ ప్యాడ్ డిస్పోజల్ మెషిన్‌ను కళాశాలకు అందించారు.

డాక్టర్ గీతారెడ్డి విద్యార్థినులకు నెలసరి సమయంలో పాటించాల్సిన జాగ్రత్తలు, పరిశుభ్రత మరియు పోషకాహారం యొక్క ప్రాధాన్యతపై వివరించారు. ఈ కార్యక్రమంలో కళాశాల ప్రిన్సిపల్ డి. శోభారాణి, వివిధ విభాగాల హెచ్‌వోడీలు, అధ్యాపకులు, విద్యార్థినులు మరియు ప్రతిమ ఫౌండేషన్ సిబ్బంది పాల్గొన్నారు.
    user_OM NAMSHIVAYA
    OM NAMSHIVAYA
    Karimnagar, Telangana•
    1 hr ago
  • కరీంనగర్‌లో ఇటీవల జరిగిన ఓ పెళ్లి వేడుక ప్రత్యేకమైన అద్భుతాన్ని ఆవిష్కరించింది, ఇదంతా 'శ్రీనివాసుల మయం'గా మారడంతో అక్కడి వాతావరణం మరింత విశేషంగా నిలిచింది. ఈ పెళ్లిలో పెళ్లికొడుకు పేరు శ్రీనివాస్ కాగా, ఆయన పిల్లనిచ్చిన మామ పేరు కూడా శ్రీనివాసే. అంతేకాకుండా, మేనమామ పేరు కూడా శ్రీనివాస్ కావడం అందరినీ ఆశ్చర్యపరిచింది. పెళ్లి పందిరిలో శ్రీనివాస్ అని పిలిస్తే ముగ్గురు ఒకేసారి హు అని పలకడం ఈ వేడుకకే ఓ ప్రత్యేక ఆకర్షణగా నిలిచింది. ఈ పెళ్లికి పెద్ద సంఖ్యలో శ్రీనివాస్ పేరుగల వ్యక్తులు హాజరై నూతన వధూవరులను ఆశీర్వదించారు. ఈ దృశ్యాన్ని చూసిన బంధుమిత్రులంతా 'అంతా శ్రీనివాసుల మయం' కావడంతో ఆశ్చర్యం వ్యక్తం చేశారు. తెలంగాణ శ్రీనివాసుల సేవా సంస్థ చైర్మన్ వుట్కూరి శ్రీనివాస రెడ్డి మాట్లాడుతూ, ఇలాంటి అరుదైన, అద్భుతమైన దృశ్యానికి వేదికైన కరీంనగర్ తన ప్రత్యేకతను చాటుకుందని పేర్కొన్నారు.
    1
    కరీంనగర్‌లో ఇటీవల జరిగిన ఓ పెళ్లి వేడుక ప్రత్యేకమైన అద్భుతాన్ని ఆవిష్కరించింది, ఇదంతా 'శ్రీనివాసుల మయం'గా మారడంతో అక్కడి వాతావరణం మరింత విశేషంగా నిలిచింది. ఈ పెళ్లిలో పెళ్లికొడుకు పేరు శ్రీనివాస్ కాగా, ఆయన పిల్లనిచ్చిన మామ పేరు కూడా శ్రీనివాసే. అంతేకాకుండా, మేనమామ పేరు కూడా శ్రీనివాస్ కావడం అందరినీ ఆశ్చర్యపరిచింది. పెళ్లి పందిరిలో శ్రీనివాస్ అని పిలిస్తే ముగ్గురు ఒకేసారి హు అని పలకడం ఈ వేడుకకే ఓ ప్రత్యేక ఆకర్షణగా నిలిచింది.

ఈ పెళ్లికి పెద్ద సంఖ్యలో శ్రీనివాస్ పేరుగల వ్యక్తులు హాజరై నూతన వధూవరులను ఆశీర్వదించారు. ఈ దృశ్యాన్ని చూసిన బంధుమిత్రులంతా 'అంతా శ్రీనివాసుల మయం' కావడంతో ఆశ్చర్యం వ్యక్తం చేశారు. తెలంగాణ శ్రీనివాసుల సేవా సంస్థ చైర్మన్ వుట్కూరి శ్రీనివాస రెడ్డి మాట్లాడుతూ, ఇలాంటి అరుదైన, అద్భుతమైన దృశ్యానికి వేదికైన కరీంనగర్ తన ప్రత్యేకతను చాటుకుందని పేర్కొన్నారు.
    user_K.V.REDDY
    K.V.REDDY
    చిగురుమామిడి, కరీంనగర్, తెలంగాణ•
    19 hrs ago
  • జగిత్యాల జిల్లాలోని కోరుట్ల సర్కిల్ ఇన్‌స్పెక్టర్ కార్యాలయంలో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో మెట్‌పల్లి డిఎస్పి ఎ. రాములు కీలక వివరాలు వెల్లడించారు. నిన్న రాత్రి అలమయ్యగుట్టలో హత్యకు గురైన 35 ఏళ్ల ఇప్ప కాశిరాం కేసులో, అతడి భార్య రజినిని అరెస్టు చేసినట్లు తెలిపారు. డిఎస్పి వివరించిన వివరాల ప్రకారం, ఇప్ప కాశిరాంకు 14 సంవత్సరాల క్రితం కోరుట్లకు చెందిన రజినీతో వివాహం జరిగింది. వీరికి ఇద్దరు ఆడపిల్లలు, ఒక బాబు ఉన్నారు. గత కొన్ని రోజులుగా కాశిరాం మద్యం తాగి వచ్చి భార్య రజినిని కొడుతూ, పిల్లలను ఇబ్బంది పెడుతున్నాడు. దీనివల్ల తమకు, పిల్లలకు సమస్యలు ఎదురవుతున్నాయని భావించిన రజిని, ఎలాగైనా భర్తను అడ్డు తొలగించుకోవాలని నిర్ణయించుకుంది. సుమారు 20 రోజుల క్రితం కర్రతో దాడి చేసి చంపడానికి ప్రయత్నించగా, ఇరుగుపొరుగు వారు కాపాడి, ఆసుపత్రికి తరలించి కాశిరాం ప్రాణాలు నిలిపారు. అయితే, నిన్న తేదీ 8-7-2026న కాశిరాం కుటుంబ సభ్యులతో మధ్యాహ్నం చెట్ల పండగకు వెళ్లి సాయంత్రం ఇంటికి తిరిగి వచ్చాడు. రాత్రి మళ్లీ బయటకు వెళ్లి ఇంటికి వచ్చిన కాశిరాంను చంపాలనే ఉద్దేశంతో రజిని, తన పిల్లలను ముందుగానే తల్లిగారింటికి పంపింది. రాత్రి 11 గంటల 45 నిమిషాలకు మద్యం సేవించి ఇంటికి వచ్చిన భర్తతో ఉద్దేశపూర్వకంగా గొడవపడిన రజిని, అదే సరైన సమయంగా భావించి ఇంట్లో ఉన్న రోకలిబండతో కాశిరాం తలపై, ఇతర చోట్ల బలంగా కొట్టింది. ఈ దాడిలో తలకు తీవ్ర రక్త గాయాలు కావడంతో కాశిరాం అక్కడికక్కడే మృతి చెందాడు. హత్య అనంతరం రజిని ఇంటి నుంచి పారిపోయి అయ్యప్ప స్వామి ఆలయం వెనకాల ఉన్న బంధువుల ఇంట్లో పడుకుంది. ఈ రోజు పారిపోతుండగా, నమ్మదగిన సమాచారంతో సీఐ, ఎస్ఐ తమ సిబ్బందితో కలిసి నిందితురాలిని అదుపులోకి తీసుకున్నారు. హత్యకు ఉపయోగించిన రోకలిబండను స్వాధీనం చేసుకున్నారు. ఈ దర్యాప్తులో నేరాన్ని రుజువు చేయడానికి సాంకేతిక పరిజ్ఞానాన్ని ఉపయోగించిన సీఐ, ఎస్ఐలను డిఎస్పి అభినందించారు.
    1
    జగిత్యాల జిల్లాలోని కోరుట్ల సర్కిల్ ఇన్‌స్పెక్టర్ కార్యాలయంలో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో మెట్‌పల్లి డిఎస్పి ఎ. రాములు కీలక వివరాలు వెల్లడించారు. నిన్న రాత్రి అలమయ్యగుట్టలో హత్యకు గురైన 35 ఏళ్ల ఇప్ప కాశిరాం కేసులో, అతడి భార్య రజినిని అరెస్టు చేసినట్లు తెలిపారు.

డిఎస్పి వివరించిన వివరాల ప్రకారం, ఇప్ప కాశిరాంకు 14 సంవత్సరాల క్రితం కోరుట్లకు చెందిన రజినీతో వివాహం జరిగింది. వీరికి ఇద్దరు ఆడపిల్లలు, ఒక బాబు ఉన్నారు. గత కొన్ని రోజులుగా కాశిరాం మద్యం తాగి వచ్చి భార్య రజినిని కొడుతూ, పిల్లలను ఇబ్బంది పెడుతున్నాడు. దీనివల్ల తమకు, పిల్లలకు సమస్యలు ఎదురవుతున్నాయని భావించిన రజిని, ఎలాగైనా భర్తను అడ్డు తొలగించుకోవాలని నిర్ణయించుకుంది. సుమారు 20 రోజుల క్రితం కర్రతో దాడి చేసి చంపడానికి ప్రయత్నించగా, ఇరుగుపొరుగు వారు కాపాడి, ఆసుపత్రికి తరలించి కాశిరాం ప్రాణాలు నిలిపారు.

అయితే, నిన్న తేదీ 8-7-2026న కాశిరాం కుటుంబ సభ్యులతో మధ్యాహ్నం చెట్ల పండగకు వెళ్లి సాయంత్రం ఇంటికి తిరిగి వచ్చాడు. రాత్రి మళ్లీ బయటకు వెళ్లి ఇంటికి వచ్చిన కాశిరాంను చంపాలనే ఉద్దేశంతో రజిని, తన పిల్లలను ముందుగానే తల్లిగారింటికి పంపింది. రాత్రి 11 గంటల 45 నిమిషాలకు మద్యం సేవించి ఇంటికి వచ్చిన భర్తతో ఉద్దేశపూర్వకంగా గొడవపడిన రజిని, అదే సరైన సమయంగా భావించి ఇంట్లో ఉన్న రోకలిబండతో కాశిరాం తలపై, ఇతర చోట్ల బలంగా కొట్టింది. ఈ దాడిలో తలకు తీవ్ర రక్త గాయాలు కావడంతో కాశిరాం అక్కడికక్కడే మృతి చెందాడు.

హత్య అనంతరం రజిని ఇంటి నుంచి పారిపోయి అయ్యప్ప స్వామి ఆలయం వెనకాల ఉన్న బంధువుల ఇంట్లో పడుకుంది. ఈ రోజు పారిపోతుండగా, నమ్మదగిన సమాచారంతో సీఐ, ఎస్ఐ తమ సిబ్బందితో కలిసి నిందితురాలిని అదుపులోకి తీసుకున్నారు. హత్యకు ఉపయోగించిన రోకలిబండను స్వాధీనం చేసుకున్నారు. ఈ దర్యాప్తులో నేరాన్ని రుజువు చేయడానికి సాంకేతిక పరిజ్ఞానాన్ని ఉపయోగించిన సీఐ, ఎస్ఐలను డిఎస్పి అభినందించారు.
    user_అబ్దుల్ ముసవ్విర్
    అబ్దుల్ ముసవ్విర్
    Insurance Agent కోరుట్ల, జగిత్యాల, తెలంగాణ•
    20 hrs ago
  • కామారెడ్డిలో యూనియన్ బ్యాంక్ అధికారుల తీరుపై ప్రజలు, రైతులు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. గత రెండు రోజులుగా బ్యాంక్ చుట్టూ తిరుగుతున్నా తమ పనులు జరగకపోవడంతో వినియోగదారుల సహనం నశించి, ఈరోజు బ్యాంక్ వద్ద తీవ్ర ఉద్రిక్త వాతావరణం నెలకొంది. అధికారుల నిర్లక్ష్య వైఖరిని నిరసిస్తూ పెద్ద ఎత్తున ఆందోళనకు దిగారు. ప్రస్తుతం అత్యంత కీలకమైన సమయంలో రైతులు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. ప్రభుత్వం వేస్తున్న వడ్ల పైసలు (ధాన్యం డబ్బులు) ఖాతాల్లో జమ అయినా తీసుకోలేని పరిస్థితి నెలకొంది. మరోవైపు రైతు రుణాలు, పంట రుణాలు సకాలంలో అందడం లేదు. యూనియన్ బ్యాంక్‌ను నమ్ముకుంటే అడుగడుగునా కష్టాలే మిగులుతున్నాయని, గంటల తరబడి లైన్లలో నిలబడినా 'సర్వర్ లేదు', 'లింక్ లేదు' అంటూ సాకులు చెబుతున్నారని రైతులు వాపోతున్నారు. 'మాకు ఈ బ్యాంక్ వద్దు.. మా ఊరికి వెంటనే మరో బ్యాంక్ కావాలి' అంటూ ఆవేదనతో నినదించారు. బ్యాంక్ వద్ద ఉద్రిక్తత నెలకొందన్న సమాచారం అందుకున్న వెంటనే స్థానిక మాజీ ఎంపీటీసీ నీరజ గారి భర్త సంఘటనా స్థలానికి చేరుకున్నారు. ఆందోళన చెందుతున్న ప్రజలు, రైతులతో మాట్లాడి వారి సమస్యలను తెలుసుకున్న ఆయన, యూనియన్ బ్యాంక్ అధికారుల తీరుపై తీవ్ర అసంతృప్తి వ్యక్తం చేశారు. ప్రజల ఇబ్బందులను గమనించిన ఆయన, వెంటనే స్పందించి ఉన్నతాధికారులతో ఫోన్‌లో మాట్లాడారు. ఇక్కడి ప్రజల అవస్థలను, రైతుల ఇబ్బందులను అధికారుల దృష్టికి తీసుకెళ్లి, కేవలం ఒకే బ్యాంక్ ఉండటం వల్ల పని భారం పెరిగి సేవలు అందడం లేదని వివరించారు. ఈ ప్రాంతంలో జనాభా పెరిగిందని, దానికితోడు రైతులకు సంబంధించిన లావాదేవీలు కోట్లలో జరుగుతున్నాయని, వేలాది మంది ఒకే బ్యాంక్‌పై ఆధారపడటం వల్ల ప్రతిరోజూ నరకం చూస్తున్నారని పేర్కొన్నారు. కాబట్టి వెంటనే స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా (SBI) నూతన శాఖను ఏర్పాటు చేయాలని ఆయన గట్టిగా డిమాండ్ చేశారు. బీబీపేట్ మండల కేంద్రంలో ఎస్‌బీఐ (SBI) నూతన బ్రాంచ్‌ను ఏర్పాటు చేసేందుకు తక్షణమే సర్వే నిర్వహించి, అనుమతులు మంజూరు చేయాలని సంబంధిత ఉన్నతాధికారులు, జిల్లా యంత్రాంగం యుద్ధ ప్రాతిపదికన స్పందించాలని ప్రజలు, రైతులు డిమాండ్ చేస్తున్నారు. ఒకవేళ అధికారులు ఇప్పటికైనా స్పందించి కొత్త బ్యాంక్‌ను ఏర్పాటు చేయకపోతే, రాబోయే రోజుల్లో రైతులు, ప్రజలు పెద్ద ఎత్తున రోడ్లపైకి వచ్చి ఆందోళనలు తీవ్రతరం చేసేందుకు సిద్ధమవుతున్నారు. ఇప్పటికైనా పాలకులు, ఉన్నతాధికారులు కళ్లు తెరిచి ఎస్‌బీఐ బ్యాంక్ ఏర్పాటు దిశగా అడుగులు వేయాలని విజ్ఞప్తి చేస్తున్నారు. రెండు రోజులుగా తిరిగినా పనులు కాని యూనియన్ బ్యాంక్ ప్రజల పాలిట శాపంగా మారిందని ఆవేదన వ్యక్తం చేశారు.
    1
    కామారెడ్డిలో యూనియన్ బ్యాంక్ అధికారుల తీరుపై ప్రజలు, రైతులు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. గత రెండు రోజులుగా బ్యాంక్ చుట్టూ తిరుగుతున్నా తమ పనులు జరగకపోవడంతో వినియోగదారుల సహనం నశించి, ఈరోజు బ్యాంక్ వద్ద తీవ్ర ఉద్రిక్త వాతావరణం నెలకొంది. అధికారుల నిర్లక్ష్య వైఖరిని నిరసిస్తూ పెద్ద ఎత్తున ఆందోళనకు దిగారు.

ప్రస్తుతం అత్యంత కీలకమైన సమయంలో రైతులు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. ప్రభుత్వం వేస్తున్న వడ్ల పైసలు (ధాన్యం డబ్బులు) ఖాతాల్లో జమ అయినా తీసుకోలేని పరిస్థితి నెలకొంది. మరోవైపు రైతు రుణాలు, పంట రుణాలు సకాలంలో అందడం లేదు. యూనియన్ బ్యాంక్‌ను నమ్ముకుంటే అడుగడుగునా కష్టాలే మిగులుతున్నాయని, గంటల తరబడి లైన్లలో నిలబడినా 'సర్వర్ లేదు', 'లింక్ లేదు' అంటూ సాకులు చెబుతున్నారని రైతులు వాపోతున్నారు. 'మాకు ఈ బ్యాంక్ వద్దు.. మా ఊరికి వెంటనే మరో బ్యాంక్ కావాలి' అంటూ ఆవేదనతో నినదించారు.

బ్యాంక్ వద్ద ఉద్రిక్తత నెలకొందన్న సమాచారం అందుకున్న వెంటనే స్థానిక మాజీ ఎంపీటీసీ నీరజ గారి భర్త సంఘటనా స్థలానికి చేరుకున్నారు. ఆందోళన చెందుతున్న ప్రజలు, రైతులతో మాట్లాడి వారి సమస్యలను తెలుసుకున్న ఆయన, యూనియన్ బ్యాంక్ అధికారుల తీరుపై తీవ్ర అసంతృప్తి వ్యక్తం చేశారు. ప్రజల ఇబ్బందులను గమనించిన ఆయన, వెంటనే స్పందించి ఉన్నతాధికారులతో ఫోన్‌లో మాట్లాడారు. ఇక్కడి ప్రజల అవస్థలను, రైతుల ఇబ్బందులను అధికారుల దృష్టికి తీసుకెళ్లి, కేవలం ఒకే బ్యాంక్ ఉండటం వల్ల పని భారం పెరిగి సేవలు అందడం లేదని వివరించారు. ఈ ప్రాంతంలో జనాభా పెరిగిందని, దానికితోడు రైతులకు సంబంధించిన లావాదేవీలు కోట్లలో జరుగుతున్నాయని, వేలాది మంది ఒకే బ్యాంక్‌పై ఆధారపడటం వల్ల ప్రతిరోజూ నరకం చూస్తున్నారని పేర్కొన్నారు. కాబట్టి వెంటనే స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా (SBI) నూతన శాఖను ఏర్పాటు చేయాలని ఆయన గట్టిగా డిమాండ్ చేశారు.

బీబీపేట్ మండల కేంద్రంలో ఎస్‌బీఐ (SBI) నూతన బ్రాంచ్‌ను ఏర్పాటు చేసేందుకు తక్షణమే సర్వే నిర్వహించి, అనుమతులు మంజూరు చేయాలని సంబంధిత ఉన్నతాధికారులు, జిల్లా యంత్రాంగం యుద్ధ ప్రాతిపదికన స్పందించాలని ప్రజలు, రైతులు డిమాండ్ చేస్తున్నారు. ఒకవేళ అధికారులు ఇప్పటికైనా స్పందించి కొత్త బ్యాంక్‌ను ఏర్పాటు చేయకపోతే, రాబోయే రోజుల్లో రైతులు, ప్రజలు పెద్ద ఎత్తున రోడ్లపైకి వచ్చి ఆందోళనలు తీవ్రతరం చేసేందుకు సిద్ధమవుతున్నారు. ఇప్పటికైనా పాలకులు, ఉన్నతాధికారులు కళ్లు తెరిచి ఎస్‌బీఐ బ్యాంక్ ఏర్పాటు దిశగా అడుగులు వేయాలని విజ్ఞప్తి చేస్తున్నారు. రెండు రోజులుగా తిరిగినా పనులు కాని యూనియన్ బ్యాంక్ ప్రజల పాలిట శాపంగా మారిందని ఆవేదన వ్యక్తం చేశారు.
    user_Bollam Saireddy జయం న్యూస్ మీడ
    Bollam Saireddy జయం న్యూస్ మీడ
    Interior designer Manakondur, Karimnagar•
    22 hrs ago
  • హుస్నాబాద్‌లో నిర్వహించిన జాబ్ మేళాలో మంత్రి వివేక్ వెంకటస్వామి పాల్గొన్నారు. రాష్ట్రం ఏర్పడిన తర్వాత పదేళ్లు ఉద్యోగాల కోసం ఎదురుచూశామని, కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చాక ఇప్పటికే లక్ష ఉద్యోగాలను భర్తీ చేసిందని ఆయన పేర్కొన్నారు. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి నేతృత్వంలో తెలంగాణను మూడు ట్రిలియన్ డాలర్ల ఆర్థిక వ్యవస్థగా తీర్చిదిద్దడమే లక్ష్యమని ఆయన వివరించారు. రాష్ట్రంలో నైపుణ్యాభివృద్ధి (స్కిల్ డెవలప్‌మెంట్) కోసం రూ. 4,500 కోట్ల వ్యయంతో 120 ఏటీసీ (ATC) కేంద్రాలను ఏర్పాటు చేయాలని ప్రభుత్వం నిర్ణయించింది. రాష్ట్ర ఆర్థిక పరిస్థితి ఇబ్బందికరంగా ఉన్నప్పటికీ, టాటా సంస్థతో చర్చలు జరిపి సీఎస్ఆర్ (CSR) నిధుల ద్వారా రూ. 4 వేల కోట్లతో వీటిని నిర్మిస్తున్నట్లు వెల్లడించారు. ఈ కేంద్రాల్లో వర్చువల్ అనాలసిస్ డిజైన్, ఈవీ మెయింటెనెన్స్, డిజిటల్ మ్యానుఫ్యాక్చరింగ్ వంటి అంశాలపై శిక్షణ ఇస్తామని, అంతేకాకుండా దేశంలోనే ఎక్కడాలేని విధంగా నెలకు రూ. 2,000 స్టైఫండ్ కూడా అందిస్తామని తెలిపారు. ఉద్యోగాల కోసం స్థానికంగానే కాకుండా, అవసరమైన చోటికి వెళ్లడానికి నిరుద్యోగులు సిద్ధంగా ఉండాలని ఆయన సూచించారు. విదేశీ ఉద్యోగాల గురించి వివరిస్తూ, నిరుద్యోగులకు నైపుణ్యంతో పాటు విదేశీ భాషలను నేర్పించి విదేశాలకు పంపేలా చర్యలు తీసుకుంటున్నామని మంత్రి చెప్పారు. టామ్ కామ్ సంస్థకు బడ్జెట్‌లో రూ. 90 కోట్లు కేటాయించామని, జర్మన్ భాష వంటివి నేర్చుకుంటే విదేశాల్లో లక్షల్లో జీతం వచ్చే ఉద్యోగాలతో పాటు, అక్కడి లేబర్ యాక్ట్ ప్రకారం పార్ట్ టైమ్ చేసుకునే అవకాశం కూడా ఉంటుందని ఆయన పేర్కొన్నారు. ప్రస్తుతం విదేశాల్లో సుమారు 5 లక్షల ఉద్యోగ అవకాశాలు ఉన్నాయని, నిరుద్యోగులు ఈ అవకాశాలను సద్వినియోగం చేసుకోవాలని మంత్రి వివేక్ వెంకటస్వామి పిలుపునిచ్చారు.
    1
    హుస్నాబాద్‌లో నిర్వహించిన జాబ్ మేళాలో మంత్రి వివేక్ వెంకటస్వామి పాల్గొన్నారు. రాష్ట్రం ఏర్పడిన తర్వాత పదేళ్లు ఉద్యోగాల కోసం ఎదురుచూశామని, కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చాక ఇప్పటికే లక్ష ఉద్యోగాలను భర్తీ చేసిందని ఆయన పేర్కొన్నారు. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి నేతృత్వంలో తెలంగాణను మూడు ట్రిలియన్ డాలర్ల ఆర్థిక వ్యవస్థగా తీర్చిదిద్దడమే లక్ష్యమని ఆయన వివరించారు.

రాష్ట్రంలో నైపుణ్యాభివృద్ధి (స్కిల్ డెవలప్‌మెంట్) కోసం రూ. 4,500 కోట్ల వ్యయంతో 120 ఏటీసీ (ATC) కేంద్రాలను ఏర్పాటు చేయాలని ప్రభుత్వం నిర్ణయించింది. రాష్ట్ర ఆర్థిక పరిస్థితి ఇబ్బందికరంగా ఉన్నప్పటికీ, టాటా సంస్థతో చర్చలు జరిపి సీఎస్ఆర్ (CSR) నిధుల ద్వారా రూ. 4 వేల కోట్లతో వీటిని నిర్మిస్తున్నట్లు వెల్లడించారు. ఈ కేంద్రాల్లో వర్చువల్ అనాలసిస్ డిజైన్, ఈవీ మెయింటెనెన్స్, డిజిటల్ మ్యానుఫ్యాక్చరింగ్ వంటి అంశాలపై శిక్షణ ఇస్తామని, అంతేకాకుండా దేశంలోనే ఎక్కడాలేని విధంగా నెలకు రూ. 2,000 స్టైఫండ్ కూడా అందిస్తామని తెలిపారు. ఉద్యోగాల కోసం స్థానికంగానే కాకుండా, అవసరమైన చోటికి వెళ్లడానికి నిరుద్యోగులు సిద్ధంగా ఉండాలని ఆయన సూచించారు.

విదేశీ ఉద్యోగాల గురించి వివరిస్తూ, నిరుద్యోగులకు నైపుణ్యంతో పాటు విదేశీ భాషలను నేర్పించి విదేశాలకు పంపేలా చర్యలు తీసుకుంటున్నామని మంత్రి చెప్పారు. టామ్ కామ్ సంస్థకు బడ్జెట్‌లో రూ. 90 కోట్లు కేటాయించామని, జర్మన్ భాష వంటివి నేర్చుకుంటే విదేశాల్లో లక్షల్లో జీతం వచ్చే ఉద్యోగాలతో పాటు, అక్కడి లేబర్ యాక్ట్ ప్రకారం పార్ట్ టైమ్ చేసుకునే అవకాశం కూడా ఉంటుందని ఆయన పేర్కొన్నారు. ప్రస్తుతం విదేశాల్లో సుమారు 5 లక్షల ఉద్యోగ అవకాశాలు ఉన్నాయని, నిరుద్యోగులు ఈ అవకాశాలను సద్వినియోగం చేసుకోవాలని మంత్రి వివేక్ వెంకటస్వామి పిలుపునిచ్చారు.
    user_Mahesh Chary
    Mahesh Chary
    Photographer Husnabad, Siddipet•
    1 hr ago
  • రాజన్న సిరిసిల్ల జిల్లా కేంద్రంలోని ఒక ప్రైవేట్ ఫంక్షన్ హాల్‌లో సర్పంచులు మరియు కార్యదర్శుల కోసం శిక్షణ తరగతులు జరుగుతుండగా, బిఆర్ఎస్ మరియు కాంగ్రెస్ సర్పంచుల మధ్య తీవ్ర వాగ్వాదం చోటుచేసుకుంది. ఈ శిక్షణ కార్యక్రమంలో పాల్గొన్న సర్పంచుల మధ్య ప్రభుత్వం విడుదల చేసే నిధుల విషయంలో మాటల యుద్ధం మొదలైంది. గ్రామాల్లో జరుగుతున్న పనులు కేంద్రం విడుదల చేసిన నిధులతోనే సాగుతున్నాయని ఒక వర్గం వాదించగా, గత ప్రభుత్వ హయాంలో చేసిన పనులకు ఇప్పటికీ బిల్లులు అందలేదని, దీనివల్ల మాజీ సర్పంచులు తమను నిలదీస్తున్నారని మరో వర్గం ఎదురుదాడికి దిగింది. ఈ పరస్పర ఆరోపణలతో సమావేశ ప్రాంగణంలో కొంతసేపు గందరగోళ పరిస్థితి నెలకొంది.
    1
    రాజన్న సిరిసిల్ల జిల్లా కేంద్రంలోని ఒక ప్రైవేట్ ఫంక్షన్ హాల్‌లో సర్పంచులు మరియు కార్యదర్శుల కోసం శిక్షణ తరగతులు జరుగుతుండగా, బిఆర్ఎస్ మరియు కాంగ్రెస్ సర్పంచుల మధ్య తీవ్ర వాగ్వాదం చోటుచేసుకుంది. ఈ శిక్షణ కార్యక్రమంలో పాల్గొన్న సర్పంచుల మధ్య ప్రభుత్వం విడుదల చేసే నిధుల విషయంలో మాటల యుద్ధం మొదలైంది.

గ్రామాల్లో జరుగుతున్న పనులు కేంద్రం విడుదల చేసిన నిధులతోనే సాగుతున్నాయని ఒక వర్గం వాదించగా, గత ప్రభుత్వ హయాంలో చేసిన పనులకు ఇప్పటికీ బిల్లులు అందలేదని, దీనివల్ల మాజీ సర్పంచులు తమను నిలదీస్తున్నారని మరో వర్గం ఎదురుదాడికి దిగింది. ఈ పరస్పర ఆరోపణలతో సమావేశ ప్రాంగణంలో కొంతసేపు గందరగోళ పరిస్థితి నెలకొంది.
    user_సిరిసిల్ల స్వరం
    సిరిసిల్ల స్వరం
    సిరిసిల్ల, రాజన్న సిరిసిల్ల, తెలంగాణ•
    3 hrs ago
  • రాజన్న సిరిసిల్ల జిల్లా రుద్రంగిలో భారతీయ జనతా పార్టీ (బీజేపీ) మండల అధ్యక్షుడు కర్ణవత్తుల వేణు ఆధ్వర్యంలో 'చాయ్ పే చర్చ' కార్యక్రమాన్ని నిర్వహించారు. ఈ కార్యక్రమానికి బీజేపీ రాష్ట్ర అధికార ప్రతినిధి, వేములవాడ నియోజకవర్గ ఇంచార్జ్ చెన్నామనేని వికాస్ రావు ముఖ్య అతిథిగా హాజరై కార్యకర్తలు, నాయకులతో సమీక్ష సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా, వికాస్ రావు కేంద్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా చేపట్టిన SIR ప్రక్రియను వేగవంతం చేసి, అర్హులైన ఓటర్ల పేర్లు జాబితాలో నమోదయ్యేలా కృషి చేయాలని సూచించారు. అలాగే, ప్రతి బూత్‌లోని పార్టీ కార్యకర్తలు, నాయకులు ప్రజల్లోకి వెళ్లి బీజేపీ పార్టీ సిద్ధాంతాలను, కేంద్ర ప్రభుత్వ సంక్షేమ, అభివృద్ధి పథకాలను విస్తృతంగా ప్రచారం చేయాలని ఆదేశించారు. రానున్న కార్యక్రమాలలో ప్రతి కార్యకర్త సమన్వయంతో పనిచేసి, గ్రామస్థాయిలో పార్టీని మరింత బలోపేతం చేయాలని ఆయన కోరారు. అనంతరం, వికాస్ రావు దసరానాయక్ తండాలో జరుగుతున్న సేవాలాల్ మహరాజ్ ఆలయ విగ్రహ ప్రతిష్ఠాపన కార్యక్రమంలో పాల్గొన్నారు. అక్కడ ఆయన గిరిజనులతో కలిసి ప్రత్యేక పూజలు నిర్వహించారు. సేవాలాల్ మహరాజ్ ఆశీస్సులతో వర్షాలు సమృద్ధిగా కురిసి ప్రజలు సంతోషంగా ఉండాలని వేడుకున్నట్లు ఆయన తెలిపారు. ఈ కార్యక్రమాలలో మండల ప్రధాన కార్యదర్శి మల్యాల శ్రీనివాస్, ఉపాధ్యక్షులు బుక్య నరేష్, ట్రెజరర్ తల్లపెళ్లి బాలకిషన్ రావు, కార్యదర్శి బలగం శ్రీధర్, సోషల్ మీడియా కన్వీనర్ కాసోజు వంశీ, కిసాన్ మోర్చా అధ్యక్షులు అల్లూరి రవీందర్ రెడ్డి, ప్రధాన కార్యదర్శి దర్శనం లింగయ్య, అక్కినపల్లి నర్సింగరావు, భాషని దయానందం, గంటే మల్లయ్య, రాచకొండ గంగ నరసయ్య, చెట్టుపల్లి జనార్ధన, నెవురి కిషన్ తదితరులు పాల్గొన్నారు.
    1
    రాజన్న సిరిసిల్ల జిల్లా రుద్రంగిలో భారతీయ జనతా పార్టీ (బీజేపీ) మండల అధ్యక్షుడు కర్ణవత్తుల వేణు ఆధ్వర్యంలో 'చాయ్ పే చర్చ' కార్యక్రమాన్ని నిర్వహించారు. ఈ కార్యక్రమానికి బీజేపీ రాష్ట్ర అధికార ప్రతినిధి, వేములవాడ నియోజకవర్గ ఇంచార్జ్ చెన్నామనేని వికాస్ రావు ముఖ్య అతిథిగా హాజరై కార్యకర్తలు, నాయకులతో సమీక్ష సమావేశం నిర్వహించారు.

ఈ సందర్భంగా, వికాస్ రావు కేంద్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా చేపట్టిన SIR ప్రక్రియను వేగవంతం చేసి, అర్హులైన ఓటర్ల పేర్లు జాబితాలో నమోదయ్యేలా కృషి చేయాలని సూచించారు. అలాగే, ప్రతి బూత్‌లోని పార్టీ కార్యకర్తలు, నాయకులు ప్రజల్లోకి వెళ్లి బీజేపీ పార్టీ సిద్ధాంతాలను, కేంద్ర ప్రభుత్వ సంక్షేమ, అభివృద్ధి పథకాలను విస్తృతంగా ప్రచారం చేయాలని ఆదేశించారు. రానున్న కార్యక్రమాలలో ప్రతి కార్యకర్త సమన్వయంతో పనిచేసి, గ్రామస్థాయిలో పార్టీని మరింత బలోపేతం చేయాలని ఆయన కోరారు.

అనంతరం, వికాస్ రావు దసరానాయక్ తండాలో జరుగుతున్న సేవాలాల్ మహరాజ్ ఆలయ విగ్రహ ప్రతిష్ఠాపన కార్యక్రమంలో పాల్గొన్నారు. అక్కడ ఆయన గిరిజనులతో కలిసి ప్రత్యేక పూజలు నిర్వహించారు. సేవాలాల్ మహరాజ్ ఆశీస్సులతో వర్షాలు సమృద్ధిగా కురిసి ప్రజలు సంతోషంగా ఉండాలని వేడుకున్నట్లు ఆయన తెలిపారు.

ఈ కార్యక్రమాలలో మండల ప్రధాన కార్యదర్శి మల్యాల శ్రీనివాస్, ఉపాధ్యక్షులు బుక్య నరేష్, ట్రెజరర్ తల్లపెళ్లి బాలకిషన్ రావు, కార్యదర్శి బలగం శ్రీధర్, సోషల్ మీడియా కన్వీనర్ కాసోజు వంశీ, కిసాన్ మోర్చా అధ్యక్షులు అల్లూరి రవీందర్ రెడ్డి, ప్రధాన కార్యదర్శి దర్శనం లింగయ్య, అక్కినపల్లి నర్సింగరావు, భాషని దయానందం, గంటే మల్లయ్య, రాచకొండ గంగ నరసయ్య, చెట్టుపల్లి జనార్ధన, నెవురి కిషన్ తదితరులు పాల్గొన్నారు.
    user_Sai
    Sai
    Local News Reporter కోనరావుపేట, రాజన్న సిరిసిల్ల, తెలంగాణ•
    23 hrs ago
  • తెలంగాణలో విద్యా వ్యవస్థ సంక్షోభంలో ఉందని, విద్యారంగ సమస్యలను ప్రభుత్వం నిర్లక్ష్యం చేస్తోందని ఆరోపిస్తూ వామపక్ష విద్యార్థి సంఘాల (SFI, AISF, PDSU, AIDSO, AIFDS, AISB) కరీంనగర్ జిల్లా కమిటీల ఆధ్వర్యంలో నేడు విద్యాసంస్థల బంద్ నిర్వహించారు. పాఠశాలలు, కళాశాలల్లో సిబ్బంది కొరత, మౌలిక వసతుల లేమి, హాస్టళ్లలో దయనీయ పరిస్థితులు, స్కాలర్‌షిప్‌లు, ఫీజు రీయింబర్స్‌మెంట్ బకాయిలు మరియు ప్రైవేట్ విద్యాసంస్థల ఫీజుల దోపిడీని నిరసిస్తూ ఈ ఆందోళన చేపట్టారు. జిల్లా వ్యాప్తంగా ప్రైవేట్ విద్యాసంస్థలు స్వచ్ఛందంగా బంద్‌లో పాల్గొన్నాయి. బంద్‌లో భాగంగా తెలంగాణ చౌక్ నుండి బైక్ ర్యాలీ నిర్వహిస్తుండగా పోలీసులు అడ్డుకుని, ఏఐఎస్ఎఫ్, ఎస్ఎఫ్ఐ, పిడిఎస్యు, ఏఐఎస్బి, ఏఐఎఫ్డిఎస్ నాయకులను అక్రమంగా అరెస్టు చేసి పోలీస్ ట్రైనింగ్ సెంటర్‌కు తరలించారు. ఈ సందర్భంగా విద్యార్థి సంఘాల నాయకులు మాట్లాడుతూ, రేవంత్ రెడ్డి ప్రభుత్వం పోలీసులతో ఉద్యమాలను అణిచివేయాలని చూస్తోందని, విద్యారంగాన్ని నిర్వీర్యం చేస్తే కేసీఆర్‌కు పట్టిన గతే రేవంత్ రెడ్డికి పడుతుందని హెచ్చరించారు. ప్రభుత్వ విద్యను పరిరక్షించాలని, సమస్యలను తక్షణమే పరిష్కరించాలని వారు డిమాండ్ చేశారు. ప్రభుత్వ పాఠశాలల్లో ఖాళీ పోస్టుల భర్తీ, హాస్టళ్లలో నాణ్యమైన భోజనం, తాగునీరు, వైద్య సదుపాయాల కల్పన, ఫీజు నియంత్రణ చట్టం అమలు, మహిళా విద్యార్థుల భద్రత, విద్యార్థి సంఘాల ఎన్నికల నిర్వహణ, కాంట్రాక్ట్ అధ్యాపకుల సమస్యల పరిష్కారం, మరియు జాతీయ విద్యా విధానం (NEP-2020) అమలును నిలిపివేయాలని వారు డిమాండ్ చేశారు. ఈ కార్యక్రమంలో కసిరెడ్డి మణికంఠ రెడ్డి, గజ్జెల శ్రీకాంత్, రామప్రతాప్, మచ్చ రమేష్, అంగడి కుమార్, గడ్డం శ్రీకాంత్, అతీకము రాజశేఖర్‌తో పాటు పలువురు విద్యార్థి సంఘాల నాయకులు పాల్గొన్నారు.
    3
    తెలంగాణలో విద్యా వ్యవస్థ సంక్షోభంలో ఉందని, విద్యారంగ సమస్యలను ప్రభుత్వం నిర్లక్ష్యం చేస్తోందని ఆరోపిస్తూ వామపక్ష విద్యార్థి సంఘాల (SFI, AISF, PDSU, AIDSO, AIFDS, AISB) కరీంనగర్ జిల్లా కమిటీల ఆధ్వర్యంలో నేడు విద్యాసంస్థల బంద్ నిర్వహించారు. పాఠశాలలు, కళాశాలల్లో సిబ్బంది కొరత, మౌలిక వసతుల లేమి, హాస్టళ్లలో దయనీయ పరిస్థితులు, స్కాలర్‌షిప్‌లు, ఫీజు రీయింబర్స్‌మెంట్ బకాయిలు మరియు ప్రైవేట్ విద్యాసంస్థల ఫీజుల దోపిడీని నిరసిస్తూ ఈ ఆందోళన చేపట్టారు. జిల్లా వ్యాప్తంగా ప్రైవేట్ విద్యాసంస్థలు స్వచ్ఛందంగా బంద్‌లో పాల్గొన్నాయి.

బంద్‌లో భాగంగా తెలంగాణ చౌక్ నుండి బైక్ ర్యాలీ నిర్వహిస్తుండగా పోలీసులు అడ్డుకుని, ఏఐఎస్ఎఫ్, ఎస్ఎఫ్ఐ, పిడిఎస్యు, ఏఐఎస్బి, ఏఐఎఫ్డిఎస్ నాయకులను అక్రమంగా అరెస్టు చేసి పోలీస్ ట్రైనింగ్ సెంటర్‌కు తరలించారు. ఈ సందర్భంగా విద్యార్థి సంఘాల నాయకులు మాట్లాడుతూ, రేవంత్ రెడ్డి ప్రభుత్వం పోలీసులతో ఉద్యమాలను అణిచివేయాలని చూస్తోందని, విద్యారంగాన్ని నిర్వీర్యం చేస్తే కేసీఆర్‌కు పట్టిన గతే రేవంత్ రెడ్డికి పడుతుందని హెచ్చరించారు. ప్రభుత్వ విద్యను పరిరక్షించాలని, సమస్యలను తక్షణమే పరిష్కరించాలని వారు డిమాండ్ చేశారు.

ప్రభుత్వ పాఠశాలల్లో ఖాళీ పోస్టుల భర్తీ, హాస్టళ్లలో నాణ్యమైన భోజనం, తాగునీరు, వైద్య సదుపాయాల కల్పన, ఫీజు నియంత్రణ చట్టం అమలు, మహిళా విద్యార్థుల భద్రత, విద్యార్థి సంఘాల ఎన్నికల నిర్వహణ, కాంట్రాక్ట్ అధ్యాపకుల సమస్యల పరిష్కారం, మరియు జాతీయ విద్యా విధానం (NEP-2020) అమలును నిలిపివేయాలని వారు డిమాండ్ చేశారు. ఈ కార్యక్రమంలో కసిరెడ్డి మణికంఠ రెడ్డి, గజ్జెల శ్రీకాంత్, రామప్రతాప్, మచ్చ రమేష్, అంగడి కుమార్, గడ్డం శ్రీకాంత్, అతీకము రాజశేఖర్‌తో పాటు పలువురు విద్యార్థి సంఘాల నాయకులు పాల్గొన్నారు.
    user_OM NAMSHIVAYA
    OM NAMSHIVAYA
    Karimnagar, Telangana•
    2 hrs ago
  • రాజన్న సిరిసిల్ల జిల్లా వీర్నపల్లి మండల కేంద్రంలో గుర్తు తెలియని వ్యక్తులు రెండు కార్లను దగ్ధం చేశారు. ఈ ఘటనకు సంబంధించిన పూర్తి వివరాలు ఇంకా తెలియాల్సి ఉంది.
    3
    రాజన్న సిరిసిల్ల జిల్లా వీర్నపల్లి మండల కేంద్రంలో గుర్తు తెలియని వ్యక్తులు రెండు కార్లను దగ్ధం చేశారు. ఈ ఘటనకు సంబంధించిన పూర్తి వివరాలు ఇంకా తెలియాల్సి ఉంది.
    user_Sai
    Sai
    Local News Reporter కోనరావుపేట, రాజన్న సిరిసిల్ల, తెలంగాణ•
    3 hrs ago
View latest news on Shuru App
Download_Android
  • Terms & Conditions
  • Career
  • Privacy Policy
  • Blogs
Shuru, a product of Close App Private Limited.