logo
Shuru
Apke Nagar Ki App…
  • Latest News
  • News
  • Politics
  • Elections
  • Viral
  • Astrology
  • Horoscope in Hindi
  • Horoscope in English
  • Latest Political News
logo
Shuru
Apke Nagar Ki App…

కమలాపూర్‌లో గంజాయి మత్తులో నలుగురి వీరంగం.. నడిరోడ్డుపై వ్యక్తిపై దాడి! హన్మకొండ జిల్లా కమలాపూర్ మండల కేంద్రంలోని సబ్‌స్టేషన్ వద్ద గంజాయి మత్తులో నలుగురు వ్యక్తులు ఓ వ్యక్తిపై నడిరోడ్డుపై దాడికి పాల్పడ్డారు. ఈ ఘటనకు సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది. గంజాయి మత్తులో బహిరంగంగా దాడికి పాల్పడటంతో స్థానికులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. ఇతర రాష్ట్రాల నుంచి వచ్చిన కొందరు కార్మికులు తరచూ గొడవలకు పాల్పడుతున్నారని స్థానికులు ఆరోపిస్తున్నారు. కమలాపూర్‌లో గంజాయి విక్రయాలు, అసాంఘిక కార్యకలాపాలకు అడ్డుకట్ట వేసేందుకు పోలీసులు కఠిన చర్యలు తీసుకోవాలని కోరుతున్నారు. ఘటనపై పోలీసులు విచారణ చేపట్టారు.

9 hrs ago
user_M D Azizuddin
M D Azizuddin
జర్నలిస్ట్ వర్ధన్నపేట, వరంగల్, తెలంగాణ•
9 hrs ago

కమలాపూర్‌లో గంజాయి మత్తులో నలుగురి వీరంగం.. నడిరోడ్డుపై వ్యక్తిపై దాడి! హన్మకొండ జిల్లా కమలాపూర్ మండల కేంద్రంలోని సబ్‌స్టేషన్ వద్ద గంజాయి మత్తులో నలుగురు వ్యక్తులు ఓ వ్యక్తిపై నడిరోడ్డుపై దాడికి పాల్పడ్డారు. ఈ ఘటనకు సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది. గంజాయి మత్తులో బహిరంగంగా దాడికి పాల్పడటంతో స్థానికులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. ఇతర రాష్ట్రాల నుంచి వచ్చిన కొందరు కార్మికులు తరచూ గొడవలకు పాల్పడుతున్నారని స్థానికులు ఆరోపిస్తున్నారు. కమలాపూర్‌లో గంజాయి విక్రయాలు, అసాంఘిక కార్యకలాపాలకు అడ్డుకట్ట వేసేందుకు పోలీసులు కఠిన చర్యలు తీసుకోవాలని కోరుతున్నారు. ఘటనపై పోలీసులు విచారణ చేపట్టారు.

More news from తెలంగాణ and nearby areas
  • దళిత క్రైస్తవులకు ఎస్సీ హోదా కల్పించాలనీ జిల్లా ప్రైస్ సిటీ క్రైస్తవ సంఘం ఆధ్వర్యంలో హనుమకొండ కలెక్టరేట్ ఎదుట నిరసన దళిత క్రైస్తవులకు ఎస్సీ హోదా కల్పించాలనే ప్రధాన డిమాండ్‌తో వరంగల్ ప్రైస్ సిటీ క్రైస్తవ సంఘం ఆధ్వర్యంలో.. హనుమకొండ కలెక్టరేట్ ఎదుట నిరసనకు దిగారు. ఈ నిరసనలో భాగంగా సెంటనరీ బాప్టిస్ట్ చర్చి నుంచి హనుమకొండ ప్రభుత్వ వరకు శాంతియుతంగా భారీ ర్యాలీ నిర్వహించారు. తమ న్యాయమైన డిమాండ్లను కేంద్ర ప్రభుత్వం తక్షణమే పరిష్కరించాలని డిమాండ్ చేశారు.
    1
    దళిత క్రైస్తవులకు ఎస్సీ హోదా కల్పించాలనీ జిల్లా ప్రైస్ సిటీ క్రైస్తవ సంఘం ఆధ్వర్యంలో హనుమకొండ కలెక్టరేట్ ఎదుట నిరసన
దళిత క్రైస్తవులకు ఎస్సీ హోదా కల్పించాలనే ప్రధాన డిమాండ్‌తో వరంగల్ ప్రైస్ సిటీ క్రైస్తవ సంఘం ఆధ్వర్యంలో.. హనుమకొండ కలెక్టరేట్ ఎదుట నిరసనకు దిగారు. ఈ నిరసనలో భాగంగా సెంటనరీ బాప్టిస్ట్ చర్చి నుంచి హనుమకొండ ప్రభుత్వ వరకు శాంతియుతంగా భారీ ర్యాలీ నిర్వహించారు. తమ న్యాయమైన డిమాండ్లను కేంద్ర ప్రభుత్వం తక్షణమే పరిష్కరించాలని డిమాండ్ చేశారు.
    user_Shareef pasha
    Shareef pasha
    Local News Reporter పాలకుర్తి, జనగాం, తెలంగాణ•
    23 hrs ago
  • గుప్తనిధుల పేరుతో క్షుద్ర పూజ చేస్తామంటూ కలరింగ్ గుప్తనిధుల పేరుతో మోసం పాల్పడుతున్న ముఠాగట్టురట్టు నలుగురు నిందితుల అరెస్టు *గుప్తనిధుల పేరుతో క్షుద్రపూజ చేస్తానంటూ కలరింగ్..!* శంషాబాద్ జోన్ కమిషనర్ టాస్క్‌ఫోర్స్ – 'గుప్త నిధుల' పేరుతో మోసాలకు పాల్పడుతున్న ముఠా గుట్టు రట్టు – నలుగురు నిందితుల అరెస్ట్* *స్వాధీనం చేసుకున్న సొత్తు: 02 కార్లు, 01 ఆటో, 02 మోటార్ సైకిళ్లు, 04 సెల్ ఫోన్లు, నకిలీ బంగారు నాణేలు మరియు బొగ్గు.* హైదరాబాదు:: రాజేంద్రనగర్ పోలీసుల భాగస్వామ్యంతో శంషాబాద్ జోన్ కమిషనర్ టాస్క్‌ఫోర్స్ పోలీసులు, ఇళ్ల కింద గుప్త నిధులు ఉన్నాయంటూ అమాయకులను నమ్మించి మోసగిస్తున్న ఒక ముఠాను విజయవంతంగా పట్టుకున్నారు. ఈ కేసుకు సంబంధించి నలుగురు (04) నిందితులను అదుపులోకి తీసుకుని, వారి వద్ద నుండి పలు వాహనాలను మరియు ఇతర సామగ్రిని స్వాధీనం చేసుకున్నారు. *అరెస్టయిన నిందితుల వివరాలు:* మహ్మద్ మునావర్ అలియాస్ మున్నా (36) – తండ్రి: మహ్మద్ అన్వర్, వృత్తి: కార్ల డెంటింగ్ & పెయింటింగ్, నివాసం: గుడిమల్కాపూర్, హైదరాబాద్. సయ్యద్ అలీ అష్రఫ్ (40) – తండ్రి: సయ్యద్ మూసా, వృత్తి: ఎలక్ట్రీషియన్, నివాసం: ఫర్హాన్ నగర్, జవహర్ నగర్, ECIL, మేడ్చల్-మల్కాజ్‌గిరి జిల్లా. మహ్మద్ హాజీ (25) – తండ్రి: మహ్మద్ ఖాజా, వృత్తి: ఆటో డ్రైవర్, నివాసం: బాలాజీ నగర్, జవహర్ నగర్, ECIL, మేడ్చల్-మల్కాజ్‌గిరి జిల్లా. మహ్మద్ సల్మాన్ (29) – తండ్రి: మహ్మద్ అన్వర్, వృత్తి: బైక్ మెకానిక్, నివాసం: యాదగిరిపల్లి (గ్రామం), కీసర (మండలం), మేడ్చల్-మల్కాజ్‌గిరి జిల్లా. *స్వాధీనం చేసుకున్న వస్తువులు:* 02 నాలుగు చక్రాల వాహనాలు (కార్లు) 01 ఆటో రిక్షా 02 మోటార్ సైకిళ్లు 04 సెల్ ఫోన్లు 25 నకిలీ (బంగారు పూత పూసిన) నాణేలు 6 కేజీల బొగ్గు 4 కేజీల మట్టి పూజా సామగ్రి ప్రధాన నిందితుడు మునావర్ పాత నేరాల చరిత్ర: బేగంబజార్ పోలీస్ స్టేషన్ పరిధిలో 01 మోసం (Cheating) కేసు నమోదు. *నేరం చేసిన తీరు (Modus Operandi):* ప్రధాన నిందితుడు మహ్మద్ మునావర్ హైదరాబాద్‌లో జన్మించి పెరిగాడు. చదువు పూర్తయిన తర్వాత కార్ల డెంటింగ్ మరియు పెయింటింగ్ పనులు చేస్తూ జీవనం సాగిస్తున్నాడు. అయితే, వచ్చే ఆదాయం కుటుంబ ఖర్చులకు సరిపోకపోవడంతో, సులభంగా డబ్బు సంపాదించాలనే ఉద్దేశంతో ఒక కుట్ర పన్నుతాడు. ఇళ్ల కింద పూడ్చిపెట్టిన గుప్త నిధులను బయటకు తీసే ప్రత్యేక విద్య తనకు వచ్చు అని ప్రచారం చేసుకుంటూ అమాయకులను మోసం చేయడం ప్రారంభించాడు. ఈ క్రమంలో మునావర్ తన స్నేహితులైన సయ్యద్ అలీ అష్రఫ్, మహ్మద్ హాజీ, మహ్మద్ సల్మాన్‌లను సంప్రదించి తన పథకాన్ని వివరించాడు. ఈ అక్రమ మార్గంలో సులభంగా డబ్బు సంపాదించవచ్చని భావించిన వారు కూడా ఇందుకు అంగీకరించారు. ఆ తర్వాత, నిందితులు అమాయక ప్రజలను సమీపించి, తమకు ప్రత్యేక శక్తులు ఉన్నాయని, వారి నివాస స్థలాల కింద భూమిలో గుప్త నిధులు ఉన్నాయని నమ్మించేవారు. వారు సూచించిన ప్రదేశంలో గుంత తీసిన తర్వాత, ముందే సిద్ధం చేసుకున్న బొగ్గు మరియు నకిలీ బంగారు నాణేలు ఉన్న సంచిని రహస్యంగా అందులో ఉంచేవారు. ఆ తర్వాత, పూజలు చేసి, ఆ బొగ్గు బంగారంగా మారడానికి కొంత సమయం పడుతుందని చెప్పి నిందితులు అక్కడ నుండి పరారయ్యేవారు. ఈ ముఠా వివిధ ప్రాంతాల్లో దాదాపు 11 మందిని మోసం చేసి, సుమారు రూ. 1 కోటి వరకు వసూలు చేసినట్లు ఆధారాలు లభించాయి. ఈ ఘటనపై రాజేంద్రనగర్ పోలీస్ స్టేషన్‌లో క్రైమ్ నంబర్ 916/2026, బిఎన్ఎస్ (BNS) చట్టంలోని సెక్షన్లు 318(4), 351(2), 61(2) r/w 3(5) కింద కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. ప్రజలకు విజ్ఞప్తి: ఇటీవలి కాలంలో కొందరు కేటుగాళ్లు వీధులు, గ్రామాలు, పట్టణాల్లో తిరుగుతూ కొన్ని ప్రాంతాల్లో గుప్త నిధులు ఉన్నాయని, వాటిని తీసి ఇస్తామని చెప్పి అమాయక ప్రజలను మోసం చేస్తున్నట్లు పోలీసుల దృష్టికి వచ్చింది. కాబట్టి, సదరు మోసగాళ్లను, వారి మాటలను నమ్మి ప్రజలెవరూ మోసపోవద్దని పోలీసులు హెచ్చరిస్తున్నారు. ఎవరైనా ఇటువంటి అక్రమ లేదా చట్టవిరుద్ధమైన కార్యకలాపాలకు పాల్పడుతున్నట్లు తెలిస్తే వెంటనే పోలీసులకు సమాచారం అందించాలని కోరడమైనది. హైదరాబాద్ సిటీ శంషాబాద్ జోన్ టాస్క్‌ఫోర్స్ ఇన్స్‌పెక్టర్ కె. రవి, సబ్‌ఇన్స్‌పెక్టర్లు కె. మన్సూర్ అలీ, నర్సింగరావు, ఎస్. శేషు, ఇతర టాస్క్‌ఫోర్స్ సిబ్బంది మరియు రాజేంద్రనగర్ పోలీసుల సమన్వయంతో ఈ ముఠాను పట్టుకోవడం జరిగింది. (కె.ఎస్. రావు) అడిషనల్ డిప్యూటీ కమిషనర్ ఆఫ్ పోలీస్, టాస్క్‌ఫోర్స్, రాజేంద్రనగర్ & శంషాబాద్ జోన్స్, హైదరాబాద్ సిటీ.
    1
    గుప్తనిధుల పేరుతో క్షుద్ర పూజ చేస్తామంటూ కలరింగ్ గుప్తనిధుల పేరుతో మోసం పాల్పడుతున్న ముఠాగట్టురట్టు నలుగురు నిందితుల అరెస్టు 
*గుప్తనిధుల పేరుతో క్షుద్రపూజ చేస్తానంటూ కలరింగ్..!* 
శంషాబాద్ జోన్ కమిషనర్ టాస్క్‌ఫోర్స్ – 'గుప్త నిధుల' పేరుతో మోసాలకు పాల్పడుతున్న ముఠా గుట్టు రట్టు – నలుగురు నిందితుల అరెస్ట్*
*స్వాధీనం చేసుకున్న సొత్తు: 02 కార్లు, 01 ఆటో, 02 మోటార్ సైకిళ్లు, 04 సెల్ ఫోన్లు, నకిలీ బంగారు నాణేలు మరియు బొగ్గు.*
హైదరాబాదు:: రాజేంద్రనగర్ పోలీసుల భాగస్వామ్యంతో శంషాబాద్ జోన్ కమిషనర్ టాస్క్‌ఫోర్స్ పోలీసులు, ఇళ్ల కింద గుప్త నిధులు ఉన్నాయంటూ అమాయకులను నమ్మించి మోసగిస్తున్న ఒక ముఠాను విజయవంతంగా పట్టుకున్నారు. ఈ కేసుకు సంబంధించి నలుగురు (04) నిందితులను అదుపులోకి తీసుకుని, వారి వద్ద నుండి పలు వాహనాలను మరియు ఇతర సామగ్రిని స్వాధీనం చేసుకున్నారు.
*అరెస్టయిన నిందితుల వివరాలు:*
మహ్మద్ మునావర్ అలియాస్ మున్నా (36) – తండ్రి: మహ్మద్ అన్వర్, వృత్తి: కార్ల డెంటింగ్ & పెయింటింగ్, నివాసం: గుడిమల్కాపూర్, హైదరాబాద్.
సయ్యద్ అలీ అష్రఫ్ (40) – తండ్రి: సయ్యద్ మూసా, వృత్తి: ఎలక్ట్రీషియన్, నివాసం: ఫర్హాన్ నగర్, జవహర్ నగర్, ECIL, మేడ్చల్-మల్కాజ్‌గిరి జిల్లా.
మహ్మద్ హాజీ (25) – తండ్రి: మహ్మద్ ఖాజా, వృత్తి: ఆటో డ్రైవర్, నివాసం: బాలాజీ నగర్, జవహర్ నగర్, ECIL, మేడ్చల్-మల్కాజ్‌గిరి జిల్లా.
మహ్మద్ సల్మాన్ (29) – తండ్రి: మహ్మద్ అన్వర్, వృత్తి: బైక్ మెకానిక్, నివాసం: యాదగిరిపల్లి (గ్రామం), కీసర (మండలం), మేడ్చల్-మల్కాజ్‌గిరి జిల్లా.
*స్వాధీనం చేసుకున్న వస్తువులు:*
02 నాలుగు చక్రాల వాహనాలు (కార్లు)
01 ఆటో రిక్షా
02 మోటార్ సైకిళ్లు
04 సెల్ ఫోన్లు
25 నకిలీ (బంగారు పూత పూసిన) నాణేలు
6 కేజీల బొగ్గు
4 కేజీల మట్టి
పూజా సామగ్రి
ప్రధాన నిందితుడు మునావర్ పాత నేరాల చరిత్ర: 
బేగంబజార్ పోలీస్ స్టేషన్ పరిధిలో 01 మోసం (Cheating) కేసు నమోదు.
*నేరం చేసిన తీరు (Modus Operandi):*
ప్రధాన నిందితుడు మహ్మద్ మునావర్ హైదరాబాద్‌లో జన్మించి పెరిగాడు. చదువు పూర్తయిన తర్వాత కార్ల డెంటింగ్ మరియు పెయింటింగ్ పనులు చేస్తూ జీవనం సాగిస్తున్నాడు. అయితే, వచ్చే ఆదాయం కుటుంబ ఖర్చులకు సరిపోకపోవడంతో, సులభంగా డబ్బు సంపాదించాలనే ఉద్దేశంతో ఒక కుట్ర పన్నుతాడు. ఇళ్ల కింద పూడ్చిపెట్టిన గుప్త నిధులను బయటకు తీసే ప్రత్యేక విద్య తనకు వచ్చు అని ప్రచారం చేసుకుంటూ అమాయకులను మోసం చేయడం ప్రారంభించాడు.
ఈ క్రమంలో మునావర్ తన స్నేహితులైన సయ్యద్ అలీ అష్రఫ్, మహ్మద్ హాజీ, మహ్మద్ సల్మాన్‌లను సంప్రదించి తన పథకాన్ని వివరించాడు. ఈ అక్రమ మార్గంలో సులభంగా డబ్బు సంపాదించవచ్చని భావించిన వారు కూడా ఇందుకు అంగీకరించారు. ఆ తర్వాత, నిందితులు అమాయక ప్రజలను సమీపించి, తమకు ప్రత్యేక శక్తులు ఉన్నాయని, వారి నివాస స్థలాల కింద భూమిలో గుప్త నిధులు ఉన్నాయని నమ్మించేవారు. వారు సూచించిన ప్రదేశంలో గుంత తీసిన తర్వాత, ముందే సిద్ధం చేసుకున్న బొగ్గు మరియు నకిలీ బంగారు నాణేలు ఉన్న సంచిని రహస్యంగా అందులో ఉంచేవారు. ఆ తర్వాత, పూజలు చేసి, ఆ బొగ్గు బంగారంగా మారడానికి కొంత సమయం పడుతుందని చెప్పి నిందితులు అక్కడ నుండి పరారయ్యేవారు.
ఈ ముఠా వివిధ ప్రాంతాల్లో దాదాపు 11 మందిని మోసం చేసి, సుమారు రూ. 1 కోటి వరకు వసూలు చేసినట్లు ఆధారాలు లభించాయి. ఈ ఘటనపై రాజేంద్రనగర్ పోలీస్ స్టేషన్‌లో క్రైమ్ నంబర్ 916/2026, బిఎన్ఎస్ (BNS) చట్టంలోని సెక్షన్లు 318(4), 351(2), 61(2) r/w 3(5) కింద కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.
ప్రజలకు విజ్ఞప్తి:
ఇటీవలి కాలంలో కొందరు కేటుగాళ్లు వీధులు, గ్రామాలు, పట్టణాల్లో తిరుగుతూ కొన్ని ప్రాంతాల్లో గుప్త నిధులు ఉన్నాయని, వాటిని తీసి ఇస్తామని చెప్పి అమాయక ప్రజలను మోసం చేస్తున్నట్లు పోలీసుల దృష్టికి వచ్చింది. కాబట్టి, సదరు మోసగాళ్లను, వారి మాటలను నమ్మి ప్రజలెవరూ మోసపోవద్దని పోలీసులు హెచ్చరిస్తున్నారు. ఎవరైనా ఇటువంటి అక్రమ లేదా చట్టవిరుద్ధమైన కార్యకలాపాలకు పాల్పడుతున్నట్లు తెలిస్తే వెంటనే పోలీసులకు సమాచారం అందించాలని కోరడమైనది.
హైదరాబాద్ సిటీ శంషాబాద్ జోన్ టాస్క్‌ఫోర్స్ ఇన్స్‌పెక్టర్ కె. రవి, సబ్‌ఇన్స్‌పెక్టర్లు కె. మన్సూర్ అలీ, నర్సింగరావు, ఎస్. శేషు, ఇతర టాస్క్‌ఫోర్స్ సిబ్బంది మరియు రాజేంద్రనగర్ పోలీసుల సమన్వయంతో ఈ ముఠాను పట్టుకోవడం జరిగింది.
(కె.ఎస్. రావు)
అడిషనల్ డిప్యూటీ కమిషనర్ ఆఫ్ పోలీస్,
టాస్క్‌ఫోర్స్, రాజేంద్రనగర్ & శంషాబాద్ జోన్స్,
హైదరాబాద్ సిటీ.
    user_SIRIPATI ARUNKUMAR
    SIRIPATI ARUNKUMAR
    Auditor బచ్చన్నపేట, జనగాం, తెలంగాణ•
    2 hrs ago
  • కరీంనగర్ కిసాన్ నగర్ ఘర్షణ దాడి కేసులో కార్పొరేటర్ తో సహా 7 గురు అరెస్టు...శాంతి భద్రతలకు విఘాతం కలిగిస్తే కఠిన చర్యలు తప్పవని పోలీసులు హెచ్చరిక కరీంనగర్ లోని 29 వ డివిజన్ కిసాన్ నగర్ లో రెండు రోజుల క్రితం జరిగిన ఘర్షణ దాడి కేసులో కార్పొరేటర్ సోమిడి వేణుప్రసాద్ తో సహా ఏడుగురిని పోలీసులు అరెస్టు చేశారు. రాజకీయ కక్షలతో కిసాన్ నగర్ లో గత కొంతకాలంగా బిఆర్ఎస్ బిజెపి కార్యకర్తల మధ్య ఘర్షణ వాతావరణం నెలకొంది. దీంతో ఆదివారం రాత్రి బిజెపికి చెందిన కార్యకర్తలు టిఆర్ఎస్ కు చెందిన శ్రీకాంత్ శేఖర్ ల పై దాడి చేశారు.‌ దాడిలో శ్రీకాంత్ కు రక్త గాయాలు కావడంతో శ్రీకాంత్ తో పాటు శేఖర్ ఫిర్యాదు మేరకు పోలీసులు స్థానిక కార్పొరేటర్ వేణు ప్రసాద్ తోపాటు నాగేందర్, మధు, భానుచందర్, వేణు, శశిధర్ పై హత్నాయత్నంతో పాటు ఎస్సీ ఎస్టీ అట్రాసిటీ కేసు నమోదు చేశారు. ఏడుగురిని అరెస్టు చేసి కోర్టులో హాజరుపరిచి రిమాండ్ కు తరలించామని అడిషనల్ డిసిపి వెంకటరమణ ప్రకటించారు.
    2
    కరీంనగర్ కిసాన్ నగర్ ఘర్షణ దాడి కేసులో కార్పొరేటర్ తో సహా 7 గురు అరెస్టు...శాంతి భద్రతలకు విఘాతం కలిగిస్తే కఠిన చర్యలు తప్పవని పోలీసులు హెచ్చరిక
కరీంనగర్ లోని 29 వ డివిజన్ కిసాన్ నగర్ లో రెండు రోజుల క్రితం జరిగిన ఘర్షణ దాడి కేసులో కార్పొరేటర్ సోమిడి వేణుప్రసాద్ తో సహా ఏడుగురిని పోలీసులు అరెస్టు చేశారు. రాజకీయ కక్షలతో కిసాన్ నగర్ లో గత కొంతకాలంగా బిఆర్ఎస్ బిజెపి కార్యకర్తల మధ్య ఘర్షణ వాతావరణం నెలకొంది. దీంతో ఆదివారం రాత్రి బిజెపికి చెందిన కార్యకర్తలు టిఆర్ఎస్ కు చెందిన శ్రీకాంత్ శేఖర్ ల పై దాడి చేశారు.‌ దాడిలో శ్రీకాంత్ కు రక్త గాయాలు కావడంతో శ్రీకాంత్ తో పాటు శేఖర్ ఫిర్యాదు మేరకు పోలీసులు స్థానిక కార్పొరేటర్ వేణు ప్రసాద్ తోపాటు నాగేందర్, మధు, భానుచందర్, వేణు, శశిధర్ పై హత్నాయత్నంతో పాటు ఎస్సీ ఎస్టీ అట్రాసిటీ కేసు నమోదు చేశారు.
ఏడుగురిని అరెస్టు చేసి కోర్టులో హాజరుపరిచి రిమాండ్ కు తరలించామని  అడిషనల్ డిసిపి వెంకటరమణ ప్రకటించారు.
    user_K.V.REDDY
    K.V.REDDY
    చిగురుమామిడి, కరీంనగర్, తెలంగాణ•
    38 min ago
  • తల్లిపాలపై అవగాహన కల్పించిన అంగన్వాడీ సిబ్బంది .... వడ్లూరులో తల్లిపాల వారోత్సవాలు సిద్దిపేట జిల్లా బెజ్జంకి మండలం వడ్లూరు గ్రామంలోని అంగన్వాడీ కేంద్రంలో తల్లిపాల వారోత్సవాలను నిర్వహించారు. ఈ సందర్భంగా గర్భిణులు, బాలింతలకు తల్లిపాల ప్రాముఖ్యతపై అవగాహన కల్పించారు. శిశువు పుట్టిన వెంటనే తల్లిపాలు పట్టించడం, తొలి ఆరు నెలలు తల్లిపాలను మాత్రమే అందించడం ద్వారా బిడ్డ ఆరోగ్యంగా ఎదుగుతాడని వివరించారు. తల్లిపాలు శిశువుకు అవసరమైన పోషకాలను అందించడంతో పాటు వ్యాధి నిరోధక శక్తిని పెంచుతాయని తెలిపారు. తల్లులు పోషకాహారం తీసుకోవాలని సూచించారు. కార్యక్రమంలో సర్పంచ్ పులి రమేష్, గ్రామ కార్యదర్శి పద్మ, అంగన్వాడీ టీచర్లు, ఆశా కార్యకర్తలు, గర్భిణులు, బాలింతలు పాల్గొన్నారు.
    2
    తల్లిపాలపై అవగాహన కల్పించిన అంగన్వాడీ సిబ్బంది .... వడ్లూరులో తల్లిపాల వారోత్సవాలు
సిద్దిపేట జిల్లా బెజ్జంకి మండలం వడ్లూరు 
గ్రామంలోని అంగన్వాడీ కేంద్రంలో తల్లిపాల వారోత్సవాలను నిర్వహించారు. ఈ సందర్భంగా గర్భిణులు, బాలింతలకు తల్లిపాల ప్రాముఖ్యతపై అవగాహన కల్పించారు. శిశువు పుట్టిన వెంటనే తల్లిపాలు పట్టించడం, తొలి ఆరు నెలలు తల్లిపాలను మాత్రమే అందించడం ద్వారా బిడ్డ ఆరోగ్యంగా ఎదుగుతాడని వివరించారు. తల్లిపాలు శిశువుకు అవసరమైన పోషకాలను అందించడంతో పాటు వ్యాధి నిరోధక శక్తిని పెంచుతాయని తెలిపారు. తల్లులు పోషకాహారం తీసుకోవాలని సూచించారు. కార్యక్రమంలో సర్పంచ్ పులి రమేష్, గ్రామ కార్యదర్శి పద్మ, అంగన్వాడీ టీచర్లు, ఆశా కార్యకర్తలు, గర్భిణులు, బాలింతలు పాల్గొన్నారు.
    user_ప్రభాకర్
    ప్రభాకర్
    Farmer బెజ్జంకి, సిద్దిపేట, తెలంగాణ•
    2 hrs ago
  • యాదాద్రి శ్రీ లక్ష్మీనరసింహస్వామి వారి ఆలయంలో భక్తుల రద్దీ సాధారణం ప్రసిద్ధ పుణ్యక్షేత్రం యాదగిరిగుట్ట శ్రీ లక్ష్మీనరసింహస్వామి వారి ఆలయంలో ఆషాడ మాసం మంగళవారం భక్తుల రద్దీ సర్వ సాధారణంగా కొనసాగుతోంది. ఆలయంలో రద్దీ తక్కువగా ఉన్నందున సర్వదర్శనాలకు గంట, ప్రత్యేక దర్శనానికి అరగంట సమయం మాత్రమే పడుతుంది. స్వామివారికి శాస్త్రోక్తంగా నిత్య కైంకర్యాలు కొనసాగుతున్నాయి. భక్తులు పాల్గొని మొక్కులు తీర్చుకుంటున్నారు.
    1
    యాదాద్రి శ్రీ లక్ష్మీనరసింహస్వామి వారి ఆలయంలో భక్తుల రద్దీ సాధారణం
ప్రసిద్ధ పుణ్యక్షేత్రం యాదగిరిగుట్ట శ్రీ లక్ష్మీనరసింహస్వామి వారి ఆలయంలో ఆషాడ మాసం మంగళవారం భక్తుల రద్దీ సర్వ సాధారణంగా కొనసాగుతోంది. ఆలయంలో రద్దీ తక్కువగా ఉన్నందున సర్వదర్శనాలకు గంట, ప్రత్యేక దర్శనానికి అరగంట సమయం మాత్రమే పడుతుంది. స్వామివారికి శాస్త్రోక్తంగా నిత్య కైంకర్యాలు కొనసాగుతున్నాయి. భక్తులు పాల్గొని మొక్కులు తీర్చుకుంటున్నారు.
    user_P.srinu
    P.srinu
    యాదగిరిగుట్ట, యాదాద్రి భువనగిరి, తెలంగాణ•
    5 hrs ago
  • రత్నవరంలో బోనాల సందడి.................................... సూర్యాపేట జిల్లా నడిగూడెం మండలం రత్నవరం గ్రామంలోని హరిహర క్షేత్రంలో కొలువైన శ్రీ కనకదుర్గమ్మ అమ్మవారికి భక్తులు ఘనంగా బోనాలు సమర్పించారు. మహిళలు భక్తిశ్రద్ధలతో బోనాలు తీసుకొచ్చి అమ్మవారిని దర్శించుకున్నారు. అనంతరం ఆటపాటలతో సందడి చేశారు. గ్రామస్థులు, భక్తులు పెద్ద సంఖ్యలో పాల్గొని ఉత్సవాన్ని ఆనందోత్సాహాలతో జరుపుకున్నారు. మహిళల బోనాల సమర్పణతో ఆలయ పరిసరాలు భక్తిభావంతో కళకళలాడాయి.
    1
    రత్నవరంలో బోనాల సందడి....................................
సూర్యాపేట జిల్లా  నడిగూడెం మండలం రత్నవరం గ్రామంలోని హరిహర క్షేత్రంలో కొలువైన శ్రీ కనకదుర్గమ్మ అమ్మవారికి భక్తులు ఘనంగా బోనాలు సమర్పించారు. మహిళలు భక్తిశ్రద్ధలతో బోనాలు తీసుకొచ్చి అమ్మవారిని దర్శించుకున్నారు. అనంతరం ఆటపాటలతో సందడి చేశారు. గ్రామస్థులు, భక్తులు పెద్ద సంఖ్యలో పాల్గొని ఉత్సవాన్ని ఆనందోత్సాహాలతో జరుపుకున్నారు. మహిళల బోనాల సమర్పణతో ఆలయ పరిసరాలు భక్తిభావంతో కళకళలాడాయి.
    user_K. UPENDER
    K. UPENDER
    Farmer నాదిగూడెం, సూర్యాపేట, తెలంగాణ•
    12 hrs ago
  • రాత్రివేళ గ్రామాల్లో పర్యటిస్తూ కార్యకర్తలకు భరోసా.. అనారోగ్యంతో ఉన్న కాంగ్రెస్ కార్యకర్తకు ఎమ్మెల్యే పరామర్శ ఆపదలో ఉన్న కార్యకర్తలు ఏ సమయంలోనైనా తనకు ఫోన్ చేయాలని, వారికి అండగా నిలిచే విషయంలో వెనక్కి తగ్గేది లేదని ప్రభుత్వ విప్, డోర్నకల్ ఎమ్మెల్యే డాక్టర్ జాటోత్ రామచంద్ర నాయక్ భరోసా ఇచ్చారు. మహబూబాబాద్ జిల్లా కురవి మండలం రాజోలు గ్రామంలో అనారోగ్యంతో ఉన్న కాంగ్రెస్ కార్యకర్తను రామచంద్ర నాయక్ పరామర్శించారు. రాత్రివేళ గ్రామాల్లో పర్యటిస్తూ పార్టీ కార్యకర్తలను కలుసుకున్నారు. వారి సమస్యలను అడిగి తెలుసుకున్నారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ.. కార్యకర్తలకు ఎలాంటి ఇబ్బంది వచ్చినా తన దృష్టికి తీసుకురావాలని సూచించారు. ఆపద సమయంలో వారికి అండగా ఉంటానని స్పష్టం చేశారు. ఎమ్మెల్యే తమకు భరోసా కల్పించడంతో కార్యకర్తలు హర్షం వ్యక్తం చేశారు.
    1
    రాత్రివేళ గ్రామాల్లో పర్యటిస్తూ కార్యకర్తలకు భరోసా.. అనారోగ్యంతో ఉన్న కాంగ్రెస్ కార్యకర్తకు ఎమ్మెల్యే పరామర్శ
ఆపదలో ఉన్న కార్యకర్తలు ఏ సమయంలోనైనా తనకు ఫోన్ చేయాలని, వారికి అండగా నిలిచే విషయంలో వెనక్కి తగ్గేది లేదని ప్రభుత్వ విప్, డోర్నకల్ ఎమ్మెల్యే డాక్టర్ జాటోత్ రామచంద్ర నాయక్ భరోసా ఇచ్చారు.
మహబూబాబాద్ జిల్లా కురవి మండలం రాజోలు గ్రామంలో అనారోగ్యంతో ఉన్న కాంగ్రెస్ కార్యకర్తను రామచంద్ర నాయక్ పరామర్శించారు. రాత్రివేళ గ్రామాల్లో పర్యటిస్తూ పార్టీ కార్యకర్తలను కలుసుకున్నారు. వారి సమస్యలను అడిగి తెలుసుకున్నారు.
ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ.. కార్యకర్తలకు ఎలాంటి ఇబ్బంది వచ్చినా తన దృష్టికి తీసుకురావాలని సూచించారు. ఆపద సమయంలో వారికి అండగా ఉంటానని స్పష్టం చేశారు. ఎమ్మెల్యే తమకు భరోసా కల్పించడంతో కార్యకర్తలు హర్షం వ్యక్తం చేశారు.
    user_M D Azizuddin
    M D Azizuddin
    జర్నలిస్ట్ వర్ధన్నపేట, వరంగల్, తెలంగాణ•
    10 hrs ago
  • ప్రజల కోసం ప్రాణం త్యాగం చేసిన తన అమ్మానాన్నల బాటలోనే ప్రయాణిస్తూ ప్రజాసేవలో ముందుకు సాగుతున్న ములుగు ప్రజల ఆశాజ్యోతి శ్రీమతి బడే నాగజ్యోతి ప్రజల కోసం ప్రాణ త్యాగం చేసిన తన అమ్మ -నాన్న ల బాటలో పయనిస్తూ ప్రజా సేవలో ముందుకు సాగుతున్న అడవి తల్లి ముద్దు బిడ్డ సమ్మక్క -సారక్కతల్లుల పోరాట వారసురాలు, ములుగు ప్రజల ఆశజ్యోతి *శ్రీమతి బడే నాగజ్యోతి* గారు జయహో *నాగజ్యోతి అక్క*
    1
    ప్రజల కోసం ప్రాణం త్యాగం చేసిన తన అమ్మానాన్నల బాటలోనే ప్రయాణిస్తూ ప్రజాసేవలో ముందుకు సాగుతున్న ములుగు ప్రజల ఆశాజ్యోతి శ్రీమతి బడే నాగజ్యోతి
ప్రజల కోసం ప్రాణ త్యాగం చేసిన తన అమ్మ -నాన్న ల బాటలో పయనిస్తూ ప్రజా సేవలో ముందుకు సాగుతున్న అడవి తల్లి ముద్దు బిడ్డ  సమ్మక్క -సారక్కతల్లుల పోరాట వారసురాలు, ములుగు ప్రజల ఆశజ్యోతి  *శ్రీమతి బడే నాగజ్యోతి* గారు 
జయహో  *నాగజ్యోతి అక్క*
    user_SIRIPATI ARUNKUMAR
    SIRIPATI ARUNKUMAR
    Auditor బచ్చన్నపేట, జనగాం, తెలంగాణ•
    4 hrs ago
  • కరీంనగర్ అసెంబ్లీ నియోజకవర్గంలో అత్యధికంగా లక్ష ఓట్లు ఔట్... ఈ నెల 17న ఓటర్ల ముసాయిదా జాబితా ఓటర్ సమగ్ర సవరణ సర్ ప్రక్రియ ముగిసింది. ఉమ్మడి కరీంనగర్ జిల్లాలో మూడు లక్షల 92 వేల 298 ఓట్లు తొలగించబడుతున్నాయి. ఉమ్మడి కరీంనగర్ జిల్లాలో 12 అసెంబ్లీ నియోజకవర్గాల్లో 29 లక్షల 97 వేల 973 మంది ఓటర్లు ఇదివరకు ఉన్నారు. ఓటర్ల సమగ్ర సవరణ సర్ ప్రక్రియతో అందరికీ ఎన్యూమరేషన్ ఫామ్స్ అందజేశారు. గత అర్ధరాత్రి గడువు ముగిసేసరికి ఉమ్మడి జిల్లాలో 26 లక్షల 5 వేల 675 మంది ఓటర్లు తమ ఫామ్స్ బి ఎల్ వో లకు అప్పగించారు. వాటిని డిజిటలైజేషన్ చేశారు. మిగతా మూడు లక్షల 92 వేల 298 మంది ఎన్యూమరెషన్ ఫామ్స్ అప్పగించలేదు. దీంతో వారి పేర్లు ఓటర్ లిస్ట్ నుంచి తొలగించినట్లే అవుతుంది. అత్యధికంగా కరీంనగర్ అసెంబ్లీ నియోజకవర్గంలో లక్ష 854 ఓట్లు తొలగిపోతున్నాయి. డబల్ ఎంట్రీ, చనిపోయిన వారు, ఇతర ప్రాంతాలకు వలస పోయిన వారి పేర్లు ఓటర్ లిస్ట్ నుంచి తొలగిపోతున్నాయి. ప్రస్తుతం డిజిటలైజేషన్ అయిన ఓటర్ల ముసాయిదా జాబితా ఈ నెల 17న ప్రకటిస్తారు. ఓటర్ జాబితా పై అభ్యంతరాలను స్వీకరించి సెప్టెంబర్ 17 వరకు పరిష్కరిస్తారు. ఓటర్ ఫైనల్ జాబితా అక్టోబర్ 19న ప్రకటించనున్నారు. తాజా ఓటర్ జాబితాలో పేర్లు రానివారు కొత్తగా ఓటర్ నమోదు చేసుకోవాల్సి ఉంటుంది. కొత్తగా ఓటర్ నమోదు కావాలంటే ఫామ్ 6 తో పాటు సెల్ఫ్ డిక్లరేషన్ 2002 లేదా 2026 సర్ ఫ్యామిలీ మ్యాపింగ్ డిటేల్స్ సమర్పించాల్సి ఉంటుంది. స్పాట్...
    1
    కరీంనగర్ అసెంబ్లీ నియోజకవర్గంలో అత్యధికంగా లక్ష ఓట్లు ఔట్... ఈ నెల 17న ఓటర్ల ముసాయిదా జాబితా
ఓటర్ సమగ్ర సవరణ సర్ ప్రక్రియ ముగిసింది. ఉమ్మడి కరీంనగర్ జిల్లాలో మూడు లక్షల 92 వేల 298 ఓట్లు తొలగించబడుతున్నాయి. ఉమ్మడి కరీంనగర్ జిల్లాలో 12 అసెంబ్లీ నియోజకవర్గాల్లో 29 లక్షల 97 వేల 973 మంది ఓటర్లు ఇదివరకు ఉన్నారు. ఓటర్ల సమగ్ర సవరణ సర్ ప్రక్రియతో అందరికీ ఎన్యూమరేషన్ ఫామ్స్ అందజేశారు. గత అర్ధరాత్రి గడువు ముగిసేసరికి ఉమ్మడి జిల్లాలో 26 లక్షల 5 వేల 675 మంది ఓటర్లు తమ ఫామ్స్ బి ఎల్ వో లకు అప్పగించారు. వాటిని డిజిటలైజేషన్ చేశారు. మిగతా మూడు లక్షల 92 వేల 298 మంది ఎన్యూమరెషన్ ఫామ్స్  అప్పగించలేదు. దీంతో వారి పేర్లు ఓటర్ లిస్ట్ నుంచి తొలగించినట్లే అవుతుంది. అత్యధికంగా కరీంనగర్ అసెంబ్లీ నియోజకవర్గంలో లక్ష 854 ఓట్లు తొలగిపోతున్నాయి. డబల్ ఎంట్రీ, చనిపోయిన వారు, ఇతర ప్రాంతాలకు వలస పోయిన వారి పేర్లు ఓటర్ లిస్ట్ నుంచి తొలగిపోతున్నాయి. ప్రస్తుతం డిజిటలైజేషన్ అయిన ఓటర్ల ముసాయిదా జాబితా ఈ నెల 17న ప్రకటిస్తారు. 
ఓటర్ జాబితా పై అభ్యంతరాలను స్వీకరించి సెప్టెంబర్ 17 వరకు పరిష్కరిస్తారు. ఓటర్ ఫైనల్ జాబితా అక్టోబర్  19న ప్రకటించనున్నారు. తాజా ఓటర్ జాబితాలో పేర్లు రానివారు కొత్తగా ఓటర్ నమోదు చేసుకోవాల్సి ఉంటుంది. కొత్తగా ఓటర్ నమోదు కావాలంటే ఫామ్ 6 తో పాటు సెల్ఫ్ డిక్లరేషన్ 2002 లేదా 2026 సర్ ఫ్యామిలీ మ్యాపింగ్ డిటేల్స్ సమర్పించాల్సి ఉంటుంది.
స్పాట్...
    user_K.V.REDDY
    K.V.REDDY
    చిగురుమామిడి, కరీంనగర్, తెలంగాణ•
    46 min ago
View latest news on Shuru App
Download_Android
  • Terms & Conditions
  • Career
  • Privacy Policy
  • Blogs
Shuru, a product of Close App Private Limited.