Shuru
Apke Nagar Ki App…
ప్రజల కోసం ప్రాణం త్యాగం చేసిన తన అమ్మానాన్నల బాటలోనే ప్రయాణిస్తూ ప్రజాసేవలో ముందుకు సాగుతున్న ములుగు ప్రజల ఆశాజ్యోతి శ్రీమతి బడే నాగజ్యోతి ప్రజల కోసం ప్రాణ త్యాగం చేసిన తన అమ్మ -నాన్న ల బాటలో పయనిస్తూ ప్రజా సేవలో ముందుకు సాగుతున్న అడవి తల్లి ముద్దు బిడ్డ సమ్మక్క -సారక్కతల్లుల పోరాట వారసురాలు, ములుగు ప్రజల ఆశజ్యోతి *శ్రీమతి బడే నాగజ్యోతి* గారు జయహో *నాగజ్యోతి అక్క*
SIRIPATI ARUNKUMAR
ప్రజల కోసం ప్రాణం త్యాగం చేసిన తన అమ్మానాన్నల బాటలోనే ప్రయాణిస్తూ ప్రజాసేవలో ముందుకు సాగుతున్న ములుగు ప్రజల ఆశాజ్యోతి శ్రీమతి బడే నాగజ్యోతి ప్రజల కోసం ప్రాణ త్యాగం చేసిన తన అమ్మ -నాన్న ల బాటలో పయనిస్తూ ప్రజా సేవలో ముందుకు సాగుతున్న అడవి తల్లి ముద్దు బిడ్డ సమ్మక్క -సారక్కతల్లుల పోరాట వారసురాలు, ములుగు ప్రజల ఆశజ్యోతి *శ్రీమతి బడే నాగజ్యోతి* గారు జయహో *నాగజ్యోతి అక్క*
More news from తెలంగాణ and nearby areas
- యాదగిరిగుట్ట శ్రీ లక్ష్మీనరసింహస్వామి వారి నిత్య ఆదాయ వివరాలు యాదగిరిగుట్ట శ్రీ లక్ష్మీనరసింహస్వామి వారి నిత్య ఖజానాకు మంగళవారం సమకూరిన ఆదాయ వివరాలు ఇలా ఉన్నాయి. అందులో ప్రధాన బుకింగ్ రూ.61,874, బ్రేక్ దర్శనాలతో రూ.1,21,800, వీఐపీ దర్శనాలతో రూ.2,60,550, కార్ పార్కింగ్ రూ.3,45,500, ప్రసాద విక్రయాలతో రూ.6,17,400, తదితర విభాగాల నుంచి మొత్తం కలిపి రూ.16,16,870 ఆదాయం వచ్చినట్లు ఆలయ ఈవో భవాని శంకర్ తెలిపారు.1
- గ్రామస్తులంతా కలిసి అంగరంగ వైభవంగా జరుపుకున్న మారమ్మ బోనాలు జనగామ జిల్లా పాలకుర్తి మండలం లక్ష్మీనారాయణపురం గ్రామంలో మారమ్మ బోనాలు బుధవారం రోజున గ్రామస్తులంతా ఘనంగా జరుపుకున్నారు.1
- జీఆర్ఎంబీ ఎజెండా నుంచి తెలంగాణ ప్రాజెక్టులను తొలగించాలి-మాజీఎంపీ వినోద్‌కుమార్, ఎమ్మెల్యే గంగుల ఈనెల 18న హైదరాబాద్‌లో జరగనున్న గోదావరి రివర్ మేనేజ్‌మెంట్ బోర్డు 18వ సమావేశ ఎజెండా నుంచి తెలంగాణ ప్రాజెక్టులను వెంటనే తొలగించాలని మాజీ ఎంపీ వినోద్‌కుమార్, ఎమ్మెల్యే గంగుల కమలాకర్ డిమాండ్ చేశారు. కరీంనగర్ లో గంగుల నివాసంలో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో వారు మాట్లాడారు. తెలంగాణ రాష్ట్ర సాధనే నీళ్ల కోసం జరిగిన పోరాటమని, కేసీఆర్ హయాంలో అన్ని చట్టబద్ధమైన అనుమతులతోనే ప్రాజెక్టులను నిర్మించినట్లు స్పష్టం చేశారు. తెలంగాణలోని 7 ప్రాజెక్టుల అనుమతులు రద్దు చేయాలని ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు కేంద్రానికి ఎజెండా పంపడంపై వారు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. దీనిపై ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి, నీటిపారుదల శాఖ మంత్రి ఉత్తమ్‌కుమార్‌రెడ్డి ఏ విధంగా స్పందిస్తారో ప్రజలకు చెప్పాలని డిమాండ్ చేశారు. వచ్చిన అనుమతులను రద్దు చేయాలని కోరడం, దాన్ని ఎజెండాలో పెట్టడం సరికాదన్నారు. తెలంగాణ నుంచి ప్రాతినిధ్యం వహిస్తున్న బిజేపి కాంగ్రెస్ ఎంపీలు పార్లమెంట్‌లో ఈ అంశంపై ఎందుకు నిలదీయడం లేదని ప్రశ్నించారు. రాష్ట్రంలో కట్టిన ప్రాజెక్టుల అనుమతులు రద్దు చేయాలని అడుగుతుంటే ఎంపీలు మౌనం వహించడం సిగ్గుచేటని మండిపడ్డారు. వెంటనే ఎంపీలందరూ దిల్లీకి వెళ్లి ప్రధానమంత్రి నరేంద్ర మోదీని కలిసి, జీఆర్ఎంబీ ఎజెండా నుంచి ఆ ప్రాజెక్టుల తొలగింపునకు పార్లమెంట్ వేదికగా గట్టిగా కొట్లాడాలని సూచించారు. ఒకవేళ అనుమతులు రద్దు చేస్తే రాష్ట్రంలో విపత్కర పరిస్థితులు తలెత్తుతాయని హెచ్చరించారు. ఈనెల 18లోగా ప్రాజెక్టులను జీఆర్ఎంబీ ఎజెండా నుంచి తొలగించాలని, లేనిపక్షంలో బీఆర్ఎస్ పార్టీ ఆధ్వర్యంలో తీవ్రమైన ఆందోళనలు చేపడతామని అవసరమైతే జిఆర్ఎంబి సమావేశాన్ని అడ్డుకుంటామని హెచ్చరించారు.2
- కమలాపూర్‌లో అగ్రికల్చర్ యూనివర్సిటీ విద్యార్థుల ప్రత్యేక శిబిరం హనుమకొండ జిల్లా కమలాపూర్: గ్రామీణ వ్యవసాయ కృషి అనుభవ కార్యక్రమం 2026–27లో భాగంగా ప్రొఫెసర్ జయశంకర్ వరంగల్ అగ్రికల్చర్ యూనివర్సిటీ విద్యార్థులు కమలాపూర్‌లో ప్రత్యేక శిబిరాన్ని ఏర్పాటు చేశారు. గ్రామీణ ప్రాంతాల్లో రైతులతో మమేకమై వ్యవసాయ రంగానికి సంబంధించిన అంశాలపై ప్రత్యక్ష అవగాహన పొందడంతో పాటు రైతులకు అవసరమైన సమాచారాన్ని అందించేందుకు ఈ కార్యక్రమాన్ని నిర్వహిస్తున్నారు. ఈ సందర్భంగా విద్యార్థులు రైతులు సాగు చేస్తున్న వివిధ రకాల పంటలు, పంట మార్పిడి విధానం, సాగులో పాటించాల్సిన పద్ధతులు, పంట వేసిన నాటి నుంచి దిగుబడి వచ్చే వరకు తీసుకోవాల్సిన జాగ్రత్తలపై అధ్యయనం చేయనున్నారు. ఆధునిక వ్యవసాయ పద్ధతులు, పంటల యాజమాన్య విధానాలపై రైతులకు అవగాహన కల్పించనున్నారు. విద్యార్థి ఓంకార్ మాట్లాడుతూ.. రైతులు పండించే పంటలు, పంట మార్పిడి విధానం, సాగులో ఎదురయ్యే సమస్యలు, వాటి పరిష్కార మార్గాలపై రైతులతో కలిసి తెలుసుకుంటామని తెలిపారు. పంట వేసినప్పటి నుంచి దిగుబడి వచ్చే వరకు అవసరమైన మెళకువలపై అవగాహన సదస్సులు నిర్వహిస్తామని చెప్పారు. ఈ కార్యక్రమం నాలుగు నెలల పాటు కొనసాగుతుందని వెల్లడించారు.1
- యూట్యూబ్ నుండి BIG UPDATE ఇక Manitization కష్టమే 🤔8,000 వాచ్ హౌర్స్. #shorts #youtube #newrules #see1
- కేసీఆర్, కేటీఆర్ కాళ్లు మొక్కింది పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి కాదా? పదేళ్లు బీఆర్ఎస్ ప్రభుత్వం ఉన్నప్పుడు అన్ని కాంట్రాక్టులు తీసుకొని ఎంజాయ్ చేసింది పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి కాదా? కేసీఆర్, కేటీఆర్‌ల పుణ్యాన పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి ఇంత పెద్దోడు అయ్యాడు.. లేకుంటే ఆయన గతి ఏంటి? ఈరోజు వాళ్లనే తిడుతున్నాడు.. తిన్నింటి వాసాలు లెక్కపెట్టకు పొంగులేటి అసలు కాంగ్రెస్ నాయకులను పక్కనబెట్టి, ఈ దొంగ కాంగ్రెస్ నాయకులు మాట్లాడుతున్నారు బీఆర్ఎస్ ఎమ్మెల్యే పాడి కౌశిక్ రెడ్డి1
- కరీంనగర్ లో బీజేపీ ఆధ్వర్యంలో తిరంగా ర్యాలీ... నగరంలో రెపరెపలాడిన త్రివర్ణ పతాకాలు భారత్ 80వ స్వాతంత్ర్య దినోత్సవ వేడుకలను పురస్కరించుకుని కరీంనగర్ లో బిజెపి హర్ ఘర్ తిరంగా అభియాన్ ఉత్సవాలు ఘనంగా నిర్వహించింది. నగరంలోని భారతీయ జనతా పార్టీ సౌత్ జోన్ ఆధ్వర్యంలో మువ్వన్నెల జెండాలు చేతబూని, దేశభక్తి నినాదాలతో నాయకులు, కార్యకర్తలు ర్యాలీలో ఉత్సాహంగా దేశభక్తితో పాల్గొన్నారు. కలెక్టరేట్ వద్ద ప్రారంభమైన తిరంగా ర్యాలీ, నగర వీధుల గుండా సాగి భగత్ నగర్‌లోని భగత్ సింగ్ విగ్రహం సర్కిల్ వరకు కొనసాగింది. ఈ కార్యక్రమానికి ముఖ్యఅతిథిగా బీజేపీ రాష్ట్ర అధికార ప్రతినిధి డిప్యూటీ మేయర్ యాదగిరి సునీల్ రావు హాజరయ్యారు. జాతీయ జెండాను చేతబూని, కార్యకర్తల్లో ఉత్సాహం నింపుతూ ర్యాలీని ముందుండి నడిపించారు. భారత్ మాతా కీ జై, వందేమాతరం అని నినాదాలు చేస్తూ ర్యాలీలో పాల్గొన్నారు. స్వాతంత్ర్య సమరయోధుల త్యాగాలను స్మరించుకుంటూ, ప్రతి ఒక్కరి గుండెల్లో జాతీయ భావం ఉప్పొంగేలా ఈ ర్యాలీని తీర్చిదిద్దారు. ప్రతి ఒక్కరికి చేతుల్లో త్రివర్ణ పతాకాలను పట్టుకొని కదం తొక్కడం నగరవాసులను విశేషంగా ఆకర్షించింది.ర్యాలీ ముగింపు సందర్భంగా భగత్ నగర్ చౌరస్తా వద్దకు చేరుకొని అక్కడ ఉన్న స్వాతంత్ర్య సమరయోధుడు, అమరవీరుడు భగత్ సింగ్ విగ్రహానికి పూలమాలలు వేసి ఘనంగా నివాళులు అర్పించారు. అనంతరం వందేమాతరం గీతాన్ని, జాతీయగీతం జనగణమనను ఆలపించారు. జాతీయ సమైక్యతను, అఖండ భారత స్ఫూర్తిని చాటిచెప్పేలా జరిగిన ఈ తిరంగా ర్యాలీ నగరంలో జరిగిన 80వ స్వాతంత్ర్య దినోత్సవ వేడుకలకు ఒక ప్రత్యేక ఆకర్షణగా నిలిచింది. ఈ కార్యక్రమంలో సౌత్ జోన్ అధ్యక్షులు బండారి గాయత్రి, కార్పొరేటర్లు చొప్పరి జయశ్రీ వేణు, నాంపెల్లి రేణుక శ్రీనివాస్, పొన్నం లక్ష్మీ మొండయ్య గౌడ్, సౌగాని కొమురయ్య, బిజెపి ప్రధాన కార్యదర్శి తాళ్లపల్లి శ్రీనివాస్ గౌడ్, నాయకులు, కార్యకర్తలు, భారీ సంఖ్యలో విద్యార్థులు, తదితరులు పాల్గొన్నారు2
- బచ్చన్నపేటలో ఘనంగా హర్ ఘర్ తిరంగా ర్యాలీ,ప్రతి ఇంటిపై జాతీయ జెండా ఎగురవేయాలి: బీజేపీ నాయకులు జనగాం జిల్లా బచ్చన్నపేట మండల కేంద్రంలో ప్రధాని నరేంద్ర మోదీ పిలుపు మేరకు బీజేపీ మండల అధ్యక్షుడు బంగారు మహేశ్ ఆధ్వర్యంలో బచ్చన్నపేటలో హర్ ఘర్ తిరంగా ర్యాలీ నిర్వహించారు. వాణి స్కూల్ నుంచి ప్రారంభమైన ర్యాలీ చౌరస్తా మీదుగా బస్టాండ్ వరకు కొనసాగింది. బీజేపీ నాయకులు, కార్యకర్తలు జాతీయ జెండాలను చేతబూని ర్యాలీలో పాల్గొన్నారు. ఈ సందర్భంగా రాష్ట్ర నాయకుడు శ్రీనివాస్ మాట్లాడుతూ.. ఆగస్టు 10 నుంచి 15వ తేదీ వరకు ప్రతి ఇంటిపై జాతీయ జెండాను ఎగురవేసి దేశభక్తిని చాటాలని ప్రజలకు పిలుపునిచ్చారు. దేశ స్వాతంత్య్రం కోసం పోరాడిన మహనీయుల త్యాగాలను స్మరించుకోవాలని కోరారు. హర్ ఘర్ తిరంగా కార్యక్రమాన్ని విజయవంతం చేయడంలో ప్రతి ఒక్కరూ భాగస్వాములు కావాలని తెలిపారు.1
- ఎల్బీనగర్ పోలీస్ స్టేషన్ వద్ద తీవ్ర ఉద్రిక్తత కానిస్టేబుల్ సాయికుమార్ మృతిపై అనుమానం వ్యక్తం చేస్తూ ఫర్నిచర్ కంప్యూటర్ దస్వం చేసిన కుటుంబ సభ్యులు పోలీసులకు నిసనకారులకు మధ్య వాగ్వాదం ఏసీపీ కార్యాలయంపై దాడి చేసిన కానిస్టేబుల్ సాయికుమార్ కుటుంబ సభ్యులు ఎల్బీనగర్ పోలీస్ స్టేషన్ వద్ద తీవ్ర ఉద్రిక్తత కానిస్టేబుల్ సాయికుమార్ మృతిపై అనుమానాలు వ్యక్తం చేస్తూ, ఏసీపీ కార్యాలయంలోని ఫర్నిచర్, కంప్యూటర్లను ధ్వంసం చేసిన కుటుంబ సభ్యులు పోలీసులకు, నిరసనకారులకు మధ్య వాగ్వాదం భారీగా మోహరించిన పోలీసులు1