👉హైదరాబాద్ జనవరి 9 ప్రజా తెలంగాణ న్యూస్/ *టీ ఎస్ యు టీ ఎఫ్ కురవి మండలం గుండ్రాత్రి మడుగు మహబూబ్ నగర్ జిల్లా* *టెట్ లో మినహాయింపు ఇచ్చి, సీపీఎస్, ఎన్ఈపి రద్దు చేయాలి... టిఎస్ యూటీఎఫ్ జిల్లా ప్రధాన కార్యదర్శి షేక్ యాకూబ్* సీనియర్ ఉపాధ్యాయులను ఉపాధ్యాయ అర్హత పరీక్ష (టెట్) నుండి మినహాయించాలని, ప్రభుత్వ విద్యకు నష్టం కలిగించే జాతీయ విద్యా విధానం (ఎన్ఈపి) ని రద్దు చేయాలని, పాఠశాలల మూసివేత, విలీనాలను ఆపాలని, ఎన్పిఎస్, సిపిఎస్ లను రద్దు చేసి పాత పెన్షన్ విధానాన్ని పునరుద్ధరించాలని, సమాన పనికి సమాన వేతనం ఇవ్వాలని, ప్రాథమిక ఉపాధ్యాయులకు ఉపాధ్యాయ ఎమ్మెల్సీ ఎన్నికల్లో ఓటుహక్కు కల్పించాలని తదితర డిమాండ్లతో అఖిల భారత ఉపాధ్యాయ సంఘాల సంయుక్త కార్యాచరణ కమిటీ (ఎఐ జాక్టో) ఇచ్చిన పిలుపు మేరకు శనివారం మండలం లోని, జిల్లా లోని అన్ని పాఠశాలల్లో ఉపాధ్యాయులు నల్ల బ్యాడ్జిలు ధరించి భోజన విరామ సమయంలో నిరసన ప్రదర్శన చేశారని టిఎస్ యూటీఎఫ్ జిల్లా ప్రధాన కార్యదర్శి షేక్ యాకూబ్ అన్నారు. ఈ సందర్బంగా టిఎస్ యూటీఎఫ్ జిల్లా ప్రధాన కార్యదర్శి షేక్ యాకూబ్ మాట్లాడుతూ ప్రభుత్వ విద్యను నిర్వీర్యం చేసి ప్రయివేట్ పరం చేసే జాతీయ విద్యా విధానాన్ని రద్దు చేయాలనీ, ఉద్యోగ, ఉపాధ్యాయులకు పెనుశాపంగా మారిన యూపీస్, సీపీఎస్ లను రద్దు చేసి పాత పెన్షన్ విధానాన్ని పునరుద్దరించాలని, కొన్ని రాష్ట్ర ప్రభుత్వాలు సీపీఎస్ రద్దు చేసిన కేంద్ర ప్రభుత్వం పాత పెన్షన్ విధానానికి అవకాశం ఇవ్వక పోవడం శోచనియమని అన్నారు, సుప్రీంకోర్టు తీర్పు వచ్చి నాలుగు నెలలు గడిచినా కేంద్ర ప్రభుత్వం గానీ, జాతీయ ఉపాధ్యాయ విద్యా మండలి (ఎన్సీటిఈ) గానీ ఏమాత్రం స్పందించకుండా మౌనంగా ఉండడాన్ని తీవ్రంగా ఖండించారు. 23 ఆగస్టు 2010 కంటే ముందు నియామకమైన ఉపాధ్యాయులకు ఉపాధ్యాయ అర్హత పరీక్ష మినహాయింపు ఇచ్చినట్లు నోటిఫికేషన్ లో పేర్కొన్న ఎన్సీటిఈ సుప్రీంకోర్టుకు ఆ విషయాన్ని తెలియజేయడంలో విఫలమైందని ఆరోపించారు. సుప్రీంకోర్టు తీర్పు ప్రకారం రెండేళ్లలో టెట్ పాస్ కాకపోతే లక్షలాది ఉపాధ్యాయులు ఉద్యోగాలు కోల్పోవాల్సి వస్తుందని, వేలాది పాఠశాలలు మూతపడి, పేద పిల్లలకు విద్య దూరమయ్యే ప్రమాదం దాపురించిందని ఆవేదన వ్యక్తంచేశారు. విద్యా వ్యవస్థలో సంక్షోభానికి కారణమైన సుప్రీంకోర్టు తీర్పుకు కేంద్ర ప్రభుత్వం, ఎన్సీటిఈ లే బాధ్యత వహించాలని అన్నారు. తక్షణమే కేంద్రం సుప్రీం కోర్టులో రివ్యూ లేదా క్యూరేటివ్ పిటిషన్ దాఖలు చేయాలని, లేదా సీనియర్ ఉపాధ్యాయులకు రక్షణ కల్పించే విధంగా విద్యా హక్కు చట్టాన్ని సవరించాలని డిమాండ్ చేశారు. సమాన పనికి సమాన వేతనం చెల్లించాలనే సుప్రీం కోర్టు తీర్పును అమలు పరచాలని, పాఠశాలల మూసివేత, విలీనాలను ఆపి, అంతరాలు లేని కామన్ విద్యావిధనాన్ని అమలు పరచాలని డిమాండ్ చేశారు. ఈ కార్యక్రమంలో గుండ్రాతిమడుగు ఉన్నతపాఠశాల ప్రధానోపాధ్యాయులు కె జానయ్య, మండల ప్రధాన కార్యదర్శి ఎం ప్రవీణ్ కుమార్ ఉపాధ్యాయులు భద్రు నాయక్, శ్రీధర్, యాదగిరి, కమల్బా కిషోర్బు, , గోపాల్ రావు, సింధు, రమ, ఉమారాణి తదితరులు పాల్గొన్నారు. కృతజ్ఞతలతో.. షేక్ యాకూబ్ TSUTF జిల్లా ప్రధాన కార్యదర్శి

- 👉గజ్వేల్ సిద్దిపేట జిల్లా జనవరి 9 ప్రజా తెలంగాణ న్యూస్/ గజ్వేల్ మున్సిపల్ వార్డులను పెంచాలని సిద్దిపేట కలెక్టర్ కార్యాలయంలో వినతిపత్రం ఇచ్చిన ఎంపీటీసీల ఫోరం రాష్ట్ర అధ్యక్షులు దేవీ రవీందర్ సిద్దిపేట జిల్లా కలెక్టర్ కార్యాలయంలో గజ్వేల్ మున్సిపల్ వార్డులను పెంచాలని కలెక్టర్ గారిని కలవడానికి వెళ్ళినటువంటి సమయంలో కలెక్టర్ గారు అందుబాటులో లేకపోవడంతో జిల్లా కలెక్టర్ కార్యాలయ పరిపాలన అధికారి రాజేష్ గారికి వార్డులను పెంచాలని వినతిపత్రం ఇవ్వడం జరిగింది.1
- సంగారెడ్డి పట్టణం లోని ప్రభుత్వ బాలుర ఉన్నత పాఠశాలలో ముగ్గుల పోటీలు గెలుపొందిన వారికి బహుమతులు అందజేత1
- యాదాద్రి భువనగిరి జిల్లాలో 6000 లంచం తీసుకుంటూ పంచాయతీ కార్యదర్శి ఏసీబీకి పట్టుబడ్డ సంఘటన శుక్రవారం చోటుచేసుకుంది. ఏసీబీ అధికారులు తెలిపిన వివరణ ప్రకారం తుంగతుర్తి మండలం గానుగబండ గ్రామ పంచాయతీ కార్యదర్శి కృష్ణ ఇంటి నిర్మాణ బిల్లులు విడుదల చేసేందుకు 6000 రూపాయలు డిమాండ్ చేయడంతో బాధితులు తమను ఆశ్రయించినట్లు తెలిపారు. దీంతో 6000 రూపాయలు కృష్ణకు అందిస్తుండగా రెడ్ హ్యాండెడ్గా పట్టుకున్నట్లు తెలిపారు. దీంతో కృష్ణ నివాసంలో కూడా ఏసీబీ అధికారులు తనిఖీలు చేపడుతున్నట్లు చెప్పారు.1
- హన్మకొండ:నడికుడ మండల కేంద్రంలోని మండల ప్రజా పరిషత్ కార్యాలయంలో శాశ్వత ఆధార్ నమోదు కేంద్రాన్ని శుక్రవారం ప్రారంభించిన ఎమ్మెల్యే రేవూరి ప్రకాష్ రెడ్డి.వారు మాట్లాడుతూ ప్రజలకు అవసరమైన సేవలు సులభంగా, సమయానుకూలంగా అందించాలనే లక్ష్యంతో ఈ కేంద్రాన్ని ఏర్పాటు చేశామని తెలిపారు. ప్రజలు ఈ సౌకర్యాన్ని పూర్తిగా వినియోగించుకోవాలని ఎమ్మెల్యే కోరారు.1
- జగిత్యాల జిల్లా కొండగట్టులో ఇటీవల జరిగిన అగ్ని ప్రమాద బాధిత కుటుంబాలకు సీఎం సహాయ నిధి ద్వారా మంజూరైన రూ.83,12,000 చెక్కులను రాష్ట్ర సంక్షేమ శాఖ మంత్రి అడ్లూరి లక్ష్మణ్ కుమార్ పంపిణీ చేశారు. బాధితుల పునరావాసానికి ప్రభుత్వం పూర్తిస్థాయిలో అండగా ఉంటుందని మంత్రి భరోసా ఇచ్చారు. టెంపుల్ సిటీ కారిడార్ అభివృద్ధి చేస్తామని తెలిపారు. కలెక్టర్ సత్య ప్రసాద్, ఎమ్మెల్యే మేడిపెల్లి సత్యం, అధికారులు పాల్గొన్నారు.2
- వరంగల్ జిల్లా నర్సంపేట పట్టణంలోని శ్రీ చైతన్య పాఠశాలలో ముందస్తు సంక్రాంతి సంబరాలను ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా మాతృమూర్తులు, విద్యార్థులకు ముగ్గుల పోటీలు నిర్వహించి విజేతలకు బహుమతులు అందజేశారు. సంక్రాంతి పండుగ ప్రాముఖ్యతను, మన సంస్కృతి–సాంప్రదాయాల గొప్పతనాన్ని ప్రిన్సిపాల్ కే. అమర్నాథ్ గారు వివరించారు. కార్యక్రమంలో పాఠశాల యాజమాన్యం, ఉపాధ్యాయులు, విద్యార్థులు, తల్లిదండ్రులు పాల్గొన్నారు.4
- భారత్ మాత కి జై 🇮🇳1
- 👉గజ్వేల్ సిద్దిపేట జిల్లా జనవరి 9 ప్రజా తెలంగాణ న్యూస్/ కొంపముంచిన అ*క్రమ సంబంధం.. | : కట్టుకున్నవాడిని కాదని కట్టుకథలు చెప్పే కాలయముడిని నమ్మినట్లుగా అయ్యింది ఓ వివాహిత జీవితం. పరిచయమైన నెల రోజుల్లోనే నమ్మిన ప్రియుడే డిసెంబర్ 31వ రోజు వేడుకల పేరిట నమ్మించి గొంతు నుమిలి చంపాడు వివాహిత కల్పన అనే మహిళను. సిద్దిపేట జిల్లా వర్గల్ మండలం నాచారం గ్రామ శివారులో ఈ నెల 1వ తేదీన అనుమానాస్పద స్థితిలో ఓ మహిళ మృత దేహాన్ని పోలీసులు గుర్తించారు. విచారణ జరుపగా చేగుంట మండలం ఇస్లాంపూర్ గ్రామానికి చెందిన మంతూరు కల్పన(26) గా పోలీసులు గుర్తించారు. అయితే కల్పనకు గత కొద్ది నెలల కిందట కుటుంబీకులు నిచ్చయించిన వ్యక్తితో వివాహం జరిగింది. అయితే కుటుంబంలో నెలకొన్న గొడవల కారణంగా తల్లివారి ఇంటి వద్దే కల్పన నివసిస్తుంది. ఈ క్రమంలో చేగుంటలోని ఓ కళ్ళు దుకాణంలో మాసాయి పేట మండలం కొప్పుల పల్లి గ్రామానికి చెందిన పెంటయ్య(30) తో కల్పనకు నెల రోజుల కిందట పరిచయం ఏర్పడింది. దీంతో తరచూ ఫోన్ లు మాట్లాడుతుండటంతో ఇరువురి బంధం బలపడింది. కాగా ఈ నెల 31 వ తేదీన కల్పన హైదరాబాద్ లోని ఆసుపత్రిలో ఆరోగ్య పరీక్షల పేరిట వెళ్లి నాచారం బ్రిడ్జ్ వద్ద శవమై తేలింది. దీంతో కేసు నమోదు చేసుకున్న పోలీసులు విచారణ చేపట్టగా తన ప్రియుడు పెంటయ్య హత్య చేసినట్లుగా గుర్తించామని ఏసిపి నర్సింలు తెలిపారు. ప్రియుడి బొలెరో వాహనంలో నాచారం బ్రిడ్జ్ వద్ద ఇరువురు చేరుకుని మద్యం సేవించి, తమ వెంట తెచ్చుకున్న బిర్యానీనీ తిన్నారు. ఇక తనకు పదివేల రూపాయలు కావాలని లేదంటే నీ పై మానభంగం కేసు పెడతానని తనను కల్పన బెదిరించిందని పెంటయ్య పోలీసుల విచారణలో తెలిపాడు. కాగా తన వద్ద అంత డబ్బు లేదని,నా పై ఇప్పటికే పలు చోరీ కేసులు ఉన్నాయనే భయాందోళనలో కల్పనను మెడకు త్రాడు వేసి బలంగా లాగి హత్య చేశాడు ఆయన అన్నారు. విచారణ అనంతరం నిందితుడు పెంటయ్యను రిమాండ్ చేసినట్లుగా ఏసిపి పేర్కొన్నారు. B.నర్సింలు(గజ్వేల్) మీడియా సమావేశంలో1
- పుల్కల్ మండల పరిధిలోని సింగూరు ప్రాజెక్టు వద్ద మాంజీర నదిలో గుర్తుతెలియని మహిళ మృతదేహం లభ్యం1