Shuru
Apke Nagar Ki App…
కాగజ్‌నగర్‌లో ఘనంగా హనుమాన్ శోభాయాత్ర.జై శ్రీరామ్ నినాదాలతో మార్మోగిన పట్టణం; కోనేరు కోనప్ప ప్రారంభం కాగజ్‌నగర్ పట్టణంలో హనుమాన్ జయంతి సందర్భంగా హిందూ జాగరణ్ మంచ్ ఆధ్వర్యంలో శోభాయాత్ర ఘనంగా నిర్వహించారు. ఈ శోభాయాత్రను మాజీ ఎమ్మెల్యే కోనేరు కోనప్ప ప్రారంభించారు. భక్తులు, యువత భారీగా పాల్గొని జై శ్రీరామ్ నినాదాలతో పట్టణాన్ని మార్మోగించారు. రాజీవ్ గాంధీ చౌరస్తాలో భక్తులకు మజ్జిగ పంపిణీ చేశారు. కార్యక్రమంలో స్థానిక ప్రజాప్రతినిధులు, నాయకులు పాల్గొన్నారు.
Krishna
కాగజ్‌నగర్‌లో ఘనంగా హనుమాన్ శోభాయాత్ర.జై శ్రీరామ్ నినాదాలతో మార్మోగిన పట్టణం; కోనేరు కోనప్ప ప్రారంభం కాగజ్‌నగర్ పట్టణంలో హనుమాన్ జయంతి సందర్భంగా హిందూ జాగరణ్ మంచ్ ఆధ్వర్యంలో శోభాయాత్ర ఘనంగా నిర్వహించారు. ఈ శోభాయాత్రను మాజీ ఎమ్మెల్యే కోనేరు కోనప్ప ప్రారంభించారు. భక్తులు, యువత భారీగా పాల్గొని జై శ్రీరామ్ నినాదాలతో పట్టణాన్ని మార్మోగించారు. రాజీవ్ గాంధీ చౌరస్తాలో భక్తులకు మజ్జిగ పంపిణీ చేశారు. కార్యక్రమంలో స్థానిక ప్రజాప్రతినిధులు, నాయకులు పాల్గొన్నారు.
More news from Telangana and nearby areas
- బీ.ఆర్.ఎస్ మున్సిపల్ ఫ్లోర్ లీడర్ గా 49వ వార్డు కౌన్సిలర్ వేనగంటి ప్రకాష్ ఎన్నికయ్యారు. ఈ మేరకు శుక్రవారం మాజీమంత్రి జోగురామన్న ఆయనను శాలువాలతో సత్కరించి అభినందనలు తెలియచేశారు. బీ.ఆర్.ఎస్ ఫ్లోర్ లీడర్ గా ఆయనను నియమించాలని మున్సిపల్ కమిషనర్ కు, చైర్ పర్సన్ కు లేఖ రాశారు. పట్టణ పరిధిలో నెలకొన్న సమస్యలను మున్సిపల్ కౌన్సిల్ సమావేశాల దృష్టికి తీసుకెళ్ళడంతో పాటు... కౌన్సిల్ లో అత్యంత కీలక పాత్ర పోషించాలని సూచించారు. ఈ సందర్భంగా ఆయనకు తోటి కౌన్సిలర్లు అభినందనలు తెలియచేశారు. పట్టణాభివృద్దికి గత బీ.ఆర్.ఎస్ ప్రభుత్వం విశేష కృషి చేసిందని ఈ సందర్భంగా మాజీమంత్రి జోగురామన్న అన్నారు. అదే స్పూర్తితో ప్రస్తుత కౌన్సిల్ లోనూ అభివృద్ధికే బీ.ఆర్.ఎస్ కౌన్సిలర్లు పాటు పడాలని సూచించారు. ప్రజా సమస్యలను ఎప్పటికపుడు పరిష్కరించడంతో పాటు... పట్టణాభివృద్ధికి తీసుకునే కీలక నిర్ణయాల్లో క్రియాశీలక పాత్ర పోషిస్తూ సమర్ధవంతంగా విధులు నిర్వర్తించాలని దిశా నిర్దేశం చేశారు. కార్యక్రమంలో మాజీ మున్సిపల్ చైర్మన్ జోగుప్రేమేందర్, అన్నెల వసంత్, ఆత్రం వెంకటేష్, డాక్టర్ గౌస్ , సలీమ్,అనిల్, పర్వీన్ తదితరులు పాల్గొన్నారు..4
- కాంగ్రెస్ పార్టీకి గుడ్ బై చెప్పిన మాజీ మంత్రి జీవన్ రెడ్డి వారం పది రోజుల్లో ఏ పార్టీలో చేరేది క్లారిటీ ఇస్తానని చెప్పారు. రేవంత్ రెడ్డి సర్కార్ ను ఓడించే సత్తా గల పార్టీలో చేరతానని స్పష్టం చేశారు. జగిత్యాలలో విలేకరుల సమావేశంలో జీవన్ రెడ్డి మాట్లాడుతూ బీజేపీ, బీఆర్ఎస్ రెండు పార్టీలు తమపై అభిమానాన్ని చూపుతున్నాయని అందుకు ఆయా పార్టీల నేతలకు కృతజ్ఞతలు చెబుతున్నట్లు తెలిపారు. ఏ పార్టీలో చేరాలనేది అభిమానుల ఆలోచనలకు అనుగుణంగా నిర్ణయం తీసుకుంటామని త్వరలోనే ఫైనల్ నిర్ణయం ప్రకటిస్తానని తెలిపారు. గతంలో మార్పు రావాలని....కెసిఆర్ పోవాలని కోరుకున్నామని, పదేళ్ల తర్వాత ప్రజల్లో మార్పు వస్తే, ఇప్పుడు పరిస్థితి మారి, రెండేళ్లలో మార్పు రావాలి రేవంత్ రెడ్డి పోవాలి అనే పరిస్థితి వచ్చిందన్నారు. ప్రాణహిత నదీ జలాలను వినియోగించుకోకవడం, కాళేశ్వరం ప్రాజెక్టు మరమ్మతులు చేయడంలో రేవంత్ రెడ్డి సర్కార్ నిర్లక్ష్యంగా వ్యవహరిస్తుందని ఆరోపించారు. ఇప్పటికైనా ప్రభుత్వం నిర్లక్ష్యాన్ని వీడి, వెంటనే కాళేశ్వరం ప్రాజెక్ట్ మరమ్మత్తు పనులు చేపట్టాలని, ప్రాణహిత నది జలాల వినియోగానికి తుమ్మిడిహెట్టి వద్ద బ్యారేజి నిర్మాణం చేపట్టాలని జీవన్ రెడ్డి చేశారు.1
- Post by Solanke Ravi1
- పత్రిక ప్రకటన తేది:02.04.2026 కామారెడ్డి జిల్లా గురువారం. .. బీసీ సంక్షేమ శాఖ ఆధ్వర్యంలో సర్దార్ సర్వాయి పాపన్న వర్ధంతి కలెక్టరేట్ లో ఏర్పాటు చేసిన కార్యక్రమానికి జిల్లా కలెక్టర్ ఆశిష్ సాంగ్వాన్ సర్దార్ సర్వాయి పాపన్న గౌడ్ చిత్ర పటానికి పూలమాల వేసి జ్యోతి ప్రజ్వలన గావించి ఘనంగా నివాళులర్పించారు . అనంతరం జిల్లా కలెక్టర్ మాట్లాడుతూ “సర్దార్ సర్వాయి పాపన్న పోరాటం ప్రతి ఒక్కరికీ స్పూర్తిదాయకం అని ఆయన ధైర్యసాహసాలు, సమాజానికి చేసిన సేవలు చిరస్మరణీయం” అని కొనియాడారు. . సామాజిక న్యాయం, సమానత్వం కోసం అహర్నిశలు కృషి చేసిన మహానేత అని పేర్కొన్నారు. ఆయన జీవితం, సేవలు నేటి తరాలకు మార్గదర్శకంగా నిలుస్తాయని అన్నారు. ఈ కార్యక్రమంలో అదనపు కలెక్టర్లు విక్టర్, మధుమొహాన్ జిల్లా అధికారులు, సిబ్బంది పాల్గొని పాపన్న సేవలను స్మరించుకున్నారు.1
- హన్మకొండ జిల్లా:హనుమకొండ వడ్డేపల్లి సబ్ రిజిస్ట్రార్ కార్యాలయంలో ఏసీబీ ఆకస్మిక సోదాల్లో అవినీతి వ్యవహారాలు బయటపడ్డాయి. కార్యాలయంలో 20 మంది అనధికార ఏజెంట్లు ఉన్నట్లు గుర్తించగా, ఏడాదిలో రూ.42 లక్షల డిజిటల్ లావాదేవీలు జరిగినట్లు తేలింది. ఎస్ఆర్ఆలు రామనర్సింహారావు, ఆనంద్ అక్రమాలకు సంబంధించిన వాట్సాప్ చాటింగ్ సాక్ష్యాలుగా లభించాయి. వారి ఇళ్లలో సోదాల్లో నగదు, బంగారం, వెండి, ఫిక్స్డ్ డిపాజిట్లు బయటపడగా, కార్యాలయంలో పెండింగ్ డాక్యుమెంట్లు, నగదు స్వాధీనం చేసుకున్నారు. దర్యాప్తు కొనసాగుతోంది.1
- మహబూబాబాద్ జిల్లా కొత్తగూడ మండలంలోని ఓటాయి గ్రామంలో సాంప్రదాయ జానపద కళారూపమైన “యాదవ రాజుల కథ” ప్రదర్శన గ్రామ ప్రజలను విశేషంగా ఆకట్టుకుంది. ఎన్నో ఏళ్లుగా టెలివిజన్, సీరియళ్లకే పరిమితమైన వినోదానికి అలవాటు పడిన ప్రజలు, ముఖ్యంగా మహిళలు, ఇలాంటి చారిత్రక, సాంస్కృతిక కథనాలను ఆసక్తిగా వీక్షించడం గ్రామీణ సంస్కృతికి కొత్త ఊపును తీసుకొచ్చింది. గ్రామీణ కళాకారులు తమ సాంస్కృతిక వృత్తి ధర్మంలో భాగంగా మళ్లీ ఈ జానపద కళారూపాన్ని పునరుద్ధరించి ప్రజల ముందుకు తీసుకురావడం విశేషం. గతంలో పల్లెల్లో విస్తృతంగా వినిపించిన యాదవ రాజుల వీరగాథలు, కాలక్రమేణా కనుమరుగవుతున్న వేళ, ఇప్పుడు మళ్లీ గ్రామాల్లో కళాకారుల కంఠాల్లో ప్రతిధ్వనించడం స్థానికులను ఆనందానికి గురి చేసింది. ఈ ప్రదర్శనను చూడడానికి గ్రామ ప్రజలు, యువతి యువకులు పెద్ద సంఖ్యలో హాజరై భక్తిశ్రద్ధలతో, ఆసక్తితో కథను ఆలకించారు. చారిత్రక నేపథ్యంతో సాగిన ఈ కళారూపం ప్రేక్షకులను ఆకట్టుకోవడమే కాకుండా, పాత తరం జ్ఞాపకాలను తడిమింది. గ్రామీణ కళలు, జానపద సంప్రదాయాలు కేవలం వినోదమే కాకుండా, సమాజ చరిత్రను, జీవన విధానాన్ని, సంస్కృతిని తరతరాలకు అందించే గొప్ప వారసత్వమని పలువురు గ్రామ పెద్దలు అభిప్రాయపడ్డారు. ఇలాంటి జానపద కళారూపాలకు ప్రోత్సాహం లభిస్తే గ్రామీణ సంస్కృతి మరింత బలపడటంతో పాటు, కళాకారులకు కూడా గుర్తింపు, ఆదరణ లభిస్తుందని స్థానికులు పేర్కొన్నారు.1
- సిర్పూర్(టి) గ్రామపంచాయతీలో నిర్వహించిన గ్రామసభ ఉపసర్పంచ్ దుర్గం ప్రశాంత్ ఆందోళనతో అర్ధాంతరంగా ముగిసింది. అధికారుల గైర్హాజరును కారణంగా చూపుతూ సమావేశాన్ని అడ్డుకుని తీవ్రంగా నిలదీశారు. మిషన్ భగీరథ నీటి సరఫరా, పింఛన్లు, ప్రజా సమస్యలపై స్పందించాల్సిన అధికారులు లేకుండా సభ నిర్వహించడం సరైందికాదని ప్రశాంత్ అభ్యంతరం వ్యక్తం చేశారు. ఆయనకు మద్దతుగా వార్డు సభ్యులు వాకౌట్ చేయడంతో ప్రజలు కూడా బయటకు వెళ్లిపోయారు. సర్పంచ్ నాగమణి, అధికారులు నచ్చజెప్పినా ప్రయోజనం లేకపోవడంతో కోరం లేక గ్రామసభను అర్ధాంతరంగా ముగించారు.2
- *ముధోల్ శాసనసభ్యులు శ్రీ పవార్ రామారావు పటేల్ గారు* హాజరయ్యారు.ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ, తాను రైతు బిడ్డనని పేర్కొంటూ సంఘ అభివృద్ధికి కట్టుబడి ఉన్నానని తెలిపారు.సంఘానికి దశలవారీగా ప్రభుత్వం నుండి నిధులు మంజూరు అయ్యేలా తన వంతు కృషి చేస్తానని హామీ ఇచ్చారు.గ్రామస్తులు మరియు సంఘ సభ్యులు ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు.4
- కరీంనగర్ సమీపంలోని బొమ్మకల్ ఫ్లై ఓవర్ వద్ద జరిగిన రోడ్డు ప్రమాదంలో ఇద్దరు యువకులు మృతి చెందారు. బొమ్మకల్ ఫ్లైఓవర్ సమీపంలో ఆగి ఉన్న లారీని కారు ఢీకొట్టింది. కారు నచ్చు నచ్చాయి కార్ల ప్రయాణిస్తున్న సయ్యద్ అబ్దుల్ రెహమాన్, సయ్యద్ అతియాబ్ హుస్సేన్ అక్కడికక్కడే మృతి చెందారు. మరో ఇద్దరికి గాయాలుకాగ ఒకరి పరిస్థితి విషమంగా ఉంది. స్వల్ప గాయాలతో మరొకరు మాత్రమే బయటపడ్డారు. అర్ధరాత్రి దాటిన తర్వాత ఈ రోడ్డు ప్రమాదం జరిగింది. కారు పూర్తిగా నుజ్జునుజ్జుకావడం చూస్తే ఎంత స్పీడులో ఉన్నారో అర్థం అవుతుంది. సంఘటన స్థలాన్ని పోలీసులు చేరుకుని క్షతగాత్రులను ఆసుపత్రికి తరలించారు ప్రమాదం పై కేసు నమోదు చేసి విచారణ చేపట్టారు.3