Shuru
Apke Nagar Ki App…
దివ్యాంగుల గళం… దేశం వినాల్సిన సమయం వచ్చింది! దివ్యంగుల NPRD INDIA రాష్ట్ర కమిటీ దివ్యాంగుల గళం… దేశం వినాల్సిన సమయం వచ్చింది! PM Modi తెలంగాణ పర్యటన సందర్భంగా SCIAT & NPRD (INDIA) తరఫున మా స్పష్టమైన డిమాండ్ 👇 ₹300 దివ్యాంగుల పెన్షన్ కాదు… కనీసం ₹3000 ఇవ్వాలి! దివ్యాంగుల జీవితాలు కూడా గౌరవప్రదంగానే ఉండాలి. సంక్షేమం మాటల్లో కాదు… అమలులో కనిపించాలి. ఈ వీడియోను ఎక్కువగా షేర్ చేయండి 📢 మన గళం ఢిల్లీ వరకు వినిపిద్దాం 🇮🇳 #DisabilityPension #300To3000 #SCIAT #NPRDIndia #PMModi #Divyangs #SocialJustice #Telangana
Bukka Ismail
దివ్యాంగుల గళం… దేశం వినాల్సిన సమయం వచ్చింది! దివ్యంగుల NPRD INDIA రాష్ట్ర కమిటీ దివ్యాంగుల గళం… దేశం వినాల్సిన సమయం వచ్చింది! PM Modi తెలంగాణ పర్యటన సందర్భంగా SCIAT & NPRD (INDIA) తరఫున మా స్పష్టమైన డిమాండ్ 👇 ₹300 దివ్యాంగుల పెన్షన్ కాదు… కనీసం ₹3000 ఇవ్వాలి! దివ్యాంగుల జీవితాలు కూడా గౌరవప్రదంగానే ఉండాలి. సంక్షేమం మాటల్లో కాదు… అమలులో కనిపించాలి. ఈ వీడియోను ఎక్కువగా షేర్ చేయండి 📢 మన గళం ఢిల్లీ వరకు వినిపిద్దాం 🇮🇳 #DisabilityPension #300To3000 #SCIAT #NPRDIndia #PMModi #Divyangs #SocialJustice #Telangana
More news from Telangana and nearby areas
- 17254 మంది రైతులు నుండి ధాన్యం కొనుగోలు చేసి 86 కోట్లు చెల్లింపులు జరిగాయి జిల్లా కలెక్టర్ ప్రతిమాసింగ్ ప్రచురణార్థం మెదక్ 10 మే,2026 ప్రణాళిక బద్ధంగా ధాన్యం కొనుగోలు ప్రక్రియ కలెక్టర్ *కొనుగోలు చేసిన ధాన్యాన్ని త్వరితగతిని మిల్లులకు తరలించాలి..* 86 కోట్ల రూపాలు రైతులకు చెల్లింపు *ధాన్యాన్ని విల్లులకు తలించేందకు ప్రత్యేక చర్యలు* ఇప్పటివరకు 17254 మంది రైతుల నుండి 80,411 మెట్రిక్ టన్నుల ధాన్యాన్ని కొనుగోలు చేసి 86 కోట్లు చెల్లింపులు కొనుగోలు అయిన ధాన్యాన్ని సత్వరమే మిల్లులకు తరలించేందుకు తగిన చర్యలు తీసుకోవాలని *జిల్లా కలెక్టర్ ప్రతిమా సింగ్ సంబందిత అధికారులను ఆదివారం ఒక ప్రకటన ద్వారా ఆదేశించారు. ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ ఈ ఇప్పటివరకు 17254 మంది రైతుల నుండి 80,411 మెట్రిక్ టన్నుల ధాన్యాన్ని కొనుగోలు చేసి 86 కోట్లు చెల్లింపులు చేస్తున్నట్లు వివరించారు కొనుగోలు చేసిన ధాన్యం వివరాలను కలెక్టర్ తెలుసుకొని... నిల్వలు లేకుండా వెను వెంటనే విల్లులకు తలించేందుకు ప్రత్యేక శ్రద్ద తీసుకోవాలని అన్నారు. వేగవంతంగా రవాణా చేయుటకు దిశనిర్ధేశం చేశారు. కొనుగోలు అయిన ధాన్యాన్ని సత్వరమే మిల్లులకు తరలించుటకు ప్రత్యేక చర్యలు తీసుకోవాలని, లారీ ల పైనే ఆధార పడకుండా అవసరమైతే ఇతరాత్ర వాహనాలను ద్వారా మిల్లులకు చేరవేసేందుకు చర్యలు తీసుకోవాలని అధికారులను ఆదేశించారు. అలాగే రోజువారిగా కేంద్రాలో గల నిల్వలు, మిల్లులకు తరలించిన వివరాల నివేదికలను సమర్పించాలని కలెక్టర్ కొనుగోలు కేంద్ర నిర్వాహకులను ఆదేశించారు ధాన్యాన్ని మిల్లులకు తరలించుటలో ఎలాంటి అలసత్వం ప్రదర్శించరాదని నిర్వహకులకు కలెక్టర్ స్పష్టం చేశారు. గన్ని సంచులు, టార్పాలిన్లు సరిపడా అందుబాటులో ఉండేవిధంగా చర్యలు తీసుకోవాలని, కేంద్రాలలో ఉండే ప్రతి దాన్యం గింజను మిల్లులకు తరలించే వరకు శ్రమించాలని అధికారులకు కలెక్టర్ సూచించారు. ఏమైన సమస్యలు ఉంటే తమ దృష్టికి తెవాలన్నారు. అలాగే ధాన్యాన్ని కొనుగోలు చేసిన వివరాలు , మిల్లులకు రవాణా చేస్తున్న ధాన్యం వివరాలను సంబంధిత రిజిష్టర్లలో పకడ్బందీగా నమోదు చేయాలని ఆదేశించారు1
- పటాన్చెరు పట్టణంలో హోటల్ లో అగ్ని ప్రమాదం తప్పిన ప్రమాదం పటాన్ చెరు బస్టాండ్ సమీపంలోని ఖానవల్లి హోటల్ లో షార్ట్ సర్క్యూట్ తో ఆదివారం అగ్నిప్రమాదం జరిగింది. మంటలు వేగంగా వ్యాపించడంతో స్థానికులు భయాందోళన చెందారు. వెంటనే స్పందించిన యాజమాన్యం హోటల్లో ఉన్న వారిని వెంటనే బయటకు పంపించింది. సమాచారం అందుకున్న అగ్నిమాపక సిబ్బంది వెంటనే మంటలను ఆర్పి వేశారు. హోటల్ యజమాని జరప్పకు శిల్ప గాయాలు అయ్యాయి.1
- నిజాంసాగర్ మండలం : మంగ్లూరు నుంచి మోడీ బహిరంగ సభకు భారీగా తరలిన బిజెపి శ్రేణులు, మోదీ నాయకత్వం వర్ధిల్లాలని నినాదాలు జుక్కల్ నియోజకవర్గం నిజాంసాగర్ మండలం సికింద్రాబాద్ పరేడ్ గ్రౌండ్లో నిర్వహించనున్న ప్రధాని మోదీ భారీ బహిరంగ సభకు నిజాంసాగర్ మండలం మంగ్లూర్ గ్రామం నుంచి బీజేపీ కార్యకర్తలు భారీగా తరలివెళ్లారు. గ్రామ సర్పంచ్ నర్మల రాజు ఆధ్వర్యంలో నాయకులు, కార్యకర్తలు ఉత్సాహంగా పయనమయ్యారు. ఈ సందర్భంగా మోదీ నాయకత్వం వర్ధిల్లాలని నినాదాలు చేస్తూ ప్రత్యేక వాహనాల్లో బయలుదేరారు. ప్రధాని సభను విజయవంతం చేయడమే లక్ష్యంగా పార్టీ శ్రేణులు పెద్ద ఎత్తున కదిలాయి.1
- నెల రోజులు అవుతుంది ప్రభుత్వం పంట కొనడం లేదు ప్రభుత్వం పంట కొనకున్నా బాగున్ను.. ప్రైవేట్ వాళ్లకు అయినా అమ్మేవాళ్ళము ఇప్పుడు ప్రభుత్వం కొనకుండా ప్రైవేట్ వాళ్ళని కొనకుండా చేసారు తెలివి లేక కాంగ్రెస్ పార్టీకి ఓటు వేశాము నెల రోజులు అవుతుంది ప్రభుత్వం పంట కొనడం లేదు ప్రభుత్వం పంట కొనకున్నా బాగున్ను.. ప్రైవేట్ వాళ్లకు అయినా అమ్మేవాళ్ళము ఇప్పుడు ప్రభుత్వం కొనకుండా ప్రైవేట్ వాళ్ళని కొనకుండా చేసారు తెలివి లేక కాంగ్రెస్ పార్టీకి ఓటు వేశాము1
- సికింద్రాబాద్‌లోని జవహర్‌నగర్‌లో ప్రేమ వ్యవహారం కారణంగా 23 ఏళ్ల బీటెక్ విద్యార్థి యావన్‌ను దారుణంగా కత్తితో పొడిచి చంపారు. యువతి కుటుంబ సభ్యులు హెచ్చరించినా కలుస్తుండటంతో, ఆరుగురు దుండగులు అతడిని 17 సార్లు కత్తితో పొడిచి హత్య చేశారు. ఈ ఘటనకు సంబంధించి పలు కీలక వివరాలు వెలుగులోకి వచ్చాయి.1
- నామీద వస్తున్న తప్పుడు ప్రచారాలు నమ్మకండి:బీజేపీ ఎంపీ బండి సంజయ్ నా మీద వస్తున్న తప్పుడు ప్రచారాలను బిజెపి కార్యకర్తలు ప్రజలు నమ్మవద్దని కేంద్రమంత్రి బండి సంజయ్ తెలిపారు. రాజకీయంగా నన్ను ఎదుర్కోలేక ఇలా తప్పుడు ప్రచారాలు చేస్తున్నారని పరేడ్ గ్రౌండ్ లో నిర్వహించిన మోడీ బహిరంగ సభలో ఆయన మాట్లాడారు. తాను సామాన్యంగా కార్యకర్తగా కాషాయం జెండాను భుజంపై ఎత్తుకొని కేంద్రమంత్రి అయ్యానని కాలర్ ఎగర వేసుకొని నేను బిజెపి కార్యకర్తలు అని చెప్పుకుంటానని తెలిపారు. తండ్రుల పేర్లు చెప్పి నేను ఎప్పుడూ రాజకీయాల్లోకి రాలేదని తెలిపారు.1
- టీవీకే అధినేత విజయ్ ప్రమాణ స్వీకార కార్యక్రమానికి రాహుల్ గాంధీ హాజరయ్యారు. ఆయన హాజరు జాతీయ స్థాయిలో ఈ కార్యక్రమానికి ప్రత్యేక ప్రాధాన్యతను సంతరించుకుంది.1
- పాపన్నపేటలో ధాన్యం కొనుగోలు కేంద్రాన్ని ఆకస్మికంగా తనకి చేసిన ఎమ్మెల్యే రోహిత్ రావు ధాన్యం కొనుగోలులో వేగం పెంచాలి... పాపన్నపేటలో కొనుగోలు కేంద్రాన్ని ఆకస్మికంగా తనిఖీ చేసిన ఎమ్మెల్యే మైనంపల్లి రోహిత్ రావు * రైస్ మిల్లర్లతో ఫోన్లో మాట్లాడి సమస్య పరిష్కరించిన ఎమ్మెల్యేధాన్యం కొనుగోలు ప్రక్రియలో వేగం పెంచాలని మెదక్ ఎమ్మెల్యే మైనంపల్లి రోహిత్ రావు సూచించారు.ఆదివారం సాయంత్రం పాపన్నపేటలో ధాన్యం కొనుగోలు కేంద్రాన్ని ఆకస్మికంగా తనిఖీ చేశారు.కొనుగోలు కేంద్రంలో ఉన్న ధాన్యాన్ని పరిశీలించారు.కొనుగోలు ప్రక్రియలో రైస్ మిల్లర్లు ఇబ్బందులు పెడుతున్నారని స్థానిక నాయకులు, రైతులు ఆయన దృష్టికి తీసుకురావడంతో వెంటనే స్పందించి పలువురు రైస్ మిల్లర్లతో ఫోన్లో మాట్లాడారు.రైతులకు ఇబ్బందులు లేకుండా మిల్లుకు వచ్చిన వెంటనే ధాన్యాన్ని ఖాళీ చేసి ఇబ్బందులు లేకుండా చూడాలని రైస్ మిల్లర్లకు సూచించారు.రైతులు అధైర్య పడవద్దని పండించిన ప్రతి చివరి గింజ వరకు ప్రభుత్వం ధాన్యం కొనుగోలు చేస్తుందని పేర్కొన్నారు.అధికారులు ఎప్పటికపుడు కొనుగోలు ప్రక్రియను పరిశీలించాలని సూచించారు.ఎమ్మెల్యే వెంట మెదక్ మున్సిపల్ వైస్ చైర్మన్ దొంతి నరేష్ గౌడ్, మండల కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు నరేందర్ గౌడ్, మండల నాయకులు ప్రశాంత్ రెడ్డి, శ్రీనివాస్, శ్రీకాంతప్ప, శ్రీనివాస్, హీరాలాల్, గౌస్, తదితరులున్నారు.1