logo
Shuru
Apke Nagar Ki App…
  • Latest News
  • News
  • Politics
  • Elections
  • Viral
  • Astrology
  • Horoscope in Hindi
  • Horoscope in English
  • Latest Political News
logo
Shuru
Apke Nagar Ki App…

జూలై 2028 నాటికి ఎస్‌ఎల్‌బీసీ సొరంగ మార్గం పూర్తి చేస్తాం : మంత్రి కోమటిరెడ్డి వెంకటరెడ్డి నియోజకవర్గ ప్రజల రాకపోకలకు ఎలాంటి ఇబ్బందులు లేకుండా మెరుగైన రహదారులను నిర్మించడంతో పాటు నల్లగొండ నియోజకవర్గాన్ని అన్ని రంగాల్లో అభివృద్ధి చేయడమే తన సంకల్పమని రాష్ట్ర రోడ్లు, భవనాలు, సినిమాటోగ్రఫీ శాఖల మంత్రి కోమటిరెడ్డి వెంకటరెడ్డి అన్నారు. సోమవారం నల్లగొండ మండలం, రాములబండ గ్రామ సమీపంలో రహదారులు, భవనాల శాఖ ఆధ్వర్యంలో రూ.107 కోట్ల అంచనా వ్యయంతో చేపట్టనున్న డబుల్‌ రోడ్ నిర్మాణ పనులకు మంత్రి శంకుస్థాపన చేశారు. ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ నల్లగొండ మండల పరిధిలో రూ.107 కోట్లతో డబుల్‌ రోడ్ల నిర్మాణ పనులను చేపడుతున్నట్లు తెలిపారు.న్యం రోడ్డు నుంచి దొనకల్లు ఎక్స్‌రోడ్‌ మీదుగా రాములబండ, కొండారం, అప్పాజీపేట అన్నపర్తి వరకు రూ.75 కోట్లతో డబుల్‌ రోడ్డు నిర్మాణానికి ముందస్తు టెండర్‌ ప్రక్రియ పూర్తి చేశామని, నాలుగు రోజుల్లో పనులు ప్రారంభిస్తామని చెప్పారు.దసరా కానుకగా ఈ పనులను పూర్తి చేసి ప్రజలకు అందుబాటులోకి తీసుకొస్తామని తెలిపారు.నియోజకవర్గంలో నిర్మించే రహదారులు సుమారు 30 సంవత్సరాల పాటు ప్రజలకు ఉపయోగపడేలా నాణ్యతతో నిర్మిస్తామని మంత్రి చెప్పారు. నల్లగొండ నియోజకవర్గంలో సుమారు రూ.850 కోట్లతో గ్రామాలకు హ్యాంరోడ్లు, ఇతర రహదారుల నిర్మాణ పనులు చేపడుతున్నామని, ప్రజలకు రాకపోకల్లో ఎలాంటి ఇబ్బందులు లేకుండా చర్యలు తీసుకుంటున్నామని తెలిపారు. రాష్ట్రవ్యాప్తంగా సుమారు రూ.25 వేల కోట్లతో రహదారుల అభివృద్ధి పనులు చేపడుతున్నట్లు వెల్లడించారు.ప్రస్తుతం ప్రపంచవ్యాప్తంగా ఎల్ నినో వల్ల కరువు పరిస్థితులతో ప్రజలు ఇబ్బందులు పడుతున్నారని, దేవుడి దయతో వర్షాలు సమృద్ధిగా కురవాలని వినాయకుడిని ప్రార్థించాలని మంత్రి కోరారు. ఎస్‌ఎల్‌బీసీ సొరంగ మార్గం పనుల్లో ఇప్పటికే 600 మీటర్ల మేర పురోగతి సాధించామని మంత్రి తెలిపారు. ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి ద్వారా స్వయంగా నిధులు తీసుకొచ్చి బ్రాహ్మణవెల్లెంల ప్రాజెక్టును పూర్తి చేయించామని చెప్పారు. సొరంగ మార్గం పనులకు అవసరమైన రూ.2 వేల కోట్లకు అదనంగా ముఖ్యమంత్రి ద్వారా నిధులు తీసుకొచ్చి జూలై 2028 నాటికి సొరంగ మార్గాన్ని పూర్తి చేసి నల్లగొండ రైతులకు రెండు పంటలకు సాగునీరు అందిస్తానని మంత్రి స్పష్టం చేశారు.ప్రతి గ్రామానికి సబ్‌స్టేషన్‌ నిర్మించడంతో పాటు, అర్హులైన పేదలకు ఇందిరమ్మ ఇళ్లు, రేషన్‌ కార్డులు అందిస్తున్నామని తెలిపారు. తెలంగాణ వ్యాప్తంగా సన్నబియ్యం పంపిణీ చేస్తున్నామని, గత ప్రభుత్వం దొడ్డు బియ్యం అందించి ప్రజలను ఇబ్బందులకు గురిచేసిందని విమర్శించారు.దోమలపల్లి గ్రామంలో రూ.10 కోట్లతో తెలంగాణ పబ్లిక్‌ స్కూల్‌ను నిర్మిస్తున్నామని మంత్రి తెలిపారు. త్వరలోనే తల్లిదండ్రులు తమ పిల్లలను ఈ పాఠశాలలో చేర్పించాలని సూచించారు. ప్రైవేట్‌ పాఠశాలలకు దీటుగా ప్రభుత్వ పాఠశాలల్లో నాణ్యమైన విద్య అందించడమే ప్రభుత్వ లక్ష్యమన్నారు.ఎస్‌ఎల్‌బీసీ సమీపంలో రూ.200 కోట్లతో యంగ్‌ ఇండియా స్కూల్‌ను నిర్మిస్తున్నామని, కులమతాలకు అతీతంగా పిల్లలందరూ నాణ్యమైన విద్యను అభ్యసించేలా ఈ పాఠశాలను ఏర్పాటు చేస్తున్నామని తెలిపారు.నల్లగొండ నియోజకవర్గాన్ని అన్ని రంగాల్లో అభివృద్ధి చేసి రాష్ట్రంలో ఆదర్శ నియోజకవర్గంగా తీర్చిదిద్దడమే తన లక్ష్యమని మంత్రి కోమటిరెడ్డి వెంకటరెడ్డి అన్నారు. ఈ కార్యక్రమంలో. ఆర్ అండ్ బి ఎస్ ఈ. మోహన్ ఆర్డీవో అశోక్ రెడ్డి,తహసిల్దార్ పరుశురాం, ఎంపీడీవో యాకూబ్ నాయక్ ,మాజీ జెడ్పిటిసి గుమ్మలమోహన్ రెడ్డి ,మాజీ జెడ్పిటిసి వంగూరి లక్ష్మయ్య, ఆర్ అండ్ బి డి ఈ గణేష్, ఏఈ వెంకట రమేష్ ,పి ఆర్ డి ఈ రమేష్, సర్పంచ్ చామకూరి శంకర్ , సెక్రటరీ విటల్ రెడ్డి, సర్పంచులు ప్రజలు పాల్గొన్నారు .

1 day ago
user_Praneeth
Praneeth
Nalgonda, Telangana•
1 day ago
2cac2d3a-a8f8-4fbe-bc1c-17620e39af9f

జూలై 2028 నాటికి ఎస్‌ఎల్‌బీసీ సొరంగ మార్గం పూర్తి చేస్తాం : మంత్రి కోమటిరెడ్డి వెంకటరెడ్డి నియోజకవర్గ ప్రజల రాకపోకలకు ఎలాంటి ఇబ్బందులు లేకుండా మెరుగైన రహదారులను నిర్మించడంతో పాటు నల్లగొండ నియోజకవర్గాన్ని అన్ని రంగాల్లో అభివృద్ధి చేయడమే తన సంకల్పమని రాష్ట్ర రోడ్లు, భవనాలు, సినిమాటోగ్రఫీ శాఖల మంత్రి కోమటిరెడ్డి వెంకటరెడ్డి అన్నారు. సోమవారం నల్లగొండ మండలం, రాములబండ గ్రామ సమీపంలో రహదారులు, భవనాల శాఖ ఆధ్వర్యంలో రూ.107 కోట్ల అంచనా వ్యయంతో చేపట్టనున్న డబుల్‌ రోడ్ నిర్మాణ పనులకు మంత్రి శంకుస్థాపన చేశారు. ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ నల్లగొండ మండల పరిధిలో రూ.107 కోట్లతో డబుల్‌ రోడ్ల నిర్మాణ పనులను చేపడుతున్నట్లు తెలిపారు.న్యం రోడ్డు నుంచి దొనకల్లు ఎక్స్‌రోడ్‌ మీదుగా రాములబండ, కొండారం, అప్పాజీపేట అన్నపర్తి వరకు రూ.75 కోట్లతో డబుల్‌ రోడ్డు నిర్మాణానికి ముందస్తు టెండర్‌ ప్రక్రియ పూర్తి చేశామని, నాలుగు రోజుల్లో పనులు ప్రారంభిస్తామని చెప్పారు.దసరా కానుకగా ఈ పనులను పూర్తి చేసి ప్రజలకు అందుబాటులోకి తీసుకొస్తామని తెలిపారు.నియోజకవర్గంలో నిర్మించే రహదారులు సుమారు 30 సంవత్సరాల పాటు ప్రజలకు ఉపయోగపడేలా నాణ్యతతో నిర్మిస్తామని మంత్రి చెప్పారు. నల్లగొండ నియోజకవర్గంలో సుమారు రూ.850 కోట్లతో గ్రామాలకు హ్యాంరోడ్లు, ఇతర రహదారుల నిర్మాణ పనులు చేపడుతున్నామని, ప్రజలకు రాకపోకల్లో ఎలాంటి ఇబ్బందులు లేకుండా చర్యలు తీసుకుంటున్నామని తెలిపారు. రాష్ట్రవ్యాప్తంగా సుమారు రూ.25 వేల కోట్లతో రహదారుల అభివృద్ధి పనులు చేపడుతున్నట్లు వెల్లడించారు.ప్రస్తుతం ప్రపంచవ్యాప్తంగా ఎల్ నినో వల్ల కరువు పరిస్థితులతో ప్రజలు ఇబ్బందులు పడుతున్నారని, దేవుడి దయతో వర్షాలు సమృద్ధిగా కురవాలని వినాయకుడిని ప్రార్థించాలని మంత్రి కోరారు. ఎస్‌ఎల్‌బీసీ సొరంగ మార్గం పనుల్లో ఇప్పటికే 600 మీటర్ల మేర పురోగతి సాధించామని మంత్రి తెలిపారు. ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి ద్వారా స్వయంగా నిధులు తీసుకొచ్చి బ్రాహ్మణవెల్లెంల ప్రాజెక్టును పూర్తి చేయించామని చెప్పారు. సొరంగ మార్గం పనులకు అవసరమైన రూ.2 వేల కోట్లకు అదనంగా ముఖ్యమంత్రి ద్వారా నిధులు తీసుకొచ్చి జూలై 2028 నాటికి సొరంగ మార్గాన్ని పూర్తి చేసి నల్లగొండ రైతులకు రెండు పంటలకు సాగునీరు అందిస్తానని మంత్రి స్పష్టం చేశారు.ప్రతి గ్రామానికి సబ్‌స్టేషన్‌ నిర్మించడంతో పాటు, అర్హులైన పేదలకు ఇందిరమ్మ ఇళ్లు, రేషన్‌ కార్డులు అందిస్తున్నామని తెలిపారు. తెలంగాణ వ్యాప్తంగా సన్నబియ్యం పంపిణీ చేస్తున్నామని, గత ప్రభుత్వం దొడ్డు బియ్యం అందించి ప్రజలను ఇబ్బందులకు గురిచేసిందని విమర్శించారు.దోమలపల్లి గ్రామంలో రూ.10 కోట్లతో తెలంగాణ పబ్లిక్‌ స్కూల్‌ను నిర్మిస్తున్నామని మంత్రి తెలిపారు. త్వరలోనే తల్లిదండ్రులు తమ పిల్లలను ఈ పాఠశాలలో చేర్పించాలని సూచించారు. ప్రైవేట్‌ పాఠశాలలకు దీటుగా ప్రభుత్వ పాఠశాలల్లో నాణ్యమైన విద్య అందించడమే ప్రభుత్వ లక్ష్యమన్నారు.ఎస్‌ఎల్‌బీసీ సమీపంలో రూ.200 కోట్లతో యంగ్‌ ఇండియా స్కూల్‌ను నిర్మిస్తున్నామని, కులమతాలకు అతీతంగా పిల్లలందరూ నాణ్యమైన విద్యను అభ్యసించేలా ఈ పాఠశాలను ఏర్పాటు చేస్తున్నామని తెలిపారు.నల్లగొండ నియోజకవర్గాన్ని అన్ని రంగాల్లో అభివృద్ధి చేసి రాష్ట్రంలో ఆదర్శ నియోజకవర్గంగా తీర్చిదిద్దడమే తన లక్ష్యమని మంత్రి కోమటిరెడ్డి వెంకటరెడ్డి అన్నారు. ఈ కార్యక్రమంలో. ఆర్ అండ్ బి ఎస్ ఈ. మోహన్ ఆర్డీవో అశోక్ రెడ్డి,తహసిల్దార్ పరుశురాం, ఎంపీడీవో యాకూబ్ నాయక్ ,మాజీ జెడ్పిటిసి గుమ్మలమోహన్ రెడ్డి ,మాజీ జెడ్పిటిసి వంగూరి లక్ష్మయ్య, ఆర్ అండ్ బి డి ఈ గణేష్, ఏఈ వెంకట రమేష్ ,పి ఆర్ డి ఈ రమేష్, సర్పంచ్ చామకూరి శంకర్ , సెక్రటరీ విటల్ రెడ్డి, సర్పంచులు ప్రజలు పాల్గొన్నారు .

More news from తెలంగాణ and nearby areas
  • జిల్లాలో ప్రశాంతంగా గణేష్ వేడుకలు జరుపుకోవాలి.. నల్గొండ ఎస్పీ శరత్ చంద్ర పవార్ _గణేష్ ఉత్సవాల సందర్భంగా జిల్లా ఎస్పీ శరత్ చంద్ర పవార్ కీలక సూచనలు.!_ ఇప్పటివరకు జిల్లాలో సుమారు 2,500 వరకు ఆన్‌లైన్ రిజిస్ట్రేషన్లు పూర్తి.. మరో వెయ్యి వరకు రిజిస్ట్రేషన్లు పూర్తయ్యే అవకాశం.. ప్రతి గణేష్ మండపం వద్ద నిర్వాహకులు తప్పనిసరిగా సీసీ కెమెరాలు ఏర్పాటు చేయాలి... రాత్రి వేళల్లో మండపం వద్ద ఒక నిర్వాహకుడు తప్పనిసరిగా అందుబాటులో ఉండాలి.. భక్తులను రెచ్చగొట్టే విధంగా పాటలు పెట్టకుండా ప్రశాంత వాతావరణంలో ఉత్సవాలు నిర్వహించాలి.. ప్రతి గణేష్ మండపానికి ఒక కానిస్టేబుల్‌ను అందుబాటులో.. దొంగతనాల నివారణకు సీసీఎస్ బృందాలు ప్రత్యేకంగా ఫీల్డ్‌లో పర్యటిస్తాయి.. మహిళల భద్రత కోసం షీ టీమ్స్ కూడా నిరంతరం పర్యవేక్షిస్తాయి... ఆన్‌లైన్ రిజిస్ట్రేషన్ సమయంలో నిమజ్జనం తేదీ వివరాలను కూడా నమోదు చేయాలి.. నిమజ్జనం రోజున ఆయా ప్రాంతాలకు అనుగుణంగా ప్రత్యేక బందోబస్తు ఏర్పాటు చేస్తాం.. ల్యాండ్ అండ్ ఆర్డర్‌కు విఘాతం కలిగించే వారిపై కఠిన చర్యలు తప్పవు.. గత వారం రోజులుగా పలువురికి కౌన్సెలింగ్, బైండోవర్ చర్యలు చేపట్టాం.. ఉత్సవాలను ప్రశాంతమైన వాతావరణంలో భక్తిశ్రద్ధలతో నిర్వహించాలని విజ్ఞప్తి.. *జిల్లా ఎస్పీ శరత్ చంద్ర పవార్*
    1
    జిల్లాలో ప్రశాంతంగా గణేష్ వేడుకలు జరుపుకోవాలి.. నల్గొండ ఎస్పీ శరత్ చంద్ర పవార్
_గణేష్ ఉత్సవాల సందర్భంగా జిల్లా ఎస్పీ శరత్ చంద్ర పవార్ కీలక సూచనలు.!_
ఇప్పటివరకు జిల్లాలో సుమారు 2,500 వరకు ఆన్‌లైన్ రిజిస్ట్రేషన్లు పూర్తి..
మరో వెయ్యి వరకు రిజిస్ట్రేషన్లు పూర్తయ్యే అవకాశం..
ప్రతి గణేష్ మండపం వద్ద నిర్వాహకులు తప్పనిసరిగా సీసీ కెమెరాలు ఏర్పాటు చేయాలి...
రాత్రి వేళల్లో మండపం వద్ద ఒక నిర్వాహకుడు తప్పనిసరిగా అందుబాటులో ఉండాలి..
భక్తులను రెచ్చగొట్టే విధంగా పాటలు పెట్టకుండా ప్రశాంత వాతావరణంలో ఉత్సవాలు నిర్వహించాలి..
ప్రతి గణేష్ మండపానికి ఒక కానిస్టేబుల్‌ను అందుబాటులో..
దొంగతనాల నివారణకు సీసీఎస్ బృందాలు ప్రత్యేకంగా ఫీల్డ్‌లో పర్యటిస్తాయి..
మహిళల భద్రత కోసం షీ టీమ్స్ కూడా నిరంతరం పర్యవేక్షిస్తాయి...
ఆన్‌లైన్ రిజిస్ట్రేషన్ సమయంలో నిమజ్జనం తేదీ వివరాలను కూడా నమోదు చేయాలి..
నిమజ్జనం రోజున ఆయా ప్రాంతాలకు అనుగుణంగా ప్రత్యేక బందోబస్తు ఏర్పాటు చేస్తాం..
ల్యాండ్ అండ్ ఆర్డర్‌కు విఘాతం కలిగించే వారిపై కఠిన చర్యలు తప్పవు..
గత వారం రోజులుగా పలువురికి కౌన్సెలింగ్, బైండోవర్ చర్యలు చేపట్టాం..
ఉత్సవాలను ప్రశాంతమైన వాతావరణంలో భక్తిశ్రద్ధలతో నిర్వహించాలని విజ్ఞప్తి..
*జిల్లా ఎస్పీ శరత్ చంద్ర పవార్*
    user_Journalist pk
    Journalist pk
    Journalist గుండ్ల పల్లె, నల్గొండ, తెలంగాణ•
    15 hrs ago
  • ఎస్సై వేధింపులంటూ పోలీస్‌స్టేషన్ ఎదుట కుటుంబం మందు డబ్బతో ఆందోళన ఎస్సై రవికుమార్ తమను అసభ్య పదజాలంతో దూషించారని బాధితుల ఆవేదన వ్యక్తం చేస్తూ పోలీస్‌ స్టేషన్‌కు పిలిపించి తీవ్రంగా వేధిస్తున్నారని మహబూబాబాద్ జిల్లా దంతాలపల్లి మండలం తూర్పు తండా గ్రామానికి చెందిన కుటుంబసభ్యులు గూగులోత్ రూప్సింగ్ వారి కుటుంబసభ్యులు ఆవేదన వ్యక్తం చేశారు.ఇంటి దారి, భూవివాదంలో శంకర్ కేసు పెట్టినట్లు బాధితుల ఆరోపణ చేశారు. కేసుకు సంబంధించిన ఆధారాలు పరిశీలించకుండానే తమను ఇబ్బందులకు గురిచేస్తున్నారని వారన్నారు. ఎస్సై వేధింపులు తట్టుకోలేక మందు డబ్బాతో పోలీస్‌స్టేషన్ ఎదుట నిరసన వ్యక్తం చేశారు. తమకు ప్రాణహాని ఉందని ఆందోళన వ్యక్తం చేసిన రూప్‌సింగ్ కుటుంబ సభ్యులు ఎస్సైపై సమగ్ర విచారణ జరిపి న్యాయం చేయాలని డిమాండ్ చేశారు.
    1
    ఎస్సై వేధింపులంటూ పోలీస్‌స్టేషన్ ఎదుట కుటుంబం మందు డబ్బతో ఆందోళన
ఎస్సై రవికుమార్ తమను అసభ్య పదజాలంతో దూషించారని బాధితుల ఆవేదన వ్యక్తం చేస్తూ పోలీస్‌ స్టేషన్‌కు పిలిపించి తీవ్రంగా వేధిస్తున్నారని మహబూబాబాద్ జిల్లా దంతాలపల్లి మండలం తూర్పు తండా గ్రామానికి చెందిన కుటుంబసభ్యులు గూగులోత్ రూప్సింగ్ వారి కుటుంబసభ్యులు ఆవేదన వ్యక్తం చేశారు.ఇంటి దారి, భూవివాదంలో శంకర్ కేసు పెట్టినట్లు బాధితుల ఆరోపణ చేశారు. కేసుకు సంబంధించిన ఆధారాలు పరిశీలించకుండానే తమను ఇబ్బందులకు గురిచేస్తున్నారని వారన్నారు.
ఎస్సై వేధింపులు తట్టుకోలేక మందు డబ్బాతో పోలీస్‌స్టేషన్ ఎదుట నిరసన వ్యక్తం చేశారు. తమకు ప్రాణహాని ఉందని ఆందోళన వ్యక్తం చేసిన రూప్‌సింగ్ కుటుంబ సభ్యులు ఎస్సైపై సమగ్ర విచారణ జరిపి న్యాయం చేయాలని డిమాండ్ చేశారు.
    user_Shareef pasha
    Shareef pasha
    Local News Reporter పాలకుర్తి, జనగాం, తెలంగాణ•
    8 hrs ago
  • మతోన్మాదవాదులు సాయుధ పోరాటాన్ని వక్రీకరిస్తున్నారు సిపిఎం జిల్లా కార్యదర్శి వర్గ సభ్యులు కల్లూరి మల్లేశం నిజాం నిరంకుశ పాలనకు, భూస్వామ్య దోపిడీకి, వెట్టిచాకిరీకి వ్యతిరేకంగా భూమి, భుక్తి, విముక్తి కోసం కుల, మతాలకు అతీతంగా కమ్యూనిస్టు పార్టీ నాయకత్వంలో తెలంగాణ సాయుధ రైతాంగ పోరాటం సాగిందని కానీ కొంత మంది మతోన్మాదులు చరిత్రను వక్రీకరిస్తూ తప్పుడు ప్రచారం చేస్తున్నారని సీపీఐ(ఎం) జిల్లా కార్యదర్శి వర్గ సభ్యులు కల్లూరి మల్లేశం విమర్శించారు. తెలంగాణ సాయుధ పోరాటాన్ని హిందూ–ముస్లిం పోరాటంగా చిత్రీకరిస్తూ చరిత్రను వక్రీకరించే ప్రయత్నాలను ఆయన తీవ్రంగా ఖండించారు. మంగళ వారం నాడు సాయుధ రైతాంగ పోరాట వారోత్సవాలలో భాగంగా గుండ్ల గూడెం, పటేల్ గూడెం, శ్రీనివాస పురం గ్రామంలో నాటి తెలంగాణ సాయుధ రైతాంగ పోరాటం లో పాల్గొన్న ఎసి రెడ్డి నరసింహ రెడ్డి, బొమ్మ కంటి లక్ష్మి నర్సయ్య, గ్యార బాలయ్య, ఏంటిక రాములు , గ్యార సిద్దయ్య తదితరుల స్థూ పాలకు. పూల మాలలు వేసి ఘనంగా నివాళులు అర్పించడమైనది. ఈ సందర్భంగా ఆయా గ్రామాల్లో నిర్వహించిన సభలకు ముఖ్య అతిథిగా హాజరైన జిల్లా కార్యదర్శి వర్గ సభ్యులు కల్లూరి మల్లేశం మాట్లాడుతూ తెలంగాణ సాయుధ రైతాంగ పోరాటంలో గానీ, దేశ స్వాతంత్ర్య పోరాటంలో గానీ పాల్గొనని వారు నేడు దేశభక్తి గురించి మాట్లాడటం విడ్డూరంగా ఉందన్నారు. బ్రిటిష్ పాలకులకు లొంగిపోయి వారి అనుకూలంగా వ్యవహరించిన శక్తులు నేడు తెలంగాణ సాయుధ రైతాంగ పోరాటాన్ని హిందూ–ముస్లిం పోరాటంగా వక్రీకరించడం ద్వారా ప్రజల మధ్య మత విభజనలను సృష్టించి రాజకీయ లబ్ధి పొందాలని చూస్తున్నాయని విమర్శించారు. నిజాం ముస్లిం పాలకుడైనప్పటికీ తెలంగాణలోని అనేక మంది భూస్వాములు, జమీందార్లు, జాగీర్దార్లు హిందువులే ఉన్నారని, దోపిడీకి మతం లేదని అన్నారు. పేద రైతులు, కూలీలు, మహిళలు, అణగారిన వర్గాలు కుల, మత భేదాలను అధిగమించి సాగించిన ఈ పోరాటంలో వేలాది మంది అమరులయ్యారని గుర్తు చేశారు. అమరవీరుల త్యాగాలను ఓట్ల కోసం వక్రీకరించడం, ప్రజల మధ్య విద్వేషాలను రెచ్చగొట్టడం మానుకోవాలని, తెలంగాణ సాయుధ రైతాంగ పోరాటం వాస్తవ చరిత్రను ప్రజలకు తెలియజేస్తూ వారి ఆశయాల సాధన కోసం కమ్యూనిస్టు పార్టీ నిరంతరం పోరాడుతుందని మల్లేశం స్పష్టం చేశారు. ఈ కార్యక్రమంలో జిల్లా కమిటీ సభ్యులు.M.A ఇక్బాల్, మండల కార్యదర్శి దూపటి వెంకటేష్, మండల కార్యదర్శి వర్గ సభ్యులు సూదగాని సత్య రాజయ్య, జూకంటి పౌల్, మిట్ట శంకరయ్య, నల్ల మాస తుల శయ్య, పిక్క గణేష్ మోరీ గాడి రమేశ్, సంగీ రాజు, బొమ్మకంటి లక్ష్మి నారాయణ,గణ గాని మల్లేష్, చౌడ బోయిన యాదగిరి, వడ్డే మాను బాలరాజు, పారుపల్లి సత్తయ్య, గ్యార భాస్కర్ మడిపల్లి ఆంజనేయులు, చెక్కిళ్ళ ఉపేంద్ర, మిట్ట పార్వతమ్మ, దూసరి మల్లమ్మ, ఈదు నూరి కిష్టయ్య, సోమక్క, గ్యార అండాలు ,మిట్ట బిక్షపతి, చెక్కిళ్ళ గౌరమ్మ, ఎల్లమ్మ, అంజమ్మ, నీలమ్మ తదితరులు పాల్గొన్నారు
    1
    మతోన్మాదవాదులు సాయుధ పోరాటాన్ని వక్రీకరిస్తున్నారు సిపిఎం జిల్లా కార్యదర్శి వర్గ సభ్యులు కల్లూరి మల్లేశం
నిజాం నిరంకుశ పాలనకు, భూస్వామ్య దోపిడీకి, వెట్టిచాకిరీకి వ్యతిరేకంగా భూమి, భుక్తి, విముక్తి కోసం కుల, మతాలకు అతీతంగా కమ్యూనిస్టు పార్టీ నాయకత్వంలో తెలంగాణ సాయుధ రైతాంగ పోరాటం సాగిందని కానీ కొంత మంది మతోన్మాదులు చరిత్రను వక్రీకరిస్తూ తప్పుడు ప్రచారం చేస్తున్నారని సీపీఐ(ఎం) జిల్లా కార్యదర్శి వర్గ సభ్యులు కల్లూరి మల్లేశం విమర్శించారు. తెలంగాణ సాయుధ పోరాటాన్ని హిందూ–ముస్లిం పోరాటంగా చిత్రీకరిస్తూ చరిత్రను వక్రీకరించే ప్రయత్నాలను ఆయన తీవ్రంగా ఖండించారు.
మంగళ వారం నాడు సాయుధ రైతాంగ పోరాట వారోత్సవాలలో భాగంగా గుండ్ల గూడెం, పటేల్ గూడెం, శ్రీనివాస పురం గ్రామంలో నాటి తెలంగాణ సాయుధ రైతాంగ పోరాటం లో పాల్గొన్న ఎసి రెడ్డి  నరసింహ రెడ్డి, బొమ్మ కంటి లక్ష్మి నర్సయ్య, గ్యార బాలయ్య, ఏంటిక రాములు , గ్యార సిద్దయ్య తదితరుల స్థూ పాలకు. పూల మాలలు వేసి ఘనంగా నివాళులు అర్పించడమైనది. ఈ సందర్భంగా ఆయా గ్రామాల్లో నిర్వహించిన సభలకు ముఖ్య అతిథిగా హాజరైన జిల్లా కార్యదర్శి వర్గ సభ్యులు కల్లూరి మల్లేశం మాట్లాడుతూ 
తెలంగాణ సాయుధ రైతాంగ పోరాటంలో గానీ, దేశ స్వాతంత్ర్య పోరాటంలో గానీ పాల్గొనని వారు నేడు దేశభక్తి గురించి మాట్లాడటం విడ్డూరంగా ఉందన్నారు. బ్రిటిష్ పాలకులకు లొంగిపోయి వారి అనుకూలంగా వ్యవహరించిన శక్తులు నేడు తెలంగాణ సాయుధ రైతాంగ పోరాటాన్ని హిందూ–ముస్లిం పోరాటంగా వక్రీకరించడం ద్వారా ప్రజల మధ్య మత విభజనలను సృష్టించి రాజకీయ లబ్ధి పొందాలని చూస్తున్నాయని విమర్శించారు. నిజాం ముస్లిం పాలకుడైనప్పటికీ తెలంగాణలోని అనేక మంది భూస్వాములు, జమీందార్లు, జాగీర్దార్లు హిందువులే ఉన్నారని, దోపిడీకి మతం లేదని అన్నారు. పేద రైతులు, కూలీలు, మహిళలు, అణగారిన వర్గాలు కుల, మత భేదాలను అధిగమించి సాగించిన ఈ పోరాటంలో వేలాది మంది అమరులయ్యారని గుర్తు చేశారు. అమరవీరుల త్యాగాలను ఓట్ల కోసం వక్రీకరించడం, ప్రజల మధ్య విద్వేషాలను రెచ్చగొట్టడం మానుకోవాలని, తెలంగాణ సాయుధ రైతాంగ పోరాటం వాస్తవ చరిత్రను ప్రజలకు తెలియజేస్తూ వారి ఆశయాల సాధన కోసం కమ్యూనిస్టు పార్టీ నిరంతరం పోరాడుతుందని మల్లేశం స్పష్టం చేశారు. ఈ కార్యక్రమంలో జిల్లా కమిటీ సభ్యులు.M.A ఇక్బాల్, మండల కార్యదర్శి దూపటి వెంకటేష్, మండల కార్యదర్శి వర్గ సభ్యులు సూదగాని సత్య రాజయ్య, జూకంటి పౌల్, మిట్ట శంకరయ్య, నల్ల మాస తుల శయ్య, పిక్క గణేష్ మోరీ గాడి రమేశ్, సంగీ రాజు, బొమ్మకంటి లక్ష్మి నారాయణ,గణ గాని మల్లేష్, చౌడ బోయిన యాదగిరి, వడ్డే మాను  బాలరాజు, పారుపల్లి సత్తయ్య, గ్యార భాస్కర్ మడిపల్లి ఆంజనేయులు, చెక్కిళ్ళ ఉపేంద్ర, మిట్ట పార్వతమ్మ, దూసరి మల్లమ్మ, ఈదు నూరి కిష్టయ్య, సోమక్క, గ్యార  అండాలు ,మిట్ట బిక్షపతి, చెక్కిళ్ళ గౌరమ్మ, ఎల్లమ్మ, అంజమ్మ, నీలమ్మ తదితరులు పాల్గొన్నారు
    user_గడ్డమీది చంద్రయ్య
    గడ్డమీది చంద్రయ్య
    Bhongir, Yadadri Bhuvanagiri•
    10 hrs ago
  • యాదగిరిగుట్ట గిరిప్రదక్షిణకు భారీగా తరలివచ్చిన భక్తులు యాదాద్రి లక్ష్మీ నరసింహస్వామి జన్మ నక్షత్రమైన స్వాతి నక్షత్రాన్ని పురస్కరించుకుని నిర్వహిస్తున్న గిరి ప్రదక్షిణ కార్యక్రమానికి భక్తులు భారీగా తరలివచ్చారు. గిరిప్రదక్షిణ అనంతరం స్వామి వారిని దర్శించుకొని భక్తులు తమ మొక్కులు తీర్చుకున్నారు. భక్తులకు ఎలాంటి అసౌకర్యం కలగకుండా అన్ని చర్యలు తీసుకున్నట్లు ఆలయ అధికారులు తెలిపారు.
    1
    యాదగిరిగుట్ట గిరిప్రదక్షిణకు భారీగా తరలివచ్చిన భక్తులు
యాదాద్రి లక్ష్మీ నరసింహస్వామి జన్మ నక్షత్రమైన స్వాతి నక్షత్రాన్ని పురస్కరించుకుని నిర్వహిస్తున్న గిరి ప్రదక్షిణ కార్యక్రమానికి భక్తులు భారీగా తరలివచ్చారు. గిరిప్రదక్షిణ అనంతరం స్వామి వారిని దర్శించుకొని భక్తులు తమ
మొక్కులు తీర్చుకున్నారు. భక్తులకు ఎలాంటి అసౌకర్యం కలగకుండా అన్ని చర్యలు తీసుకున్నట్లు ఆలయ అధికారులు తెలిపారు.
    user_P.srinu
    P.srinu
    యాదగిరిగుట్ట, యాదాద్రి భువనగిరి, తెలంగాణ•
    11 hrs ago
  • కుక్కల బెడద.. ప్రయాణికులకు ఇబ్బందులు.................... నడిగూడెం మండలంలోని గ్రామాల్లోనే కాకుండా గ్రామ శివారులోనూ వీధి కుక్కల బెడద పెరిగింది. గుంపులుగా సంచరిస్తూ మాటు వేసి నడిగూడెం మండల కేంద్రానికి వచ్చే ప్రయాణికులను వెంటాడుతున్నాయి. దీంతో ద్విచక్ర వాహనదారులు, పాదచారులు భయాందోళనకు గురవుతున్నారు. కుక్కల నియంత్రణకు అధికారులు చర్యలు చేపట్టి ప్రయాణికులకు ఇబ్బందులు లేకుండా చూడాలని స్థానికులు కోరుతున్నారు.
    1
    కుక్కల బెడద.. ప్రయాణికులకు ఇబ్బందులు....................
నడిగూడెం మండలంలోని గ్రామాల్లోనే కాకుండా గ్రామ శివారులోనూ వీధి కుక్కల బెడద పెరిగింది. గుంపులుగా సంచరిస్తూ మాటు వేసి నడిగూడెం మండల కేంద్రానికి వచ్చే ప్రయాణికులను వెంటాడుతున్నాయి. దీంతో ద్విచక్ర వాహనదారులు, పాదచారులు భయాందోళనకు గురవుతున్నారు. కుక్కల నియంత్రణకు అధికారులు చర్యలు చేపట్టి ప్రయాణికులకు ఇబ్బందులు లేకుండా చూడాలని స్థానికులు కోరుతున్నారు.
    user_K. UPENDER
    K. UPENDER
    Farmer నాదిగూడెం, సూర్యాపేట, తెలంగాణ•
    18 hrs ago
  • న్యూ ప్రిన్స్ బేకరీపై ఎస్‌ఓటీ పోలీసుల దాడి గడువు తీరిన ఆహార పదార్థాలు, సింథటిక్‌ ఫుడ్‌ కలర్స్‌ స్వాధీనం ఘట్‌కేసర్‌: మేడ్చల్–మల్కాజిగిరి జిల్లా ఘట్‌కేసర్‌ పట్టణంలోని న్యూ ప్రిన్స్‌ బేకరీపై ఉప్పల్‌ జోన్‌ ఎస్‌ఓటీ పోలీసులు దాడి చేసి తనిఖీలు నిర్వహించారు. తనిఖీల్లో బేకరీలో అపరిశుభ్ర వాతావరణం ఉన్నట్లు గుర్తించడంతో పాటు, గడువు తీరిన ఆహార పదార్థాలు, సింథటిక్‌ ఫుడ్‌ కలర్స్‌ వినియోగిస్తున్నట్లు పోలీసులు గుర్తించారు. ఈ సందర్భంగా గడువు తీరిన ఫుడ్‌ కలర్‌, హాట్‌ చిల్లీ ప్యాకెట్లు, మఫిన్‌ మిక్స్‌ పౌడర్‌, కొబ్బరి తురుము, 10 ట్రేల గుడ్లు, బ్రెడ్‌, వనస్పతి తదితర సామగ్రిని పోలీసులు స్వాధీనం చేసుకుని సీజ్‌ చేశారు. ఈ వ్యవహారంలో బేకరీ యజమాని షేక్‌ అక్బర్‌ (35), సూపర్‌వైజర్‌ **షేక్‌ నజీర్‌ బాషా (22)**ను అదుపులోకి తీసుకున్నారు. స్వాధీనం చేసుకున్న సామగ్రితో పాటు ఇద్దరినీ ఘట్‌కేసర్‌ పోలీసులకు అప్పగించారు. కేసు నమోదు చేసుకున్న ఘట్‌కేసర్‌ పోలీసులు దర్యాప్తు కొనసాగిస్తున్నారు. ప్రజల ఆరోగ్యంతో చెలగాటం ఆడే ఆహార వ్యాపార సంస్థలపై అధికారులు కఠిన చర్యలు తీసుకోవాలని స్థానికులు కోరుతున్నారు.
    3
    న్యూ ప్రిన్స్ బేకరీపై ఎస్‌ఓటీ పోలీసుల దాడి

గడువు తీరిన ఆహార పదార్థాలు, సింథటిక్‌ ఫుడ్‌ కలర్స్‌ స్వాధీనం

ఘట్‌కేసర్‌: మేడ్చల్–మల్కాజిగిరి జిల్లా ఘట్‌కేసర్‌ పట్టణంలోని న్యూ ప్రిన్స్‌ బేకరీపై ఉప్పల్‌ జోన్‌ ఎస్‌ఓటీ పోలీసులు దాడి చేసి తనిఖీలు నిర్వహించారు.
తనిఖీల్లో బేకరీలో అపరిశుభ్ర వాతావరణం ఉన్నట్లు గుర్తించడంతో పాటు, గడువు తీరిన ఆహార పదార్థాలు, సింథటిక్‌ ఫుడ్‌ కలర్స్‌ వినియోగిస్తున్నట్లు పోలీసులు గుర్తించారు.
ఈ సందర్భంగా గడువు తీరిన ఫుడ్‌ కలర్‌, హాట్‌ చిల్లీ ప్యాకెట్లు, మఫిన్‌ మిక్స్‌ పౌడర్‌, కొబ్బరి తురుము, 10 ట్రేల గుడ్లు, బ్రెడ్‌, వనస్పతి తదితర సామగ్రిని పోలీసులు స్వాధీనం చేసుకుని సీజ్‌ చేశారు.
ఈ వ్యవహారంలో బేకరీ యజమాని షేక్‌ అక్బర్‌ (35), సూపర్‌వైజర్‌ **షేక్‌ నజీర్‌ బాషా (22)**ను అదుపులోకి తీసుకున్నారు.
స్వాధీనం చేసుకున్న సామగ్రితో పాటు ఇద్దరినీ ఘట్‌కేసర్‌ పోలీసులకు అప్పగించారు. కేసు నమోదు చేసుకున్న ఘట్‌కేసర్‌ పోలీసులు దర్యాప్తు కొనసాగిస్తున్నారు.
ప్రజల ఆరోగ్యంతో చెలగాటం ఆడే ఆహార వ్యాపార సంస్థలపై అధికారులు కఠిన చర్యలు తీసుకోవాలని స్థానికులు కోరుతున్నారు.
    user_Kommidi shiva krishna Reddy
    Kommidi shiva krishna Reddy
    Farmer ఘట్‌కేసర్, మేడ్చల్ మల్కాజ్‌గిరి, తెలంగాణ•
    5 hrs ago
  • ఇంటి దారి వివాదం ఇరువైపులా ఆవేదనే న్యాయం చేయాలని పోలీస్‌స్టేషన్‌ ఎదుట బాధిత కుటుంబం ధర్నా రెండేళ్లుగా కొనసాగుతున్న వివాదానికి పరిష్కారం చూపాలని డిమాండ్‌.. ఇరువర్గాల వాదనలు పరిశీలించిన అధికారులు మహాబుబాబాద్ -దంతాలపల్లి:- ఇంటి దారి విషయంలో తమకు న్యాయం చేయాలని కోరుతూ తూర్పు తండాకు చెందిన ఓ కుటుంబ సభ్యులు మంగళవారం పోలీస్‌స్టేషన్‌ ఎదుట ధర్నా నిర్వహించారు. పూర్వం నుంచి తమ కుటుంబం రాకపోకలకు ఉపయోగిస్తున్న బాటను కొందరు పూడ్చివేయడంతో ఇంటి నుంచి బయటకు రాలేని పరిస్థితి ఏర్పడిందని బాధితులు ఆవేదన వ్యక్తం చేశారు. ఈ సందర్భంగా బాధితులు మాట్లాడుతూ.. తమ తాతల కాలం నుంచి అదే దారిలో రాకపోకలు సాగిస్తున్నామని తెలిపారు. గత రెండేళ్లుగా బాట విషయంలో తమ దగ్గరి బంధువులతో వివాదం కొనసాగుతోందని, ఈ కారణంగా తమ కుటుంబం తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటోందని వాపోయారు. కొంతమంది వ్యక్తులు కుమ్మక్కై తమ కుటుంబాన్ని ఆవేదనకు గురిచేస్తున్నారని ఆరోపించారు.ఇంటి వద్ద భద్రత కోసం సీసీ కెమెరాలు ఏర్పాటు చేసుకున్నప్పటికీ వాటిని తొలగించారని, తరచూ గొడవలు జరుగుతున్నాయని బాధితులు పేర్కొన్నారు. ఈ విషయంపై గత రెండేళ్లుగా పోలీస్‌స్టేషన్‌లో ఫిర్యాదులు చేస్తున్నప్పటికీ సమస్య పరిష్కారం కాలేదని ఆరోపించారు. తమ దగ్గరి బంధువుల నుంచి ప్రాణహాని ఉందని, అధికారులు స్పందించి పూర్తిస్థాయిలో విచారణ జరిపి తమకు న్యాయం చేయాలని కోరారు.అలాగే న్యాయం కోసం  బాధితులు పోలీస్ స్టేషన్ కి వెలితే మీరు ఎవ్వరు  రాకూడదని బయటకి పోవాలి అని ఎస్ ఐ ధూచించడాని వాళ్ళు ఆరోపించారు. ఇరువర్గాల వాదనలు పరిశీలించాం: ఎస్‌ఐ బాట పూడ్చివేశారంటూ ఫిర్యాదు అందిన వెంటనే తహసీల్దార్‌, ఎంపీడీవోలతో కలిసి సంఘటనా స్థలాన్ని పరిశీలించినట్లు ఎస్‌ఐ తెలిపారు. బాటకు సంబంధించిన వ్యక్తిని దారి ఇవ్వాలని కోరగా, స్థలం ఇస్తే తన పిల్లలకు గృహాలు పడవని, అందువల్ల స్థలం ఇవ్వలేనని చెప్పినట్లు వివరించారు. అదేవిధంగా తండాలోని సుమారు 30 కుటుంబాలకు చెందిన ఉమ్మడి ఆస్తిపై కూడా వివాదం ఉందని, బాధితుడు ఆ ఉమ్మడి ఆస్తిని కబ్జా చేసినట్లు స్థానికులు చెబుతున్నారని ఎస్‌ఐ పేర్కొన్నారు. ఇంటి బాట, ఉమ్మడి ఆస్తికి సంబంధించిన అంశం కోర్టు పరిధిలో ఉన్నట్లు తెలిపారు. అయితే తాను ఎవరినీ వ్యక్తిగతంగా గానీ, కుటుంబపరంగా గానీ దూషించలేదని, కించపరచలేదని స్పష్టం చేశారు.
    4
    ఇంటి దారి వివాదం ఇరువైపులా ఆవేదనే
న్యాయం చేయాలని పోలీస్‌స్టేషన్‌ ఎదుట బాధిత కుటుంబం ధర్నా
రెండేళ్లుగా కొనసాగుతున్న వివాదానికి పరిష్కారం చూపాలని డిమాండ్‌.. ఇరువర్గాల వాదనలు పరిశీలించిన అధికారులు
మహాబుబాబాద్ -దంతాలపల్లి:- ఇంటి దారి విషయంలో తమకు న్యాయం చేయాలని కోరుతూ తూర్పు తండాకు చెందిన ఓ కుటుంబ సభ్యులు మంగళవారం పోలీస్‌స్టేషన్‌ ఎదుట ధర్నా నిర్వహించారు. పూర్వం నుంచి తమ కుటుంబం రాకపోకలకు ఉపయోగిస్తున్న బాటను కొందరు పూడ్చివేయడంతో ఇంటి నుంచి బయటకు రాలేని పరిస్థితి ఏర్పడిందని బాధితులు ఆవేదన వ్యక్తం చేశారు.
ఈ సందర్భంగా బాధితులు మాట్లాడుతూ.. తమ తాతల కాలం నుంచి అదే దారిలో రాకపోకలు సాగిస్తున్నామని తెలిపారు. గత రెండేళ్లుగా బాట విషయంలో తమ దగ్గరి బంధువులతో వివాదం కొనసాగుతోందని, ఈ కారణంగా తమ కుటుంబం తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటోందని వాపోయారు. కొంతమంది వ్యక్తులు కుమ్మక్కై తమ కుటుంబాన్ని ఆవేదనకు గురిచేస్తున్నారని ఆరోపించారు.ఇంటి వద్ద భద్రత కోసం సీసీ కెమెరాలు ఏర్పాటు చేసుకున్నప్పటికీ వాటిని తొలగించారని, తరచూ గొడవలు జరుగుతున్నాయని బాధితులు పేర్కొన్నారు. ఈ విషయంపై గత రెండేళ్లుగా పోలీస్‌స్టేషన్‌లో ఫిర్యాదులు చేస్తున్నప్పటికీ సమస్య పరిష్కారం కాలేదని ఆరోపించారు. తమ దగ్గరి బంధువుల నుంచి ప్రాణహాని ఉందని, అధికారులు స్పందించి పూర్తిస్థాయిలో విచారణ జరిపి తమకు న్యాయం చేయాలని కోరారు.అలాగే న్యాయం కోసం  బాధితులు పోలీస్ స్టేషన్ కి వెలితే మీరు ఎవ్వరు  రాకూడదని బయటకి పోవాలి అని ఎస్ ఐ ధూచించడాని వాళ్ళు ఆరోపించారు.
ఇరువర్గాల వాదనలు పరిశీలించాం: ఎస్‌ఐ
బాట పూడ్చివేశారంటూ ఫిర్యాదు అందిన వెంటనే తహసీల్దార్‌, ఎంపీడీవోలతో కలిసి సంఘటనా స్థలాన్ని పరిశీలించినట్లు ఎస్‌ఐ తెలిపారు. బాటకు సంబంధించిన వ్యక్తిని దారి ఇవ్వాలని కోరగా, స్థలం ఇస్తే తన పిల్లలకు గృహాలు పడవని, అందువల్ల స్థలం ఇవ్వలేనని చెప్పినట్లు వివరించారు.
అదేవిధంగా తండాలోని సుమారు 30 కుటుంబాలకు చెందిన ఉమ్మడి ఆస్తిపై కూడా వివాదం ఉందని, బాధితుడు ఆ ఉమ్మడి ఆస్తిని కబ్జా చేసినట్లు స్థానికులు చెబుతున్నారని ఎస్‌ఐ పేర్కొన్నారు. ఇంటి బాట, ఉమ్మడి ఆస్తికి సంబంధించిన అంశం కోర్టు పరిధిలో ఉన్నట్లు తెలిపారు. అయితే తాను ఎవరినీ వ్యక్తిగతంగా గానీ, కుటుంబపరంగా గానీ దూషించలేదని, కించపరచలేదని స్పష్టం చేశారు.
    user_ఎర్రబోయిన మురళి యాదవ్
    ఎర్రబోయిన మురళి యాదవ్
    Photographer దంతాలపల్లె, మహబూబాబాద్, తెలంగాణ•
    7 hrs ago
  • ఎగువ ప్రాంతాల నుండి వాగులోకి నీళ్లు రావడంతో పొంగిపొర్లుతున్న చెక్డ్యామ్ జనగామ జిల్లా దేవరుప్పుల మండలం రాంబోజిగూడెం గ్రామంలోని వాగులో ఉన్న చెక్‌డ్యాం పొంగి పొర్లుతుండడంతో గ్రామస్తులు సంతోషం వ్యక్తం చేస్తున్నారు. వర్షాలు పెద్దగా లేకపోయినా ఎగువ ప్రాంతాల నుంచి నీళ్లు రావడంతో చెక్‌డ్యాం నిండిపోయి మత్తడి పోస్తుండటం ఆనందంగా ఉందని గ్రామస్తులు తెలిపారు. చెక్‌డ్యాం నిండడం వల్ల భూగర్భ జలాలు పెరిగే అవకాశం ఉందని,రైతులకు ఎంతో ప్రయోజనం కలుగుతుందని,వాగులో నీటి ప్రవాహం కొనసాగడంతో గ్రామంలో ఆనంద వాతావరణం నెలకొందని గ్రామస్తులు తెలిపారు.
    1
    ఎగువ ప్రాంతాల నుండి వాగులోకి నీళ్లు రావడంతో పొంగిపొర్లుతున్న చెక్డ్యామ్ 
జనగామ జిల్లా దేవరుప్పుల మండలం రాంబోజిగూడెం గ్రామంలోని వాగులో ఉన్న చెక్‌డ్యాం పొంగి పొర్లుతుండడంతో గ్రామస్తులు సంతోషం వ్యక్తం చేస్తున్నారు. వర్షాలు పెద్దగా లేకపోయినా ఎగువ ప్రాంతాల నుంచి నీళ్లు రావడంతో చెక్‌డ్యాం నిండిపోయి మత్తడి పోస్తుండటం ఆనందంగా ఉందని గ్రామస్తులు తెలిపారు. చెక్‌డ్యాం నిండడం వల్ల భూగర్భ జలాలు పెరిగే అవకాశం ఉందని,రైతులకు ఎంతో ప్రయోజనం కలుగుతుందని,వాగులో నీటి ప్రవాహం కొనసాగడంతో గ్రామంలో ఆనంద వాతావరణం నెలకొందని గ్రామస్తులు తెలిపారు.
    user_Shareef pasha
    Shareef pasha
    Local News Reporter పాలకుర్తి, జనగాం, తెలంగాణ•
    16 hrs ago
View latest news on Shuru App
Download_Android
  • Terms & Conditions
  • Career
  • Privacy Policy
  • Blogs
Shuru, a product of Close App Private Limited.