సిఎంఆర్ఎఫ్ చెక్కులు పంపిణి చేసిన ఎమ్మెల్యే డాక్టర్ సంజయ్ కుమార్ జగిత్యాల, ఆగస్టు 1 జగిత్యాల పట్టణంలోని మోతే రోడ్డు కాంగ్రెస్ పార్టీ కార్యాలయంలో పట్టణానికి చెందిన 80 మంది లబ్ధిదారులకు సీఎం సహాయనిధి ద్వారా మంజూరైన 80 లక్షల 60 వేల రూపాయల విలువగల చెక్కులను ఎమ్మెల్యే డాక్టర్ సంజయ్ కుమార్ పంపిణి చేశారు. ఈ సందర్బంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ సీఎం సహాయ నిధితో బీద మధ్య తరగతి ప్రజలకు ఆర్థిక చేయూత కల్గుతుందని అన్నారు. రాష్ట్రంలో అత్యధిక సీఎం సహాయ నిధి చెక్కులు జగిత్యాలకు మంజూరుకు కృషి చేస్తానని తెలిపారు. రాష్ట్రంలోనే జిల్లాలో ఏకైక మెడికల్ కళాశాల జగిత్యాల నడి బొడ్డున ఉందని మెడికల్ కళాశాలకు అవసరమైన 600 పడకల కన్నా జగిత్యాల మెడికల్ కాలేజీ కి మాత్రం 800 పైగా పడకలు అందుబాటులో ఉన్నాయని తెలిపారు. రాష్ట్రంలో ఏకైక ట్రామా సెంటర్ జగిత్యాలకు మొదటిగా రానుందని పాత బస్టాండ్ లో ట్రామా వెల్ నెస్ సెంటర్ ఏర్పాటు చేస్తున్నాం అని తెలిపారు. ఈ కార్యక్రమంలో డీసీసీ అధ్యక్షుడు గాజంగి నందయ్య ఏఎంసి చైర్మెన్ గడ్డం నారాయణ రెడ్డి బండ శంకర్ గట్టు సతీష్ గిరి నాగభూషణం గోలి శ్రీనివాస్ కొత్త మోహన్ సమీండ్ల శ్రీనివాస్ అడువాల లక్ష్మణ్ జిల్లా ఎస్సీ సెల్ అధ్యక్షుడు దుమాల రాజ్ కుమార్ కౌన్సిలర్లు అరవ లక్ష్మీ దయాల చంద్రకళ శంకర్ శరత్ బీరం రాజేష్ తదితరులు పాల్గొన్నారు.
సిఎంఆర్ఎఫ్ చెక్కులు పంపిణి చేసిన ఎమ్మెల్యే డాక్టర్ సంజయ్ కుమార్ జగిత్యాల, ఆగస్టు 1 జగిత్యాల పట్టణంలోని మోతే రోడ్డు కాంగ్రెస్ పార్టీ కార్యాలయంలో పట్టణానికి చెందిన 80 మంది లబ్ధిదారులకు సీఎం సహాయనిధి ద్వారా మంజూరైన 80 లక్షల 60 వేల రూపాయల విలువగల చెక్కులను ఎమ్మెల్యే డాక్టర్ సంజయ్ కుమార్ పంపిణి చేశారు. ఈ సందర్బంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ సీఎం సహాయ నిధితో బీద మధ్య తరగతి ప్రజలకు ఆర్థిక చేయూత కల్గుతుందని అన్నారు. రాష్ట్రంలో అత్యధిక సీఎం సహాయ నిధి చెక్కులు జగిత్యాలకు మంజూరుకు కృషి చేస్తానని తెలిపారు. రాష్ట్రంలోనే జిల్లాలో ఏకైక మెడికల్ కళాశాల జగిత్యాల నడి బొడ్డున ఉందని మెడికల్ కళాశాలకు అవసరమైన
600 పడకల కన్నా జగిత్యాల మెడికల్ కాలేజీ కి మాత్రం 800 పైగా పడకలు అందుబాటులో ఉన్నాయని తెలిపారు. రాష్ట్రంలో ఏకైక ట్రామా సెంటర్ జగిత్యాలకు మొదటిగా రానుందని పాత బస్టాండ్ లో ట్రామా వెల్ నెస్ సెంటర్ ఏర్పాటు చేస్తున్నాం అని తెలిపారు. ఈ కార్యక్రమంలో డీసీసీ అధ్యక్షుడు గాజంగి నందయ్య ఏఎంసి చైర్మెన్ గడ్డం నారాయణ రెడ్డి బండ శంకర్ గట్టు సతీష్ గిరి నాగభూషణం గోలి శ్రీనివాస్ కొత్త మోహన్ సమీండ్ల శ్రీనివాస్ అడువాల లక్ష్మణ్ జిల్లా ఎస్సీ సెల్ అధ్యక్షుడు దుమాల రాజ్ కుమార్ కౌన్సిలర్లు అరవ లక్ష్మీ దయాల చంద్రకళ శంకర్ శరత్ బీరం రాజేష్ తదితరులు పాల్గొన్నారు.
- సౌదీ జైలులో చిక్కుకున్న తెలంగాణ యువకుడు... భర్తను స్వదేశానికి తీసుకురావాలని వికలాంగురాలైన భార్య కన్నీటి విజ్ఞప్తి... రూ.84 లక్షల బ్లడ్‌మనీ కోసం సహాయం కోరుతున్న కుటుంబం." "జగిత్యాల జిల్లా మెట్‌పల్లి మండలానికి చెందిన శ్రావణ్‌కుమార్... సౌదీలో రోడ్డు ప్రమాద కేసులో జైలుశిక్ష అనుభవిస్తున్నాడు. అతని విడుదలకు భారీ మొత్తం అవసరమైంది." **"జగిత్యాల జిల్లా మెట్‌పల్లి మండలం చింతలపేట గ్రామానికి చెందిన మమత, నిజామాబాద్ జిల్లా కుమ్మనపల్లి గ్రామానికి చెందిన శ్రావణ్‌కుమార్‌ను నాలుగేళ్ల క్రితం వివాహం చేసుకుంది. కుటుంబ పోషణ కోసం మూడేళ్ల క్రితం శ్రావణ్‌కుమార్ సౌదీ అరేబియాలోని రియాద్‌కు వెళ్లి అంబులెన్స్ డ్రైవర్‌గా పనిచేస్తుండగా రోడ్డు ప్రమాదానికి సంబంధించిన కేసులో చిక్కుకున్నాడు. కేసు విచారణ అనంతరం బాధిత కుటుంబానికి సుమారు 3.30 లక్షల సౌదీ రియాల్స్, అంటే భారత కరెన్సీలో దాదాపు 84 లక్షల రూపాయలు బ్లడ్‌మనీగా చెల్లించాలని అక్కడి కోర్టు తీర్పు ఇచ్చింది. వికలాంగురాలైన మమత తన చిన్న కుమారుడితో కలిసి భర్తను కాపాడుకునేందుకు అధికారులను, ప్రజాప్రతినిధులను, ప్రవాస సంఘాలను ఆశ్రయిస్తూ ఆర్థిక సహాయం కోసం వేడుకుంటోంది."1
- మురికి కాలువలు శుభ్రం చేయక దుర్వాసన.. దేవునిగూడలో వ్యాధుల భయం జన్నారం మండలం దేవునిగూడ గ్రామంలో గత కొద్ది రోజులుగా మురికి కాలువలను శుభ్రం చేయకపోవడంతో అవి గడ్డి, చెత్తాచెదారంతో పూర్తిగా నిండిపోయాయి. కాలువల్లో నీరు నిల్వ ఉండటంతో తీవ్ర దుర్వాసన వెదజల్లుతోంది. దోమలు విపరీతంగా పెరిగి డెంగ్యూ, మలేరియా వంటి వ్యాధులు వ్యాపించే ప్రమాదం ఉందని గ్రామస్థులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. సంబంధిత అధికారులు వెంటనే స్పందించి కాలువలను శుభ్రం చేసి పారిశుద్ధ్య చర్యలు చేపట్టాలని ప్రజలు కోరుతున్నారు.1
- లయన్స్ క్లబ్ ఆధ్వర్యంలో ఘనంగా తల్లిపాల వారోత్సవాలు...... ప్రపంచ తల్లిపాల వారోత్సవాలను పురస్కరించుకుని కరీంనగర్ లయన్స్ క్లబ్ ఆధ్వర్యంలో స్థానిక ప్రభుత్వ మాతా శిశు ఆసుపత్రిలో పాలిచ్చే తల్లులకు ఉచితంగా ప్రోటీన్ పౌడర్, విటమిన్ బిళ్లలు పంపిణీ చేశారు. ఈ కార్యక్రమానికి 35వ డివిజన్ కార్పొరేటర్ సదావేణి సుజాత శ్రీనివాస్ ముఖ్య అతిథిగా, డాక్టర్ విజయ రేకులపల్లి గౌరవ అతిథిగా హాజరయ్యారు. ఈ సందర్భంగా తల్లులకు 200 ప్రోటీన్ పౌడర్ బాక్సులు, రూ.50,000 విలువగల ఈఎస్‌వివై కంపెనీ విటమిన్ మాత్రలతో పాటు ప్లాస్టిక్ నివారణకు గుడ్డ సంచులను అందజేశారు. నవజాత శిశువుల సమగ్ర ఎదుగుదలకు, ఆరోగ్యానికి తల్లిపాలు ఎంతో శ్రేష్ఠమని, ప్రతి తల్లి పోషకాహారం తీసుకోవాలని వైద్యులు సూచించారు. సమాజ సేవలో లయన్స్ క్లబ్ కృషిని కార్పొరేటర్ అభినందించారు. ఈ కార్యక్రమంలో క్లబ్ అధ్యక్షుడు మ్యాడం శివకాంత్, కార్యదర్శి బట్టు వినోద్, కోశాధికారి మేతుకు కృష్ణ చైతన్య, ఉదారంగా సహకరించిన గజవాడ రాధాకృష్ణ, గజవాడ ప్రభు, లయన్స్ క్లబ్ సభ్యులు మరియు ఆసుపత్రి సిబ్బంది పాల్గొన్నారు.3
- నిజామాబాదు జిల్లా శ్రీరాంసాగర్ నీ తెలంగాణ మంత్రులు ఉత్తమ్ కుమార్ రెడ్డి, శ్రీధర్ బాబూ తో కలిసి పరిశీలించరు మంత్రి వివేక్ వెంకట స్వామి మంత్రి కామెంట్స్ ప్రాణహిత ఎల్లంపల్లి లింక్ లో ఉండేది కోదిరోజులుగా బిఆర్ఎస్ వాళ్లు మాట్లాడుతు బ్యారేజ్ లు లేకుండా పంపు లు నడిపియండి అంటూ ప్రచారం చేశారు బ్యారేజ్ లు లేకుండా పంపులు నడిపితే బ్యారేజ్ లు ఎందుకు కట్టినట్టు మరి గతంలో 60 టీఎంసీలు ఎల్లంపల్లి కి పంపు చేశారు తిరిగి వరద రావడం తో దాన్ని గోదావరి లోకి వదిలేసారు దానికి 30వేల కోట్ల కరంట్ బిల్లులు వచ్చాయి.. అలాంటి తప్పుడు నిర్ణయాలు తీసుకోకుండా కాంగ్రెస్ ప్రభుత్వం రైతుల కోసం ఆలోచిస్తుంది కేంద్రం డ్యామ్ సేఫ్టీ కమిటీ అందులో మళ్ళీ నీళ్లు నింపారాదు అని మరోసారి చెప్పింది కాబట్టి దానికి అనుగుణంగా నే ప్రభుత్వం ముందుకు వెళ్తుంది ఉత్తమ్ కుమార్ కామెంట్స్ శ్రీరాంసాగర్ పూర్తి నీటి నిల్వ 112టీఎంసీలు కానీ పూడిక తీత వాళ్ళ 80కి పడిపోయింది మళ్ళీ 112టీఎంసీలకు తీసుకెళ్లేలా ప్రభుత్వం చర్యలు తీసుకుంటుంది రాబోయే రోజుల్లో వరద ఎంత వస్తుంది ఎంత సాగు నీరు ఇవ్వగలం అనేది స్పష్టమైన ప్రకటన రెండు మూడు రోజుల్లో ఇస్తాం మెడిగడ్డ సుందిల్ల అన్నారం పంపు హౌస్ లు అవసరం లేకుండా నే కాంగ్రెస్ కట్టిన ఎల్లంపల్లి లో 20 టీఎంసీల నీరు వచ్చింది దీనిపై బిఆర్ఎస్ తప్పుడు ప్రచారం చేసింది రైతులు గమనించాలి నిన్న కూడా కేంద్ర డ్యామ్ సేఫ్టీ అధికారులు ఆ బ్యారేజ్ ల్లో నీరు నింపదు అని తెలిపారు ఆ బ్యారేజ్ లకి ప్రభుత్వం వ్యతిరేకం కాదు దాన్ని పూర్తిగా పరిశీలించి మర్మతులు చేస్తాం దీనిలో రాజకీయ దురుద్దెశం లేదు కానీ ఎల్లంపల్లి కట్టింది కాంగ్రెస్ స్వర్గీయ శ్రీపాద రావ్ గారి పేరుపై అప్పట్లో కట్టిన శ్రీరాంసాగర్, శ్రీశైలం, నిజం సాగర్ నాగార్జునా సాగర్ 60 ఏళ్ళు అయినా ఎలా ఉన్నాయి బిఆర్ఎస్ కట్టిన అన్నారం మెడిగడ్డ, సుందిల్లా ఎలా ఉంది ప్రజలు గమనించాలి జాతీయ అంతర్జాతీయ నిపుణులు సూచనల మేరకు ముందుకు వెళ్తాము4
- ఫీజు రీయింబర్స్‌మెంట్ బకాయిలను వెంటనే విడుదల చేయాలి బిసి సంఘం ఆధ్వర్యంలో కలెక్టరేట్ ముట్టడి జాతీయ బీసీ సంక్షేమ సంఘం పిలుపు మేరకు ఈరోజు కరీంనగర్ జిల్లా కలెక్టరేట్ వద్ద బీసీ యువజన సంఘం ఆధ్వర్యంలో ఫీజు రీయింబర్స్‌మెంట్ బకాయిల విడుదల కోసం భారీ నిరసన కార్యక్రమం నిర్వహించి కలెక్టరేట్‌ను ముట్టడించాం. ఈ సందర్భంగా బీసీ సంక్షేమ సంఘం ఉమ్మడి జిల్లా అధ్యక్షులు అది మల్లేశం పటేల్, బీసీ యువజన సంఘం జిల్లా అధ్యక్షులు నర్సింగోజు శ్రీనివాస్ మాట్లాడుతూ, రాష్ట్ర ప్రభుత్వం ఫీజు రీయింబర్స్‌మెంట్ పథకాన్ని యథాతథంగా అమలు చేయాలని, విద్యార్థులకు సంబంధించిన సుమారు రూ.8,000 కోట్ల ఫీజు బకాయిలను వెంటనే విడుదల చేయాలని డిమాండ్ చేశారు. ప్రభుత్వం ఫీజు బకాయిలు విడుదల చేయకపోవడంతో ఇంజనీరింగ్, ఫార్మసీ, డిగ్రీ, పీజీ తదితర కోర్సులు పూర్తిచేసిన వేలాది మంది విద్యార్థులు తమ ఒరిజినల్ సర్టిఫికెట్లు పొందలేక తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారని తెలిపారు. ఉద్యోగ అవకాశాలు వచ్చినా, విదేశీ ఉన్నత విద్యకు ఎంపికైనా, సర్టిఫికెట్లు లేక భవిష్యత్తు ప్రశ్నార్థకంగా మారుతోందని ఆవేదన వ్యక్తం చేశారు. ప్రభుత్వం తరచూ జీవోలు జారీ చేస్తూ విద్యార్థుల్లో గందరగోళం సృష్టించడం సరైన విధానం కాదని, గత 18 సంవత్సరాలుగా అమలవుతున్న ఫీజు రీయింబర్స్‌మెంట్ విధానాన్ని ఎలాంటి మార్పులు లేకుండా కొనసాగించాలని డిమాండ్ చేశారు. అలాగే బీసీ, ఈబీసీ, ఎస్సీ, ఎస్టీ, మైనారిటీ విద్యార్థులపై అదనపు ఆర్థిక భారం మోపే నిర్ణయాలను వెంటనే ఉపసంహరించుకోవాలని కోరారు. విద్యార్థుల భవిష్యత్తుతో ప్రభుత్వం చెలగాటమాడితే రాష్ట్రవ్యాప్తంగా ఉద్యమాలను మరింత ఉధృతం చేస్తామని హెచ్చరించారు. విద్యార్థుల న్యాయమైన సమస్యలను వెంటనే పరిష్కరించి, ఫీజు బకాయిలను విడుదల చేయాలని ప్రభుత్వాన్ని కోరారు. ఈ కార్యక్రమంలో బీసీ సంక్షేమ సంఘం, బీసీ యువజన సంఘం నాయకులు, విద్యార్థులు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు.1
- అమాయకుడిపై దారుణ కుట్ర: గంజాయి కేసులో కానిస్టేబుల్ అరెస్ట్ సివిల్ తగాదాలో ప్రత్యర్థిని జైలుకు పంపేందుకు పగతో రగిలిపోయిన ఓ పోలీస్ కానిస్టేబుల్ తీరు కరీంనగర్‌లో తీవ్ర కలకలం రేపింది. పోలీసుల కథనం ప్రకారం..ఈగల్ టీమ్‌లో పనిచేస్తున్న కానిస్టేబుల్ మేడబోయిన నాగరాజు, తన మిత్రుడైన తోడేటి శ్రీనివాస్‌కు చెందిన భూ వివాదంలో జోక్యం చేసుకున్నాడు. ఎలాగైనా ప్రత్యర్థి శ్రీనివాస్‌రెడ్డిని క్రిమినల్ కేసులో ఇరికించాలనే ఉద్దేశంతో వరంగల్ నుంచి గంజాయి తెప్పించి అతడి ఫెర్టిలైజర్ షాపులో పెట్టించాడు. అనంతరం పోలీసులకు సమాచారం అందించి శ్రీనివాస్‌రెడ్డిపై కేసు నమోదయ్యేలా చేశాడు. అయితే తెప్పించిన గంజాయిలో మిగిలిన 370 గ్రాములను నాగరాజు సీతారాంపూర్‌లోని తన ఇంట్లో దాచుకున్నాడు. పక్కా సమాచారంతో కొత్తపల్లి పోలీసులు దాడి చేసి,గంజాయితో పాటు 4 ఫోన్లను స్వాధీనం చేసుకుని కానిస్టేబుల్ నాగరాజును అరెస్ట్ చేసినట్లు ఏసిపి విజయ్ కుమార్ తెలిపారు.2
- సిరిసిల్ల పట్టణంలోని 35వ వార్డులో పురపాలక సంఘం ఆధ్వర్యంలో నిర్వహిస్తున్న అభివృద్ధి పనులకు భూమి పూజ కార్యక్రమలు నిర్వహించి పనులు ప్రారంభించిన మున్సిపల్ చైర్ పర్సన్ జిందం కళ చక్రపాణి. స్థానిక 35వ వార్డులో పురపాలక సంఘం ఆధ్వర్యంలో నిర్వహిస్తున్న అభివృద్ధి పనులకు భూమి పూజ కార్యక్రమలు నిర్వహించి పనులు ప్రారంభించిన మున్సిపల్ చైర్ పర్సన్ జిందం కళ చక్రపాణి. ఈ సందర్భంగా మున్సిపల్ చైర్ పర్సన్ జిందం కళ చక్రపాణి మాట్లాడుతూ 35 వ వార్డులో ప్రజలకు మౌలిక వసతుల కల్పనలో భాగంగా శిథిలావస్థకు చేరుకున్న మురికినీటి కాలువ సమస్యను మున్సిపల్ నుండి 3,00,000 జనరల్ ఫండ్ నిధులతో మురికి కాలువ నిర్మాణం, కల్వర్టు నిర్మాణం కోసం మరియు స్థానిక సుందరయ్య నగర్ అర్బన్ హెల్త్ సెంటర్ లో వివిధ రకాల అభివృద్ధి పనుల కోసం దాదాపు 2 లక్షల రూపాయల నిధులతో పనులు ప్రారంభించుకోవటం కోసం భూమిపూజ కార్యక్రమాలు నిర్వహించుకోవడం జరిగిందని అన్నారు.రాబోయే రోజుల్లో ప్రణాళిక బద్ధంగా అన్ని వార్డులలో ప్రజల అవసరాలకు అనుగుణంగా అభివృద్ధి పనులు చేపడుతూ సిరిసిల్ల సమగ్ర అభివృద్ధికి మున్సిపల్ పాలకవర్గం తరపున చర్యలు చేపడతామని అన్నారు.ఈ కార్యక్రమంలో మున్సిపల్ కమిషనర్ ఖాదీర్ పాషా ,కౌన్సిలర్ సభ్యులు బత్తుల రమేష్ , ఎలుక వెంకటేశం, మున్సిపల్ మాజీ వైస్ చైర్మన్ మంచె శ్రీనివాస్, మాజీ కౌన్సిలర్ సభ్యులు గెంట్యాల శ్రీనివాస్, రిక్కమల్లె సంపత్ , బత్తుల వనజ , మున్సిపాలిటీ డీఈ వాణి, వైద్యాధికారులు, మున్సిపల్ సిబ్బంది , హాస్పిటల్స్ సిబ్బంది మరియు ప్రజలు పాల్గొన్నారు.1
- రాజన్న సిరిసిల్ల జిల్లాలో కురుస్తున్న వర్షాలు ప్రాజెక్టులకు కొత్త జీవం పోస్తున్నాయి. కొనరావుపేట మండలం నిమ్మపల్లి వద్ద ఉన్న మూలవాగు ప్రాజెక్ట్ జలకళను సంతరించుకుంది. రాజన్న సిరిసిల్ల జిల్లాలో కురుస్తున్న వర్షాలు ప్రాజెక్టులకు కొత్త జీవం పోస్తున్నాయి. కొనరావుపేట మండలం నిమ్మపల్లి వద్ద ఉన్న మూలవాగు ప్రాజెక్ట్ జలకళను సంతరించుకుంది. నిజామాబాద్ జిల్లాలో కురుస్తున్న భారీ వర్షాల ప్రభావంతో ప్రాజెక్ట్ పూర్తిస్థాయిలో నిండగా, మత్తడి దూకుతూ నీరు ఉధృతంగా ప్రవహిస్తోంది. ఈ నీరు వేములవాడ మూలవాగు మీదుగా మిడ్ మానేరు ప్రాజెక్ట్‌లోకి చేరుతోంది. ఎడతెరిపి లేకుండా కురుస్తున్న వర్షాలతో రాజన్న సిరిసిల్ల జిల్లాలోని కొనరావుపేట మండలం నిమ్మపల్లి మూలవాగు ప్రాజెక్ట్ నిండు కుండలా మారింది. నిజామాబాద్ జిల్లాలో కురుస్తున్న భారీ వర్షాల కారణంగా ప్రాజెక్ట్‌లోకి భారీగా వరద నీరు చేరుతోంది. ప్రస్తుతం ప్రాజెక్ట్ మత్తడి దూకుతూ ఉధృతంగా ప్రవహిస్తుండడంతో ఆ దృశ్యాలను చూసేందుకు పరిసర ప్రాంతాల ప్రజలు పెద్ద సంఖ్యలో తరలివస్తున్నారు. ప్రాజెక్ట్ నిండడంతో రైతుల్లో ఆనందం నెలకొంది.ఈ ప్రాజెక్ట్ ద్వారా సుమారు 3 వేల ఎకరాల ఆయకట్టుకు సాగునీరు అందనుంది. దీంతో ఖరీఫ్ సాగుకు అవసరమైన నీటి సమస్య తీరనుందని రైతులు ఆశాభావం వ్యక్తం చేస్తున్నారు. నిమ్మపల్లి మూలవాగు ప్రాజెక్ట్ నుంచి విడుదలవుతున్న వరద నీరు వేములవాడ మూలవాగు గుండా ప్రవహిస్తూ చివరకు మిడ్ మానేరు ప్రాజెక్ట్‌లోకి చేరుతోంది. ఎగువ ప్రాంతాల నుంచి వరద ప్రవాహం కొనసాగుతున్న నేపథ్యంలో అధికారులు పరిస్థితిని ఎప్పటికప్పుడు పర్యవేక్షిస్తున్నారు. ప్రాజెక్ట్ వద్దకు వచ్చే ప్రజలు అప్రమత్తంగా ఉండాలని, మత్తడి ప్రాంతాలకు దగ్గరగా వెళ్లవద్దని అధికారులు సూచిస్తున్నారు. భారీ వరద ప్రవాహం కొనసాగుతున్నందున ఎలాంటి ప్రమాదాలు జరగకుండా జాగ్రత్తలు తీసుకోవాలని హెచ్చరిస్తున్నారు.4