Shuru
Apke Nagar Ki App…
wanted job vacancies
Om Namaha Shivyaa
wanted job vacancies
More news from Telangana and nearby areas
- కాగజ్నగర్ పట్టణంలో మున్సిపల్ కార్మికుల సమ్మె జరుగుతుంది వారికి వేతనాలు రావడం లేదు అని వారు సమ్మె చేయడం జరుగుతుంది. వారు చేసే సమ్మె వల్ల టౌన్ లోని దుర్గంధ వాసనతో కూడిన చెత్తాచెదారం నాలిళ్లలో చెత్త పేరుకపోవడం జరిగింది ఇట్టి విషయాన్ని గౌరవనీయులు ఉన్నతాధికారులకు తెలియజేసిన బిఆర్ఎస్ పార్టీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి డాక్టర్ ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ సార్ గారు1
- కేశవ నాథ ఆలయంలో ఉత్తర ద్వారా దర్శనం అసిఫాబాద్: జిల్లా కేంద్రంలోని కేశవ నాతఆలయంలో భక్తులు వైకుంఠ ఏకాదశి సందర్భంగా వైకుంఠ ద్వారం నుండి దర్శనం చేసుకొని తమ మొక్కులు చెల్లించుకున్నారు. భక్తులతో ఆలయం కిటకిటలాడింది1
- శాంతినగర్ డబుల్ బెడ్రూమ్ ఇళ్ల దుస్థితి పై బీజేపీ తీవ్ర ఆందోళన; రాజన్న సిరిసిల్ల జిల్లా రాజన్న సిరిసిల్ల జిల్లా కేంద్రంలోని శాంతి నగర్ బైపాస్ పరిధిలోని గల డబుల్ బెడ్ రూమ్స్ కోట్ల రూపాయల ప్రజా ధనం తో నిర్మించిన డబుల్ బెడ్రూమ్ ఇళ్లు ప్రస్తుతం శిథిలావస్థ కు చేరుకుని, పిచ్చిమొక్కల తో నిండిపోయి ఉండటం అత్యంత దుర దృష్టకరమని బిజెపి సిరిసిల్ల పట్టణ అధ్యక్షులు దుమాల శ్రీకాంత్, సిరిసిల్ల పట్టణ శాఖ తీవ్ర ఆవేదన వ్యక్తం చేశారు.ఈ ఇళ్లను స్వయం గా పరిశీలించిన అనంతరం ఆయన మాట్లాడుతూ, ప్రజల కోసం నిర్మించిన ఇళ్లు ఇలా నిర్లక్ష్యానికి గురవడం ప్రజాధనానికి ఘోరమైన అవమానమని అన్నారు. ఖాళీగా ఉన్న ఇళ్ల లో ఎలక్ట్రికల్ వైర్లు, మోటార్లు, ఐరన్ సామాగ్రి దొంగలపాలవుతుండగా, ఈ ప్రాంతం అసాంఘిక కార్యకలాపాలకు అడ్డాగా మారుతోందని ఆందోళన వ్యక్తం చేశారు. పట్టణ శివారులో అత్యంత ఖరీదైన స్థలంలో ఇట్టి డబుల్ బెడ్ రూమ్ ఇళ్ల నిర్మాణం జరిగినవి. అంత కు ముందు ఇదే స్థలంలో గౌరవ ఎస్సీ కులస్తుల కు కాలనీ నిర్మించి అది కూడా శిథిలావస్థ కు చేరగా వాటి స్థానంలో ఈ డబల్ బెడ్ రూమ్ ఇడ్లు నిర్మించారు.ఇప్పుడు ఇవి కూడా వాటిలాగే సితిలావస్థకు చేరే పరిస్థితి. గతం లో ఈ ఇళ్లను మొదట గా గౌరవ ఎస్సీ కులస్తులకు కేటాయించిన తర్వాత మిగతా అర్హులకు ఇస్తామని ప్రభుత్వం ప్రకటించినప్పటికీ, ఇప్పటి వరకు ఆ ప్రక్రియ పూర్తి కాకపోవడం వల్లే ఈ సమస్య ఉత్పన్నమైందని ఆయన పేర్కొన్నారు. వెంటనే ఆ సమస్యను పరిష్కరించి అర్హులైన లబ్ధిదారులకు ఇళ్లను అప్పగించాలని డిమాండ్ చేశారు.అప్పటి మంత్రి, ప్రస్తుత స్థానిక ఎమ్మెల్యే కేటీఆర్, అప్పుడు డబల్ బెడ్ రూమ్లు పంపిణీ చేయగా ఇంకా 900 మంది మిగిలిన వారు ఉన్నారు. అందు లో నుండి కొంతమంది కి పట్టాలు ఇచ్చారు. కనీసం వారికి స్థలం కూడా చూపించలేదని తీవ్ర విమర్శలు చేశారు. ప్రజా సమస్యల ను విస్మరించి కేవలం పార్టీ కార్యక్రమాలకే పరిమితమవడం బాధాకరమని మండి పడ్డారు.కిరాయిలు చెల్లించ లేక తీవ్ర ఇబ్బందులు పడు తున్న నిరుపేదలకు ఈ డబుల్ బెడ్రూమ్ ఇళ్ల ను వెంటనే పంపిణీ చేయాలని, లేని పక్షంలో ఇవి పూర్తి గా కూలిపోయే ప్రమాదం ఉందని హెచ్చరించారు.ఈ విషయంలో జిల్లా కలెక్టర్, స్థానిక ప్రజా ప్రతినిధులు తక్షణమే చొరవ తీసుకొని సమస్య ను పరిష్కరించాలని,అర్హులైన నిరుపేదలకు ఇళ్లను వెంటనే కేటాయిం చాలని బీజేపీ సిరిసిల్ల పట్టణ శాఖ తరపున డిమాండ్ చేస్తున్నామని దుమాల శ్రీకాంత్ స్పష్టం చేశారు.ఈ కార్యక్రమంలో భారతీయ జనతా పార్టీ ప్రధాన కార్యదర్శి కొండ నరేష్, మెరుగు శ్రీనివాస్, మోర రవి, నరసయ్య, దూడం సురేష్, గాని శ్రీనివాస్, కంబోజి శ్రీధర్, అంకారపు రాజు, వడ్నాల శేఖర్ బాబు, అభినవ్, కనుకయ్య, దేవరాజు, కొంపెల్లి విజయ్ కుమార్, స్థానిక జిల్లా నాయకులు, స్థానిక నాయకులు, స్థానికులు, పాల్గొన్నారు1
- హిందువులను కాపాడాలని ర్యాలీ బంగ్లాదేశ్లో మైనార్టీలుగా ఉన్న హిందువులను కాపాడాలని జన్నారం మండల కేంద్రంలో బిజెపి, పలు హిందూ సంఘాల నాయకులు భారీ ర్యాలీ నిర్వహించారు. మంగళవారం వారు జన్నారంలోని తెలంగాణ తల్లి విగ్రహం నుండి ప్రధాన రహదారి మీదుగా భారీ ర్యాలీ నిర్వహించారు. బంగ్లాదేశ్లో మైనార్టీలుగా ఉన్న హిందువులను చంపడం అమానుషం అన్నారు. అక్కడి ప్రభుత్వం హిందువులను రక్షించాలని వారు డిమాండ్ చేశారు. ఈ కార్యక్రమంలో నాయకులు పాల్గొన్నారు.1
- ఆడ పిల్లలకు మన హిందూ సనాతన ధర్మం మన సాంప్రదాయం మన సంస్కృతి గురించి నేర్పించండి1
- వైకుంఠ ఏకాదశి1
- తెలంగాణ రాష్ట్ర రోడ్లు భవనాలు శాఖ మంత్రి కోమటిరెడ్డి వెంకట్ రెడ్డి గారు, కేంద్ర రోడ్డు రవాణా మరియు రహదారుల శాఖ మంత్రి నితిన్ గడ్కరీకి రాశారు. *లేఖలోని ప్రధాన అంశాలు:* తెలుగు రాష్ట్రాలైన తెలంగాణ మరియు ఆంధ్రప్రదేశ్‌లలో సంక్రాంతి అతిపెద్ద పండుగ అని, ఈ సందర్భంగా హైదరాబాద్ నుండి విజయవాడ మార్గంలో జనవరి 13 వరకు వాహనాల రాక విపరీతంగా ఉంటుందని పేర్కొన్నారు. పంతంగి, కొర్లపహాడ్ మరియు చిల్లకల్లు టోల్ గేట్ల వద్ద ఉన్న డేటా ప్రకారం.. సాధారణ రోజుల కంటే ఈ సమయంలో 200% అదనపు ట్రాఫిక్ ఉంటుందని వివరించారు. దీనివల్ల టోల్ ప్లాజాల వద్ద ప్రయాణికులు తీవ్ర జాప్యానికి గురవుతున్నారని తెలిపారు. జంక్షన్లు, జనావాసాలు మరియు ప్రస్తుతం రహదారిపై జరుగుతున్న పనుల వల్ల కూడా ట్రాఫిక్ జామ్‌లు ఏర్పడుతున్నాయని, రాష్ట్ర ప్రభుత్వం NHAI మరియు పోలీసులతో కలిసి ట్రాఫిక్‌ను క్రమబద్ధీకరిస్తోందని పేర్కొన్నారు. ప్రయాణం సాఫీగా సాగడం కోసం ఈ క్రింది సమయాల్లో టోల్ వసూలు చేయకుండా (టోల్ ఫ్రీ) టోల్ మినహాయింపు ఇచ్చి వాహనాలను అనుమతించాలని కోరారు. హైదరాబాద్ నుండి విజయవాడకు: జనవరి 9 నుండి 14 వరకు. విజయవాడ నుండి హైదరాబాద్‌కు: జనవరి 16 నుండి 18 వరకు. ప్రజల సౌకర్యార్థం జనవరి 9 నుండి 18 వరకు ఈ మార్గంలో ఉచిత ప్రయాణాన్ని (టోల్ ఫ్రీ) అనుమతించేలా చర్యలు తీసుకోవాలని మంత్రి కోమటిరెడ్డి వెంకట్ రెడ్డి గారు కేంద్ర మంత్రిని అభ్యర్థించారు.1
- *_కొత్త సరసాల గ్రామ పంచాయతీలో BRS జనరల్ సెక్రటరీ డాక్టర్ ఆర్.ఎస్. ప్రవీణ్ కుమార్ గారి భారీ సమావేశం జరిగింది. బీజేపీ నుండి భారీ సంఖ్యలో గ్రామస్తులు BRS పార్టీలో చేరిక_* •బీజేపీ నుంచి BRSలోకి మారిన తెలంగాణ ఉద్యమకారులు దహగం రాజు గారు మరియు ఇతర గ్రామస్తులు ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు. •దహగం రాజు గారి అధ్యక్షతన జరిగిన ఈ సమావేశంలో డాక్టర్ ఆర్.ఎస్. ప్రవీణ్ కుమార్ ముఖ్య అతిథిగా పాల్గొన్నారు. డాక్టర్ ఆర్.ఎస్. ప్రవీణ్ కుమార్ మాట్లాడుతూ, కవ్వింపు చర్యలకు పాల్పడితే ఊరుకోబోమని, గతంలోకి వెళ్తే మీకే నష్టమని హెచ్చరించారు. తాను ప్రేమతో, మానవత్వంతో సిర్పూర్‌ను మార్చాలని వచ్చానని, కొబ్బరికాయలు కొట్టి మోసం చేయడానికి రాలేదని స్పష్టం చేశారు. •రైతుల బాధలు తీర్చలేని ఎమ్మెల్యే ఎందుకు? •పత్తి పంట అమ్ముకోవడానికి వెళ్తే అధికారులు కొనకపోవడం, స్థానిక బీజేపీ ఎమ్మెల్యే పట్టించుకోకపోవడం వంటి సమస్యలను లేవనెత్తారు. •దమ్ముంటే పిల్లలకు ఇంగ్లీష్ మీడియం విద్య అందించండి, రైతుల బాధలు తీర్చండి, ఫారెస్ట్ అధికారుల ఆగడాలపై కోట్లాడండి అని సవాల్ విసిరారు. •40 ఏళ్లలో సిర్పూర్ నియోజకవర్గానికి ఎన్ని నిధులు తెచ్చారో చర్చకు సిద్ధమా? 3 లక్షల కోట్ల బడ్జెట్‌లో 30 కోట్లైనా తెచ్చారా? అని ప్రశ్నించారు. •కిడ్నీ బాధతో చనిపోయే వారిని ఆదుకోండి, రోడ్లు బాగుచేసి ప్రమాదాలు ఆపండి అని డిమాండ్ చేశారు. •వ్యతిరేక అభ్యర్థులపై దాడులు చేస్తే ఖబర్దార్ అని హెచ్చరించారు. •అడా ప్రాజెక్ట్, జగన్నాథపూర్ ప్రాజెక్ట్‌లను ఎందుకు ఆపారు? ఇసుక దందాల కోసమేనా? అని ప్రశ్నించారు. ప్రవీణ్ కుమార్ వచ్చాక సిర్పూర్‌లో భయం పోయిందని, అక్రమ కేసులు బనాయించి బెదిరించే రోజులు పోయాయని ఆయన తెలిపారు. ఈ కార్యక్రమంలో BRS ముఖ్య నాయకులు లెండుగురే శ్యామ్ రావు, కొంగ సత్యనారాయణ, ఏం ఏ సలీం, తన్నీరు పోచం, కాగజ్‌నగర్ మండల కన్వీనర్ పార్వతీ అంజన్న, మాజీ కౌన్సిలర్ నక్క మనోహర్, దహెగాం మండల కన్వీనర్ షాకీర్, తైదాల రవి, దేవాజీ, బొమ్మెల రాజన్న, మహేష్ తదితరులు పాల్గొన్నారు. సరసాల గ్రామ నాయకులు బొడ్డు రాకేష్, దహగం శ్రీవల్లి-రాజు, పూజారి సత్యాన్న, పూజారి వెంకన్న, రుకుం సతీష్, సకినాల సతీష్, నాయిని సంతోష్, వాసాల హర్ష వర్ధన్ మధుకర్ తదితరులు కూడా ఈ సమావేశంలో పాల్గొని BRS బలోపేతానికి తమ వంతు సహకారం అందించారు.1
- భారత్ మాత కి జై 🇮🇳1