Shuru
Apke Nagar Ki App…
KCR బర్త్ డే..పూరీ తీరంలో ఆకట్టుకున్న సైకత శిల్పం (వీడియో) TG: బీఆర్ఎస్ అధినేత, మాజీ సీఎం కేసీఆర్ 72వ పుట్టిన రోజు సందర్భంగా ఒడిశాలోని పూరీ సముద్రతీరంలో ఆయన సైకత శిల్పం ఆకట్టుకుంటోంది. అభిమాని రూపొందించిన ఈ శిల్పం గులాబీ రంగులో మెరిసిపోతూ పర్యాటకులను విశేషంగా ఆకర్షిస్తోంది. తెలంగాణ అభివృద్ధిలో ఆయన పాత్రను స్మరించుకుంటూ రూపొందించిన ఈ కళాఖండం ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్గా మారింది.
Chetty:Ramesh
KCR బర్త్ డే..పూరీ తీరంలో ఆకట్టుకున్న సైకత శిల్పం (వీడియో) TG: బీఆర్ఎస్ అధినేత, మాజీ సీఎం కేసీఆర్ 72వ పుట్టిన రోజు సందర్భంగా ఒడిశాలోని పూరీ సముద్రతీరంలో ఆయన సైకత శిల్పం ఆకట్టుకుంటోంది. అభిమాని రూపొందించిన ఈ శిల్పం గులాబీ రంగులో మెరిసిపోతూ పర్యాటకులను విశేషంగా ఆకర్షిస్తోంది. తెలంగాణ అభివృద్ధిలో ఆయన పాత్రను స్మరించుకుంటూ రూపొందించిన ఈ కళాఖండం ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్గా మారింది.
More news from తెలంగాణ and nearby areas
- హన్మకొండ నక్కలగుట్ట లో నూతనంగా ప్రారంభమైన జోయాలుక్కాస్ గోల్డ్ షోరూం రెండవ బ్రాంచ్ ప్రారంభోత్సవ కార్యక్రమంలో ముఖ్య అతిథులుగా తెలంగాణ రాష్ట్ర అటవీ, పర్యావరణ, దేవాదాయ శాఖల మంత్రి కొండా సురేఖ , వరంగల్ పశ్చిమ ఎమ్మెల్యే నాయిని రాజేందర్ రెడ్డి. వర్ధన్నపేట నియోజకవర్గ ఎమ్మెల్యే, కేఆర్ నాగరాజు విచ్చేసి.తొలుత రిబ్బన్ కట్ చేసి జ్యోతి ప్రజ్వలన చేసి షో రూమ్ ను ప్రారంభించారు.ఈ సందర్భంగా షోరూం యజమాన్యం మంత్రి కొండా సురేఖ , వరంగల్ పశ్చిమ ఎమ్మెల్యే నాయిని రాజేందర్ రెడ్డి. వర్ధన్నపేట నియోజకవర్గ ఎమ్మెల్యే, కేఆర్ నాగరాజును శాలువాతో సత్కరించి సన్మానించారు.అనంతరం షోరూం లో నిర్వహించిన ఫ్యాషన్ షో ను తిలకించిన. మంత్రి ఎమ్మెల్యే లు జోయలుక్కస్ గోల్డ్ షోరూం నిర్వాహకులకు మరియు యాజమాన్యానికి శుభాకాంక్షలు తెలియజేశారు.అనంతరం మంత్రి కొండా సురేఖ మీడియాతో మాట్లాడారు.ఈ కార్యక్రమంలో జోయలుక్కస్ యజమాన్యం సిబ్బంది పలువురు ప్రజాప్రతినిధులు, ప్రముఖులు, వ్యాపార వేత్తలు. అభిమానులు తదితరులు పాల్గొన్నారు.1
- వరంగల్ జిల్లా: ఆజంజహి మిల్లు కార్మికులకు ఇంటి స్థలాలు కేటాయించాలని డిమాండ్ చేస్తూ వరంగల్ వెంకట్రామ కూడలి వద్ద కార్మికులు మరియు నాయకులు రోడ్డుపై బైఠాయించి నిరసన వ్యక్తం చేశారు. 2021 అక్టోబర్ 26న భారతదేశ అత్యున్నత న్యాయస్థానం ఇచ్చిన తీర్పు ప్రకారం 134 మందికి ఇంటి స్థలాలు కేటాయించినట్లే మిగిలిన 318 మంది కార్మికులకు కూడా స్థలాలు ఇవ్వాలని వారు కోరారు. నిరసన కార్యక్రమంలో పాల్గొన్న నాయకులు మాట్లాడుతూ సుప్రీంకోర్టు తీర్పును అమలు చేయడంలో ప్రభుత్వం విఫలమవుతోందని ఆరోపించారు. ఈ సందర్భంగా సింగిరెడ్డి యశోద మాట్లాడుతూ, అత్యున్నత న్యాయస్థానం ఇచ్చిన స్పష్టమైన ఆదేశాలను పక్కన పెట్టి ప్రభుత్వం వ్యవహరిస్తోందని మండిపడ్డారు. వరంగల్ ఆజంజహి మిల్లు కార్మికుల సమస్యలను ప్రభుత్వం వెంటనే పరిష్కరించాలని, మిగిలి ఉన్న 318 మంది కార్మికులకు తక్షణమే ఇంటి స్థలాలు కేటాయించాలని డిమాండ్ చేశారు. లేకపోతే కార్మికుల హక్కుల కోసం ఉద్యమాన్ని మరింత ఉద్ధృతం చేస్తామని రాష్ట్ర ప్రభుత్వానికి హెచ్చరించారు. ఈ నిరసనతో కొంతసేపు వెంకట్రామ కూడలి ప్రాంతంలో ట్రాఫిక్‌కు అంతరాయం ఏర్పడింది. అనంతరం పోలీసులు పరిస్థితిని అదుపులోకి తీసుకుని రాకపోకలను పునరుద్ధరించారు.4
- వరంగల్ జిల్లా:పర్వతగిరి మండలం చంద్రగిరితండాలో శుక్రవారం విషాదకర ఘటన చోటుచేసుకుంది. తీవ్ర జ్వరంతో బాధపడుతున్న ఆయా బానోత్ అనురాధ సెలవు కోరగా, అధికారులు నిరాకరించారు. దీంతో చేసేది లేక ఆమె అంగన్వాడీ కేంద్రంలోనే విధులకు హాజరవుతూ సెలైన్ పెట్టించుకున్నారు. జబ్బుపడినా కనికరించకుండా విధులకు ఆదేశించడంపై స్థానికులు ఆగ్రహం.ఈ దృశ్యాలు సామాజిక మద్యంలో వైరల్ గా మారాయి.1
- కరీంనగర్ జిల్లా గంగాధర మండలం నారాయణపూర్ గ్రామస్తులు రోడ్డెక్కారు. ముంపు గ్రామంగా ప్రకటించి పునరావాసం కల్పించాలని ఆందోళనకు దిగారు. గత అసెంబ్లీ ఎన్నికల ముందు కాంగ్రెస్ అధికారంలోకి వస్తే వెంటనే నారాయణపూర్ గ్రామాన్ని ముంపు గ్రామంగా ప్రకటించి పునరావాసం కల్పిస్తామని చెప్పిన ఎమ్మెల్యే మేడిపల్లి సత్యం, ప్రస్తుతం తమ గోడు పట్టించుకోవడంలేదని ఆందోళన వ్యక్తం చేశారు. గ్రామ పంచాయతీ వద్ద ధర్నా నిర్వహించి ప్రభుత్వానికి వ్యతిరేకంగా నినాదాలు చేశారు. గతంలో 7 ట్రాక్టర్లలో కలెక్టర్ కార్యాలయానికి వెళ్లి వినతిపత్రం సమర్పించామని తెలిపారు. ఎన్నికల ముందు నెలకు ఒకసారి వచ్చిన ఎమ్మెల్యే ప్రస్తుతం పట్టించుకోవడం లేదని ఆందోళన వ్యక్తం చేశారు. ముంపు గ్రామంగా ప్రకటిస్తామని హనుమాన్ గుడి సాక్షిగా హామీ ఇచ్చారని రెండున్నర ఏళ్ళు కావస్తున్న ఇప్పటి వరకు పట్టించుకోవడం లేదని విమర్శించారు. మళ్ళీ వర్షాకాలం ఆరంభం అయితే ప్రతి ఇంటిలోకి నీరు చేరుతోందని, తక్షణమే ముంపు గ్రామంగా ప్రకటించి పునరావాసం కల్పించాలని డిమాండ్ చేశారు. లేనిచో ఆందోళన ఉధృతం చేసి నారాయణపూర్ రిజర్వాయర్ కట్టకు గండి పెడతామని హెచ్చరించారు.1
- భద్రాద్రి కొత్తగూడెం జిల్లా కొత్తగూడెం లో ప్రజాపాలన- ప్రగతి ప్రణాళిక 99 రోజులలో భాగంగా లక్ష్మీదేవి పల్లి మండలం చాతకొండ రోడ్ నందు గల ప్రైవేట్ ఫంక్షన్ హాల్ నందు లక్ష్మీదేవిపల్లి పోలీసుల ఆధ్వర్యంలో మత్తు పదార్థాలు వినియోగం - అనర్ధాలు అంశం పై స్థానిక ప్రజలు, విద్యార్థులు, యువతకు అవగాహన కార్యక్రమం ఏర్పాటు చేశారు. ఈయొక్క కార్యక్రమంకు ముఖ్య అతిధిగా జిల్లా ఎస్పీ రోహిత్ రాజ్ హాజరయ్యారు. ఈసందర్భంగా ఎస్పీ డ్రగ్స్ పై అవగాహన కల్పించారు. డ్రగ్స్ వాడకం వల్ల ఎదురయ్యే ఇబ్బందులు గురించి తెలిపారు. డ్రగ్స్ మత్తులో విద్యార్థులు, యువత భవిష్యత్ నాశనం అవుతుందని తెలిపారు. మహిళలు, చిన్న పిల్లలపై దారుణాలు చోటుచేసుకుంటాయని అన్నారు. డ్రగ్స్ కు దూరంగా ఉండి ఆనందమైన జీవితం గడపాలని సూచించారు.2
- *నల్లగొండ జిల్లా :-* • మునుగోడు మండలం కల్వలపల్లి గ్రామంలో భూగర్భ జలాలు అడుగంటి ఎండిపోతున్న వరి పంటలను పరిశీలించిన ఎమ్మెల్సీ నెల్లికంటి సత్యం. • భూగర్భ జలాలు అడుగంటంతో ట్యాంకర్ల ద్వారా రైతులు ఇతర ప్రాంతాల నుండి నీటిని తరలించి తమ పంటను కాపాడే ప్రయత్నం చేస్తున్నా రైతులు *ఎమ్మెల్సీ నెల్లికంటి సత్యం కామెంట్స్ :-* • అధికారులు, కాంట్రాక్టర్ల నిర్లక్ష్యం కారణంగానే రైతుల పంటలు ఎండిపోతున్నాయి. • బ్రాహ్మణ వెళ్ళాముల చెరువు నీళ్లను సద్వినియోగం చేయడంలో అధికారులు విఫలమయ్యారు. • ఉదయ సముద్రం బ్రాహ్మణ వెళ్ళాముల ప్రాజెక్టు నుండి కిష్టాపురం వరకు కాల్వ పొడగించి మునుగోడు మండల గ్రామాల చెరువులను నింపాలి • నల్లగొండ నకిరేకల్ నియోజకవర్గనికి కొలమానం లేకుండా నీరు తరలించడం అన్యాయం. • పంటలు ఎండిన రైతు ఎకరాకి 40 వేల నష్టపరిహారం ఇవ్వాలి. • ఆరుగాలం శ్రమించి సాగుచేసిన పంటలు కండ్ల ముందే ఎండిపోయే బాధ నేను స్వయాన అనుభవించిన. • మునుగోడు మండలంలోని కలువల పల్లి,పులిపలుపుల చెరువులకు నీరిచ్చే అవకాశం ఉన్న అధికారులు నిర్లక్ష్యంగా వ్యవహారిస్తున్నారు. • బోరు బావుల పై ఆధారపడి వ్యవసాయం చేసే ఎంతోమంది రైతులు నష్టపోతున్నారు.1
- మునుగోడు.... ప్రజాపాలన ప్రగతి ప్రణాళికలో భాగంగా మునుగోడు మండలం చెలిమెడ గ్రామంలో 1 కోటి 75 లక్షల వ్యయంతో చల్మడ నుండి బొత్తలగడ్డ గ్రామం వరకు నిర్మించే రోడ్డు అభివృద్ధి పనులకు ఎమ్మెల్సీ నెల్లికంటి సత్యం గారితో కలిసి శంకుస్థాపన చేసిన గౌరవ మునుగోడు శాసనసభ్యులు శ్రీ కోమటిరెడ్డి రాజ్ గోపాల్ రెడ్డి గారు...2
- రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఆజంజాహి మిల్లు కార్మికులకు ఇచ్చిన హామీని వెంటనే నెరవేర్చాలని గురువారం నాడు రోడ్డెక్కి ఆందోళన దిగిన కార్మికులు. వరంగల్ నగరంలోని వెంకట్రామ జంక్షన్ వద్ద రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఆజం జాహి మిల్లు కార్మికులకు ఇస్తామన్న 200 గజాల నివాస స్థలమును వెంటనే ఇవ్వాలని కార్మికులు డిమాండ్ చేస్తూ వెంకట్రామ జంక్షన్ వద్ద రాస్తా రోకో చేపట్టారు భారీగా నిలిచిన ట్రాఫిక్. రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి పాదయాత్ర చేస్తున్న సమయంలో అధికారంలోకి వచ్చాక కార్మికులకు నివాస స్థలాలు ఇస్తామని హామీ ఇచ్చారని అవి ఇప్పటికీ నెరవేర్చలేదని కార్మికులు 20 సంవత్సరాల నుండి పోరాటం చేస్తుంటే 2021లో సుప్రీంకోర్టు కార్మికులకు అనుకూలంగా తీర్పు ఇచ్చిందని సుప్రీంకోర్టు ఇచ్చిన తీర్పును కూడా ఇప్పటివరకు కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు అమలు చేయడం లేదని వెంటనే కార్మికులకు 200 గజాల నివాసస్థలం కేటాయించి రిజిస్ట్రేషన్ చేయాలని యూనియన్ అధ్యక్షులు శ్రీనివాస్ డిమాండ్ చేశారు.1