రుద్రంగి మండలంలో వాటర్ ట్యాంకర్ తో వరిపంటకు సాగునీరు...అడుగంటిన భూగర్భ జలాలతో ఎండుతున్న పంట పొలాలను కాపాడుకునేందుకు రైతులు భగీరథ ప్రయత్నం. రాజన్న సిరిసిల్ల జిల్లాలో భూగర్భజలాలు అడుగంటి సాగునీరు అందక రైతులు వేసిన పంటలు ఎండిపోయే పరిస్థితి ఏర్పడింది. ఎండుతున్న పంటలను కాపాడుకునేందుకు రుద్రంగి మండలంలో రైతులు వాటర్ ట్యాంకర్ తో నీరందిస్తున్నారు. కొందరు రైతులు నీరు లేక పోవడంతో చేసేదేమీలేక పంట పొలాలను పశువులకు మేతగా వదిలిపెట్టారు. రుద్రంగి లో అచ్చయ్యకుంట చెరువు, బతుకమ్మ కుంట చెరువు, నాగారం చెరువు, సూరమ్మ చెరువు ఉన్నప్పటికీ వాటిలో నీరు లేకపోవడంతో భూగర్భజలాలు అడుగంటి పోయాయి. అలాగే వర్షాలు కూడా ఎక్కువగా పడలేదని రైతులు అంటున్నారు. కనీసం కాళేశ్వరం ఎల్లంపల్లి నీటితోనైనా పంటను కాపాడుకుందాం అనుకుంటే కాంగ్రెస్ ప్రభుత్వం ఇప్పటికి నీటిని విడుదల చేయలేదని ఆగ్రహం వ్యక్తంచేశారు. పంటలు ఎండిన తర్వాత నీరందించి ఏంలాభం అని రైతులు ప్రశ్నిస్తున్నారు. అదే నీటిని జనవరి నెలలో విడుదల చేసి ఉంటే పంటలు ఎండక పోవునని అన్నారు. జనవరి నెలలోనే చేరువులన్ని కాళేశ్వరం నీటితో నింపి ఉంటే భూగర్భజలాలు పెరిగి రైతులకు ఇంతటి కష్టంనష్టం జరగకపోవునని తెలిపారు. ఇప్పటికైనా త్వరగా నీటిని విడుదల చేస్తే మిగిలిన పంటనైన రైతులు కపాడుకుంటామని రైతులు అంటున్నారు.
రుద్రంగి మండలంలో వాటర్ ట్యాంకర్ తో వరిపంటకు సాగునీరు...అడుగంటిన భూగర్భ జలాలతో ఎండుతున్న పంట పొలాలను కాపాడుకునేందుకు రైతులు భగీరథ ప్రయత్నం. రాజన్న సిరిసిల్ల జిల్లాలో భూగర్భజలాలు అడుగంటి సాగునీరు అందక రైతులు వేసిన పంటలు ఎండిపోయే పరిస్థితి ఏర్పడింది. ఎండుతున్న పంటలను కాపాడుకునేందుకు రుద్రంగి మండలంలో రైతులు వాటర్ ట్యాంకర్ తో నీరందిస్తున్నారు. కొందరు రైతులు నీరు లేక పోవడంతో చేసేదేమీలేక పంట పొలాలను పశువులకు మేతగా వదిలిపెట్టారు. రుద్రంగి లో అచ్చయ్యకుంట చెరువు, బతుకమ్మ కుంట చెరువు, నాగారం చెరువు, సూరమ్మ చెరువు ఉన్నప్పటికీ వాటిలో నీరు లేకపోవడంతో భూగర్భజలాలు అడుగంటి పోయాయి. అలాగే వర్షాలు కూడా ఎక్కువగా పడలేదని రైతులు అంటున్నారు. కనీసం కాళేశ్వరం ఎల్లంపల్లి నీటితోనైనా పంటను కాపాడుకుందాం అనుకుంటే కాంగ్రెస్ ప్రభుత్వం ఇప్పటికి నీటిని విడుదల చేయలేదని ఆగ్రహం వ్యక్తంచేశారు. పంటలు ఎండిన తర్వాత నీరందించి ఏంలాభం అని రైతులు ప్రశ్నిస్తున్నారు. అదే నీటిని జనవరి నెలలో విడుదల చేసి ఉంటే పంటలు ఎండక పోవునని అన్నారు. జనవరి నెలలోనే చేరువులన్ని కాళేశ్వరం నీటితో నింపి ఉంటే భూగర్భజలాలు పెరిగి రైతులకు ఇంతటి కష్టంనష్టం జరగకపోవునని తెలిపారు. ఇప్పటికైనా త్వరగా నీటిని విడుదల చేస్తే మిగిలిన పంటనైన రైతులు కపాడుకుంటామని రైతులు అంటున్నారు.
- యుద్ధ ప్రభావం ఎరువుల ఉత్పత్తి పై చూపుతుంది. గ్యాస్ కొరతతో రామగుండం ఎరువుల కర్మాగారంలో సగానికిపైగా ఎరువుల ఉత్పత్తి తగ్గిపోయింది. ఇప్పటికే యూరియా కొరతతో రైతులు ఆందోళన చెందుతున్న నేపథ్యంలో యుద్ద ప్రభావంతో గ్యాస్ కొరత వల్ల ఎరువుల ఉత్పత్తి తగ్గడంతో రైతన్నలు ఆవేదనతో ఆందోళన చెందే పరిస్థితి ఏర్పడింది. గ్యాస్ ఆధారిత రామగుండం ఎరువుల కర్మాగారంలో రోజుకు 3850 టన్నుల ఎరువులు ఉత్పత్తి కావలసి ఉండగా ప్రస్తుతం సగానికి పైగా ఉత్పత్తి తగ్గింది. గ్యాస్ సప్లై లో అంతరాయం ఇలాగే కొనసాగితే ఎరువుల ఉత్పత్తి మరింత క్షీణించే అవకాశం ఉందనే అభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి. ప్రత్యామ్నాయంగా అత్యవసరాలకు ఎన్పీడీసీఎల్ విద్యుత్తును వినియోగంలోకి తెచ్చే అంశాన్ని అధికారులు పరిశీలిస్తున్నట్లు సమాచారం. గత ఐదు నెలలుగా ఎలాంటి అంతరాయాలు లేకుండా RFCL లో ఎరువుల ఉత్పత్తి కొనసాగుతుండగా గ్యాస్ కొరతతో ప్రస్తుతం ఉత్పత్తి నిలిచిపోయే పరిస్థితులు ఉత్పన్నం అవుతున్నాయి. ఆర్ఎఫ్సీఎల్ లో రోజుకు 3850 టన్నుల ఎరువుల ఉత్పత్తి కావాల్సి ఉండగా అందులో సగం కూడా ప్రస్తుతం ఉత్పత్తి కావడం లేదు. వార్షిక లక్ష్యం 12 లక్షల 70 వేల మెట్రిక్ టన్నుల ఎరువులు ఉత్పత్తి కాగా, ఫిబ్రవరి మాసాంతానికి 8 లక్షల 50 వేల మెట్రిక్ టన్నుల ఎరువులు ఉత్పత్తి అయింది. ఈనెలలో ఇప్పటి వరకు 1900 టన్నుల ఎరువులు ఉత్పత్తి అయింది. దేశవ్యాప్తంగా గ్యాస్ ఆధారిత ఎరువుల కర్మాగారాల్లో ఇదే పరిస్థితి నెలకొంది.1
- జగిత్యాల జిల్లా కేంద్రంలో మాజీ మంత్రి జీవన్ రెడ్డి ప్రెస్ మీట్ నిర్వహించారు. పార్టీ మారుతున్నారన్న ప్రచారంపై మీడియా ప్రశ్నలకు స్పందించిన ఆయన, కాంగ్రెస్ పార్టీలో కొనసాగాలా లేదా అనే విషయంపై ఆలోచించాల్సిన పరిస్థితి ఉందన్నారు. అయితే ఇప్పటివరకు ఎలాంటి నిర్ణయం తీసుకోలేదని తెలిపారు. సరైన సమయం, సందర్భం వచ్చినప్పుడు నిర్ణయం తీసుకుంటానని, ఏ నిర్ణయం తీసుకున్నా మీడియా ద్వారానే వెల్లడిస్తానని స్పష్టం చేశారు.1
- తంగళ్లపల్లి మండలం 11వ ప్యాకేజీ కింద ఎల్ ఎం -6, ఎల్ ఎం -4 కెనాల్ పనులను వెంటనే పూర్తి చేయాలని డిమాండ్ చేస్తూ తంగళ్లపల్లి మండల రైతులు ధర్నా చేపట్టారు. సిరిసిల్ల - తంగళ్లపల్లి మానేరు వాగు బ్రిడ్జిపై ధర్నా, రాస్తారోకో నిర్వహించారు. ఈ ధర్నాకు బిజెపి జిల్లా అధ్యక్షులు రెడ్డబోయిన గోపి, నాయకులు మద్దతు పలికి ధర్నాలో పాల్గొన్నారు. ఈ సంధర్బంగా బిజెపి జిల్లా అధ్యక్షులు రెడ్డబోయిన గోపి మాట్లాడారు.1
- వరంగల్ జిల్లా వర్ధన్నపేట పట్టణానికి చెందిన వడ్లకొండ శ్రీనివాస్–సరిత దంపతుల కుమారుడు సాయి చరణ్ రెండేళ్ల క్రితం అనారోగ్యంతో మృతి చెందాడు. కొడుకు జ్ఞాపకాలను శాశ్వతంగా నిలుపుకోవాలనే ఉద్దేశంతో తల్లిదండ్రులు అతని రూపంలో నిలువెత్తు విగ్రహాన్ని తయారు చేయించి ఇంట్లో ప్రతిష్టించారు. నేడు కుమారుడి జన్మదినం సందర్భంగా ఆ విగ్రహానికి కొత్త రంగులు వేసి పూలమాలలతో అలంకరించి కుటుంబ సభ్యులు, బంధుమిత్రుల సమక్షంలో కేక్ కట్ చేసి పుట్టినరోజు వేడుకలను భావోద్వేగభరితంగా నిర్వహించారు. కుమారుడు తమతోనే ఉన్నాడన్న భావనతో ప్రతి ఏడాది ఇలాంటి వేడుకలు నిర్వహిస్తున్నట్లు కుటుంబ సభ్యులు తెలిపారు.1
- అందులో భాగంగా ఈరోజు రాత్రి 10 గంటలకు లక్ష్మీనరసింహస్వామి వార్ల తిరు కళ్యాణ మహోత్సవం అంగరంగ వైభవంగా భక్తుల జయ జయ ద్వానాల నడుమ నిర్వహించనున్నారు. కాబట్టి చుట్టుపక్క గ్రామాల ప్రజలతో పాటు హైదరాబాద్ సికింద్రాబాద్ జంట నగరాల నుంచి పెద్ద సంఖ్యలో భక్తులు తరలివచ్చి స్వామివారి కృపకు పాత్రులు కాగలరని ఆలయ అర్చకులు, నిర్వాహకులు కోరుతున్నారు. భక్తులకు ఎలాంటి ఇబ్బందులు కలగకుండా ఏర్పాట్లు పూర్తి చేసినట్లు ఆలయ చైర్మన్, ధర్మకర్తలు, ఈవో, సిబ్బంది భక్తులను ఆహ్వానిస్తున్నారు.1
- అశోక్ నగర్ వినాయకుని ఆలయంలో చోరీ సంగారెడ్డి జిల్లాలోని రామచంద్రపురం పోలీస్ స్టేషన్ పరిధిలో ఆలయంలో చోరీ జరిగింది. అశోక్ నగర్ వినాయక ఆలయంలో మంగళ వారం తెల్లవారుజామున దొంగలు తాళాలు పగులగొట్టి లోపలికి ప్రవేశించారు. స్థానికుల సమాచారం ప్రకారం దొంగలు ఆలయంలోని సుమారు 3 తులాల బంగారు ఆభరణాలు, 8 కిలోల వెండి వస్తువులు అపహరించారు. అంతేకాకుండా ఆలయ హుండీని పగులగొట్టి అందులో ఉన్న సుమారు 90 వేల రూపాయల నగదును కూడా తీసుకెళ్లినట్లు తెలుస్తోంది. ఉదయం ఆలయానికి వచ్చిన స్థానికులు తాళాలు పగులగొట్టబడినట్టు గుర్తించి వెంటనే పోలీసులకు సమాచారం అందించారు.సమాచారం అందుకున్న వెంటనే పోలీసులు సంఘటనా స్థలానికి చేరుకుని పరిశీలనలు ప్రారంభించారు. క్లూస్ టీం సహాయంతో వేలిముద్రలు మరియు ఇతర ఆధారాలను సేకరిస్తున్నారు. ఆలయ పరిసరాల్లో ఉన్న సీసీటీవీ కెమెరాలను పోలీసులు పరిశీలిస్తూ దొంగల కోసం గాలింపు చర్యలు చేపట్టారు.ఈ ఘటనపై రామచంద్రాపురం పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు కొనసాగిస్తున్నారు.4
- గజ్వేల్ సిద్దిపేట జిల్లా మార్చ్ 10 ప్రజా తెలంగాణ న్యూస్/ గజ్వేల్ సబ్ స్టేషన్ వద్ద బీఆర్ఎస్ నిరసన గజ్వేల్: కరెంట్ సరఫరాలో కోత విధించడంతో పoటలు ఎండిపోతున్నాయని, ఈ పరిస్థితి మారక పోతే సహించేదీలేదని ఎఫ్డిసి మాజీ చైర్మన్ వంటేరు ప్రతాప్ రెడ్డి హెచ్చరించారు. సోమవారం గజ్వే ల్లో లోని సబ్స్టే స్టేషన్ వద్ద బీఆర్ఎస్ శ్రేణులతో కలిసి నిరసన తెలిపారు. అనంతరం విద్యుత్శాఖ డీఈ భానుప్రకాశకు వినతిపత్రం అందజేశారు. అనం తరం ఆయన మాట్లాడుతూ గతంలో కేసీఆర్ రైతులకు 24గంటలూ విద్యుత్ సరఫరా అందజేసి అండగా నిలిస్తే.. నేడు పరిస్థితి భిన్నంగా మారిందని ఆందోళన వ్యక్తం చేశారు. క్షేత్రస్థాయిలో 9గంటలకు మించి సరఫరా కావడం లేదన్నారు. దీంతో పం టలు ఎండిపోయే పరిస్థితి వచ్చిందని చెప్పారు. కార్యక్రమంలో మున్సిపల్ చైర్మన్ చందన, దేవీ రవీందర్, మాజీ జెడ్పీటీసీ మల్లేశం, నాయకులు తదితరులు పాల్గొన్నారు.4
- గోదావరి పుష్కరాలను ఘనంగా నిర్వహించాలని క్యాబినెట్ సబ్ కమిటీ నిర్ణయించింది. సెక్రటేరియట్‌లో మంత్రి శ్రీధర్ బాబు అధ్యక్షతన “గోదావరి పుష్కరాలు–2027 కేబినెట్ సబ్ కమిటీ” తొలి సమావేశం నిర్వహించారు. ఈ సమావేశంలో మంత్రులు తుమ్మల నాగేశ్వరరావు, కోమటిరెడ్డి వెంకట్ రెడ్డి, కొండా సురేఖ, పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి, సీతక్క, ప్రభుత్వ సలహాదారు సుదర్శన్ రెడ్డి, హర్కర వేణుగోపాల్ సంబంధిత శాఖల ఉన్నతాధికారులు పాల్గొన్నారు. గోదావరి పుష్కరాలను ఈసారి కని విని ఎరుగని రీతిలో నిర్వహించేందుకు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ప్రత్యేక దృష్టి సారించారని మంత్రులు తెలిపారు. రాష్ట్ర ప్రతిష్ఠకు అనుగుణంగా పుష్కరాల ఏర్పాట్లు అత్యంత ప్రాముఖ్యంతో చేపట్టాలని సీఎం ఇప్పటికే అధికారులకు సూచించినట్లు చెప్పారు. గోదావరి నది పరివాహక ప్రాంతాల్లో లక్షలాది మంది భక్తులు పుష్కర స్నానాలకు తరలివస్తారని పేర్కొన్నారు. ముఖ్యంగా ధర్మపురి నియోజకవర్గ పరిధిలో గోదావరి తీరం విస్తరించి ఉండటంతో పాటు అక్కడ ప్రసిద్ధ పుణ్యక్షేత్రాలు ఉండటంతో భక్తుల రద్దీ మరింత ఎక్కువగా ఉంటుందని తెలిపారు. ధర్మపురి శ్రీ లక్ష్మీనరసింహ స్వామి ఆలయం సహా గోదావరి తీరం వెంట ఉన్న ఆలయాలను దర్శించేందుకు దేశం నలుమూలల నుంచి భక్తులు పెద్ద సంఖ్యలో వచ్చే అవకాశం ఉందని మంత్రి అడ్లూరి లక్ష్మణ్ కుమార్ తెలిపారు. అందువల్ల ఘాట్‌ల అభివృద్ధి, తాత్కాలిక స్నాన ఘాట్‌లు, రహదారుల విస్తరణ, పార్కింగ్ స్థలాలు, తాగునీరు, పారిశుధ్యం, విద్యుత్, వైద్య సేవలు, భద్రత వంటి అంశాలపై ముందస్తు ప్రణాళికతో ఏర్పాట్లు చేయాలని అధికారులకు సూచించారు. పుష్కరాల సమయంలో భక్తులకు సౌకర్యవంతమైన రవాణా కోసం ప్రత్యేక బస్సులు, తాత్కాలిక వసతి కేంద్రాలు, సమాచార కేంద్రాలు ఏర్పాటు చేయాలని తెలిపారు. అలాగే విపత్తు నిర్వహణ, పోలీస్ భద్రత, వైద్య అత్యవసర సేవలు అందుబాటులో ఉండేలా సమగ్ర ప్రణాళికతో ముందుకు వెళ్లాలని పేర్కొన్నారు. పుష్కరాల సందర్భంగా పర్యాటక అభివృద్ధికి కూడా ప్రాధాన్యత ఇవ్వాలని, రాష్ట్రానికి వచ్చే భక్తులకు తెలంగాణ సాంస్కృతిక వైభవాన్ని పరిచయం చేసే విధంగా కార్యక్రమాలు నిర్వహించాలని సమావేశంలో సూచించారు.2