వనపర్తి జిల్లా పర్యాటకులను ఆకర్షించే విధంగా జిల్లాలోని పర్యాటక ప్రదేశాల అభివృద్ధికి తగు చర్యలు చేపట్టాలని జిల్లా కలెక్టర్ ఆదర్శ్ సురభి ఆదేశించారు. మంగళవారం రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి సంజయ్ జాజు వర్షాభావ పరిస్థితులు, నీట్–పీజీ పరీక్ష ఏర్పాట్లు, పర్యాటక అభివృద్ధి తదితర అంశాలపై అన్ని జిల్లాల కలెక్టర్లతో వీడియో కాన్ఫరెన్స్ ద్వారా సమీక్ష నిర్వహించారు. వనపర్తి జిల్లా కలెక్టరేట్లోని కాన్ఫరెన్స్ హాల్ నుండి జిల్లా కలెక్టర్ ఆదర్శ్ సురభి, అదనపు కలెక్టర్ స్థానిక సంస్థలుఖీమ్య నాయక్, అదనపు కలెక్టర్ రెవెన్యూ వినోద్ కుమార్ తో కలిసి వీడియో కాన్ఫరెన్స్‌లో పాల్గొన్నారు. సి ఎస్ మాట్లాడుతూ రాష్ట్రవ్యాప్తంగా ఎంపిక చేసిన 27 ప్రత్యేక పర్యాటక ప్రాంతాలను ప్రాధాన్యతా ప్రాతిపదికన అభివృద్ధి చేయాలని సూచించారు. ప్రతి జిల్లాలోని పర్యాటక ప్రాంతాలను అనుసంధానిస్తూ సమగ్ర అభివృద్ధి ప్రణాళికలను రూపొందించాలని ఆదేశించారు. పర్యాటక ప్రాంతాల్లో రహదారులు, పార్కింగ్, తాగునీరు, మరుగుదొడ్లు, విద్యుత్, పారిశుద్ధ్యం, సూచిక బోర్డులు, ఇతర సందర్శకుల సౌకర్యాలను మెరుగుపరచాలని సీఎస్ ఆదేశించారు. ప్రతి పర్యాటక ప్రాంతానికి స్పష్టమైన అభివృద్ధి కార్యాచరణ, బాధ్యతలు, కాలపరిమితిని నిర్ణయించి పనుల పురోగతిని క్రమం తప్పకుండా సమీక్షించాలని సూచించారు. స్థానిక కళలు, హస్తకళలు, స్థానిక ఆహారం, సంస్కృతికి ప్రాధాన్యతనిస్తూ స్థానికులకు ఉపాధి అవకాశాలు కల్పించాలని, హోమ్‌స్టేలు, స్థానిక గైడ్ సేవలను ప్రోత్సహించాలని తెలిపారు. తెలంగాణ సంస్కృతి, కళలు, హస్తకళలు, చారిత్రక వారసత్వం, స్థానిక ఆహారం, పండుగలు, సంప్రదాయాలను ప్రపంచానికి పరిచయం చేయడం ద్వారా ‘బ్రాండ్ తెలంగాణ’కు ప్రత్యేక గుర్తింపు తీసుకురావాలని సీఎస్ తెలిపారు. ఫెయిర్లు, ఫెస్టివల్స్, వారసత్వ కార్యక్రమాలను విస్తృతంగా నిర్వహించాలని సూచించారు. *వర్షాభావ పరిస్థితులపై నిరంతర పర్యవేక్షణ* రాష్ట్రంలో ప్రస్తుతం 22 శాతం లోటు వర్షపాతం నమోదైందని, సెప్టెంబర్ చివరి వరకు పెద్దగా వర్షాలు కురిసే అవకాశం లేదని వాతావరణ నిపుణులు సూచించినట్లు సీఎస్ తెలిపారు. ఇప్పటివరకు రాష్ట్రవ్యాప్తంగా సుమారు 1.20 కోట్ల ఎకరాల్లో పంటల సాగు జరిగిందని, గత వానాకాలంలో సుమారు 1.38 కోట్ల ఎకరాల్లో సాగు జరిగినట్లు తెలిపారు. వర్షాభావ పరిస్థితుల నేపథ్యంలో పంటల పరిస్థితి, సాగునీరు, తాగునీటి లభ్యతను నిరంతరం పర్యవేక్షిస్తూ అవసరమైన ముందస్తు చర్యలు చేపట్టాలని జిల్లా కలెక్టర్లను ఆదేశించారు. వీసీ అనంతరం జిల్లా అధికారులతో కలెక్టర్ మాట్లాడుతూ వనపర్తి జిల్లాలో కూడా వర్షాభావ పరిస్థితుల ప్రభావాన్ని ఎప్పటికప్పుడు అంచనా వేస్తూ, వ్యవసాయం, సాగునీరు, తాగునీటి లభ్యతపై సంబంధిత శాఖల అధికారులు సమన్వయం చేసుకుంటూ అవసరమైన చర్యలు చేపట్టాలని సూచించారు. ఆరుతడి పంటలను ప్రాధాన్యతగా రైతులు వేసే విధంగా వ్యవసాయ శాఖ అధికారులు ఇంకా ఎక్కువగా చొరవ తీసుకొని ప్రోత్సహించాలన్నారు. నీటి లభ్యత దృష్టిలో ఉంచుకొని వరి పంట కాకుండా మినుములు వేరుశనగ వంటి ఆరుతడి పంటలను వేసుకునే విధంగా చర్యలు తీసుకోవాలన్నారు. టూరిజం గురించి మాట్లాడుతూ పర్యాటకులను ఆకర్షించే విధంగా జిల్లాలోని పర్యాటక ప్రదేశాల సమగ్ర అభివృద్ధికి తగు చర్యలు చేపట్టాలని ఆదేశించారు. సమావేశంలో జెడ్పి సీఈవో యాదయ్య, జిల్లా వ్యవసాయ అధికారి ఆంజనేయులు, జిల్లా పర్యాటక శాఖ అధికారి సుధీర్ రెడ్డి, ఇతర అధికారులు తదితరులు పాల్గొన్నారు.
వనపర్తి జిల్లా పర్యాటకులను ఆకర్షించే విధంగా జిల్లాలోని పర్యాటక ప్రదేశాల అభివృద్ధికి తగు చర్యలు చేపట్టాలని జిల్లా కలెక్టర్ ఆదర్శ్ సురభి ఆదేశించారు. మంగళవారం రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి సంజయ్ జాజు వర్షాభావ పరిస్థితులు, నీట్–పీజీ పరీక్ష ఏర్పాట్లు, పర్యాటక అభివృద్ధి తదితర అంశాలపై అన్ని జిల్లాల కలెక్టర్లతో వీడియో కాన్ఫరెన్స్ ద్వారా సమీక్ష నిర్వహించారు. వనపర్తి జిల్లా కలెక్టరేట్లోని కాన్ఫరెన్స్ హాల్ నుండి జిల్లా కలెక్టర్ ఆదర్శ్ సురభి, అదనపు కలెక్టర్ స్థానిక సంస్థలుఖీమ్య నాయక్, అదనపు కలెక్టర్ రెవెన్యూ వినోద్ కుమార్ తో కలిసి వీడియో కాన్ఫరెన్స్‌లో పాల్గొన్నారు. సి ఎస్ మాట్లాడుతూ రాష్ట్రవ్యాప్తంగా ఎంపిక చేసిన 27 ప్రత్యేక పర్యాటక ప్రాంతాలను ప్రాధాన్యతా ప్రాతిపదికన అభివృద్ధి చేయాలని సూచించారు. ప్రతి జిల్లాలోని పర్యాటక ప్రాంతాలను అనుసంధానిస్తూ సమగ్ర అభివృద్ధి ప్రణాళికలను రూపొందించాలని ఆదేశించారు. పర్యాటక ప్రాంతాల్లో రహదారులు, పార్కింగ్, తాగునీరు, మరుగుదొడ్లు, విద్యుత్, పారిశుద్ధ్యం, సూచిక బోర్డులు, ఇతర సందర్శకుల సౌకర్యాలను మెరుగుపరచాలని సీఎస్ ఆదేశించారు. ప్రతి పర్యాటక ప్రాంతానికి స్పష్టమైన అభివృద్ధి కార్యాచరణ, బాధ్యతలు, కాలపరిమితిని నిర్ణయించి పనుల పురోగతిని క్రమం తప్పకుండా సమీక్షించాలని సూచించారు. స్థానిక కళలు, హస్తకళలు, స్థానిక ఆహారం, సంస్కృతికి ప్రాధాన్యతనిస్తూ స్థానికులకు ఉపాధి అవకాశాలు కల్పించాలని, హోమ్‌స్టేలు, స్థానిక గైడ్ సేవలను ప్రోత్సహించాలని తెలిపారు. తెలంగాణ సంస్కృతి, కళలు, హస్తకళలు, చారిత్రక వారసత్వం, స్థానిక ఆహారం, పండుగలు, సంప్రదాయాలను ప్రపంచానికి పరిచయం చేయడం ద్వారా
‘బ్రాండ్ తెలంగాణ’కు ప్రత్యేక గుర్తింపు తీసుకురావాలని సీఎస్ తెలిపారు. ఫెయిర్లు, ఫెస్టివల్స్, వారసత్వ కార్యక్రమాలను విస్తృతంగా నిర్వహించాలని సూచించారు. *వర్షాభావ పరిస్థితులపై నిరంతర పర్యవేక్షణ* రాష్ట్రంలో ప్రస్తుతం 22 శాతం లోటు వర్షపాతం నమోదైందని, సెప్టెంబర్ చివరి వరకు పెద్దగా వర్షాలు కురిసే అవకాశం లేదని వాతావరణ నిపుణులు సూచించినట్లు సీఎస్ తెలిపారు. ఇప్పటివరకు రాష్ట్రవ్యాప్తంగా సుమారు 1.20 కోట్ల ఎకరాల్లో పంటల సాగు జరిగిందని, గత వానాకాలంలో సుమారు 1.38 కోట్ల ఎకరాల్లో సాగు జరిగినట్లు తెలిపారు. వర్షాభావ పరిస్థితుల నేపథ్యంలో పంటల పరిస్థితి, సాగునీరు, తాగునీటి లభ్యతను నిరంతరం పర్యవేక్షిస్తూ అవసరమైన ముందస్తు చర్యలు చేపట్టాలని జిల్లా కలెక్టర్లను ఆదేశించారు. వీసీ అనంతరం జిల్లా అధికారులతో కలెక్టర్ మాట్లాడుతూ వనపర్తి జిల్లాలో కూడా వర్షాభావ పరిస్థితుల ప్రభావాన్ని ఎప్పటికప్పుడు అంచనా వేస్తూ, వ్యవసాయం, సాగునీరు, తాగునీటి లభ్యతపై సంబంధిత శాఖల అధికారులు సమన్వయం చేసుకుంటూ అవసరమైన చర్యలు చేపట్టాలని సూచించారు. ఆరుతడి పంటలను ప్రాధాన్యతగా రైతులు వేసే విధంగా వ్యవసాయ శాఖ అధికారులు ఇంకా ఎక్కువగా చొరవ తీసుకొని ప్రోత్సహించాలన్నారు. నీటి లభ్యత దృష్టిలో ఉంచుకొని వరి పంట కాకుండా మినుములు వేరుశనగ వంటి ఆరుతడి పంటలను వేసుకునే విధంగా చర్యలు తీసుకోవాలన్నారు. టూరిజం గురించి మాట్లాడుతూ పర్యాటకులను ఆకర్షించే విధంగా జిల్లాలోని పర్యాటక ప్రదేశాల సమగ్ర అభివృద్ధికి తగు చర్యలు చేపట్టాలని ఆదేశించారు. సమావేశంలో జెడ్పి సీఈవో యాదయ్య, జిల్లా వ్యవసాయ అధికారి ఆంజనేయులు, జిల్లా పర్యాటక శాఖ అధికారి సుధీర్ రెడ్డి, ఇతర అధికారులు తదితరులు పాల్గొన్నారు.
- NGKL:హామీలు అమలు చేయకపోతే ఉద్యమం తప్పదు: సీఐటీయూ హెచ్చరిక ఆర్టీసీ యాజమాన్యం చర్చల వేదికగా ఇచ్చిన హామీలను అమలు చేయకుండా కార్మికులను వంచిస్తోందని ఎస్‌డబ్ల్యూఎఫ్ ఉపాధ్యక్షులు పి.చింతలయ్య ధ్వజమెత్తారు. మంగళవారం నాగర్‌కర్నూల్ ఆర్టీసీ డిపో వద్ద సీఐటీయూ ఆధ్వర్యంలో చేపట్టిన ఒకరోజు నిరాహార దీక్షలకు శ్రీకారం చుట్టారు. ఈ కార్యక్రమాన్ని గౌరవాధ్యక్షులు ఆర్. శ్రీనివాసులు ప్రారంభించగా, టీజేఎంయూ నాయకుడు డీవీ నాయక్ మద్దతు పలికారు. రూట్ సర్వేలు చేయకుండానే ఏకపక్షంగా రన్నింగ్ టైమ్స్ మారుస్తున్నారని చింతలయ్య విమర్శించారు. మోటారు వాహనాల చట్టం-2019 ప్రకారం ఉద్యోగ భద్రత కల్పించాలని, 2017 వేతన బకాయిలు, ఆర్పీఎస్-2021 అరియర్స్ వెంటనే చెల్లించాలని, 2019 నాటి పోలీసు కేసులను ఎత్తివేయాలని ఆయన డిమాండ్ చేశారు. ఈ కార్యక్రమంలో యూనియన్ ప్రతినిధులు నందీశ్వర్, లింగయ్య, అర్జున్, వెంకట వర్ధనమ్మ పాల్గొన్నారు.3
- గోనెగండ్ల మండలం కులుమల గ్రామంలో కర్నూలు జిల్లా తెలుగుదేశం పార్టీ ఉపాధ్యక్షులు భాస్కర్ల చంద్రశేఖర్ గారు పర్యటించారు *ప్రజల మధ్య శేఖరన్న – అభివృద్ధి బాటలో కులుమల గ్రామం *గోనెగండ్ల మండలం కులుమల గ్రామంలో కర్నూలు జిల్లా తెలుగుదేశం పార్టీ ఉపాధ్యక్షులు భాస్కర్ల చంద్రశేఖర్ గారు పర్యటించారు.* *ఈ సందర్భంగా గ్రామ ప్రజలతో మమేకమై, గౌరవ ఎమ్మెల్యే డాక్టర్ బీవీ జయనాగేశ్వర రెడ్డి గారి ఆధ్వర్యంలో జరుగుతున్న అభివృద్ధి కార్యక్రమాలను ప్రజలకు వివరిస్తూ, వారి సమస్యలను స్వయంగా తెలుసుకున్నారు.* *ప్రజల సమస్యలు తెలుసుకుని, వాటి పరిష్కారానికి కృషి చేయడమే లక్ష్యంగా శేఖరన్న గారి పర్యటన కొనసాగింది.1
- అలంపూర్: మొక్కలు నాటిన మున్సిపల్ కమిషనర్!! మొక్కలను నాటుదాం దానిని చెట్లగా మారుద్దాం.. మున్సిపల్ కమిషనర్ రాజేష్ పిలుపు అలంపూర్ మున్సిపల్ పరిధిలో చేపట్టిన వనమహోత్సవం కార్యక్రమంలో భాగంగా స్థానిక మున్సిపల్ కమిషనర్ రాజేష్ మొక్కలను నాటారు. ఈ సందర్భంగా కమిషనర్ మాట్లాడుతూ ప్రతి ఒక్కరు మొక్కలు నాటి భావితరాలకు స్వచ్ఛమైన గాలి అందేటట్లు చూడాలని ప్రజలకు సూచించారు. ఈ కార్యక్రమంలో మున్సిపల్ అధికారులు , మున్సిపల్ చైర్మన్ పీజయరాముడు, వైస్ చైర్మన్ విక్రం,స్థానిక ప్రజలు పాల్గొన్నారు.1
- స్వచ్ఛందంగా త్రాగునీటి కొరకు రోడ్డు పైకీ ఎక్కి ఆగ్రహించిన మహిళలు. ఎవరి పర్మిషన్ తీసుకున్నారు అంటున్న పోలీసులు. ( కోడుమూరు షురు న్యూస్ ప్రతినిధి) కర్నూలు జిల్లా కోడుమూరు పట్టణంలో కొండపేట చెందిన మహిళలు స్వచ్ఛందంగా బిందెలు తీసుకొని రోడ్డుపైకి ఎక్కి అగ్రహంతో ధర్నాకు దిగారు. మహిళలు మాట్లాడుతూ ఏ ఒక్క నాయకుడు వచ్చినా తూతూ మంత్రంగానే మాటలు చెప్పి తప్పించుకుంటున్నారు తప్ప కోడుమూరు పట్టణానికి శాశ్వతంగా మంచినీటి సౌకర్యం కల్పించాలని ఇంకిత జ్ఞానం నాయకులకు లేదు. మాకు 20 రోజులైనా కుళాయిల నుంచి నీరు అందటం లేదు మేము ఎందుకు రోడ్డుపైకి వస్తాం మాకు ఏమైనా పొగరా..? మాకు నీళ్లు వస్తే ఎందుకు ఎక్కుతం రోడ్డు. అదే మీ ఇండ్లలో నీళ్లు లేకుంటే మీ ఆడవాళ్లు ఎలా ఉంటారు మీకు అర్థమవుతుంది మాలాగైతేనే మీకు తెలుస్తుంది ఉద్యోగాలు చేసుకుని జీతాలు తినేది కాదు.. నీటి సమస్యను తీరేంతవరకు ఈ ధర్నా నుంచి విరమించుకునేదే లేదు కలెక్టర్ రావాలి అంటూ పట్టు పట్టారు. పోలీసులు వచ్చి మహిళలు మాట్లాడిన మాటలు విని పోలీసులు మాట్లాడుతూ మీకు పర్మిషన్ ఎవరు ఇచ్చారు. పరిమిషన్ ఉంటేనే ధర్నాకు దిగాలి మీ ఇష్టం వచ్చినట్టు రోడ్డు ఎక్కితే సరిపోదు మీ మీద కేసులు పెడతాం జాగ్రత్త అంటూ ఆగ్రహించారు. అంబులెన్స్ లో నాలుగు వెళ్లాయి గర్భవతులు అందులో ఉన్నారు అందులో గర్భవతులు చనిపోతే మీ మీద కేసులు పెడతాం . ఇదంతా సిపిఎం పార్టీ వాళ్లే చేసినట్టు ఉన్నారు.అంటూ గాంభీరంగా పోలీసులు మాట్లాడారు .దురుసు ఎక్కువ అయిపోతున్నది అంటూ మహిళలు పోలీసులపై మండిపడ్డారు. మాకు ఏ నాయకులతో సంబంధం లేదు మేము స్వచ్ఛందంగా బిందెలు తీసుకొని రోడ్ ఎక్కాం.మా ఇండ్లలో మాదిరిగా మీకు మా పరిస్థితి వస్తే సరిపోతుంది. ఊరికే ఇష్టం వచ్చినట్టు పోలీసులు మాట్లాడేది కాదు మాకు ఏ నాయకుడు చెప్పలేదు రోడ్డు ఎక్కమని.మేమే స్వచ్ఛందంగా వచ్చాం త్రాగునీటి కొరకు మా ఇండ్లలో నీళ్లు ఉన్నాయో లేదో పోలీసులైన పంచాయతీ అధికారులు అయిన మీరు వచ్చి చూడండి మీకు అర్థం అవుతుంది. అంటూ మహిళల ఆగ్రహించి మాట్లాడారు. ఒక్కసారిగా పోలీసులు ఏమీ ఆలోచించకుండా ట్రాఫిక్ సమస్య లేకుండా ముందుగా ధర్నాకు దిగిన మహిళలను పోలీసు స్టేషన్ కు తరలించారు. మరి కోడుమూరు త్రాగునీటి సమస్య ఎంతవరకు అవుతుందో సమస్యను తీరుస్తారో లేదో ఎవరికి అర్థం కాని పరిస్థితి ఈ వీడియో చూస్తే అధికారులకు తెలుస్తుంది. వేచి చూడాలి.1
- కేశంపేట మండల పరిధిలోని కాకునూరులో కలుపు మొక్కల నివారణకు చర్యలు కేశంపేట మండల పరిధిలోని కాకునూరు గ్రామంలో కలుపు మొక్కల నివారణకు పంచాయతీ సిబ్బంది చర్యలు చేపట్టారు. సర్పంచ్ బుడ్డ రాజు పిలుపు మేరకు సిబ్బంది గ్రామంలోని పలు ప్రాంతాల్లో పెరిగిన కలుపు మొక్కలకు మందులు పిచికారీ చేశారు. రోడ్ల వెంట, ఖాళీ ప్రదేశాలు, కాలనీల పరిసరాల్లో పెరిగిన పిచ్చి మొక్కలను తొలగిస్తూ గ్రామాన్ని పరిశుభ్రంగా ఉంచేందుకు చర్యలు తీసుకున్నారు. వర్షాకాలంలో కలుపు మొక్కలు, పిచ్చి మొక్కలు అధికంగా పెరగడంతో దోమలు, ఇతర కీటకాలు వృద్ధి చెందే అవకాశం ఉందని అధికారులు తెలిపారు. గ్రామ ప్రజలు తమ పరిసరాలను పరిశుభ్రంగా ఉంచుకోవాలని సర్పంచ్ బుడ్డ రాజు సూచించారు. పంచాయతీ సిబ్బంది చేపడుతున్న పారిశుద్ధ్య చర్యలకు ప్రజలు సహకరించాలని కోరారు.1
- మంత్రాలయం రాఘవేంద్ర స్వామి దర్శించుకున్న జిల్లా మంత్రులు - _*కర్నూలు జిల్లా మంత్రాలయం నియోజకవర్గం పర్యటనలో సహచర మంత్రి గొట్టిపాటి రవి,కర్నూలు ఎంపీ బస్తి పాటి నాగరాజు,ఎమ్మిగనూరు ఎమ్మెల్యే డాక్టర్ బీవీ జయ నాగేశ్వర్ రెడ్డి,గిద్దలూరు ఎమ్మెల్యే అశోక్ రెడ్డి,కర్నూలు జిల్లా టిడిపి అధ్యక్షురాలు గుడిసె కృష్ణమ్మ,మంత్రాలయం ఇన్ చార్జ్ రాఘవేంద్ర రెడ్డి, మంత్రాలయం జనసేన పార్టీ ఇన్చార్జి లక్ష్మన్న,మరియు కూటమి పార్టీల నాయకులతో గురు రాఘవేంద్ర స్వామి దర్శనం చేసుకోవడం జరిగింది.*_ #NimmalaRamaNaidu #kurnoolcity #BvJayaNageshwaraReddy #APGovernment #NDA #leader #temples1
- సమిష్టి కృషితో బాల కార్మిక వ్యవస్థ నిర్మూలిద్దాం బ్రహ్మానంద చారి బనగానపల్లె మండలం పలుకూరు గ్రామంలో జే కే ఆర్ సంక్షేమ సంఘం అధ్యక్షుడు జే ఎస్ ఎస్ బ్రహ్మానంద చారి ఆధ్వర్యంలో ఆంజనేయ స్వామి భక్త మండలి సహకారంతో డి పి యు పి మరియు ఉర్దూ ప్రాథమిక పాఠశాల యందు 115 మంది విద్యార్థులకు రాత పుస్తకాలు పెన్నులు పంపిణీ మరియు బాల కార్మిక వ్యవస్థ నిర్మూలనపై సదస్సు ఏర్పాటు చేయడం జరిగినది. బ్రహ్మానంద చారి మాట్లాడుతూ.. బాల కార్మిక వ్యవస్థ నిర్మూలనకు అన్ని వర్గాల ప్రజలు సహకారం అందించాలని ఐదు సంవత్సరాల నుంచి 14 సంవత్సరాల్లో పిల్లలతో పని చేయించుకోవడం చట్టరితే నేరమని, ప్రభుత్వం బాల కార్మిక వ్యవస్థ నిర్మూలించాలని పిల్లలకు మధ్యాహ్న భోజనం, దుస్తులు మరియు పుస్తకాలు,, 15000 నగదు పురస్కారం అందిస్తుందని పిల్లలకు విద్య నేర్పిస్తే ఆస్తులు ఇచ్చిన దానికంటే ఎక్కువ అని బ్రహ్మానంద చారి వివరించారు. డిపియుపి ఇన్చార్జి హెచ్ఎం పుష్పరాజు ఉర్దూ స్కూల్ హెచ్ఎం ఫాతిమా అలియానా మాట్లాడుతూ.. ప్రభుత్వం విద్యార్థులకు కల్పించే సదుపాయాలు వివరించారు. ప్రాత పుస్తకాలు పెన్నులు ఇచ్చిన ఆంజనేయ స్వామి భక్తి మండలి వారికి కృతజ్ఞతలు తెలిపారు. ఈ కార్యక్రమంలో ఉపాధ్యాయులు వెంకోబారావు, నాగేంద్రుడు, కే పుష్పరాజు, మంగళ్ లక్ష్మన్న, విద్యార్థుల తల్లిదండ్రులు పాల్గొన్నారు, అనంతరం 115 మంది విద్యార్థులకు రాత పుస్తకాలు పెన్నులు బ్రహ్మానందం పంపిణీ చేశారు.2
- *హైదరాబాద్- విజయవాడ హైవేపై ఘోర బస్సు ప్రమాదం.. ఐదుగురు మృతి* హైదరాబాద్-విజయవాడ జాతీయ రహదారిపై తెల్లవారుజామున ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. విజయవాడ వెళ్తున్న ప్రైవేట్ ట్రావెల్స్ బస్సు కోదాడ మండలం దుర్గాపురం స్టేజీ వద్ద కంటైనర్ డీసీఎంను వెనుక నుండి ఢీకొట్టింది. ఈ దుర్ఘటనలో బస్సులో ప్రయాణిస్తున్న ఐదుగురు అక్కడికక్కడే మృతి చెందగా, 20 మంది తీవ్రంగా గాయపడ్డారు. ప్రమాద సమయంలో బస్సులో మొత్తం 42 మంది ప్రయాణికులు ఉన్నట్లు సమాచారం. మృతుల సంఖ్య మరింత పెరిగే అవకాశం ఉందని తెలుస్తోంది. పోలీసులు ఘటనా స్థలానికి చేరుకుని సహాయక చర్యలు చేపడుతున్నారు.1