పీలేరులో ప్రశాంత వాతావరణంలో SIR కార్యక్రమం తహశీల్డారు శివకుమార్ పారదర్శక నిర్వహణకు ప్రజల హర్షం అన్నమయ్య జిల్లా పీలేరు పట్టణంలోని సిఎల్ఆర్సి కార్యాలయంలో SIR (స్పెషల్ ఇంటెన్సివ్ రివిజన్) కార్యక్రమం ప్రశాంత వాతావరణంలో, పూర్తి పారదర్శకంగా, నిష్పక్షపాతంగా కొనసాగుతోందని పీలేరు తహశీల్దారు శివకుమార్ తెలిపారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ, పీలేరు మరియు తలుపుల గ్రామాల ప్రజలు తమ ఓటర్ జాబితాలోని తప్పులను సవరించుకునేందుకు స్వచ్ఛందంగా ముందుకు వస్తున్నారని, ప్రజలకు ఎటువంటి ఇబ్బందులు కలగకుండా అన్ని ఏర్పాట్లు చేశామని అన్నారు. ప్రజల నుండి వస్తున్న వినతుల మేరకు కొత్త ఓటర్ల పేర్ల నమోదు, అడ్రస్ మార్పులు, పేర్లలో తప్పుల సవరణ వంటి అంశాలను అక్కడికక్కడే పరిశీలించి ఆన్‌లైన్ చేస్తున్నామని తెలిపారు. రెండు రోజుల క్రితమే బీఎల్ఓ ల ద్వారా రెండు గ్రామాల్లో ప్రజలందరికీ సమాచారం అందేలా చర్యలు తీసుకున్నామని చెప్పారు. నిన్న సోమవారం వర్కింగ్ డే కావడంతో కొద్దిసేపు, ప్రజా ఫిర్యాదుల పరిష్కార వేదిక (గ్రీవెన్స్ డే) పిజిఆర్ఎస్ కార్యక్రమంలో పాల్గొనడంతో బీఎల్ఓలు ఎక్కువ మంది ఓటర్లను తీసుకురావడంతో కాస్త రద్దీ నెలకొన్నప్పటికీ, తహశీల్దారు సమర్థ నాయకత్వంలో సిబ్బంది అందరూ సమన్వయంతో వ్యవహరించి రద్దీని చక్కగా నియంత్రించారని స్థానికులు ప్రశంసిస్తున్నారు. ఇప్పటి వరకు 18 వందల మంది ఓటర్ల సవరణ ప్రక్రియను పూర్తి చేశామని, వచ్చే నెల 18వ తేదీ వరకు గడువు ఉందని, గడువు లోపే ఉన్నతాధికారులు నిర్దేశించిన లక్ష్యాన్ని పూర్తిగా పూర్తి చేస్తామని తహశీల్దారు శివకుమార్ గారు స్పష్టం చేశారు. తహశీల్దారు చొరవతో SIR కార్యక్రమం ప్రజలకు ఎంతో ఉపయోగకరంగా, ఇబ్బందులు లేకుండా జరుగుతుండటంపై ప్రజలు హర్షం వ్యక్తం చేస్తున్నారు.

- స్థానిక సంస్థల ఎన్నికల్లో ఎక్కడైనా పోటీ జరగకుండా ఏకగ్రీవమైతే.. ఆ నియోజకవర్గ ఎమ్మెల్యే లేదా ఇంచార్జ్ నెక్స్ట్ సార్వత్రిక ఎన్నికల్లో ఎమ్మెల్యే అభ్యర్థిగా ఉండరు. ఎన్నికల తర్వాత నేను రిపోర్ట్ తెప్పించుకుంటాను. ప్రతి చోటా పోటీ జరగాల్సిందే. స్థానిక సంస్థల ఎన్నికల్లో ఎక్కడైనా పోటీ జరగకుండా ఏకగ్రీవమైతే.. ఆ నియోజకవర్గ ఎమ్మెల్యే లేదా ఇంచార్జ్ నెక్స్ట్ సార్వత్రిక ఎన్నికల్లో ఎమ్మెల్యే అభ్యర్థిగా ఉండరు. ఎన్నికల తర్వాత నేను రిపోర్ట్ తెప్పించుకుంటాను. ప్రతి చోటా పోటీ జరగాల్సిందే.1
- ఫ్రెండ్స్ మా చిన్నబాబు వివేకనంద ఈరోజు బర్త్డే ఫ్రెండ్స్ మీ అందరి ఆశీస్సులు కావాలని కోరుతున్నాను1
- స్థానిక సంస్థల ఎన్నికల్లో ఎక్కడైనా ఏకగ్రీవం జరిగితే.. ఆ నియోజకవర్గ ఎమ్మెల్యే లేదా ఇంచార్జ్ నెక్స్ట్ సార్వత్రిక ఎన్నికల్లో ఎమ్మెల్యే టికెట్ పై ఆశలు వదిలేసుకోవాలి....! ప్రతిచోటా పోటీ చేయాల్సిందే.. ఎన్నికలు తర్వాత రిపోర్ట్ తెప్పించుకుంటాను తాడేపల్లిలోని పార్టీ కేంద్ర కార్యాలయంలో ఈరోజు జరిగిన ఎమ్మెల్యే/ నియోజకవర్గ ఇంచార్జ్ ల మీటింగ్ లో వైయస్ జగన్ గారు అల్టిమేటం స్థానిక సంస్థల ఎన్నికల్లో ఎక్కడైనా ఏకగ్రీవం జరిగితే.. ఆ నియోజకవర్గ ఎమ్మెల్యే లేదా ఇంచార్జ్ నెక్స్ట్ సార్వత్రిక ఎన్నికల్లో ఎమ్మెల్యే టికెట్ పై ఆశలు వదిలేసుకోవాలి....! ప్రతిచోటా పోటీ చేయాల్సిందే.. ఎన్నికలు తర్వాత రిపోర్ట్ తెప్పించుకుంటాను తాడేపల్లిలోని పార్టీ కేంద్ర కార్యాలయంలో ఈరోజు జరిగిన ఎమ్మెల్యే/ నియోజకవర్గ ఇంచార్జ్ ల మీటింగ్ లో వైయస్ జగన్ గారు అల్టిమేటం1
- బస్సులో 80 మంది.. 🚍 ఇద్దరే పురుషులు.. కండక్టర్ వీడియో వైరల్ తెలంగాణ రాష్ట్రంలోని మంచిర్యాల డిపో బస్సు కండక్టర్ తన ఆవేదనను పంచుకున్న వీడియో వైరల్ అవుతోంది. 'మా బస్సులో 80 మంది ఉండగా అంతా మహిళలే.. ఇద్దరే పురుషులు ఉన్నారు. డిపార్ట్మెంటేమో డబ్బులు తీసుకురావాలని వేధిస్తోంది. ఇలా అయితే డబ్బులు ఎలా తేవాలి? ప్రభుత్వం మహిళల కోసం ఫ్రీ బస్ స్కీమ్ పెట్టింది. అందుకు అనుగుణంగా మేం పని చేస్తున్నాం. టికెట్ డబ్బుల కోసం వేధించవద్దు' అని కోరారు.1
- కీసీ కెనాల్ రైతుల సమస్యల పరిష్కారానికి గ్రామబాట....... కడప జిల్లా కీసీ కెనాల్, తెలుగు గంగ ఆయకట్టు రైతుల సమస్యల పరిష్కారం కోసం రైతు సేవాసమితి ఆధ్వర్యంలో సెప్టెంబర్ 1 నుంచి 26వ తేదీ వరకు గ్రామబాట కార్యక్రమం నిర్వహించనున్నట్లు సమితి ప్రతినిధులు తెలిపారు. కీసీ కెనాల్‌కు ఈ ఖరీఫ్ సీజన్‌లో తగినంత నీరు అందక రైతులు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారని పేర్కొన్నారు. భవిష్యత్తులో కీసీ కెనాల్‌పై ఆధారపడే వేలాది మంది రైతులకు నీటి సమస్య లేకుండా ఉండేందుకు రాజోలి 2.95 టీఎంసీల ప్రాజెక్టును పూర్తి చేయాలని, జొలదరాసి ప్రాజెక్టును కూడా త్వరితగతిన పూర్తి చేయాలని డిమాండ్ చేశారు. అలాగే తెలుగు గంగ ప్రాజెక్టులోని ఎస్‌ఆర్-1, ఎస్‌ఆర్-2, బ్రహ్మసాగర్ పరిధిలో నీరు ఉన్నప్పటికీ పంట, పిల్ల కాలువల సమస్యల కారణంగా ఆయకట్టు రైతులకు సాగునీరు అందడం లేదని తెలిపారు. ఈ ఏడాది కీసీ కెనాల్ రైతులకు పంటలు సాగు చేసుకునే అవకాశం లేకపోవడంతో ప్రతి రైతు కుటుంబానికి రూ.30 వేల ఆర్థిక సహాయం అందించి ప్రభుత్వం రైతులను ఆదుకోవాలని కోరారు. ఈ మూడు ప్రధాన సమస్యల పరిష్కారం కోసం గ్రామాల్లో రైతులకు అవగాహన కల్పిస్తూ ప్రజాసంఘాలతో కలిసి గ్రామబాట నిర్వహించనున్నట్లు తెలిపారు. సెప్టెంబర్ 27న రాయలసీమ రైతు నాయకులతో కలిసి ప్రత్యేక సదస్సు నిర్వహించి కడప జిల్లా రైతుల సమస్యలను రాష్ట్ర ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్లనున్నట్లు రైతు సేవాసమితి వెల్లడించింది. రైతులు, ప్రజాసంఘాల ప్రతినిధులు పెద్ద సంఖ్యలో పాల్గొని గ్రామబాట, సదస్సును విజయవంతం చేయాలని సమితి విజ్ఞప్తి చేసింది.1
- తాగునీటి సమస్య పరిష్కరించాలని ఎంపీడీవో కార్యాలయం వద్ద గ్రామస్తులు ధర్నా.. పుంగనూరు మండలం, వనమలదిన్నె పంచాయతీ, ఓబిరెడ్డిపల్లి గ్రామంలో తాగునీటి సమస్యను పరిష్కరించాలని కోరుతూ గ్రామస్తులు మంగళవారం పుంగనూరు పట్టణంలోని ఎంపీడీవో కార్యాలయం వద్ద ధర్నా నిర్వహించారు. ఈ సందర్భంగా గ్రామస్తులు మాట్లాడుతూ గ్రామంలో సుమారు 100 కుటుంబాలు ఉన్నాయని, గత మూడు నెలలుగా తాగునీటి కోసం తీవ్ర ఇబ్బందులు పడుతున్నామని గ్రామస్తులు తెలిపారు. సమీప వ్యవసాయ బోర్ల వద్దకు నీటి కోసం వెళ్తే రైతులు అనుమతించడం లేదని వాపోయారు. బోరు మరమ్మతులకు ప్రభుత్వ నిధులు లేవని, మరమ్మతుల కోసం ప్రతి ఇంటి నుంచి రూ.100 నుంచి రూ.200 వరకు డబ్బులు అడుగుతున్నారని ఆరోపించారు. వెంటనే అధికారులు స్పందించి గ్రామంలో తాగునీటి సమస్యను పరిష్కరించాలని గ్రామస్తులు డిమాండ్ చేశారు.1
- పుంగనూరు పట్టణంలోని కోర్టు సమీపంలో రోడ్డు ప్రమాదం ఇద్దరికి గాయాలు రామసముద్రం మండలం అరికెల గ్రామానికి చెందిన నారాయణ తన మనవడు హర్ష తో కలిసి ద్విచక్ర వాహనం లో వ్యక్తిగత పని నిమిత్తం పుంగనూరుకు వచ్చి తిరుగు ప్రయాణంలో మినీ బైపాస్ రోడ్డు కోర్టు సమీపంలో మంగళవారం రోడ్డు ప్రమాదానికి గురయ్యారు. నూతనంగా ఏర్పాటు చేసిన స్పీడ్ బ్రేకర్ ను చూసి సడెన్ బ్రేక్ వేయడంతో ద్విచక్ర వాహనం అదుపుతప్పి కిందపడటంతో నారాయణకు తీవ్ర గాయాలయ్యాయి. తన మనవడు హర్ష కు కొద్దిపాటి గాయాలు అవ్వడంతో వెంటనే గుర్తించిన వాహనదారులు, వారిని దగ్గరలోని ప్రైవేటు ఆసుపత్రికి ఆటోలో తరలించడం జరిగింది. పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది.1
- పుంగనూరు కోర్టు సమీపంలో రోడ్డు ప్రమాదO. వ్యక్తికి గాయాలు. రామసముద్రం మండలం అరికెల గ్రామానికి చెందిన నారాయణ తన మనవడు హర్ష తో కలిసి ద్విచక్ర వాహనం లో వ్యక్తిగత పని నిమిత్తం పుంగనూరుకు వచ్చి తిరుగుప్రయాణంలో మినీ బైపాస్ రోడ్డు కోర్టు సమీపంలో ప్రమాదానికి గురయ్యారు. నూతనంగా ఏర్పాటు చేసిన వేగ నిరోధకంను చూసి సడెన్ బ్రేక్ వేయడంతో ద్విచక్ర వాహనం అదుపుతప్పి కిందపడటంతో నారాయణకు తీవ్ర గాయాలయ్యాయి. తన మనవడు హర్ష కు కొద్దిపాటి గాయాలు అవ్వడంతో వెంటనే గుర్తించిన వాహనదారులు, వారిని దగ్గరలోని ప్రైవేటు ఆసుపత్రికి ఆటోలో తరలించడం జరిగింది. పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది.3