Shuru
Apke Nagar Ki App…
పాడేరు మండలం లగిసపల్లిలో బీజేపీ 46వ ఆవిర్భావ దినోత్సవం ఘనంగా జరిగింది. అట్టడుగు పేదలకు మేలు చేయడమే పార్టీ లక్ష్యమని జిల్లా అధ్యక్షురాలు శాంతకుమారి అన్నారు. గిరిజన మోర్చా ఆధ్వర్యంలో జరిగిన ఈ సభలో మోడీ ప్రభుత్వ పథకాలను వివరించారు. #మనజెండా_మనఊరు కింద జెండా స్తంభాలకు QR కోడ్ ఏర్పాటు చేశారు. దీనిని స్కాన్ చేస్తే కేంద్ర పథకాలు, స్థానిక లబ్ధిదారుల వివరాలు తెలిసేలా వినూత్న ప్రచారం చేపట్టారు.
Shyam
పాడేరు మండలం లగిసపల్లిలో బీజేపీ 46వ ఆవిర్భావ దినోత్సవం ఘనంగా జరిగింది. అట్టడుగు పేదలకు మేలు చేయడమే పార్టీ లక్ష్యమని జిల్లా అధ్యక్షురాలు శాంతకుమారి అన్నారు. గిరిజన మోర్చా ఆధ్వర్యంలో జరిగిన ఈ సభలో మోడీ ప్రభుత్వ పథకాలను వివరించారు. #మనజెండా_మనఊరు కింద జెండా స్తంభాలకు QR కోడ్ ఏర్పాటు చేశారు. దీనిని స్కాన్ చేస్తే కేంద్ర పథకాలు, స్థానిక లబ్ధిదారుల వివరాలు తెలిసేలా వినూత్న ప్రచారం చేపట్టారు.
More news from ఆంధ్రప్రదేశ్ and nearby areas
- Post by Shyam1
- *పేదలకు ఒక న్యాయం రియల్ ఎస్టేట్ వాళ్ళకి ఒక న్యాయమా* విజయనగరం జిల్లా నెల్లిమర్ల నియోజకవర్గం డెంకాడ మండలం పెదతాడివాడ పంచాయతీ ఉడికలపేట గ్రామా0లో ఉన్న సర్వే నెంబర్ 101/23గెడ్డం పోరంబోకు గా ఉంది.. ఇదివరకు పేదలకు ఇల్లస్థలాల కోసం స్థానిక అధికారులకు వినతిపత్రాలు ఇస్తే గెడ్డపోరంబోకులో ఇల్లాస్థలాలు ఇవ్వకూడదని చెప్పిన అధికారులు. ఇప్పుడు అదే గెడ్డంపొరూంబోకు స్థలమే ఆ స్థలానికి అనుకోని ఉన్న 100/4సర్వే నెంబర్ కూడా గెడ్డ పోరంబోకు లో ఉన్న రియల్ ఎస్టేట్ వారికి వారి ప్లాట్స్ దారి కోసం కప్పేసి కేవలం చిన్న డ్రైనేజి కాలువ లాగా కాలువ నిర్మించడమే కాకుండా. తరతరాలుగా పెద్దతాడివాడ రైతులకి వ్యవసాయ భూములకి వర్షంనీరు పారె గెడ్డ మరియు 2008 లో అప్పటి ప్రభుత్వాలు చెక్ డ్యామ్ నిర్మించిన గెడ్డ మరియు కొన్ని సంవత్సరాలు ఉపాధి హామీ పనులు చేసిన గెడ్డను పూర్తిగా మట్టితో కప్పేసి అక్కడ రియల్ ఎస్టేట్ ప్లాట్స్ వేస్తున్నారు.. గెడ్డలు కప్పి అక్కడ భవనాలు నిర్మిస్తే వరదలు సమయంలో ఆ భవనాలు కూలిపోయి ఎంత మంది ప్రాణాలు కోల్పోతారో అన్న దూరదృష్టిగాని అలాగే ఆ గెడ్డనీరుతో నిండే పెద బంద. చిన్న బంద. జిరాయితీ చెరువులు చవితిబందామెట్టు బంద చెరువులకి మరియు ఆ చెరువులు నిండినక పక్కనే అనుకోని ఉన్న చిన్నతాడివాడ గ్రామంలో చెరువులకి వెళ్లే గెడ్డలనీరునే వ్యవసాయ ఆధారంగా రైతులు ఉన్నారన్న బాహ్య సృహ గాని లేకుండా కేవలం కాసులకి ఆశపడో లేఖ రాజకీయ వత్తుడులకో అధికారులు చూసిచుడనట్టు వదిలేయడ0 బాధాకరం.. సుమారు ముప్పై నలభై అడుగుల వెడల్పు. పదిహేను అడుగులు లోతు ఉన్న గెడ్డ తరతరాలుగా నీటి ఆధారమైన గెడ్డ కేవలం యాభై ఏళ్ల కిందట ఎలా జిరాయితీ అయ్యిందో అధికారులు ఆలోచించాలి.. జమీందారి జులుం తో లెక్క పత్రాలు మార్చిన వారిపై తగిన చర్యలు తీసుకొని మా గెడ్డ మాకు తిరిగి అప్పగించాలని రైతులు. గ్రామస్తులు అడుగుతున్నా అధికారులుని వేడుకొంటున్న ఏ ఒక్కరు ఎందుకు పట్టించుకోరో సమాధానం చెప్పాలి.. ఇప్పటికే పెద్దతాడివాడ పంచాయతీ చెరువులు గెడ్డలు మాయమవుతున్నాయి అని పేపర్లో టీవిల్లో కధనాలువస్తున్న అధికారులకు ఎన్ని సార్లు వినతిపత్రాలు ఇచ్చిన ఏ ఒక్కరు పట్టించుకోవడం లేదు..ఈరోజు స్థానిక VRO. సర్వే అధికారులతో ఫీల్డ్ లోకి వెళ్లగా అక్కడ వాతావరణం చుసి ఆశ్చర్య పోయాము.. ఇప్పటికైనా జిల్లా కలెక్టర్ గారు నుంచి స్థానిక అధికారుల వరకు స్పందించగలరు..3
- విశాఖపట్నంలోని గాజువాక ప్రాంతంలో స్టీల్ ప్లాంట్ అడ్మిన్ బిల్డింగ్ జంక్షన్ వద్ద రిటైర్డ్ ఉద్యోగులు మంగళవారం ధర్నా నిర్వహించారు. మెడికల్ ఇన్సూరెన్స్‌ను పాత పద్ధతిలో కొనసాగించాలని వారు డిమాండ్ చేశారు. యాజమాన్యం తీసుకున్న తాజా నిర్ణయాలకు వ్యతిరేకంగా నినాదాలు చేస్తూ నిరసన వ్యక్తం చేశారు. రిటైర్డ్ ఉద్యోగుల ఇన్సూరెన్స్ ప్రీమియాన్ని భారీగా పెంచడాన్ని పోరాట కమిటీ నాయకుడు జే. అయోధ్యరాం తీవ్రంగా విమర్శించారు. ఇప్పటి వరకు ఏడాదికి సుమారు ₹1,300గా ఉన్న ప్రీమియాన్ని ఒక్కసారిగా ₹8,500కు పెంచడం అన్యాయమని ఆయన పేర్కొన్నారు. ఇది దాదాపు 700 శాతం పెరుగుదలగా ఉండటం వల్ల రిటైర్డ్ ఉద్యోగులకు భారంగా మారిందని తెలిపారు. స్థానిక ఎమ్మెల్యేలు, ఎంపీలు, అలాగే స్టీల్ మినిస్టర్‌తో చర్చలు జరిపినా యాజమాన్యం నిర్ణయం మార్చుకోలేదని ఆరోపించారు. ప్రస్తుతం రిటైర్డ్ ఉద్యోగులకు నెలకు సుమారు ₹3,000 మాత్రమే పెన్షన్ వస్తోందని, ఈ పరిస్థితిలో ఇన్సూరెన్స్ ప్రీమియం పెంపు తగదని అన్నారు. మూడున్నర దశాబ్దాల పాటు కష్టపడి పనిచేసిన రిటైర్డ్ కార్మికులను యాజమాన్యం ఇబ్బందులకు గురి చేస్తోందని వారు ఆవేదన వ్యక్తం చేశారు. వెంటనే పాత పద్ధతిలో ఇన్సూరెన్స్‌ను కొనసాగించాలని, లేనిపక్షంలో ఉద్యమాన్ని మరింత ఉధృతం చేస్తామని హెచ్చరించారు. ఈ ధర్నాలో ఆదినారాయణ, ఎన్. రామారావు, రామకృష్ణ, రమణ తదితర రిటైర్డ్ ఉద్యోగులు పాల్గొన్నారు.3
- అనకాపల్లి టు రాజమహేంద్రవరం వరకు విస్తరించే ఎన్ హెచ్ 16 కొత్త బైపాస్ ప్రతిపాదనలు సిద్ధమయ్యాయి. ఇందులో భాగంగా అనకాపల్లి నుండి రాజమహేంద్రవరం ఆరు లైన్లుగా విస్తరణ జరుగుతుంది.36.30 కిలోమీటర్ల మేరా బైపాస్ రోడ్డు నిర్మించనున్నారు. అనకాపల్లి జిల్లా వడ్డీమెట్ట నుండి పెద్దరాంబద్రపురం మీదుగా చేపూరు హైవే రోడ్డుకు ఈ రహదారి కలుస్తుంది. ఈ రహదారి విస్తరణలో భాగంగా 7.7 కిలోమీటర్ల మేరా కొత్త రహదారి నిర్మాణం జరుగుతుంది.1
- తలవరం గ్రామ సచివాలయంలో విజ్ఞాపన అందిస్తున్న ఆ గ్రామ రైతులు. రబి సీజన్లో పండించిన మొక్కజొన్న పంటను గ్రామ రైతు సేవా కేంద్రాల ద్వారా కొనుగోలు చేసి రైతులను ఆదుకోవాలని ఆ గ్రామానికి చెందిన రైతులు గ్రామ సచివాలయం కార్యదర్శికి విజ్ఞాపన పత్రం అందించారు.ఈ సందర్భంగా కోరికన హిమగిరి మాట్లాడుతూ వేల రూపాయలు పెట్టుబడి పెట్టి సాగుచేసిన మొక్కజొన్న పంట అన్ని అనుకూలించడంతో నాణ్యమైన దిగుబడి వచ్చిందని అమ్ముకుందామంటే ప్రభుత్వం కొనుగోలు కేంద్రాలు లేకపోవడంతో దళారులు వ్యాపారస్తులు కుమ్మక్కై క్వింటా మొక్కజొన్నను 1600 కి 1700 కి అడుగుతున్నారని వాస్తవానికి గత ఇదే సమయంలో సుమారు 2300 లెక్క అమ్మే వాళ్ళమని కానీ నేడు ధర తగ్గించే వ్యాపారులు అడుగుతున్న నేపథ్యంలో ప్రభుత్వమే రైతు సేవా కేంద్రాల ద్వారా కొనుగోలు చేసి రైతులను ఆదుకోవాలని విజ్ఞప్తి చేశారు. సంకెలి షుగర్ ఫ్యాక్టరీ వారు మొక్కజొన్న పంట కొంటున్నారని అయితే రైతుల నుండి కొనుగోలు చేయడానికి కొన్ని ఇబ్బందులు ఉన్న నేపథ్యంలో గౌరవ కలెక్టర్ గారు కలుగజేసుకొని వారిచేత కొనుగోలు చేస్తే రైతులు దళారుల బారిన పడాల్సిన పని ఉండదని ఆ విధంగా రైతు పైన కష్టానికి ఫలితం దక్కుతుందని ఆ గ్రామ రైతులు విన్నవించుకున్నారు. విజ్ఞప్తి అందించిన వారిలో కోరికన గోవిందరావు,కిమిడి మోహన్ రావు, వావలపల్లి శ్రీనివాసరావు,జి. అప్పలనాయుడు సిమ్మి నాయుడు తదితరులు ఉన్నారు. తలవరం గ్రామ సచివాలయంలో విజ్ఞాపన అందిస్తున్న ఆ గ్రామ రైతులు.రబి సీజన్లో పండించిన మొక్కజొన్న పంటను గ్రామ రైతు సేవా కేంద్రాల ద్వారా కొనుగోలు చేసి రైతులను ఆదుకోవాలని ఆ గ్రామానికి చెందిన రైతులు గ్రామ సచివాలయం కార్యదర్శికి విజ్ఞాపన పత్రం అందించారు.ఈ సందర్భంగా కోరికన హిమగిరి మాట్లాడుతూ వేల రూపాయలు పెట్టుబడి పెట్టి సాగుచేసిన మొక్కజొన్న పంట అన్ని అనుకూలించడంతో నాణ్యమైన దిగుబడి వచ్చిందని అమ్ముకుందామంటే ప్రభుత్వం కొనుగోలు కేంద్రాలు లేకపోవడంతో దళారులు వ్యాపారస్తులు కుమ్మక్కై క్వింటా మొక్కజొన్నను 1600 కి 1700 కి అడుగుతున్నారని వాస్తవానికి గత ఇదే సమయంలో సుమారు 2300 లెక్క అమ్మే వాళ్ళమని కానీ నేడు ధర తగ్గించే వ్యాపారులు అడుగుతున్న నేపథ్యంలో ప్రభుత్వమే రైతు సేవా కేంద్రాల ద్వారా కొనుగోలు చేసి రైతులను ఆదుకోవాలని విజ్ఞప్తి చేశారు. సంకెలి షుగర్ ఫ్యాక్టరీ వారు మొక్కజొన్న పంట కొంటున్నారని అయితే రైతుల నుండి కొనుగోలు చేయడానికి కొన్ని ఇబ్బందులు ఉన్న నేపథ్యంలో గౌరవ కలెక్టర్ గారు కలుగజేసుకొని వారిచేత కొనుగోలు చేస్తే రైతులు దళారుల బారిన పడాల్సిన పని ఉండదని ఆ విధంగా రైతు పైన కష్టానికి ఫలితం దక్కుతుందని ఆ గ్రామ రైతులు విన్నవించుకున్నారు. విజ్ఞప్తి అందించిన వారిలో కోరికన గోవిందరావు,కిమిడి మోహన్ రావు, వావలపల్లి శ్రీనివాసరావు,జి. అప్పలనాయుడు సిమ్మి నాయుడు తదితరులు ఉన్నారు.1
- ఉగాది పర్వదినాన్ని పురస్కరించుకుని బిక్కవోలు ప్రసిద్ధ శ్రీ లక్ష్మీ గణపతి స్వామి వారి ఆలయం గురువారం భక్తులతో కిటకిటలాడింది. తెలుగు నూతన సంవత్సరాదిని పురస్కరించుకుని స్వామివారిని దర్శించుకునేందుకు అనేక ప్రాంతాల నుంచి పెద్ద ఎత్తున భక్తులు ఆలయానికి తరలివచ్చారు.ఈ సందర్భంగా స్వామివారిని దర్శించుకుని చెవిలో తమ కోరికలను చెప్పుకుని మొక్కులు చెల్లించుకున్నారు. ఆలయ అర్చకులు ప్రత్యేక పూజలు నిర్వహించారు.1
- Post by Chikku srinivas1
- కాకినాడ జిల్లా తుని పట్టణ రైల్వే స్టేషన్లో కొత్త కొత్త హంగులు తో అవుతుంది. అమృత్ భారత్ పథకం కింద రైల్వే స్టేషన్లో చేపట్టిన మొదటి దశ పనులు పూర్తి చేయని మంగళవారం నాడు రైల్వే అధికారులు తెలిపారు.19.13 కోట్లతో స్టేషను ను ఆధునికరించి ఎయిర్పోర్ట్ తరహా వెయిటింగ్ హాల్, తాగునీరు వెస్ట్రన్ టాయిలెట్స్ వంటి సదుపాయాలు ఏర్పాటు చేశారు. త్వరలోనే 23 కోట్లతో రెండో దశ పనులు పూర్తి చేస్తామని తెలిపారు.1