Shuru
Apke Nagar Ki App…
బోనాల పండుగ సందర్భంగా......బోనాల విందులో సీఎం రేవంత్ రెడ్డి బోనాల పండుగ సందర్భంగా రవాణాశాఖ మంత్రి పొన్నం ప్రభాకర్ నివాసంలో ఏర్పాటు చేసిన ప్రత్యేక విందులో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి పాల్గొన్నారు. ఈ సందర్భంగా మంత్రి పొన్నం ప్రభాకర్ సీఎం రేవంత్ రెడ్డికి సాదర స్వాగతం పలికారు. బోనాల పండుగ శుభాకాంక్షలు తెలుపుకుంటూ నాయకులు, ప్రజాప్రతినిధులతో సీఎం రేవంత్ రెడ్డి ఆత్మీయంగా ముచ్చటించారు.
వేణు విలేకరి
బోనాల పండుగ సందర్భంగా......బోనాల విందులో సీఎం రేవంత్ రెడ్డి బోనాల పండుగ సందర్భంగా రవాణాశాఖ మంత్రి పొన్నం ప్రభాకర్ నివాసంలో ఏర్పాటు చేసిన ప్రత్యేక విందులో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి పాల్గొన్నారు. ఈ సందర్భంగా మంత్రి పొన్నం ప్రభాకర్ సీఎం రేవంత్ రెడ్డికి సాదర స్వాగతం పలికారు. బోనాల పండుగ శుభాకాంక్షలు తెలుపుకుంటూ నాయకులు, ప్రజాప్రతినిధులతో సీఎం రేవంత్ రెడ్డి ఆత్మీయంగా ముచ్చటించారు.
More news from తెలంగాణ and nearby areas
- బోనాల పండుగ సందర్భంగా......బోనాల విందులో సీఎం రేవంత్ రెడ్డి బోనాల పండుగ సందర్భంగా రవాణాశాఖ మంత్రి పొన్నం ప్రభాకర్ నివాసంలో ఏర్పాటు చేసిన ప్రత్యేక విందులో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి పాల్గొన్నారు. ఈ సందర్భంగా మంత్రి పొన్నం ప్రభాకర్ సీఎం రేవంత్ రెడ్డికి సాదర స్వాగతం పలికారు. బోనాల పండుగ శుభాకాంక్షలు తెలుపుకుంటూ నాయకులు, ప్రజాప్రతినిధులతో సీఎం రేవంత్ రెడ్డి ఆత్మీయంగా ముచ్చటించారు.1
- బెజ్జంకిలో పోచమ్మ తల్లి, ఎల్లమ్మ తల్లి బోనాల వేడుకలు ...... బెజ్జంకిలో పోచమ్మ తల్లి బోనాల వేడుకలు ఘనంగా ఆషాఢ మాసం సందర్భంగా బెజ్జంకి గ్రామంలో పద్మశాలి, మున్నూరు కాపు సంఘాల ఆధ్వర్యంలో శ్రీ పోచమ్మ తల్లి బోనాల వేడుకలు భక్తి పారవశ్యంతో నిర్వహించారు. మహిళలు తలపై బోనాలను మోసుకుంటూ డప్పు చప్పుళ్లు, శివసత్తుల నృత్యాల మధ్య ఊరేగింపుగా ఆలయానికి చేరుకుని అమ్మవారికి నైవేద్యాలు సమర్పించి ప్రత్యేక పూజలు నిర్వహించారు. గ్రామంలో సుఖశాంతులు నెలకొని, పిల్లాపాపలు ఆయురారోగ్యాలతో, పాడిపంటలు సమృద్ధిగా ఉండాలని ప్రార్థిస్తూ భక్తులు మొక్కులు చెల్లించుకున్నారు. ప్రతి ఏడాది ఈ సంప్రదాయాన్ని భక్తిశ్రద్ధలతో కొనసాగిస్తున్నామని సంఘాల ప్రతినిధులు తెలిపారు.4
- సమాజిక సేవతోనే సంఘం బలోపేతం ఎమ్మెల్యే గంగుల కమలాకర్ ఘనంగా గ్రేటర్ విద్యానగర్ మున్నూరు కాపు సంఘం నూతన కార్యవర్గ ప్రమాణ స్వీకారం గ్రేటర్ విద్యానగర్ మున్నూరు కాపు సంఘం నూతన కార్యవర్గ ప్రమాణ స్వీకార కార్యక్రమం నేడు కరీంనగర్ లోని ఓ వేడుక మందిరం. లో ఘనంగా నిర్వహించారు. ఈ వేడుకకు మాజీ మంత్రి, కరీంనగర్ ఎమ్మెల్యే గంగుల కమలాకర్ ముఖ్య అతిథిగా విచ్చేశారు. ఈ సందర్భంగా నూతనంగా ఎన్నికైన పాలకవర్గ అధ్యక్షులు ఉప్పు తిరుపతి పటేల్, ప్రధాన కార్యదర్శి సుధాకర్ పటేల్ తో పాటు ఇతర కార్యవర్గ సభ్యులను ఆయన ఘనంగా సన్మానించి శుభాకాంక్షలు తెలిపారు. సంఘం సర్వతోముఖాభివృద్ధికి, బలోపేతం కోసం నూతన కమిటీ సభ్యులు ఐక్యమత్యంతో అంకితభావంతో కృషి చేయాలని ఈ సందర్భంగా ఆయన పిలుపునిచ్చారు. ఈ కార్యక్రమంలో మాజీ మంత్రి, కరీంనగర్ ఎమ్మెల్యే గంగుల కమలాకర్ పుట్ట పురుషోత్తం మున్నూరు కాపు సంఘం రాష్ట్ర అధ్యక్షులు వర్కింగ్ ప్రెసిడెంట్ చల్ల హరిశంకర్, జిల్లా అధ్యక్షులు బొమ్మ రాధాకృష్ణ, మార్కెట్ కమిటీ చైర్మన్ఆకుల నర్సయ్య తదితరులు ఈ కార్యక్రమంలో పాల్గొని నూతన కార్యవర్గానికి అభినందనలు తెలిపారు.2
- కరీంనగర్ లో కన్నుల పండువగా పోచమ్మ తల్లి బోనాల వేడుకలు.. స్వయంగా అమ్మవారి బోనం ఎత్తుకున్న మాజీ మంత్రి కరీంనగర్ ఎమ్మెల్యే గంగుల కమలాకర్ కరీంనగర్ నగరంలో ఆదివారం పోచమ్మ తల్లి, మైసమ్మ తల్లి బోనాల వేడుకలు అత్యంత వైభవంగా, కన్నుల పండువగా నిర్వహించారు. నగరంలోని శ్రీపురం కాలనీ, చింతకుంట, కిసాన్ నగర్, కట్ట రాంపూర్ ప్రాంతాలలో భక్తులు అమ్మవారికి ఘనంగా బోనాలు సమర్పించారు. ఈ వేడుకలకు కరీంనగర్ ఎమ్మెల్యే, మాజీ మంత్రి గంగుల కమలాకర్, ముఖ్య అతిథులుగా విచ్చేశారు. ఈ సందర్భంగా వారు స్వయంగా అమ్మవారి బోనం ఎత్తుకొని ఆలయం వరకు చేరుకుని, భక్తిశ్రద్ధలతో అమ్మవారికి మొక్కులు చెల్లించుకున్నారు. అనంతరం అతిథులు మాట్లాడుతూ.. అమ్మవారి దయతో ప్రజలందరూ సుఖసంతోషాలతో వర్ధిల్లాలని, కాలం కలిసివచ్చి సమృద్ధిగా వర్షాలు కురిసి పాడిపంటలు కళకళలాడాలని ఆకాంక్షించారు. ఈ కార్యక్రమంలో నగర బారాస అధ్యక్షులు చల్ల హరి శంకర్, 40 వ డివిజన్ కార్పొరేటర్ నలువాల పుష్పలత రవీందర్, మాజీ మేయర్ సర్ధార్ రవీందర్ సింగ్, డివిజన్లకు చెందిన నాయకులు, స్థానిక భక్తులు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు.1
- సికింద్రాబాద్ ఉజ్జయిని మహంకాళి లస్కర్ బోనాల జాతర హాజరైన తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి సికింద్రాబాద్ ఉజ్జయిని మహంకాళి లష్కర్ బోనాల జాతరను పురస్కరించుకొని సహచర మంత్రి పొన్నం ప్రభాకర్ గారు తన నివాసంలో విందు కార్యక్రమాన్ని ఏర్పాటు చేశారు. ఈ సందర్భంగా గౌరవ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు, శాసనసభ స్పీకర్ గడ్డం ప్రసాద్ కుమార్ గారు, మంత్రి పొంగులేటి శ్రీనివాస రెడ్డి గారు మరియు సహచర మంత్రులు వివేక్ వెంకటస్వామి గారు, కొండా సురేఖ గారు, మహమ్మద్ అజారుద్దీన్ గారు, ప్రభుత్వ సలహాదారులు, ఎమ్మెల్సీలు, ఎమ్మెల్యేలు, కాంగ్రెస్ పార్టీ నాయకులు తదితరులతో కలిసి పాల్గొనడం జరిగింది.1
- వేములవాడలో రాజన్నను దర్శించుకుని మొక్కులు చెల్లించుకున్న భక్తులు రాజన్న సిరిసిల్ల జిల్లా వేములవాడలో రాజన్నను దర్శించుకుని మొక్కులు చెల్లించుకున్న భక్తులు1
- కరీంనగర్ జిల్లాలో ఫ్రెండ్ షిప్ డే విషాదం...మిత్రులతో కలిసి ఈతకు వెళ్ళి ప్రాణాలు కోల్పోయిన ఇద్దరు కరీంనగర్ జిల్లాలో స్నేహితుల దినోత్సవం విషాదంగా మారింది. స్నేహితులతో ఆడిపాడిన ఇద్దరు ప్రాణాలు కోల్పోయారు. మిత్రులతో కలిసి ఈతకు వెళ్ళి రెండు చోట్ల ఇద్దరు పిల్లలు నీట మునిగి మృతి చెందారు. తిమ్మాపూర్ మండలం పరిధిలో ఎల్ఎండి రిజర్వాయర్ లో స్నేహితులతో కలిసి అలుగునూర్ కు చెందిన గోల్కొండ మణిప్రసాద్(23) ఈతకు వెళ్ళాడు. ప్రమాదవశాత్తు నీటమునిగి ప్రాణాలు కోల్పోయాడు. అటు శంకరపట్నం మండలం మొలంగూరు గ్రామంలో స్నేహితులతో కలిసి ఈతకు వెళ్ళిన 8 ఏళ్ళ బాలుడు రీత్విక్ నీట మునిగి ప్రాణాలు కోల్పోయారు. స్నేహితులతో కలిసి ఈతకు వెళ్లి ప్రాణాలు కోల్పోవడంతో కన్నవారు కన్నీరుమున్నీరుగా విలపిస్తున్నారు.2